horn
-
స్టేషన్ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారెవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మరి రైలు ప్రయాణంలో అనుకోని ఘటన ఏదైనా జరిగితే అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా అటువంటి ఉదంతమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని ఉదీ మోడ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు గ్రీన్ సిగ్నల్ కోసం అరగంట పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్ ఆగ్రా డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు ఈ నిర్లక్ష్యానికి కారణాన్ని వివరించాలని స్టేషన్ మాస్టర్‌ను ఆదేశించారు.ఈ ఘటన గురించి ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఈ విషయంలో స్టేషన్ మాస్టర్‌కు ఛార్జ్ షీట్ జారీ చేశామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఘటన జరిగిన సమయంలో స్టేషన్ మాస్టర్‌ను నిద్రలేపడానికి రైలులోని లోకో పైలట్ పలుమార్లు హారన్ మోగించారు.అరగంట తరువాత స్టేషన్ మాస్టర్ నిద్రనుంచి మేల్కొని రైలు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డ్యూటీలో ఉన్న ‘పాయింట్‌మెన్’ ట్రాక్‌ను పరిశీలించడానికి వెళ్లాడని, దీంతో ఆ సమయంలో తాను స్టేషన్లో ఒంటరిగా ఉన్నానని ఆ స్టేషన్ మాస్టర్ తెలిపారు. -
హైదరాబాద్: నిషేధిత హారన్ కొడుతూ రోడ్లపై దూసుకుపోతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: చిత్ర విచిత్రమైన ధ్వనులతో హారన్ కొడుతూ.. రోడ్లపై దూసుకుపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! జూన్ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్ వంటి నిషేధిత హారన్ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిషేధిత హారన్లు వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు. ఆయా వాహనదారులకు ఎంవీ యాక్ట్ 190 (2) సెక్షన్ ప్రకారం రూ.1,000 జరిమానా విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్)–1988 సెక్షన్ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్ హారన్ మాత్రమే ఉండాలి. -
నిషేధిత హారన్ కొడితే చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: చిత్ర విచిత్రమైన ధ్వనులతో హారన్ కొడుతూ.. రోడ్లపై దూసుకుపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! జూన్ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్ వంటి నిషేధిత హారన్ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిషేధిత హారన్లు వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు. ఆయా వాహనదారులకు ఎంవీ యాక్ట్ 190 (2) సెక్షన్ ప్రకారం రూ.1,000 జరిమానా విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్)–1988 సెక్షన్ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్ హారన్ మాత్రమే ఉండాలి. -
దున్నపోతు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
సాధారణంగా కొన్ని సందర్భాల్లో సాటి మనుషులే.. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు మనకేందుకులే అని వదిలేస్తారు. అయితే, ఒక మూగ జీవి మాత్రం ఆపదలో ఉన్న సాటి జీవికి సహయం చేసి మనుషులు తమ ప్రవర్తనను మార్చుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, దున్నపోతులు కొన్ని సందర్భాల్లో కోపంగా ప్రవర్తిస్తుంటాయి. ఆ సమయంలో వాటికి ఎదురుగా ఎవరున్నా కోపంతో పైకి ఎత్తి కిందపడేస్తాయి. కొన్ని చోట్ల దున్నపోతుల పోటీలను నిర్వహిస్తుంటారు. వీటిలో వాటిని ఎరుపు వస్త్రం చూపించి, దాన్ని రెచ్చగొట్టేలా చేసి.. లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ఆటలో ఒక్కొసారి అనుకొని సంఘటనలు చోటు చేసుకున్నవిషయం మనకు తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం.. ఒక దున్నపోతు తనకు ఎదురుగా ఉన్న ఒక జీవిని.. కోపంగా కుమ్మకుండా ప్రశాంతంగా దాని ప్రాణాలను కాపాడింది. వివరాలు.. ఈ వీడియోలో ఒక నలుపు రంగు దున్నపోతు, దాని ముందు ఒక తాబేలు ఉన్నాయి. పాపం.. తాబేలు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి బోర్లాపడింది. ఎంత ప్రయత్నించిన పైకి లేవలేకపోయింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దీన్ని గమనించిన ఒక దున్నపోతు.. వెంటనే అక్కడికి వెళ్లి తన కొమ్ములతో తాబేలుకు ఆనించి.. పైకి లేచేలా చేసింది. దీంతో ఈ సంఘటనను చూస్తున్న అక్కడి వారంతా అభినందిస్తు కేకలు వేశారు. అయితే, దీన్ని గతంలో మనస్కామ్రాన్ అనే టిక్ టాక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొందరు మనుషుల కంటే నోరులేని జీవాలే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. Buffalo saved a tortoise by flipping him over.. 🎥 IG: sanamkamran pic.twitter.com/DpHAbsk2eA — Buitengebieden (@buitengebieden_) December 16, 2021 -
కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన
వాహనాల హారన్ సౌండ్లు మార్చే యోచనలో కేంద్రం ఉందనే కథనాల నడుమ.. కీలకమైన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. కార్లకు మాత్రమే హారన్ శబ్దాలను, అదీ భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాల్ని అన్వయింజేస్తామని, చట్టబద్ధత ద్వారా దీనిని అమలు చేయబోతున్నామని వెల్లడించారు. హారన్ శబ్దాలు మార్చేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేక చట్టం అమలులోకి తేబోతున్నామని ప్రకటించారు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నిజానికి గతంలోనే ఆయన పేరు మీద ‘ప్లీజ్ ఛేంజ్ హార్న్’ కథనం వెలువడినప్పటికీ.. ఇప్పుడు నేరుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఫ్లూట్, తబలా, వయొలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియం.. ఈ లిస్ట్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారాయన. అంతేకాదు ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సైరన్లను మార్చే అంశం పరిశీలిస్తున్నామని, వాటి స్థానంలో ఆల్ ఇండియా రేడియోలో వినిపించే ఆహ్లాదకరమైన సంగీతాన్ని చేర్చే విషయమై సమీక్షిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో వినిపించే ఆ సంగీతం వినేవారికి ఆహ్లాదకరమైన కలిగిస్తుందని భావిస్తున్నట్లు గడ్కరీ అభిపప్రాయపడ్డారు. వాహనాల రోదనల వల్ల జనాలు పడే ఇబ్బందులేంటో తనకూ అనుభవమని, అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. ఆ జోన్స్ లేకపోవడమే.. నో హాంకింగ్ జోన్స్.. అంటే ఆ జోన్ ఉన్న ప్రాంతంలో వెహికల్స్ హారన్ కొట్టడానికి వీల్లేదు. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. చాలాదేశాల్లో ఇలాంటి జోన్లు ఉన్నాయి. కానీ, మన దేశంలో ఎక్కడా అలాంటివి కనిపించవు. కేవలం ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో నో హాంకింగ్ జోన్స్‌కి బదులు.. హారన్ శబ్దాల్ని మార్చాలనే ఆలోచన చేయడం విశేషం. సడలింపు లేకుండా ఈ నిబంధనను అమలు చేస్తే.. హారన్ మార్పిడి కోసం వాహన తయారీదారీ కంపెనీలతో పాటు పాత వాహనదారులపైనా భారం పడనుంది. చదవండి: ప్రశాంతంగా యోగా కూడా చేసుకోనివ్వలేదు!: గడ్కరీ -
2,500 ఖడ్గమృగం కొమ్ములను కాల్చేసిన అస్సాం ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?
దిస్పూర: సెప్టెంబర్ 22 ప్రపంచ ఖడ్గమృగం దినోత్సవం సందర్భంగా అస్సాం ప్రభుత్వం వినూత్నంగా వేడుకలు నిర్వహించింది. వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వేలాది ఖడ్గమృగాల కొమ్ములను దగ్దం చేసింది. కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోని బోకాఖట్‌లో 2,500 ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కొమ్ములను అక్కడి అధికారులు బహిరంగంగా దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదవండి: డ్రగ్స్ కోసం దాడి: అవమానం తట్టుకోలేక ఫ్రెండ్ ఆత్మహత్య ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేపట్టిన ‘రైనో హార్న్ రీ-వెరిఫికేషన్’ కార్యక్రమంలో భాగంగా వీటిని స్మగ్లర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత వారం రాష్ట్ర మంత్రివర్గం కొమ్ముల దహనం చేయనున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఆస్సాం ప్రభుత్వం ఖడ్గమృగం కొమ్ములను దహనం చేయడం వెనుక ఓ కారణం ఉంది. చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం వీటి కొమ్ములను చైనీయులు సంప్రాదాయక ఔషధాల తయారీలో వాడుతారనే కారణంతో వేటగాళ్లు అటవీ అధికారుల కళ్లుగప్పి ఒక కొమ్ము ఖడ్గమృగాలను వేటాడుతున్నారు. అత్యంత కిరాతకంగా వాటిని చంపి, కొమ్ములు కోసుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో రైనో కొమ్ములకు ఎలాంటి ఔషధ ప్రాముఖ్యత లేదని వేటగాళ్లకు బలమైన సందేశం ఇవ్వడం కోసం అసోం సర్కారు ఇలా చేసింది. -
తెలుసా..! ఈ దేశంలో రైళ్లు కుక్కల్లా మొరుగుతాయట.. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జపాన్.. రైలు కూతలకు కుక్క అరుపులు జోడించిందనే వార్త హాస్యస్పదమే. కానీ ఇది నిజం. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థలు కలిగిన జపనీస్ ట్రైన్ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్ వేసేవి. సూపర్ ఫాస్ట్ షింకన్సేన్ (బుల్లెట్ ట్రైన్) సైతం దూసుకుపోగలిగే జపాన్ రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. ఇలా జపాన్‌కి పెద్ద సమస్యే వచ్చిపడింది. ట్రాక్స్‌కి, హిల్స్‌కి జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో.. వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఆర్ఐ) పరిష్కారం దిశగా అడుగులు వేసింది. సింహం పేడను తెచ్చి ట్రాక్ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్ మీద నుంచి తుర్రుమనడం గమనించిన అధికారులు.. ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. ఐడియా అదుర్స్ కదూ. చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!! -
‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో!
-
ప్లీజ్ చేంజ్ హారన్: గడ్కరీ
Nitin Gadkari Horn Change Rules: నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నడుమ చెవులు చిల్లులు పడే రేంజ్ రణగోణధ్వనుల్ని భరిస్తూ.. వాహనదారులు ముందుకు పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సినారియోను మార్చేందుకు కేంద్రం సరికొత్త ఆలోచన చేయబోతోంది. విచిత్రమైన, ఘోరమైన శబ్దాలు చేసే హారన్ సౌండ్‌ల్ని మార్చేసే దిశగా ఆలోచన చేయనున్నట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటన చేశారు. మరాఠీ న్యూస్ పేపర్ లోక్‌మట్ కథనం ప్రకారం.. నాగ్‌పూర్‌లో ఓ భవనంలో పదకొండవ అంతస్తులో నివాసం ఉంటున్న గడ్కరీకి.. ప్రశాంతంగా గంటసేపు ప్రాణాయామం కూడా చేసుకోని పరిస్థితి ఎదురవుతోందట. వాహనాల రోదనల వల్ల అంత ఎత్తులో ఉన్న తన పరిస్థితే అలా ఉంటే.. సాధారణ పౌరులు ఆ గోలను ఎలా భరిస్తున్నారో తాను ఊహించుకోగలనని చెప్తున్నారాయన. అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఇప్పుడున్న వెహికిల్ హారన్ల ప్లేస్‌లో తబలా, వయొలిన్, ఫ్లూట్.. ఇలా రకరకాల వాయిద్యాల శబ్దాలను పరిశీలించబోతున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో కార్లకు ఈ ఆలోచనను అమలు చేయబోతున్నట్లు, ఈ మేరకు త్వరలో కంపెనీలకు సూచనలు సైతం పంపిచనున్నట్లు గడ్కరీ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. ఒకవేళ కేంద్రం గనుక కరాకండిగా ఈ రూల్స్ అమలు చేస్తే మాత్రం.. వాహన తయారీదారీ కంపెనీలపై అదనపు భారం పడనుంది. ఆ టైంలోనే గట్టిగా.. హారన్ శబ్దాల వల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మనుషుల్లో చెవుడుతో పాటు ఆందోళన, ఒత్తిళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా అతి ధ్వనులను అవతి వాహనాలు(ఏవైనా సరే), వ్యక్తులు తప్పిపోయిన సమయాల్లో.. దూరం నుంచి వాహనాలు వస్తున్నాయనే అలర్ట్ ఇవ్వడానికి(ఎమెర్జెన్సీ సర్వీసుల విషయంలో) మాత్రమే ఉపయోగించాలని రూల్స్ చెప్తున్నాయి. కానీ, ఈ రూల్స్ అమలు కావడం లేదు. రోడ్ల మీద వెళ్లే వాహనాల విషయంలోనే కాదు.. షిప్స్, రైళ్ల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలి. సాధారణంగా రైళ్ల హారన్ 130-150 డెసిబెల్స్ దాకా ఉంటుంది. దూరం ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్ద తీవ్రతతో హారన్ కొట్టాలి. ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్ సౌండ్ హారన్ కొట్టడం రూల్స్‌కి వ్యతిరేకం!. నో హాంకింగ్ జోన్స్ కొన్ని చోట్ల హారన్లు కొట్టడానికి వీల్లేదు. అలాంటి ప్రాంతాల్ని ‘నో హాంకింగ్ జోన్స్’ అంటారు. మన దేశంలో ఎక్కడా అలాంటి జోన్లను ఏర్పాటు చేయలేదు. కేవలం శబ్ద తీవ్రత పరిమితిని మించినప్పుడు.. అదీ ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ నో హాంకింగ్ జోన్స్ వ్యవస్థను అమలు చేస్తే.. గడ్కరీ చెప్తున్న హారన్ మార్పిడి ఆలోచన అవసరమే ఉండదనేది చాలామంది వెల్లడిస్తున్న అభిప్రాయం. చదవండి: లెదర్ పరిశ్రమకు మంచి రోజులు -
వామ్మో.. ‘మోత’ మోగిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాలోని పలు ప్రాంతాల్లో ధ్వని, వాయు కాలుష్య సమస్యలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో శబ్దాల సమస్య మితిమీరుతుంటే, కొన్ని జిల్లాలు, పట్టణాల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌లో గతంలో ఉన్న వాయు కాలుష్య సమస్య కొంత తగ్గుముఖం పట్టగా జిల్లాలు, ముఖ్య పట్టణాల్లో వాయు నాణ్యత తక్కువగా నమోదవుతోంది. వేసవిలో సెకండ్‌వేవ్ సందర్భంగా లాక్డౌన్ అమలు, తర్వాత వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గిందని, చలికాలం వచ్చేటప్పటికి మళ్లీ కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) గత 3 నెలల (మే, జూన్, జూలై) వెల్లడించిన గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయమే స్పష్టమవుతోంది. శబ్ద ప్రమాణాలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత శబ్ద ప్రమాణాల ప్రకారం వివిధ ›ప్రాంతాల వారీగా పగలు, రాత్రి సమయాల్లో వెలువడే ధ్వనులు కింద సూచించిన మేర ఆయా స్థాయిలు పగటిపూట (ఉదయం 6 నుంచి రాత్రి 10 లోపు), రాత్రి సమయాల్లో (రాత్రి 10 నుంచి ఉదయం 6 లోపు) డెసిబుల్స్ లోబడి ఉండాలి. ఇవీ సీపీసీబీ వాయు నాణ్యతా ప్రమాణాలు.. సీపీసీబీ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను బట్టి వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 0–50 పాయింట్ల మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్లు, ఈ పరిమితిలో ఉంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నం కావు. ► 50–100 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలున్న వారికి గాలి పీల్చుకోవడంలో, ఇతరత్రా సమస్యలు ఎదురవుతాయి. ► 101–200 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్థమా, గుండె సంబంధిత జబ్బులున్న వారికి గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ► వాయు నాణ్యత మరింత తగ్గి 200 పాయింట్ల ఏక్యూఐని మించిన గాలిని దీర్ఘకాలం పాటు పీలిస్తే అనారోగ్యం, శ్వాసకోశ సంబంధిత, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై తీవ్ర ›ప్రభావం పడుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత 3 నెలల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు ఇలా (ఎక్యూఐ పాయింట్లలో) మల్టీ హారన్స్ వల్లే.. హైదరాబాద్‌లో శబ్దకాలుష్యం క్రమంగా పెరుగుతోంది. వివిధ రకాల వాహనాలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, వివిధ అభివృద్ధి పనులు, ఇతర రూపాల్లో రోజువారీ కార్యక్రమాల్లో ప్రమాణాలకు మించి పెరుగుతున్న ధ్వనులు ఈ పరిస్థితికి కారణం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వివిధ నిర్దేశిత ప్రాంతాల్లో నిర్ణీత ప్రమాణాల కంటే శబ్దాలు ఎక్కువగా నమోదు కావడానికి మల్టీహారన్స్ వినియోగం ప్రధాన కారణంగా గుర్తించాం. అంతర్రాష్ట్ర బస్సు, లారీ సర్వీసులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా మల్టీ హారన్స్ వినియోగంతో ఈ సమస్య పెరుగుతోంది. దీని నియంత్రణకు పోలీసు, రవాణా శాఖలు తగిన చర్యలు చేపడుతున్నాయి. – టీపీసీబీ ధ్వని, కాలుష్య నియంత్రణ అధికారులు వినికిడి శక్తికి ప్రమాదం.. ప్రజల ఆరోగ్యం, వారి వివిధ అవయవాలు, శరీర భాగాలపై వాయు, నీరు, ధ్వని ఇతర రూపాల్లోని కాలుష్యాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె ఇతర ముఖ్యమైన భాగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. శబ్ద కాలుష్యం వినికిడి, ఇతర మానసిక సమస్యలకు దారితీస్తోంది. రోజూ 8 గంటల పాటు 85 డెసిబుల్స్ ఉన్న ధ్వనికి గురైతే వినికిడి సమస్యలు మరింత పెరుగుతాయి. 90కు మించి డెసిబుల్స్‌తో వెలువడే శబ్దాలకు చెవులు, 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలకు కర్ణ భేరి దెబ్బతిని, వినికిడి శక్తి కోల్పోతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, రాజకీయ పార్టీల ప్రచారాల్లో మోగించే డీజే సౌండ్లు అనేక అనర్థాలకు కారణమవుతు న్నా యి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. – డా.ఎం.మోహన్‌రెడ్డి, చీఫ్ ఈఎన్టీ స్పెషలిస్ట్, నోవా హాస్పిటల్ -
ఇకపై అతిగా హారన్ కొడితే.. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ధ్వని కాలుష్యం నివారణ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట అతిగా హారన్ మోగించే వాహనదారులపై భారీగా జరిమానాలను విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలో మతపరమైన ప్రదేశాల్లో, పెళ్లి వేడుకల్లో, వాహనాల వల్ల శబ్ధ కాలుష్యం వెలువడితే భారీ జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ శబ్ధ కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నామని, నిర్దేశిత డెసిబుల్ దాటి శబ్ధం వస్తే ఫైన్ కట్టాల్సిందేనని ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియల్ తెలిపారు. కొత్తగా సూచించిన ఉత్తరాఖండ్ శబ్థ కాలుష్య నిబంధనల ప్రకారం కొన్ని ప్రాంతాలను గుర్తించారు. మతపరమైన ప్రదేశాలలో, అతిగా ధ్వని మొదటిసారిగా పేర్కొన్న డెసిబెల్ను మించితే.. జరిమానా 5000 రూపాయలు, రెండవసారి-10,000 రూపాయలు, మూడోసారి 15,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా హోటళ్ళు, రెస్టారెంట్ల ప్రాంతాలలో మొదటిసారి రూ.10,000, రెండవసారి రూ.15,000, మూడవసారి రూ. 20,000 ఉంటుంది. పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో జరిమానా రూ. 20,000, రెండవ సారి రూ. 30,000, మూడవ సారి రూ. 40,000 వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో శబ్థ కాలుష్య నియమాలను ఉల్లంఘించివారిపై ప్రభుత్వం ఇకపై వెయ్యి రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు జరిమానాలు వసూలు చేయనుంది. ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియల్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ పర్యావరణం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోనుందని తెలిపారు. అదే క్రమంలో శబ్ధ కాలుష్యానికి కారణమైన పరికరాలను కూడా సీజ్ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: వైరల్: ఏం ఫిలాసఫీ బాబు.. మద్యం తాగితే కరోనా సోకదా? -
ఒక్కసారి హారన్ కొడతా...ప్లీజ్
-
ఒక్కసారి హారన్ కొడతా...ప్లీజ్
అన్ని యాప్‌ల యందు టిక్‌టాక్ వేరయా..! అంటున్నారు టిక్‌టాక్ యూజర్లు. ప్రతీవారం ఏదో ఒక చాలెంజ్‌తో ట్రెండింగ్‌గా నిలిచే టిక్‌టాక్ ఈ వారం హారన్ చాలెంజ్‌తో ముందుకొచ్చింది. ఇంకేముంది, ఎవరికి నచ్చినట్టుగా వారు వారిదైన స్టైల్లో వీడియోలు తీసుకుంటూ హ్యాష్‌ట్యాగ్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పాటకు తగ్గట్టుగా లిప్ మూమెంట్ ఉండి అందుకు తగ్గట్టుగా నటన ఉన్నప్పుడే అది వైరల్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ హారన్ చాలెంజ్‌కు అవేవీ అవసరం లేదు. పైగా తక్కువ నిడివి ఉండటంతో సులువుగా చేసే అవకాశం ఉంది. చేసిన వీడియోలను షేర్ చేసుకునే అవకాశం ఉండటంతో జనాలు టిక్‌టాక్ మాయలో ఉన్నారు. ప్రస్తుతం హారన్ చాలెంజ్ టిక్‌టాక్ యూజర్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇందులో అంతా నిశ్శబ్ధంగా ఉండి ఒక్కసారిగా బస్ హారన్ శబ్దం మాత్రమే వినపడుతుంది. బస్ హారన్ ఎలా కొడతారో ఎదుటివారి మొహాన్ని కూడా అదే విధంగా ప్రెస్ చేస్తారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వుతారు. ఎవరిని మొహాన్నైతే హారన్‌లా ప్రెస్ చేస్తారో వారి ముఖంలో చిత్రవిచిత్రాలుగా హావభావాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇది మరింత హాస్యానికి కారణమవుతుంది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ ఇస్తుంటే.. టిక్ టాక్ యూజర్లు ఊరికే ఊరుకుంటారా! ప్రతీ చాలెంజ్‌కు వీడియోలు చేస్తూ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేసుకుంటున్నారు. గతవారం నూడుల్ డ్యాన్స్, గడ్డం చాలెంజ్‌తో ఊదరగొట్టగా నేడు ఫన్నీగా ఉండే ‘హారన్ చాలెంజ్’ హాట్ ట్రెండ్‌గా నిలిచింది. చాలామంది యూజర్లు వాటికి అంతే ఫన్నీగా వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. -
తుర్రో... తుర్రు..
సాక్షి, తెలంగాణ డెస్క్: అనగనగనగా టాంజానియా అనే దేశం.. మన దేశానికి చాలా దూరం లెండి.. అక్కడ సెరెన్గెటీలో ఓ సఫారీ పార్కు.. ఈ పార్కులో బోలెడన్ని పులులు, చిరుతలు.. సింహాలు.. ఏనుగులు.. పాములు.. ఆ.. మర్చిపోయాను.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కొంగ బావ కూడా ఇక్కడే ఉంటోంది. ఈ మధ్య.. ఓ మిట్టమధ్యాహ్నం వేళ.. సరిగ్గా లంచ్ టైము అన్నమాట. ఈ చిరుత పులి కడుపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయి. అసలే దీనికి ఆకలి ఎక్కువ.. టైముకి తిండి ఠంచనుగా పడిపోవాల్సిందే.. మరి ఇదేమో జూ కాదాయే.. టైముకి ఫుడ్ పెట్టడానికి.. సఫారీ పార్కు.. దాంతో వేటకు బయల్దేరింది.. ఎంత వెతికినా.. ఒక్క జంతువూ కనపడలేదు.. ఇంక నీరసం వచ్చి పడిపోతుంది అనుకునే లోపు.. అక్కడికి దగ్గర్లో అప్పుడే లంచ్ కానిచ్చి.. అరగడానికి వాకింగ్ చేస్తున్న కొంగ బావ కనిపించింది.. అంతే.. గడ్డిలో చటుక్కున దాక్కుంది.. యుద్ధరంగంలోని సైనికుడిలాగ బరబరమని.. పాక్కుంటూ.. దాని దగ్గరికి వెళ్లింది.. ఈ కొంగ పని ఇక అయిపోయింది నా సామి రంగా అని అనుకుంటూ ఒక్కసారిగా దబీమని దూకింది.. అయితే.. కొంగబావకి మామూలుగానే తెలివితేటలు ఎక్కువ.. దీనికి కాస్త సిక్త్స్ సెన్స్ కూడా ఉన్నట్లుంది.. వెంటనే ప్రమాదాన్ని గ్రహించింది.... ఇంకేముంది.. తుర్రో.. తుర్రు.. -
హారన్లు.. హాహాకారాలు∙
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ముందెళ్లేవారు వెనుకొచ్చే వారికి దారివ్వాలనే సంకేతానికి, వెనుకగా తాము వస్తున్నామనే విషయం తెలిపేందుకు మాత్రమే హారన్లు విని యోగించే కాలం చెల్లిపోయింది. ప్రజ లందరూ తమకు ఆకర్షితులు కావడానికి, తమ గురించే చర్చింకోవడానికి అ న్నట్టుగా ఆయా హారన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇవే ఫ్యాషన్‌గా మారి ంది. వాటి నుంచి వచ్చే వింతవింత శ బ్ధాలతో నగర ప్రజలను బెంబేలెత్తిపోతున్నారు. శారీరక, మానసిక అనారో గ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. శబ్ద కాలుష్యమే పరమావధి శబ్ద కాలుష్యం సృష్టించడమే పరమావధిగా కొందరు యువకులు తమ బైకులకు అమర్చుకునే హారన్ల ద్వారా ఇతరులకు దడ పుట్టిస్తున్నారు. యువత రోడ్లపై ఇష్టానుసారం తిరుగుతూ వేస్తున్న హారన్ల శబ్దాలు ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. ఉపధ్రవమేదో జరుగుతోందనే ఆందోళనలో ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. ఇటీవల బుల్లెట్ బైక్‌ల వినియోగం పెరగడంతో వాటి నుంచి సాధారణంగానే పెద్దశబ్ధం వస్తుండగా, వాటికి అమర్చే హారన్లు నుంచి వచ్చే పెద్దశబ్దం ధ్వని కాలుష్యాన్ని పెంచిపోషిస్తున్నాయి. చిన్నారులు బిగ్గరగా ఏడుస్తున్నట్లు, ఏదో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు హాహాకారాలు చేస్తున్నట్లు, హర్రర్ సినిమాల్లోని భయంకర శబ్దాలు హారన్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి కొందరైతే మంత్రులు, కలెక్టర్లు, ఇతర వీఐపీలు బుగ్గకార్లకు వాడే హారన్లు, ఫైర్ ఇంజన్, అంబులెన్స్ హారన్లను కూడా బైకులకు వినియోగిస్తున్నారు. నిబంధనలివి కేంద్ర మోటార్ వాహనాల చట్టంలో వాహనాల హారన్ల శబ్దం ఎన్ని డెసిబుల్స్ ఉండాలో నిర్దేశించారు. ఇవి ట్రాఫిక్ విధులు నిర్వహించే కొందరికి తెలియకపోవడం శోచనీయం. మోటార్ బైకులకు 80 డెసిబుల్స్, కార్లకు 82, ప్యాసింజర్ లేదా నాలుగు టన్నుల లోపు తేలికపాటి వాహనాలకు 85, 12 టన్నుల సామర్థ్యం గల వాహనాలకు 88, అంతకు మించిన భారీ వాహనాలకు 91 డెసిబుల్స్ హారన్ మాత్రమే వినియోగించాలి. అనారోగ్యమే శబ్ద కాలుష్యం అధికమైతే తాత్కాలిక, శాశ్వత వినికిడి లోపం ఏర్పడే ప్రమాదముంది. మోతాదుకు మించిన శబ్దం మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. చెవుల్లో దూది పెట్టుకుంటే 5 డెసిబుల్స్ శబ్దం నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే ఇయర్ ప్లగ్స్ వినియోగంతో 15 డెసిబుల్స్, ఇయర్ మగ్గస్తో 30 నుంచి 40 డెసిబుల్స్ శబ్దం నుంచి రక్షణ కల్పిస్తుంది. – డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు, చెవి, ముక్కు,గొంతు వైద్య నిపుణులు మల్టీ టైప్ హారను నిషేధం మోటారు వాహనాల చట్టం మల్టీ టైప్ హారన్లను నిషేధించింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, బాలికల హాస్టళ్లు వంటి ప్రాంతాల్లో హారన్లను వినియోగించరాదు. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే 108 జీఓ ప్రకారం రూ.1000 అపరాధ రుసుంగా వసూలు చేస్తాం. – కె.ఈశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు -
నో హారన్ ప్లీజ్...
ఈ నినాదం ఎన్నో వాహనాల వెనుక రాసి ఉంటుంది.. కానీ పాటించేదెవ్వరు? ఈయన పాటిస్తున్నాడు.. 18 ఏళ్లుగా! నోరెళ్లబెట్టారా? రోజూ హారన్ కొట్టికొట్టి వాహనాలు నడిపే.. మనలాంటి వాళ్లకు ఇలాంటోళ్లను చూస్తే.. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది మరి.. అందుకే ఈయనకు ఆ మధ్య ‘మానుష్ సన్మాన్’ అనే పురస్కారాన్ని కూడా ఇచ్చారు. ఇంతకీ ఈయనెవరో చెప్పలేదు కదూ.. పేరు.. దీపక్ దాస్.. కోల్‌కతాలో ఉంటారు. శబ్ధ కాలుష్యంలో ఈ హారన్లదీ కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసినా.. మరో వాహనం మనకు దగ్గరగా వచ్చినా.. హారన్‌తో ఓసారి హెచ్చరిస్తాం. ‘హారన్ల వల్ల శబ్ద కాలుష్యం మరింత పెరుగుతుంది. నో హారన్ పాలసీని అనుసరించడం ద్వారా డ్రైవర్ మరింత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతాడు. టైమింగ్, వేగం, ఎంత స్పేస్ ఉందన్న విషయంపై తగిన అవగాహన ఉంటే చాలు.. హారన్‌తో పనే లేదు’ అని దీపక్ దాస్ చెబుతారు. కారు డ్రైవర్‌గా పనిచేసే దీపక్.. ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు తన కస్టమర్లు హారన్ ఉపయోగించాలని కోరుతుంటారని.. తాను సున్నితంగా తిరస్కరిస్తుంటానని తెలిపారు. దూర ప్రయాణాల విషయంలోనూ తనది ఇదే పాలసీ అని చెప్పారు. తన స్ఫూర్తితో కొంతమందైనా డ్రైవర్లు మారితే చాలన్నారు. తమ వినూత్న ప్రతిభ ద్వారా సమాజానికి మంచి చేసే వ్యక్తులను ‘మానుష్ మేలా’ అనే సంస్థ ఏటా మానుష్ సన్మాన్ అవార్డుతో సన్మానిస్తుంది. దీపక్ గతంలో పలువురు ప్రముఖులతోపాటు పలు సంస్థల్లో డ్రైవర్‌గా పనిచేశారని.. అందరినీ కనుక్కున్నాకే.. పూర్తిస్థాయి పరిశీలన అనంతరమే.. దీపక్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సదరు సంస్థ ప్రతినిధులు చెప్పారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
బుల్‌ఫైట్ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము
-
బుల్‌ఫైట్ : 11 ఇంచులు దూసుకుపోయిన కొమ్ము
మెక్సికో: బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడుస్తూ హింసించే బుల్‌ఫైట్ క్రీడలో దారుణం చోటు చేసుకుంది. దున్నపోతుకు, బుల్ఫైటర్కు మధ్య మెక్సికోలో హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో దున్నను తన చేతిలో ఉన్న ఎరుపు రంగు జెండాను చూపిస్తూ తన ఆధీనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అదును చూసుకొని దున్న బుల్ ఫైటర్‌ను ఒక్క కుమ్ము కుమ్మడంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో జెండాతో పాటూ చేతిలోని ఆయుధం కిందపడిపోయాయి. కిందపడిపోయిన అతనిపై దున్న ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించింది. తప్పించుకోవడానికి ప్రయాత్నించే క్రమంలోనే దున్న అతని వెనకవైపు భాగంతో పొడిచింది. దీంతో 11 ఇంచుల మేర కొమ్ము అతని వెనక భాగంలోకి దూసుకుపోయింది. తీవ్రగాయాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
శవమై తేలిన మరో ఖడ్గమృగం!
