వాహనాల హారన్ సౌండ్లు మార్చే యోచనలో కేంద్రం ఉందనే కథనాల నడుమ.. కీలకమైన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. కార్లకు మాత్రమే హారన్ శబ్దాలను, అదీ భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాల్ని అన్వయింజేస్తామని, చట్టబద్ధత ద్వారా దీనిని అమలు చేయబోతున్నామని వెల్లడించారు.
హారన్ శబ్దాలు మార్చేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేక చట్టం అమలులోకి తేబోతున్నామని ప్రకటించారు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నిజానికి గతంలోనే ఆయన పేరు మీద ‘ప్లీజ్ ఛేంజ్ హార్న్’ కథనం వెలువడినప్పటికీ.. ఇప్పుడు నేరుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఫ్లూట్, తబలా, వయొలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియం.. ఈ లిస్ట్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారాయన.
అంతేకాదు ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సైరన్‌లను మార్చే అంశం పరిశీలిస్తున్నామని, వాటి స్థానంలో ఆల్ ఇండియా రేడియోలో వినిపించే ఆహ్లాదకరమైన సంగీతాన్ని చేర్చే విషయమై సమీక్షిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో వినిపించే ఆ సంగీతం వినేవారికి ఆహ్లాదకరమైన కలిగిస్తుందని భావిస్తున్నట్లు గడ్కరీ అభిపప్రాయపడ్డారు. వాహనాల రోదనల వల్ల జనాలు పడే ఇబ్బందులేంటో తనకూ అనుభవమని, అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు.
ఆ జోన్స్ లేకపోవడమే..
నో హాంకింగ్ జోన్స్.. అంటే ఆ జోన్ ఉన్న ప్రాంతంలో వెహికల్స్ హారన్ కొట్టడానికి వీల్లేదు. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. చాలాదేశాల్లో ఇలాంటి జోన్లు ఉన్నాయి. కానీ, మన దేశంలో ఎక్కడా అలాంటివి కనిపించవు. కేవలం ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో నో హాంకింగ్ జోన్స్‌కి బదులు.. హారన్ శబ్దాల్ని మార్చాలనే ఆలోచన చేయడం విశేషం. సడలింపు లేకుండా ఈ నిబంధనను అమలు చేస్తే.. హారన్ మార్పిడి కోసం వాహన తయారీదారీ కంపెనీలతో పాటు పాత వాహనదారులపైనా భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment