నక్సల్స్ ఉద్యమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు నడుంకట్టింది.
నక్సలిజం వద్దు
Published Mon, Sep 9 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
న్యూఢిల్లీ: నక్సల్స్ ఉద్యమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో కేంద్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు నడుంకట్టింది. దీనికి గాను ఆయా ప్రాంతాల్లో రేడియో ద్వారా నక్సల్స్ వ్యతిరేక ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర హోం శాఖ తాజాగా రేడియో కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణకు గాను రూ.2.16 కోట్లను విడుదల చేసింది. మావోల ప్రభావానికి గ్రామీణులు, గిరిజనులు, నిరుద్యోగులు ప్రభావితం కాకుండా విధంగా కార్యక్రమాలను రూపొందించాలని ఆలిండియా రేడియోను ఇప్పటికే కోరిన ప్రభుత్వం, రానున్న 2 నెలల్లో ప్రసారం చేయాలని కూడా సూచించింది.
Advertisement
Advertisement