అసోంః కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో మరో ఖడ్గమృగం శవమై తేలింది. ఇప్పటికే ఎన్నోసార్లు వేటగాళ్ళ బారిన పడి ఆ మూగజీవాలు మృత్యు వాత పడ్డ విషయం తెలిసిందే. వాడిగా ఉండే వాటి కొమ్ములకోసం వేటగాళ్ళు ఏంకగా వాటి ప్రాణాలనే బలితీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా తాజాగా కొమ్ములతోసహా ఓ మగ ఖడ్గమృగం కనిపించి కలకలం రేపింది. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ (కేఎన్ పీ) సమీపంలో ఖడ్గ మృగం మృతదేహం కనిపించింది. పార్కు సమీపంలోని జపోరిపత్తర్ గ్రామస్థులు కొమ్ములతోపాటు ఉన్న జంతువు శరీరాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. కొహోరా రేంజ్ లోని మికిర్జన్ అటవీప్రాంతం డిప్లూ నదిలో ఖడ్గమృగం శరీరం కొట్టుకొని వచ్చినట్లు జపోరిపత్తర్ గ్రామస్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేఎన్పీ అధికారులు, పశువైద్యులు శరీరాన్ని పరిశీలించి.. ఆ మృగానిది సహజ మరణంగా నిర్థారించారు. ఎంతో దృఢంగా ఉండే ఖడ్గమృగం కొమ్ములను సురక్షితంగా భద్రపరిచేందుకు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అదొక్కటే దారి..: రేణు దేశాయ్
అసలే ట్రాఫిక్.. ఆపైన హారన్.. ఎంత చిరాకుగా ఉంటుందో కదా. ట్రాఫిక్ జామ్ అయిందని చూస్తూ కూడా కొంతమంది అదే పనిగా హారన్ మోగిస్తుంటారు. అప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. బహుశా రేణు దేశాయ్‌కి కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్టుంది. తన అనుభవాన్ని కాదుగానీ.. ఇదొక్కటే దారి అంటూ ట్విట్టర్లో తనకు తోచిన పరిష్కారాన్ని సూచించారు రేణు. హారన్ బటన్‌ను పెట్రోల్ ట్యాంకుకు అటాచ్ చేసి.. హారన్ మోగించినప్పుడల్లా ట్యాంకులో ఉన్న ఇంధనం త్వరగా అయిపోయేలా చేయడమే.. ఇండియాలో అనవసరంగా హారన్ మోగించేవారిని ఆపగలిగే ఏకైక పరిష్కారం అంటూ ట్వీట్ చేశారు. అలాగే.. ఎప్పుడైనా మీకు వృద్ధులుగానీ, పిల్లలు గానీ రోడ్డు దాడుతూ కనిపిస్తే.. జస్ట్ ఒక్కసారి వారిని మీ తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఊహించుకుని దయచేసి మీ వాహనాన్ని ఆపి వారిని రోడ్డు దాటనివ్వండి అంటూ ట్వీట్ చేశారు రేణు దేశాయ్. When you see old ppl or kids trying to cross the road, just imagine them to be ur parents or kids& stop ur bike/car&let them cross...please — renu (@renuudesai) September 22, 2015 The only way ppl will stop honking unnecessarily in India is, if the horn button is attached to petrol tank & the fuel gets used up faster — renu (@renuudesai) September 22, 2015