దేశం కోసం సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఒకరు..
సమసమాజం కోసం విప్లవోద్యమంలో ఇంకొకరు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లిద్దరూ చెడ్డీ దోస్తులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరూ కలిసి పదో తరగతి దాకా చదువుకున్నారు. టెన్త్ పూర్తయ్యాక చెరో దారిలో నడిచారు. అది కూడా వర్గ శత్రువులుగా భావించే నక్సలిజం వైపు ఒకరు వెళ్తే, కేంద్ర పారామిలటరీ బలగాల్లోకి మరొకరు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఏడాది తేడాలో ఆ ఇద్దరూ అసువులు బాసారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం పెద్ద వెంకట్‌రెడ్డి, భూమవ్వల కుమారుడైన సిద్దారెడ్డి, అదే గ్రామానికి చెందిన కంది నాగమణి, శంకరయ్య దంపతుల పెద్ద కొడుకు సిద్దరాములు ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు.
స్కూలుకైనా, వాగులో ఈతకైనా, ఆటల్లో అయినా ఇద్దరూ ఇద్దరే. అలాంటి స్నేహితులు నూనూగు మీసాల వయసులో చెరో దారిని ఎంచుకున్నారు. సిద్దారెడ్డి అలి యాస్ సిద్దన్న సమసమాజం కోసమంటూ అప్పటి పీపు ల్స్‌వార్ ఉద్యమంలో చేరిపోయాడు. తర్వాత కాలంలో ఆ ప్రాంత ఆర్గనైజర్‌గా చురుగ్గా పాల్గొన్న సిద్దారెడ్డి 1998లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. సిద్దారెడ్డి స్నేహితుడు సిద్దరాము లు దేశ రక్షణ తన విధిగా భావించి 1990లో సీఆర్‌పీఎఫ్ జవా నుగా సెలెక్టయ్యాడు. ఆయన 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు మందుపాతర పేల్చిన ఘటనలో తనువు చాలించాడు.
సిద్దారెడ్డి స్తూపం పక్కనే సిద్దరాములు విగ్రహం...
చిట్యాల గ్రామంలోకి అడుగుపెట్టగానే ప్రధాన కూడలి వద్ద రోడ్డు పక్కన స్తూపం, దాని పక్కనే విగ్రహం ఉంటాయి. గ్రామంలో సిద్దారెడ్డితో పాటు చనిపోయిన మరికొందరి పేర్లతో అమరవీరు ల స్తూపం నిర్మించారు. కాగా జవాన్ సిద్దరాములు తల్లి కంది నాగమణి తన కొడుకు విగ్రహం పెట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రయ త్నించి.. చివరకు ఏర్పాటు చేసి గతేడాది మార్చి 27న ఆవిష్కరింపజేసింది. ఇద్దరి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడం యా దృచ్ఛికంగా జరిగినా, దోస్తులూ పక్కపక్కనే ఉన్నట్టుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment