all india radio
-
గళ మాంత్రికుడు, లెజెండ్, అమీన్ సయానీ: ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
"బెహెనోం..ఔర్ భాయియోం.. మై హూం ఆప్కా దోస్త్.. అంటూ శబ్ద తరంగాలపై తేలియాడుతూ కొంత గంభీరంగా మరింత శ్రావ్యంగా మోగిన ఆ స్వరం 70వ చివరిదాకా పరిచయం లేనివారు ఉంటారా అసలు. ప్రతి బుధవారం రాత్రి 8గం.లకు రేడియో సిలోన్ లో బినాకా గీత్ మాలా లక్షలాది ఇళ్లలో మారుమోగిన సూపర్ హిట్ షో. అమీన్ సయానీ గొంతు వినటం ఒక మరపురాని జ్ఞాపకం. ఆహా..అంటూ హిందీ చిత్రగీతాలను పరిచయం చేస్తూ సాగిన ఆ స్వరం దశాబ్దాల తరబడి భావి తరాలకు స్ఫూర్తినిచ్చింది. తన గాత్రంతో ప్రజల గుండె చప్పుడును పెంచిన ప్రపంచ స్వర మాంత్రికుడు. ఆకాశవాణిలో అమీన్ సయానీ గోల్డెన్ వాయస్ ఒక మ్యాజిక్. 91 ఏళ్ల వయసులో గుండెపోటు రావడంతో ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన మరణం తీరని లోటు.. ఒక స్వర్ణ యుగం ముగిసిందంటూ అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. మైక్‌లో కూల్‌గా, సాధారణంగా మృదువైన టోన్‌తో 54,000కి పైగా రేడియో ప్రోగ్రామ్‌లు, జింగిల్స , స్పాట్లను అందించిన అద్భుతమైన వ్యక్తి అమీన్ సయానీ. 1952లో ప్రారంభమైన బినాకా గీత్మాల 70ల చివరినాటికి, వారానికోసారి 21 కోట్ల మంది ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. వారానికి 65వేలకు పైగా సంచుల కొద్దీ ఉత్తరాలొచ్చేవంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. రేడియో సూపర్‌స్టార్ కేవలం 13 ఏళ్లకే బాంబేలో ఆల్ ఇండియా రేడియో (AIR)కి ఆంగ్ల భాషా వ్యాఖ్యాతగా పనిచేశారు. 1952లో, బాలకృష్ణ విశ్వనాథ్ కేస్కర్‌ను ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా నియమించారు. కేస్కర్ భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో హిందీ-భాషా సినిమా పాటల పట్ల మోజు చూపలేదు. హిందీ పాటల ప్రసార సమయాన్ని 10శాతం కోటాకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిషేధించాడు. ఆ రోజుల్లో భారతదేశంలో పనిచేస్తున్న ఒక అమెరికన్ వ్యాపారవేత్త డేనియల్ మోలినా సయాని సోదరుడు హమీద్‌ను తన సిలోన్ రేడియో కార్యకలాపాలకోసం ఎంపిక చేశారు. ఇంతలో ఆల్ ఇండియా రేడియో హిందీ విభాగం ఆడిషన్ తర్వాత, ఇంగ్లీష్, గుజరాతీకి సంబంధించిన యాస ఉందంటూ అమీన్‌ను తిరస్కరించారు. దీంతో సిలోన్ రేడియోలో ఉద్యోగం కోసం సోదరుడిని అడిగాడు. ఆకాశవాణి తిరస్కరించి కదా అంటూ ఆయన కూడా నిరాకరించాడు. అయితే అంత తేలిగ్గా వదులుకునే వ్యక్తి కాదు సయానీ. పట్టు వీడ లేదు. ఆ సమయంలో అమీన్‌కి ‘ఓవల్టీన్ఫుల్వారీ’ కార్యక్రమంలో అనౌన్సర్‌గా ఉద్యోగం వచ్చింది. తన మధురమైన గాత్రం, తనదైన శైలితో ప్రేక్షకులను కట్టి పడేసే వారు. తరువాత 1952లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని లెజెండ్‌గా అవతరించాడు. అలాగే తనను తిరస్కరించిన ఆల్ ఇండియా రేడియోలో అత్యంత ఇష్టపడే అనౌన్సర్‌గా నిలవడం విశేషం. 1952లో ‘బినాకాగీత్మాల’ సంచలనాలు నమోదు చేసింది. సయానీన షోను స్వీడిష్ కంపెనీ సిబా టూత్‌పేస్ట్ బ్రాండ్ బినాకా స్పాన్సర్ చేసింది. అదృష్టవశాత్తూ గీతమాల కార్యక్రమం 1989 - 1990ల మధ్య ఆల్ ఇండియా రేడియో (AIR)లోని వివిధ్ భారతికి మారింది. ఇటీవల హిందీ-భాషా సినిమా స్వర్ణయుగం సంగీత హక్కులను కలిగి ఉన్న సరేగామ, దశాబ్దాల ప్రోగ్రామ్ చరిత్రలోని ముఖ్యాంశాలను కవర్ చేసిన “అమీన్ సయానీ ప్రెజెంట్స్ గీత్‌మాలా కి ఛాన్ మే” పేరుతో 10 సంపుటాలను విడుదల చేసింది.ఈ పాటలతో పాటు, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, ముఖేష్, మన్నా డే, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, శశి కపూర్ , మరెంతో మంది గొప్ప వ్యక్తులతో సయానీ ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. అవార్డులు, రివార్డులు అమీన్సయానీని 2009లో పద్మశ్రీ అవార్డ్ వరించింది. 2006లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ నుండి లివింగ్ లెజెండ్ అవార్డు 2003లో ఇండియా రేడియో ఫోరమ్, రేడియో మిర్చి నుంచి కాన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో పాటు వంటి అనేక అవార్డులను అందుకున్నారు. "బినాకా గీతమాల" కు అత్యుత్తమ రేడియో కార్యక్రమంగా 2000లో బొంబాయి అడ్వర్టైజింగ్ క్లబ్ గోల్డెన్ అబ్బి, ఇండియన్ అకాడమీ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ ఆర్ట్ నుండి 1993లో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు, 1992లో పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 1991లో ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ నుండి అప్పటి భారత ఉపరాష్ట్రపతి K.R. నారాయణన్ చేతుల మీదుగా బంగారు పతకాన్నిఅందుకున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి ఆయన గళం ఆసియా దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 'బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఎత్నిక్ నెట్వర్క్'లో ప్రసారమయ్యే "మినీ ఇన్సర్షన్స్ ఆఫ్ ఫిల్మ్ స్టార్ ఇంటర్వ్యూస్", బీబీసీవరల్డ్ సర్వీస్ రేడియోలో మిలియన్స్", లండన్‌లోని 'సన్‌రైజ్ రేడియో'లో ప్రసారమయ్యే "వీటీకా హంగామా"కు నాలుగున్నరేళ్లు, UAEలోని 'రేడియో ఉమ్ముల్క్వైన్'లో ప్రసారమవుతున్న "గీత్‌మాలా కి యాదీన్" నాలుగేళ్లుగా, "యే భీచంగావో భీఖూబ్" 'రేడియో ఆసియా',దుబాయ్‌లో ఎనిమిది నెలల పాటు, టొరంటో, వాషింగ్టన్, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ బోస్టన్లలోని 'జాతి రేడియో స్టేషన్ల'లో మొత్తం రెండున్నర సంవత్సరాల పాటు, దక్షిణాఫ్రికా దేశం స్వాజిలాండ్ ఇలా మరెన్నో ఆయన కరియర్లో మైలు రాళ్లు. సినిమాల్లోనూ.. అమీన్ సయాని భూత్ బంగ్లా, బాక్సర్, తీన్ డెవియన్ , ఖత్ల్తో సహా సినిమాల్లో అనౌన్సర్‌గా కనిపించారు. 1960-62లో టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్‌లో బ్రాండ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశాడు. ఆయన భార్య రమా మట్టు కూడా ప్రముఖ గాయని, వాయిస్ ఆర్టిస్ట్. ఎక్కడ పుట్టారు 1932 డిసెంబర్ 21 న ముంబైలో జన్మించారు అమీన్ సయానీ . ముంబైలోని న్యూ ఎరా స్కూల్లో అతని పాఠశాల విద్య పూర్తిగా ఇంగ్లీష్ , గుజరాతీలో సాగింది. తరువాత 1954లో గ్వాలియర్‌కు మారి సింధియా స్కూల్లో చదువుకున్నారు. స్వాతంత్ర్యం తరువాత, ముంబైకి తిరిగి వచ్చేశారు. ప్రస్తుత FM రేడియో యుగంలో, రేడియో జాకీలు వస్తున్నారు. పాపులారిటీ సాధిస్తున్నారు. కానీ భారతదేశ రేడియో ప్రేమికులకు అమీన్ తేనెలూరు ఆ స్వరం అజరామరం. ఆయన భౌతికంగా లేకపోయినా ధ్వని తరంగాలపై ఆ గొంతు ఎప్పటికీ శాశ్వతమే. -
అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!
అది 1973 సంవత్సరం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12.05 ని. కావస్తోంది. కాసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం.. శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం.. అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు. అలా ప్రారంభమైన ఆ కార్యక్రమం – 1990 సెప్టెంబరు 7 వ తేదీ ‘ఉషశ్రీ’ కన్నుమూసే వరకు కొనసాగింది. ఆకాశవాణి ద్వారా ఉషశ్రీ.. వాల్మీకి రామాయణం, కవిత్రయ భారతం, పోతన భాగవతాలను తెలుగు శ్రోతలకు వినిపించారు. శ్రోతల సందేహాలకు చమత్కారంగా సమాధానాలిచ్చేవారు. ఉషశ్రీ నేపథ్యం.. పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ‘ఉషశ్రీ’ కలం పేరుతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. జ్వలితజ్వాల, అమృత కలశం, మల్లెపందిరి, సంతప్తులు, ప్రేయసి – ప్రియంవద, తరాలు-అంతరాలు వంటి నవలలు, కథలు, వెంకటేశ్వర కల్యాణం వంటి యక్షగానాలు, పెళ్లాడేబొమ్మా(నవలా లేఖావళి), వ్యాసాలు, విమర్శలు, నాటికలు రాసిన ఉషశ్రీ... రామాయణభారత ఉపన్యాసాలు ప్రారంభించాక ఇక కథలు, పద్యాలు, నవలలు విడిచిపెట్టేశారు. ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా.. తుది శ్వాస విడిచేవరకు రామాయణభారతాలే ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా జీవించారాయన. శృంగేరి శారదా పీఠం ఆస్థానకవిగా సత్కారం అందుకున్నారు. ఉషశ్రీ రచించిన రామాయణ భారత భాగవతాలను తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కాపీలు ముద్రించింది. ఇప్పుడు తెలుగువారు గర్వించే సన్నివేశం చోటు చేసుకుంది. అదే అయోధ్యలో ఉషశ్రీ గళం. అయోధ్య అంతటా.. ఉషశ్రీ గళంలో జాలువారిన రామాయణం ఇప్పుడు అయోధ్యలో వినిపిస్తోంది. అయోధ్యను సందర్శించి, విన్నవారు ఈ సంగతిని చెప్పారు. అంతే కాకుండా దేశంలోని అనేక ఎఫ్.ఎం. స్టేషన్లు కూడా దీనిని ప్రసారం చేస్తున్నాయి. కేంద్రంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒకరి చొరవతో ఇది సాధ్యమైందని తెలిసింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు తమ ఎఫ్.ఎం. స్టేషన్లలో వీటిని తాజాగా ప్రసారం చేశాయి. వీటిని విన్నవారు, ఇదే స్వరాన్ని అయోధ్య ఆలయంలో కూడా విన్నామని చెబుతున్నారు. ఆటుపోట్ల నడుమ ఆ గళం.. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గళ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడలో వినబడడం ప్రారంభమైంది. ధర్మసందేహాలు శీర్షికన మహాభారతంతో మొదలై, శ్రీ భాగవతం వరకూ కొనసాగింది. ఆ సమయంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉషశ్రీ గారు భౌతికంగా అదృశ్యమై 33 సంవత్సరాలు అయినా ఆ గళం ఇంకా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన అభిమానులు. ఆ తరువాత కరోనా సమయంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉషశ్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. రామాయణ, భారత, భాగవతాలను ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ రామాయణం దేశవ్యాప్తంగా అన్ని ఎఫ్.ఎం.లలోనూ ప్రసారమవుతోంది. అయోధ్య రామాలయ పరిసరాల్లోనూ మార్మోగుతోంది. ఉత్తర భారతంలో ఉషశ్రీ రామాయణాన్ని వినిపించడం అది కూడా రాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రసారం చెయ్యడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. -
‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం!
అరబిందో ఘోష్.. ప్రముఖ భారతీయ తత్వవేత్త, యోగి, మహర్షి, కవి, పాత్రికేయుడు. 1872 ఆగస్టు 15న అరబిందో ఘోష్ జన్మించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆల్ ఇండియా రేడియో, తిరుచిరాపల్లి అభ్యర్థన మేరకు అరబిందో స్వాతంత్ర్య ఉద్యమ సందేశాన్ని అందించారు. అది 1947 ఆగస్టు 14న రేడియోలో ప్రసారమయ్యింది. ‘ఈ రోజే నా పుట్టినరోజు యాదృచ్చికం’ ‘ఆగస్ట్ 15 నా పుట్టినరోజు. దేశానికి స్వాతంత్ర్యం దక్కిన రోజే నా పుట్టినరోజు కావడం సహజంగానే నాకు సంతోషాన్నిస్తుంది. నేను ఈ యాదృచ్చిక సంఘటనను సాధారణమైనదిగా కాకుండా, నేను చేపడుతున్న పనుల విషయంలో నా దశలను మార్గనిర్దేశం చేసే దైవిక శక్తి ఆమోద ముద్రగా తీసుకుంటాను. ఈ రోజున నేను నా జీవితకాలంలో నెరవేరాలని ఆశించిన అతిపెద్ద కలను చూడగలిగాను. గతంలో అవి ఆచరణ సాధ్యం కాని కలల మాదిరిగా కనిపించాయి. ఇప్పుడు అవి ఫలించాయి. సాధించే మార్గంలోనూ కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాలన్నింటిలో స్వేచ్ఛా భారతదేశం అనేది అగ్రగామిగా నిలిచింది. ‘భారత్ శక్తిమంతం కానుంది’ నేను కన్న కలలలో మొదటిది స్వేచ్ఛాయుత ఐక్య భారతదేశాన్ని సృష్టించడం. భారతదేశం నేడు స్వేచ్ఛగా ఉంది. కానీ ఐక్యతను సాధించలేదు. బ్రిటిష్ ఆక్రమణకు ముందు ఉన్న ప్రత్యేక రాష్ట్రాల గందరగోళం తిరిగి చోటుచేసుకుంటుందనే భావన ఏర్పడుతోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ముప్పు తప్పే చర్యలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో యూనియన్ స్థాపితమవనప్పటికీ, ఇది శక్తివంతమైనదిగా మారనున్నదని తెలుస్తోంది. రాజ్యాంగ సభ తీసుకున్న తెలివైన, కఠినమైన విధానం అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి దోహదపడేలా ఉంది. అలాగే విభేదాలు, చీలికలు లేకుండా పరిష్కారానికి అవకాశం ఏర్పడనుంది. ఇది కూడా చదవండి: సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు.. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. ‘మతపరమైన విభజన భావన తగదు’ అయితే హిందువులు, ముస్లింలు అనే మతపరమైన విభజన ఇప్పుడు దేశంలో శాశ్వత రాజకీయ విభజనగా మారింది. ఈ వాస్తవం తాత్కాలిక అంగీకారంగానే ఉండాలి. ఒకవేళ ఇదే కొనసాగితే భారతదేశం తీవ్రంగా బలహీనపడవచ్చు. అప్పుడు అంగవైకల్యం బారినపడినట్లవుతుంది. అలాంటప్పుడు దేశపౌరుల మధ్య కలహాలు ఎల్లప్పుడూ కొనసాగుతాయి. కొత్త దండయాత్రలు, విదేశీ ఆక్రమణలకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. భారతదేశ అంతర్గత అభివృద్ధికి, శ్రేయస్సుకు ఆటంకం ఏర్పడుతుంది. విదేశాలలో భారత్ స్థానం బలహీనపడవచ్చు. దేశ విభజన జరగాలి. అయితే శాంతి, సామరస్యాల ఆవశ్యకతను గుర్తించడం ద్వారా దేశంలో ఐక్యత ఏర్పడుతుంది. ఇది భారతదేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం. ‘స్వేచ్ఛాయుత పోరాటాల్లో భారత్ కీలకం’ నేను కన్న మరో కల ఆసియావాసుల పునరుజ్జీవనం, విముక్తి. మానవ నాగరికత గొప్ప పురోగతి సాధించడం. ఆసియా ఉద్భవించింది. చాలా దేశాలు ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఉన్నాయి. మరికొన్ని విముక్తి పొందుతున్నాయి. కొన్ని దేశాల్లో స్వేచ్ఛ కోసం పోరాటాలు సాగుతున్నాయి. నేడోరోపో వారి కలలు నెరవేరనున్నాయి. వీటిలో భారతదేశం తన కీలక పాత్రను పోషించవలసి ఉంది. శక్తి , సామర్థ్యాలను చాటాల్సిన అవసరం ఉంది. ఇది వినూత్న అవకాశాలను అందించడమే కాకుండా, వివిధ దేశాల కౌన్సిల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెడుతుంది. ‘ప్రపంచ ఏకీకరణ అత్యవసరం’ నా మూడవ కల మానవ ప్రపంచ ఏకీకరణ. ఇది ప్రస్తుతం జరుగుతోంది. దీనిలో కూడా భారతదేశం ప్రముఖ పాత్రను పోషించడం ప్రారంభించింది. ప్రస్తుత వాస్తవాలు, తక్షణ అవకాశాలకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తును గుర్తించి, రాజనీతిజ్ఞతను పెంపొందించుకోగలిగితే దేశ ఉనికి మరింతగా గుర్తింపు పొందుతుంది. ఏకీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఒక అనివార్య ఉద్యమం. అన్ని దేశాలకు దాని ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఐక్యత లేనప్పుడు చిన్నచిన్న దేశాల స్వేచ్ఛ ఏ క్షణంలోనైనా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఇందుకు అంతర్జాతీయ స్ఫూర్తి, దృక్పథం మరింతగా పెరగాలి. ద్వంద్వ లేదా బహుపాక్షిక పౌరసత్వం, వివిధ సంస్కృతుల స్వచ్ఛంద కలయిక వంటి పరిణామాలు జరగాలి. ఏకత్వపు స్ఫూర్తి మానవ జాతి ప్రగతికి ఆధారంగా నిలుస్తుంది. నాకున్న మరో కల ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక బహుమతిని అందివ్వాలి. అది ఇప్పటికే ప్రారంభమైంది. భారతదేశ ఆధ్యాత్మికత యూరప్, అమెరికాలో నానాటికీ మరింతగా ప్రవేశిస్తోంది. కేవలం బోధనలకు మాత్రమే పరిమితం కాకుండా మానసిక, ఆధ్యాత్మిక సాధనలకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. ‘పశ్చిమ దేశాలలో భారత్‌కు పట్టు’ నా చివరి కల నాగరికతా పరిణామంలో మరో అడుగు. ఇది మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకు వెళుతుంది. వ్యక్తిగత పరిపూర్ణత, పరిపూర్ణ సమాజం ఏర్పాటుకు దారితీస్తుంది. సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. ఈ దిశగా కదులుతున్న భారతదేశం.. పశ్చిమ దేశాలలో పట్టు సాధించడం ప్రారంభించింది. ఘనమైన సంకల్పం ఉంటే అన్ని సమస్యలు సమసిపోతాయి. ఈ పరిణామం చోటుచేసుకోవాలంటే ప్రజలు అంతర్గత స్పృహను కలిగివుంటూ ముందుకు సాగాలి. ఈ చొరవ భారతదేశం నుండే మొదలుకావచ్చు. భారతదేశానికి విముక్తి కలిగిన రోజున నా ఆశ ఎంతవరకు నేరవేరుతుందనేది స్వేచ్ఛాయుత భారతదేశంపై ఆధారపడి ఉంటుంది’ అని అరబిందో పేర్కొన్నారు. అరబిందో ఘోష్ 1950 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -
మన్ కీ బాత్ @100.. మోదీ కామెంట్స్ ఇవే..
సాక్షి, ఢిల్లీ: ఎంతో ఆత్రుతతో దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రసరమవుతోంది. మన్ కీ బాత్ కోసం దేశవ్యాప్తంగా 4 లక్షల వేదికలు ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌తో పాటు వెయ్యి రేడియో స్టేషన్లతో లైవ్‌లో మన్ కీ బాత్ ప్రసారమవుతోంది. ఇక, మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2014 విజయదశమి రోజున మన్ కీ బాత్ మొదలుపెట్టాం. ప్రజలు మన్ కీ బాత్‌లో భాగస్వాములయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన్ కీ బాత్‌లో చర్చించాం. సామాన్యులతో అనుసంధానికి మన్ కీ బాత్ వేదికైంది. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలను మరింత చేరువ చేసింది. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందన్నారు. I'm glad that #MannKiBaat has covered various stories of women empowerment, such as the women of Deora village in Chhattisgarh, tribal women in Tamil Nadu making terracotta cups, and women rejuvenating Vellore Lake. #MannKiBaat has showcased stories of talented individuals across… pic.twitter.com/XvIUfOjXew — ANI (@ANI) April 30, 2023 ఇక, మన్ కీ బాత్ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని స్వయం సహాయక సంఘం గుర్తించి మోదీ ప్రస్తావించారు. మహిళా శక్తిని ప్రధాని ప్రశంసించారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా గతంలో ఫోన్లో మాట్లాడిని వ్యక్తులతో మోదీ మళ్లీ ముచ్చటించారు. విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురించి మోదీ ప్రస్తావించారు. ప్రసాద్ ఎక్కువగా భారతీయ వస్తువులే ఉపయోగిస్తారని అన్నారు. ఇలా పలువురు గురించి ప్రస్తావించారు. Mann Ki Baat has been a catalyst in igniting numerous mass movements, be it 'Har Ghar Tiranga' or 'Catch the Rain', Mann Ki Baat has enabled mass movements to gain momentum: PM Narendra Modi during the 100th edition of #MannKiBaat#MannKiBaat100 pic.twitter.com/Z2DBkxzNee — ANI (@ANI) April 30, 2023 #WATCH | Union Minister Jitendra Singh listens to the 100th episode of #MannKiBaat at India House in London, UK. pic.twitter.com/yOpYXHNSjQ — ANI (@ANI) April 30, 2023 #WATCH | BJP national president JP Nadda listens to the 100th episode of #MannKiBaat, in Davanagere, Karnataka. pic.twitter.com/h9kLJKGlDe — ANI (@ANI) April 30, 2023 #WATCH | Uttar Pradesh: Students and teachers at Irfania Madarsa in Lucknow listen to the 100th episode of #MannKiBaat pic.twitter.com/J6uXAgICmS — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 30, 2023 ఇది కూడా చదవండి: మన్ కీ బాత్ @100.. ఐరాసలో ప్రసారం.. -
మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్‌లైటింగ్’ అంటారు. అయితే టెక్ కంపెనీల చట్టం ప్రకారం ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఆ తొలగింపులే ఐటీ రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై స్పందించారు. తాను ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)లో రేడియో జాకీగా పనిచేసే సమయంలో మూన్‌లైటింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఓవైపు లాయర్‌గా పనిచేస్తూనే ఏఐఆర్‌లో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ అనే షోస్‌గా వ్యవహరించినట్లు ఓ సమావేశంలో చెప్పారు. ఆ వీడియోని బార్ అండ్ బెంచ్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం సంస్థలో పనిచేస్తూ..మరో సంస్థలో మరో జాబ్ చేయడానికి మూన్‌లైటింగ్ అంటారు?. అయితే కాన్ఫరెన్స్‌లో సీజేఐ మాట్లాడుతూ..అప్పట్లో దీని గురించి (మూన్‌లైటింగ్) చాలా మందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో నేను మూన్‌లైటింగ్ చేశా. రేడియో జాకీగా పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్ చేసినట్లు తెలిపారు.‘ఈ సందర్భంగా తన అభిరుచిల్ని బయటపెట్టారు.నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. అందుకే ప్రతిరోజూ న్యాయ విధులు నిర్వహిస్తూనే..ఇంటికి వెళ్లి మ్యూజిక్ వింటున్నట్లు వెల్లడించారు. మూన్‌లైటింగ్ అంటే మోసం చేయడమే ఇటీవల మనదేశంలో పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐటీ కంపెనీ హ్యాపిహెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రెండో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విటర్లో మూన్‌లైటింగ్ అంటే సంస్థల్ని మోసం చేయడంతో సమానమేనని అన్నారు. అప్పటి నుంచి దేశీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ చర్చంశనీయంగా మారింది. Did you know CJI DY Chandrachud moonlighted as a RADIO JOCKEY in his early 20's - Do listen to him#SupremeCourt #SupremeCourtofIndia #cjichandrachud Video Credit - BCI pic.twitter.com/EdvRqntXST — Bar & Bench (@barandbench) December 4, 2022 చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ -
అలనాటి ఆకాశ వాణి
‘‘కలదు ఆ శారదకు వీణ కరములందు కలదు ఈ శారదకు వీణ గళమునందు కలదు ఆ శారద కవుల కవితలందు కలవు కవితలే ఈమె గానామృతమందు శారద కాని శారదకు శారదలోగల సత్కళా సుధా సారదకున్... విశారదకు సాదర పూర్వ నమస్సుమాంజలులు’’ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌కు ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ప్రశంస ఇది. 19.6.1977వ తేదీన ఆత్రేయ స్వహస్తాలతో రాసిన ఈ లేఖ శారదా శ్రీనివాసన్ దగ్గర ఇంకా భద్రంగా ఉంది. ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో ‘లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ’ ప్రాంతీయ పురస్కారం అందుకున్నారామె. 45 ఏళ్ల కిందటి ఆత్రేయ గారి ప్రశంస, ఇప్పుడు ఈ పురస్కారానికి మధ్య ఆమె అందుకున్న గౌరవాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని. అలాగే ఆమె గళమిచ్చిన పాత్రల సంఖ్య కూడా! వేలల్లో ఉంది. తనకు గుర్తింపు, గౌరవం అన్నీ రేడియోతోనే అన్నారామె. శారదా శ్రీనివాసన్ తన రేడియో ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. గళం దేవుడిచ్చాడు! ఉచ్చారణ ఇల్లు నేర్పించింది! ‘‘నేను పుట్టింది కృష్ణాజిల్లా, అవనిగడ్డ. మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. అప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవారు. నాకు భగవంతుడు చక్కటి గొంతునిచ్చాడు. చక్కగా ఉచ్చరించడం మా ఇంట్లో అలవడింది. ఏ తొందరపాటులోనో ఒకపదంలో ఒక్క ఒత్తును సరిగ్గా పలకకపోయినా సరే ఉపేక్షించేవారు కాదు, ‘ఏం పలికావు? మళ్లీ పలుకు’ అని కోప్పడుతూ ఎప్పటికప్పుడు సరిదిద్దేవారు. మేము తణుకులో ఉన్నప్పుడు నన్నయ భట్టారకుని జయంతి సందర్భంగా పాఠశాల బాలికలకు పద్యపఠనం నిర్వహించారు. నేను కూడా ఓ నాలుగు పద్యాలు కంఠతా పట్టి ఆ పోటీల్లో వినిపించాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతితో ఇంటికి వస్తే మా నాన్న ఏమన్నారో తెలుసా... ‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లు, నీకు ప్రథమ బహుమతి వచ్చిందా’ అని నవ్వారు. యాదృచ్ఛికంగా మొదలైంది! మేము విజయవాడ, మాచవరంలో ఉన్నప్పుడు హిందీకాలేజ్లో ప్రవీణ, ప్రచారక్ చేస్తున్న రోజుల్లో అనుకోకుండా వచ్చింది అవకాశం. రేడియో కాంటాక్ట్ కోసం వాయిస్ టెస్ట్ చేశారు. మా లెక్చరర్ చొరవతో వాయిస్ టెస్ట్‌లో పాల్గొనడం, సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఇది 1956–57ల నాటి మాట. అలా మొదలైన నా ఆకాశవాణి ప్రయాణంలో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 1995 ఆగస్టులో రిటైరయ్యే వరకు నేను గళమిచ్చిన ప్రతి కార్యక్రమం నాకు ఒక పాఠమే. నన్ను సమగ్రంగా తయారు చేసిన యూనివర్సిటీ రేడియో. నవరసాలూ గొంతులోనే పానుగంటి వారి రచనల్లోని పాతతరం తెలుగు భాషను ఒంటపట్టించుకోవడం కొంచెం శ్రమ అనిపించేది. అంతే తప్ప మరెక్కడా ఇబ్బంది పడలేదు. బాలగంగాధర తిలక్ ‘సుప్తశిల’ నేను చాలా బాగా చేశానని నాకనిపించిన నాటిక. రంగస్థలం మీద నటించేటప్పుడు హావభావాలు ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. రేడియోలో అలా కాదు. నవరసాలనూ గొంతులోనే పలికించాలి. అంతేకాదు, శ్రోతలకు మేము కనిపించడం లేదు కదా అని ఒకే చోట కూర్చుని మాట్లాడుతూ నాటికను రికార్డు చేస్తే జీవం రాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్తున్న సన్నివేశంలో కానీ, ఒక పాత్ర ఇంటి నుంచి బయటకు వెళ్తూ ‘వెళ్లొస్తాను’ అంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మొదటి అక్షరం పలకడానికి చివరి అక్షరం పలకడానికి మధ్య మైక్‌కు దూరం వెళ్తేనే ఆ సన్నివేశం శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దర్శకులు చెప్పరు. ఎవరికి వారు సాధనలో తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం... ఉచ్చారణ ఉద్దేశం ఏమిటి? ఎదుటి వారికి తెలియాల్సిన ఒక విషయాన్ని మనం చెబుతున్నామనే కదా! పదాలను ఎక్కడ ఆపాలో, ఎక్కడ కలిపి పలకాలో స్పష్టత లేకపోతే వినేవాళ్లకు విషయం ఎలా తెలుస్తుంది? టీవీలో వార్తలు చదివే వాళ్లు ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే బావుణ్ణనిపిస్తుంటుంది. ఉత్సాహాన్నిచ్చింది ఇక నా కుటుంబ విషయానికి వస్తే... చెన్నై నుంచి వచ్చిన ఫ్లూట్ ఆర్టిస్ట్ శ్రీనివాసన్‌తో రేడియోలోనే పరిచయమైంది. పెళ్లి చేసుకున్నాం. మాకు ఒకమ్మాయి నీరద. నాటికల ద్వారా ఎన్నో జీవితాలను ఆయా పాత్రల్లో ఇమిడిపోయినంతగా చదివాను. అందుకే ఎన్నో కోణాలను అర్థం చేసుకోగలిగాను. ముందే చెప్పాను కదా... ఆకాశవాణి అనే యూనివర్సిటీలో పట్టా పొందిన విద్యార్థిని నేను. ఈ రోజు లాడ్లీ్ల వంటి సంస్థ గుర్తించడానికి కారణమూ రేడియోనే. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికీ గళం సహకరిస్తూ ఉండడం నా అదృష్టమనే చెప్పాలి’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు రేడియో ఆర్టిస్ట్, రచయిత శారదా శ్రీనివాసన్. ఆకాశవాణి... నా బడి గుడి! నాటికలు నా ప్రధాన విభాగం. అయినప్పటికీ స్పోకెన్ వర్డ్ ఆర్టిస్ట్‌గా రకరకాల స్క్రిప్టులు చదివాను. సాహిత్యం, చరిత్ర, నవలాపఠనం, వైద్య కథనాలు, మహిళలు – పిల్లల అంశాలు, కార్మికుల కార్యక్రమాలు, పిల్లల పాఠ్యాంశాలు... ఇలా అదీ ఇదీ అని పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. యువవాణి మినహా రేడియోలో అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. -
నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మీడియా అద్దం లాంటిదని, అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడు తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి హో దాలో నెల్లూరు ఎఫ్ఎంకు శంకుస్థాపన చేశామని, అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకో వడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సంచలనాలకోసం కాకుండా సత్యానికి దగ్గరగా ఉండాలన్నారు. చానళ్లలోని చర్చల్లో సభ్యత, సంస్కారంతో గౌరవప్రదమైన పదాలు వాడాలన్నారు. ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని వారికి అనువుగా ఉండేలా సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటిని ప్రోత్సహించేందుకు పత్రికలు, మీడియా మాధ్యమాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ వెంపటి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఎన్. వేణుధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊరికో సేవాలయం ఉండాలి ప్రతి ఊరిలో ఒక విద్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక దేవాలయం లాగా ఒక సేవాలయం కూడా ఉం డాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు కాలువ వద్ద ఏర్పాటు చేసిన దేవిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌ను ఆయన ప్రారంభించారు. దేవిరెడ్డి శారదమ్మ విగ్రహం వద నివాళులర్పించారు. -
కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన
వాహనాల హారన్ సౌండ్లు మార్చే యోచనలో కేంద్రం ఉందనే కథనాల నడుమ.. కీలకమైన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. కార్లకు మాత్రమే హారన్ శబ్దాలను, అదీ భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాల్ని అన్వయింజేస్తామని, చట్టబద్ధత ద్వారా దీనిని అమలు చేయబోతున్నామని వెల్లడించారు. హారన్ శబ్దాలు మార్చేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేక చట్టం అమలులోకి తేబోతున్నామని ప్రకటించారు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నిజానికి గతంలోనే ఆయన పేరు మీద ‘ప్లీజ్ ఛేంజ్ హార్న్’ కథనం వెలువడినప్పటికీ.. ఇప్పుడు నేరుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఫ్లూట్, తబలా, వయొలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియం.. ఈ లిస్ట్ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారాయన. అంతేకాదు ఆంబులెన్స్, పోలీస్ వాహనాల సైరన్లను మార్చే అంశం పరిశీలిస్తున్నామని, వాటి స్థానంలో ఆల్ ఇండియా రేడియోలో వినిపించే ఆహ్లాదకరమైన సంగీతాన్ని చేర్చే విషయమై సమీక్షిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో వినిపించే ఆ సంగీతం వినేవారికి ఆహ్లాదకరమైన కలిగిస్తుందని భావిస్తున్నట్లు గడ్కరీ అభిపప్రాయపడ్డారు. వాహనాల రోదనల వల్ల జనాలు పడే ఇబ్బందులేంటో తనకూ అనుభవమని, అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. ఆ జోన్స్ లేకపోవడమే.. నో హాంకింగ్ జోన్స్.. అంటే ఆ జోన్ ఉన్న ప్రాంతంలో వెహికల్స్ హారన్ కొట్టడానికి వీల్లేదు. నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. చాలాదేశాల్లో ఇలాంటి జోన్లు ఉన్నాయి. కానీ, మన దేశంలో ఎక్కడా అలాంటివి కనిపించవు. కేవలం ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రమే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో నో హాంకింగ్ జోన్స్‌కి బదులు.. హారన్ శబ్దాల్ని మార్చాలనే ఆలోచన చేయడం విశేషం. సడలింపు లేకుండా ఈ నిబంధనను అమలు చేస్తే.. హారన్ మార్పిడి కోసం వాహన తయారీదారీ కంపెనీలతో పాటు పాత వాహనదారులపైనా భారం పడనుంది. చదవండి: ప్రశాంతంగా యోగా కూడా చేసుకోనివ్వలేదు!: గడ్కరీ -
మోదీ ‘మనసులో మాట’కు కోట్లకు కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే నరేంద్ర మోదీ ఆదరణ కోల్పోతున్న ఆలిండియా రేడియో, దూరదర్శన్పై దృష్టి సారించారు. మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గట్టు అభివృద్ధి చెందని ఆలిండియా రేడియో, దూరదర్శన్పై మోదీ తీసుకున్న నిర్ణయంతో పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు మన దేశ రేడియో, దూరదర్శన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రధానమంత్రి ‘మనసులో మాట (మన్ కీ బాత్)’ కార్యక్రమంతో కోట్లు వస్తున్నాయి. మూసివేతకు గురవుతుందని భావించిన ఆయా సంస్థలు ఇప్పుడు లాభాల బాట పట్టింది కూడా. 2014లో ‘మనసులో మాట (మన్ కీ బాత్)’ అనే కార్యక్రమాన్ని ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసుకు నచ్చిన అంశంపై మాట్లాడుతారు. అలా ఇప్పటివరకు 78 ఎపిసోడ్లు ప్రధాని మన్ కీ బాత్ చేశారు. ఈ కార్యక్రమంతో ఇప్పటివరకు రూ.30.80 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఏ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందో వివరంగా సభకు తెలిపింది. సంవత్సరం ఆదాయం 2014-15 రూ.1.6 కోట్లు 2015-16 రూ.2.81 కోట్లు 2016-17 రూ.5.14 కోట్లు 2017-18 రూ.10.64 కోట్లు 2018-19 రూ.7.47 కోట్లు 2019-20 రూ.2.56 కోట్లు 2020-21 రూ.1.02 కోట్లు ఈ మన్ కీ బాత్ ఆలిండియా రేడియోలోనే అంత్యత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ప్రధానమంత్రి ప్రసంగంతో దూరదర్శన్ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని గణాంకాలతో సహా వివరించింది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్ (బార్క్) వివరాల ప్రకారం.. 6 కోట్ల నుంచి ఏకంగా 14.35 కోట్ల మంది వీక్షకులు పెరిగారని వెల్లడించింది. మారుమూల గ్రామాలకు సైతం ప్రధాని ప్రసంగం చేరిందని పేర్కొంది. అయితే ఈ ‘మనసులో మాట’ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించారు. తాను ఏ అంశంపై మాట్లాడాలో చెప్పాలని అప్పుడప్పుడు ప్రజలను అడుగుతుంటారు. ఈ కార్యక్రమంతో ప్రసార భారతి (ఆలిండియో రేడియో), దూరదర్శన్‌కు పూర్వ వైభవం వచ్చింది. ఆలిండియో రేడియోను దేశ రేడియోగా, దూరదర్శన్ను మన దేశ టీవీగా పేర్కొంటారు. మన దేశ అధికారిక ప్రసార మాధ్యమాలు ఆ రెండూ అనే విషయం అందరికీ తెలిసిందే. -
ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తామని, ప్రజల రోజువారీ జీవనంలో భాగమయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని ఆల్ ఇండియా రేడియో నూతన డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైద్యం, ఆరోగ్యం సహా అన్ని రంగాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడం తమ ప్రధాన కర్తవ్యమని వివరించారు. ఆరోగ్యకరమైన వినోదానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని తెలిపారు. స్థానిక, గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు రూపొందిస్తామని వివరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు స్టేషన్ స్థాయిలో వక్తృత్వ, సంగీత తదితర పోటీలు నిర్వహించడం ద్వారా రేడియోను పాఠశాలల స్థాయి వరకు చేరువ చేస్తామని వేణుధర్‌రెడ్డి వివరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఆయన తాజాగా డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎరిజెర్ల గ్రామానికి చెందిన వేణుధర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) 1988 బ్యాచ్ అధికారి. 1990–2000 కాలంలో అకాశవాణి, దూరదర్శన్‌లో న్యూస్ ఎడిటర్‌గా పనిచేసిన ఆయన 2009–17 మధ్య సమాచార ప్రసార శాఖలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా, 2017–21 మధ్య కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. -
సంగీత దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత
కరోనా మహమ్మారి మరణాలు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆల్ ఇండియా రేడియో సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కోవిడ్‌తో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ 1990లో ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరారు. అల్లు రామలింగయ్య నటించిన ‘బంట్రోతు భార్య’ సినిమాతో నేపథ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా చేశారు. ఆ తర్వాత రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ ద్వారా సంగీత దర్శకుడు అయ్యారు. ‘బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్–హిందీ )’ ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు చంద్రశేఖర్. ఆ తర్వాత విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. తిరుపతిలో చంద్రశేఖర్ ప్రదర్శన చూసి ముగ్దులైన ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల తన హార్మోనియాన్ని ఆయనకు బహూకరించారట. కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీత దర్శకులు చంద్రశేఖర్ వద్ద శిష్యరికం చేశారు. చంద్రశేఖర్‌కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
న్యూస్ రీడర్ ఏడిద ఇకలేరు
సాక్షి,హైదరాబాద్ : ‘ఆకాశవాణి..వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు..’అంటూ ఢిల్లీ కేంద్రంగా మూడు దశాబ్దాలుగా గంభీరస్వరంతో అనేక జాతీయ,అంతర్జాతీయ వార్తలు వినిపించిన రేడియా న్యూస్ రీడర్ ఏడిద గోపాలరావు(83) గురువారం బోరబండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ కేంద్రంగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన రంగస్థలంపై కూడా తనదైన ముద్రవేసి రంగస్థల గాంధీగా పేరు సంపాదించారు. 1995లో పదవీ విరమణ చేసిన అనంతరం ఆయన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు వారధిగా నిలిచారు. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు సోదరుడు. కాగా, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో గోపాలరావు అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడు శ్యామ్ రాజా చితికి నిప్పంటించారు. సీఎం కేసీఆర్ సంతాపం ఏడిద గోపాలరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చద వడం ద్వారానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతులు సంపాదించారని సీఎం గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపాల రావు మృతిపై దూరదర్శన్, ఆకాశవాణి ప్రోగ్రాం సిబ్బంది సంతాపాన్ని తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం అమరావతి : ఏడిద గోపాలరావు మృతికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న గోపాలరావు.. వివిధ సాంస్కృతిక, కళా సంఘాలతో అనుబంధం కొనసాగించారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. రచయిత్రి శాంతసుందరి కన్నుమూత హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు ఆర్.శాంతసుందరి(74) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దికాలంగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న శాంతసుందరి రెండు నెలల క్రితం కోమాలోకి వెళ్లిపోయారు. ఈమె ప్రముఖ రచయిత కొడవగంటి కుటుంబరావు కుమార్తె. హిందీ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీలోకి అనేక పుస్తకాలను అనువదించారు. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో తల్లి వరూధిని, భర్త గణేశ్వరరావు, కూతుళ్లతో పాటు బంధుమిత్రుల సమక్షంలో గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
పార్వతీ ప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ఆకాశవాణి న్యూస్ రీడర్ పింగళి పార్వతీ ప్రసాద్(70) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆమె సేవలు నిరుపమానమని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కాగా, కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతీ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆకాశవాణి కేంద్రంలో వార్తలు చదవడంలో ఆమెకి పెట్టిందిపేరు. వినసొంపైన కంఠస్వరంతో ప్రతి అక్షరమూ శ్రోతలకు స్పష్టంగా వినబడాలని తపించే పింగళి పార్వతీ ప్రసాద్ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్మాణంతో ప్రారంభించి వార్తా విభాగంలో సీనియర్ న్యూస్ రీడర్ గా దాదాపు 35 ఏళ్లపాటు సేవలు అందించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు అడిగే ప్రశ్నలకు ఎంతో హుందాగా చిరునవ్వు తో సమాధానం చెప్పేవారు. వార్తా ప్రపంచం మీదే, భవిష్యత్ తరాలు మీరే అంటూ జూనియర్స్‌ను ప్రోత్సహించే వారు. ఆమె దగ్గరికి వచ్చిన వారికి వార్తా పఠనంలోని మెళకువలను వివరించేవారు. -
మాడపాటి సత్యవతి మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: రేడియోలో వార్తలు చదువుతూ శ్రోతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాడపాటి సత్యవతి(80) కన్నుమూశారు. తన సుస్వరంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం తిరుమల్గిరి శ్మశాన వాటికలో మాడపాటి సత్యవతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తన గాత్రంతో న్యూస్ రీడర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యవతి 2017లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ మహిళ పురస్కారం అందుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం మాడపాటి సత్యవతి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి మహిళా న్యూస్ రీడర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన సత్యవతికి విజయవాడతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. సత్యవతి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
నాదస్వర విద్వాన్ నాగూర్ కన్నుమూత
అద్దంకి: నాదస్వర విద్వాన్ నాగూర్ సాహెబ్ (90 ) గురువారం అద్దంకిలోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కశ్యాపురం గ్రామానికి చెందిన నాగూర్ సాహెబ్ తండ్రి ఖాశీం సాహెబ్ పేరు మోసిన నాదస్వర విద్వాంసులు. తల్లి హుస్సేన్భీ. 1930వ సంవత్సరంలో నాగూర్ సాహెబ్ జన్మించారు. ఆయన సోదరుడు దస్తగిరి సైతం నాదస్వర విద్వాంసులు. అద్దంకి ప్రాంతంలో ఇద్దరూ నాదస్వర ద్వయంగా పేరు గాంచారు. తొలి గురువు అయిన తండ్రి వద్దే సంగీతంలో ప్రాథమిక విద్యను నేర్చుకున్నారు. తరువాత మేనమామ నాగులుప్పలపాడు మండల గొనసపూడికి చెందిన మస్తాన్ సాహెబ్ దగ్గర ఉన్నత విద్యను నేర్చుకున్నారు. తమిళనాడులోని తంజావూరు గ్రామానికి చెందిన దొరై కణ్ణన్∙ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో 1965 నుంచి 2000 సంవత్సరం వరకు నాదస్వర కచేరీలు చేశారు. అక్కడ బీ హైగ్రేడు, ఏ గ్రేడు కళాకారునిగా గుర్తింపు పొందారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రముఖ నాదస్వర విద్వాంసుడు పద్మశ్రీ షేక్ చినమౌలానా స్మారక అవార్డును, నాదస్వర విద్వాన్, నాద కోవిద బిరుదులను అందుకున్నారు. ఈయన శిష్యుడు ప్రముఖ నాదస్వర విద్వాంసుడు చినమౌలానా మనవడు బాబుల్ మధురైలో గొప్ప విద్వాంసుడుగా పేరు పొందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సంగీత దర్శకుడు కె.విశ్వనాథ్‌చే నాదస్వర మణిరత్న బిరుదును పొందారు. సుమారు 5వేల మందికిపైగా ఔత్సాహిక కళాకారులకు హర్మోనియం, నాదస్వరం, ప్లూట్, క్లారినట్ వంటి ఎన్నో వాయిద్యాలను నేర్పారు. నాగూర్‌సాహెబ్‌కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఒక కుమారుడు ఎస్కే షాజహాన్ గూడూరులో ఎక్సైజ్ ఇన్చార్జ్ సీఐగా పనిచేస్తున్నారు. మరో కుమారుడు తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నాదస్వర కళాకారుడయ్యాడు. రెండున్నరేళ్లుగా అనారోగ్య కారణంగా వాయిద్యానికి దూరంగా ఉంటూ గురువారం తన స్వగృహంలో తదిశ్వాస విడిచారు. గాత్ర వాయిద్య కళాకారుల సంఘ నాయకుడు శేషగిరిరావు, కోలాటం కళాకారుడు జాన్ సాహెబ్, రంగస్థల కళాకారుడు అద్దంకి నాగేశ్వరరావు, కోటేశ్వరమ్మతోపాటు మరి కొందరు కళాకారులు, నూర్ భాషా సంఘ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. -
ఆకాశవాణి రేలారే..!
హరన్సింఘా...దట్టమైన అడవి, కొండ, గుట్టలతో కూడిన జార్ణండ్ గ్రామం. ఒకప్పుడు నక్సలైట్లకు పెట్టనికోటగా నిలిచిన ప్రదేశం. ఈ ప్రాంతంలోనే వందల ఏళ్లుగా నివసిస్తున్న సంతాల్ గిరిజనతెగకు చెందిన వారిప్పుడు కొందరు ప్రత్యేక అతిథులకు సాదర స్వాగతం పలికారు. వారుమరెవరో కాదు.. గిరిజన భాష, జానపదసంగీతం మిణుకు మిణుకు మంటూ ఆరిపోకముందే వాటిని రికార్డ్ చేసేందుకు వచ్చిన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)కు చెందిన నిపుణులు. జానపద సంగీతం, సాహిత్యం కొడిగట్టకుండా, క్రమక్రమంగా అంతరించిపోయే ప్రమాదమున్న సంతాలీ సంగీతాన్ని నిక్షిప్తం చేసేందుకు వారంతా కూడా భాగల్పూర్, బీహార్ల మీదుగా ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు... కశ్మీర్ మొదలుకుని ఈశాన్యరాష్ట్రాలు... అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల వరకు నిత్యం ఘర్షణలు తలెత్తుతున్న కల్లోల ప్రాంతాల్లోని గిరిజనతెగల జానపద సంగీతాన్ని రికార్డ్ చేసే (ఆడియో, వీడియో) గురుతర బాధ్యతను ఏఐఆర్ స్వీకరించింది. 2014లో ఏఐఆర్ దేశవ్యాప్తంగా ఉన్న జానపద, గిరిజన సంగీతాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. మొత్తం ఆరువేల వరకున్న గిరిజన కులాలు, తెగలు 16,500 భాషలు మాట్లాడుతున్నాయి. వాటిలోని 9 లక్షల పాటలను నిక్షిప్తం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటివరకు 20 వేల గీతాలు రికార్ట్చేసింది. దేశంలోని 214 ఏఐఆర్ కేంద్రాల్లోని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌ల సొంత చోరవతోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని కోసం ప్రత్యేక బడ్జెట్ లేదా వనరులేమి కేటాయించలేదు. ఈ అఖిల భారతస్థాయి ప్రాజెక్టును ఢిల్లీలోని త్రిసభ్యబృందం పర్యవేక్షిస్తోంది. ఏఐఆర్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా రిటైరైన సోమ్ దత్ శర్మ 1980లలో మొదటి పోస్టింగ్ రాంఛీలో పనిచేస్తునపుడు వివిధ గిరిజన తెగల భాషలు, సంగీతాన్ని రికార్డ్ చేశారు. అప్పుడే ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఇప్పుడు ఆయనే ‘ఆకాశవాణి లోక్ సంపద సంరక్షణ్ మహాపరియోజన’ పేరిట ఈ ప్రాజెక్టు సమన్వయం చేస్తున్నారు. ప్రస్తుత ఏఐఆర్ డైరెక్టర్జనరల్ శశి శేఖర్ వెంపటి తీసుకున్న చోరవతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. సేకరణ ఎలా...? 1) కుటుంబ జీవనానికి సంబంధించిన ఆచారాలు 2) పర్వతాలు,నదులు, యుద్ధం, పనులకు సంబంధించిన ఇతర పాటలు 3) సంచార తెగల గీతాలు 4) ఇతర దేశాలకు వలస వెళ్లిన భారతీయ పాటలుగా విడదీసి వీటిని సేకరిస్తున్నారు మొత్తం ఈ పాటలను 24 కేటగిరిలుగా వర్గీకరించారు.కఠినమైన ప్రామాణీకరణ ప్రక్రియ తర్వాతే ముగ్గురు సభ్యుల బృందం ఈ గీతాలు సర్టిఫై చేస్తుంది.. ఆ తర్వాత వీటిని సాంస్కృతిక నిపుణులు, ప్రొఫెసర్లు, మానవపరిణామ శాస్త్రవేత్తలతో కూడిన ప్యానెల్ సమీక్షిస్తుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించకుండానే ప్రధానంగా ఎంపీ3 ఫైల్స్‌లో ఈ పాటలను ఏఐఆర్ భద్రపరుస్తోంది. దీనిని ఎప్పుడైనా, ఎలాంటి టెక్నాలజీలోకైనా డిజిటలైజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు లక్ష్యం ఈ గీతాలను ఏఐఆర్ ద్వారా ప్రసారం చేసేందుకు కాకుండా పరిశోధన, డాక్యుమెంటేషన్ కోసం భద్రపరచడం వరకే. సంగీత ‘సేకరణ’ సాగిందిలా..! స్థానికంగా ఉన్న ఆకాశవాణి సిబ్బంది , ఆయా గిరిజన తెగలకు చెందిన ప్రముఖులు, సంగీతకారులు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్వచ్ఛందసేవాసంస్థల ప్రతినిధులు, అందుబాటులో ఉన్న గిరిజన సాహిత్యం తదితర రూపాల ద్వారా మౌలిక సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సంగీత, వాయిద్యకారులు, గాయకుల వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేస్తారు. ఆడియో రికార్డులతో పాటు అన్ని పాటలను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఈ గీతాలను హిందీ,ఇంగ్లిష్‌లోకి అనువదిస్తారు. 2014లో హర్యానా, కశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలకు చెందిన సంగీతకారులు, బృందాలను షిల్లాంగ్‌కు రప్పించి వర్క్‌షాపును నిర్వహించారు. ఇందులోనే ఏఐఆర్ బృందం తొలుత సంగీతాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రసార భారతిని ఎంపీలే మరిచిపోయారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశవాణి, దూరదర్శన్‌లను నిర్వహిస్తున్న ప్రసార భారతి చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ ఏ. సూర్య ప్రకాష్ ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’కు చెందిన వారు. ఫౌండేషన్ నిర్వాహకులకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెల్సిందే. సహజంగానే తనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సైద్ధాంతిక అనుబంధం ఉంటుందని కూడా సూర్య ప్రకాష్ ఇటీవల ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పరిధిలోకి వస్తోంది. ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి ఇరానీకి అధికార దర్పం కాస్త ఎక్కువే. వీరిరువురి గురించి తెలిసిన ఎవరికైనా ప్రసార భారతికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంటుందో, అది ఎంత తటస్థంగా వ్యవహరిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాష్‌కు, స్మృతి ఇరానీలకు ఈ మధ్య బొత్తిగా పడటం లేదు. విధానపరంగా ఎంతమాత్రం కాదు. ప్రసార భారతి బోర్డు నియామకాల విషయంలో గొడవ. బోర్డులో ఖాళీగా ఉన్న ఓ ఐఏఎస్, ఇద్దరు సీనియర్ పాత్రికేయులను నియమించాలని స్మృతి ఇరానీ సిఫార్సు చేయగా, ఆ సిఫార్సులను సూర్య ప్రకాష్ చెత్తబుట్టలో పడేశారు. ఆ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతున్నారు. ఆ పోస్టుల్లోని సీనియర్ పాత్రికేయులు చూసుకోవాల్సిన అసైన్మెంట్ను 2.9 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీంతో కోపం వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసార భారత సిబ్బందికి జనవరి, ఫిబ్రవరి నెలలకు జీతాలుగా ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ సూర్య ప్రకాష్ లొంగకుండా ఆపద్ధర్మ నిధి నుంచి సిబ్బందికి రెండు నెలల జీతాలను చెల్లించారు. ప్రసార భారతి (బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చట్టం కింద 1977లో స్వయం ప్రతిపత్తిని కల్పించారు. దానికి ఎంత స్వయం ప్రతిపత్తి ఎంతుందో మనందరికి తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేరళ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి తిరస్కరించిన విషయమూ తెల్సిందే. ప్రైవేటు టీవీ చానళ్లు వెల్లువెత్తుతున్న నేటి రోజుల్లో పబ్లిక్ బ్రాడ్ క్యాస్టింగ్ సర్వీసు ఎంతైనా అవసరం. అయితే ఈ పబ్లిక్ సర్వీసు కాస్త స్టేట్ సర్వీసుగా మారిపోయి ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రభుత్వానికి బాకాలుగా మారిపోయాయి. ప్రసార భారతి చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం 22 మంది పార్లమెంట్ సభ్యుల కమిటీ ఆకాశవాణి, దూరదర్శన్ల కార్యకలాపాలను చూసుకోవాల్సి ఉంది. చట్టం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఒక్క ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్ కమిటీ కోసం డిమాండ్ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ టీవీ ఎంపీల కమిటీ ఆధ్యర్యంలో నడుస్తోంది. దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌గా ఉన్నారు. అలాంటప్పుడైనా ప్రసార భారతీ కమిటీ గురించి గుర్తుకు రావాలి. ప్రసార భారతి చైర్మన్, మంత్రి స్మతి ఇరానీ గొడవ పడుతున్న ఈ సమయంలోనైనా పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం మంచిది. -
ఆకాశవాణి తెలుగు పలికిన వేళ..!
ఒక్క తెలుగు ప్రాంతమే కాదు, దేశం యావత్తూ సమాజానికి దోహదపడే ఆలోచనలతో ప్రాణాలకు తెగించి పోరాడాలని సిద్ధమవుతున్న రోజులవి. స్వార్థం చంపుకోవాలనే త్యాగకాంక్ష బలపడుతుండగా మద్యపాన నిషేధం, అక్షరాస్యత, మూఢ నమ్మకాల నిర్మూలన, గ్రంథాలయోద్యమం, కుటీర పరిశ్రమలు, ఖాదీ, స్త్రీ జనోద్ధరణ వంటివి జన బాహుళ్యంలోకి వెళుతున్నాయి. ఈ ఉద్యమాలు విడివిడిగా, కలివిడిగా ఆవేశాన్నీ, ఆక్రోశాన్నీ పంచుతున్నాయి, పెంచుతున్నాయి. 1938 జూన్ 16న మద్రాసులో తెలుగు ప్రసారాలు మొదలైన సందర్భపు నేపథ్యం ఇది. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా జర్నలిజం విశ్వవ్యాప్తం కావడం మొదలైంది. 1914లోనే ఆంధ్రపత్రిక బొంబాయి నుంచి మద్రాసు తరలివచ్చి వారపత్రిక దిన పత్రికగా మారింది. ఎం.ఏ. చదివిన రెండవ తెలుగు వ్యక్తి, అనేక ఉద్యమాల భాగస్వామి, రచయిత గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు. కట్టమంచి రామలింగారెడ్డి తొలి ఆధునిక సాహిత్య విమర్శ ‘కవిత్వతత్వ విచారం’ వెలువడింది 1914 లోనే. కృష్ణా పత్రిక, శ్రీ సాధన వంటి ప్రధాన పత్రికలతోపాటు ఎన్నో ఇతర పత్రికలూ; 1924లో మొదలైన భారతి వెలుగులు చిమ్మడం ప్రత్యేకత. తెలుగు వచనాన్ని శక్తిమంతంగా రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథల సంపుటం 1915లో వెలువడింది. వేమనను యోగవాదిగా, ప్రయోజనశీలిగా పరిచయం చేస్తూ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేసిన ప్రసంగాలు అప్పట్లో సంచలనం రేపుతున్నాయి. సమాజంపై రచనల ద్వారా ఈటెలు విసిరిన చలం ‘మాలపిల్ల’ సినిమా రచనలో భాగస్వామి అయిన సందర్భం కూడా ఇదే. గిడుగు రామమూర్తి వ్యవహారిక తెలుగు ఉద్యమం ఫలితంగా, పరివర్తన చెందిన తాపీ ధర్మారావు కొత్తపాళీతో వ్యవహారిక భాషకు పత్రికల ద్వారా, సినిమా ద్వారా కాగడా పట్టారు. సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రచురించిన గిడుగు రామమూర్తి వ్యాసం కారణంగా గూడవల్లి రామబ్రహ్మం ప్రజామిత్ర మాసపత్రిక వాడుక భాషలోకి 1934లో మారింది. 1938లో మొదలైన ‘ఆంధ్రప్రభ’కు తొలుత ఖాసా సుబ్బారావు సంపాదకుడైనా, వ్యవహారిక భాషలో చక్కని కాలమ్ రాసిన న్యాపతి నారాయణమూర్తి కొద్దికాలంలోనే బాధ్యతలు తీసుకున్నారు. కనుక వస్తుపరంగానే కాదు వ్యక్తీకరణపరంగా కూడా చాలా అర్థవంతమైన నేపథ్యం ఉన్న సమయంలో ఆకాశవాణి తెలుగు పలికింది. తెలుగు పత్రికలు, తెలుగు సినిమా, తర్వాతి కాలంలో తెలుగు టెలివిజన్ కూడా మొదలైన మద్రాసులోనే తెలుగు ఆకాశవాణి మొదలు కావడం ఔచిత్యమే. మద్రాసు రేడియో క్లబ్ 1924లో ప్రసారాలు ప్రారంభిం చింది. అయితే మూడేళ్లకు మించి సాగలేదు. మళ్లీ 1930లో మద్రాసు పురపాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించినా పరిమితంగానే ఉండేవి. 1933లో తపాలా శాఖ ఉద్యోగి మహబూబ్ అలీ హైదరాబాద్‌లో చిన్న రేడియో కేంద్రం మొదలుపెట్టాడు. దీన్ని 1935లో నిజాం వశం చేసుకున్నాడు. నాలుగు భాషలలో సాగిన నిజాం రేడియోలో రాయప్రోలు రాజశేఖర్, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గాచలం, కురుగంటి సీతారామయ్య, మహా రథి వంటి వారు పని చేశారు. నిజాం రేడియో 1950 ఏప్రిల్ 1న ఆకాశవాణి హైదరాబాద్‌గా మారింది. 1935 సెప్టెంబరులో మైసూరులోనూ, 1937 సెప్టెంబరులో తిరువాన్కూరు సంస్థానంలోనూ రేడియో కేంద్రాలు వచ్చాయి. అంటే మద్రాసు ఆకాశవాణి నాలుగు భాషలతో ప్రసారాలు ప్రారంభించే సమయానికి హైదరాబాద్, మైసూరు, తిరువాన్కూరు సంస్థానాలలో మాత్రమే రేడియో కేంద్రాలున్నాయి. దేశంలో తొలిసారిగా 1921లో బొంబాయిలో స్వల్ప స్థాయిలో రేడియో ప్రసారాలు మొదలై 1927 జూలై 23కు ఒక గాడిన పడ్డాయి. కలకత్తా, మద్రాసు, హైదరాబాద్, బరోడా, మైసూరు వంటి చోట్ల వ్యాప్తి చెందాయి. 1936లో ఆలిండియా రేడియోగా నామకరణం జరిగింది. అదే సంవత్సరంలో రేడియో పత్రిక కూడా ఒక స్థిర రూపానికి వచ్చింది. ఈ పరిపక్వత మద్రాసు తెలుగు ఆకాశవాణి ప్రసారాలలో ద్యోతకమైంది. సాహితీవేత్త అచంట జానకీరామ్, న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అయ్యగారి వీరభద్రరావు వంటి వారు తొలి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్స్. మల్లంపల్లి సోమశేఖర శర్మ తమ్ముడు ఉమామహేశ్వరరావు తొలి తెలుగు అనౌన్సర్ కాగా, గాయని విశ్వేశ్వరమ్మ చెల్లెలు భానుమతి మలి తెలుగు అనౌన్సర్. చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభ ప్రసంగం చేయగా; గాత్ర కచేరి తర్వాత సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు రేడియో గురించి మాట్లాడారు. గిడుగు రామమూర్తి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, అడవి బాపిరాజు వంటి వారు తొలి ప్రసంగాలు చేసినవారు. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ తొలి రేడియో నాటకం. సాహిత్య కార్యక్రమాలే కాక విద్యార్థులకు, గ్రామస్తులకు, వ్యవసాయదారులకు, సంగీతాభిలాషులకు తగిన రీతిలో తొలి దశలోనే ప్రయత్నాలు జరగడం విశేషం. తెలుగు ప్రసారాల నేపథ్యం ఎంత ఉజ్వలంగా ఉందో, తర్వాత గమనం కూడా అంతే గొప్పగా కనబడుతుంది. (భాషా సాహిత్యాలకు ఆకాశవాణి చేసిన సేవ గురించి సాహిత్య అకాడమీ ఆగస్టు 28, 29 తేదీలలో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా) డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సంచాలకులు, ఆకాశవాణి, తిరుపతి ‘ మొబైల్ : 94407 32392 -
త్రిపుర సీఎం ప్రసంగానికి దూరదర్శన్ నో!
అగర్తలా: దూరదర్శన్, ఆలిండియా రేడియో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి నిరాకరించాయని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. ప్రసంగ పాఠంలో మార్పులు చేస్తేనే ప్రసారం చేస్తామని అవి చెప్పటం అప్రజాస్వామిక, నిరంకుశ, అసహన చర్య అని అభివర్ణించారు. త్రిపుర ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ప్రకటన ప్రకారం...డీడీ, ఆకాశవాణి ఆగస్టు 12నే సర్కార్ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. అయితే అందులో మార్పులు చేస్తేనే ప్రసారం చేస్తామంటూ సోమవారం సీఎం కార్యాలయానికి లేఖ వచ్చింది.‘సీఎం ప్రసంగాన్ని అధికారులు పరిశీలించారు. ప్రస్తుత రూపంలో దాన్ని ప్రసారం చేయలేం. ప్రజల సెంటిమెంట్లు, సందర్భోచితంగా సీఎం తన సందేశంలో మార్పులు చేస్తే మంచిది’ అని పేర్కొన్నారు. అయితే తన ప్రసం గంలో అక్షరం కూడా మార్చడానికి సీఎం ఒప్పుకోలేదని ఆయన కార్యాలయం చెప్పింది. -
హీరోయిన్‌పై వేటుకు సిద్ధం?
హీరోయిన్ కాజోల్ మీద వేటు వేసేందుకు ప్రసారభారతి సిద్ధం అవుతోంది. సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆమెను తప్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉంది. దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో కూడిన ప్రసారభారతి ఒక స్వతంత్ర సంస్థ. ఇది సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. 2016 ఫిబ్రవరి నెలలో కాజోల్‌ను ఈ బోర్డులో పార్ట్ టైం సభ్యురాలిగా నియమించారు. అయితే గత నాలుగు సమావేశాల నుంచి ఆమె అసలు హాజరు కావడం లేదు. దాంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌కు చెప్పకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వాళ్ల సభ్యత్వాన్ని రద్దుచేయచ్చని ప్రసారభారతి నిబంధనలు చెబుతున్నాయి. ముందుగానే ఉన్న వృత్తిపరమైన కమిట్మెంట్ల వల్లే గత మూడు నాలుగు సమావేశాలకు కాజోల్ హాజరు కాలేదని ఆమె ప్రతినిధి జైవీర్ అన్నారు. అంతేకాక ఈ సంవత్సరంలో చాలాకాలం పాటు కుటుంబపరమైన వైద్య కారణాలు కూడా అందుకు ఉన్నాయన్నారు. గత కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయినందుకు ఆమె కూడా చాలా బాధపడ్డారని తెలిపారు. కానీ బోర్డులోని పలువురు సభ్యులు మాత్రం గత సమావేశంలోనే ఆమె రాకపోవడాన్ని ప్రస్తావించి, కాజోల్‌ను తొలగించాలని అన్నారు. ముందుగా ఆమెకు ఒక నోటీసు పంపుతామని, ఆ తర్వాత ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సమావేశాలకు వచ్చేందుకు సభ్యులకు విమాన చార్జీలు, హోటల్ చార్జీలు, ఇతర అలవెన్సులు ఇస్తారు. -
మహిళా న్యూస్‌రీడర్ మంగమ్మ కన్నుమూత
మదనపల్లె: ఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్, రచయిత, విద్యావేత్త డాక్టర్ జోలెపాళెం మంగమ్మ (92) బుధవారం అనారోగ్యంతో చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రెడ్డీస్‌కాలనీలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. స్థానిక అమ్మినేని వీధికి చెందిన సుబ్బన్న, లక్ష్మమ్మ దంపతులకు మంగమ్మ జన్మించారు. స్థానిక బి.టి.కళాశాలలో డిగ్రీ వరకు చదివారు. ఢిల్లీలో ఉన్నత చదువులు అభ్యసించారు. అనంతరం ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా చేరారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్‌రీడర్‌గా పదేళ్లపాటు పని చేశారు. అనంతరం బి.టి.కళాశాల పాలకవర్గ సభ్యురాలిగా, రుషీవ్యాలీ పాఠశాలలో పరీక్షల విభాగంలో పని చేశారు. మంగమ్మ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనేక గ్రంథాలు రాశారు. దీంతోపాటు ఆమెకు ఫ్రెంచ్, తమిళం, హిందీ, కన్నడం భాషల్లోనూ ప్రవేశం ఉంది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి 2002లో ఉగాది పురస్కారం, 2002లో కుప్పం రెడ్డెమ్మ సాహితీపురస్కారం, సిద్ధార్థ కళాపీఠం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. మంగమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. -
జాతీయ గీతం ఎలా పుట్టింది?
న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయహే’ వెనక మనకు గుర్తులేని చరిత్ర ఎంతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించేందుకు పార్లమెంట్‌కు ఎంతో కాలం పట్టలేదు. కానీ జాతీయ గీతాన్ని ఎంపిక చేసుకోవడానికే దాదాపు మూడేళ్లు పట్టింది. తొలుత స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించాలనే డిమాండ్ వచ్చింది. జాతీయ కాంగ్రెస్ ప్రతి సదస్సులో వందేమాతరం గీతాన్నే ఆలాపించేవారు. మొహమ్మద్ జిన్నా లాంటి ముస్లిం నాయకులు, ఆయన అనుచరులు కూడా గౌరవపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ తర్వాత ఛాందసవాద ముస్లిం నాయకులు తమ మత విశ్వాసాలకు ఆ గీతం వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అప్పుడు వారి మనోభావాలను గౌరవించి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వా 1950, జనవరి 26వ తేదీన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పుడు పార్లమెంట్లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘జన గణ మన అధినాయక జయహే’ను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాటలకు సమాన హోదాను కల్పిస్తూ ఒక్కొక్కటి కచ్చితంగా 60 సెకండ్లు ఉండాలని కూడా పార్లమెంట్ నిర్ణయించింది. ఆకాశవాణి ద్వారానే ప్రచారం ఈ రెండు గీతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం 60 సెకండ్లకు మించకుండా గాత్రంతో ఒకటి, కేవలం సంగీత వాయిద్యాలతో ఒక్కటి చొప్పున అంతర్జాతీయ గీతాల బాణీలను పరిగణలోకి తీసుకొని బాణికట్టి పాడించే బాధ్యతని ఆలిండియా రేడియో (ఆకాశవాణికి)కు అప్పగించారు. గాత్ర గీతాలను పండిట్ దినకర్ కైకిని, సుమతి ముతాత్కర్తో పాడించారు. మ్యూజిక్ వర్షన్ కూడా కంపోజ్ చేశారు. వాయిద్యాల వర్షన్‌ను ప్రత్యేకంగా సైనిక బ్యాండ్‌కే పరిమితం చేయాలని కూడా పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ రెండు వర్షన్లను పార్లమెంట్ కమిటీ, గ్రాఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు ఆమోదించాయి. రెండు పాటల రెండు వర్షన్లను వెయ్యేసి రికార్డుల చొప్పున కాపీ చేయించాలని నిర్ణయించారు. రికార్డుకు ఓ పక్కన వందేమాతరం గాత్రాన్ని, మరోపక్క వాయిద్య గీతాన్ని, అలాగే మరో రికార్డుకు ఓ పక్క జన గన మనను, మరో పక్క మ్యూజిక్ వర్షన్ రికార్డు చేయించారు. ఆ రికార్డులను దేశంలో 800 రేడియో స్టేషన్లకు పంపించారు. ప్రతి రోజు ఆకాశవాణి ప్రాథ:కాళ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందు వందేమాతరం గేయాన్ని ప్రసారం చేయాలని నిర్ణయించారు. 1955 నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయాన్ని ఆకాశవాణి పాటిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జన గణ మన గీతాన్ని వినిపించాలని నిర్ణయించారు. అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఇదే క్రమంలో దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేత తరగతులు ప్రారంభానికి ముందు వందేమాతరంను, తరగతులు ముగిశాక జన గన మనను పాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎంపీలకు ప్రాక్టీస్ ఆరోజుల్లో జాతీయ గీతం 60 సెకండ్లు ఉండాలంటే ఎక్కువ, తక్కువ కాకుండా కచ్చితంగా 60 సెకండ్లే ఆలాపించేవారు. అప్పట్లో ఎంపీలందరికీ జాతీయ గీతం వచ్చేది. అయితే 60 సెకండ్ల కచ్చితత్వం కోసం గాయకురాలు సుమతి ముతాత్కర్ ప్రతి శుక్రవారం పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీలకు పాడడంలో శిక్షణ ఇచ్చేవారు. (సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో) -
రణబీర్ కాదు... రచ్చబండ!
‘బ్రదరూ! రణబీర్ కపూర్‌తో జర జాగ్రత్త’. బాలీవుడ్ పార్టీల్లో ఇప్పుడిదే కొత్త స్లోగన్ అట. రణబీర్‌కి ఏదైనా సీక్రెట్ చెప్పాలంటే హిందీ సినిమా జనాలు భయపడుతున్నారు. అంతే కాదండోయ్... అతడికి ‘ఆలిండియా రేడియో’ అని ఓ ముద్దు పేరు కూడా పెట్టారు. రణబీర్‌కి ఏదైనా సీక్రెట్ చెబితే రేడియోలో చెప్పినట్టేనట. దాంతో మేటర్ రచ్చబండకు ఎక్కినట్టే అంటున్నారు. బాలీవుడ్లో కొందరు రణబీర్‌కి సీక్రెట్ చెప్పడం.. చివరకు, అది అందరికీ తెలియడంతో చిరాకు పడ్డారట. రణబీర్ మాత్రం ఈ ప్రపంచంలో సీక్రెట్ అనేది లేదంటున్నారు. ఈ రొమాంటిక్ హీరో చెప్పిన వివరణ ఏంటో తెలుసా? ‘‘ఈ ప్రపంచంలో సీక్రెట్ అనేది ఏదీ లేదు. ప్రతి ఒక్కరికీ ఓ స్నేహితుడు ఉంటాడు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఆ స్నేహితుడు ఎవరికీ చెప్పడనే నమ్మకం ఉంటుంది. ఆ స్నేహితుడికీ ఓ స్నేహితుడు ఉంటాడు.. అతను కూడా అంతే. ఆ విధంగా సీక్రెట్ అనేది ప్రపంచం మొత్తం చక్కర్లు కొడుతుంది. ఇక, సీక్రెట్ అనేదానికి అర్థం ఎక్కడుంది? నాతో ఎవరైనా సీక్రెట్ చెబితే... నా ఆరోగ్యం పాడవుతుంది. వెంటనే ఎవరో ఒకరితో ఆ సీక్రెట్ చెప్పేసి, నా ఆరోగ్యాన్ని కాపాడేసుకుంటా’’ అన్నారు రణబీర్. భలే వింతగా, నిజమే అనేంతలా ఉంది కదూ!! -
బెలూచిస్థాన్లో ఇండియా రేడియో
-
ఇక పాకిస్థాన్‌లోనూ మన 'ఆకాశవాణి'
''ఆకాశవాణి.. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జీడిగుంట నాగేశ్వరరావు'' ఇలాంటి మాటలు వినకపోతే చాలామందికి తెల్లవారేది కాదు. ఆలిండియా రేడియో ప్రసారాలు అంతగా మన దేశ వాసులకు అలవాటు అయిపోయాయి. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా మన ఆకాశవాణి ప్రసారాలు వినిపిస్తాయి. 300 కిలోవాట్ల డిజిటల్ రేడియో మాండియల్ (డీఆర్ఎం) ట్రాన్స్మిటర్ను జమ్ములో ఏర్పాటుచేయడం ద్వారా ఆలిండియా రేడియో ప్రసారాల సిగ్నళ్ల సామర్థ్యాన్ని కేంద్రం పెంచింది. దాంతో ఇది సాధ్యమవుతోంది. జమ్ము స్టేషన్ నుంచి ప్రసారం చేసే కార్యక్రమాలు ఇప్పుడు పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో కూడా వినిపిస్తాయి. డీఆర్ఎం ట్రాన్స్మిషన్ వల్ల శబ్దాలు మరింత స్పష్టంగా, గట్టిగా వినిపిస్తాయని, ఎక్కడా సిగ్నల్ సరిగా లేకపోవడం ఉండదని ఏఐఆర్ వర్గాలు తెలిపాయి. ఆలిండియా రేడియోలోని రేడియో కశ్మీర్ జమ్ము స్టేషన్ కార్యక్రమాలను పాక్ ఆక్రమిత కశ్మీర్, ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వినొచ్చు. ఉధంపూర్‌లో కూడా రేడియో స్టేషన్ కావాలని చాలాకాలంగా అడుగుతుండటంతో అక్కడ సైతం ఒక స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ ఏర్పాటుచేసే స్టేషన్ నుంచి 55 కిలోమీటర్ల దూరం వరకు సిగ్నల్ స్పష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు కావల్సిన భూమిని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. -
ఆకాశవాణిలో మెరిసిన మంద్రస్వరం
సందర్భం మల్లాది నరసింహశాస్త్రి మా సహోద్యోగి అని చెప్పుకునేం దుకు మేము గర్వపడతాము. ఆయన మల్లాది రామకృష్ణ శాస్త్రి తనయుడు కాబట్టి మేము గర్వపడతామని చెప్ప డం లేదు. ఎం.ఎన్. శాస్త్రి అస లెప్పుడూ అలాంటి భేషజా లకు పోయే వ్యక్తి కాదు. ఎప్పుడూ గొప్పలు చెప్పు కోలేదు. మితభాషి, తన పనేమిటో తాను చేసుకుపోవ డమేగాని, వివాదాలకు తావిచ్చే మనస్తత్వం కాదు ఆయ నది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం, ఆ ముఖంలో అప్పుడప్పుడూ ఒక కొంటెతనం, ఒక వేళాకోళం లాంటి భావాలు కనిపించేవి. కేవలం ముఖంలోనే ఆ మాట లతో ఆ భావాన్ని అస్సలు వ్యక్తపరిచేవారు కాదు. అదుగో ఈ స్వభావాలను బట్టి మేము ఆయనను చూసి గర్వపడతామని చెప్పేది. మల్లాది నరసింహశాస్త్రి విజయవాడ ఆకాశవాణిలో 1950లో అనౌన్సరుగా జాయిన్ అయ్యారు. అంటే దాదాపు విజయవాడ స్టేషన్ ప్రారంభం నుంచి అందులో పనిచేసి ఆ సంస్థ అభివృద్ధికి తోడ్పడిన వారిలో ఒకరుగా చెప్పవచ్చు. సాహి త్యంలో ‘లత’గా పేరు పొందిన తెన్నేటి హేమలత, ఎ. శ్యామసుందరి, కూచి మంచి కుటుంబరావు, నండూరి పాండురంగ విఠల్ వీరందరూ ఆయన సహోద్యోగులు. అప్పట్లో అనౌన్సర్స్, ఒక్క అనౌన్స్మెంట్కే పరిమి తంకాక వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవారు. అలా ఆయన కూచిమంచి ఓబయ్య, బాబయ్య అన్న స్టాక్ క్యారెక్టర్స్‌తో ఒక కార్యక్రమం నడిపేవారు. శ్రోతలు ఆ కార్యక్రమం కోసం ఎదురుతెన్నులు చూసేవారు. అంత పాపులర్. ఆ రోజుల్లోనే సుప్రసిద్ధ రచయిత ఆర్కే నారా యణ్ నవల ‘గైడ్’ని ‘మార్గదర్శి’ అన్న పేరుతో మల్లాది నరసింహశాస్త్రి తెనిగించారు. హైదరాబాద్‌కి వచ్చాక కొన్నాళ్లు అనౌన్సర్‌గానే ఉన్నా, ఆ తరువాత ‘సాం అండ్ హోం’ సెక్షన్లో స్క్రిప్ట్ రైటర్‌గా ప్రమోషన్ పొందారు. ఆ రోజుల్లో ఆయన, నేను కలిసి కొన్నాళ్లపాటు ఉదయం ప్రసారమయ్యే గ్రామస్తుల కార్యక్రమంలో పాడిపంటల మీద ‘బులెటిన్’ చదువుతుండేవారం. ఆయన హైదరాబాద్ వచ్చాక నాటకాలలో ఎక్కువ పాల్గొనలేదు. విజయవాడలో ఉన్నప్పుడు బుచ్చిబాబు రాసి నిర్వహించిన ప్రతి నాటకంలోను శాస్త్రిని తప్పక తీసుకునేవారని, శాస్త్రి సతీమణి అన్నపూర్ణ చెప్పారు. ఇక్కడ ఒక ఉగాదికి తురగా కృష్ణమోహనరావు రచించిన ‘నవ్వులు పండించే ఉగాది’ అన్న నాటకంలో ఒక కవి పాత్రను పోషించి మెప్పించారు. విజయవాడలో నేను కాజువల్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నప్పటినుంచి శాస్త్రిని ఎరుగుదును. అన్నపూర్ణ ప్రసిద్ధ గాయని. ఆవిడ పాడిన ‘రాగ రంజితాత్మవై ఏగుచుంటివా రాధా’ అన్నపాట చాలా ప్రసిద్ధిపొంది, టి.ఎస్. రికార్డ్‌గా వచ్చి రేడియోలో అనేకసార్లు ప్రసారమైంది. ఆయన చదువుకునే రోజులనుండే వారి కథలు వివిధ మాస, వార పత్రికలలో ప్రచురితమయ్యేవి. ‘ఛాత్రారామ’ అనే చైనీస్ నవలను అనువదించారు. ఆయన కథలన్నీ ‘మణి దీపాలు’ అన్న పేరుతో సంక లనంగా వచ్చాయి. చందమామలో పిల్లల కోసం కథలు రాశారు. మల్లాది నరసింహశాస్త్రి లేని లోటును తట్టుకునే శక్తి వారి కుటుంబానికి కాలమే ఇవ్వాలి. శారదా శ్రీనివాసన్, వ్యాసకర్త ఆలిండియా రేడియో కళాకారిణి మొబైల్ : 94410 10396 -
కేరళలో ‘సుభాషితం’ దుమారం
తిరువనంతపురం: ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో ప్రసారమైన ‘సుభాషితం’ అనే కార్యక్రమం కేరళలో దుమారం రేపుతోంది. ఏఐఆర్ త్రిస్సూర్ ప్రాంతీయ కేంద్రంలో సుభాషితం అనే కార్యక్రమాన్ని డాక్టర్ సీఎన్ పరమేశ్వరన్ అనే స్కాలర్ గతవారం ప్రెజెంట్ చేశారు. అయితే అందులో మన పురాణాల్లోని దేవతలు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధాలు.. అగ్రవర్ణాలకు చెందిన పరదేశీయులకు, స్థానికులకు మధ్య జరిగినవని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. హిందువుల ఆరాధ్య దైవాలు రాముడు, కృష్ణుడు విదేశీయులని వ్యాఖ్యానించడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బీ గోపాలకృష్ణన్ ఆరోపించారు. -
ఆకాశవాణిపై ఆర్యవైశ్యుల ఆగ్రహం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆర్యవైశ్య వర్గాన్ని కించపరుస్తూ ఆకాశవాణి (ఆలిండియా రేడియో)లో ప్రసారమైన వ్యాఖ్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయకుంటే దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాలను ముట్టడిస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రామకృష్ణ తంగుటూరి హెచ్చరించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో ప్రచారం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఒక జాతీయ భాషలో వెలువడిన ప్రకటనను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు తెలుగు భాషలోకి తర్జుమా చేయడంలో ఆర్యవైశ్యులను అవమానపరిచారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగుడైన కుమారుడితో తండ్రి మాట్లాడే క్రమంలో ‘నా సంపాదనంతా ఆ కోమటోడికి వడ్డీ కట్టడానికే సరిపోయింది’..అంటూ వ్యాఖ్యానిస్తాడు. వాట్సాప్ ద్వారా ఈ వ్యాఖ్యలు ప్రపంచం నలుమూలలా ఉన్న వైశ్యులకు చేరిపోయాయి. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు 26వ తేదీన ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ప్రచారాన్ని ఆకాశవాణి ఉపసంహరించుకుంది. ముంబయిలోని అడ్వర్టైజ్మెంట్ సంస్థకు సైతం నిలుపుదల ఆదేశాలను పంపారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని ఆలిండియా రేడియో డెప్యూటీ డెరైక్టర్ ఎం.కృష్ణకుమారి ఈనెల 28వ తేదీన విడుదల చేసిన ఒక లేఖ ద్వారా బీజేపీ విజయవాడ సిటీ అధ్యక్షులు ఉమామహేశ్వర రాజుకు క్షమాపణలు చెప్పారు. అరెస్ట్ చేయకుంటే ఆకాశవాణి ముట్టడి ఆర్యవైశ్య కులాన్ని దారుణంగా కించపరుస్తూ ఆకాశవాణిలో ప్రసారమైన వ్యాఖ్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయకుంటే దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాలను ముట్టడిస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తూ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రామకృష్ణ తంగుటూరి చెన్నైలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ప్రధానిని ఫాలోఅవుతున్న ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టయిల్‌ను ఫాలో అవుతున్నారు. ప్రధాని నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తరహాలో ఆయన కూడా ఆకాశవాణి ద్వారా రైతులను కలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ అధికారిక ప్రసారమాధ్యమం ఆకాశవాణిని ఎంచుకున్నారు. 20 నిమిషాలు పాటు ప్రత్యక్షంగా రేడియో ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గత రెండు నెలలుగా ధరల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులను పలకరించారు. తన రేడియో సందేశం ద్వారా రైతు సోదరులలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. త పంట నష్టపోతున్న రైతుల కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే హెల్ప్‌లైన్‌ను వాడుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. పంటల రకాలు, పంట విధానాలు తదితర విషయాలపై వ్యవసాయ శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దీంతోపాటు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు చెల్లించాల్సిన బాకీలను జూన్ చివరికల్లా చెల్లిస్తామని హామీ వచ్చారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పంపిణీ పథకం 'అన్నభాగ్య' కు రేడియో ద్వారా విస్తృతప్రచారాన్ని కల్పిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేడియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిత్వ వర్గాలు ధృవీకరించాయి. అవసరం ఏర్పడినపుడల్లా రేడియో కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను కలవనున్నారని వెల్లడించాయి. -
ఉగ్రదాడి అనుకొని పోలీసుపై కాల్పులు
న్యూఢిల్లీ: అదుపుతప్పి ఆఫీసులోకి వేగంగా దూసుకొచ్చిన కారును చూసి ఉగ్రదాడి అనుకొని ఓ ఢిల్లీ పోలీసుపై నాగాలాండ్ పోలీసు గార్డు కాల్పులు జరిపాడు. పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీ పోలీసు బెటాలియన్‌లో పనిచేస్తున్న అంకిత్ కుమార్ (30) అనే కానిస్టేబుల్ అలా సరదాగా ఢిల్లీ వీధిలో కారు నడుపుకుంటూ జోరుగా వెళుతున్నాడు. సడెన్‌గా కారుపై అతడు నియంత్రణ కోల్పోడంతో అది ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలోకి దూసుకెళ్లింది. తాళం వేసి ఉన్న గేటు కాస్త కారు వేగానికి ధ్వంసమైంది. ఇంతలో తేరుకుని అంకిత్ కుమార్ కారు వెనక్కి తీసే ప్రయత్నం చేస్తుండగా అదే కార్యాలయంలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న నాగాలాండ్ కు చెందిన ఓ పోలీసు గార్డు.. ఆ కారు ఉగ్రవాదులది అనుకొని, అది ఉగ్రదాడి అనుకొని వెంటనే కాల్పులు జరిపాడు. దీంతో అందులోని ఒక బుల్లెట్ అంకిత్ ఎడమవైపు ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో అతడిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించారు. దీంతో అతడు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. అంకిత్ కుమార్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సుధామతో రేడియో అక్కయ్య ముచ్చట్లు
-
చిన్నక్క కబుర్లు
రేడియో అంతరంగాలు ఆలిండియా రేడియోలో ఓ నటిగా, రచయిత్రిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు రతన్‌ప్రసాద్. శ్రోతలందరికీ ఆమె ‘చిన్నక్క’గా సుపరిచితురాలు. అనౌన్సర్ అంటే ఇలా ఉండాలని చూపించదగ్గ గొప్పతనం ఆమెకుంది. ఏ కార్యక్రమానికి ఎలా మాట్లాడాలనే దానిపై ఆమెకున్న పట్టు సాటిలేనిది. సినీతారలకే కాదు రేడియో కళాకారులకు కూడా ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ఆమె మాటలు వింటే తెలుస్తుంది. ‘‘తప్పు జరిగింది, క్షమించండి’’ అని చెప్పాల్సిన పరిస్థితిని ఆమె తన నలభై ఏళ్ల సర్వీసులో ఏనాడూ తెచ్చుకోలేదు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్ ఈ వారం ప్రఖ్యాత రేడియో ఆర్టిస్ట్ అయిన 83 ఏళ్ల రతన్‌ప్రసాద్‌ను పలకరించారు. ఆత్మీయంగా పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... దక్కన్ రేడియోలో క్యాజువల్ ఆర్టిస్ట్‌గా నా రేడియో జీవితాన్ని ప్రారంభించాను. అప్పుడు అక్కడ కేశవపంతుల నరసింహ శాస్త్రిగారు, కుప్పుస్వామిగారు ఉండేవారు. తర్వాత దక్కన్ రేడియో ‘ఆలిండియా రేడియో’గా రూపాంతరం చెందాక 1958లో నేను అనౌన్సర్‌గా ఉద్యోగంలో చేరాను. అది అనుకోకుండా జరిగి పోయింది. అసలు నేను వాద్యసంగీతం ఆడిషన్‌కు వెళ్లాను. ఆ ఆడిషన్లో వాద్యాల మధ్య నేను మాట్లాడిన మాటలను విని, నా కంఠ స్వరంలో ప్రత్యేకత ఉందని చెప్పి అక్కడి జడ్జీలు నన్ను అనౌన్సర్‌గా తీసుకున్నారు. కార్మికుల కార్యక్రమం ఈ కార్యక్రమం నా జీవితాన్నే మలుపు తిప్పిందని చెప్పాలి. ఇప్పటికీ ప్రజల్లో ‘చిన్నక్క’, ‘ఏకాంబరం’ పాత్రలు గుర్తున్నాయంటే అది మా అదృష్టం. ఈ కార్యక్రమంలో మొదట కొన్నేళ్లు నేను రమణక్కగా తెలంగాణ మాండలికంలో మాట్లాడేదాన్ని. తర్వాత నా పాత్ర పేరును రమణక్క నుంచి చిన్నక్కగా, సత్యనారాయణ పోషించే పాత్ర పేరును జగన్నాథం నుంచి ఏకాంబరంగా మార్చారు. అలా 10 ఏళ్లు రమణక్కగా, 30 ఏళ్లు చిన్నక్కగా రేడియోలో కార్యక్రమాలు చేశాను. అలాగే కుటుంబ నియంత్రణపై మేం చేసిన కార్యక్రమాలు మాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఏనుగు అంబారీ దివిసీమ ఉప్పెన సమయంలో తుపాను బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిద్దామని నేను, వి.సత్యనారాయణ (ఏకాంబరం పాత్రధారి), జీడిగుంట రామచంద్రమూర్తి (బాలయ్య పాత్రధారి)లతో మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో పర్యటించాం. సినీ తారలకు నీరాజనం పట్టినట్టే మాకూ ఘనస్వాగతం పలికారు ప్రజలు. అలాగే జగిత్యాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు నన్ను ఏనుగుపై ఊరేగించి సన్మానం చేశారు. ఆ సన్మానం నాకు జరిగినట్టుగా నేనెప్పుడూ భావించలేదు. అది ఆకాశవాణికే జరిగిందని నమ్ముతాను. భాగ్యనగరంలో కలకలం 1970లో గండిపేట తెగిపోయి హైదరాబాద్ నగరం మునిగిపోతుందని వదంతులు చెలరేగాయి. అప్పుడు ప్రజల్లో భయాందోళనలు తొలిగించేందుకు కృషి చేయాల్సిందిగా పోలీసులు మమ్మల్ని కోరారు. దాంతో ప్రతి అయిదు నిమిషాలకోసారి ఈ అంశంపై వివిధ రకాలుగా అనౌన్స్ చేశాను. మరుసటి రోజు పోలీసు కమిషనర్ వచ్చి ‘‘మేం చేయలేకపోయిన పనిని మీరు విజయవంతంగా చేశార’’ని ప్రశంసించారు. ప్రజలు మెచ్చిన ప్రోగ్రామ్స్ స్త్రీల కార్యక్రమంలో ‘రంగవల్లి’లో ‘అమ్మ ఒడి’ అనే ధారావాహిక శీర్షిక నిర్వహించాను. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల భాషలోనే కథలు చెప్పేదాన్ని. ‘గ్రామసీమలు’ కార్యక్రమంలో రామాయణం చదివి వినిపించాను. మునిమాణిక్యం గారి ‘కాంతం కథలు’ చదివాను. 1962లో చైనా యుద్ధ సమయంలో సైనిక సోదరులు తమ భార్యలకు రాసినట్టుగా మేం ప్రసారం చేసిన ‘హంస సందేశం’ అనే దేశభక్తిపూరిత ధారావాహిక ఉత్తరాల కార్యక్రమం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ‘వన్నెల విసనకర్ర’ శీర్షికతో మహిళా వస్త్రధారణ, నగలకు సంబంధించిన కార్యక్రమం చేశాను. అలుపెరుగని కృషి.. నేను పత్రికలకు రాసిన ‘ఆవలి తీరానికి’, ‘ఎప్పటికీ ఏమీకాను’, ‘తెర తొలగింది’లాంటి నవలలకు బహుమతులు అందుకున్నాను. సెక్షన్ గ్రేడ్ అనౌన్సర్‌గా 1992లో రిటైర్ అయ్యాను. ఇప్పటికీ హైదరాబాద్ స్టేషన్ వారు మూడు, నాలుగేళ్లకోసారి నిర్వహించే జాతీయ నాటకానికి దర్శకత్వం వహించే బాధ్యతను నాకే అప్పగిస్తారు. ప్రస్తుతం ‘అమృతవాణి’లో చిన్నారులకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ..:: ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి కత్తిమీది సాము అనౌన్సర్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. అయితే వీరికి బాహ్య శత్రువులంటూ ఎవరూ ఉండరు. తమ కళ్లు, నాలుక, చేతులే విరోధులు. అవెలాగంటారా... స్క్రిప్టులోని అక్షరాలు అప్పుడప్పుడు కంటిని తప్పు దారి పట్టిస్తాయి. దాంతో నాలుక తప్పు చదువుతుంది. ఇక చేయి విషయానికొస్తే అనౌన్సర్లు మిషన్లతో వేగంగా పని చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతే ఇంక. -
రేడియో అక్కయ్య ముచ్చట్లు!
-
దక్కన్లో నేనొక్కణ్ణే...
రేడియో అంతరంగాలు నిజాం కాలంలోని దక్కన్ రేడియోలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆలిండియా రేడియోలో సుదీర్ఘ కాలం స్టాఫ్ ఆర్టిస్ట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు పి. కుప్పుస్వామి అయ్యర్ (94). ఏడేళ్ల వయసప్పుడే వీణ, వయొలిన్ చేతపట్టిన కుప్పుస్వామి.. ప్రతి సంగీత ఉపాసకునికీ గురుభక్తి, దైవభక్తి తప్పనిసరిగా ఉండాలంటారు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తనను కలిసినప్పుడు, ఆయన నెమరు వేసుకున్న 32 ఏళ్ల్ల రేడియో అనుభవాలు, జీవిత విశేషాలు... ఆయన మాటల్లోనే... త్యాగరాజుగారి శిష్యుడు కృష్ణభాగవతార్ ముని మనుమణ్ణి అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా మొదటి గురువు మా నాన్నగారు పిచ్చయ్య భాగవతార్. చెన్నైలో ఆయన దగ్గరే వీణ, వయొలిన్ నేర్చుకున్నాను. ఓ రోజు మా నాన్న నన్ను ‘‘కుప్పా! సంధ్యావందనం చేయాలి త్వరగా రా’’ అన్నారు. కంగారుగా పరుగెత్తుతూ వీణను కింద పడేశా. దాంతో అదీ పగిలింది, నన్నూ పగలగొట్టారు (నవ్వుతూ). తర్వాత కరూర్‌కి వెళ్లి గురుకులంలో చేరి శ్రీకరూర్ చిన్నస్వామి అయ్యర్ దగ్గర శిష్యరికం చేశాను. నేను సంగీతాన్ని వృత్తిగా చేసుకోవడం మా నాన్నకు ఇష్టం లేదు. కానీ ఆసక్తి మేరకు నేను ఆ రంగంలోకి వెళ్లాను. మద్రాస్ టు హైదరాబాద్ 1941లో జపాన్ వాళ్లు మద్రాసుపై రెండు బాంబులు వేశారు. అప్పుడు అక్కడి వారంతా ఎక్కడెక్కడికో వలస వెళ్లారు. మా విద్యార్థుల్లో ఓ అయ్యంగార్ కుటుంబ బంధువులు హైదరాబాద్‌లో ఉండేవారు. వాళ్ల ఇంటికి వారితోపాటు నన్నూ రమ్మన్నారు. అలా 1942లో ఇక్కడ అడుగుపెట్టాను. హిమాయత్ నగర్‌లోని వాళ్లింట్లోనే ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి పెట్టి, వసతి ఇచ్చి బాగా చూసుకునే వాళ్లు (కన్నీళ్లు పెట్టుకుంటూ). రోజుకో గంట కార్యక్రమం ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన చీఫ్ ఇంజినీర్ మహాలింగం గారింట్లో వాళ్ల అమ్మాయికి సంగీతం చెబుతుండేవాణ్ణి. అప్పుడు ఆయన ‘‘స్టేషన్లో వయొలిన్, మృదంగం వాయించే వాళ్లు కావాలి. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు చేసి వెళ్లండి’’ అన్నారు. నేను ట్యూషన్లు చెప్పే కీలక సమయం అది. కాబట్టి నేను రాలేనన్నాను. కానీ ఆయన పట్టు వదలకుండా అడిగే సరికి ఒప్పుకున్నాను. అలా 1947లో దక్కన్ రేడియోలో రోజూ గంట కార్యక్రమం చేయడానికి వెళ్లేవాణ్ణి. అప్పుడు హైదరాబాద్‌లో నేనొక్కణ్ణే సంగీత విద్వాంసుణ్ణి. దక్కన్ రేడియోలో రోజూ ప్రారంభంలో ఓ అయిదు నిమిషాలు వయొలిన్ వాయించేవాణ్ణి. నల్లకుంట నుంచి ఖైరతాబాద్‌కు సైకిల్‌పై వెళ్లేవాణ్ణి ఆఫీసుకు. ఇందిరమ్మ మేలు 1950లో ఆలిండియా రేడియోను భారత ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు ఢిల్లీ నుంచి బంట్రోతు వస్తున్నాడంటే కూడా ఎంతో భయపడే వాళ్లం. ఇందిరా గాంధీ సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా జీతం రూ.160 నుంచి ఒకేసారి రూ.300లకు పెరిగింది. నేను రిటైర్ అయ్యేటప్పుడైనా అంత జీతం తీసుకుంటానా అనుకునే వాణ్ణి. కర్ణాటక సంగీతం నేను మొదటి నుంచీ కర్ణాటక సంగీతంపైనే సాధన చేశాను. వరదరాజన్‌గారు కర్ణాటక సంగీతానికి ప్రొడ్యూసర్‌గా ఉండేవారు. ఆయన బంగారం లాంటి మనిషి. ఎవరైనా గాయకులు చిన్న చిన్న తప్పులు చేస్తే ‘‘ఏం ఫర్వాలేదు. చిన్న తప్పే కదా’’ అనేంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మంచి స్వభావం గల పెద్ద విద్వాంసుడు. మంచాల జగన్నాథరావుగారు హిందుస్థానీ సంగీత విభాగంలో ప్రొడ్యూసర్‌గా ఉండేవారు. ఆయన వీణ వాయించేవారు. మా అందరి మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలుండేవి. నాతో పని చేసే పురుషోత్తం, జగన్నాథంతో కలిసి ఎప్పుడూ గోపీ హోటల్, అసెంబ్లీ దగ్గరుండే మైసూర్ కేఫ్‌కు వెళ్లేవాణ్ణి. భక్తి గీతాలు నేను భక్తి రంజని కార్యక్రమంలో ఎన్నో పాటలు పాడించేవాణ్ణి. దీపావళి, నవరాత్రి పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలు చేశాను. అంబాళి, సుబ్రహ్మణ్యస్వామి, కృష్ణుడు, శివుడు, గణపతుల పై ఎన్నో పాటలు చేశాం. నా ప్రత్యేకత వయొలిన్ వాయించడం. నా భార్య రాజ్యలక్ష్మి కూడా ఆకాశవాణిలో పాడేది. 1980లో నేను పదవీ విరమణ తీసుకున్నాను. అప్పుడే నేను నిర్వహించిన కార్యక్రమాల రికార్డులన్నీ తెచ్చుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర అవి భద్రంగా ఉన్నాయి. నాకున్న ఆసక్తితో అప్పుడప్పుడు ఆకాశవాణికి వెళ్లి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తుంటాను. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫోటోలు: జి. రాజేశ్ అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు! అప్పట్లో సంగీతం నేర్చుకుంటే ఏ ఉద్యోగం రాకపోయినా బతికేయొచ్చు అనే వాళ్లు.. అలాగే నేను మా గురువు చిన్నస్వామిగారి దగ్గర ఉండగానే సంగీతం నేర్పిస్తే రూ.7 సంపాదించే అవకాశం దొరికింది. దాన్ని ఆయనకు ఇస్తే నా హోటల్ ఖర్చులు అన్నీ చూసుకుంటూ నెలకు రూపాయి మిగిల్చేవాళ్లు.. ఆ తర్వాత మరో మూడు, నాలుగు ట్యూషన్లకు ఒప్పందం కుదుర్చుకున్నా. మొత్తం నెలకు రూ.22 వచ్చేవి. అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు. ఆ గురువుగారి దగ్గర నేను మొత్తం ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి, బట్టలు పెట్టేవారు. ఆయన రుణం నా జన్మలో తీర్చుకోలేను. -
చలంగారి ప్రశంసతో చలించిపోయాను!
రేడియో అంతరంగాలు తెలుగుకి సంబంధించి ఆల్ ఇండియా రేడియో అనగానే... ఠక్కున గుర్తొచ్చేది చలం ‘పురూరవ’ శ్రవణ నాటకం. అందులో ‘ఊర్వశి’ శారదా శ్రీనివాసన్! కావ్యాల్లోని ఊర్వశి సోయగాన్ని తన మధురస్వరంలో ఒలికించి శ్రోతల ఊర్వశిగా నిలిచారు. చలాన్ని సైతం మైమరిపించారు..! ఆ పురూరవ ఊర్వశి... ఆకాశవాణి మానసి... శారదా శ్రీనివాసన్ అంతరంగంలోని రేడియో తరంగం... రేడియో... నా జీవితమే అది. నా అనుబంధమంతా దానితోనే. నాటకాలు వేసినా, పాటలు పాడినా, సీతక్కగా శ్రోతలు ఆదరించినా అంతా రేడియో వల్లే. ఒకరకంగా ఆకాశవాణి నాకు తల్లిలాంటిది. ఏఐఆర్ మాకు ఆఫీస్ కాదు. ఓ ఇల్లు.. ఓ ఫ్యామిలీ! అది తప్పితే మాకు ఇంకే వ్యాపకమూ ఉండేది కాదు. ఏఐఆర్... ఓ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏఐఆర్ బిల్డింగ్ (ఇప్పుడున్నది కాదు పాతది) అసెంబ్లీ ఎదురుగుండా అంతే దర్జాగా ఇంకా చెప్పాలంటే దాని ఔన్నత్యాన్ని చాటుతున్నట్టుండేది. అసెంబ్లీలోని ప్రజాప్రతినిధుల వాయిస్‌కి ప్రతిధ్వని. అప్పుడు బిల్డింగ్ అంతా వెనక్కి ఉంటే లాన్స్ ముందు ఉండేవి. బిల్డింగ్‌కి లాన్స్కి మధ్యలో కార్ డ్రైవ్. సాయంకాలాలు... ఆ లాన్స్‌లో కూర్చోని రిహార్సల్స్ చేసుకునే వాళ్ళం. బేగం అఖ్తర్ భుజం మీద చేయి వేసి...‘బేటీ కేసీ హో...క్యాకర్తీ హో ఇదర్’ అని అడిగింది. మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మరీ పలకరించింది. బాలమురళీకృష్ణగారితో కలిసి పాడే అదృష్టాన్నిచ్చింది. ఇలా వీళ్లందరినీ వ్యక్తిగతంగా చూసి, మాట్లాడే అవకాశం ఆకాశవాణివల్లే కలిగింది. నేను గనుక అందులో ఉద్యోగం చేసుండకపోతే వాళ్లను కనీసం చూసే భాగ్యం కూడా దొరక్కపోవును. సౌందర్యరాశి ఊర్వశి.. మన కావ్యాల్లో వర్ణించిన దాని ప్రకారం మహా సౌందర్యరాశి ఆవిడ. రేడియోలో ఆ సౌందర్యాన్ని గొంతులో పలికించాలి. ఊర్వశి పట్ల శ్రోతలకున్న ఊహకు రేడియో ఆర్టిస్ట్ తన కంఠంతో ఊపిరి పోయాలి. అలాంటి ఈ శ్రవణ పాత్ర నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. కృష్ణశాస్త్రిగారి ‘షర్మిష్ఠ’ నాటకంలోని దేవయానిగా పలికిన నా పాత్రకు రాజమన్నార్లాంటి వాళ్ళు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు. అయితే ఈ ప్రశంసలన్నిటికీ అప్పుడు కలిగిన సంతోషం వేరు...ఇన్నేళ్ళయినా వాటి ద్వారా ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారని ఇప్పుడు కలుగుతున్న సంతోషం మాటల్లో చెప్పలేనిది. చలంగారు నా ఊర్వశి పాత్రను చాలా మెచ్చుకున్నారని అప్పట్లో ఎవరో చెప్పారు. నేను నమ్మలేదు. ఎందుకంటే చలంగారు ఈ రేడియో ప్రోగ్రామ్స్‌ని పెద్దగా ఇష్టపడరని వినున్నాను. అలాంటి ఆయన ఆ నాటకంలోని నా పాత్రను ఎందుకు మెచ్చుకుంటార్లే అనుకున్న. ఓరోజు... రమణయ్య రాజా అనే ఓ లెఫ్టినెంట్ కల్నల్ ఫోన్ చేసి ‘‘మేడం... చలంగారు ‘పురూరవ’ నాటకం విని అందులోని మీ ఊర్వశి పాత్రను చాలా మెచ్చుకున్నారండీ’’ అన్నారు. ఎదురుగా ఆ నాటకం ప్రొడ్యూసర్ గోపాల్గారూ ఉన్నారు. నేను రిటైరయ్యాక భార్గవిగారితో కలిసి ఊరికెనే అరకులోయ చూడాలని వెళ్ళాం. అన్నీ చూసుకొని ఆ రోజు సాయంకాలం తిరుగు ప్రయాణమవుతామనగా... ‘‘శారదా.. సరదాగా భీమ్లీ వెళ్ళి సౌరీస్ (చలంగారి అమ్మాయి)ని చూద్దాం’’ అంది భార్గవి. అప్పుడు మాతో కథారచయిత గొరుసు జగదీశ్వర్‌రెడ్డి ఉన్నాడు. భీమ్లీ కోసం అతనే కారు అదీ ఆరెంజ్ చేసి భీమ్లీకి తీసుకెళ్ళాడు. మేం వెళ్లే సరికి సౌరీస్ కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో కూర్చొని ఉన్నారు. హిందుస్థానీ మ్యూజిక్ ఏదో ప్లే అవుతుంది. తతిమావాళ్ళంతా ఆవిడకెదురుగా అలా కూర్చొని ఉన్నారు. మేమూ అరగంట అలాగే కూర్చున్నాం. అయినా ఆవిడ కళ్ళు తెరవరు. మధ్యాహ్నం ఎవరింట్లోనో భోజనం మాకు. వాళ్లింటికి వెళ్ళాలి. టైమ్ అవుతోంది. ఈలోపు భార్గవి ఇంకో వైపు ఉన్న ద్వారం నుంచి సౌరీస్ దగ్గరకు వెళ్ళింది. తను మిలేనియం ఇయర్లో కొన్ని కథల సంపుటి తీసుకొచ్చింది. అందులో సౌరీస్ కథ కూడా ఉంది. ఆ మాటే సౌరీస్ చెవిలో చెప్తూ ఆ భార్గవిని నేను అంది. ఆవిడ కళ్ళు తెరవకుండా అవునా అన్నట్టుగా తల ఊపారు. తర్వాత పక్కనే ఉన్న నన్ను ‘ఈవిడ శారదా శ్రీనివాసన్’ అంటూ పరిచయం చేసింది భార్గవి. ఆ మాట విన్న వెంటనే దిగ్గున కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ ‘‘ఎవరూ ఊర్వశి?’’ అని అడిగారు. ఆశ్చర్యపోయాను. తేరుకొని ‘‘అవును మేడమ్...ఆ వేషం నేనే వేశాను’’ అన్నాను. ‘‘నాన్నగారికి చాలా ఇష్టం’’ అన్నారు. మరపురాని జ్ఞాపకం ఇది. చలంగారు మెచ్చుకున్నారన్న విషయాన్ని అప్పుడు నమ్మాను. అంతకు ముందు అభిమానుల నుంచి వచ్చిన వేల ఉత్తరాలు, ఫోన్లకు స్పందించని నా మనసు చలంగారి ప్రశంసతో చలించిపోయింది. ఆయన రాసిన నాటకాన్ని నేను మెప్పించగలిగాను అన్న సంతృప్తి. అలాగే మనసుకవి ఆత్రేయగారు ‘పురూరవ’ నాటకాన్ని విని ఫోన్ చేశారు. ‘‘ఊర్వశిగా అద్భుతం మీరు. నాకు ఆ రికార్డింగ్ కావాలి. పంపగలరా ఎలాగైనా’’ అని పంపాను. తర్వాత ఒకసారి ‘‘మీకు సన్మానం చేస్తున్నాం, రాగలరా’’ అని అడిగారు. ‘‘సారీ అండీ... నాకు టైమ్ ఉండదు. అయినా మీలాంటి గొప్ప కవుల ప్రశంసే నాకు సన్మానం కన్నా ఎక్కువ’’ అన్నాను. ‘‘లేదు. నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను మీకేమైనా అభ్యంతరమా?’’ అన్నారు. ‘‘మీరు మా ఇంటికి రాగలిగితే చాలా సంతోషం’’ అన్నాను. ఎవరినో వెంటతీసుకొని మా ఇంటికొచ్చారు. ‘పురూరవ’లో పురూరవగా వేసిన చిరంజీవిగారినీ రమ్మన్నాను. నేనూ, మావారూ ఉన్నాం. నేను వేసిన మిగిలిన నాటకాల గురించీ అడిగారు. సంభాషణ అంతా అయ్యాక చిన్న కాగితం ఉంటే ఇవ్వమ్మా అని అడిగారు. ఇచ్చాను. నన్ను, సరస్వతిదేవిని కంపేర్ చేస్తూ ‘ఆ శారదకు వీణ కరమునుందు ఈ శారదకు వీణ గళము నందు’ అంటూ ఓ కవిత రాసిచ్చారు. ఏ పద్మశ్రీలు వీటితో సమానం? అలాగే బాలమురళీకృష్ణగారు... నా జీవితంలో ఆయనది గురుస్థానం. ఆయన సంగీత సారథ్యం వహించిన ఓ సినిమాలో నేను డబ్బింగ్ చెప్పాను. ఎప్పుడు విన్నారో తెలియదు కానీ.. ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు ‘శారదా.. ఇలా రా...’ అని పిలిచి ‘‘నిన్ను చూసి నేను గర్వపడుతున్నానమ్మా’’ అన్నారు. నా కళ్లెంబట నీళ్లోచ్చేశాయ్. అలాంటివన్నీ తలచుకున్నప్పుడు నా జీవితాన్ని వృథా కానివ్వలేదు. తర్వాత తరం వాళ్ళు నేర్చుకోవడానికి ఎంతోకొంత స్ఫూర్తినిచ్చాననే తృపి.్త ఒక్కటి కూడా వినలేదు ... ఇంతా చేసి నేను వేసిన నాటకం ఒక్కటి కూడా మా నాన్న గారు వినలేదు. అలాగని ఆయనకు నాటకాలంటే ఇష్టంలేక కాదు. బందాగారు, స్థానంవారు వేసిన నాటకాలను పక్క ఊరికి కూడా వెళ్ళి చూసొచ్చిన సందర్భాలున్నాయి. బహుశా...తన కూతురు అలా రేడియోలో నాటకం వేయడం ఇష్టం ఉండకపోవచ్చు. అంతదాకా ఎందుకు..మా ఆయనా పెళ్ళయ్యాక ‘‘రేడియోలో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండగలవా?’’ అని అడిగారు. ఆయనదీ రేడియోలోనే ఉద్యోగం. ఫ్లూట్ వాయిద్యంలో పెద్ద విద్వాంసుడు. ‘‘మీరూ ఇదే ఉద్యోగంలో కంటిన్యూ అవుతూ నన్ను ఉద్యోగం మానేయమంటే ఇల్లు గడవడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఇంతకన్నా మంచి ఉద్యోగం చూసుకోండి అప్పుడు నేను ఈ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటా’’ అని చెప్పాను. కానీ ఆయన వేరే జాబ్ చూసుకోవడం పడలేదు... నేను రేడియోలో ఉద్యోగం మానేసే అవసరం రాలేదు (నవ్వుతూ) తర్వాత మామధ్య ఇంకెప్పుడూ ఆ ప్రస్తావన కూడా రాలేదు. విజయవాడలో నేను ప్రవీణ ప్రచారక్‌గా ఉన్నప్పుడు మా హిందీ కాలేజ్‌కి ఓ కాంట్రాక్ట్ వచ్చింది. హిందీలో ఓ శ్రవణ నాటకం వేయమని. మా మాస్టర్ వేమూరి రాధాకృష్ణగారితో ఆడిషన్ టెస్ట్‌కి వెళ్లాను. వాళ్లిచ్చిన విషయాన్ని మాడ్యులేషన్‌తో చదివాను. జనమంచి రామకృష్ణారావుగారు నన్ను సెలక్ట్ చేశారు. అయితే కాలేజ్ ప్లే ద్వారా కాకుండా వేరే ప్లే ద్వారా నా రేడియో ప్రవేశం జరిగింది. అదే నాంది అనుకోవచ్చు. -
మోదీ రేడియో ప్రసంగంపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దసరా రోజు (ఈ నెల 3)న ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) ద్వారా చేసిన ప్రసంగం ‘మన్‌కీ బాత్’పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించడం ద్వారా ప్రధాని ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ మేరకు ఏఐసీసీ న్యాయ విభాగం కార్యదర్శి కేసీ మిట్టల్ ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్‌కు లేఖ రాశారు. -
ఆకాశవాణిలో.. మోడీ వాణి..!
-
తొలిసారి రేడియోలో మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించారు. 'మన్ కీ బాత్' (మనసులో మాట) పేరుతో ఆయన ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చెడుపై మంచి గెలిచిన రోజుగా ఆయన అభివర్ణించారు. నెలకోసారి, లేదా రెండుసార్లు ఆదివారం రేడియోలో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. మన శక్తి సామర్థ్యాలు అపారమైనవని మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో లో అందరూ పాల్గొనాలని, ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడే ఖాదీ ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే పేదల ఇళ్లల్లో ప్రగతి దీపం వెలిగించినట్లేనన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రేడియో కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రేడియో కేంద్రాల్లో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారం కానుంది. -
‘రేడియో రఘు’ ఇకలేరు
- ‘ఏఐఆర్’లో పాతికేళ్ల సేవలు - ఘంటసాల, జీ ఆనంద్ సంగీత బృందంలో సేవలు చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆలిండియా రేడియో (చెన్నై) తబలా వాయిద్య కళాకారులు (రిటైర్డ్) మామిడేల రఘురామ్ (65) గురువా రం కన్నుమూశారు. ‘రేడియో రఘు’గా చిరపరిచితులైన ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన శిష్యులు, అభిమానుల నడుమ బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య దేవసేన, కుమార్తె ప్రీతి ఉన్నారు.పదేళ్లవయస్సులోనే తబలా వాయిద్యంపై మక్కువ పెంచుకున్న రఘురామ్ ఎటువంటి శిక్షణ పొందకుండానేభజనలు తదితర చిన్నపాటి కార్యక్రమాలకు సేవలందించారు. ఆ తరువాత గానగంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆశీస్సులతో జట్సన్ మాస్టారు వద్ద శిష్యరికం చేసి మెళకువలను నేర్చుకున్నారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో అనేక సినిమా పాటలకు వాద్యసహకారం అందించారు. అదే సమయంలో ప్రముఖ సంగీత దర్శకులు, సినీ నేపధ్యగాయకులు జీ ఆనంద్ నేతృత్వంలోని స్వరమాధురీ ట్రూప్‌లో ఉంటూ వేలాది సంగీత కచ్చేరీలు చేశారు. సినిమా రంగంలో స్థిరమైన సం పాదన కష్టం, ఆలిండియా రేడియోలో ప్రయత్నాలు చేసుకొమ్మని ఘంటసాల ఇచ్చిన సూచనతో ప్రయత్నాలు ప్రారంభించారు. శాఖాపరమైన బీహై వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై కొన్నాళ్లు చెన్నై ఆలిం డియా రేడియోలో కాంట్రాక్టు కళాకారునిగా పనిచేశారు. ఆ తరువాత తిరుచ్చిరాపల్లి ఆలిండియా రేడియో కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టుగా జాయినయ్యారు. అక్కడి నుంచి బదిలీపై చెన్నై వచ్చిన రఘురామ్ 2009లో ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగంలో ఉండగానే స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన ఆ తరువాత కోలుకోలేకపోయారు. నేటికీ మరువలేను : జీ ఆనంద్ తబలా ఆర్టిస్ట్‌గా వేలాది కచ్చేరీలలో తనతోపాటు వేదికను పంచుకున్న రఘురామ్ వాద్యనైపుణ్యాన్ని నేటకీ మరువలేనని అంత్యక్రియలకు హాజరైన స్వరమాధురీ అధినేత, సినీ సంగీత దర్శకులు, నేపధ్యగాయకులు జీ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఆర్‌లో చేరిన తరువాత స్వరమాధురి కార్యక్రమాలకు దూరమై పాతికేళ్లు అవుతున్నా తమ మధ్య ఆత్మీయ అనుబంధం చెక్కుచెదరలేదన్నారు. కేవలం తబలా కళాకారునిగాగాక, కార్యక్రమ నిర్వహణలో ఒక మేనేజర్ వలే అన్నీ తానై చూసుకునేవారని గుర్తుచేసుకుంటూ భౌతికకాయం వద్ద నిలబడి కన్నీటిపర్యంతమయ్యూరు. రఘురామ్ అత్మకు శాంతి చేకూరాలని పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. -
మీరిప్పుడు వేధింపుల కథ వింటారు..
*ఆకాశవాణిలో కొందరు పర్మినెంట్ ఉద్యోగుల దౌష్ట్యం *కాంట్రాక్టు సిబ్బందిపై పెత్తనం *పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసిన మహిళలు *నోరెత్తితే ఉద్యోగం ఊడినట్లే *పట్టించుకోని ఉన్నతాధికారులు విజయవాడ : నిత్యం జనావళికి వార్తలనందించే ఆకాశవాణి కేంద్రం తాజాగా అదే ఓ వార్తయింది. ఆ విషయాన్ని అది నేరుగా శ్రోతలకు చెప్పకపోయినా ఆనోటా, ఈనోటా పాకి పెద్ద చర్చే జరుగుతోంది. గొప్ప ప్రసారంతోనో, పెద్ద అవార్డు అందుకునో కాదు.. కాంట్రాక్టు సిబ్బందిగా పనిచేస్తున్న మహిళలను వేధించడం ద్వారా కేంద్రం అభాసుపాలవుతోంది. ఆకాశవాణి కేంద్రంలో పర్మినెంట్ ఉద్యోగులు అడుగడుగునా కాంట్రాక్టు సిబ్బందిపై పెత్తనం చలాయిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 90 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలే. వేధిం పులు భరించలేక.. ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని కొందరు ఉద్యోగినులు వాపోతున్నారు. గతంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే అక్కడున్న పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వరుస ఫిర్యాదులు.. పర్మినెంట్ న్యూస్‌రీడర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఒక మహిళా క్యాజువల్ అనౌన్సర్ ఇటీవల సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసుపెట్టిన విషయం విదితమే. అప్పట్లో ఆ న్యూస్‌రీడర్‌ను ఆకాశవాణి ఉన్నతాధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఎఫ్ఎం జాకీ సైతం ఓ అధికారిపై ఉమెన్ సెల్‌తోపాటు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నర కిందట కొత్తగా నియమితులైన ఇద్దరు పర్మినెంట్ సిబ్బందిపై పురుష క్యాజువల్ అనౌన్సర్ ఏకంగా భౌతిక దాడికి దిగారు. వారు తన మాట వినడం లేదనే సాకుతోనే ఆయన ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో చివరికి వారిద్దరు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆంక్షల చట్రంలో.. పర్మినెంట్ ఉద్యోగుల వేధింపులపై ప్రశ్నిస్తే.. ఇక వారికి ఆకాశవాణిలో అడుగుపెట్టే అవకాశమే ఇవ్వడం లేదని కాంట్రాక్టు సిబ్బంది చెబుతున్నారు. న్యూస్రీడర్పై కేసు పెట్టిన మహిళా అనౌన్సర్, ఇటీవల మరో అధికారిపై ఫిర్యాదు చేసిన ఎఫ్ఎం జాకీకి సైతం కాంట్రాక్టు డ్యూటీలు వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొన్నారు. సవాలక్ష ఆంక్షలు పెడుతూ కాంట్రాక్టు సిబ్బంది బానిసలుగా చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా అనౌన్సర్లు తమ ముందు సెల్ మాట్లాడకూడదని, అటూఇటూ తిరగకూడదని, ఖాళీగా ఉన్న పర్మినెంట్ ఉద్యోగుల కుర్చీల్లో కూర్చోకూడదంటూ షరతులు విధిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. ఈ గొడవ ముదురుపాకాన పడి మరింత రచ్చ కాకముందే ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఆకాశవాణి అధికారులను అడిగితే.. ఎవరికి వారు తమ విభాగాలకు సంబంధం లేదంటూ బదులివ్వడం కొసమెరుపు. -
హైటెక్ నగరిలో కథాలహరి...
కాళ్లకు గజ్జెలు, చేతిలో చిడతలు, ఇద్దరు తోడు వాయిద్యాలు... ‘వినరా వినరా... విష్ణువు కథా వివరము చెబుతాను’ అంటూ హరికథా కాలక్షేపం ప్రారంభం. అదీ ఎక్కడ... ఇన్ఫోసిస్ లాంటి కార్పొరేట్ హౌజ్లోనో, డివిఎస్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్లోనో... ఇంటి గుమ్మం దాటని గృహిణులుండే గేటెడ్ కమ్యూనిటీలోనో, ఇంటర్నెట్ తప్ప ఇంకేమీ పట్టని అల్ట్రా మోడ్రన్ యూత్ మధ్యలోనో. పిల్లలకు నాలుగు మంచి విషయాలు చెప్పే ఓర్పు లేకపోగా, హరికథలూ, బుర్రకథలూ వినేకాలమా ఇది? అని ప్రశ్నించేవాళ్లకు పాఠంలా... నిన్నటి మన బంగారు బాల్యాన్ని ‘కథ’ సాక్షిగా మనకోసం తిరిగి వెలిగిస్తున్న దీపాకిరణ్ హైటెక్నగరిలో స్టోరీటెల్లింగ్‌కి ఓ ఆశాకిరణం. ‘రంపాపమ్ రంపాపమ్’ అంటూ దీప జానపద కథలకు రిథమ్‌ను జోడించగానే హాజరైన వారుసైతం జత కలుస్తారు. జన్మతః తమిళనాడుకు చెందిన దీప ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌గా, టీచర్‌గా, ఫ్రీలాన్స్రైటర్గా, ఆల్ ఇండియా రేడియోలోనూ పనిచేశారు. ఆమె ఒకప్పుడు క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ‘టీచర్‌గా పిల్లలకి కథలు చెప్తూ వారెంత ఆనందిస్తున్నారో అంతే ఆనందాన్ని నేనూ పొందేదాన్ని’ అని వివరించారామె. కథలు చెప్పడం ద్వారా కలుగుతున్న ఆనందం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ కథల కోసం చేసిన అన్వేషణ ఆమె మరింతగా స్టోరీటెల్లింగ్‌పై ఆసక్తి పెంచుకునేలా చేశాయి. కిడ్నీ వ్యాధి, అధిక బరువు సమస్యలను అధిగమించడానికి కూడా తనకు స్టోరీటెల్లింగ్ చక్కని మార్గంగా ఉపకరించింది అంటారామె. ‘ఇది కేవలం నోటికి మాత్రమే పని చెప్పేది కాదు ఇందులో హావభావాలుంటాయి, పాటలుంటాయి, నృత్యాలుంటాయి. అద్భుతమైన శారీరక, మానసిక ఉల్లాసాల్ని అందిస్తుంది’ అని చెప్పే దీప ఐదేళ్ల క్రితం పూర్తిస్థాయి స్టోరీటెల్లర్ అవతారమెత్తారు. కార్పొరేట్ కంపెనీల్లో కథా ప్రవాహం... ‘ఏ అంశంపైనయినా కథలు సృష్టించవచ్చు. మనం చెప్పాలనుకున్నదాన్ని మరింత బలంగా, ఆసక్తికరంగా చెప్పడానికి స్టోరీటెల్లింగ్ ఉపకరిస్తుంది’ అంటున్న దీప కార్పొరేట్ కంపెనీలనూ ఆకట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా డీపీఎస్, భారతీయవిద్యాభవన్స్ వంటి పేరున్న స్కూళ్లలో, లైబ్రరీల్లో, కల్చరల్ సెంటర్లలో, పబ్లిషింగ్ హౌస్‌లలో, మైక్రోసాఫ్ట్, జెన్‌ప్యాక్ వంటి కార్పొరేట్ సంస్థల్లో సైతం ఆమె స్టోరీటెల్లింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘దీనిని కేవలం ‘పిల్ల’కథలుగా మాత్రమే చూడకూడదు. కార్పొరేట్ కంపెనీ ప్రజెంటేషన్స్కూ, టీమ్‌బిల్డింగ్ వర్క్షాప్లకూ... ఏ రంగంలోని వారికైనా స్టోరీటెల్లింగ్ స్కిల్స్ ఉపయుక్తమే’అంటారామె. కథను మరింత జనరంజకంగా మలచడానికి ఆమె సంగీతాన్ని, నృత్యాన్ని దీనికి జతచేస్తున్నారు. గజ్జెలు ధరించి చిడతలు పట్టుకుని ఆమె హరికథాకాలక్షేపం సమర్పిస్తుంటే తోడు వాయిద్యాలు... ఆమె ఇద్దరు కొడుకులే. ‘మేమూ కథలు చెప్పే పనిలో పాలుపంచుకుంటాం అంటూ వారూ నాతో జతకలిశారు. నేను చెప్పింది కాదు’ అంటూ తన కుమారులు తనకు తోడైన నేపథ్యాన్ని వివరించారామె. టెలివిజన్లూ, ట్యాబ్లెట్ పీసీల కాలంలో తాతలు, బామ్మల ఒడినే బడిచేసి చెప్పిన కమ్మని కథల్ని తిరిగి మనకు చేరువ చేయాలని, మన విజయాలకు కథలను తోడుచేయాలని దీపాకిరణ్ ఆశిస్తున్నారు. ఏదేమైనా... అంతరించిపోతున్న కళకు ఆమె దీపంలా మారుతున్నారు. ఆ వెలుగులు మరింత మందికి ప్రేరణ కావాలని ఆశిద్దాం. స్టోరీటెల్లింగ్‌తో లాభాలెన్నో... మన ముందున్న వాళ్లని మన మాటలతో కళ్లతో, ఇంటరాక్షన్‌తో... వాళ్ల స్పందనకి మనం స్పందిస్తూ చేసే పూర్తిస్థాయి కమ్యూనికేషన్ మార్గమిది. ‘మీ పిల్లలు తెలివిగలవాళ్లు కావాలంటే వారికి కథలు చెప్పాలి. ఇంకా తెలివిగలవాళ్లు కావాలంటే మరిన్ని కథలు చెప్పాలి’ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంటారు. కథ వింటున్నపుడు పిల్లల ఊహాశక్తి మెరుగవుతుంది. జ్ఞాపకశక్తికి మేలు. వాస్తవానికి స్కూల్లో చెప్పే పాఠాలు పిల్లలకు సగం కూడా గుర్తుండవు. కానీ కథలో అన్నీ గుర్తుంచుకుంటారు. కథలో విన్న డైలాగ్‌లు నిజజీవితంలోనూ వినియోగిస్తారు. ఆంగ్లంలో కథలు వినడం వల్ల భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. ఓ బిజినెస్ ఈవెంట్లో అందించాలనుకున్న సందేశాన్ని సింపుల్‌గా, సరళంగా మార్చేస్తుంది. వ్యక్తుల హృదయాల్లోకి చొచ్చుకువెళ్లి వారి సబ్కాన్షియస్ మైండ్‌ను ప్రేరేపించి నిర్ణయాలను సైతం ప్రభావితం చేసే శక్తి దీనికి ఉంది. కథలు చెప్పేటప్పుడు... కదిలించేలా, శ్రోతలకు ఓ ఊహాజనిత ప్రపంచాన్ని చేరువ చేసేలా కథలు చెప్పాలి. దీనికి పెయింటింగ్, పేపర్ కట్టింగ్, ఆర్ట్, పాటలు... ఇంకేదైనా సరే మాధ్యమంగా ఎంచుకోవడం అవసరం. పిల్లల ఏకాగ్రతను మనవైపు నిలిచేలా చేసుకోవడం ఒక పట్టాన సాధ్యం కాదు కాబట్టి చిన్నారులకు చెప్పేటప్పుడు సమయోచిత వైఖరి అవసరం. కథ ఆధారంగా తమ ఊహల్ని నిర్మించుకోవడానికి వారికి తగిన సమయం ఇవ్వాలి. ప్రతి సందర్భానికీ అనుగుణమైన కథలున్నాయి. సబ్జెక్ట్‌కి, అంశానికి సంబంధించి కూడా ఉన్నాయి. థీమ్‌పై ఆధారపడి, ప్రజెంటేషన్‌లోని ముఖ్యాంశాలపైనా.. కథలు అల్లుకోవచ్చు. ఎత్తుగడ, ప్రధానాంశం, ముగింపు... ఈ మూడు దశలే ఏ కథకైనా ప్రాణం. ప్రారంభాన్ని, ముగింపును బట్టే స్టోరీటెల్లర్ నైపుణ్యం తెలుస్తుంది. అన్ని కళల్లానే స్టోరీటెల్లింగ్ కూడా కొందరికి జన్మతః వస్తే... మరికొందరు ప్రయత్నంతో నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తికీ కథలు చెప్పే సామర్థ్యం ఉంటుంది. అవసరమైన, తోచిన మార్గంలో కొందరు అది ఇప్పటికే నిరూపిస్తున్నారు కూడా. ఈ సామర్థ్యాన్నే మరింత మెరుగుపరచుకుంటే ప్రొఫెషనల్‌గా మారవచ్చు. శ్రోతలు ఎవరు? ఎంత వయసు వారు అనేదాన్ని బట్టి మనం చెప్పే శైలిలో మార్పు చేర్పులు అవసరం. కథాకాలక్షేపాలు షురూ... తాతల కాలం నాటి కథాకాలక్షేపాలు తిరిగి రానున్నాయా? నగరంలో స్టోరీటెల్లింగ్‌కు పెరుగుతున్న ఆదరణ గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ప్రసిద్ధ సాంస్కృతిక కేంద్రాలైన గోతెజంత్రం, లామకాన్, సప్తపర్ణి... వంటి చోట్ల వారాంతాల్లో ఏర్పాటవుతున్న ఈ కథా కార్యక్రమాలకు పెద్ద యెత్తున నగరవాసులు హాజరవుతున్నారు. ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్స్‌కు అమాంతం డిమాండ్ ఊపందుకుంది. ప్రపంచవ్యాప్త క్రేజ్... స్టోరీటెల్లింగ్‌కు నగరంలో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంటే... విదేశాల్లో మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్నెట్ వేదికగా ప్రపంచవ్యాప్త స్టోరీటెల్లర్స్ నెట్వర్క్ కూడా పనిచేస్తోంది. ఏటేటా సింగపూర్‌లో ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇందులో దీపాకిరణ్ కూడా పాల్గొన్నారు. ఈ స్టోరీటెల్లింగ్‌కి దుబాయ్‌లో మంచి మార్కెట్ ఉంది. అమెరికా, మలేషియా,హాంగ్‌కాంగ్‌లలో సైతం స్టోరీటెల్లింగ్ అంటే చెవి కోసుకుంటారు. మన నగరంలోనూ రెండేళ్ల నుంచీ స్టోరీటెల్లింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. సృజనాత్మకతకు మేలు... పుస్తకాలు, విజువల్ మీడియా కన్నా నోటి ద్వారా కథ చెప్పడం మరింత ప్రభావం చూపుతుంది. కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు తమ ప్రెజంటేషన్స్, స్పీచ్‌లలో స్టోరీటెల్లింగ్‌ను చేర్చడం ద్వారా తమ ప్రజెంటేషన్‌ను ప్రభావవంతంగా చేస్తున్నారు. ఈ ఒరవడి ఈ కళకు మరింత మంచి భవిష్యత్తు ఉందని సూచిస్తోంది. జీవితాంతం కథావ్యాసంగంలోనే ఉండాలని, కథాశక్తిని ప్రపంచానికి చాటాలని ఆశిస్తున్నాను. - దీపాకిరణ్ -
నక్సలిజం వద్దు
న్యూఢిల్లీ: నక్సల్స్ ఉద్యమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు నడుంకట్టింది. దీనికి గాను ఆయా ప్రాంతాల్లో రేడియో ద్వారా నక్సల్స్ వ్యతిరేక ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర హోం శాఖ తాజాగా రేడియో కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణకు గాను రూ.2.16 కోట్లను విడుదల చేసింది. మావోల ప్రభావానికి గ్రామీణులు, గిరిజనులు, నిరుద్యోగులు ప్రభావితం కాకుండా విధంగా కార్యక్రమాలను రూపొందించాలని ఆలిండియా రేడియోను ఇప్పటికే కోరిన ప్రభుత్వం, రానున్న 2 నెలల్లో ప్రసారం చేయాలని కూడా సూచించింది.