Friendship day
-
‘సాక్షి’ కలిపింది ఈ ఇద్దరినీ...
రామచంద్రాపురం(పటాన్చెరు): తన చిన్న నాటి స్నేహితుడిని చూడాలని ఉందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించిన మనోగతాన్ని గతేడాది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రచురించింది. ఆ కథనమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయి మిత్రుడి ఆచూకీ తెలిసేలా చేసింది. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు మిత్రులు ప్రత్యక్షంగా కలుసుకుని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు నెలలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’దిన పత్రికతో 39ఏళ్లుగా తన బాల్యమిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణ గురించి వివరించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న సమయంలో తన బాల్యమిత్రుడైన ఎం.ఆనంద్ గురించి తెలిపారు. అతడిని ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఆ కథనం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైంది. ఆ కథనాన్ని స్నేహితులకు, ఇతర వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దానిని చూసిన ఆయన స్వగ్రామానికి చెందిన స్నేహితులు సైతం అన్వేషణ మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఎం.ఆనంద్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించి అతడిని చిరునామా తెలుసుకున్నారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి సంక్రాంతి పండుగ రోజున తన బాల్యమిత్రుడు ఆనంద్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘సాక్షి’లో వచ్చిన కథనం తన బాల్యమిత్రుడిని కలిసేలా చేసిందని, పత్రికతో పాటు అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన బాల్యమిత్రుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ ఫ్రెండ్‌షిప్‌డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
విశాఖపట్నం బీచ్‌లో ఫ్రెండ్షిప్ డే సందడి (ఫొటోలు)
-
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పిక్స్ షేర్ చేసిన మంచులక్ష్మి (ఫోటోలు)
-
కల సాకారం కోసం తపించే స్నే‘హితుడు’..
ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్న పీజీ.వింద (అష్టాచెమ్మా, సమ్మోహనం, జెంటిల్మన్..ఫేం) నిజమైన హితుడు అని చెప్పాలి. తన కల సాకారంతో పాటు మిత్రులందిరివీ కలిపి మన కలలను సాకారం చేయాలని ఆరాటపడతాడు. సిటీలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు నాకు సహాధ్యాయి. ఇద్దరికీ కళలపట్ల ఆసక్తి, ఏదో సాధించాలన్న తపన.. మా స్నేహబంధంతో పాటు బలపడుతూ వచి్చంది. బేగంపేట్‌లో ఓ చిన్న గదిలో అద్దెకుంటూ చాలీ చాలని డబ్బులతో బిస్కట్లు, సమోసాలతో కడుపు నింపుకుంటూ.. బహుశా ఇవన్నీ ఎదిగే క్రమంలో చాలా మందికి అనుభవమే కావచ్చు. కానీ.. మా లాంటి స్నేహం మాత్రం అతి కొద్దిమందికే దక్కింది అని సగర్వంగా చెప్పగలను. దర్శకులు శేఖర్ కమ్ములకు నన్ను పీజీ.వింద పరిచయం చేసి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇప్పించకపోతే.. బహుశా సినీరంగానికి దూరంగానే ఉండేవాడినేమో. నాలాంటి మరికొంత మంది స్నేహితుల కలల సాకారానికి కూడా సాయం అయ్యాడు. అందుకే ఎందరో ఫ్రెండ్స్.. కానీ కొందరే స్నే‘హితులు’.. అలాంటివారిలో బెస్ట్ పీజీ.వింద. –అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, తెలుగు సినీ దర్శకుడు -
‘ఆధునిక హైదరాబాద్’ ఆ ఇద్దరు మిత్రులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒక అందమైన నగరం. నాలుగు వందల ఏళ్ల చారిత్రక సోయగం. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరం ఇది. విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఒకే పాదు నుంచి పూచిన పూలై వికసించాయి. వైవిధ్యభరితమైన స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్ అంటేనే ఆతీ్మయమైన నగరం. ఎంతోమంది గొప్ప స్నేహితులు ఈ నేలపైన పుట్టిపెరిగారు. చరిత్రను సృష్టించారు. ఆదర్శప్రాయమైన స్నేహితులుగా నిలిచారు. నిజాం నవాబుల కాలంలో రాజులకు, ఉన్నతాధికారులకు మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండేవి. ఆధునిక హైదరాబాద్ నిర్మాణాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన దార్శనికుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ ఫక్రుల్ముల్క్ బహదూర్. ఇద్దరూ గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయారు. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కలిసి ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదర్శప్రాయమైన, అజరామరమైన వారి స్నేహంపైన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. అది స్వర్ణయుగం.. ఆ ఇద్దరి స్నేహం హైదరాబాద్ చరిత్రలో స్వర్ణ యుగం. మీర్ మహబూబ్ అలీఖాన్ ఆధునిక హైదరాబాద్ నగరానికి బాటలు పరిచిన గొప్ప పాలకుడు. ఆయన ఆశయాన్ని, ఆలోచనలను ఆచరణలో పెట్టిన పరిపాలనాదక్షుడు ఫక్రుల్ముల్్క. విధినిర్వహణ దృష్ట్యా ప్రధానమంత్రి. ఇద్దరి అభిరుచులు చాలా వరకూ ఒకేవిధంగా ఉండేవి. 1892 నుంచి 1901 ఫక్రుల్ముల్క్ ప్రధానిగా పనిచేశారు. ఇంచుమించు సమయసు్కలు కావడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. నాలుగు దశాబ్దాల పాటు ఆ స్నేహం కొనసాగింది.. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప ప్రతిభావంతుడైన ఫక్రుల్కు సంగీతం, సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. మహబూబ్ అలీఖాన్ కూడా గొప్ప సాహిత్యాభిరుచి కలిగిన వ్యక్తి. ఇద్దరూ కలిసి కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొనేవారు. ఉర్ధూ సాహిత్య వికాసం కోసం మహబూబ్ అలీ ఎంతో కృషి చేశారు. ఆధునిక విద్యకు శ్రీకారం చుట్టింది ఆయనే. ఎంతోమంది కవులను, కళాకారులను. పండితులను ప్రోత్సహించారు. ఇద్దరు థారి్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలిచారు. అనాథలు, నిస్సహాయులను ఆదుకొనేందుకు ఫక్రుల్ స్వచ్ఛంద సంస్థలకు ధారాళంగా విరాళాలు ఇచ్చేవారు. నిజాంకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా అనేక సమావేశాల్లో, విధానపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా... భావితరాల అవసరాలను, నగర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ‘విజన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఇద్దరూ కలిసి అనేక నిర్మాణాలను కొనసాగించారు. రహదారులను నిర్మించారు. కొత్త భవనాలను కట్టించారు. నాటి సంపన్నులు, నవాబుల పిల్లల ఉన్నత చదువుల కోసం 1887లోనే నిజామ్స్ కళాశాలను నిర్మించారు. అనంతర కాలంలో అన్ని వర్గాలకూ చేరువైంది. బాలికల విద్య కోసం మహబూబియా కళాశాల, హైకోర్టు భవనం, అసెంబ్లీహాల్, రైల్వే నిర్మాణం, టెలిఫోన్, బ్యాంకింగ్ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ వంటి కార్యక్రమాలు మహబూబ్ అలీ హయాంలో చేపట్టినవే. స్కూళ్లు, కళాశాలలు కట్టించారు. ఈ నిర్మాణాలన్నింటిలోనూ నిజాంకు ఫక్రుల్ కుడిభుజంగా నిలిచారు.ఎర్రమంజిల్ ఒక కళాఖండం.. ఆ ఇద్దరి అపురూపమైన, ఆదర్శప్రాయమైన స్నేహానికి చిహ్నంగా ఫక్రుల్ అద్భతమైన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కట్టించాడు. ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ రాజ మందిరం అద్భుతమైన మాన్యుమెంట్గా నిలిచింది. ఎత్తయిన ప్రదేశంలో ఈ అందమైన ప్యాలెస్‌ను కట్టించారు. 1890లో నిర్మాణ పనులు ప్రారంభించగా పదేళ్ల పాటు పనులు కొనసాగాయి. 1900లో ఈ భవన నిర్మాణం పూర్తయింది. దేశంలోని మొఘల్, కుతుబ్‌షాహీ వాస్తు శిల్పాన్ని, యురప్లోని విక్టోరియన్, గోథిక్ నిర్మాణ శైలిని మేళవించి ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మాంచారు. ఫక్రుద్దీన్ నివాస మందిరం ఇది. సభలు, సమావేశాలు, వేడుకలు, విందులు, వినోదాలతో ఈ ప్యాలెస్ నిత్యం సందడిగా ఉండేది. -
స్నేహం అజరామరం.. చరిత్రాత్మకం
యే దోస్తీ హమ్ నహీ తోడేంగే తోడేంగే దమ్ మగర్ తేరా సాత్ నా చోడేంగే.. అంటూ నాటి షోలే సినిమాలో ఆనంద్ బక్షి..రచించిన ఈ పాట మొదలుకొని.. ఆ మధ్య కాలంలో వచి్చన.. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం.. అంటూ భువన చంద్ర రచించిన ఈ పాట వరకూ స్నేహం గొప్పతనాన్ని తెలిపేవే.. ఇలాంటి అనేక పాటలు స్నేహంలోని మాధుర్యాన్ని తెలియజేస్తాయి.. నిజమే మరి నాటి నుంచి నేటి తరం వరకూ లవర్స్ లేని వాళ్లు ఉంటారేమో గానీ.. స్నేహితులు లేని వాళ్లు దాదాపు ఉండరనే చెప్పొచ్చు.. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరికి కులం, మతం, ప్రాంతం, భాష, ఆస్తి, అంతస్తు, పేద ధనిక వంటి బేధాలు అడ్డురావు.. మనం ఫోన్ చెయ్యగానే..‘అరేయ్ చెప్పరా మామా’ అనేంత క్లోజ్ నెస్ వారి మధ్య ఉంటుంది. స్నేహాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సరదాలూ అన్నీ వారితో పంచుకునే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. అలాంటి కొందరు దోస్తులకు సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక విషయాలు..విడదీయరాని స్నేహ బంధం..గోల్కొండ: రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని కార్వాన్, బహదూర్‌పురా ఎమ్మెల్యేలు కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ ముబీన్ అంటున్నారు. రోజు రోజుకు తమ స్నేహ బంధం బలపడుతుందని ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 40 ఏళ్ల క్రితం మజ్లీస్ కార్యకర్తలుగా కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అదే సమయంలో పాత నగరం ఆగాపూరా నుంచి మహ్మద్ ముబీన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చురుకైన యువ కార్యకర్తలుగా పార్టీ అధిష్టానం మెప్పుపొందారు. దివంగత మజ్లీస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీతో పాటు ప్రస్తుత అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటులుగా మారారు. అయితే ముందుగా ఎమ్మెల్యే పదవి వరించింది మాత్రం కౌసర్ మోహియుద్దీన్‌కు. వరుసగా మూడోసారి కౌసర్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ముబీన్ మొదటిసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మెహియుద్దీన్ సతీమణి గోల్కొండ వెస్ట్, నానల్‌నగర్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించగా ముబీన్ మాత్రం ఆగాపూరా నుంచి రెండుసార్లు, శాస్త్రీపురం నుంచి ఒకసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో గెలిచిన ఇద్దరూ ఒకే రోజు ఒకే సారి ఒకే సమయంలో ఆప్తమిత్రులుగా అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తాము ప్రాధాన్యం ఇస్తామంటారు. 40 ఏళ్ల తమ స్నేహ బంధంలో ఏనాడూ పొరపచ్చాలు రాలేదని వారు స్పష్టం చేశారు. -
చిన్ననాటి స్నేహితులు చెరో దారిలో నడిచారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వాళ్లిద్దరూ చెడ్డీ దోస్తులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరూ కలిసి పదో తరగతి దాకా చదువుకున్నారు. టెన్త్ పూర్తయ్యాక చెరో దారిలో నడిచారు. అది కూడా వర్గ శత్రువులుగా భావించే నక్సలిజం వైపు ఒకరు వెళ్తే, కేంద్ర పారామిలటరీ బలగాల్లోకి మరొకరు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఏడాది తేడాలో ఆ ఇద్దరూ అసువులు బాసారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం పెద్ద వెంకట్‌రెడ్డి, భూమవ్వల కుమారుడైన సిద్దారెడ్డి, అదే గ్రామానికి చెందిన కంది నాగమణి, శంకరయ్య దంపతుల పెద్ద కొడుకు సిద్దరాములు ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. స్కూలుకైనా, వాగులో ఈతకైనా, ఆటల్లో అయినా ఇద్దరూ ఇద్దరే. అలాంటి స్నేహితులు నూనూగు మీసాల వయసులో చెరో దారిని ఎంచుకున్నారు. సిద్దారెడ్డి అలి యాస్ సిద్దన్న సమసమాజం కోసమంటూ అప్పటి పీపు ల్స్వార్ ఉద్యమంలో చేరిపోయాడు. తర్వాత కాలంలో ఆ ప్రాంత ఆర్గనైజర్‌గా చురుగ్గా పాల్గొన్న సిద్దారెడ్డి 1998లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. సిద్దారెడ్డి స్నేహితుడు సిద్దరాము లు దేశ రక్షణ తన విధిగా భావించి 1990లో సీఆర్పీఎఫ్ జవా నుగా సెలెక్టయ్యాడు. ఆయన 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు మందుపాతర పేల్చిన ఘటనలో తనువు చాలించాడు. సిద్దారెడ్డి స్తూపం పక్కనే సిద్దరాములు విగ్రహం...చిట్యాల గ్రామంలోకి అడుగుపెట్టగానే ప్రధాన కూడలి వద్ద రోడ్డు పక్కన స్తూపం, దాని పక్కనే విగ్రహం ఉంటాయి. గ్రామంలో సిద్దారెడ్డితో పాటు చనిపోయిన మరికొందరి పేర్లతో అమరవీరు ల స్తూపం నిర్మించారు. కాగా జవాన్ సిద్దరాములు తల్లి కంది నాగమణి తన కొడుకు విగ్రహం పెట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రయ త్నించి.. చివరకు ఏర్పాటు చేసి గతేడాది మార్చి 27న ఆవిష్కరింపజేసింది. ఇద్దరి విగ్రహాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడం యా దృచ్ఛికంగా జరిగినా, దోస్తులూ పక్కపక్కనే ఉన్నట్టుంటుంది. -
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా!
సాక్షి, మచిలీపట్నం: స్నేహ బంధం మధురమైంది.. తియ్యనైంది. దీనికి కుల, మత, వర్గ, లింగ భేదాలు ఉండవు. తరాలు గడిచినా.. యుగాలు అంతరించినా తరగని పెన్నిధి స్నేహం. స్పందించే గుండె ఉండాలే కాని స్నేహం అనే పదం అనిర్వచనీయమైంది. బంధుత్వం కన్నా ఒక్కొక్కసారి రక్త సంబంధం కన్నా స్నేహ బంధమే విడదీయలేని అనుబంధంలా నిలిచిపోతుంది. నిజమైన స్నేహం త్యాగాన్నే కోరు కుంటుంది. మన పురాణాల్లో శ్రీకృష్ణ కుచేలుని స్నేహ బంధం ఇందుకు ప్రత్యక్ష సాక్షం. స్నేహం గొప్పతనం గురించి డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఓ పాటలో భార్యాభర్తల మధ్య స్నేహం విరబూస్తే ప్రేమ పరిమళిస్తుంది. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. తల్లి తండ్రీ.. బిడ్డల మధ్య స్నేహం నింగికి ఎగబాకితే వెన్నెల సౌధమై వికసిస్తుంది. అక్కా తమ్ముడు, అన్న చెల్లెళ్లు, కుటుంబ సభ్యులు.. ఆ మాటకు వస్తే ప్రజలందరూ స్నేహ భావంతో మెలిగితే సమాజంలో విద్వేషాలు, శతృత్వాలు తగ్గి కలిసి మెలిసి ఉండే తత్వం ఏర్పడుతుంది. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ కథనం.. నా సతీమణే నా బెస్ట్ ఫ్రెండ్ పాఠశాల దశ నుంచే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా కొరటగెరె గ్రామంలోని స్కూల్లో, ఇంటర్ తుముకూరులోని కాలేజీలో, బెంగళూరులో డిగ్రీ (బీబీఎం), ఎంబీఏ చదివేటప్పుడు, ఐఏఎస్ శిక్షణలో మంచి స్నేహితులు కలిశారు. నేను అందరితో స్నేహంగా, సరదాగా ఉంటాను. అయితే చిన్నప్పటి నుంచి మా నాన్న కృష్ణయ్య శెట్టి, అమ్మ మంజులాదేవి నాతో తల్లిదండ్రుల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవారు. సివిల్స్ శిక్షణ పూర్తి చేసుకున్న నాకు ఏపీ కేడర్ దక్కింది. దీంతో 2016 జూన్‌లో కృష్ణాజిల్లా ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యాను. 2017 ఏప్రిల్ 23న బెంగళూరుకు చెందిన వి.ఎన్. పృ«థ్వీ కల్యాణితో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా తరువాత ఆమే నాకు బెస్ట్ ఫ్రెండ్. విధి నిర్వహణలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇతర సందర్భాల్లోనూ అన్ని విధాలా అర్థం చేసుకుని సహకరిస్తుంది. పైగా ఏదైనా పనిభారం, ఒత్తిడి ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆమె నాకు అండగా నిలిచి, ధైర్యం చెబుతుంది. ఆమె ప్రైవేటు సెక్టార్లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా.. అవసరమైన సమయాల్లో సలహా ఇచ్చి, కష్టాల్లోనూ షేర్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్‌లా నిలుస్తుంది. అపురూపం వారి స్నేహంకంచికచర్ల: స్నేహానికి మించిన బంధం ఏదీ లేదని వారు నిరూపించారు. మండలంలోని గండేపల్లిలో 10 మంది విద్యార్థులు పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి అనంతరం నందిగామ కేవీఆర్ కళాశాలలో 2012లో ఇంట రీ్మడియెట్ చదివారు. కొంతమంది విద్యార్థులు డిగ్రీ, పీజీలు చదివారు. మరికొంతమంది పాలి టెక్నిక్, ఐటీఐ చదివారు. వీరంతా వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అయితే నేటికీ వీరంతా ఒకే కుటుంబంలాగా కలసి మెలసి ఉంటారు. వాళ్లల్లో ఎవరి కుటుంబంలో శుభకార్యాలు జరిగినా అందరూ తమతమ కుటుంబసభ్యులతో హాజరవుతారు. వీరి స్నేహానికి ఆర్థిక అసమానతలు, హెచ్చుతగ్గులు లేవు. వీరిలో బొక్కా శ్రీకాంత్ (ప్రయివేటు ఎల్రక్టీíÙయన్), బొక్కా మార్క్ (ఆక్వా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మచిలీపట్నం), సంగం దిలీప్(సాంసంగ్ యాడ్ ఏజన్సీ), మీసాల జయప్రకా‹Ù(డ్రైవింగ్ ఫీల్డ్), బొక్కా రాంబాబు (హయ్యర్ కంపెనీ సేల్స్ మేనేజర్, విశాఖపట్నం), మందా నాని( ప్రయివేటు ఎలక్ట్రికల్స్) బి.నరేంద్ర (రైల్వే ఎంప్లాయి), మార్కపూడి మాణిక్యరావు (ప్రయివేటు ఎంప్లాయి), ఐలపోగు గోపీ(ప్రయివేటు ఎంప్లాయి) వీరంతా వివిధ వృత్తులలో కొనసాగుతున్నారు. వీరి స్నేహబంధాన్ని గురించి గండేపల్లిలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఏడు లోకాల్లో ఎక్కడున్నా...ఈ ఏడుగురూ కలవాల్సిందే వారంతా చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. పెద్దయ్యాక అందరూ తలో రకంగా వారి వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నా...ఇప్పటికీ వారి స్నేహానికి విలువనిస్తూ ముఖ్యమైన శుభకార్యాల్లో కుటుంబసభ్యులతో కలసి అందరూ పాల్గొంటారు. ఏడు లోకాల్లో ఎక్కడున్నా ఈ ఏడుగురు కలవాల్సిందే...వారిలో ఒకరు కంచికచర్ల మండలంలో పంచాయతీ విస్తరణాధికారి(ఈఓపీఆర్డీ) బొజ్జగాని శ్రీనివాసరావు. తను చదువుకున్న రోజుల నుంచి ఉద్యోగం చేస్తున్నా కాని తన ఏడుగురు బాల్య స్నేహితులతో కలసి అంతే స్నేహంగా ఉంటారు. వీరి స్నేహ బృందం సభ్యులు రేగళ్ల శ్రీనివాసరావు(ఏఎస్ఐ గన్నవరం), శ్రీనివాసరావు( రైల్యే ఉద్యోగి,), ఆర్.శ్రీనివాస రావు(పొగాకు వ్యాపారి, విజయవాడ),జి.దాసు,(టైర్ల వ్యాపారం, వెంకటాపురం), పవన్‌కుమార్(అడ్వకేట్, హైకోర్టు). వీరంతా విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తిచేశారు. చదువులో ఒకరితో ఒకరు పోటీ పడేవారు. వీరంతా నేడు ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ వృత్తులతో కొనసాగుతున్నారు. అయితే నేటికి కుటుంబాలలో జరిగే శుభకార్యాలకు హాజరై సంతోషాల్లో పాలుపంచుకుంటున్నారు. వారిలో ఏ ఒక్కరికి ఆర్థికంగా సమస్య వచ్చినా మిగతా వారంతా సహాయ సహకారాలందిస్తారు. స్నేహం ఒకటే.. నిర్వచనాలు అనేకం స్నేహం పదం ఒకటే అయినా అనేక నిర్వచనా లు ఇస్తుంది. ఎలాంటి రక్త సంబంధం లేకుండా ఏర్పడే దృఢమైన బంధం స్నేహం. ఇందులో త్యాగం, నమ్మకం, ధైర్యం, ప్రేమ, భరోసా, నిజాయితీ ఇలా అనేక అంశాలు కలిసి ఉంటా యి. స్వార్థానికి, మోసానికి చోటు లేదు. ఆర్థికంగానో మరో విధంగానే సహాయం చేస్తేనే స్నేహం కాదు. కష్టసుఖాల్లో పాలు పంచుకుని, ధైర్యం చెప్పినా అది ఎంతో ఊరటనిస్తుంది. నా చిన్నప్పుటి మిత్రడు అబ్దుల్ సుభాన్. అతను స్కూల్ దశ నుంచే మంచి స్నేహితుడు. ఇప్పు డు నేను ఏఎస్పీగా పనిచేస్తున్న మచిలీపట్నంలో నే అతను డీఎస్పీగా పనిచేస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు కలిసినప్పుడు చెప్పుకుంటాం. అది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.– ఎస్వీడీ. ప్రసాద్, అడిషనల్ ఎస్పీ, కృష్ణా జిల్లా -
Friendship Day: ఓ.. మై ఫ్రెండ్ (ఫొటోలు)
-
ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి
‘పక్కింట్లో సుజాత నాతో కాలేజ్కొచ్చేది ఇప్పుడు ఎక్కడుందో’ ‘డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్‌లో చూశాను సంధ్యను. మళ్లీ కాంటాక్ట్ లేదు’ ‘పెళ్లయ్యాక రెండుమూడుసార్లు మాట్లాడింది మాలతి. చూసి ఎన్నాళ్లయ్యిందో’స్త్రీల మధ్య ఏర్పడే గాఢమైన స్నేహాలు ఎప్పుడో ఒకసారి తెగిపోవడమే జరుగుతుంది. ఫ్రెండ్షిప్ డే నాడు స్త్రీలు తమ ఆత్మీయ స్నేహితురాళ్లను తలుచుకోవడమే తప్ప కలుసుకునే వీలెక్కడ? కాని నాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి కదా.చిన్నప్పుడు ఆడపిల్లలు జట్టు కడతారు. అరుగుల మీద ఆటలాడతారు. స్కూల్ నుంచి రాగానే గబగబా స్నానాలు ముగించి కూడబలుక్కుని ట్యూషన్లకు నడుస్తారు. ఆదివారం వస్తే కలిసి పూలు కోసుకుంటారు. రేడియోలో ΄ాటలు... దూరదర్శన్‌లో చిత్రహార్లు ...స్నేహితురాలి కుటుంబంతో సినిమా కు వెళ్లడం లేదా తన కుటుంబంతో స్నేహితురాలిని తీసుకెళ్లడం... ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత కబుర్లు.. రహస్యాలు... వెంటబెట్టుకెళ్లి చేసే బట్టల సెలక్షన్లు... జామెట్రీ బాక్స్‌లో దాచిన చిరుతిండ్ల పంపకాలు... ఇవన్నీ గొప్ప ఆనందాలు... శాశ్వతం అనిపిస్తాయి. కాని కుదరదు. చాలామందికి ఆ స్నేహం అసంపూర్ణమే.వివాహం ఒక పునరావాసంపెళ్లయ్యాక స్త్రీ భర్త ఇంటికి చేరుతుంది. భర్తది అదే ఇల్లు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా. కాని అమ్మాయికి పెళ్లికి ముందు ఒక ఇల్లు. పెళ్లి తర్వాత ఒక ఇల్లు. పుట్టింటి వాళ్లు తమ కూతురి స్నేహాలను ప్రోంత్సహిస్తారు. ఆమె స్నేహితురాళ్లను తమ ఇంటి ఆడపిల్లల్లా చూస్తారు. వారికి ఎప్పుడూ స్వాగతం ఉంటుంది. కాని పెళ్లి అమ్మాయిని ‘పరాయి ఇంటి’కి చేరుస్తుంది. ఆ పరాయి ఇంట్లోకి పెళ్లికూతురి స్నేహితురాలు స్వతంత్రించి వెళ్లలేదు. అందుకు భర్త అనుమతి అత్తామామల అనుమతి కావాలి. అది అంత సులభం కాదు.కుటుంబమే ముఖ్యంస్త్రీ ఇంటి పట్టున ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా కుటుంబం మొదటి ప్రాధాన్యం అవుతుంది. పిల్లలు పుట్టాక స్త్రీ అన్నీప్రాధాన్యాలనూ వెనక్కు నెట్టి పిల్లల బాధ్యత ప్రథమంగా తీసుకుంటుంది. ఆమెకు సమయం చిక్కదు. ఆమె తన స్నేహితురాళ్లతో ఫోన్ మాట్లాడటం ఒకోసారి అభ్యంతరకరం కూడా కావచ్చు. ‘ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. కాని ఎప్పుడు చెప్పుకోవడం. ఎన్నోసార్లు కలవాలని ఉంటుంది. కాని ఎలా కలవడం?’అతడిలా ప్రయాణం కట్టడంభర్తకు విసుగు కలిగితే తన స్నేహితులను తీసుకొని అలా ఒక టూర్‌కు వెళతాడు. భార్య అలా తన స్నేహితురాళ్లతో వెళ్లలేదు. సామాజిక భద్రత సంగతి ఒక కారణమే అయినా అసలు అలాంటి వీలు కూడా ఉండదు చాలాసార్లు. తన స్నేహితులు వస్తే భార్యను పరిచయం చేసి వారికి టీలు కాఫీలు భోజనాలు భార్య చేత ఏర్పాటు చేయించే భర్త ‘నీ స్నేహితురాళ్లను నువ్వూ ఆహ్వానించుకోవచ్చు’ అని అనడం చాలా తక్కువగా జరుగుతుంది. విచిత్రమేమంటే మధ్య వయసు దాటాకే స్త్రీలు తమ పాత స్నేహితురాళ్లను కలిసే అనుమతి ΄÷ందుతారు. లేదా పిల్లల ద్వారా స్నేహాన్ని పునరుద్ధరించుకుంటారు.స్నేహం అవసరంప్రతి మనిషికీ స్నేహం అవసరం. భర్త, పిల్లలు, బంధువులు ఎందరు ఉన్నా ప్రతి స్త్రీకి తన చిన్ననాటి, కాలేజీ నాటి, ఊరి స్నేహితురాళ్లు తప్పక అవసరమే. వారితో పంచుకునే విషయాలు. వారి ద్వారా ΄పోందే ఓదార్పు, వారి నుంచి పోందే సలహాలు, వెళ్లబోసుకోవడాలు... ఇవన్నీ స్త్రీలు అలసిపోకుండా చూస్తాయి. కాని దురదృష్టవశాత్తు మన దేశంలో స్నేహమంటే పురుషుల స్నేహమే. స్నేహగాథలన్నీ వారివే. కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉండే స్త్రీ కూడా తన పాత స్నేహితురాలు కనిపిస్తే నవ్వే నవ్వు, కార్చే ఆనందబాష్పాలు పూర్తిగా ప్రత్యేకం. ఆ నవ్వు ఆనందబాష్పాలు వారికి దక్కాలని ఈ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా కోరుకుందాం. -
స్వచ్ఛమైన స్నేహం.. తీపి జ్ఞాపకాల సంతకం..(ఫొటోలు)
-
Happy Friendship Day 2024: పోవే..పోరా..అనుకునే టాలీవుడ్ బెస్ట్‌ఫ్రెండ్స్(ఫోటోలు)
-
Friendship Day: చెరగనిది మా స్నేహబంధం (ఫొటోలు)
-
వండర్లాలో ఫ్రెండ్షిప్ డే
సాక్షి, హైదరాబాద్: అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసే ఫ్రెండ్షిప్ డే వేడుకల కోసం నగరంతో పాటు వండర్లా కూడా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఆగస్టు 4న స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రతిష్టాత్మక అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. స్నేహానికి ప్రతీకగా ఆ రోజు వండర్లా టిక్కెట్ ఒకటి కొంటే మరొకటి ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఆన్లైన్లో మాత్రమే అందిస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి తెలిపారు. లైవ్ డీజే, స్పెషల్ ఈవినింగ్ జుంబా సెషన్లు, ఫన్ గేమ్స్, ఉత్కంఠ భరిత పార్క్ రైడ్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో కన్నా పార్క్‌లు ఎక్కువ సేపు తెరిచి ఉంటాయన్నారు. బుక్కింగ్ కోసం https://bookings.wonderla.com/ లేదా హైదరాబాద్ పార్క్ – 084 146 76333, +91 91000 63636ను సంప్రదించవచ్చు. -
స్నేహితుడితో ఓ సెల్ఫీ
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ఈ మాటల్ని వింటే పులకించి పోవాల్సిందే. అదీ స్నేహం గొప్పతనం. స్నేహానికి కులం, మతం, ప్రాంతం, భాష, లింగ భేదాలేవీ వుండవు. ఉన్నదంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమే. దోస్త్ అంటే వీడేరా అనిపించేంత బంధం. మరి ‘దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీ జాన్.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం’’ అనుకునేంత గొప్ప దోస్తులు మీ జీవితంలో ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి నిజమైన స్నేహితుడితో సంతోష క్షణాలను మళ్లీ గుర్తు చేసుకోండి. ఆగష్టు ఫస్ట్ సండే..(4వ తేదీ) స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ దోస్తుతో సెల్పీ దిగి సాక్షి. కామ్‌కు పంపించండి. ‘దోస్త్ మేరా దోస్త్’ సెల్పీ 9182729310 నెంబరుకు వాట్సాప్ చేయండి. ఆ ఫొటోలను సాక్షి డాట్ కామ్‌లో ప్రచురిస్తాం. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడమే కాదు.. ఈ జ్ఞాపకాన్ని కలకాలం పదిల పర్చుకోండి. ఫ్రెండ్షిప్ డే గురించి ఇవి మీకు తెలుసా?అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ ప్రతిపాదన 1958 జూలై 30న పరాగ్వేలో మొదలైంది. వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఆలోచనను తొలిసారి 1958, జూలై 20న పరాగ్వేలో స్నేహితులతో విందు సందర్భంగా డాక్టర్ ఆర్టెమియో బ్రాచో ప్రతిపాదించారు.ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశంలో ఆగస్టు నెలలోని తొలి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. -
కోలీవుడ్ స్టార్స్‌తో దర్శకుడి ఫ్రెండ్షిప్.. ఫోటో వైరల్
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఇది పాట మాత్రమే కాదు. జీవనామృతం. ఈ కాలంలో ప్రేమాభిమానాలను పంచుకోవాల్సిన కుటుంబ సభ్యులే ద్వేషాలను పెంచుకుంటున్నారు. అందరూ కాకపోయినా ఎక్కువ మంది కుటుంబాల్లో జరుగుతోంది ఇదే. అయితే ఒక్కోసారి గొడవలు పడ్డా, కొట్టుకున్నా కష్టకాలంలో అండగా నిలుస్తుంది స్నేహితులు మాత్రమే. కాగా సోమవారం స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంది. సినీ పరిశ్రమలోనూ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో తోపు అని సామాజిక మాధ్యమాల్లో విమర్శించుకోవడం పరిపాటే. తమిళ సినిమాలో ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ అభిమానులు ఈ విషయంలో తీవ్రంగా గొడవపడేవారు. అయితే రాను రానూ ఆ పరిస్థితి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఇలాంటి పోటీ తీవ్ర రూపు దాల్చింది. ఇప్పుడు అది కూడా సన్నగిల్లింది. తాజాగా రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య ఎవరు సూపర్ స్టార్? అన్న వివాదం నడుస్తోంది. అయితే హీరోలు మాత్రం తామంతా ఒకటేనని వివాదాలు వద్దని తమ అభిమానులకు హితవాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అభిమానులకు అది తలకెక్కడం లేదు. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు చుట్టూ ఎప్పుడు చూసినా మిత్ర బృందమే ఉంటుంది. స్నేహానికి అంత విలువనిచ్చే ఆయన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్లో 'ఇది చాలా సంతోషకరమైన స్నేహితుల దినోత్సవం. ప్రేమను వ్యాపింపజేయండి' అని పేర్కొన్నారు. అందులో నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, ఆయన తండ్రి గంగై అమరన్ తో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. అదేవిధంగా విజయ్, అజిత్‌తో కలిసి ఉన్న మరో ఫొటోను పోస్ట్ చేశారు. Happy friendship day🙏🏽❤️ spread love pic.twitter.com/TJ8Ab1HTEx — venkat prabhu (@vp_offl) August 6, 2023 చదవండి: మిగతా హీరోయిన్లకు సమంత కథ వేరే! -
స్నేహితుల దినోత్సవం నాడే.. ఈ స్నేహితులకు చివరి రోజు..
భద్రాద్రి: స్నేహితులతో కలిసి సంబురాలు జరుపుకున్న కొద్దిసేపటికే అందులోని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తోటి స్నేహితుల్లో విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాల్వంచ నవభారత్‌కు చెందిన ఏనిగ ఉపేందర్‌రెడ్డి కుమారుడు మధూకర్‌రెడ్డి (20), వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేట గ్రామానికి చెందిన దూడల శ్రీను కుమారుడు శివ (20)లు ఆదివారం సాయంత్రం బైక్‌పై నవభారత్ వైపు వెళ్తూ ఎన్ఎండీసీ కర్మాగారం సమీపంలో డివైడర్‌కు ఢీకొట్టారు. దీంతో ఇద్దరు ఎగిరి ముందుకు పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్, పట్టణ ఎస్ఐ బి.రాములు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సంబురాలు.. అంతలోనే విషాదం.. ఆదివారం సెలవు కావడంతో పాటు స్నేహితుల దినోత్సవం కాగా నవభారత్‌లో ఉంటున్న మధూకర్‌రెడ్డి మోటార్ సైకిల్‌పై పాల్వంచకు వచ్చాడు. కొద్దిసేపు స్నేహితులంతా కలుసుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు మద్యం కూడా సేవించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం మధూకర్‌రెడ్డి.. శివను మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో డివైడర్‌కు ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. మధూకర్‌రెడ్డి మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. శివ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.రాము తెలిపారు. -
డెలివరీ బాయ్‌గా మారిన జొమాటో సీఈవో! బైక్‌పై ఫుడ్ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిపోయారు. ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్‌పై ఫుడ్ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్నర్స్కు, రెస్టారెంట్ పార్ట్నర్స్కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై బయలుదేరారు. ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో 'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్నర్స్కు ఆహారం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్షిప్ డే చార్జ్లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX — Deepinder Goyal (@deepigoyal) August 6, 2023 -
వీళ్లది అలాంటి ఫ్రెండ్షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!
స్నేహితులు.. ఫ్రెండ్స్.. దోస్తులు.. ఏ భాషలో ఏ పేరుతో పిలిచినా పలికే వ్యక్తులు కొందరు ఉంటారు. కష్టసుఖాల్లో తోడుండటమే కాదు.. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమని చూపిస్తారు. అయితే టాలీవుడ్‌లోనూ ఇలాంటి దోస్తులు చాలామందే ఉన్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్రెండ్షిప్ విషయంలో మాత్రం వీళ్లు చాలా స్పెషల్. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి స్టోరీలు? (ఇదీ చదవండి: సర్కారు నౌకరి టీజర్.. ఎమోషనలైన సింగర్ సునీత) చిరంజీవి-నాగార్జున ఒకే టైంలో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి, నాగార్జున కోట్లాదిమంది అభిమానుల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే వీళ్లిద్దరి స్నేహం గురించి పెద్దగా చెప్పుకోరు. కలిసి సినిమాలు చేయలేదు గానీ ఒకరి మూవీకి మరొకరి సాయం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కలిసి టీవీ ఛానెల్, ఫుట్‌బాల్ టీమ్ కొనడం లాంటి బిజినెస్‌లు కూడా చేశారు. ఇప్పటికీ వీళ్ల బాండింగ్ అంతే స్ట్రాంగ్‌గా ఉంది. రామ్ చరణ్- జూ.ఎన్టీఆర్ టాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే చరణ్-తారక్ కచ్చితంగా గుర్తొస్తారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కలిసి నటించారు. ఒక్కటిగా ప్రమోషన్ చేశారు, హిట్ కొట్టారు, ఆస్కార్ వరకు వెళ్లారు. దీనంతటికీ వీళ్ల మధ్య ఉన్న బాండింగ్, ఫ్రెండ్షిప్ ప్రధాన కారణం. వీళ్లది అలాంటి ఇలాంటి దోస్తానా కాదు.. కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఔటింగ్‌కి వెళ్తారు. బోలెడన్ని క్రేజీ అడ్వెంచర్స్ చేస్తుంటారు. (ఇదీ చదవండి: రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?) రామ్ చరణ్ - రానా దగ్గుబాటి హీరో రానా.. టాలీవుడ్లో అందరికీ ఫ్రెండ్. కాకపోతే రామ్ చరణ్ మాత్రం రానాకు జిగిరి దోస్త్. చిన్నప్పుడు కలిసి చదువుకున్నప్పుడు మొదలైన ఈ స్నేహం.. స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కెరీర్, ఫ్యామిలీ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కలుస్తూనే ఉంటారు. కాకపోతే ఈ విషయం పెద్దగా బయటకు తెలియనివ్వరు. ప్రభాస్ - గోపీచంద్ 'వర్షం' మూవీలో హీరో విలన్‌గా ప్రభాస్, రానా అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మొదలవక ముందు నుంచే వీళ్లు ఫ్రెండ్స్. డార్లింగ్ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయినా సరే.. గోపీచంద్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఒకరి గురించి ఒకరు టీజ్ చేసుకుంటుంటారు. కొన్నాళ్ల ముందు 'అన్ స్టాపబుల్' షోలోనూ కలిసి సందడి చేశారు. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్) నితిన్ - అఖిల్ యంగ్ హీరో నితిన్.. అక్కినేని అఖిల్‌కి మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలోకి అఖిల్ రాకముందు నుంచే అఖిల్.. నితిన్ కు ఫ్రెండ్ అయ్యాడు. అది అలా కొనసాగుతూ వచ్చింది. అలానే అఖిల్ ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది నితిన్ కావడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలనప్పటికీ వీళ్ల స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదు. అల్లరి నరేశ్ - నాని యంగ్ హీరోలు అల్లరి నరేశ్, నాని స్నేహం గురించి పెద్దగా జనాలకు తెలీదు. నాని హీరోగా కెరీర్ మొదలుపెట్టే సమయానికి నరేశ్ ఆల్రెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే నరేశ్ తో ఏరా అనిపించుకునేంత క్లోజ్‌నెస్ నానికి ఉండేది. ఇప్పటికీ అది అలానే కొనసాగుతుంది. ఏరా అనే పిలుపు కాస్త బాబాయ్ అనేంత వరకు మారింది. వీళ్లతోపాటు రజినీకాంత్-మోహన్ బాబు, రామ్ చరణ్- శర్వానంద్, ఎన్టీఆర్ - మంచు మనోజ్, బాలకృష్ణ- శివరాజ్ కుమార్, మహేశ్ బాబు- వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్- సునీల్ కూడా చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. (ఇదీ చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున) -
Happy Friendship Day 2023: వెండి తెరపై ఈ స్టార్స్ దోస్తీ గురించి తెలుసా?
ప్రతి ఒక్కరి జీవిత పుస్తకంలో స్నేహానికి ముఖ్యమైన పేజీలు ఉంటాయి. స్నేహితులు లేనివాళ్లు దాదాపు ఉండరు. అసలు స్నేహం లేకుండా జీవితమే ఉండదంటే అతిశయోక్తి కాదు. కష్ట సుఖాల్లో దోస్త్ మేరా దోస్త్ అని చెప్పుకునే ఫ్రెండ్ ఒకరుంటే అంతకన్నా మించినది ఏం ఉంటుంది? కొన్ని సినిమాల్లో స్నేహానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇలా వెండి తెరపై ప్రస్తుతం కొనసాగుతున్న కొందరు స్టార్స్ దోస్తీ గురించి తెలుసు కుందాం. సలార్ స్నేహం అమ్మకు ఇచ్చిన మాట తాలూకు లక్ష్యం ఓ వైపు.. తన మిత్రుడి రక్షణ మరోవైపు... సలార్‌కి ఉన్న రెండు పెద్ద బాధ్యతలు ఇవి. ప్రభాస్ టైటిల్ రోల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సలార్’. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మకు ఇచ్చిన మాట, స్నేహితుణ్ణి రక్షించుకోవాల్సిన బాధ్యత.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే హీరో పాత్రను ప్రభాస్ చేస్తున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్కి సంబంధించి ఓ స్ట్రాంగ్ ఎపిసోడ్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారని, ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా ఉంటాయని సమాచారం. కాగా ‘సలార్’ కథలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. హాయ్ ఫ్రెండ్ స్నేహానికి ఏజ్‌తో, జెండర్‌తో పని లేదు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ఉండే స్నేహం నేపథ్యంలో చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’, వెంకటేశ్ ‘వసంతం’, సిద్దార్థ్ ‘ఓ.. మై ఫ్రెండ్’ వంటి చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో ఓ సినిమా చేరనుందని టాక్. అదే నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్ కీలక పాత్ర చేస్తున్నారు. శ్రుతీది నాని ఫ్రెండ్ క్యారెక్టర్ అని, వీరి కాంబినేషన్ సీన్స్ బాగుంటాయని టాక్. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల కానుంది. పుష్పగాడి ఫ్రెండ్ ‘ఆర్య’ సినిమాలో ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్. అలాగే ‘ఆర్య 2’లో ఫ్రెండ్‌షిప్‌లోని మరో కోణాన్ని చూపించింది ఈ కాంబినేషన్. ఇప్పుడు ‘పుష్ప’తో మరోసారి స్నేహాన్ని చూపించారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించగా, ఆయన ఫ్రెండ్ కేశవగా జగదీష్ నటించారు. పుష్పరాజ్, కేశవల మధ్య ఉన్న స్నేహం ఆడియన్స్‌కు భలే అనిపిస్తుంటుంది. సినిమాలో పుష్ప చేసే ప్రతి పనిలో కేశవ ఉంటుంటాడు. ఫ్రెండ్‌కు పుష్పరాజ్ ఇచ్చే ఇంపార్టెన్స్ అది. పుష్పరాజ్, కేశవల బాండింగ్‌ను ‘పుష్ప: ది రైజ్’లో కొంత చూశాం. అలాగే ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ వీరి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా స్నేహం ఓ ప్రధానాంశంగా తెరకెక్కుతున్నాయి. -
నేస్తమా.. సేవా హస్తమా..
శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. స్నేహితులు వందమంది అయినా తక్కువే అంటారు వివేకానందుడు. మనిíÙని అవసరంలో ఆదుకునే స్నేహ హస్తం కన్నా ప్రియమైనదేదీ లేదంటారు గురునానక్. నిజమైన మిత్రుడెవరో తెలిసేది కష్టకాలంలోనే అంటారు గాం«దీజీ.. ఎవరేమన్నప్పటికీ స్నేహాన్ని మించింది ఈ లోకాన లేదంటారు సినీ కవులు.. ఇంతటి విశిష్ట బంధాన్ని పటిష్టం చేయడానికి ఇప్పటి ఆధునిక కమ్యూనికేషన్ తోడ్పాటునందిస్తోంది. చిన్నప్పుడెప్పుడో మరిచిపోయిన మిత్రుడ్ని గుర్తు చేస్తోంది. తనతో చదువుకున్న వారందరినీ ఏకం చేస్తోంది.. సోషల్ మీడియా వేదికగా చాలామంది స్నేహితులవుతున్నారు. పుట్టిన రోజు వస్తే ఒకప్పుడు ఇంట్లోవారికి తప్ప మరెవరికీ తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు ఫేస్బుక్.. వాట్సప్‌లు వచ్చాక ఇలాంటి సందర్భాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికైనా సహాయం అందించడంలోనూ ఈ మిత్ర సమూహాలు ముందుంటున్నాయి. కొన్నాళ్లుగా టెన్తులోనో.. లేదా మరే సందర్భంలోనో కలిసి చదువుకున్న వారంతా ఏటా ఒకసారైనా కలిసి ఆనందం కలబోసుకుంటున్నారు. వీరి స్నేహ కలయికకు ఆధునిక సమాచారమే వారధిగా నిలుస్తోంది. ప్రత్తిపాడు: వారు చిన్ననాటి స్నేహితులు. వారు వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 35 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారిలో ఒకరు తెలంగాణ గవర్నర్ తమిళసై కాగా మరొకరు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయిని దేవన్ రేమల. వారిద్దరూ తమిళనాడు రాష్ట్రం చైన్నెలోని ఒకే ప్రాంతంలో ఉండేవారు. తమ స్నేహం గురించి రేమల ఏమంటారంటే... ప్రస్తుతం గవర్నర్ తమిళసై తండ్రి కుమారి అనంతన్, మా నాన్న దేవరాజ్ రాజకీయంగా సన్నిహితులు. తమిళసైతో కలిసి రాయపురంలో ఒకటో తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకూ చదువుకున్నాను. తమిళసై మెడిసిన్ చదివారు. నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. ఆమె గవర్నరుగా బాధ్యతలు చేపట్టారని తెలిసి చాలా సంతోషించాను. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ గవర్నర్‌కు మెయిల్ పంపాను. దీంతో ఆమె స్పందించారు. ఫలితంగా తమిళ సైను కలిసే అవకాశం ఇటీవల వచ్చింది. చూడగానే గవర్నర్ ఆప్యాయంగా పలుకరించారు. ఆనాటి ముచ్చట్లను జ్ఞప్తికి తెచ్చుకున్నామని రేమల అన్నారు. అంతస్తులు, హోదాలు తమ స్నేహానికి అడ్డు కాలేదన్నారు. ఔదార్యం... అ‘పూర్వ’ం మండపేట: ఆపన్నులకు ఆసరాగా నిలుస్తున్నారు మండపేట ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు. ఏటా రూ. 7.5 లక్షల నుంచి రూ. 8 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 75 మంది 2008లో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ పేరిట సంస్థగా ఏర్పడ్డారు. కొంత స్థిర నిధిని ఏర్పాటు చేసుకున్నారు. కోవిడ్ ముందు వరకు 13 ఏళ్ల పాటు ఏటా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు రూ. 2.5 లక్షల విలువైన పుస్తకాలు, స్టేషనరీని అందించేవారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాక ప్రభుత్వమే విద్యార్థులకు పుస్తకాలను అందిస్తుండటంతో మూడేళ్లుగా ప్రభుత్వ, మున్సిపల్ హైస్కూళ్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కలువపువ్వు సెంటర్లో ఏటా శ్రీరామ నవమి నుంచి జూన్ మొదటి వారం వరకు చల్లటి మజ్జిగను సరఫరా చేస్తున్నారు. ఇందుకు ఏటా రూ.4 లక్షలు వెచ్చిస్తున్నారు. సంస్థ కార్యదర్శి సంకా శ్రీనివాసరంగా ఏటా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి రూ. 1.5 లక్షల విలువైన బహుమతులు అందజేస్తున్నారు. ప్రస్తుతం బిక్కిన చక్రవర్తి అధ్యక్షునిగా ఉండగా కోశాధికారిగా పోతంశెట్టి సత్తిబాబు సేవలు అందిస్తున్నారు. -
మిత్రుడి పేరిట స్కూల్.. హ్యాపీ ఫ్రెండ్సిప్ డే..
కరీంనగర్: పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన యాదిలో చిన్ననాటి మిత్రులు ఏదైనా చేయాలని నిర్ణయించున్నారు. గాజుల శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూఎస్ఏ సిరిసిల్ల పట్టణ శివారులో 22 గుంటల స్థలం కొనుగోలు చేసి, రూ.30 లక్షలతో 2006లో దయానంద్ మెమోరియల్ స్కూల్ స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నారు. రాజీవ్‌నగర్ కార్మిక క్షేత్రంలోని పేదవాళ్లు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రస్తుతం 65 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ నిర్వహణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో ఎక్కువ మొత్తాన్ని శ్రీనివాస్ భరిస్తున్నారు. బోడ రవీందర్, సిరిసిల్ల తిరుపతి, కట్కం గోపి, పయ్యావుల శ్రీనివాస్, బి.రాము, బొడ్డు శ్రీధర్, లింగమూర్తి, సిరిసిల్ల తిరుమలేశ్, వూరడి రవి, కోడం సుధాకర్ పాఠశాల నిర్వహణలో భాగస్వాములవుతూ స్నేహానికి నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నారు. -
Viral Video: గుండెను తడిమే దృశ్యాలు!
-
వైరల్ వీడియో.. గుండెను తడిమే దృశ్యాలు!
స్నేహానికి కన్నా మిన్న లోకాన లేదన్నారు. చెలిమిని వర్ణించడానికి ఈ ఒక్క మాట చాలు. నా అన్నవాళ్లు ఎవరున్నా లేకపోయినా మంచి మిత్రుడు తోడుంటే జీవితాంతం భరోసాగా బతికేయొచ్చు. స్నేహం విలువను చాటి చెప్పడానికి ఆగస్టు నెలలో మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక ఫ్రెండ్షిప్ డే’ లాంటి ప్రత్యేకమైన రోజుల్లో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక ఫొటోలు, వీడియోలకైతే లెక్కేలేదు. అయితే అక్కడక్కడా గుండెను తడిమే హృద్యమైన దృశ్యాలు మన కంటబడుతున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్లో షేర్ చేసిన వీడియో హృదయానికి హత్తుకుంటోంది. (క్లిక్: వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..) విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలు.. వెల్లువలా వచ్చి ఓ మహిళను అప్యాయంగా ముద్దాతున్న దృశ్యాలు వీక్షకులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్న మూగజీవాలను ఆమె గుండెలకు హత్తుకోవడం చూస్తుంటే.. హృదయం పులకిస్తుంది. ఆమె ఎవరు.. ఎక్కడ, ఎపుడు జరిగిందనే వివరాలతో సంబంధం లేకుండా అలౌకిక భావనలోకి వెళ్లిపోతాం. మనం ఏది ఇస్తే అదే తిరుగొస్తుందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా! ఈ వీడియోను మీరూ చూడండి. -
ఆకట్టుకుంటున్న నాని 'దసరా' స్పెషల్ పోస్టర్
నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్‌తో మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే నేడు(ఆదివారం)ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట సందడి చేస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Dhoom dhaam dostaan Iraga maraga chedhaam ❤️🔥#HappyFriendshipDay #Dasara pic.twitter.com/0JrI1mybmf — Nani (@NameisNani) August 7, 2022 -
అల్లుకుంటున్న 'ఈ' స్నేహం.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ స్టోరీ!
అల్లుకుంటున్న ఈ స్నేహం స్నేహం... చెప్పేది కాదు.. చేసేది! వర్ణించే వీలు లేనిది.. ఆస్వాదనలో మాత్రమే అందేది! కష్టాన్ని తీర్చేది.. సంతోషాన్ని పెంచేది! మంచి.. చెడులు ఎంచకుండా ఎల్లకాలం వెంట ఉండేది! తప్పుల్ని కాస్తూ ఒప్పుల్లో నడిపించేది.. జనం మెప్పు అందించేది! దీని గుణం ఇంత గొప్పది కాబట్టే ఫ్రెండ్ లేని జీవన ప్రయాణం ఎడారిని తలపిస్తుంది! ఈ ప్రస్తావనకు సందర్భం ‘ఫ్రెండ్షిప్ డే’ అని అర్థమయ్యే ఉంటుంది! ఇరుగు,పొరుగు ఆవరణలు.. వీథులు.. బడులు.. కాలేజీలు.. ప్రయాణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా.. స్నేహం కుదరని చోటు లేదు ఈ లోకంలో. కరోనా వచ్చి మనిషిని ఏకాకిని చేద్దామని ప్రయత్నించింది. ఆ పరీక్షకూ నిలబడింది స్నేహం.. సోషల్ మీడియా ద్వారా వర్చువల్ రూపం తీసుకుని. నిజానికి ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్.. సోషల్ మీడియా పరిచయం అయిన నాటి నుంచే ఉనికిలో ఉంది. దాన్ని కరోనా బలోపేతం చేసింది. ఆ మాటకొస్తే కలం స్నేహాల కాలంలోనే వర్చువల్ ఫ్రెండ్షిప్లు ఊపిరి పోసుకునుంటాయి. ఉత్తరాలు.. లాంగ్ డిస్టెన్స్ స్నేహాలను పదిలంగా ఉంచాయి. వీటన్ని భర్తీ చేస్తోంది సోషల్ మీడియా! మార్పులు మనుషుల మీద ప్రభావం చూపిస్తున్నా తాను ఇగిరిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉంది స్నేహం. ఏ కొత్త మీడియం వచ్చినా దాన్ని తనకు వేదికగా మలచుకుంటోంది మనిషిని వదిలి వెళ్లిపోకుండా! ఈమెయిల్స్ మొదలు ఆర్కుట్.. ఫేస్బుక్.. ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్.. వాట్సాప్ ఇలా ఏ నెట్‌వర్క్‌లోనైనా ముందు ఇమిడిపోయింది స్నేహమే. బిజీ లైఫ్.. సాయంత్రాలు వీథి మలుపుల్లో.. ఇరానీ చాయ్ సెంటర్లలో.. థియేటర్లలో.. బాతాఖానీ కొట్టే వెసులుబాటును ఇవ్వలేకపోయినా ‘ఆన్లైన్’లో కావలసినంత స్పేస్ తీసుకుంటోంది ఫ్రెండ్షిప్. Hai.. Hwru, 5n అనే పొడి పొడి పదాల దగ్గర్నుంచి బాల్య స్నేహితుల గ్రూప్, స్కూల్, కాలేజ్ గ్రూప్స్, వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ గ్రూప్, ట్రావెల్ ఫ్రెండ్స్ గ్రూప్, కామన్ ఇంటరెస్ట్స్ ఫ్రెండ్స్ గ్రూప్ దాకా రకరకాల సమూహాల రూపంలో స్నేహం పలకరిస్తూనే ఉంది. నైతికంగా మద్దతిస్తూనే ఉంది. సోషల్ నెట్వర్క్ సిస్టమ్ వల్ల వ్యక్తిగతంగా కంటే వర్చువల్‌గా నడుస్తున్న స్నేహాలే ఇప్పుడు మనిషికి ఊరటనిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆన్లైన్ స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటున్న వాళ్లూ పెరిగిపోతున్నారు. అందుకే ఆన్లైన్ స్నేహం పాత జాన్ జిగ్రీలను బ్లెస్ చేస్తూనే కొత్త దోస్తుల జాబితానూ తయారు చేస్తోంది. ఫేస్బుక్ ద్వారా 40 ఏళ్లకు.. నలభై ఏళ్ల కిందట.. విడిపోయిన బాల్యమిత్రులు ఫేస్బుక్ ద్వారా తిరిగి కలుసుకున్న ఘటన ఇది. వాళ్లది ఇరవై ఏళ్ల స్నేహం. ఒకరికి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబసమేతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అడ్రస్ మిస్సయ్యింది. పైగా అప్పట్లో ఫోన్ సౌకర్యం కూడా పెద్దగా లేకపోవడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఎయిర్‌ఫోర్స్ మిత్రుడు రిటైర్మెంట్ తర్వాత ఇంట్లోనే ఉండిపోయాడు. ఒకరోజు.. ఫేస్బుక్లో తన చిన్ననాటి స్నేహితుడు తారసపడ్డాడు. రాజకీయవేత్తగా ఎదగడంతో సంతోషం వ్యక్తం చేసి.. ఫేస్బుక్లో అతని వాల్ మీద ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ‘ముంబై నుంచి జాకబ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడ’ని అవతలి స్నేహితుడికి చెప్పాడు. అతను ఎవరో కాదు టీఆర్ఎస్ నేత పద్మారావు. తనకు ఫోన్ చేసిన వ్యక్తి 40 ఏళ్ల కిందట దూరమైన తన బాల్యమిత్రుడు జాకబ్ అని తెలియడంతో పద్మారావు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ప్రాణ సఖి వేలు నాచియార్.. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన మహారాణి. బ్రిటిషర్స్ మీద మొట్టమొదటిసారిగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సాహసి. నిజానికి ఆమె చేసిన పోరును ప్రథమ స్వాతంత్య్ర సమరం అనొచ్చు. అయితే కుయిలీ అనే యోధ లేకపోతే వేలు నాచియార్ ఆ పోరాటం అంత సులవయ్యేది కాదు. కుయిలీ.. వేలు నాచియార్‌కు ప్రాణ స్నేహితురాలు. బ్రిటిష్ పాలకుల మీద స్నేహితురాలు తలపెట్టిన యుద్ధంలో ఆమెకు అండగా నిలిచి పోరాడింది. తన ఒంటి మీద నెయ్యి, నూనె పోసుకుని, నిప్పంటించుకుని మానవ బాంబుగా కదనరంగంలోకి దూకింది. తన స్నేహితురాలి కోటను కాపాడింది. భారతదేశ చరిత్రలో తొలి మానవ బాంబు కుయిలేనట. తుది శ్వాస వరకు.. కొప్పెరుంచోళుడు .. చోళుల తొలితరం రాజుల్లో ఒకడు. పిసిరంతైయార్ కవి. ఈ ఇద్దరూ తమ జీవితకాలంలో ఒకరినొకరు చూసుకోలేదు. కొప్పెరుంచోళుడి పరిపాలనకు ముగ్ధుడయ్యాడు పిసిరంతైయార్. అతని కవిత్వానికి ఆరాధకుడయ్యాడు కొప్పెరుంచోళుడు. కాలం గడుస్తోంది. కొప్పెురుంచోళుడి ఇద్దరు కొడుకులకు పరిపాలనా కాంక్ష పెరిగింది. తండ్రిని హింసించసాగారు. కొడుకులను ఏం చేయలేక.. అలాగని ప్రజల బాధ్యతను దుర్మార్గులైన తన కొడుకుల చేతుల్లో పెట్టలేక తాను ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు అన్నపానీయాలు మానేసి. తను ప్రాణత్యాగానికి సిద్ధమవుతున్నానని.. తానుంటున్న గదికి పక్కనున్న గదిలోకి వచ్చి ఉండాల్సిందిగా తన మిత్రుడు పిసిరంతైయార్కు వర్తమానం పంపాడు చోళరాజు. అయితే.. పిసిరంతైయార్ బయలుదేరి వచ్చేసరికే కొప్పెరుంచోళుడు ప్రాణాలు వదిలేశాడట. అప్పుడు ఆ కవి.. తనను తన స్నేహితుడు కూర్చోమన్న గదిలో కూర్చుని అతనూ అన్న, పానీయాలు మానేసి.. ప్రాణాలను వదిలేశాడట స్నేహితుడిలాగే. అలా చివరికి ప్రాణాలు విడిచే సమయంలోనూ ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. హిస్టరీ మెన్ జధునాథ్ సర్కార్, జీఎస్ సర్దేశాయి, రఘుబీర్ సింగ్.. ఈ ముగ్గురూ చరిత్రకారులు. చక్కటి స్నేహితులు. ఎలాంటి పొరపొచ్చాలకు తావీయని యాభై ఏళ్ల స్నేహ బంధం వాళ్లది. ముందు ఉత్తరప్రత్యుత్తరాల ద్వారానే వీళ్ల మధ్య స్నేహం కుదిరింది. నాలుగేళ్ల ఆ లెటర్ కరెస్పాండెన్స్ అనంతరం 1909లో సర్దేశాయి, సర్కార్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రఘుబీర్ సింగ్ కూడా తోడయ్యాడు. అప్పటి నుంచి ఈ ముగ్గురూ తరచుగా కలుసుకుంటూ చరిత్ర నుంచి ప్రాపంచిక విషయాల దాకా ఎన్నిటినో చర్చించుకునేవాళ్లు. ఈ చర్చలు, వాళ్ల స్నేహం భారతదేశ చరిత్రలో కొత్త కోణాలు శోధించడానికి.. సరికొత్త అధ్యాయాలను రచించడానికి దోహదపడ్డాయి. వాళ్ల మైత్రిని ‘హిస్టరీ మెన్’ అనే పుస్తకంగా మలచాడు టీసీఏ రాఘవన్ అనే రచయిత. జాన్ జిగ్రీస్ మహ్మద్ అలీ జిన్నా.. లోకమాన్య బాల గంగాధర్ తిలక్.. సిద్ధాంతాలు, అభిప్రాయ భేదాలకు అతీతంగా చక్కటి స్నేహం చేయొచ్చని నిరూపించిన మంచి మిత్రులు. తీరిగ్గా తిలక్ వాళ్లింట్లో .. పనిలో ఉన్నప్పుడు హైకోర్ట్‌లోని జిన్నా చాంబర్లో కూర్చుని ఈ ఇద్దరూ గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లట. ఆ సంభాషణల్లో వాళ్ల రోజూవారి పనుల నుంచి దేశ స్వాతంత్య్రం వరకు ఎన్నో విషయాలుండేవట. తిలక్‌తో తన స్నేహం గురించి తన దగ్గరి వాళ్లతోనే కాదు బహిరంగ సమావేశాల్లోనూ ప్రస్తావించేవాడు జిన్నా. తర్వాత కాలంలో జిన్నా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నప్పటికీ తిలక్‌తో స్నేహంలో మాత్రం రవ్వంత తేడా కూడా రానివ్వలేదట. మైత్రీ మధురిమలు జార్జ్ హ్యారిసన్.. పండిట్ రవిశంకర్ల స్నేహం చెప్పుకుని తీరాల్సిందే. ఏషియన్ మ్యూజిక్ సర్కిల్ ద్వారా పండిట్ రవిశంకర్ పరిచయమయ్యాడు హ్యారిసన్‌కు. అప్పుడు మొదలైన స్నేహం.. మ్యూజిక్ ఫ్యూజన్‌గా సంగీతాభిమానులకే కాదు.. యావత్ స్నేహ ప్రపంచానికి మైత్రీ మధురిమలను పంచింది. తోడు నీడ ఇందిరా గాంధీ, పుపుల్ జయకర్.. ఇద్దరూ అలహాబాద్‌లోనే పుట్టి.. కలసి పెరిగారు. కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖంలో, సంతోషంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు వీడలేదు. ఇందిరా గాంధీ రాజకీయ జీవితం వాళ్ల స్నేహాన్ని ఏ మాత్రం చెక్కుచెదరనీయలేదు. ఇందిరాగాంధీ విజయాల్లోనే కాదు ఆపత్కాలంలోనూ ఆమె వెన్నంటే ఉంది జయకర్. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలోనూ ఇందిరాగాంధీనే సపోర్ట్ చేసింది. తన ఆత్మకథ రాయమని చాలాసార్లు జయకర్‌ను కోరిందట ఇందిరా. ఎందుకో రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందట. చివరకు ఇందిరా గాంధీ చనిపోయాక ఆమె బయోగ్రఫీ రాసింది పుపుల్ జయకర్. బాబాయ్.. అబ్బాయ్ స్నేహం.. కుల, మత, ప్రాంత, కలిమిలేములకు మాత్రమే కాదు .. వయసు క్కూడా అతీతమే అనిపిస్తుంది రతన్ టాటా, శంతను నాయుడుల ఫ్రెండ్షిప్ చూస్తే. ఈ ఇద్దరి మధ్య స్నేహాన్ని కుదిర్చిన కామన్ పాయింట్ మూగజీవాల పట్లæ ఇద్దరికీ ఉన్న ప్రేమ. స్ట్రే డాగ్స్ కోసం శంతను నాయుడు చేసిన వర్క్ గురించి తెలిశాక అతనికి ఈ మెయిల్ పంపాడు రతన్ టాటా. బదులు ఇచ్చాడు శంతను. అలా వాళ్ల ఫ్రెండ్షిప్ మొదలైంది. కార్నెల్ యూనివర్శిటీలో శంతను కాన్వొకేషన్‌కు రతన్ టాటా హాజరయ్యారు. చిత్రమేంటంటే రతన్ టాటా ఆ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఈతరం ప్రతినిధి శంతను.. నాటి విలువల మనిషి రతన్ టాటాకు సాంఘిక మాధ్యమాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడట రతన్ టాటా. బాధ్యతలను పంచుకున్నాడు గాంధీ దక్షిణాఫ్రికా జీవితం ఆయన బయోగ్రఫీలో భాగంగానే కాదు.. చాలా కథలుగానూ ఎంతో ప్రచారంలో ఉంది. అయినా ఆయనకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలున్నాయి ఇంకా. వాటిల్లో ఒకటే హెన్రీ పోలాక్, మిల్లీ దంపతులతో ఆయనకున్న స్నేహం. విప్లవభావాలున్న యూదుడు హెన్రీ. క్రైస్తవాన్ని పాటించే స్త్రీవాది మిల్లీ. ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పరస్పర విరుద్ధ మతాలు వీళ్ల పెళ్లికి అడ్డం పడ్డాయి. ఇరు పెద్దలూ ఒప్పుకోలేదు. కోకపోగా మిల్లీని మరచిపోవడానికని హెన్రీని దక్షిణాఫ్రికా పంపించారు అతని పెద్దలు. జోహాన్నెస్ బర్గ్‌లోని ఓ శాకాహార హోటల్లో హెన్రీకి గాంధీ పరిచయమయ్యాడు. అనతికాలంలోనే అది స్నేహంగా మారింది. గాంధీతో తన గోడంతా వెళ్లబుచ్చుకున్నాడు హెన్రీ. మిల్లీ తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత తీసుకున్నాడు గాంధీ. ఒప్పించి మిల్లీని దక్షిణాఫ్రికా రప్పించాడు. హెన్రీ, మిల్లీ పెళ్లికి ప్రధాన సాక్షిగా సంతకం కూడా చేశాడు గాంధీ. దాంతో హెన్రీ దంపతులకు గాంధీ అప్తమిత్రుడుగా మారాడు. ఎంతలా అంటే మన దేశ స్వాతంత్య్ర సమరంలో గాంధీ జైల్లో ఉన్నప్పుడు గాంధీ మొదలుపెట్టిన ఉద్యమాలను తాను ముందుండి నడిపించాడు హెన్రీ. ఫ్రెండ్.. గురు, గైడ్ అన్నీ! సోషల్ మీడియా ఒకరకమైన గ్రూప్ థెరపీ సెషన్. ఎలాంటి భావోద్వేగాలను అయినా.. సోషల్ మీడియాలో పంచుకుంటే ఊరట దక్కుతోంది అంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే వాళ్లు. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ మాధ్యమంలో లేదా ఆ గ్రూపుల్లో జరిగే చర్చలు.. వచ్చే జవాబులతో ఎంతోకొంత ధైర్యం, ఉపశమనం కలుగుతుందంటారు వాళ్లు. కరెంట్ టాపిక్స్ దగ్గర్నుంచి వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ విషయాలు, వ్యాపారలావాదేవీలు, ఆరోగ్యం ఒక్కటేంటి సమస్త అంశాల మీదా సలహాలు, సూచనలు దగ్గర్నుంచి అనుభవాలు, అభిప్రాయాల దాకా అన్నీ అందుతున్నాయి. ఏదైనా విషయం మీద మద్దతు దొరకాలన్నా.. అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు సోషల్ మీడియానే ఫ్రెండ్, గురు, గైడ్, ఫిలాసఫర్ అన్నీ! ‘రోజూ కలిసే ఫ్రెండ్స్ కంటే.. సోషల్ నెట్వర్క్ స్నేహాలే మెదళ్లకు పదును పెట్టిస్తున్నాయి. చర్చల ద్వారా ఎక్కువ మందిని స్నేహితులను తయారు చేసుకునేందుకు చాన్స్ ఇస్తున్నాయి’ అంటున్నారు ఆన్లైన్ ఫ్రెండ్ షిప్‌ను ఇష్టపడేవారు. స్నేహ బంధాన్ని బలంగా ఉంచడంలో సోషల్ మీడియా చేస్తున్న మరో సాయం.. పాత స్నేహాలను పైకి తేవడం. ఎప్పుడో విడిపోయిన స్నేహితులు, బంధువులు సైతం దీని ద్వారా తిరిగి దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాలోని అకౌంట్లలో సెర్చింగ్ ద్వారా, ఫోన్ నెంబర్లను సంపాదించడం ద్వారా తిరిగి ఆ పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటు న్నారు. పలుచబడ్డ బంధాలను మళ్లీ బలోపేతం చేసుకుంటున్నారు. కామన్ స్నేహితులు లేదంటే గ్రూపుల ద్వారా మళ్లీ పాత స్నేహాలను.. పాత రోజుల్ని గుర్తు చేసుకునే అవకాశం కలుగు తోంది. గెట్ టు గెదర్, ఔటింగ్స్ వంటివన్నీ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారానే నిర్వహించుకుంటున్నారు. అయినా అప్రమత్తం సోషల్ మీడియాను వాడే ప్రతీ వందలో 80 మంది.. దీన్నొక ఫ్రెండ్షిఫ్ ప్లాట్‌ఫామ్‌గానే అభివర్ణిస్తున్నారు. ఆన్లైన్ స్నేహితులు.. తమ క్రియేటివిటీకి తోడుగా ఉంటున్నారని కొందరు, గ్రూపు స్నేహాలు పెంపొందడానికి వీలుగా ఉంటోందని ఇంకొందరు, కష్టకాలంలో మద్దతు దొరుకుతోందని మరికొందరు చెబుతున్నారు. నాణేనికి రెండు వైపులున్నట్లే.. ఆన్లైన్ స్నేహాలకూ రెండు కోణాలు ఉన్నాయి. వాస్తవ ప్రపంచ స్నేహంలోనే కాదు.. వర్చువల్ ఫ్రెండ్‌షిప్‌లోనూ గొడవలు సహజం. మోసాలకు, వెన్నుపోట్లకు ఆస్కారం ఎక్కువే. అలాగని సోషల్ మీడియా చెడ్డది కాదు. ఆన్లైన్ స్నేహాలన్నీ మోసాలే కావు. అయితే అప్రమత్తం గా ఉండడం మాత్రం అవసరమే. అనుమానా స్పదంగా ఉన్న వ్యక్తులను, పూర్తి అపరిచితులను ఫ్రెండ్స్లిస్ట్లోకి చేర్చుకోకపోవడమే ఉత్తమం. అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను ఎంత తక్కువగా షేర్ చేసుకుంటే అంత మంచిది. కనిపించిన వాళ్లందరినీ కలుపుకుని వెళ్లడమే సోషల్ నెట్వర్క్ సిస్టం. నమ్మకాన్ని, వంచనను వేరు చేసే గుణం దానికి లేదు. అసలు అది దాని ప్రోగ్రామే కాదు. కాబట్టి మనమే ఆ జాగ్రత్త తీసుకోవాలి. స్నేహానికి చేయి చాచాలి.. స్నేహితులను అండగా ఉండాలి. కానీ మోసాన్ని పసిగట్టే పరిశీలనను అలవర్చుకోవాలి. అదీ స్నేహమే నేర్పిస్తుంది. నేర్చుకోవాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!! ∙భాస్కర్ శ్రీపతి -
మీదీ ఇదే కథా... ఇంకోసారి గుర్తుచేసుకొని ముసిముసిగా మురిసిపొండి!
సాక్షి, హైదరాబాద్: స్నేహితుల దినోత్సవం అంటే అందరికీ పండగే. చిన్ననాటి స్నేహితులు, టీనేజ్ ఫ్రెండ్షిప్ అన్నీ అలలు అలలుగా మన కళ్లముందు కదులుతాయి. ఈ అనుభూతి ఏ ఒక్కరికో మాత్రమే సొంతం కాదు. కుల,మత, పేద, ధనిక ప్రాంత, లింగ భేదం లేకుండా అందరిలోనూ, అందిరికీ కలిగే మధురమైన అద్భుతమైన అనుభూతి స్నేహం. ఇదీ అని వర్ణించలేం. ఎవరి ప్రత్యేకత వారిదే.. అందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు!! Happy friendship day. pic.twitter.com/eotbUSQFdB — Charan (@charan_tweetz) August 7, 2022 మన దేశంలో ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీ. ఫ్రెండ్షిప్ డే అనగానే శుభాకాంక్షలు చెప్పుకోవడం, పార్టీలు చేసుకోవడం చాలా కామన్. ఈ సందర్భంగా అనేక హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే , కొటేషన్లు, విషెస్ , వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. ఈ సందర్భంగా అలాంటి ఫన్నీ వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి! అభిప్రాయ బేధాలు వచ్చినా.. కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. ఎండ్ ఆఫ్ ద డే.. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. #HappyFriendshipDay pic.twitter.com/hs3ESASVRO — Harish M (@27stories_) August 7, 2022 A good friend multiplies our happiness and divides our sorrow. Grateful to all the wonderful friends in my life ❤! Happy Friendship Day!#friendsforever #friendshipday #friendshipday2022 #happyfriendshipday❤️ #friends #manjulaghattamaneni pic.twitter.com/wBIPbsbYol — Manjula Ghattamaneni (@ManjulaOfficial) August 7, 2022 Friends fight but don't hurt ........💝 #HappyFriendshipDay #FriendshipDay #FriendshipDay2022 pic.twitter.com/vRYa2UnPuq — Suchitra Das (@Suchitra_Dass) August 7, 2022 #FriendshipDay Friends fight but don't hurt ........💝 #CaseTohBantaHai#HappyFriendshipDay #FriendshipDay2022 pic.twitter.com/Kegrh2RALW — Sanju Singh (@Iamsanjusingh1) August 7, 2022 -
Friendship Day: మైత్రి.. ఓ మాధుర్యం.. అండగా ఉంటూ, ఆదర్శంగా నిలుస్తూ..
సాక్షి, కరీంనగర్: బాల్యం.. స్నేహం ఎవరికైనా తీయని జ్ఞాపకం. విద్యార్థి దశలో మొదలైన స్నేహం.. జీవితంలో కలిసి సాగడం నిజంగానే అరుదు. అదో అదృష్టం కూడా. బతుకు బాటలో స్నేహ బంధానికి మించింది లేదు. స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు.. ప్రాణ స్నేహితులు చాలా అరుదుగా ఉంటుంటారు. స్నేహం తప్ప మరేదీ ఆశించకుండా కొనసాగే బంధాలు మాత్రమే కలకాలం ఉంటాయి. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఫ్రెండ్‌షిప్‌డే రోజున కేక్ కట్ చేస్తున్న స్నేహితులు అతివల ‘స్నేహం’ కోరుట్ల: స్నేహానికి వయో..లింగ భేదం లేదు. కోరుట్ల పట్టణానికి చెందిన ఓ పదిహేను మంది మహిళలు 15 ఏళ్లుగా తమ స్నేహ బంధాలను కొనసాగిస్తున్నారు. తమ గ్రూపునకు స్నేహం అనే పేరు పెట్టుకుని దాన్ని సార్థకత చేసుకునే దిశగా ఒకరికొకరు కష్టసుఖాల్లో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. కోరుట్లకు చెందిన గృహిణులు గరిపెల్లి మాధవి, కంటాల అనిత, రమాదేవి, సునీత, లీల తదితరులు పదిహేనేళ్లుగా ప్రెండ్స్‌గా ఉన్నారు. వీరంతా ఎవరి ఇంట్లో ఏలాంటి శుభ కార్యాలు ఉన్నా కలిసికట్టుగా ఒకరికొకరు సాయంగా పనులు చేసుకుంటారు. అంతే కాదు..గ్రూపు సభ్యుల్లో ఎవరికి కష్టం వచ్చినా తమకు తోచిన రీతిలో అవసరాలు తీర్చడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతీ ఫ్రెండ్షిఫ్ డే రోజున తమ అనుబంధాన్ని బలీయం చేసుకునేందుకు అంతా కలిసి కేక్ కట్ చేసి ఏడాదికి ఒకరి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారు. నగదు అందజేస్తున్న క్లాస్మేట్స్ మిత్రుడికి అండగా క్లాస్మేట్స్ రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం ఇటీవల అనారోగ్యం బారిన పడగా వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఈక్రమంలో తోటి మిత్రులైన క్లాస్మేట్స్ (2000–01 ఎస్సెస్సీ బ్యాచ్, రుద్రంగి జెడ్పీ హైస్కూల్) వైద్య ఖర్చులకు రూ.50వేలు ఆర్థికసాయం చేసి స్నేహభావాన్ని చాటుకున్నారు. నేను, ఎమ్మెల్యే ప్రాణ స్నేహితులం కోల్‌సిటీ(రామగుండం): రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నేను ప్రాణ స్నేహితులం. గోదావరిఖని తిలక్‌నగర్ డౌన్లో ఒకే వాడలో ఉంటాం. మేం బంధువులమైనా చిన్నప్పటి నుంచి పీజీ వరకు కలిసే చదివాం. మా ఇద్దరి మధ్య ఏరోజూ గొడవ జరగలేదు. చందర్‌కు చాలా ఓపిక. గతంలో మా ఏరియాలో కౌన్సిలర్‌గా గెలిచేందుకు ఇద్దరకీ అవకాశం ఉండడంతో చందర్ కోసం నేను పోటీ చేయకుండా త్యాగం చేశా. అదే ఏరియాలో ఇప్పుడు నేను కార్పొరేటర్. – పెంట రాజేశ్, 37వ డివిజన్ కార్పొరేటర్, రామగుండం కులమతాలకు అతీతం కోరుట్ల: స్నేహానికి కులమతాలు అడ్డుకాదు. ఇదే కోవలో కోరుట్లకు చెందిన ఖాలిక్ పాషా, ముక్క శ్రీనివాస్ చిన్ననాటి నుంచి స్నేహితులు. పది నుంచి ఇంజినీరింగ్ వరకు కలిసి చదువుకుని ప్రస్తుతం ఖాలీక్ పాషా దక్షిణాఫ్రికాలో జాబ్ చేస్తుండగా, శ్రీనివాస్ అమెరికాలో పనిచేస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శనివారం ఇద్దరు కోరుట్లలో కలుసుకుని తమ స్నేహ జ్ఞాపకాలు పంచుకున్నారు. ఖాలిక్ పాషా, శ్రీనివాస్ ముగ్గురు వైద్యుల ముచ్చటైన స్నేహం సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణ రావు, పి.చంద్రశేఖర్ మంచి స్నేహితులు. 1984–85లో మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో వీరి స్నేహం మొదలైంది. ముగ్గురి సొంత జిల్లాలు వేరైనా సిరిసిల్లలో స్థిరపడ్డారు. ప్రభుత్వ డాక్టర్లుగా నిజాయితీగా పని చేశారు. వీరి సతీమణులు శోభారాణి, లీలా శిరీష, శ్రీవాణిలు సైతం సిరిసిల్ల గైనాకాలజిస్ట్ డాక్టర్లుగా స్థిరపడ్డారు. రెండున్నర దశాబ్దాలుగా వైద్యసేవలు అందిస్తున్నారు. సాయికిరణ్, నరేశ్, సంతోష్, కరుణాకర్ మంచి స్నేహితులను వదులుకోవద్దు పెద్దపల్లి: మంచి స్నేహితులు లభించడంతో మంచి జీవితాన్ని పొందవచ్చు. అమ్మానాన్న జన్మను ఇస్తే స్నేహితులు మనకు బంగారు బాట చూపిస్తారు. మంచి స్నేహితులను వదలుకోకూడదు. రాజకీయాల్లో ఉన్న సమయాల్లో నా మిత్రుడు (ప్రస్తుతం అడిషనల్ డీజీపీ శ్రీనివాసరెడ్డి) నన్ను చదువుకోమని ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతో నేను రాజకీయాలు వీడి ఉన్నత చదువులు చదివిన. యువత చెడు స్నేహాలు చేయొద్దు. మనకున్న మంచి స్నేహితులను విడిచిపెట్టొద్దు. – లక్ష్మీనారాయణ,అదనపు కలెక్టర్, పెద్దపల్లి స్నేహితులే నా ప్రాణం పెద్దపల్లికమాన్: స్నేహితుల సహకారంతోనే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థాయికి వచ్చాను. చిన్ననాటి బాల్య మిత్రులు ముక్తార్ ఫ్యాషన్– డిజైనర్, సతీశ్– టీచర్, బాలు– బిజినెస్ చేస్తూ నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించారు. రక్త సంబంధాలే దూరమవుతున్న ఈ కాలంలో నేను చేసే పనిలో అన్నీ వారై నా విజయంలో పాలు పంచుకున్నారు. జీవితాంతం వారు న్యాయవాద వృత్తిలో నాతోపాటు ఉండాలని ఈ విద్యా సంవత్సరంలో వారిని ఎల్ఎల్బీ చదివిస్తున్నా. – పి.రాకేశ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పెద్దపల్లి పాతికేళ్ల స్నేహబంధం వేములవాడ: వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు.. కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ప్రజాసేవలో తరిస్తున్నారు. వేములవాడ మున్సి పల్ 3వ వార్డు కౌన్సిలర్‌గా నిమ్మశెట్టి విజయ్, 27వ వార్డు కౌన్సిలర్‌గా గోలి మహేశ్ సేవలందిస్తున్నారు. వేములవాడ పట్టణంలో 1 నుంచి 12వ తరగతి వరకు గీతా విద్యాలయంలో చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కలిసే నడిచారు. రాష్ట్రం సాధించుకున్న అనంతరం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కౌన్సిలర్లుగా గెలి చారు. నాటి నుంచి నేటి వరకు అరేయ్... ఒరేయ్ అంటూ భుజాలు తడుముకుంటూ దోస్తానా చలాయిస్తున్నా రు. అంతేకాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ 30కి పైగా రక్తదానాలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. క్లాస్మెట్లు.. జాబ్మెట్లు బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రానికి చెందిన మాడిషెట్టి సాయికిరణ్, వాసాల సంతోష్, మోగులోజి నరేశ్, సంబ కరుణాకర్‌లు స్థానిక హైస్కూల్లో 2008లో పదోతరగతి ఉత్తీర్ణులు అయ్యారు. తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నలుగురు ఒకేసారి పోలీసులుగా సెలక్ట్ అయ్యారు. పండుగలు, ఇతరత్రా సెలవుల్లో ఊరికి వచ్చినపుడు సందడి చేస్తామని చెప్పారు. ‘ఫ్రెండ్స్’ సేవాభావం మెట్పల్లి(కోరుట్ల): మెట్‌పల్లికి చెందిన సురిగి శ్రీనివాస్ స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఐదుగురితో మొదలైన ట్రస్ట్‌లో ప్రస్తుతం 60మంది సభ్యులుగా ఉన్నారు. అందరూ తమ సంపాదనలో నుంచి కొంత మొత్తాన్ని ట్రస్ట్‌కు అందిస్తున్నారు. దీనికి తోడు పలువురు చేస్తున్న ఆర్థికసాయంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఇదేం దోస్తానారా అయ్య: ఫ్రెండ్ షిప్‌డే నాడే దాడులు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఈత సరదా యువకుల మధ్య చిచ్చురేపింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముగ్గురు గాయపడగా ఒక యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు నుంచి వెలువడే నీళ్లు చఫ్టా ద్వారా కృష్ణానదిలో కలుస్తాయి. చఫ్టా వద్ద జాలువారే నీటిని వాటర్‌ఫాల్స్‌గా భావించి యువకులు ఈత కొట్టేందుకు వస్తుంటారు. ఆదివారం ఫ్రెండ్షిఫ్ డే కావడంతో అధిక సంఖ్యలో యువకులు అక్కడకు చేరుకున్నారు. బైక్‌ల విషయంలో మొదలై... స్టాండ్ వేసిన బైక్‌లు ఒకదానిపై ఒకటి పడటంతో ఇరువర్గాల మద్య గొడవ ప్రారంభమైంది. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న యువకులు ఘర్షణకు దిగారు. హైవే వద్దకు చేరుకునే సమయానికి యువకుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. తోపులాటతో ప్రారంభమై చివరికి కర్రలు, రాళ్లు, పడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ముఖ్యంగా ముగ్గురు యువకులను తీవ్రంగా చావబాదారు. కిలేశపురంలో యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నగరానికి చెందిన యువకులు దేవిశెట్టి దివాకర్, కరమద్ది సాయి, కోట్ల అరుణ్, ముద్రబోయిన నాగేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌కుమార్, తాసెట్టి శరత్, చలసాని నాగరాజు, షేక్ షాహీల్, బొమ్మశెట్టి కుమార్ పేద కుటుంబాలకు చెందిన వారు. చదువుల పేరుతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి సరదా కోసం వీరు చేస్తున్న పనులు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చాయి. ఈ సంఘటనపై స్పందించిన సీఐ శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ.. కిలేశపురంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు వర్గాలపై కేసులు పెడతామన్నారు. 10 మంది అరెస్ట్... ఇప్పటి వరకు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. మిగిలిన వారి కోసం విజయవాడ చిట్టినగర్, పాలప్యాక్టరీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాల వద్ద గాలిస్తున్నామన్నారు. అక్కడ జరిగింది గ్యాంగ్‌వార్ కాదన్నారు. ఘటనలో పాతనేరస్తులు లేరని, ఒక్కరు కూడా చనిపోలేదని, స్థానికులు గొడవలో పాల్గొనలేదన్నారు. అందరూ నున్న, ప్రకాశ్‌నగర్, సింగ్‌నగర్ ప్రాంతాలకు చెందిన యువకులని వెల్లడించారు. -
పాటకు ప్రాణం పోస్తున్న ఫ్యాషనేట్ సింగర్స్
-
స్నేహగీతం
-
సినిమాల్లో వాడిన ఈ వెహికల్స్ గురించి తెలుసా?
షోలే సినిమాలో ‘యే దోసితీ హమ్ మగర్ ఛోడేంగే’ అంటూ అమితాబ్-ధర్మేంద్రలు చేసే బైక్ జర్నీ వీడిపోని స్నేహానికి గుర్తుగా మిగిలిపోయింది. ఒక్క షోలేలోనే కాదు వెండితెరపైన బ్యాచిలర్ ఫ్రెండ్స్ చేసిన అనేక రోడ్ ట్రిప్‌లు మన మదిపై చెరగని ముద్రను వేశాయి. వారు ఉపయోగించిన వెహికల్స్ మనలో చాలా మందికి ఓ ఫాంటసీలా ఉండిపోయాయి. దిల్ చాహ్తా హై సినిమాలో హీరోలు అమీర్‌ఖాన్, సైఫ్‌ఆలీఖాన్, అక్షయ్‌ఖన్నాలు ముంబై నుంచి గోవా వెళ్లేందుకు ఉపయోగించిన కారు మెర్సిడెజ్ బెంజ్ ఎస్ఎల్ 300 మోడల్. ఈ వింటేజ్ కారు ప్రస్తుతం మార్కెట్లో లేదు. అయితే దీని తర్వాత వచ్చిన ఎస్ఎల్ 350 వింటేజ్ కారు మార్కెట్లో కోటి రూపాయల దగ్గర లభిస్తోంది. దిల్ చాహ్తా హై దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌కి వింటేజ్ కార్లంటే ఇష్టం. అందుకే ఏరి కోరి ఈ సినిమాలో మెర్సిడెజ్ బెంజ్ ఎస్ఎల్ 300 కన్వర్టబుల్ మోడల్ని ఫర్హాన్ ఉపయోగించాడు. దిల్ చాహ్తాహై తర్వాత మరోసారి హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్‌లతో మరోసారి రోడ్ ట్రిప్ మూవీని తెరకెక్కించాడు ఫర్హాన్ అక్తర్. అయితే ఈసారి మరో వింటేజ్ కారు బ్విక్ సూపర్‌పై మనసు పారేసుకున్నాడు. ఈ కారుని 1940 నుంచి 1956 మధ్యన బ్విక్ కంపెనీ ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ఈ కార్లు మార్కెట్లో అందుబాటులో లేవు. జిందగి సినిమా కోసం ప్రత్యేకంగా ఈ కారును తీసుకొచ్చారు. ఇక ట్రెండ్ సెట్టర్ మూవీ షోలేలో అమితాబ్ , ధర్మేంద్రలు ఉపయోగించింది బీఎస్ఏ డబ్ల్యూఏ 500 సీసీ బైక్. 1942లో ఈ బైకు మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత 1975లో షోలే రిలీజ్ తర్వాత ఈ బైక్ అప్పటి యువతకి కిర్రెక్కించింది. ఈ బైక్ ఇప్పుడు మార్కెట్లో లేకపోయినా... షోలే నమూనా బైక్‌లు అనేక వింటేజ థీమ్ హోటళ్లు, రెస్టారెంట్లలో కనిపిస్తూనే ఉంటాయి. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్, ఏస్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన త్రీ ఇడియట్స్ సంచలన విజయం సాధించింది, ఈ మూవీలో లైట్ వెయిట్ వెహికల్ మహీంద్రా ఫ్లైటీ స్కూటీపై అమీర్‌ఖాన్, మాధవన్, శర్మాన్జోషిలు చేసిన విన్యాసాలు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. మహీంద్రా ఫ్లైట్ ఇప్పటికీ మార్కెట్లో ఉంది. We all need friends in our lives that are our ride or die travel partners. Whether it's to go for a Bachelor's trip or to go find a long lost friend. A very #HappyFriendshipDay to all of our readers and their friends! pic.twitter.com/JPXlOlf0aL — carandbike (@carandbike) August 1, 2021 -
రేయ్!.. మళ్లీ రారూ?
ఎన్నెన్నో సాయంత్రాలలో ఓ ప్రశాంత మైదానంలో మరెన్నో మధుర తీరాలలో పొద్దుగూకే వేళలో గూటికి చేరే పక్షుల్లా మా ప్రియ నేస్తాలంతా అక్కడ వాలిపోయే వాళ్ళం విహంగాల్లాంటి మా ప్రియమిత్రులకి ఆ అందమైన మలిసంధ్యలే తొలిసంధ్యల్లా నులివెచ్చని గూడయ్యేది ఎన్నెన్నో కమ్మని కబుర్లతో మరెన్నో తియ్యని కలహాలతో హాస్య గుళికలు చప్పరిస్తూ మధుర జ్ఞాపకాల్ని నెమరేస్తూ చిలిపితనాలు వెల్లడిస్తూ వలపు వన్నెలు వల్లెవేస్తూ తుంటరి చేష్టలు ప్రదర్శిస్తూ అన్ని గుండెలు ఒకే గుండెగా మైదానమే ఓ గూడుగా అల్లుకుని రక్తబంధంకన్నా మిన్నగా అరమరికలులేని హృదయాలతో స్నేహామృతం పంచుకుని వినువీధికెగసి తారలతో తోరణాలు కూర్చి ఒక మనసుపై మరొక మనసు మాలలుగా అలంకరించుకుని అమరలోకపు ఆనందాలు ఆ మైదానంలోనే పొంది ప్రతీ సాయంత్రం వేడుకగా మరి కొన్నిరాత్రులు తిరునాళ్ళగా గ్రీష్మమైనా శరదృతువులోనైనా శీతలమైనా శిశిరంలోనైనా ఏ కాలమైనా కొంగ్రొత్తగా స్నేహం చిగురులు తొడిగే నిత్యవాసంతమే ఆ మా ప్రియవిహంగాలకి కన్నులనిండుగా కలలు నింపుకుని రంగురంగుల మాటల తేనెలు ఒంపుకుని ఒకరిలో ఒకరిగా పదుగురం ఒక్కరిగా ఒంటరితనాన్ని గాలిలో విసరి తియ్యని స్నేహాల్ని ఊపిరి చేసుకుని గుండెలనిండా ప్రాణం పోసుకుని ఐక్యమై మమేకమై రెక్కలు రెప రెపలాడిస్తూ రివ్వురివ్వున సాగిపోయిన ఆనాటి మా అపూర్వ స్నేహ విహంగాలకి ఆరోజులు ప్రతీరోజూ ఉగాదులే సంకురాతురులే శివరాత్రి దసరా దీపావళి పండుగలే నిండుపున్నములే హర్షించే వర్షపు జల్లులే మెరిసేటి మెరుపులే ఉరికేటి సెలయేళ్లే మళ్లీ రావాలి ఆ వసంతం కొత్త మోసులు మొలవాలి ఆ పాత మధుర ఫలాలు మళ్లీ మళ్లీ పండాలి వలస పక్షుల్లా పుట్టకొకరు చెట్టుకొకరు దిక్కుకొకరు వెళ్లిపోయిన మేం తిరిగి ఆ మైదాన తీరం గూటికి చేరాలి కమ్మటి ఆనాటి ఊసులు పంచుకోవాలి నిస్వార్థంగా గుండె గుండెలు పెనవేసుకోవాలి తరలి రావాలని ఎదురు చూస్తున్నా మళ్లీ ఆ వసంతం మరలి పోకుండా గుండెలు చెదరిపోకుండా ఉండటానికి రేయ్ .... అందరూ మళ్లీ రారూ !!? -నాగముని. యం. ► అగణితం చుక్కల చెమరింతలెన్ని చూసిందో, పాలపుంతల గిలిగింతలకెంత మురిసిందో. క్షణాలే ఉచ్ఛ్వాసము క్షణాలే నిశ్వాసము కాలం విశ్వానికి ఎడతెరపి లేని ఊపిరి. కొనసాగడమే తెలిసిన కాలాన్ని పెండ్యూలం అడుగులతో కొలవడం దేనికి వింత కదూ! అగణితమైనది అంకగణితానికి లొంగిపోతుందా? అస్తమానం పగలు, రాత్రి అనడం దేనికి పగలు కళ్లు మూసుకున్నా చీకటే రాత్రి కళ్లు తెరిచినా ఒక్కటే. సమయాన్ని ఉదయాస్తమయ ఛాయల్లో చూడటం దేనికి వివేచన రగిలించని వేళ వాలిపోతేనేమి? హృదయాంతరాళాన్ని స్పృశించని క్షణాలు గడిస్తేనేమి? క్షణం తీరిక లేక సాగే కాలం దివారాత్రులను దివాలా తీస్తుంది. ఎక్కడ తడుతుందో ఎప్పుడు కుడుతుందో కాలం కనిపించక పాకే వేయికాళ్ళ జెర్రి. -కుడికాల వంశీధర్ -
Friendship Day 2021: ముఖేశ్ మనసులో ఆనంద్‌ది చెరిగిపోని స్థానం
Happy Friendship Day 2021... స్నేహమనేది ఓ మధురమైన అనుభూతి. దానికి వర్ణ, వర్గ, లింగ, జాతి, వయసు, స్థాయి, కులాలతో నిమిత్తంలేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా ప్రతి మనిషి జీవితంలో స్నేహం అందమైన లతలా అల్లుకుపోతుంది. మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా, ఎంత బిజీగా ఉన్నా ఆత్మీయ స్నేహితులతో కనీసం వారంలో ఒకటి, రెండు సార్లు కలవటం, మాట్లాడంగాని చేయకపోతే ఏదో కోల్పొయిన భావన కలుగుతుంది. అదే మరీ స్నేహానికి ఉన్న అద్భుతమైన శక్తి. ప్రతీ రోజు తమ కంపనీ షేర్ల విలువ, సంస్థల విస్తరణ, వ్యాపార లాభ నష్టాలు వంటి విషయాల్లో తలమునకలయ్యే దిగ్గజ వ్యాపారాలు కూడా తమ స్నేహితులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆ సమయంలో స్థాయి, భేదాలు మరచి స్నేహబంధ జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అలాంటి వారిలో ముందువరసలో ఉంటారు.. ముఖేశ్ అంబానీ, ఆనంద్ జైన్..ముఖేశ్ అంబానీ.. పరిచయం అక్కర్లేని వ్యాపార దిగ్గజం. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. ఆనంద్ జైన్ అయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇద్దరూ ముంబైలోని హిల్‌గ్రాంజ్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ముఖేశ్ కొంచెం బిడియంగా ఉంటాడు. అంతర్ముఖుడు. ఆనంద్ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలడు. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్‌గా ముఖేశ్ మనసులో ఆనంద్‌ది చెరిగిపోని స్థానం. మొదట్లో కలిసి పనిచేసినా, ఇప్పుడు ఎవరి వ్యాపారాల్లో వారు తలమునకలవుతున్నా వారంలో రెండు, మూడుసార్లయినా కలవటం, సరదాగా గడపడం వారిద్దరికీ అలవాటు. కిరణ్ మజుందార్ షా... నీలిమా రౌషెన్ బయోకాన్ కంపెనీ అధినేత కిరణ్ మజుందార్ షా.. నీలిమా రౌషెన్.. ఇద్దరిదీ దాదాపుగా ఒకే నేపథ్యం... వారు పనిచేసే రంగాల్లో ఇద్దరిదీ ఒంటరి పోరాటం. ఒకరికొకరు పరిచయమయ్యారు. సొంత అక్కా చెల్లెళ్లలా కలసిపోయారు. అంతా బాగుందనుకున్న తరుణంలో క్యాన్సర్ బారిన పడ్డారు నీలిమ. ఆమెకు అన్ని విధాలా ఆసరాగా నిలిచారు కిరణ్... అయితే అనుకోకుండా కొన్ని రోజులకు కిరణ్ భర్తకు కూడా క్యాన్సర్ అని తేలింది. అయితే కిరణ్ భర్త వ్యాధినుంచి కోలుకున్నారు. ఇంకా కోలుకోని స్నేహితురాలు నీలిమను విదేశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించింది. అయినా స్నేహితురాలు దక్కలేదు. ఆ వేదనతోనే కిరణ్ కాన్సర్ పై పోరాటానికి వందల కోట్లు విరాళంగా ఇచ్చారు. రతన్ టాటా– శంతను నాయుడు రతన్‌టాటా.. మనసున్న వ్యాపారవేత్త. ఎనభయ్యో పడిలోనూ ఉరకలేసే ఉత్సాహం, సంస్థతో పాటు సమాజానికీ ఏదో చెయ్యాలన్న ఆరాటం. ఆ స్వభావమే తన కన్నా వయసులో ఎంతో చిన్నవాడైనప్పటికీ శంతను నాయుడితో స్నేహం చేసేందుకు పురిగొల్పింది. వయసులో తేడా ఉన్నా శంతనుదీ తనలాంటి స్వభావమే కావడంతో ఆ స్నేహబంధం మరింత బలపడింది. పుణెకు చెందిన శంతను నాయుడు– టాటా సంస్థలో ఉద్యోగిగా పనిచేసేవాడు. అతనికి శునకాలంటే వల్లమాలిన ప్రేమ. వాటి కోసం ఏకంగా ఒక స్వచ్ఛంద సంస్థనే పెట్టాడు. ఈ విషయం రతన్‌టాటా దృష్టికి వచ్చింది. ఆయనకూ జాగిలాలంటే ఇష్టం. శంతనుని ముంబైకి పిలిపించుకుని స్వయంగా కలిసి అభినందించారు. శంతను చేసే సంక్షేమ కార్యకలాపాల గురించి ఇద్దరిమధ్యా ఈ–మెయిల్స్ నడిచేవి. వారిద్దరి స్వభావాలూ, సేవాభావనలు ఒకేలా ఉండడంతో క్రమంగా ఇద్దరూ స్నేహితులయ్యారు. -
RRR Movie :ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. వేరే లెవల్ అంతే..
RRR Friendship Song: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాటను 'ఫ్రెండ్షిప్ డే' సందర్భంగా ఆగస్ట్1న ఉయయం 11గంటలకు విడుదల చేశారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ‘దోస్తీ’ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కనిపించారు. 'ఊహించని చిత్ర విచిత్రం..స్నేహానికి చాచిన హస్తం..ప్రాణానికి ప్రాణం ఇస్తుందో, తీస్తుందో'...అంటూ సాగిన ఈ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం హైలైట్‌గా నిలిచింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం సంగీతం అందించారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ వివిధ భాషల్లో ఈ పాటను ఆలపించారు. ఇక ఈ సాంగ్ పాడిన ఐదుగురు సింగర్స్ ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. #Dosti | #Natpu | #Priyam Telugu- https://t.co/vuwMb8q383 Tamil- https://t.co/VKF46yfc2c Hindi- https://t.co/2omQXIAHJN Kannada- https://t.co/BTsQ18OqWZ Malayalam- https://t.co/LBbwrdH4hl #RRRMovie @mmkeeravaani @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @TSeries @LahariMusic — RRR Movie (@RRRMovie) August 1, 2021 -
Friendship Day 2021: అరుదైన స్నేహబంధాలు
ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. అలాగే స్నేహానికీ ఒక భాష ఉంది. ఆ భాష పదాలతో కాక భావాలతో ఏర్పడుతుంది. ఎటు చూసినా విభజన రేఖలే కనిపిస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రపంచమంతటినీ కలిపి ఉంచగల శక్తి ఆ ఒక్క స్నేహ భావానికే ఉంది. ఉంటుంది. కాబట్టి అందరం స్నేహ భావంతో ఉందాం. ఒకరికొకరం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుందాం. ఈ ప్రపంచంలో నా అన్నవారే లేని వాళ్లుండవచ్చు గాని స్నేహితులు లేని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవ్వరూ లేకున్నా ఒక్క స్నేహితుడు చాలు... అన్ని విధాలా మన జీవితాన్ని ప్రభావితం చేయగల బంధం స్నేహం. అన్ని బంధాలనూ పుట్టుకతోనే ఇచ్చే దేవుడు, స్నేహ బంధాన్ని ఎంచుకునే అవకాశం మాత్రం మనిషికే వదిలేశాడు. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో, ఆఖరుకు కడుపున పుట్టినవారితో చెప్పుకోలేని విషయాలను సైతం మిత్రులతో పంచుకోవడమే స్నేహం గొప్పతనం. స్నేహమనేది ఓ మధురమైన అనుభూతి, దీనికి వర్ణ, వర్గ, లింగ, జాతి, వయసు, స్థాయి, కులాలతో నిమిత్తంలేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా ప్రతి మనిషి జీవితంలోనూ స్నేహం అందమైన లతలా అల్లుకుపోతుంది. అంతటి ఉన్నతమైన స్నేహానికున్న ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు ఏర్పాటు చేసుకున్న రోజే ‘స్నేహితుల రోజు... నేడు ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం జరుపుకునే ‘స్నేహితుల దినోత్సవం’ పుట్టింది అమెరికాలో. స్నేహం పుట్టుక మాత్రం మనిషి పుట్టుకంత ప్రాచీనమైనది. కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేని స్నేహాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడంలో స్వదేశీ, విదేశీ భేదం లేకుండా ప్రపంచమంతా ఒక్కటయిందంటే, జీవితంలో ప్రతి ఒకరికీ స్నేహం ఎంత అపురూపమయినదో అర్థమవుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? పెద్ద ఎత్తున స్నేహితులకోసం ఒక రోజు కేటాయించి పండుగ గా జరుపుకోవడమనేది అమెరికాలో 1935 లో ప్రారంభమై, కాలక్రమేణా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొంది ‘ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డే’ గా రూపాంతరం జరిగింది. వివిధ దేశాల్లో వేర్వేరు తేదీల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నా, 2011లో ఐక్య రాజ్య సమితి సా«ర్వత్రిక సభ జూలై 30వ తేదీని అంతర్జాతీయ మైత్రీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అయినా మనదేశం సహా మరికొన్ని దేశాలూ మాత్రం ఆగస్టు నెలలోని మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్షిప్ డే’ గా జరుపుకుంటున్నాయి. ఈ ఫ్రెండ్షిప్ డే ఇటీవలి కాలంలో ముందెన్నడూ లేనంత ప్రాముఖ్యతని సంతరించుకోవడం వెనక, సామాజిక మాధ్యమాలు విరివిగా ఉపయోగంలోకి రావడం, కానీ ఖర్చులేకుండా ఒకే స్నేహ సందేశాన్ని వందల మంది నేస్తాలకి ఏక కాలంలో సులువుగా పంపగలిగే సదుపాయం దొరకడం కారణాలుగా చెప్పుకోవచ్చు. మన ముందు నడుస్తూ ఎవరైనా మార్గ నిర్దేశనం చేస్తానంటే మనకు నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు. మన వెనుక నడిచేవాడికి ఎప్పుడూ దారి చూపిస్తూ పోవాలంటే మనకి వీలు కాకపోవచ్చు. మనతో నడిచే వ్యక్తినే మనం మిత్రుడిగా భావించి మంచీ చెడూ పంచుకోగలుగుతాం. అలా మన కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్నవారినే మనం స్నేహితులుగా ఎంచి అభిమానిస్తాం, గౌరవిస్తాం. సాటివాడి కష్టానికి సానుభూతి అందించడం ఎవరైనా చేస్తారు గాని గొప్ప హృదయం ఉన్న మిత్రుడు మాత్రమే స్నేహితుని విజయాన్ని మనసారా అభినందించగలుగుతాడు. నిజమైన స్నేహం జీవితంలోని మంచిని ద్విగుణీకృతం చేస్తుంది. పాటల్లో స్నేహానికి బాటలు ‘నీవుంటే వేరే కనులెందుకు నీకంటే వేరే బతుకెందుకు, నీ బాట లోని అడుగులు నావి, నాపాట లోని మాటలు నీవి’ అంటూ స్నేహ బంధపు సౌందర్యాన్ని పాటలో పొదిగారు సినారె. అలాగే స్నేహ మాధుర్యాన్ని చవి చూసి ఆ బంధం కోసం, తను బతుకు తెరువు కోసం ఎన్నుకున్న మార్గాన్నే వదిలి మంచివాడైన ప్రతినాయకుడు ‘స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి’ అంటూ తన మిత్రుడి కోసం ప్రాణాన్నే అర్పించడానికి సిద్ధపడతాడు. అలాగే ‘మంచి మిత్రులు’గా విడిపోయి చాలా కాలం తర్వాత కలుసుకోబోతున్న ఇద్దరు స్నేహితులు తమ తమ అనుభవాలను, తాము నేర్చుకున్న జీవిత పాఠాలను ఒకరితో ఒకరు చెప్పుకోవాలని వేగిరపడుతూ ‘ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?’ అంటూ పాడిన పాట, ఆ సినిమా విడుదలై అర్ధ శతాబ్దమైనా ఇంకా సినీ గీతాభిమానుల పెదవులపై నర్తిస్తూనే ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం ‘ఛోడేంగే దమ్ అగర్, తేరా సాథ్ నా ఛోడేంగే’ అంటూ ఇద్దరు మిత్రులు చేసిన విన్యాసాలను అభిమానులు మళ్ళీ మళ్ళీ చూసి మెచ్చుకున్నారంటే ఆ పాటలో ధ్వనించిన స్నేహమాధుర్యమే కారణం. ప్రపంచ ప్రసిద్ధ కథలైన పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రభేదం అనే రెండు భాగాల్లోనూ సన్మిత్రులంటే ఎవరు, స్నేహపు గొప్పదనమేమిటి , మైత్రి ఎలాంటి వారితో చెయ్యాలి, ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేవాళ్లని ఎలా గుర్తించాలి మొదలైన ఎన్నో తెలుసుకోవలసిన విషయాలని సరళంగా అర్ధమయ్యే రీతిలో పిల్లల కథలుగా మలచి వివరించాడు విష్ణుశర్మ. పౌరాణిక స్నేహాలు స్నేహం పురాణ కాలం నుంచే ఉంది. దశరథుడు– జటాయువు; రాముడు– సుగ్రీవుడు; రాముడు– గుహుడు; కృష్ణుడు– అర్జునుడు; కృష్ణుడు–కుచేలుడు, దుర్యోధనుడు–కర్ణుడు అద్భుతమైన, అజరామరమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచారు. అగ్నిసాక్షిగా శ్రీరామ సుగ్రీవుల మధ్య హనుమ కుదిరించిన స్నేహ బంధమే అందుకు ఉదాహరణ. శ్రీరాముడు క్షత్రియుడు. అయోధ్యానగర రాజైన దశరథ మహారాజుకు తనయుడు. భావి చక్రవర్తి. సుగ్రీవుడు వానర రాజు. అయితేనేం, వారి స్నేహానికి జాతులు కానీ, కులాలు కానీ అడ్డు రాలేదు. ఇద్దరూ కష్టకాలంలోనే స్నేహితులయ్యారు. ఇద్దరూ రాజ్యాన్ని విడిచి, అడవులలో ఉంటున్నారు. పితృవాక్య పరిపాలనకై వచ్చిన రామునికి వనవాసం కష్టంగా అనిపిం^è కపోవచ్చు కానీ సీతావియోగం కష్టమే కదా! ఇక సుగ్రీవుడు రాజ్యాన్నీ, భార్యనీ వదలి కొండమీద తలదాచుకున్నాడు. ఆ ఇద్దరూ స్నేహితులై, ఒకరికొకరు సహాయం చేసుకుని ఇద్దరి కష్టాలనూ తొలగించుకున్నారు. ‘‘అనేక సద్గుణాలు, విశేషమైన ప్రేమ కలిగిన నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం అనేది నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’’ అంటాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో. శ్రీకృష్ణుడు, కుచేలుడు గురుకులంలో స్నేహితులు. చదువులు పూర్తయ్యాక ఇద్దరూ తమ తమ నెలవులకు వెళ్లారు. కుచేలుడు గృహస్థాశ్రమంలో దారిద్య్రాన్నను భవిస్తూ, భార్య సలహాపై తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లాడు. బాల్య మిత్రునికి ఇవ్వడం కోసం కాసిని అటుకులు మూట కట్టుకుని వెళ్లాడు. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, కుశలమడుగుతూనే స్నేహితుడు తన చిరిగిన ఉత్తరీయంలో మూటకట్టుకుని తెచ్చిన అటుకులలో గుప్పెడు తీసుకుని ఎంతో ఆప్యాయంగా తిన్నాడు. చిన్ననాటి విషయాలు ముచ్చటించుకున్నారు. మిత్రునికి షడ్రసోపేతమైన భోజనంతో విందు చేశాడు. కుచేలుడు ఆ విందును ఆరగించి, పట్టుపరుపుల మీద నిద్రపోయాడు. కృష్ణునికి తన దారిద్య్రాన్ని గురించి చెప్పి, సహాయ మడుగుదామనుకున్నా, ఆ విషయం ప్రస్తావించకుండానే ఇంటిదారి పట్టాడు కుచేలుడు. కానీ కుచేలుడు అడగకపోయినా అషై్టశ్వర్యాలనూ అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఒక స్నేహితుడు కష్టంలో ఉన్న తన స్నేహితుని ఇబ్బందులను అతడు అడగకుండానే తొలగించాడు. అదీ అసలైన మైత్రి. నన్ను ఒక్క మాట అడిగి ఉంటే బాగుండేది కదా అనలేదు. పెదవి విప్పి చెప్పనక్కర లేకుండానే అతని కష్టాలన్నింటినీ తీర్చాడు. అదేవిధంగా దుర్యోధన, కర్ణుల మైత్రి కూడా గాఢమైనది. మిత్రుడైన కర్ణుడి కోసం దుర్యోధనుడు ఎవరు ఎన్ని రకాలుగా హెచ్చరించినా పెడచెవిన పెట్టి మరీ అతడికి అంగరాజ్యాన్నిస్తే, దుర్యోధనుడి కోసం కర్ణుడు తన ప్రాణాలనే పణంగా పెట్టి పాండవులతో యుద్ధం చేశాడు. చివరికి పాండవులు తన తోడబుట్టిన వారేనని తెలిసినా, సోదర బంధం కన్నా స్నేహ బంధాన్నే మిన్నగా భావించి, తన ప్రాణాలను త్యాగం చేశాడు. భర్తృహరి మంచి మిత్రుని లక్షణాలను ఇలా చెబుతాడు –ఎవరైనా చెడు పనులు చేస్తూంటే మంచి మిత్రుడు నివారించాలి. అలాగే మంచిపనులు చేయటంలో ప్రోత్సహించాలి. మిత్రునికి సంబంధించిన రహస్యాలను çతనలోనే దాచుకోవాలి. మిత్రునిలోని మంచి లక్షణాలను నలుగురిలో తెలియజేయాలి. మిత్రునికి ఆపద కలిగినప్పుడు మొహం చాటేయకుండా, చేతనైన సహాయం చేయాలి. అవసర సమయాలలో తగిన రీతిలో ఆదుకోవాలి. నాటి మేటి స్నేహితులు స్నేహితులతో కలసి ఉంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే ఆ స్నేహం, స్వచ్ఛంగా ఉండాలి. అలాంటి స్నేహంలోనే ఆనందం దాగి ఉంటుంది. అలాంటి స్నేహమే కలకాలం నిలిచి ఉంటుంది. అలాంటి కొన్ని అపురూపమైన, అరుదైన స్నేహబంధాల గురించి తెలుసుకుందాం... అబ్బూరి రామకృష్ణారావు – కోడి రామమూర్తి సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయ అధికారి అబ్బూరి రామకృష్ణారావు. మల్లయోధుడిగా దేశాదేశాల్లో ప్రదర్శనలిస్తూ విజయపరంపరలో దూసుకుపోయే కోడి రామమూర్తిపై ఆనాటి పత్రికల్లో తరచు కథనాలు వచ్చేవి. కోడి రామమూర్తి ప్రతిభాపాటవాలకు అబ్బురపడిన అబ్బూరి రామకృష్ణా రావు ‘ఆంధ్ర కంఠీరవ’ అనే పద్యమాలికను రచించారు. ఆ పద్యాలను చదివిన కోడి రామమూర్తి వెదుక్కుంటూ మరీ అబ్బూరివారి ఇంటికి వచ్చారు. అబ్బూరివారి పద్యాలు కోడి రామమూర్తిని ఎంతగా ఆకట్టుకున్నాయంటే, ఆయన ఆ పద్యాలను సిల్కు రుమాళ్లపై అచ్చువేయించి, వాటిని తన ప్రదర్శనలను తిలకించే ప్రేక్షకులకు పంచిపెట్టేంతగా. అబ్బూరివారితో మైత్రి ఏర్పడినప్పటి నుంచి కోడి రామమూర్తి తన ప్రదర్శనల్లో అబ్బూరి దంపతుల కోసం ముందువరుసలో ప్రత్యేకంగా రెండు కుర్చీలు వేయించేవారు. ఆయన ప్రదర్శనకు ఒకసారి గవర్నర్ సకుటుంబంగా విచ్చేశారు. అబ్బూరి వారికి కేటాయించిన రెండు కుర్చీలను తీసుకుంటామని అన్నారట. ఇది తెలుసుకున్న కోడి రామమూర్తి, ‘కుదరదు. ఆ కుర్చీలు అలా ఉండవలసిందే. లేకుంటే ప్రదర్శనకు అంతరాయం కలుగుతుంది’ అని గవర్నర్ కార్యదర్శికి నిక్కచ్చిగా చెప్పేశారట. అబ్బూరివారంటే అంత అభిమానం చూపేవారు కోడి రామమూర్తి. అరుదైన వారి మైత్రి జీవితాంతం కొనసాగింది. సి.ఎఫ్ ఆండ్రూస్– మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ‘జాతిపిత’గా మనందరికీ తెలుసు. జాతీయోద్యమంలో ఆయనకు బాసటగా నిలిచిన సన్నిహిత జాతీయ నాయకుల గురించి కూడా తెలుసు. మరి ఈ చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ ఎవరనుకుంటున్నారా? ఆండ్రూస్ ఇంగ్లాండ్‌కు చెందిన క్రైస్తవ మత గురువు. తొలిసారిగా 1914లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆయన గాంధీజీని కలుసుకున్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయ కార్మికులపై బ్రిటిష్ పాలకులు సాగించే దమనకాండకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన ఉద్యమంలో ఆండ్రూస్ కూడా పాల్గొన్నారు. గాంధీజీ అహింసా సిద్ధాంతానికి ప్రభావితుడై, భారతీయుల స్వాతంత్య్రోద్యమానికి మద్దతుగా నిలిచారు. దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌లోనూ ఆండ్రూస్ మతబోధకుడిగా పనిచేశారు. ఆయనకు గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగోర్ వంటి వారితో కూడా సాన్నిహిత్యం ఏర్పడింది. అల్బర్ట్ ఐన్‌స్టీన్– చార్లీ చాప్లిన్ అల్బర్ట్ ఐన్‌స్టీన్, చార్లీ చాప్లిన్– ఇద్దరివీ ఏమాత్రం పొంతనలేని వేర్వేరు రంగాలు. అయినా ఇద్దరూ చక్కని స్నేహితులయ్యారు. లాస్ ఏంజెలెస్‌లోని ఒక థియేటర్లో 1931లో చాప్లిన్ చిత్రం ‘సిటీ లైట్స్’ ప్రీమియర్ షో ఏర్పాటు చేసినప్పుడు దానిని తిలకించేందుకు ఐన్‌స్టీన్ కూడా వచ్చారు. అప్పుడే ఆయన చాప్లిన్‌ను తొలిసారి కలుసుకున్నారు. ‘నీ కళలోని విశ్వజనీనతను నేను ప్రశంసించకుండా ఉండలేను. నువ్వొక్క మాట మాట్లాడకపోయినా ప్రపంచం నిన్ను ఇట్టే అర్థం చేసుకుంటుంది’ అంటూ ఐన్‌స్టీన్ పొగడ్తలు కురిపించే సరికి చాప్లిన్ తబ్బిబ్బయ్యాడు. కొద్దిక్షణాల్లోనే తేరుకుని, ‘మీ ఖ్యాతి మరింత గొప్పది. మీరు చెప్పిన సిద్ధాంతాల్లో ఒక్క మాటైనా అర్థం కాకపోయినా యావత్ ప్రపంచమే మిమ్మల్ని కీర్తిస్తోంది’ అని బదులివ్వడంతో చాప్లిన్ చమత్కారానికి ఐన్‌స్టీన్ మనసారా నవ్వేశారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి మిత్రులుగా మారారు. హాలీవుడ్లో ఐన్‌స్టీన్ కోరుకుని మరీ కలుసుకున్నది చాప్లిన్ ఒక్కరినే. అప్పటికింకా జర్మనీ పౌరుడిగానే ఉన్న ఐన్‌స్టీన్ కేవలం చాప్లిన్‌ను కలుసుకోవడానికి అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోకి రావడం ఒక అరుదైన సంఘటన. బాలగంగాధర్ తిలక్– మహమ్మదాలీ జిన్నా భారత స్వాతంత్య్ర పోరాటకాలంలో బాలగంగాధర్ తిలక్, మహమ్మదాలీ జిన్నా భిన్నధ్రువాల వంటి నాయకులు. గాంధీజీకి ముందు జాతీయ కాంగ్రెస్‌ను ముందుకు నడిపిన నాయకుడు తిలక్. అదేకాలంలో ముస్లింలీగ్‌కు అధినాయకుడు మహమ్మదాలీ జిన్నా. స్వాతంత్య్ర సాధనే ఉమ్మడి లక్ష్యంగా 1916లో కాంగ్రెస్–ముస్లింలీగ్‌ల నడుమ కుదిరిన ఒడంబడికలో తిలక్, జిన్నాలే కీలక పాత్ర పోషించారు. ఆనాటి నుంచి వారి మధ్య గాఢమైన మైత్రి ఏర్పడింది. తిలక్‌పై బ్రిటిష్ ప్రభుత్వం 1916లో దేశద్రోహం కేసు మోపినప్పుడు జిన్నా ఆయన తరఫున కోర్టులో వాదించడం వారి స్నేహానికి ఒక చారిత్రక నిదర్శనం. జిన్నా ఎంత వాదించినా, తిలక్‌కు ఆ కేసులో ఏడాదిన్నర జైలుశిక్ష విధిస్తూ బాంబే హైకోర్టులోని బ్రిటిష్ జడ్జి తీర్పునిచ్చారు. సింగిల్‌జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఫుల్‌బెంచ్ నిరాకరించింది. తిలక్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జికి బార్ అసోసియేషన్ విందు ఏర్పాటు చేసింది. దీనికి బార్ అసోసియేషన్ సిగ్గుతో తలదించుకోవాలంటూ జిన్నా తీవ్రంగా ఖండించారు. తిలక్ పట్ల ఆయన స్నేహం అలా ఉండేది. మార్క్‌ట్వైన్– హెలెన్ కెల్లర్ మార్క్ ట్వైన్ జగమెరిగిన ఇంగ్లిష్ రచయిత. హెలెన్ కెల్లర్ చిన్నతనంలోనే వ్యాధికి లోనై చూపును, వినికిడిని కోల్పోయినా, మొక్కవోని దీక్షతో వికలాంగుల హక్కుల కార్యకర్తగా ఉద్యమించిన ధీర. మార్క్ ట్వైన్‌కు, హెలెన్ కెల్లర్‌కు నడుమ తరాల అంతరం ఉన్నా, వారి మధ్య గాఢమైన స్నేహం కొనసాగింది. హెలెన్ కెల్లర్ పద్నాలుగేళ్ల బాలికగా ఉన్నప్పుడు మార్క్ ట్వైన్‌ను ఒక పార్టీలో తొలిసారి కలుసుకుంది. మార్క్ ట్వైన్ అప్పటికే యాభయ్యేళ్ల పైబడ్డవాడు. తొలి పరిచయంతోనే ఇద్దరికీ గాఢమైన స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరచు ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించుకునేవారు. ‘ఆ రోజు నుంచి అతని మరణించే రోజు వరకు మా స్నేహం కొనసాగింది’ అని హెలెన్ కెల్లర్ ఒక సందర్భంలో రాసుకుంది. ఆమె తన ఇరవైరెండో ఏట రాసిన ఆత్మకథను చదివిన మార్క్ ట్వైన్ ఆమె రచనా నైపుణ్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఇద్దరూ కలుసుకున్నప్పుడల్లా విప్లవాత్మక రాజకీయాల గురించి, సామాజిక సంస్కరణల ఆవశ్యకత గురించి చర్చించుకునేవారు. మార్క్ ట్వైన్ ఇచ్చిన నైతిక మద్దతుతో హెలెన్ కెల్లర్ హక్కుల కార్యకర్తగానే కాకుండా, రచయిత్రిగా కూడా రాణించగలిగింది. టీఎస్ ఇలియట్–గ్రూషో మార్క్స్ ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్ కవి, రచయిత టీఎస్ ఇలియట్ పేరు ప్రఖ్యాతుల ముందు హాస్యనటుడు గ్రూషో మార్క్స్ దాదాపు అనామకుడు. అలాంటి గ్రూషోకు 1961లో ఒకరోజు ఫ్యాన్మెయిల్లో వచ్చిన ఉత్తరం అతణ్ణి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఆ ఉత్తరం రాసినది టీఎస్ ఇలియట్. ‘నేను మీ అభిమానిని. మీ ఆటోగ్రాఫ్ చేసిన ఫొటోను పంపగలరు’ అని ఆ ఉత్తరంలో రాశాడు. గ్రూషో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇలియట్ కోరినట్లే తన ఫొటో పంపుతూ ఆయన కవిత్వాన్ని తాను ఎంతగా ఇష్టపడేదీ వివరిస్తూ ఉత్తరం రాశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇలియట్ 1966లో మరణించేంత వరకు వారి మధ్య ఆ మైత్రీబంధం కొనసాగింది. కోట్లలో స్నేహం ► నా వెనక నడవకు, నేను నీకు తోవ చూపించలేకపోవచ్చు.నా ముందు నడవకు, నేను నిన్ను అనుసరించకపోవచ్చు. నా జతగా నడువు, నా స్నేహితుడిగా ఉండిపో... – ఆల్బర్ట్ కాము, రచయిత, తత్త్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. ► నేను నా శత్రువులందరినీ నాశనం చేసినట్టే కదా, వాళ్ళని గనక నా స్నేహితులుగా మార్చుకోగలిగితే. – అబ్రహాం లింకన్ ► ఇద్దరిమధ్య మౌనం కూడా హాయిగా ఉన్నపుడే వారి మధ్య స్నేహం ఉన్నట్టు. – డేవిడ్ టైసన్ జెంట్రీ, గీత రచయిత ►సంపదలతో తులతూగుతున్నపుడు మన గురించి మన స్నేహితులకి తెలుస్తుంది. మనం ఆపదల్లో ఉన్నపుడు మన స్నేహితుల గురించి మనకి తెలుస్తుంది!’ – జాన్ కొల్లిన్స్, ఆంగ్ల విమర్శకుడు ► మిత్రుల పట్ల నీకు గల అభిప్రాయాలను వారి మరణానంతరం ఇచ్చే ఉపన్యాసాల కోసమో, వారి సమాధి మీద లిఖించడం కోసమో అట్టి పెట్టుకోకు, ఆ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచడం నేర్చుకో. – ఏనా కమ్మిన్స్ ► నేను మారినపుడు మారిపోతూ, నేను తలూపినపుడు తానూ తలూపుతూ ఉండే స్నేహితుడు నాకక్కరలేదు. నా నీడ ఆ పని ఇంకా మెరుగ్గా చేస్తుంది. – ప్లుటార్క్, గ్రీకు చరిత్రకారుడు ‘నెవర్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్రెండ్స్ డు నాట్ నీడిట్. యువర్ ఎనిమీస్ డోంట్ బిలీవిట్’ ఆనే ఆంగ్ల సూక్తి స్నేహ బాంధవ్యం ఎంతటిదో వివరిస్తుంది. మన గురించి నిక్కచ్చిగా మన ముందు చెప్పగల వ్యక్తిని మనమెప్పుడూ కోల్పోకూడని మిత్రుడని తెలుసుకోగలిగితే స్నేహితుల్ని సంపాదించుకోవడం, నిలబెట్టుకోవడం తెలిసినట్టే! -
దోస్తానాపై వచ్చిన తెలుగు చిత్రాలివే..
అమ్మ మీద అంతులేని ప్రేమ ఉన్నా…అన్ని విషయాలు మాట్లాడలేం. నాన్నంటే ఎంత గౌరవం ఉన్నా…అన్నింటినీ షేర్ చేసుకోలేం. జీవిత భాగస్వామి మనలో సగమే అయినా…ఏదో ఒక సీక్రెట్ దాచే ఉంచుతాం. మరి…ఒక మనిషి ఎలాంటి రహస్యాలు లేకుండా, ఓపెన్‌గా ఉండేది ఎక్కడ ? ప్రేమ, గౌరవం, వినయం, బాధ్యత లాంటి భావోద్వేగాలను కూడా దాటుకుని నిలబడేది ఎవరి పక్కన ? ఒక్క స్నేహితుడి దగ్గరే. సాధారణ మనిషికైనా.. స్టార్ హీరోకైనా స్నేహితులు ఉండాల్సిందే. స్నేహానికి ధనిక, పేద తేడాలే కాదు…లింగ భేదాలు కూడా ఉండవు.. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఫ్రెండ్షిప్ మూవీస్ మీ కోసం.. స్నేహం కోసం చిరంజీవి, విజయ్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘స్నేహం కోసం’ సినిమా స్నేహ బంధాన్ని చాటి చెప్పింది. ఈ సినిమాకు గానూ మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ అవార్డును తెచ్చిపెట్టింది. స్నేహానికి ఆస్తులు అంతస్థులు, ధనిక, పేద, కుల,మత బేధాలేవి ఉండవని చాటి చెప్పింది. ' మీసం ఉన్న నేస్తమా.. నీకు కోపం ఎక్కువ' అనే పాట స్నేహితుడు ఎలాంటి వాడో చెపుతుంది. స్నేహమంటే ఇదేరా ఈ చిత్రం స్నేహ బంధంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇందులో నాగార్జున, సుమంత్ స్నేహితులుగా నటించారు. భూమిక చావ్లా, ప్రత్యూష హీరోయిన్లుగా నటించారు. వసంతం వెంకటేశ్, కళ్యాణి, ఆర్తి అగర్వాల్, ఆకాశ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం వసంతం. 2003లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో వెంకటేశ్, కల్యాణి స్నేహితులుగా నటించారు. స్నేహానికి లింగభేదం ఉండదని ఈ సినిమా చాటి చెప్పింది. ఈ సినిమాలోని 'గాలి చిరుగాలి.. ఈ సినిమాలోని 'గాలి చిరుగాలి.. నిను పిలిచిందెవరమ్మా) అనే పాట బాధలో ఉండే స్నేహితుడిగా మనోధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఓ మై ఫ్రెండ్ సిద్ధార్థ్, శృతి హాసన్, హన్సిక, నవదీప్ ప్రధాన పాత్రలుగా 'ఓ మై ఫ్రెండ్' అనే సినిమా 2011లో వచ్చింది. సినిమాలో చందు, సిరి అనే అమ్మాయి, అబ్బాయి మధ్య ఓ మంచి స్నేహాన్ని ఈ సినిమాలో చూపించారు. హ్యాపీడేస్ వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, సోనియా తదితరులు ప్రధాన పాత్రలు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం 'హ్యాపీడేస్'. కాలేజ్ డేస్ లో పరిచయమయ్యే స్నేహాలు, వారి నుంచి లభించే స్వీట్ మెమొరీస్ ని బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో స్నేహితుల్లో ఉండే రకాలందరినీ చూపించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఉత్తమ స్నేహ చిత్రంగా రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’, మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటితో పాటు నీ స్నేహం, కేరింత, ఆర్య2 లాంటి చిత్రాలు కూడా స్నేహబంధాన్ని చక్కగా చాటిచెప్పాయి. -
చోటీ చోటీ బాతే... సితార, ఆద్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఇందులో మీ ఫ్రెండ్ ఏ కేటగిరీనో చెక్ చేసుకోండి
Happy Friendship Day 2021: అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన స్నేహ ప్రవాహం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫేస్బుక్, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్సుల్లో ఫ్రెండ్షిప్ గొప్పదనం గురించి కొటేషన్లు, దోస్త్‌ల ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. రెగ్యులర్‌గా ఫ్రెండ్షిప్ విలువ చెప్పే కంటెంట్‌కు ఇవాళ ఫుల్ గిరాకీ ఉంటుంది. అది చూసి కొందరికి ‘వావ్’ అనిపించొచ్చు.. మరికొందరికి ‘అబ్బో’ అనిపించొచ్చు. కానీ, ఎవరెన్ని అనుకున్నా స్నేహం అంటే.. . . . . . . . . . . ఒక కచ్చితమైన అవసరం. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ది బెస్ట్’, ‘స్నేహాన్ని మించిది లేదు’.. ఇలాంటి కొటేషన్స్ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. సింగిల్ కింగ్‌లైనా ఉంటారేమోగానీ.. ఫ్రెండ్ లేని మనిషి అరుదనే చెప్పాలి. జీవితంలో ఎవరితో షేర్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యే విషయాల్ని కూడా.. చివరికి ఏదో ఒక ‘బలహీన’ సందర్భంలో చెప్పుకునేది స్నేహితుడికే!. అలాగని మిగతా బంధాలను తక్కువేం చేయదు స్నేహ బంధం. అయితే స్నేహాల్లోనూ రకరకాలుంటాయి. అలాగే స్నేహితుల్లో రకరకాల మనస్తత్వాలవాళ్లూ ఉంటారు. అందుకే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీలోని ఆ జానర్ల గురించి సరదాగా చర్చించుకుందాం. పక్కా కమర్షియల్ స్నేహంలో అవసరం ఉండొచ్చు. కానీ, స్నేహాన్ని పూర్తి అవసరంగా మార్చుకునేటోళ్లూ ఉంటారు. మనిషిని అమితంగా ఆకర్షించే నెగెటివిటీ వల్ల చాలామందికి స్నేహం మీద కలిగే భావనే ఇది. అఫ్కోర్స్.. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఈ లోకంలో అన్నింటి కన్నా మిన్న అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. చివరికి డబ్బు-అంతస్థుల దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు తడబడుతుంది స్నేహం. టార్చర్ స్నేహం వీళ్లు ప్రాణ స్నేహితులంటూ చెప్తుంటారు. ఊరంతా ప్రచారం చేస్తారు. వీళ్ల మాటలు కోటలు దాటుతాయి. కానీ, పక్కలోనే ఉంటూ పోటు పోడుస్తుంటారు. నస పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే వీళ్ల స్నేహంలో ఒక స్వచ్ఛత ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. అవసరాల్లోనే కాదు.. ఆపదలోనూ వదలుకోలేని బలహీనత కనిపిస్తుంటుంది వీళ్ల స్నేహంలో. అందుకే ‘ఫ్రెండ్‌వి రా’ అనుకుంటూ కలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఏజ్‌లెస్ దోస్తులు ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. కానీ, స్నేహానికి వయసుతో సంబంధం ఉండదని మరో నిజం. ఇది నిరూపించే దోస్తులు మన చుట్టూరానే.. మనలోనే కనిపిస్తుంటారు. కలిసి సరదాలు చేస్తారు. గోలలు చేస్తుంటారు. కలిసే గోతిలో పడుతుంటారు. వాళ్ల స్నేహం వాళ్లకే కాదు.. అవతలి వాళ్లకూ ఎంటర్టైన్మెంట్ పంచుతుంటుంది. అవసరానికో స్నేహం ప్రతీ ఫ్రెండూ అవసరమేరా అనే కొటేషన్ తెలుసు కదా!. అలాగే ఈ రకం స్నేహంలో అవసరం తీరేంత వరకే స్నేహం కొనసాగుతుంది. ఆ అవసరంలో ఉన్నంత దాకా వీళ్లు వెంట నడుస్తారు. అవసరమైతే సాయం చేస్తారు. తీరా.. తమ అవసరం పూర్తిగా తీరాక హ్యాండిచేస్తారు. అపార్థాలు, అవమానాలు, అనుమానాల నడుమ ఇలాంటి స్నేహాలు కలకాలం కొనసాగడం కొంచెం కష్టమే!. ప్రాణ స్నేహితులు ఈ స్నేహం చాలా చాలా ప్రత్యేకం. చిన్న వయసు నుంచి మొదలై చివరిదాకా సాగే అవకాశాలే ఎక్కువ. ఈ స్నేహంలో రాగద్వేషాలు కనిపించేది అతితక్కువ. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునేంత స్థాయి వీళ్లలో ఉంటుంది. ప్రాణం పోయేంత వరకు స్నేహాన్ని విడిచిపెట్టవు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢబంధం వీళ్లది. పైగా ఎలాంటి తారతమ్యాలు లేనిది ఈ స్నేహం. అందుకే ‘చిలకా-కోయిల’లా కలకలకాలం కలిసి మెలిసి ఉంటారు. ఇలాంటి స్నేహంలో నడివయసులో పుట్టి కడదాకా సాగే స్నేహ బంధాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. లవ్లీ ఫ్రెండ్స్ అవతలి వాళ్లకు ఇదొక చిల్లర-చిచ్చర స్నేహం అనిపించొచ్చు. కానీ, వాళ్ల స్నేహంలో ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. వాళ్ల ఆనందం వాళ్లదే. అవతలి వాళ్ల గురించి అస్సలు పట్టించుకోరు. పోటాపోటీగా ఒకే అమ్మాయికి బీట్ కూడా కొడతారు. బడి నుంచి గుడి దాకా, రూమ్ నుంచి ఇంటి దాకా ప్రతీ విషయం చర్చించుకుంటారు. అవసరాలకు సాయం ఒకరికొకరు చేసుకుంటారు. కెరీర్ ఎదుగుదలకు వీళ్ల ప్రోద్భలం ఉంటుంది. అందుకే ఇది కూడా ఒక ప్రత్యేకమైన స్నేహమే!. ఇంటి స్నేహం స్కూల్, కాలేజీలు, ఆఫీసులు.. ఫ్రెండ్స్ అంటే ఇక్కడే దొరుకుతారా?. మనసు పెడితే ఇంట్లోనూ ఇంతకన్నా బలమైన స్నేహమే దొరుకుతుంది. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, బావాబామ్మర్ది, మామాఅల్లుడు, తాతామనవడు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బంధాలు స్నేహ బంధాలుగానూ మార్చుకోవచ్చు. సంతోషమొచ్చినా.. దుఖమొచ్చినా వాళ్లతో పంచుకుని మనసు కుదుటపర్చుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో అపార్థాలకు చోటు ఉండని ఏకైక స్నేహం.. ఇంటి స్నేహమే! వాట్సాప్ బ్యాచ్ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటారు. సంవత్సరాల దొర్లిపోయే దాకా గుర్తుండరు. సడన్‌గా గుర్తుకొస్తారు. ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. అడ్డగోలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తారు. అయితే మెసేజ్‌ల వరద.. లేదంటే గప్‌చుప్. ఇలాంటి స్నేహితులు గెట్ టు గెదర్‌లోనే కలిసేది. చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా. ‘గుర్తుకొస్తున్నాయి..’ అంటూ రీయూనియన్లలో సందడి చేసే బాపతి అన్నమాట. అఫ్కోర్స్.. బిజీ, టైం లేదంటూ కలయికను ఎగ్గొట్టి స్నేహితుల రోజున ఉప్పెనలా మెసేజ్‌లు పెట్టే దోస్తులు చాలామందే ఉన్నారండోయ్. ఇవేకాదు.. ఇంకా చాలా రకాల స్నేహాలే ఉంటాయి. అయితే నవ్వినా, తిట్టినా, ఏడ్పించినా, జోకులేసుకున్నా, చివరికి మోసానైనా తట్టుకుని నిలబడేది ఒక్క స్నేహమే. ఎంత చెప్పుకున్నా దూరాలను దగ్గర చేసే స్నేహం అంతిమంగా గొప్పదే. అందుకే ఆ బంధాన్ని గౌరవిస్తూ ఈ రోజును గుర్తించడం, అనుభవాలేవైనా అప్పటిదాకా జీవితంలో తారసపడిన రకరకాల స్నేహాల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడం తప్పేం కాదు. చివరగా.. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. -సాక్షి, వెబ్‌డెస్క్ -
అరరే ఫ్రెండ్స్ దగ్గరకు ఖాళీ చేతులతో ఎలా..? ఇలా ట్రై చేయండి..
‘‘ఈ రోజైనా ఫ్రెండ్‌ని కలిసి కాసేపైనా కబుర్లతో గడిపేద్దామంటే పనులు తెమలవు’’ ‘‘నా చేతులతో నేనే మంచి గిఫ్ట్ తయారు చేయాలనుకున్నాను. కానీ, సమయం లేదు’’ ‘‘చాలా రోజుల తర్వాత ఫ్రెండ్‌ను కలుస్తున్నాను, ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది...’’ ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఈ స్నేహితుల రోజున మదిని ముసురుతుంటాయి. కొన్నిసార్లు స్నేహితులను కలవడానికి వెళ్లి చివరి నిమిషంలో ‘అరరే, ఖాళీ చేతులతో కాకుండా ఏదైనా గిప్ట్‌తో వచ్చుంటే బాగుండేది’ అనుకుంటుంటారు. తెలిసినవీ, చిన్న చిన్నవే అయినా కొన్నిసార్లు వాటినీ మర్చిపోతుంటాం. ఇలాంటప్పుడు కొద్ది సేపట్లో కలవబోయే ఫ్రెండ్‌ను కూడా ఖుష్ చేయాలంటే ఈ సింపుల్ గిప్ట్ ఐడియాస్‌ను అమల్లో పెట్టేయచ్చు. చేతితో అద్భుతం.. కొన్ని గంటల సమయం ఉంటే మీ చేతులతో ఓ అందమైన గ్రీటింగ్ కార్డును తయారుచేయండి. కొద్దిగా సమయం ఉంటే గ్రీటింగ్ కార్డు కొనేయండి. అదీ లేదంటే, మీ చేతిలో ఓ తెల్లని కాగితం, పెన్ను ఉంటే చాలు. మీ చేతి రాతతో మీ ఫ్రెండ్ మీకెంత ప్రత్యేకమో తెలియజేస్తూ కొన్ని వాక్యాలు రాయండి. మీ ఫ్రెండ్‌కు మీలోని భావన అర్థమైపోతుంది. మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆన్లైన్ ద్వారా పంపాలనుకుంటే నచ్చిన కార్డును ఎంపిక చేసుకొని, దాని మీద మీదైన నోట్ రాసి, సెండ్ చేస్తే.. అవతలి మీ ఫ్రెండ్‌కు మీ మనసు దగ్గరైపోతుంది. చిట్టి టెడ్డీబేర్ యువతరం అయినా, పెద్దవాళ్లైనా టెడ్డీబేర్ అంటే చాలు వారి మనసులు చిన్నపిల్లల్లా గంతులు వేస్తాయి. మనస్పర్ధల కారణంగా కొద్దికాలంగా దూరంగా ఉన్న స్నేహితుల హృదయాలు కూడా స్నేహంగా కలిసిపోయినట్టుగా ఉండే హగ్ టెడ్డీబేర్‌ను చూస్తే కరిగిపోతాయి. ఇవి వివిధ రంగుల్లో రకరకాల పరిమాణాల్లో లభిస్తున్నాయి. మీ క్లోజ్ ఫ్రెండ్‌ను ఈ కానుక మరింత ఆకట్టుకుంటుంది. పెద్ద ఖర్చు కూడా ఉండదు. తియ్యటి స్నేహం ఫ్రెండ్‌కి ఏ బహుమతి నచ్చుతుందో ఏంటో అనే సందేహంలో ఉంటే మాత్రం చాక్లెట్లు మిమ్మల్ని రక్షిస్తాయి. ఏ చాక్లెట్ అయినా చాలా వరకు అందరికీ నచ్చుతాయి. అందుకే, మంచి చాక్లెట్‌ను ఈ రోజున కొన్ని నిమిషాల వ్యవధిలో గిఫ్ట్‌గా ఎంచుకోవచ్చు. బంధనం తమ మధ్య స్నేహ బంధం ఎప్పటì కీ నిలిచిఉంటుందని చెప్పడానికి గర్తుగా బంధనం కట్టుకుంటారు. అందుకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎన్నో వెరైటీలలో మార్కెట్లో ఉన్నాయి. మీకై మీరుగా రంగుల నూలు దారం, పూసలను ఉపయోగించి కూడా బ్యాండ్‌ను తయారు చేసుకోవచ్చు. మహమ్మారి కారణంగా దూరాన ఉన్న దోస్తానాలకు ఆన్లైన్ వారధిగా నిలుస్తుంది. చిన్న సందేశం, చేరవేసే కానుక ఎన్నో మైళ్ల దూరాన ఉన్న ఫ్రెండ్స్‌కు దగ్గరే ఉన్నామనే ఆలోచన వెయ్యేనుగుల బలాన్నిస్తుంది. పువ్వుల పరిమళం తాజా పువ్వులు ఎవరినైనా కాసేపు చిరునవ్వులో ముంచెత్తుతాయి. అందుకే తాజా పుష్పగుచ్ఛాన్ని కానుకగా ఇవ్వడం వల్ల స్నేహం కూడా ఎల్లప్పుడూ అంతే పరిమళ భరితంగా కొనసాగుతుంది. దూరాన ఉన్నాం, కలవలేం అనుకునేవారి కోసం ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ డే ఫ్లవర్స్ డెలివరీ దేశమంతటా ఉంది. అర్ధరాత్రికి కూడా డోర్‌డెలివరీ సదుపాయాలు ఉన్నాయి. ఎక్కువ కాలం మన్నేవి, డిజైన్ చేసిన పుష్పగుచ్చాలు కూడా ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా కలుసుకునే ఫ్రెండ్‌కి ఇంట్లో పూసిన కొన్ని పువ్వులను గుచ్ఛంలా తీసుకెళ్లి అందించవచ్చు. ఒకే ఒక కేక్ ట్రీట్ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక కేక్‌ను కట్ చేసి, పంచుకుంటే చాలు అప్పుడిక ఆనందానికి ఆకాశమే హద్దులా అనిపిస్తుంది. అందుకు, చాక్లెట్ కేక్, ఫ్రూట్ కేక్, నట్ కేక్.. ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఆన్లైన్ కేక్ సేవలూ ఈ రోజుల్లో అందుబాటుల్లో ఉన్న విషయం తెలిసింది. -
Friend Ship Day 2021: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
ఫ్రెండ్.. అందరికీ ఇష్టమైన పదం. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నట్లు.. బాధలో ఉన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది స్నేహితుడు.. సంతోషాన్ని పంచుకునేందుకు వెంట ఉండేది స్నేహితుడు. జాతి, మతం అన్న తేడాల్లేకుండా ఇద్దరు వ్యక్తులను కలిపిఉంచే బంధం కేవలం స్నేహానిది మాత్రమే. ఏ రక్త బంధంతో నిమిత్తం లేకుండా చివరి వరకు నిలిచేది స్నేహితుడు. ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే అన్న నానుడి కూడా స్వచ్ఛమైన స్నేహం నుంచి జన్మించిందే. ఏ స్వార్థం చూసుకోకుండా మనసు గెలిచిన స్నేహితుల బాగోగుల కోసం శ్రమించే స్వభావం ప్రస్తుత ప్రపంచంలో అరుదుగానే లభిస్తుందని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో చాలామంది స్నేహితులు కరోనా సమయంలో అండగా నిలిచారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడారు. కాల పరీక్షకు ఎదురుగా నిలుస్తూ స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంలా కనిపిస్తున్న పలువురిపై స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనాలు.. ఫేస్బుక్ మిత్రుల రూ.1.12లక్షల సాయం సాక్షి, ధర్మపురి(కరీంనగర్): ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద మహిళకు ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచి రూ.1.22లక్షల సాయం అందించారు. ధర్మపురికి చెందిన నరుముల లక్ష్మీ భర్త కొన్నినెలల క్రితం చనిపోయాడు. కొడుకు పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. కూలీపని చేస్తూ.. కూతురును బీఈడీ చదివిస్తోంది. భర్త మరణంతో పోషణ కష్టమైంది. ఇల్లుగడవని పరిస్థితి ఎదురైంది. కూతురు చుదువు మానిపించేద్దామని అనుకుంది. విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ లక్ష్మీ కష్టాలను గురించి జూలై 5న ఫేస్బుక్లో పోస్టుచేసి సాయం అందించాలని మిత్రులను కోరాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారై మిత్రులు రూ.1.17లక్షలు, ధర్మపురికి చెందిన కొరెడె కిరణ్‌కుమార్ మిత్రబృందం రూ.5 వేలు సాయం అందించారు. డిపాజిట్ బాండ్లను సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్ చేతుల మీదుగా శనివారం అందించారు. ఆదుకున్న స్నేహితులు కోరుట్ల: తమతో చదువుకున్న స్నేహితుల్లో మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరు.. ఏడాది క్రితం అనారో గ్యంతో మరొక రు మృతి చెందడంతో మిత్రులు వారి కుటుంబాలకు అండగా నిలిచారు. కోరుట్లలోని ఆదర్శ విద్యాలయం 1994–95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విడిపోయినా తమ స్నేహ బంధాన్ని వీడలేదు. ఈ మిత్ర బృందంలో గాజెంగి శ్రీధర్ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు పోతుగంటి శ్రీనివాస్, అంబల్ల ఆనంద్, తాళ్ల్లపల్లి శ్రీనివాస్‌లు తమ మిత్రు ల సహకారంతో రూ.1,02,000 శ్రీధర్ కూతురు నిత్య పేరిట డిపాజిట్ చేశారు. మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి రూ.1,60,000 ఆర్థికసాయం అందించారు. బడి సోపతికి 37ఏళ్లు బోయినపల్లి(చొప్పదండి): విభిన్నానికి మారుపేరు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్. ఆయనకు స్నేహమంటే ప్రాణం. స్నేహాన్ని మనసుతో చూస్తారు. ఉద్యోగంతో పాటు స్నేహాన్ని సైతం ఓ బాధ్యతగా తీసుకుని 37ఏళ్లుగా అల్లుకుపోతున్నారు. హుస్నాబాద్ 1983–84 ఎస్సెస్సీ బ్యాచ్ ఇతడిది. బడిసోపతులు పేరిట శ్యాంప్రసాద్‌లాల్ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో ఉన్న స్నేహితులను సమన్వయం చేసుకుంటూ, సోపతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ గెట్టు గెదర్ నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి అశోక్, కొండూరి శ్రీనివాస్, ఆశోక్‌కుమార్ కామారపు, అన్నవరం శ్రీనివాస్, బాపిరాజు, రజని, లత, ఉమారెడ్డి కోర్‌కమిటీ సభ్యులతో ముందుకు సాగుతున్నారు. అనుకోకుండా చనిపోయిన ఇద్దరు మిత్రుల కూతుళ్ల వివాహానికి రూ.4 లక్షలు, ఆర్థికంగా లేని స్నేహితుల కూతుర్ల వివాహానికి రూ.2.50 లక్షలు, అనారోగ్యంతో బాధ పడుతున్న మిత్రులకు రూ.2లక్షల చొప్పున సాయం అందించారు. పాతికేళ్ల స్నేహం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లలో నివాసం ఉంటున్న వేముల తిరుపతి, ఎలగొండ రవీందర్ టైలరింగ్ పని మీద తొ లిసారి బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లినపుడు కలుసుకున్నారు. దాదాపు పాతికేళ్లుగా కలిసే ఉంటున్నారు. రవీందర్ కుటుంబం కరోనా బారిన పడగా.. తిరుపతి అన్ని వి«ధాలుగా అండగా ఉండి మనో«ధైర్యం కలిగించాడు. దైవం కలిపిన బంధం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లకు చెందిన హనుమాండ్ల శ్రీకాంత్, మహ్మద్ ఫరీ ద్ ఆరోతరగతి నుంచి స్నేహితులు. గత మే నెలలో శ్రీకాంత్ ఇంట్లో అందరూ కోవిడ్ బారిన పడ్డారు. ఫరీద్ కు ఫోన్ చేశాడు శ్రీకాంత్. రాత్రి గంటలకు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆక్సిజన్ లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడ పడకలు లేవు. తనకున్న పరిచయాలతో ఆక్సిజన్ బెడ్ తెప్పించాడు. వారంపాటు కంటికి రెప్పలా కాపాడాడు. ‘మొదట్నుంచి అతనే లేకపోతే ఈ రోజు నేనిలా ఉండలేక పోయేవాడిని’ అని శ్రీకాంత్ చెప్పాడు. క్లాస్మేట్స్.. జాబ్మేట్స్ బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లికి చెందిన మాడిచెట్టి సాయికిరణ్, వాసాల సంతోశ్, మోగులోజి నరేశ్ ఊహ తెలిసినప్పటి నుంచి స్నేహితులు. ఒకేపాఠశాల,ఇంటర్, డిగ్రీ కలిసి చదివారు. గ్రామంలో కలిసి సాధనచేసి 2019లో పోలీస్ ఉద్యోగాలు సాధించారు. సాయికిరణ్ ఏఆర్ పీసీగా కరీంనగర్లో, సంతోష్ మంచిర్యాలలో టీఎస్ఎస్పీ పీసీగా, నరేశ్ సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో పీసీగా ఉద్యోగం చేస్తున్నారు. -
స్నేహబంధమూ ఎంత మధురమూ...
... చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము అని రాశారు కవి ఆత్రేయ. ‘అల్లాయే దిగి వచ్చి అడిగినా ఒక్క దోస్తే చాలంటాను’ అని రాశారు సినారె. ‘బతుకు తీపి పాటలో మధుర స్వరాలే స్నేహితులు’ అని రాశారు సిరివెన్నెల. స్నేహం, చెలిమి, మైత్రి, సోబత్, సావాసం, జత గట్టడం, నేస్తు కావడం... మాటలు ఏవైనా స్నేహితులు లేకపోతే ఆ జీవితం చిరుగాలికి, జల్లింతకు, సేద తీరే నీడకు వీలు లేని నిరర్థక వృక్షంలా ఉంటుంది. ఈ క్వారంటైన్ కాలంలో ఎవరు ఎక్కడ బందీ అయినా ఒక్క స్నేహితుడి ఫోన్ కాలే కదా ఊపిరి. దేవుడా... జేబులో రూపాయి ఉన్నా లేకున్నా చుట్టూ పది మంది స్నేహితులు ఉండే శ్రీమంతులతో ఈ లోకాన్ని నింపు. జగత్తును స్నేహమయం చెయ్. ‘దేవదాసు’ అక్కినేనికి స్నేహితుడు ‘భగవాన్’ అనే పేకేటి శివరాం మేలు చేశాడో కీడు చేశాడో చెప్పలేం. ప్రేమ విఫలమైన దేవదాసుకు మందు ఒక మందుగా సిఫార్సు చేస్తాడు పేకేటి శివరాం. అంతే కాదు... చంద్రముఖిని పరిచయం చేస్తాడు. మందు దేవదాసును నాశనం చేస్తే చంద్రముఖి కొంత ఓదార్పునైనా మిగిల్చింది. మంచికైనా చెడుకైనా సినిమాల్లో హీరోలకు స్నేహితులు ఉన్నారు. ‘పాతాళభైరవి’లో ఎన్.టి.ఆర్కు అంజిగాడు (బాలకృష్ణ) ఫ్రెండు. కాని బాలకృష్ణ అనే పేరు ఎవరూ తలవరు. మరణించేవరకూ ఆయన అంజిగాడే. స్నేహితుడికి మారుపేరు. ‘ఏడ్రా... మీ అంజిగాడు’ అనంటే ‘ఏడి.. మీ ఫ్రెండు’ అని అర్థం. తెలుగు సినిమాల్లో ఆ తర్వాత ఇదో ఫార్ములా అయ్యింది. హీరో పక్కన కమెడియన్ ఫ్రెండ్‌గా ఉండటం. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. బ్రహ్మానందంతో మొదలు సునీల్. శ్రీనివాస రెడ్డి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... వీరంతా అలాంటి ఫ్రెండ్సే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రతో సమానంగా రాహుల్ రామకృష్ణ పాత్ర ప్రేక్షకులకు నచ్చింది. ట్రూ ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ ఆ సినిమాలో. అర్జున్ రెడ్డి అనేముంది ఎవరైనా సరే జీవిత సంక్షోభాలు దాటాలంటే అలాంటి ఫ్రెండే కదా ఉండాలి. ∙∙ కుటుంబ సంబంధాలు, అన్నదమ్ముల లాస్ట్ అండ్ ఫౌండ్ ఫార్ములా... ఇవి కథలవుతున్న వేళ స్నేహం, స్నేహితుల పాత్రలు సినిమా కావడం తక్కువగా జరిగింది. కాని 1967లో హిట్ అయిన తమిళ సినిమా ‘పంద్యం’ ఆధారంగా తెలుగులో ‘మంచి మిత్రులు’ రీమేక్ అయ్యింది. కృష్ణ, శోభన్‌బాబు ఫ్రెండ్స్. ఒకరు నీతి మార్గంలో, ఒకరు నేర మార్గంలో బయలుదేరి సగం దారి తర్వాత మార్గాలు తారుమారు చేసుకుంటారు. తెలియకనే ఒకరికి ఒకరు శతృవులవుతారు. స్నేహం, నైతికత వీటిలో ఏది ప్రధానం అనే చర్చ వస్తుంది. ఇందులోని ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ పాట నేటికీ స్నేహితులు చాలారోజుల తర్వాత కలిస్తే పాడుకునే పల్లవిగా నిలిచి ఉంది. దాని కొనసాగింపుగా 1972లో ‘బాలమిత్రుల కథ’ వచ్చింది. కామందు కొడుకు, పాలేరు కొడుకు స్నేహితులుగా ఉండగలరని చూపింది. ‘గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి’ పాట ఇప్పటికీ స్నేహపు పిందెలను కాయలను కాస్తూనే ఉంది. 1973లో ‘స్నేహబంధం’ వచ్చి ‘స్నేహబంధము ఎంత మధురము’ అనే నిర్వచన గీతాన్ని ఇచ్చింది. 1974 ‘నిప్పులాంటి మనిషి’లో ఎన్.టి.ఆర్కు సత్యనారాయణ వంటి గట్టి స్నేహితుణ్ణి చూపింది. ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అని చెప్పింది. 1977 సంవత్సరం చిత్రంగా రెండు స్నేహాలను తెలుగు ప్రేక్షకులకు చూపింది. ఒకటి హిందీలో ‘దోస్తీ’ ఆధారంగా బాపు తీసిన ‘స్నేహం’. మరొకటి ఎన్.టి.ఆర్ తీసిన ‘దానవీరశూరకర్ణ’. ‘స్నేహం’ వికలాంగుడికి, అంధుడికి మధ్య ఉన్న స్నేహం చూపితే ‘దానవీరశూరకర్ణ’ అవాంఛిత శిశువు అవడం వల్ల న్యూనతను అనుభవించాల్సి వచ్చిన కర్ణునికి బాసటగా నిలిచిన దుర్యోధనుని స్నేహం చూపింది. నిండు సభలో కర్ణుణ్ణి అవమానించినందుకే కదా ఎన్.టి.ఆర్ చరిత్రాత్మక సుదీర్ఘ డైలాగ్ ‘హితుడా... ఆగాగు... ఏమంటివి ఏమంటివి’ చెప్పింది. ‘స్నేహం’లో స్నేహం విలువ చెప్పే ‘నీవుంటే వేరే కనులెందుకు’... ఎంతో తీయగా ఉంటుంది. ∙∙ 1978లో ప్రఖ్యాత కన్నడ దర్శకుడు పుట్టణ్ణ ఈ స్నేహానికి సామాజిక బాధ్యత ఇస్తూ ఒక కొత్త ఫార్ములాతో ఒక సూపర్‌హిట్ సినిమా తీశాడు. అదే తెలుగులో ‘మనవూరి పాండవులు’గా వచ్చింది. ఐదుమంది స్నేహితులు కలిసి ఊళ్లోని ఒక రాక్షసుణ్ణి తుదముట్టించడం కథ. ఇది తర్వాతి కాలంలో పెద్ద హిట్ ఫార్ములా అయ్యింది. వెంకటేశ్ తొలి సినిమా ‘కలియుగ పాండవులు’తో మొదలెట్టి ‘శివ’,‘యువసేన’, ‘ఠాగూర్’, ‘మల్లన్న’, ‘స్పైడర్’.... ఈ సినిమాలన్నింటిలో బేస్ ఫార్ములా ఇదే. స్నేహితులు విడివిడిగా ఉంటే స్నేహితులే అవుతారు. కాని ఏకమైతే పెద్ద శక్తి అవుతారు. ∙∙ కమర్షియల్ సినిమా స్నేహాన్ని కథాంశంగా రెగ్యులర్‌గా తీసుకుంటూనే ముందుకు వెళ్లింది. కృష్ణంరాజు, శరత్‌బాబు ముఖ్యపాత్రల్లో ‘ప్రాణస్నేహితులు’ వచ్చింది. ఇందులోని ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ పాట హిట్ అయ్యింది. బాలకృష్ణ, మోహన్‌బాబులతో ‘ప్రాణానికి ప్రాణం’ వచ్చింది. ‘చిన్నారి స్నేహం’, ‘పెళ్లిపందిరి’, ‘కొండవీటి రాజా’, ‘స్నేహం కోసం’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘హనుమాన్ జంక్షన్’... ఇంకా ఈ వరుస ఎక్కువగానే ఉంది. మరోవైపు రజనీకాంత్ స్నేహాన్ని గట్టిగా చూపుతూ ‘దళపతి’, ‘బాషా’, ‘కథానాయకుడు’, ‘ముత్తు’ వంటి సినిమాలు ప్రేక్షకులకు ఇచ్చాడు. ∙∙ అయితే అమ్మాయి అబ్బాయిల మధ్య స్నేహం ఉండకూడదా అనే సూచన చేస్తూ సినిమాలు మొదలయ్యాయి. తెలుగులో డబ్ అయిన తమిళ సినిమా ‘ప్రేమదేశం’ ఈ స్నేహాన్ని ప్రతిపాదించింది. అబ్బాస్, వినీత్, టబూ ఒకరి ఆకర్షణలో మరొకరు పడినా స్నేహితులుగా మిగులుతారు. ఇందులోని ఫ్రెండ్షిప్ సాంగ్ ‘ముస్తఫా ముస్తఫా డోంట్‌వర్రీ ముస్తఫా’కు యువతరం ఊగిపోయింది. ఈ కథ చిరంజీవి అంతటి స్టార్‌ను ఎట్రాక్ట్ చేసి ‘ఇద్దరు మిత్రులు’ కథ చేశాడు. అందులో సాక్షి శివానంద్, చిరంజీవి ఫ్రెండ్స్. వెంకటేశ్ ‘వసంతం’లో కల్యాణికి మంచి ఫ్రెండ్‌గా ఉంటాడు. ‘నువ్వే కావాలి’లో హీరో హీరోయిన్లు తాము ఫ్రెండ్స్‌గా ఉంటూ చివరకు ప్రేమికులుగా కూడా ఉందాం అని నిశ్చయించుకుంటారు. కాని అమ్మాయి, అబ్బాయిల మధ్య స్నేహం ఎప్పుడూ కత్తి మీద సామే సినిమాగా తీయాలంటే. ∙∙ కాలం మారింది. కొత్త దర్శకులు వచ్చారు. కొత్త స్నేహాన్ని చూపారు. ‘గమ్యం’లో శర్వానంద్ జీవితాన్ని అల్లరి నరేశ్ స్నేహం, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నాని జీవితాన్ని విజయ్ దేవరకొండ స్నేహం, ‘మహర్షి’లో మహేశ్ బాబు జీవితాన్ని అల్లరి నరేశ్ స్నేహం పూర్తిగా మార్చేస్తాయి. శేఖర్ కమ్ముల ‘హ్యాపిడేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కాలేజీ స్నేహాన్ని అందంగా చూపింది. ‘శంభో శివ శంభో’, ‘ఓ మై ఫ్రెండ్’, ‘కేరింత’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘జాతిరత్నాలు’... ఇవన్నీ ఇటీవలి స్నేహితులను చూపిన సినిమాలు. స్నేహం ఉన్నంత కాలం స్నేహాన్ని చూపే సినిమాలు ఉంటాయి. ఎందుకంటే స్నేహం ఎప్పుడూ ఒక జీవమున్న కథా ఊట. చిన్నారి స్నేహమా... చిరునామా తీసుకో గతమైన జీవితం.. కథలాగా దాచుకో మనసైతే మళ్లీ చదువుకో.... ‘ప్రేమదేశం’లో... -
యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు వద్దన్నారు.. కానీ
సితార–ఆద్య... మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘ఎ అండ్ ఎస్’ పేరుతో యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. చిన్నారులిద్దరూ యూ ట్యూబ్‌లో చేసే సందడిని లక్షల మంది వీక్షిస్తుంటారు. పండగలప్పుడు, ప్రత్యేక రోజుల్లోనూ, విడిగానూ సితార, ఆద్య చేసే స్పెషల్స్ ఫాలోయర్స్‌ని ఆకట్టుకుంటుంటాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిన్నారులిద్దరూ ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ఈ విధంగా.. ► మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది? సితార: మా స్నేహం ‘మహర్షి’ సినిమా ఓపెనింగ్ అప్పుడు మొదలైంది. అక్కడ పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆద్య వాళ్ల మమ్మీకి మా మమ్మీ ఫోన్ చేసి ఆద్యను ఇంటికి పిలిచింది. అలా మళ్లీ కలిశాం. మా ఇద్దరికీ డాల్స్ అంటే ఇష్టం. మా వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయి, ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయ్యింది. ఆద్య: మేమిద్దరం ఒకే స్కూల్. అయితే ‘మహర్షి’కి ముందు ఎప్పుడూ సితారతో మాట్లాడలేదు. ఆ సినిమా అప్పుడు కలిసిన తర్వాతే సితారతో నా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ► మీకు గొడవలు వస్తుంటాయా? మీ ఒపీనియన్స్ సేమ్‌గా ఉంటాయా? ఇద్దరూ: మా ఇద్దరికీ అభిప్రాయభేదాలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఎన్ని గొడవలొచ్చినా పది నిమిషాలు మాత్రమే. ► మీరు ఏదైనా కొత్తగా చేస్తాం అన్నప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇద్దరూ: యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ‘చిన్నపిల్లలు కదా.. ఇప్పుడే ఇంటర్నెట్ అవీ వద్దు’ అన్నారు. కానీ ఫైనల్‌గా ఒప్పుకున్నారు. ► మీ ఇద్దరిలో ఒకరికొకరికి నచ్చేదేంటి? ఆద్య: సితార చాలా ఫన్నీగా ఉంటుంది. షీ ఈజ్ వెరీ కేరింగ్ అండ్ లవింగ్. సితార: షీ ఈజ్ లైక్ మై బిగ్ సిస్టర్. తను నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది. ► మీ ఇద్దరూ కలిసి హాలిడేకి ఎక్కడికైనా వెళ్లారా? ఇద్దరూ: ఇద్దరం కలిసి వెళ్లిన ఫస్ట్ ట్రిప్ లండన్. అది మా ఇద్దరికీ ఒక మెమొరబుల్ హాలిడే. అక్కడ చాలా షాపింగ్ చేశాం అండ్ బోలెడన్ని మ్యాచింగ్ ఐటెమ్స్ కొన్నాం. ► యూ ట్యూబ్ చానెల్లో వీడియోస్ ఐడియాలు ఎవరివి? ఆద్య: ఇద్దరం ఐడియాలు డిస్కస్ చేసుకుంటాం. సితార: కానీ జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆద్య ఇస్తుంటుంది. ► హీరో మహేశ్‌బాబు–నమ్రతల కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి–మాలినిల కుమార్తె ఆద్యతో స్పెషల్ చోటే చోటే బాతె ఈరోజు ఉదయం 10.30 గంటలకు... మీ ‘సాక్షి’ టీవీలో... ► వెండితెరపై స్నేహ సుమాలల్లిన చిత్రాల తడికన్నులనే తుడిచిన నేస్తమా స్పెషల్ ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... ► వెండితెరపై అలరించిన స్నేహగీతాల పల్లకి స్నేహ గీతం ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... ► స్నేహితులుగా మారిన వెండితెర గాయకులు... ట్రెండ్ సెట్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ సింగర్స్ సాహితి, అదితి, శ్రుతీల లైవ్ షో ముస్తఫా ముస్తఫా ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... ► రియాల్టీ షోలే కాదు రియల్ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్ అయిన అరియానా, హారికలతో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గరం గరం న్యూస్ ఈరోజు రాత్రి 8.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో... -
మా స్నేహానికి రేంజ్ అడ్డు కాదు!
ఒకరితో స్నేహం చేయడం అంటే ఓకే. ఇద్దరు ముగ్గురు స్నేహితులున్నా ఓకే. అభిప్రాయభేదాలు ఉన్నా సర్దుకుపోవచ్చు. కానీ పదమూడు మంది స్నేహితులంటే సర్దుబాట్లు చాలా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేశ్, తాగుబోతు రమేశ్, ధన్‌రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్ నేని, నందు, రఘు... వీరంతా మంచి స్నేహితులు. స్నేహానికి విలువ ఇచ్చే ఈ 13 మంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇచ్చుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ స్నేహబంధం గురించి అడిగిన ‘సాక్షి’తో నటుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విశేషాలు. ►మా పదమూడు మందికి ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. పేరు ‘ఫ్లయింగ్ కలర్స్’. మేమంతా ఆర్టిస్టులుగా రంగుల ప్రపంచంలో ఉంటాం కాబట్టి, ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు ఫ్లై అవుతుంటాం కాబట్టి మా గ్రూప్‌కి ‘ఫ్లయింగ్ కలర్స్’ అని పెట్టుకున్నాం. ►మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడే ఆర్టిస్టులమే. అయినా కానీ అదంతా ప్రొఫెషనల్ లైఫ్. ఫ్రెండ్షిప్ విషయంలో రేంజ్‌ని పట్టించుకోం. పోటీని దూరంగా ఉంచుతాం. ‘వెన్నెల’ కిశోర్ అయినా ఒకటే.. నవీన్, శ్రీనివాస్ రెడ్డి అయినా ఒకటే. అందరం సరదాగా ఒకరికొకరం అన్నట్లుగా ఉంటాం. ►అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం. ఒకరికొకరు చాన్సులు చెప్పుకునే అవసరం ఉండదు. గ్రూప్‌లో ఇలాంటి విషయాలను కలపం. మా గ్రూప్‌లోని సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా మీట్ అవుతుంటాం. ముఖ్యంగా ఏవైనా పండగలు, శుభకార్యాలప్పుడు కలుస్తుంటాం. ►మేం తీసిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నాం. కానీ ఆర్టిస్టులుగా మేమందరం బిజీగా ఉన్నాం. అయితే మళ్లీ ఓ సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ►ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్నా, ఆ తర్వాత ఎవరికి వారు కంట్రోల్ కాగలిగినవాళ్లమే. సో... మా మధ్య పెద్దగా సమస్యలు రాలేదు. అందరూ సరదాగా ఉంటాం. రిలాక్సేషన్ కోసం ఫన్నీ కౌంటర్స్ వేస్తుంటాం. ∙మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్ టైమ్‌లో కొందరికి హెల్ప్ చేశాం. ►మామూలుగా నెలకోసారి కలవడం మా అలవాటు. అప్పుడు డ్రెస్ కోడ్ అనుకుంటాం. ఉదాహరణకు చిల్డ్రన్స్ డే అంటే స్కూల్ డ్రెస్సులు, పండగలప్పుడు అందుకు తగ్గ డ్రెస్సులు. కరోనా వల్ల మా మీటింగ్స్ కట్ అయ్యాయి. ఈ ఫ్రెండ్షిప్ డేకి కలుద్దామనుకున్నాం కానీ కరోనా టైమ్ కాబట్టి వద్దనుకున్నాం. -
స్నేహమేరా జీవితం
-
అన్‌లాక్ ఫ్రెండ్షిప్
ఫ్రెండ్షిప్ డే వస్తుందంటే హడావుడి అంతా ఇంతా కాదు.. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దల దాకా ఫ్రెండ్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు ఎన్నో ఏర్పాట్లు చేసుకునేవారు.. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, గిఫ్టులతో మార్కెట్లు కళకళలాడేవి.. రెస్టారెంట్లు, పబ్స్ ముస్తాబయ్యేవి.. షాపింగ్ మాల్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించేవి.. కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ నుంచి అన్‌లాక్ అవుతున్నా.. ఎక్కడి వారు అక్కడే ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. హంగు ఆర్భాటాలకు పోకుండా ఫోన్లలోనే శుభాకాంక్షలు తెలుపుకుంటామని పలువురు అంటున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పలువురు సాక్షితో ముచ్చటించారు. సాక్షి, హైదరాబాద్: వ్యక్తిత్వాల మధ్య వికసించిన స్నేహానికి నిర్వచనం అవసరం లేదేమో..! కొన్ని స్నేహాలకి బాల్యం బాటలు వేస్తుంది. ఇంకొన్ని నేస్తాలకి చదువులు, కాలేజీలు బాసటగా నిలుస్తాయి..! ఐతే మరికొన్ని స్నేహబంధాలను అభిరుచులు, ఆలోచనలు కలుపుతాయి. అలా మమేకమైన మిత్రద్వయం అరవింద్ పకిడే–భరత్ రామినేని. వీరు ఎంచుకున్న దారులు వేరైనా చేరాలనుకున్న గమ్యం మాత్రం ఒక్కటే. అరవింద్‌కి గతించిన చరిత్రని, సంస్కృతిని వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడం అభిరుచి. తెలంగాణకు చెందిన చారిత్రక కట్టడాలను. శాసనాలను, సంస్కృతిని, మనకు తెలియని మహోజ్వల వారసత్వ సంపదను తన పరిశోధనల ద్వారా వెలికి తీసి ప్రపంచానికి చూపిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లోని దాదాపు 1100 గ్రామాలు సందర్శించి చరిత్ర గర్భంలో అంతరించిపోతున్న వందల సంవత్సరాల సంపదని గుర్తించి, వాటి విశేషాలను గూగుల్‌లో నిక్షిప్తం చేస్తున్నాడు. తను సేకరించిన సమాచారం మేరకు విదేశీ సైంటిస్టులు సైతం ఇక్కడకొచ్చి రీసెర్చ్ చేయడం విశేషం. భరత్కేమో ప్రాచీన విశిష్ట సంపదను భ్యవిషత్ తరాలకు ఆధారాలుగా తన ఫొటోగ్రఫీతో బంధించడం ఇష్టం. ప్రకృతిలో ఉన్న నిగూఢార్థాన్ని బయటపెడుతూ, జీవితంలో ఇమిడి ఉన్న సంస్కృతి, సంప్రదాయాలకు ఫొటోలతో ప్రాణం పోస్తుంటాడు. కరోనా కలి్పంచిన కాస్త విశ్రాంతి సమయంలో ఈ మిత్రులు ‘ది అన్‌టోల్డ్ తెలంగాణ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ఈ ఛానెల్ ద్వారా వారు వెలికితీసిన చారిత్రాత్మక వింతలు, విశేషాలను యావత్ సమాజానికి చేరువ చేస్తున్నారు. ‘లాక్డౌన్ విధించిన వారం తర్వాత మాకు అర్థం అయ్యింది. ఇది ఇప్పుడే ఎండ్ అయే పరిస్థితి లేదని.. అంటే మాకు చాలా కాలం వర్క్, ఇన్కమ్ ఉండదని’ అంటూ గుర్తు చేసుకున్నారు బ్యాండ్ వ్యవస్థాపకులు సాయితేజ. దీనిపై తన స్నేహితుడు, బ్యాండ్‌లో సౌండ్ ఇంజినీర్ అభ్యుదయ్తో కలిసి ఆలోచించాడు. ‘బయటకు వెళ్లి పెర్ఫార్మ్ చేయడం ఇప్పుడప్పుడే కుదరదు.. సో డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీదే లైవ్ ఇన్ సింక్‌లో ఏదైనా చేయాలి అనుకున్నాం.. మా మ్యుజిషియన్స్ ఎక్కడెక్కడో ఉండి కూడా అంతా కలిసి ఒక ఈవెంట్ చేయవచ్చా? అని జూమ్ ద్వారా ట్రై చేస్తే అది సాధ్యం కాదని తేలింది. కొందరు వెబ్ డెవలపర్స్‌తో మాట్లాడాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైవ్ శైలుల్ని పరిశీలించాం. ఈ లాక్డౌన్ 2 నెలలు కష్టపడి అత్యున్నత నాణ్యతతో అచ్చంగా లైవ్ పెర్ఫార్మెన్స్ చూసిన ఫీల్ ఇచ్చేలా ఎకోస్ ప్రాజెక్ట్ డిజైన్ చేశాం. దీనికి కొందరు టెక్నీషియన్స్ సాయం తీసుకున్నాం. మా బ్యాండ్‌కి దాదాపు కేరాఫ్‌గా మారిపోయిన మూన్షైన్లో అయితే వ్యూయర్స్‌కి మరింత నాచురల్‌గా అనిపిస్తుందని అక్కడే మా ఫస్ట్ పెర్ఫార్మెన్స్(డిజిటల్) ప్లాన్ చేశాం. ఎకోస్ ద్వారా సిటీలోని మ్యూజిక్ లవర్స్‌కి ఐ ఫీస్ట్ అందించాం’ అని చెప్పారు తేజ. ఈ పెర్ఫార్మెన్స్కి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు వీరు మరిన్ని ప్రదర్శనలకు, మరెవరైనా ప్రదర్శనలు ఇస్తే వారికి ఎకోస్ వేదికను అందించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే గాయని చిన్మయి ప్రదర్శనకూ సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వర్చువల్ జుంబా పార్టీ సృష్టి.. ఫ్రెండ్షిప్ డే కోసం స్పెషల్ లాక్డౌన్ టైమ్‌లో డిజైన్ చేసిన స్నేహితురాళ్లు సిటీలో పరిస్థితుల కారణంగా పారీ్టలు ఎంజాయ్ చేయలేక డల్‌గా మారిన యూత్‌కి ఫుల్ జోష్ పంచారు నగరానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు. 2 నెలలుగా వీరు ప్లాన్ చేసి ఫ్రెండ్ షిప్ డే కోసం సమరి్పంచిన వర్చువల్ జుంబా పార్టీ ఫర్ ఫ్రెండ్స్ సిటీ యూత్‌ని ఉర్రూతలూగించింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీజర్ యాడ్స్‌తో సందడి చేస్తున్న ఈ పార్టీని ఇద్దరు ఫ్రెండ్స్ డిజైన్ చేయడం విశేషం. నగరంలో నివసించే ల్యాగ్స్గా పాపులరైన జగత మురళీ ధరణ్ జుంబా, బచతా, సల్సా వంటి డ్యాన్స్ ఫిట్నెస్ స్టైల్స్‌కు ట్రైనర్‌గా సిటీలో ఫేమస్. అలాగే మరో జుంబా ట్రైనర్ తన స్నేహితురాలు అభిజ్ఞ ఉత్తలూరు కూడా చాయ్ బిస్క్, కిర్రాక్ స్టైల్స్ ద్వారా పాపులర్. కొన్నేళ్లుగా వీరి మధ్య ఉన్న స్నేహం లాక్డౌన్ తర్వాత కొత్త షేప్ తీసుకుంది. ఇద్దరూ కలిసి సిటీలో ఫ్రెండ్ షిప్ డే సంబరాలకు తమదైన ఫిట్నెస్ అందించాలనుకున్నారు. జూమ్ యాప్‌తో నిర్వహించిన ఈ పారీ్టల్లో ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి పాల్గొనాలని కోరారు. నగరంలో ఇద్దరు జుంబా ట్రైనర్లు అది కూడా వర్చువల్‌లో జుంబా సెషన్ నిర్వహించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ఎకోస్ ప్రాజెక్ట్‌కి ప్రాథమిక పెట్టుబడిగా ఈ ఇద్దరు స్నేహితులు రూ.70 వేల దాకా ఖర్చు చేశారు. బహిరంగ ప్రదర్శనలకు అవతల మ్యూజిక్ ఈవెంట్స్‌కి కొత్త దారి చూపించారు. ‘పెర్ఫార్మెన్స్ సాగుతుండగానే వీడియో ఎడిటింగ్ వగైరాలు కూడా మా ఎకోస్ ద్వారా చేసేయవచ్చు. అంటే ప్రదర్శన పూర్తి కాగానే పూర్తిగా ఎడిట్ అయిన రికార్డెడ్ ప్రోగ్రామ్ అప్‌లోడింగ్‌కి అందుబాటులో ఉంటుంది’ అంటూ చెప్పిన తేజ ఇకపై ఈ ఎకోస్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు అందించనున్నామన్నారు. అన్ని రకాల బ్రాడ్ కాస్టింగ్స్కూ ఇది వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉండబోతోందని తేజ పేర్కొన్నారు. గత నెలలో ఓ వారాంతపు రోజు.. రాత్రి 8 గంటల సమయం.. సిటీలోని సంగీత ప్రియులు ఇష్టమైన పానీయాలు తాగుతూ.. నచి్చన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ.. ఫిలింనగర్‌లోని ఓ క్లబ్లో ఏర్పాటైన సిటీ టాప్ బ్యాండ్ క్యాప్రిసియో బృందం లైవ్ పెర్ఫార్మెన్స్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అదేంటీ లాక్డౌన్ టైమ్‌లో ఇదెలా సాధ్యం? ఆ ప్లేస్‌కి ఎలా వెళ్లారు? అంటూ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు సిటీలోని మ్యూజిక్ లవర్స్ ఎక్కడి వాళ్లు అక్కడే ఎవరి ఇళ్లలో వాళ్లే ఉన్నారు. కానీ అచ్చమైన లైవ్ పెర్ఫార్మెన్స్ని ఆస్వాదించారు. అదెలా అంటే అదే మా ఎకోస్ అని సగర్వంగా చెబుతున్నారు ఎకోస్ని సృష్టించిన ఇద్దరు స్నేహితులు తేజ, అభ్యుదయ్. వీకెండ్ విందుల్లేవు.. వినోదాల్లేవు.. వీనుల విందు చేసే సంగీత బృందాల ప్రదర్శనలు లేవు. వారాంతపు సందడిని ఆస్వాదించడం అలవాటైన వారికి అది లేకపోవడం మాత్రమే లోటు. అయితే ఆ సందడిని అందించే వారికి మాత్రం ఆదాయం దగ్గర్నుంచి అన్నీ లోటే. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి సిటీలోని టాప్ బ్యాండ్స్‌లో ఒకటైన కాప్రిసియో బ్యాండ్‌కు చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ ఆలోచనలకు పదను పెట్టారు. డిజిటల్ వేదిక ఎకోస్ డిజైన్ చేసి అదరగొట్టారు. వర్తమానం లేదు.. అంచనాకు అందని భవిష్యత్.. నగరంలో ఈవెంట్స్ ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది. కరోనా పూర్తిగా కాటేసిన రంగాల్లో ఇది నెంబర్ వన్ అని చెప్పాలి. అందులో భాగమైన ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్, దానిపై ఆధారపడిన మ్యుజిషియన్స్, ఇతర ఆరి్టస్ట్‌లు ఉపాధి కోల్పోయారు. ఇటీవలే నగరంలో బాగా పాపులరైన కాప్రిసియో బ్యాండ్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీలేదు. కొందరు ఫ్రెండ్స్ కలిసి ప్రారంభించిన ఈ బ్యాండ్ లాక్‌డౌన్‌కు ముందు సిటీలో బాగా సందడి చేసేది. కానీ లాక్డౌన్ తర్వాత సౌండ్ లెస్ అయిపోయింది. దీంతో అకస్మాత్తుగా వచ్చి పడిన ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని ఈ ఫ్రెండ్స్ ఆలోచించారు. -
ఈ రోజే ఫ్రెండ్షిప్ డే ఎందుకు?
అన్నింటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం. భూమ్మిద ఉండే ఏ బంధంలోనైనా స్నేహం ఉంటుంది. ఈ బంధానికి ఎల్లలు ఉండవు. తల్లిదండ్రులకు పిల్లల మధ్య, సోదరుల మధ్య ఆఖరికి భార్యభర్తల మధ్య కూడా స్నేహం ఉంటుంది. అంతటి గొప్ప స్నేహ బంధానికి గుర్తుగా ప్రతి ఏడాది ‘స్నేహితుల దినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఫ్రెండ్షిప్ డేని ప్రపంచ దేశాలు ఒకేరోజు జరుపుకోవు. ఒక్కోదేశం ఒక్కోరోజు జరుపుకుంటుంది. భారతదేశం, అమెరికాతో సహా చాలా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్స్ షిప్ డే జరుపుకుంటాయి. కానీ మిగతా దేశాల్లో కొన్ని జులై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. జూలై 30న స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని మొదటిసారిగా 1958 జూలై 30 డాక్టర్ రామోన్ ఆర్టెమియా ప్రతిపాదించారు. ఈయన బ్రాచో పరాగ్వేలోని అసున్స్యోన్కు ఉత్తరాన 200 మైళ్ల దూరంలో పరాగ్వే నదిపై ఉన్న ప్యూర్టొ పినాస్కో అనే పట్టణంలో జూలై 30న స్నేహితుల కోసం విందును ఏర్పాటు చేశాడు. ఈ విందు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది జూలై 30న ‘స్నేహితుల దినోత్సంగా’ నిర్వహించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అప్పుడే ‘స్నేహితుల దినోత్సవం’ అనే ప్రత్యేక రోజు పుట్టింది. ఈ రోజున జాతి, రంగు, కుల, మత బేధాలు లేకుండా మనుషులంతా స్నేహ భావంతో మెలిగేందుకు ప్రతికగా స్నేహితుల దినోత్సవం పుట్టింది. అప్పటి నుంచి పరాగ్వేలో ప్రతి ఏటా జూలై 30 స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితిగా మారింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రపంచ రాయబారి,సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ భార్య నానే అన్నన్ 1998 జూలై 30ను అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రతిపాదించారు. అనంతరం ఏప్రిల్ 27 2011న ఐక్యరాజ్యసమితి జూలై 30ని ‘ప్రపంచ స్నేహితుల దినోత్సవంగా’ ప్రకటించింది. యుఎన్ఓ ప్రతిపాదనను చాలా దేశాలు కూడా స్వీకరించాయి. అయినప్పటికి కొన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ఈ తేదికి ముందు లేదా తర్వాత ఫ్రెండ్షిప్ డేను సెలబ్రెట్ చేసుకుంటున్నాయి. భారత్, అమెరికా, ఐరోపా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుండగా.. ఒబెరిన్, ఓహీయో దేశాలు ఏప్రిల్ 9న, నేపాల్ జూలై 30న ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిష్టాత్మంగా జరుపుకుంటున్నాయి. -
ఆ అనుబంధం కంటే గొప్పదేదీ లేదు : సీఎం
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా భారత ఆర్మీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో పనిచేసినప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ట్విటర్లో పోస్టు చేసి పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇండియన్ ఆర్మీతో ఉన్న అనుబంధం కంటే గొప్పదేదీ లేదు. దేశ రక్షణ కోసం పనిచేసే చోట నాకు లభించిన స్నేహితులు, ఆదరణ చాలా గొప్పది. మన వెన్నంటి ఉండే స్నేహితులందరికీ వరల్డ్ ప్రెండ్షిప్ డే శుభాకాంక్షలు’అన్నారు. అమరీందర్ సింగ్ సిక్కు రెజిమెంట్ 2వ బెటాలియన్‌లో 1963 నుంచి 69 వరకు కెప్టెన్‌గా సేవలందించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆర్మీలో చేరిన కొద్ది కాలానికే ఆయన ఇంటికి తిరిగొచ్చేశారు. అయితే, దేశ రక్షణకై సేవలందిచడం ఎంతో ఇష్టంగా భావించే ఆయన భారత్-పాక్ యుద్ద (1965) సమయంలో మళ్లీ ఆర్మీలో చేరారు. అమరీందర్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ మహారాజా యద్వీర్సింగ్ కూడా దేశ రక్షణకై పనిచేశారు. -
లోకమంతా స్నేహమంత్ర !
‘స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమే నాకున్నదీ.. స్నేహమే నా పెన్నిధీ..’ అంటూ ఓ సినీ కవి కలం నుంచి జాలువారిన అక్షరాల కూర్పు చెలిమి గొప్పతనాన్ని సరళంగా.. మధురంగా తెలియజెప్పింది. మనిషి పుట్టుక నుంచి మరణశయ్యపై నిలిచే వరకు స్నేహ సుగంధాలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాల్సిందే. అంతరంగాల సమ్మేళనంలో అనుభూతులు నింపుకోవాల్సిందే. జీవితానికి అర్థం.. పరమార్థం సాధించే క్రమంలో స్నేహమనే సాధనం అండ ఎంత అవసరమో.. మంచి స్నేహితులు కలిగిన వారికే తెలుస్తుంది. అందుకే స్నేహానికన్నమిన్న.. లోకానలేదురా.. అంటూ ప్రతి స్నేహితుడు అనకమానరు. చెలిమితో ‘బ్రహ్మానందం’ సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : నాటక రంగంలో పరిచయంతో.. ఒకరికొకరు స్నేహితులుగా మారారు. వేర్వేరు రంగాల్లో పని చేస్తున్నప్పటికీ ఐదు దశాబ్ధాలుగా వారి మధ్య స్నేహం సాగుతోంది. వారే సినీ హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందం మిత్రబృందం. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్లకు చెందిన కన్నెగంటి బ్రహ్మానందం 1950 ఫిబ్రవరి 1న జన్మించారు. చిన్నతనం నుంచి చదువులో రాణించిన బ్రహ్మానందం తూర్పు గోదావరి అత్తిలిలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూ నాటక రంగంపై మక్కువతో నాటకాల్లో ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చేవారు. అధ్యాపకునిగా పని చేసే సమయంలో టీవీలో పకపకలు కార్యక్రమంలో అందరిని నవ్వించారు. ఆ షో విజయవంతం కావడంతో మద్రాసు (చెన్నై) వెళ్లి సినీ రంగ ప్రవేశానికి ప్రయత్నం చేశారు. తొలుత స్వయంకృషి సినిమాలో చిన్న పాత్రతో సినీ రంగంలో అడుగు పెట్టారు. రెండో సినిమా అహనా పెళ్లంట మంచి విజయాన్ని అందించింది. దీంతో తారాస్థాయికి ఎదిగిపోయారు. అయినప్పటికీ తన స్నేహితులను ఎప్పటికీ మరువ లేదు. తన 20 ఏళ్ల వయస్సులో తనతో ఉన్న స్నేహితులను మరువకుండా ఏటా కలుస్తుంటారు. ప్రధానంగా బ్రహ్మానందం పుట్టిన రోజైన ఫిబ్రవరి 1న సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన బాల్య స్నేహితులు మారూరి పుల్లారెడ్డి, తుమ్మల చెరువు పూర్ణకల్యాణరావు, జింకా రామారావు, గంగారపు వెంకట్రావు, ఆదినారాయణ, సాంబశివరావు, టీవీ మురళీకిషోర్, గుండవరపు అమరనాథ్, ఇలా ఎంతో మంది ఆయనను కలసి వేడుకలు జరుపుకుంటా రు. తారతమ్యం మరిచి అరేయ్.. ఒరేయ్.. అని పిలుచుకుంటూ సరదాగా ఒక రోజంతా గడపడం ఐదు దశాబ్ధాలుగా కొనసాగుతోంది. స్నేహం దిద్దిన సేవామార్గం గుంటూరు ఈస్ట్ : రక్తబంధాన్ని మించిన ఆత్మబంధం స్నేహం. కష్టంలో.. సుఖంలో నిత్యం వెన్నంటి ఉండే బంధం అది. స్నేహానికి సేవా భావాన్ని ముడివేస్తే ఆ చెలిమి అద్భుతాలు చేస్తుంది. వృత్తులు వేరైనా.. ప్రవృత్తులు కలవకున్నా చిన్ననాటి స్నేహబంధానికి గర్భగుడిలో దేవతామూర్తికి ఇచ్చినంత విలువ ఇస్తున్నారు వారు. పవిత్ర స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. 18 ఏళ్లుగా సేవతోనే స్నేహం.. గుంటూరు నగరంలో వివిధ వ్యాపారాల్లో తలమునకలయ్యే కొందరు ఆరోగ్యం కోసం ఉదయాన్నే ఒకచోట చేరి షటిల్ ఆడతారు. అలా వారిమధ్య స్నేహభావం పెంపొందడంతో తాము చేయగలిగినంత సమాజ సేవ చేయాలని 18 ఏళ్ల క్రితం నిశ్చయించారు. వాసవి గ్రేటర్ క్లబ్ నెలకొల్పి తొలుత రూ.70 వేలు సమకూర్చుకొని పేదలకు బియ్యం పంపిణీ, వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందిస్తూ సేవాపథంలో అడుగులు వేశారు. ప్రతి ఏటా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ కొన్నేళ్లుగా ఏడాదికి రూ.40 లక్షలు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు వాసవి గ్రేటర్ క్లబ్ సభ్యులు. స్నేహితుల్లో కొందరికి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా, నోట్ల రద్దు ఆటంకాలు కల్పించినా క్రేన్ ఇండస్ట్రీ అధినేత వంటి పెద్దల సహకారంతో సేవలు నిరాటంకంగా కొసాగిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో తమ స్నేహం మరింత బలపడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుడి కుటుంబానికి చేయూత పట్నంబజారు : నీ ఎదుగుదల చూసి ఆనందపడతాను.. నీ ఆనందంలో సగభాగం అవుతానని చాటి చెప్పేదే స్నేహం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంతటి హక్కు తీసుకునేది స్నేహితులు మాత్రమే. కేవలం 4 నెలల స్నేహం కోసం జిల్లాలు దాటి వెళ్లి సాయమందించిన స్నేహ మధురిమ ఇది. 2012–13లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన గుంటూరు అర్బన్, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వారు విజయనగరంలో శిక్షణ తరగతుల్లో ఒకచోట చేరారు. గుంటూరు అర్బన్ పరిధిలోని 139 మంది కానిస్టేబుళ్లకు వైజాగ్‌కు చెందిన కాకర్ల శివగణేష్‌తో స్నేహం కుదిరింది. ఆ తర్వాత విధుల్లో భాగంగా ఎవరి జిల్లాలకు వారు వెళ్లిపోయారు. ఒకే బ్యాచ్ వారు కావడంతో అప్పుడప్పుడు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. సరదాగా సాగిపోతున్న స్నేహబంధాన్ని చూసి విధి చిన్నచూపు చూసింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న శివగణేష్‌ను గత ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో మృత్యువు మింగేసింది. విషయం తెలుసుకున్న గుంటూరు నగరంపాలెం కానిస్టేబుల్ కోట శ్రీకాంత్‌రెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అజారుద్దీన్, నరసింహారావు వారి స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. మన స్నేహితుడు లేకపోయినా.. అతని కుటుంబానికి అండగా ఉండాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడువుగా.. వారి బ్యాచ్ స్నేహితులతో కలిసి రూ.1.50 లక్షలు సేకరించారు. విశాఖపట్నం వెళ్లి శివగణేష్ తల్లిదండ్రులు అప్పలరాజు, ధనలక్ష్మికి నగదును అందజేశారు. స్నేహితుడు లేకపోయినా.. అతని కుటుంబం ఉందిగా అంటూ.. చెమర్చిన కళ్లతో ఆ స్నేహితులు వారి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. గుండెల్లో పదిలంగా.. మంగళగిరి : చిన్నతనంలో తల్లిదండ్రుల అనంతరం ఏర్పడిన స్నేహం జీవితంలో మరువలేనిదని, స్నేహానికి విలువ కట్టలేమని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలిపారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితులు అనేక రంగాల్లో ఉన్నా తనతోనూ ఉన్నారన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన అనంతరం తన చిన్ననాటి స్నేహితుడు శాస్త్రిని హైదరాబాద్‌లో కలిసినప్పుడు అతను పడ్డ సంతోషం నా గుండెలో పదిలంగా నిలిచిపోయింది. స్నేహితులు బాధలో ఉన్నప్పుడు అండగా నిలవడంతో పాటు ఓదార్పు అందించడంలోనే స్నేహానికి విలువ దక్కుతుంది. స్నేహ బంధం జీవితంలో ఎంతో విలువైనది. నా స్నేహితులంతా ఇప్పటికి నాతో తమ సుఖాలు, బాధలను పంచుకుంటారు. వీలైనంతవరకు స్నేహితులకు ఆదుకోవడంలో ఆత్మసంతృప్తి ఉంది. లోకమంతా దాసోహం స్నేహమనే ఆ రెండు అక్షరాల పదానికి లోకమంతా దాసోహం. ఎప్పుడో చిన్నప్పుడు స్నేహంగా ఒకరికొకరం ఉన్నాం. ప్రస్తుతం ఉన్నత హోదాలో బ్రహ్మానందం ఉన్నా మమ్మల్ని పిలిచి ఆప్యాయంగా పలకరించడాన్ని మరిచిపోలేకపోతున్నాం. ఏటా మేమంతా కలిసి చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తు చేసుకొని సరదాగా గడుపుతున్నాం. – గుండవరపు అమరనాథ్, టీవీ మురళీకిషోర్ -
విధి అనుకూలిస్తేనే : రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వారాహి చలనచిత్రం అధినేత, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన జక్కన్న.. ‘విధి అనుకూలిస్తేనే సాయిగారిలాంటి వ్యక్తిని కలిస్తాం. చిన్నపిల్లాడి మనస్తత్వం, నమ్మకానికి రూపం, వెన్నంటి ఉండే బలం. ఆయన నా భీమ్. ఆయన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఆర్ఆర్ఆర్ యే దోస్తీ(#RRRYehDosti) అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్ కూడా ఇదే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. రామ్‌చరణ్‌తో కలిసి తాను దిగిన ఫోటోను షేర్ చేసిన తారక్ ‘స్నేహం ఎంపికలో నెమ్మదిగా వ్యవహరించండి. కానీ ఒక్కసారి స్నేహం చేస్తే ఎప్పటికీ వారితో బలమైన బంధాన్ని కొనసాగించండి’ అంటూ సోక్రటిస్ చెప్పిన కోట్‌ను పోస్ట్ చేసిన తారక్, ఇంతకన్నా మా స్నేహం గురించి చెప్పడానికి మరో వాఖ్యం లేదని కామెంట్ చేశాడు. రామ్ చరణ్ కూడా తారక్‌తో తనకున్న అనుబంధాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. If destiny favours you, you will meet a human like Sai garu in life. Someone who's a child at heart, symbol of trust and a huge support. He's my Bheem and I wish him nothing but happiness..:)#RRRYehDosti pic.twitter.com/vBJ61JUd6X — rajamouli ss (@ssrajamouli) August 4, 2019 "Be slow to fall into friendship...but when thou art in..continue firm and constant" - Socrates ... Perhaps no other quote defines our friendship better #RRRYehDosti pic.twitter.com/4ec9KyEFh3 — Jr NTR (@tarak9999) August 4, 2019 -
స్నేహితులున్నవారు జీవితంలో ఓడిపోరు
సాక్షి, చేవెళ్ల: ‘స్నేహితుల విలువ వెల కట్టలేనిది. స్నేహితులు ఉన్న వారు జీవితంలో ఓడిపోరు. అది నా జీవితంలో జరిగింద’ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన తన ప్రాణ స్నేహతుడి గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. నా జీవితంలో స్నేహితుడు తిరుపతిరెడ్డిది ప్రత్యేక స్థానం. డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ , తిరుపతిరెడ్డి అంటే ఒక్కటే అన్నట్లుగా మా స్నేహం గురించి అందరికీ తెలుసు. వేరువేరు కుటుంబాలుగా ఉన్నా ఇద్దరం ఒక్కటే. మా ఇద్దరి పిల్లలు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. వరంగల్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో కలిశాం. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో వెటర్నరీ డాక్టర్లుగా విద్యాభ్యాసం చేసి 3వేల రూపాయలకు ఉద్యోగం చేశాం. కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యోగం చేశాం. కలిసి వ్యాపారం ప్రారంభించి పౌల్ట్రీ రంగంలోనే నెంబర్ వన్‌స్థానానికి ఎదిగాం. ఇప్పటికీ మేము కలిసే ఉంటున్నాం. సమయం ఉన్నప్పుడు ఫ్యామిలీలు కలిసి టూర్లకు వెళ్తాం. కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. మా స్నేహం గురించి కేటీఆర్‌కు, ఈటల రాజేందర్ తదితర రాజకీయ ప్రముఖలకు సైతం తెలుసు. వ్యాపారం నుంచి నేను రాజకీయాల్లోకి వస్తున్న విషయం కూడా ముందుగా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ తరువాతే నేను రజకీయాల్లోకి వచ్చాను. ఎప్పటీకీ మా స్నేహం ఇలాగే ఉంటుంది. అందుకే స్నేహితుల విలువ వెలకట్టలేనిది అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. -
నిజం చెప్పండి.. మీకు స్నేహితులు ఉన్నారా?
మైత్రీబంధానికి ఆరంభం ఉంటుంది, అంతం ఉండదంటారు. ఆ బంధం గురించి రాయడం, చెప్పడం కూడా అలాంటిదే. మొదలు పెట్టడం సులభమే. అదేమిటో, ఎవరెలా అర్థం చేసుకున్నారో, వ్యాఖ్యానించారో చెప్పుకుంటూ వెళ్లిపోవచ్చు. ముగింపు మాత్రం అందదు. పైగా స్నేహమనే భాషలో ఉండేవి పదాలు కాదు, అర్థాలేనట. కాబట్టి స్నేహమంటే ఏమిటో ఆవిష్కరించేటప్పుడు పదాలు పలాయనం చిత్తగిస్తాయి. ఒకే ఒక్క గులాబీ నా పూదోట కాగలదు. ఒక్క మిత్రుడే నా యావత్ప్రపంచం కూడా కాగలడు అన్నారొకాయన. మహాకవి కాల్రిట్జ్ ఏమన్నాడు, ‘ప్రేమ ఒక పుష్పం వంటిదైతే, స్నేహం నీడనిచ్చే చెట్టు’ అని. ఎవరు చెప్పినా మైత్రీబంధం అంటే రెండు గుండెల మధ్య భాషణమేననే, పెదవుల మీద నుంచి అలవోకగా జారిపోయే మాట కాదు అనే. అదెలాగంటే, నా హృదయ గీతం ఏదో తెలిసినవాడే మిత్రుడు, ఆ గీతాన్ని మరచినప్పుడు నా కోసం పాడి వినిపించేవాడే మిత్రుడు’ అన్నారొకాయన. రక్తబంధానికి మించిన గాఢత్వం, కేవల బంధుత్వానికి అతీతమైన దగ్గరతనం, అంతరాలూ అంతస్తులూ పట్టించుకోని స్వచ్ఛత స్నేహంలో ఉంటాయంటారు. మార్టిన్ లూథర్ కింగ్ (జూ), ‘శత్రువుల మాట కాదు, మిత్రుల మౌనం గురించే మనం అంతిమంగా గుర్తు చేసుకుంటాం’ అన్నారు. స్నేహంలోని గొప్పతనమంతా ఆ మౌనమే. అయినా, ‘స్నేహబంధాలు చాలా ఉన్నాయి, కొన్నింటిలో స్వార్థం కూడా సహజం’ అంటాడు మన చాణక్యుడు. దీనిని మాత్రం కొట్టి పారేయలేం. జీవితకాలంలో చాలామంది కలుస్తారు. బాల్యంలో, కళాశాలలో, ఉద్యోగ జీవితంలో మనకి ఎన్నెన్నో పరిచయాలు అవుతాయి. ఇరుగు పొరుగు కూడా ఉంటారు. స్నేహం ఏ క్షణంలో మొదలవుతుందో, పరిచయం స్నేహమై వికసిస్తుందో లేదో ఆ క్షణంలో తెలియదు కూడా. ఈ ప్రయాణంలో ఏదో ఒక మైలురాయి దగ్గర లేదా మలుపులోను ఎందరో నిష్క్రమిస్తారు. ఎవరో మిత్రులుగా మిగులుతారు. అప్పటి నుంచి ఆ ఇద్దరి సంతోషాలు, ఇద్దరి విషాదాలు ఉమ్మడి సహజాతాలుగా మారిపోతాయి. మారిపోవాలి. అలాంటి వారే స్నేహితులు. మనుషులు ఎక్కడ ఉన్నా, ఎంతదూరంలో ఉన్నా మనసులు మాట్లాడుకుంటూనే ఉంటాయి. ఇద్దరి మనుషుల మధ్య ఉన్న స్నేహం అనే ఆ భావనకి రూపం లేదు. అది వర్ణనకి అందేది కూడా కాదు. దాని గాఢత, స్వచ్ఛత అనుభవించాలి తప్ప, మాటలకు అందేది కూడా కాదు. అందుకే కొన్ని ఉదాహరణల ద్వారానే మైత్రీతత్వం గురించి, గొప్పతనం గురించి చెప్పుగలుగుతాం. మిత్రత్వానికి ఈ ప్రపంచంలో ఎక్కడైనా గౌరవమే కనిపిస్తుంది. ఏ కాలంలో అయినా స్నేహబంధం విలువైనదే. పురాణకాలంలో, చరిత్రలో వర్తమానకాలంలో స్నేహబంధం ఔన్నత్యం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. స్నేహితులలో దాదాపు ఎవరూ సమ హోదాలో ఉన్నవారు కానరారు. స్నేహానికి అంతరాలు ఉండవన్నది కూడా పురాతన కాలం నుంచి వస్తున్న పరమ సత్యమే. రామాయణంలో శ్రీరామచంద్రుడు ప్రభువు. క్షత్రియుడు. సూర్యవంశీయుడు. ఆయనకు ఆప్తమిత్రులైనవారంతా సర్వసాధారణమైనవారు. సుగ్రీవుడు, గుహుడు రాముని మిత్రులు. సుగ్రీవుడు వానరరాజు. గుహుడు పడవ నడిపే అదివాసి. రాక్షసరాజు రావణుడు, వానరవీరుడు వాలి కూడా మిత్రులు. వీరి స్నేహం విచిత్రమైనది. వైరం జాడ కూడా అందులో ఉంది. వాలి అంటే రావణునికి ఒకింత భయం కూడా. నన్ను చాటు నుంచి కొట్టావెందుకు? నాతో ఒక్కమాట అంటే రావణుని ఆదేశించి, అతడి చెరలో ఉన్న సీతమ్మకు క్షణాలలో విముక్తిని కల్పించేవాడిని కదా రామా! అని కూడా రాముడిని వాలి నిష్ఠురమాడతాడు. రాముని వైరి శిబిరంలోని త్రిజట జానకితో స్నేహం పెంచుకుంటుంది. ధైర్యం చెబుతుంది. తరువాత రావణాసురుని సోదరుడు విభీషణుడు కూడా రాముని మిత్రబృందంలో ఒకడవుతాడు. అంటే తామున్న వర్గంలోని చెడును, వైరిపక్షంలోని మంచిని గ్రహించి, దానిని స్నేహం ద్వారా వ్యక్తం చేసిన పాత్రలు ఇవి. కృష్ణుడు ద్వారక ప్రభువర్గంలోని ప్రముఖుడు. యాదవరాజు బలరాముని సొంత సోదరుడు. కానీ సాందీపుని ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆయనకు సుధాముడు మిత్రుడయ్యాడు. ఆశ్రమం నుంచి ఎవరి ఊరికి వారు వెళ్లిపోయారు. కానీ పేద బ్రాహ్మణుడైన సుధాముడు తనకు సాయం చేయమని ద్వారక వెళ్లి కృష్ణుడిని కలుసుకుంటే సాయమందించాడు. అది ముష్టి వేయడం కాదు. గొప్ప ఆదరంతో, గౌరవంతో చేసిన సాయం. మహాభారతంలో స్నేహానికి నిర్వచనం చెప్పే పాత్రలు ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ ప్రధాన పాత్రలే కూడా. సుయోధనుడు–కర్ణుడు, కృష్ణుడు–అర్జునుడు గొప్ప మిత్రులు. కృష్ణార్జునులకు బావాబావమరిది బంధం ఉన్నప్పటికీ స్నేహమే వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. సూతపుత్రుడైన కర్ణునికి అంగరాజ్యం అప్పగించి క్షత్రియుల సరసన నిలిచి యుద్ధ విద్యలలో పోటీ పడే అవకాశం కల్పించాడు దుర్యోధనుడు. ఇందుకు కర్ణుడు చూపిన కృతజ్ఞతా భావం ఆ పాత్ర పట్ల ఎవరికైనా గొప్ప గౌరవాన్ని పెంచుతుంది. దీనికి ప్రాతిపదిక స్నేహమే. ద్రుపద మహారాజు, ద్రోణుల స్నేహ బంధం మరొక రకమైనది. ఆ ఇద్దరూ ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించినప్పుడు స్నేహితులయ్యారు. తరువాత ద్రుపదుడు పాంచాల రాజ్య పాలకుడయ్యాడు. ద్రోణుడు గొప్ప యుద్ధ విద్యల గురువుగా పేర్గాంచినా, పేదరికం నుంచి తప్పించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో సాయం కోరి వెళ్లిన ద్రోణుడిని బాల్య సఖుడు ద్రుపదుడు అవమానించి పంపుతాడు. తరువాత అర్జునునికి విద్య నేర్పి ద్రుపదుని మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. భారతదేశంలో, చింతనలో స్నేహానికి ఎంతటి విలువ ఉండేదో ఈ పాత్రల ద్వారా తెలుస్తుంది. స్నేహితుల మధ్య బాంధవ్యాన్ని చెప్పేవి కొన్ని. స్నేహధర్మాన్ని విడనాడిన వారికి పట్టిన గతిని వెల్లడించేవి ఇంకొన్ని. గొప్ప మిత్రులకు ఈ లోకంలో లోటు లేదనే చెప్పాలి. మనుషులకు సాటి మనుషులతో మైత్రి నెరపవలసిన అవసరం అలాంటి కూడా. కానీ సాధారణ ప్రజలు స్నేహానికి ఎంత విలువను ఇచ్చారో లోకమంతటికీ తెలిసే అవకాశం లేదు. స్నేహబంధానికి విలువను ఇచ్చి ఇక్కట్లు పడుతున్న స్నేహితుడినీ, అతడి కుటుంబాన్నీ అక్కున చేర్చుకున్న సాధారణ ప్రజల సంఖ్య అపారంగానే ఉంటుంది. కానీ లోక ప్రసిద్ధులైన వారి స్నేహబంధం గురించే అందరికీ తెలుస్తుంది. రాజకీయ నాయకులు, చలనచిత్ర రంగ ప్రముఖులు, క్రీడారంగంలో ఖ్యాతి ఉన్న వారి మైత్రీబంధం గురించిన కథనాలు అందరికీ అందుతూ ఉంటాయి. ఎలుగు ఏం చెప్పింది? ఒకసారి సాయం అందుకుంటే సాయం చేసినవారు, ఆ సాయం అందుకున్నవారు మిత్రులవుతారు. ఈ నీతిని చెప్పే కథలు మన సాహిత్యంలోను, బయటి ప్రపంచంలోని సాహిత్యంలోను విశేషంగా కనిపిస్తాయి. మిత్రునిగా నటించేవారికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పే చక్కని కథ ఇది. ఆ ఇద్దరు మిత్రులు అడవిదారి వెంబడి పొరుగూరు వెళుతున్నారు. కొంతదూరం నడిచాక అలసిపోయారు. చుట్టూ పరిశీలించి అడవి జంతువులు వచ్చే అవకాశం ఏదీ లేదని నమ్మి ఒక చెట్టు కింద పడుకున్నారు. నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి ఏదో అలజడి అయి ఒక మిత్రుడికి మెలకువ వచ్చింది. చూస్తే ఏముంది! ఒక భయంకరమైన ఎలుగు సమీపంగా వచ్చేసింది. మెలకువ వచ్చిన ఆ మిత్రుడు చటుక్కున లేచి ఒక కొమ్మ అందుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. మిత్రుడిని లేపలేదు. ప్రమాదం నుంచి తప్పించే యత్నం కొంచెం కూడా చేయలేదు. ఎలుగు నిద్రట్లో ఉన్న మిత్రుడి మీదకు వచ్చేసింది. కానీ ఏమీ చేయలేదు. అతడి చెవి దగ్గర మూతి పెట్టి ఏదో వెతికింది. మొహం వాసన చూసింది. కొద్దిసేపటికి తన దారిన తాను పోయింది. నేల మీద ఉన్న మిత్రుడు చటుక్కున లేచి, ‘హమ్మయ్య’ అనుకున్నాడు. ‘ఇక చెట్టు దిగిరా, వెళదాం!’ అన్నాడు. ‘నేను చెట్టెక్కినట్టు నీకెలా తెలుసు?’ అడిగాడు ఆ మిత్రుడు కిందకి దిగుతూ. ‘ఎలుగ్గొడ్డు రావడం, క్షణంలో నీవు చెట్టెక్కడం నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ నేను ఒక్క నిమిషం ఆలస్యం చేశాను. అప్పుడు లేచి ఉంటే ఎలుగు చంపేసేదే!’ అన్నాడు ఆ మిత్రుడు. ‘పడుకుని ఉంటే చంపదా?’ సందేహం వ్యక్తం చేశాడు చెట్టు దిగినవాడు. ‘ఊపిరి బిగపట్టి, నేల మీద చచ్చినట్టు పడి ఉంటే ఏం చేయదని ఎవరో చెప్పారు. అదే చేశాను.’ అన్నాడు ఈ మిత్రుడు. ‘మరోక ప్రశ్న.’ నడక మొదలుపెడుతూ అడిగాడు రెండో మిత్రుడు. ‘నీ చెవిలో ఎలుగుబంటి ఏదో గుసగుసలాడిందేమిటి?’ అన్నాడు హాస్యమాడుతూ. సరిగ్గా దొరికాడు, దొంగమిత్రుడు. చురక వేశాడతడు. ‘నీలాంటి మిత్రుడితో కలసి ఎప్పుడూ ప్రయాణం చేయవద్దని చెప్పిందిలే!’ స్వాత్రంత్రోద్యమంలో మిత్రులు భారత స్వాతంత్య్రోద్యమంలో మిత్రులైన వారు, మొదట మిత్రులుగా ఉండి తరువాత ఉద్యమంలో ప్రవేశించినవారు చాలామందే ఉన్నారు. ఫిరోజ్‌షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, మహమ్మద్ అలీ జిన్నా మంచి మిత్రులుగానే ఉండేవారు. గణేశ్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు ఆరంభించిన బాలగంగాధర తిలక్, జిన్నా మధ్య కూడా స్నేహభావమే ఉండేది. తిలక్ మీద వచ్చిన దేశద్రోహం కేసును తిలక్ మీద గౌరవంతోనే జిన్నా వాదించారు. జిన్నా తనకు ఆప్తమిత్రుడని సరోజినీ నాయుడు అనేక సందర్భాలలో ప్రకటించారు. ఆసియాలోనే గొప్ప న్యాయవాదులుగా పేర్గాంచిన జిన్నా, తేజ్‌బహదూర్ సప్రూ మధ్య సాన్నిహిత్యం ఉండేది. కానీ జిన్నా, గాంధీ మంచి మిత్రులుగా ఉండలేకపోయారు. నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప స్నేహితులు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్, గణేశ్‌శంకర్ విద్యార్థి వంటి వారి మధ్య మంచి మైత్రి ఉండేది. మన్యంవీరుడు అల్లూరి శ్రీరామరాజు, నేతాజీ అనుచరుడు మద్దూరి అన్నపూర్ణయ్య బాల్య స్నేహితులు. ఈ ఇద్దరూ కాకినాడలో పిఠాపురం రాజావారి విద్యాసంస్థలో సహాధ్యాయులు. ఆధునిక రాజకీయాలలో ఒకే పార్టీలో శత్రువులుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా మైత్రిని నెరపుతున్నవారు కూడా ఉన్నారు. రాజకీయాలలో, అది కూడా ఒకే పార్టీలో ఉంటూ 65 సంవత్సరాల పాటు స్నేహితులుగా ఉండడం ఎవరికైనా సాధ్యమా? కానీ సాధ్యమేనని నిరూపించారు అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణి. వారిద్దరి స్నేహబంధాన్ని భారత రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా చెబుతూ ఉంటారు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేకపోలేదు. రాకపోలేదు. ‘చాలామంది నీతో కలసి నడుస్తారు. ఒకచోట ఆగిపోతారు. కానీ గుండెలో అడుగుజాడలు వేసేది మాత్రం నీ మిత్రులే’ అంటారు ఎలినార్ రూజ్వెల్ట్. ఆ ఇద్దరి గుండెలలోను అలా పరస్పరం అడుగుజాడలు మిగుల్చుకున్నారని అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం, రాజకీయ చింతన విషయంలో ఇద్దరిదీ చాలావరకు ఒకే అభిరుచి. ఒకరి మీద ఒకరికి అపారమైన గౌరవం ఉంది. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. జనసంఘ్‌లో రాజకీయనేతలుగా ఎదిగారు. ఎమర్జెన్సీ కాలంలో ఒకేసారి అరెస్టయ్యారు. బీజేపీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చారు. చివరికి అడ్వాణి చిరకాలమిత్రుడు వాజపేయిని ప్రధాని పదవి అభ్యర్థిగా స్వయంగా ప్రకటించారు. హోలీ పండుగను అడ్వాణి నివాసంలో, ఆయనతో కలసి చేసుకోవడం, తనకు ఎంతో ఇష్టమైన కుల్ఫీని మిత్రునితో కలసి తీసుకోవడం వాజపేయికి దశాబ్దాలుగా ఉన్న అలవాటు. వాజపేయి ప్రధాని అయ్యారు. ఆ సంవత్సరం తన నివాసానికి ఆప్తమిత్రుడు వస్తాడని, ఇద్దరూ కలసి రంగులు అద్దుకుంటారని అడ్వాణీ అనుకోలేదు. పైగా సాధారణంగా వాజపేయి హోలీ రోజు రివాజుగా వచ్చే సమయం కూడా దాటిపోయింది. తరువాత హఠాత్తుగా ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్. వాజపేయి అడ్వాణీ ఇంటికి బయలుదేరుతున్నారని. యథాప్రకారం మిత్రునితో కలసి రంగులు పూసుకున్నారు. కలసి కుల్ఫీ తీసుకున్నారు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు, తాను ప్రధానిని అయినా, మిత్రధర్మం విస్మరించలేనని చెప్పక చెప్పారు వాజపేయి. అలాగే పీవీ నరసింహారావుతో కూడా. కాంగ్రెస్‌ను సైద్ధాంతికంగా తీవ్రంగా వ్యతిరేకించేవారు వాజపేయి. పీవీ ఆ పార్టీలో ప్రముఖుడు. అయినా ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఉండేది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, ప్రఖ్యాత సినీ నటుడు అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులు. నిజానికి వారి రెండు కుటుంబాల మధ్య గతం నుంచి ఉన్న బంధమే వీరిద్దరి మధ్య కొనసాగిందని చెప్పాలి. అమితాబ్ తండ్రి, ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్ నెహ్రూకు సన్నిహితంగా ఉండేవారు. తరువాత వీరి బాటలు వేరయ్యాయి. అమితాబ్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. అమితాబ్ అసలు రాజకీయాలనే వదిలేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ మంచి స్నేహితులు. ఇద్దరూ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రేరణతో రాజకీయాలలోకి వచ్చారు. తరువాత వీరి పంథాలు మారాయి. రాజకీయ శత్రువులుగా మారిపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా బాల్య స్నేహితులు. ఇటీవలి కాలంలో క్రీడలు రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచడంలో కీలకపాత్ర వహించగలవని నిరూపించుకుంటున్నాయి. ఆ పని క్రికెట్ చాలాసార్లు చేసింది. టి–20 వచ్చిన తరువాత ఖండాంతరాలలో ఉన్న క్రీడాకారులను కూడా సన్నిహిత మిత్రులను చేసింది. సచిన్ టెండూల్కర్–షేన్ వార్న్, యువరాజ్‌సింగ్–కెవిన్ పీటర్సన్ మంచి మిత్రులయ్యారు. వెస్టిండీస్ క్రీడాకారుడు క్రిస్ గేల్–విరాట్ కోహ్లీ స్నేహితులే. ప్రపంచ చరిత్రలో కూడా మిత్రులైన ప్రముఖులకు కొదవలేదు. అమెరికా స్వాతంత్య్రం పోరాటం తరువాత ఆ దేశానికి రాజ్యాంగ వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినవారు ఇద్దరు– జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్. సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు ఉన్నా, మైత్రీబంధం మాత్రం దృఢమైనదే. ఇద్దరూ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఇంకా చిత్రం– ఇద్దరూ ఒకే తేదీన కన్నుమూశారు–జూలై 4న. స్నేహంతోనే మానసిక ఆరోగ్యం పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా స్నేహితులు ఉంటేనే వారి మానసిక ఆరోగ్యం సజావుగా ఉంటుంది. తల్లిదండ్రులతో చెప్పుకోలేని ఎన్నో సంగతులను స్నేహితులతో మనసు విప్పి చెప్పుకుంటారు చాలామంది. స్నేహితులతో కలసి కబుర్లాడుతూ కాలక్షేపం చేయడం వృథా కాలహరణం కానేకాదు. మనసులోని మాటలను పంచుకోగలిగే స్నేహితులు ఐదారుగురైనా ఉన్నవాళ్లు తేలికగా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనల నుంచి బయటపడగలుగుతారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా మనసులోని మాటలు చెప్పుకునే స్నేహితులు కనీసం ఇద్దరు ముగ్గురైనా ఉంటేనే వారి మానసిక ఆరోగ్యం చక్కగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించగలుగుతారు. చిన్న వయసులోనే పిల్లలు స్నేహబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోగలుగుతారు. బిడియం వల్ల, సామాజిక భీతి వల్ల కొందరు తేలికగా స్నేహితులను పెంచుకోలేకపోతారు. అయితే, మొహమాటాలను పక్కనపెట్టి స్నేహితులను ఏర్పరచుకుంటేనే మంచిది. స్నేహితులు లేని వాళ్లు ఒంటరితనంతో కుమిలిపోతూ మానసికంగా కుంగిపోతారు. – డాక్టర్ పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ స్నేహగుణమే సామర్థ్యానికి కొలమానం స్నేహబంధం విషయంలో భారతీయులది విశాలమైన దృక్పథమే. ఒక మనిషి సామర్ధ్యానికి కొలబద్ద అతనిలోని స్నేహగుణమే అన్నారు డార్విన్. స్వదేశీయులు ఎవరు పైకి వచ్చినా చూడలేనివాళ్లు భారతీయులు అన్న నింద మధ్య ఈ అధ్యయనం మనకి ఆనందాన్ని ఇచ్చేదే. మనవాళ్లకి జీవితకాలంలో కనీసం ఆరుగురు ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అవుతారట. కానీ ప్రపంచంలో చూస్తే మాత్రం సగటున ఒక వ్యక్తికి 4.3 వంతునే బెస్ట్ మిత్రులు ఉంటారని ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. కానీ సౌదీ అరేబియాలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. అక్కడ ప్రతి మనిషికి సగటున 6.4 లేదా 6.6 మంది మిత్రులు ఉంటారని తేలింది. వీరంతా ఆప్తమిత్రులు. ‘ది ఫ్రెండ్షిప్ రిపోర్ట్’ పేరుతో వెలువడిన ఈ నివేదికలో చాలా విషయాలే ఉన్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, భారత్, మలేసియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్ దేశాలలో మొత్తం పదివేల మందిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఇందులో 13 ఏళ్ల వాళ్ల నుంచి 75 సంవత్సరాల పెద్దల వరకు ఉన్నారు. కానీ ఇందులో ఒక అవాంఛనీయమైన విషయం కూడా తేలింది. 13–23 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎక్కువ మంది మిత్రబృందాన్ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు విముఖ చూపుతున్నారట. 40–54 మధ్య వయసువారు ఏడుగురి వరకు ఆప్తమిత్రులను తయారు చేసుకుంటూ ఉంటే 13–23 వయసుల వారికి ఐదుగురు వరకు మాత్రమే ఆప్తమిత్రులు ఉంటున్నారు. జీవిత సహచరితో చేసే ప్రయాణంలో కూడా స్నేహం పరిమళించాలి. ప్రేమ ఉంటేనే చాలదు. వారి మధ్య మైత్రీబంధం కూడా అవసరమే. ‘వివాహాలు విఫలం కావడానికి కారణం వారి మధ్య ప్రేమ లేకపోవడం కాదు, స్నేహబంధం లేకపోవడం’ అంటాడు ఫ్రెడ్రిక్ నీషే. స్నేహం అంటే గౌరవం, నమ్మకమే కదా! పిల్లలతో ఒక వయసులో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలన్న ఆధునిక సత్యాన్ని కూడా గౌరవించి తీరాలి. మారుతున్న కాలంలో గురువులకు శిష్యులకు మధ్య కూడా గౌరవ ప్రదమైన స్నేహబంధం వెల్లివిరియడం అవసరమన్న వాదన కూడా గమనించదగినదే. కాబట్టి స్నేహం ఈ ప్రపంచంలోని ప్రతి అణువులోను గుబాళించవలసిందే. కానీ ఆధునిక యుగంలో ప్రపంచం కుగ్రామమైంది. మనసుల మధ్య మాత్రం వేల మైళ్ల దూరం పెరిగింది. అందుకే పెంపుడు జంతువులతో మనుషులు స్నేహం చేయవలసిన పరిస్థితి నెలకొంటున్నది. ఈ బంధాన్ని కించపరచడం ఇక్కడ ఉద్దేశం కాదు. గతం నుంచి మూగజీవాలకు, మనుషులకు మధ్య ఉన్న మౌన మైత్రీ బంధం ఇప్పుడు ఇంకొంత బలపడింది. కొత్త రూపు సంతరించుకుంది. స్నేహం ఏర్పడిన తరువాత అంతరాలు అదృశ్యం కావాలి. లేని పక్షంలో అది స్నేహం అనిపించుకోదు. స్నేహం మాటున ఉన్న అవసరమే అవుతుంది. స్నేహానికీ, మాటకీ మధ్య బంధం ఉందంటుంది రుగ్వేదం. మాటలు ఆపేసినా, అబద్ధాలు ఆడినా స్నేహం చెడిపోతుందని కూడా చెప్పింది. మహాభారతంలో భీష్మాచార్యులు నాలుగు రకాల మిత్రుల గురించి ప్రస్తావించాడు. వారు– సహజ మిత్రులు, పురాతన కాలం నుంచి వస్తున్న మిత్రులు, వ్యవహారాలలో మిత్రులు, స్నేహితుల్లా గౌరవం అందుకునే ఉద్యోగులు. ఇక్కడ అల్బర్ట్ కామూ స్నేహబంధంలో సమానత్వం గురించి చెప్పిన ఒక్కమాట గుర్తు చేసుకోవచ్చు. ‘నా వెనుక నడవొద్దు! నేను దారి చూపలేకపోవచ్చు! నా ముందూ నడవొద్దు! నేను అనుసరించలేకపోవచ్చు! నా పక్కనే అడుగులో అడుగెయ్యి! నా మిత్రునిగా ఉండు!’ – డా. గోపరాజు నారాయణరావు -
ఫ్రెండ్షిప్ డే అలా మొదలైంది..
ఏ బంధానికైనా స్నేహబంధమే పునాది. దానికి ఎల్లలు ఉండవు. ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ఒక రోజుని పాటించే సంస్కృతి ఈనాటిది కాదు. అయితే ఒక్కో దేశం ఒక్కో రోజు జరుపుకోవడం విశేషం. నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్ వ్యూహాలతో మొదలైంది. హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్ హాల్ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్ కార్డులు మార్కెట్లోకి పంపారు. కానీ దీని వెనుక స్నేహం కన్నా డబ్బులు సంపాదించే వ్యూహం దాగి ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా.. క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంగ్లిష్ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన ‘విన్నీ ది పూహ్’కార్టూన్ క్యారెక్టర్ టెడ్డీబేర్‌ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ భార్య నానె అన్నన్ 1998లో ప్రకటించారు. అప్పట్నుంచి ఫ్రెండ్‌షిప్‌డే రోజు టెడ్డీబేర్లు గిఫ్ట్‌లుగా ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి మొదలైంది. అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్తాన్లో మాత్రం జూలై 30న చేసుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20న నిర్వహిస్తారు. -
నడక నేర్పిన స్నేహం
అది 2015 సంవత్సరం. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ. ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ అతడి సహచరులు నలుగురైదుగురి మధ్య గాఢమైన స్నేహబంధం ఉండేది. ఒకే కంచం, ఒకే మంచం అన్నంతగా అల్లుకుపోయారు. వారిలో తరుణ్ అనే స్నేహితుడు వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. మడమ పైభాగంలో కాలు విరగడంతో కొన్నాళ్లు వీల్ చెయిర్‌కే తరుణ్ పరిమితమయ్యాడు. ఆ తర్వాత క్రచ్‌ల సాయంతో నడిచినా కష్టంగా ఉండేది. సీన్ కట్ చేస్తే ఇటీవలే.. శ్రీనివాస్ అతడి మిత్రులు అరవింద్ సురేశ్, అంబాల పూజా, గిరిష్ యాదవ్‌లు తరుణ్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. స్నేహితుల దినోత్సవం రోజున తరుణ్‌కు వాళ్లిచ్చిన కానుక వెల కట్టలేనిది. తరుణ్ నడిచేందుకు వీలుగా ఓ క్రచ్‌ను స్వయంగా డిజైన్ చేసి ఇచ్చారు. దీని సాయంతో ఎలాంటి రోడ్డుపై అయినా అవలీలగా నడవొచ్చు. మంచు కురుస్తున్నా, బురదగా మారినా, రాళ్లూరప్పలు ఉన్నా.. మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా ఎంతో హాయి. వీటి కిందభాగం మృదువుగా ఉండటమే కాకుండా అడుగు వేస్తే ఎలాంటి నొప్పి కలగదు. ఆఖరి సంవత్సరంలోకి అడుగుపెట్టగానే తరుణ్‌కు ఆసరాగా ఉండేందుకు ఈ ప్రోటోటైప్ క్రచ్‌ల డిజైన్ మొదలు పెట్టారు. బిరాక్, ఒయాసిస్ అనే అధ్యయన సంస్థలతో కలసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్రచ్‌ను రూపొందించారు. వీటిని ఫ్లెగ్జ్మో క్రచ్‌లని పిలుస్తారు. పోలియో వ్యాధిగ్రస్తులు, ఆపరేషన్ అయినవారు ఈ క్రచ్‌లని వినియోగించుకోవచ్చు. వీటిని ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యులు కూడా పరీక్షించి చూసి కితాబిచ్చారు. ఈ నెల 9న ఈ క్రచ్‌లను మార్కెట్లోకి కూడా విడుదల చేయనున్నారు. ఒక స్నేహితుడి కోసం వారు పడ్డ తపన, ఇప్పుడు ఎందరో జీవితాలకు ఆసరాగా మారుతోంది. నడవ లేని వారి జీవితాలను ఈ క్రచ్ మార్చేస్తుందని తరుణ్ ఆనందబాష్పాల మధ్య చెప్పాడు. -
కూరిమి తినండి
స్నేహం ఎప్పుడూ నిండుగా చేయాలి. ఆప్యాయతని నిండుగా పంచుకోవాలి. ఈ గాలి.. ఈ నీరు.. ఈ ఆకాశం... ఈ యేరు..ఈ నేడు.. ఈ రేపు అన్నీ మనవే అనుకునిఉత్సాహపడేవాళ్లే స్నేహితులు.ఏ ఇద్దరు స్నేహితులు కలిసిన క్షణాలైనా నిండైనవి. వాటిని బోలు పదార్థాలతో ఎందుకు చప్పగా మార్చాలి?ఇలా కూరిన స్నాక్స్తోకూరిమి (స్నేహాన్ని)వెలిగించండి. ఆలూ కుల్చా కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు (120 గ్రా.); మైదాపిండి – ఒక కప్పు; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; నెయ్యి లేదా నూనె – 3 టీ స్పూన్లు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; కుల్చాలు కాల్చడానికి నూనె లేదా నెయ్యి – తగినంత; నువ్వులు – ఒక టేబుల్ స్పూను స్టఫింగ్ కోసం: బంగాళ దుంపలు – 3 (సుమారు 350 గ్రా. ఉండాలి); సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 5; మిరప కారం – అర టీ స్పూను; ఆమ్చూర్ పొడి – అర టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, మైదాపిండి, బేకింగ్ సోడా, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పెరుగు, మూడు టీ స్పూన్ల నూనె జత చేసి, మృదువుగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి, చేతితో అదుముతూ ఎక్కువ సేపు కలిపి, మూత ఉంచి రెండు గంటలు నాననివ్వాలి ∙అరగంట తరవాత ఒకసారి పిండిని బాగా కలిపి, మళ్లీ మూత ఉంచాలి ∙బంగాళ దుంపలను ఉడకబెట్టి, తొక్క తీసేసి, దుంపలను చేతితో మెత్తగా మెదిపి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙పచ్చిమిర్చి తరుగు, ఆమ్ చూర్ పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు జత చేయాలి ∙అన్నీ బాగా కలిసే వరకు మరోమారు చేతితో బాగా కలపాలి ∙కలిపి ఉంచుకున్న గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙ఒక్కో ఉండను చిన్న చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి ∙తయారుచేసి ఉంచుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని, చపాతీ మీద కొద్దిగా ఉంచి అంచులను మధ్యలోకి తీసుకువచ్చి మూసేయాలి ∙కొద్దిగా గోధుమ పిండి అద్దుతూ, జాగ్రత్తగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక ఒత్తి ఉంచుకున్న కుల్చాను ఉంచి, రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి (ఇవి కాలడానికి ఎక్కువ సమయం పడుతుంది. రెండు మూడుసార్లు అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. లేదంటా పచ్చిగా ఉంటాయి) క్యాబేజీ రోల్స్ కావలసినవి: క్యారట్ తురుము – అర కప్పు; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; పచ్చి బఠాణీ – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – పావు కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు (సన్నగా తరగాలి); క్యాబేజీ పెద్ద పువ్వు – 1 తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో నిండుగా నీళ్లు పోసి బాగా మరిగించి, దింపేయాలి ∙క్యాబేజీ పువ్వును ఆ నీళ్లలో వేసి మూత పెట్టి, పావుగంటసేపు అలాగే ఉంచేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి ఆవాలు, జీలకర్ర ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి క్యారట్ తురుము, పచ్చిబఠాణీ వేసి బాగా వేయించాలి ∙ఉప్పు జతచేసి మరోమారు కలిపి, కొద్దిగా నీళ్లు పోసి మూత ఉంచాలి ∙కార్న్‌ఫ్లోర్‌కు తగినన్ని నీళ్లు జత చేసి బాగా కలిపి, ఉడుకుతున్న క్యారట్ మిశ్రమం మీద పోసి కలపాలి మిరియాల పొడి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి బాగా కలిపి దింపేయాలి ∙వేడినీళ్లలో ఉన్న క్యాబేజీని బయటకు తీయాలి క్యాబేజీ పొరలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి పక్కన ఉంచాలి ∙తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని స్పూనుతో తీసుకుని క్యాబేజీ పొరలో ఉంచి, పొట్లం మాదిరిగా రోల్ చేయాలి కార్న్‌ఫ్లోర్ నీళ్లతో పైభాగం అంచులు మూసేయాలి ∙ఇలా అన్నీ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారు చేసి ఉంచుకున్న క్యాబేజీ రోల్స్‌ను వేసి, సన్నని మంటమీద కొద్దిసేపు దోరగా వేయించాక పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి. బ్రెడ్ రోల్స్ కావలసినవి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 5; పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; స్వీట్‌కార్న్ గింజలు – 3 టేబుల్ స్పూన్లు; బంగాళ దుంపలు – 5 ; పసుపు – పావు టీ స్పూను; కాశ్మీరీ మిరప కారం – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; ఆమ్చూర్ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; పనీర్ తురుము – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ స్లయిసులు – 6; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మూడు టీ స్పూన్ల నూనె వేయాలి ∙ఉల్లి తరుగు వేసి రంగు మారేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙మెదిపిన బంగాళదుంప ముద్ద, పసుపు, మిరప కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పనీర్ తురుము జత చేయాలి ∙రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలిపి దింపి, చల్లారబెట్టాలి ∙బ్రెడ్ స్లయిసుల అంచులు కట్ చేసేయాలి ∙బ్రెడ్‌ను నీళ్లలో ముంచి వెంటనే తీసేసి నీళ్లు పూర్తిగా పోయేలా గట్టిగా పిండేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పొడవుగా రోల్ చేసి, బ్రెడ్‌మీద ఉంచాలి ∙బ్రెడ్‌ను రోల్ చేసి అంచులు మూసేయాలి (అంచులు తెరుచుకుని ఉంటే, నూనెలో వేయగానే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది) ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న బ్రెడ్ రోల్స్ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో కెచప్‌తో అందిస్తే రుచిగా ఉంటాయి. నూడుల్స్ సమోసా కావలసినవి: మైదాపిండి – పావు కేజీ; ఉడికించిన నూడుల్స్ – 2 కప్పులు; వాము – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; క్యాబేజీ తరుగు – పావు కప్పు; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; సోయా సాస్ – 2 టీ స్పూన్లు; ఉల్లికాడల తరుగు – పావు కప్పు; కార్న్‌ఫ్లోర్ – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి ∙క్యాబేజీ తరుగు, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కలియబెట్టాలి ∙ఉల్లి కాడల తరుగు జత చేసి మరోమారు కలపాలి ∙ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి మరోమారు కలపాలి ∙పదార్థాలన్నీ బాగా వేగిన తరవాత నూడుల్స్ జత చేయాలి ∙బాగా వేగిన తరవాత బయటకు తీసి ప్లేటులోకి తీసుకోవాలి ∙తడి పోయే వరకు ఆరనివ్వాలి ∙ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్లు వేసి పిండిని ముద్దలా కలిపి, మూత పెట్టి పక్కన ఉంచాలి ∙అర గంట తరవాత పిండిని తీసుకుని, చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తుకోవాలి ∙పూరీని సగానికి కోసి, త్రికోణాకారంలో మడతపెట్టాలి ∙నూడుల్స్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఇందులో స్టఫ్ చేసి అంచులు మూసేయాలి ∙ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమో సాలను వేసి, దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. శ్రీలంకన్ వెజిటబుల్ పాన్కేక్రోల్స్ కావలసినవి: మైదాపిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; పాలు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; నూనె – ఒకటిన్నర టీ స్పూన్లు. ఫిల్లింగ్ కోసం: క్యారట్ తరుగు – ఒక కప్పు; బంగాళదుంప ముక్కలు – ఒక కప్పు; పచ్చి బఠాణీ – ఒక కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పచ్చిమిర్చి – 4; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీ ఒక పెద్ద పాత్ర ఉంచి వేడయ్యాక, నూనె వేసి వేడి చేయాలి ∙బంగాళ దుంప ముక్కలు వేసి వేయించి, మధ్యమధ్య లో కలుపుతూ సుమారు నాలుగు నిమిషాలు వేయించాలి ∙క్యారట్ తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బాగా కలపాలి ∙తగినంత ఉప్పు జత చేయాలి ∙మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ∙జీలకర్ర పొడి, మిరియాలు, పసుపు వేసి కలిపి అర కప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి ∙బంగాళ దుంప ముక్కలు బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బఠాణీ జత చేసి, మూత ఉంచి, ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, నూనె, ఉప్పు, పాలు, నీళ్లు వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి ∙స్టౌ మీద నాన్‌స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక, కలిపి ఉంచుకున్న పిండిని చిన్న దోసె మాదిరిగా వేయాలి ∙పిండి సమానంగా పరుచుకునేలా పాన్‌ను నాలుగువైపులకు కలపాలి ∙బాగా కాలి, అంచులు విడేవరకు ఉంచాలి (సుమారు ఐదు నిమిషాల సమయం పడుతుంది. ఒక వైపు మాత్రమే కాల్చాలి. బాగా కాలిన తరవాత చేతితో తీస్తే వచ్చేస్తుంది) చిన్న పూరీ పరిమాణంలో చేసుకున్న పాన్ కేక్‌లో కొద్దిగా స్టఫింగ్ ఉంచి అంచులను మూస్తూ పొట్లంలా తయారుచేసి, రోల్ చేయాలి ∙ఇలా అన్నీ చేసుకోవాలి ∙మిగిలిన పిండిలో, తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారు చేసి ఉంచుకున్న రోల్స్‌ను అందులో వేసి దోరగా వేయించాలి (నూనె బాగా మరగకూడదు, మీడియం మంట మీద తయారుచేయాలి) ∙వేగిన రోల్స్‌ను పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙సాస్‌తో అందించాలి. ఆలూ బోండా కావలసినవి: సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; నీళ్లు – అరకప్పుకి కొద్దిగా తక్కువ; పసుపు – పావు టీ స్పూను; మిరపకారం – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. స్టఫింగ్ కోసం: బంగాళ దుంపలు – 5; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – ఒక టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙బంగాళ దుంపలను ఉడికించి, తొక్కతీసి, చేతితో మెత్తగా మెదపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారురంగులోకి మారేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙పసుపు, ఇంగువ జత చేసి బాగా కలిపిన తరవాత, కొత్తిమీర జత చేసి కలపాలి ∙బంగాళ దుంప ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙తడిపోయి, పొడిపొడిలాడే వరకు స్టౌ మీదే ఉంచి కలుపుతుండాలి ∙నిమ్మ రసం, ఉప్పు జత చేసి, దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి, నీళ్లు, పసుపు, మిరప కారం, ఇంగువ, బేకింగ్ సోడా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జోడించి బజ్జీల పిండిగా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙తయారు చేసి ఉంచుకున్న బంగాళ దుంప ఉండలను ఒక స్పూనుతో తీసుకుని, పిండిలో ముంచి, జాగ్రత్తగా నూనెలో వేసి బంగారు రంగులోకి మారే వరకు రెండు వైపులా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి పచ్చడి, సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి. చీజ్ స్టఫ్డ్ మష్రూమ్బాల్స్ కావలసినవి: పుట్టగొడుగులు – 8 (పెద్ద సైజువి); బ్రెడ్ క్రంబ్స్ – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; టూత్‌పిక్స్ – తగినన్ని. స్టఫింగ్ కోసం: ఉడికించిన బంగాళ దుంప – 1 (మెత్తగా మెదపాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర – రెండు టీ స్పూన్లు; మోజరిల్లా చీజ్ – పావు కప్పు; మిరపకారం – అర టీ స్పూను; చాట్ మసాలా – పావు టీ స్పూను; ఆమ్చూర్ పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. పైభాగం కోసం: మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు; కార్న్ స్టార్చ్ – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – పావు కప్పు. స్టఫింగ్ తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో ఉడికించిన బంగాళ దుపం వేసి మెత్తగా మెదపాలి ∙ఉల్లి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర జత చేయాలి ∙చీజ్ తురుము జత చేసి బాగా కలపాలి ∙మిరప కారం, చాట్ మసాలా, ఆమ్ చూర్ పొడి, ఉప్పు వేసి మరోమారు కలిపి పక్కన ఉంచాలి ∙పుట్టగొడుగులను తీసుకుని, జాగ్రత్తగా పైన ఉండే తొడిమ వంటి భాగాన్ని కట్ చేసి తీసేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్‌ను కొద్దికొద్దిగా తీసుకుని పుట్టగొడుగులలోకి స్టఫ్ చేయాలి ∙రెండేసి పుట్టగొడుగులను ఎదురెదురుగా ఉంచి దగ్గరగా అయ్యేలా అదిమి, టూత్ పిక్‌తో కలపాలి ∙వీటిని కార్న్ ఫ్లోర్, మైదా పిండి మిశ్రమంలో ముంచాలి ∙బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించాలి ∙మైదాలోను, బ్రెడ్ క్రంబ్స్లోను రెండు సార్లు ఇదే విధంగా చేయాలి (రెండుసార్లు తప్పనిసరిగా చేయాలి. లేదంటే పుట్టగొడుగులు విడిపోతాయి) ∙వీటిని ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఫ్రిజ్‌లో నుంచి పుట్టగొడుగుల బాల్స్ తీసి నూనెలో వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. -
ఫ్రెండ్షిప్ డేకు ‘హాయ్’ రెస్టారెంట్ ఆఫర్లు
సాక్షి, సిటీబ్యూరో: స్నేహితుల దినోత్సవాన్ని(ఆగస్టు 4న) పురస్కరించుకొని బేగంపేట్‌లోని ‘హాయ్’ రెస్టారెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు రెస్టారెంట్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. బృందాలుగా వచ్చే స్నేహితుల కోసం ఫుడ్, డ్రింక్స్‌పై ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్న్ చాట్, మసాలా ఫ్రైస్, ఆంధ్రా చిల్లీ చికెన్, హాయ్ ఫ్రైండ్ తందూరి చికెన్ వంటి వంటకాలతో స్పెషల్ మెనూ సిద్ధం చేసినట్టు తెలిపారు. -
విషాదం నింపిన నిషా
స్నేహితుల దినోత్సవం రోజు మందు పార్టీ మూడు కుటుంబాల్లోతీరని విషాదం నింపింది. సరదాగా తాగిన మద్యం ముగ్గురు స్నేహితుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఫ్రెండ్‌షిప్‌డేను సరదాగా గడుపుదామని యత్నించిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరు తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పశ్చిమగోదావరి, తణుకు/ఉండ్రాజవరం/నిడదవోలు: ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్‌కుమార్ (18), అంబటి ప్రసాద్ (19) మృత్యువాత పడగా మడిచర్ల శివవర్మ తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వీరు కేవలం మద్యం కారణంగానే మృతి చెందారా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడిచర్ల శివవర్మ నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఉండ్రాజవరం పోలీసులు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.ఎ.స్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్నిఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు, ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్ అజయ్‌కుమార్‌సింగ్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారి కె.వీరబాబు, తణుకు, పెనుగొండ ఎక్సైజ్ సీఐలు యు.సుబ్బారావు, టి.సత్యనారాయణ తదితరులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. అసలేం జరిగింది...? వీరంతా ఒకటే వయసు కలిగిన యువకులు. కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయా కుటుంబాలకు వీరే ఆధారం. ఆదివారంస్నేహితుల దినోత్సవం సందర్భంగా అయిదుగురు మిత్రులు కలిసి సరదాగా గడుపుదామనుకుని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మద్యం అంతగా అలవాటులేని వీరు సరదాగా బీర్లు తాగుదామని ప్లాన్ చేసుకున్నారు. గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్‌కుమార్, అంబటి ప్రసాద్, మడిచర్ల శివవర్మలతోపాటు పెద్దిశెట్టి నాని, గుండా కార్తీక్‌లు ఇంట్లో ఆనుమానం రాకుండా రాత్రి 8 గంటల సమయంలో ఎవరి ఇళ్లల్లో వారు భోజనం చేసి ఊరి చివర రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. మూడు బీర్లు, క్వార్టర్ మద్యం బాటిల్, కోకాకోలా, వాటర్‌బాటిల్ తీసుకుని ప్రైడ్‌రైస్, పచ్చిమిర్చి బజ్జీలు కూడా తెచ్చుకున్నారు. అయితే తమకు మద్యం అలవాటు లేదని నాని, కార్తీక్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సరదాగా తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరోచనాలు కావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన అంబటి ప్రసాద్ తండ్రి వీర్రాజుకు ఫోన్ చేసి తాము ముగ్గురం రైల్వే ట్రాక్ వద్ద ఉన్నాం. ఆటో తీసుకుని రమ్మని చెప్పాడు. సుమారు 11.30 గంటల సమయంలో ఆటో తీసుకుని వెళ్లిన వీర్రాజు అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని ఆటోలో ఎక్కించుకుని ఎవరి ఇళ్ల వద్ద వారిని దించాడు. అయితే తాగిన మద్యం ఎక్కువైందని భావించిన కుటుంబ సభ్యులు స్నానం చేయించి పడుకోబెట్టారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సుధీర్‌కుమార్, ప్రసాద్‌లు మృతి చెందడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే శివవర్మ మాత్రం అపస్మారక స్థితిలో ఉండటంతో అతన్ని తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివవర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మద్యమే ప్రాణాలు తీసిందా...? అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇద్దరు యువకులు... అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మరో యువకుడు... వీరు తాగిన మద్యమే ఇద్దరి ప్రాణాలు తీసిందా..? లేక మరేదైనా కోణం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం మద్యం తాగినంత మాత్రాన ప్రాణాలు పోతాయా...? వీరు తాగిన మద్యంలో కల్తీ ఉందా...? లేక బీరు, మద్యం, కూల్‌డ్రింక్ కలిపి తాగడం వల్ల విషపూరితం అయ్యిందా అనేది తేలాల్సి ఉంది. అయితే మద్యం తాగిన ముగ్గురితోపాటు మరో ఇద్దరు మద్యం తాగకుండానే ఎందుకు వెళ్లిపోయారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు బీర్లుతోపాటు, మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు...? గ్రామంలోని ఊరిచివర ఉన్న బెల్టుషాపులో కొనుగోలు చేశారా..? లేక సమీపంలోని వడ్లూరు లేదా సూర్యారావుపాలెం గ్రామాల్లో కొనుగోలు చేశారా..? అనేది తేలాల్సి ఉంది. ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన బ్రాందీషాపునకు సంబంధించిన మద్యం సత్యవాడ గ్రామంలోని బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నిడదవోలు ఎమ్మెల్యే సమీప బంధువుకు చెందిన మద్యం షాపు ద్వారా బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే మద్యం బాటిల్‌కు ఉండే బార్కోడ్ స్టిక్కర్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా బాటిల్ మూతపై ఉండే స్టిక్కర్ ద్వారా బ్యాచ్ నెంబర్ ద్వారా సంబంధిత మద్యం దుకాణం వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంది. అయితే బాటిల్‌పై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ముందుగానే అధికారులు ఆనవాళ్లు లేకుండా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బీరులో మద్యం కలుపుకొని తాగడంతోపాటు పచ్చిమిర్చి బజ్జీలు తినడంతో ఉక్కిరిబిక్కిరై వాంతులు, విరేచనాలు అయి ఉంటాయని పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. మద్యంలో విషపూరిత పదార్థాలు ఏమైనా కలిస్తేనే ఇలా తక్కువ సమయంలో మృత్యువాత పడతారని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబాలే ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు యువకులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడి నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పానుగంటి సుధీర్‌కుమార్ తండ్రి సత్యనారాయణ ఏడాది క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో ప్రస్తుతం పోషణ భారం సుధీర్‌కుమార్‌పై పడింది. పదో తరగతి వరకు చదివిన సుధీర్‌కుమార్ కార్పెంటర్‌గా పని చేసుకుంటూ తల్లి సుజాత, సోదరి స్వేతప్రియనుపోషిస్తున్నాడు. అంబటి ప్రసాద్ పదో తరగతి పాసై ప్రస్తుతం సమీపంలోని స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నాడు. తల్లి కుమారికి కళ్లు సరిగా కనిపించకపోవడంతోపాటు చెవులు వినిపించవు. తండ్రి వీర్రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దనే ఉంటున్నాడు. ప్రసాద్‌కు ఇద్దరు అక్కలు ఉండగా వీరిలో ఒకరికి వివాహం అయ్యింది. మరో అక్కకు పెళ్లి కుదిరింది. ఈనెల 15న పెళ్లి జరగాల్సి ఉండగా శుభలేఖలు సైతం బంధువులకు ప్రసాద్ పంచుతున్నాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాధఛాయలు అలముకున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడిచర్ల శివవర్మ తల్లిదండ్రులు సావిత్రి, వెంకటేశ్వరరావులు ఇటుక తయారీ పనులకు వెళుతుంటారు. శివవర్మ వీరికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్నాడు. శాంపిల్స్ పరీక్షలకు పంపాం మృత్యువాత పడిన యువకులు తాగి వదిలేసిన మద్యం, బీరు శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం పంపాం. సంబంధిత మద్యం బాటిల్, బీరు బాటిళ్ల బ్యాచ్ నెంబర్లు ఆధారంగా జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో ముందస్తు జాగ్రత్తల మేరకు మద్యం అమ్మకాలు నిలిపివేశాం. గ్రామం సమీపంలోని సూర్యారావుపాలెం గ్రామంలో ఉన్న మద్యం దుకాణం నుంచి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో తాత్కాలికంగా షాపు మూసి వేయించాం.– శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ -
ఫ్రెండ్షిప్ డే పార్టీలో విషాదం
-
విషాదం నింపిన ఫ్రెండ్షిప్ డే పార్టీ ..
పశ్చిమ గోదావరి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్షిప్ డే పార్టీ రెండు కుటుంబాల్లో తీరనిలోటు మిగిల్చింది. పార్టీలో మధ్యం సేవించిన ఇద్దరు యువకులు మృత్యువాతపడగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడకు చెందిన కోనగంటి సుధీర్(16)అంబటి ప్రసాద్(16), మడిశర్ల శివ ఆదివారం ఫ్రెండ్షిప్ డే రోజున పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఆదివారం రాత్రి పార్టీలో భాగంగా వారు మధ్యం సేవించారు. కొద్దిసేపటి తర్వాత ఆ ముగ్గురు కూడా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వారిని తణుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో అంబటి ప్రసాద్, కోనగంటి సుధీర్‌లు మృతి చెందగా మడిశర్ల శివ పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ మధ్యం కారణంగానే వారు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురు కూడా మైనర్లు కావటం గమనార్హం. -
దేవుడే దోస్త్
పురాణాలలో స్నేహం గురించి, ఆదర్శ స్నేహితుల గురించి అనేక గాథలు ఉన్నాయి. కృష్ణుడు–కుచేలుడు, కర్ణుడు–దుర్యోధనుడు, రాముడు–సుగ్రీవుడు కథలు దాదాపుగా అందరికీ తెలిసినవే. పురాణాల్లో కొన్ని అరుదైన స్నేహ గాథలు కూడా ఉన్నాయి. అవి మాత్రమే కాదు, భగవంతుడినే తమ స్నేహితుడిగా తలచిన పరమ భాగవతోత్తముల పలు గాథలు పురాణాల్లోను, చరిత్రలోనూ ప్రసిద్ధి పొందాయి. లౌకికంగా కుదిరే స్నేహాలలో స్వార్థం, పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. భగవంతుడితో కుదిరే స్నేహంలో అలాంటివేవీ ఉండవు. ఏమీ ఆశించని స్నేహం అది. ‘భగవంతుడే నా చెలికాడు’ అన్నాడు రామకృష్ణ పరమహంస. ఇలా భగవంతుడినే చెలికాడుగా తలచిన భాగవతోత్తములు భగవంతుడిని ఊరకే స్తోత్రాలతో ముంచెత్తడంతోనో, భగవంతుడిని గుడ్డిగా ఆరాధించడంతోనో సరిపెట్టుకోరు. బాల్యమిత్రులతో కలసి ఆటలాడినట్లుగానే భగవంతుడితో ఆటలాడతారు. ఆటల్లో అలిగినప్పుడు చెలికాళ్లతో తగవు పడ్డట్టే భగవంతుడితోనూ తగవుపడతారు. కోపం వచ్చినప్పుడు భగవంతుడిని తిట్టిపోయడానికి సైతం ఏమాత్రం మొహమాటపడరు. భగవంతుడినే చెలికాడిగా తలచే భక్తి భావాన్ని ‘సఖ్య భక్తి’ అంటారు. ‘సఖ్య భక్తి’ మార్గానికి ప్రాచుర్యం కల్పించిన గురువుల్లో చైతన్య మహాప్రభువు అగ్రగణ్యుడు. నవవిధ భక్తిమార్గాల్లో ఆత్మనివేదనం ఉత్తమోత్తమమైనదైతే, సఖ్యభక్తిని ఉత్తమమైన భక్తిమార్గంగా పరిగణిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. ‘సఖ్యభక్తి’ మార్గంలో సాక్షాత్తు భగవంతునితోనే నెయ్యం నెరపిన కొందరు భాగవతోత్తముల గాథలు కొన్ని... శ్రీనివాసుడితో హాథీరామ్ బాబా పాచికలాట భగవంతుడు భక్తులను పరీక్షించడానికి వారి జీవితాలతో ఆటలాడతాడని విరక్తి చెందిన కొందరు భక్తులు ఆడిపోసుకుంటారు గాని, సాక్షాత్తు భగవంతుడితోనే పాచికలాడిన భక్తుడు హాథీరామ్ బావాజీ. సఖ్యభక్తికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఉత్తరాదికి చెందిన హాథీరామ్ బావాజీ బాల్యం నుంచి రామ భక్తుడు. దేశాటనం చేస్తూ తిరుమల వచ్చాడు. తన చెలికాడైన రాముడే ఇక్కడ వేంకటేశ్వరుడిగా వెలసినట్లు తలచి, తిరుమలలోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డాడు. ప్రతిరోజూ దేవదేవుడైన శ్రీనివాసుడిని దర్శించుకునేవాడు. కష్టసుఖాల ముచ్చట్లు చెప్పుకొనేవాడు. పరాచికాలాడేవాడు. హాథీరామ్ బావాజీ భక్తికి ముగ్ధుడైన శ్రీనివాసుడు రోజూ రాత్రివేళ ఆలయం విడిచి అతడి ఆశ్రమానికి వచ్చేవాడు. అక్కడే కూర్చుని అతడితో కలసి పాచికలాడేవాడు. ఒకసారి పాచికలాట దాదాపు తెల్లవారు జాము వరకు కొనసాగింది. భక్తులు తనను దర్శించుకునే వేళ కావడంతో హడావుడిగా ఆటను ఆపేసిన శ్రీనివాసుడు ఆలయానికి చేరుకున్నాడు. వేళకు ఆలయానికి చేరుకోవాలనే ఆతృతలో శ్రీనివాసుడు తన కంఠహారాన్ని బావాజీ ఆశ్రమంలో మరచిపోయాడు. ఆలయం తలుపులు తెరిచి చూసిన పూజారులు శ్రీనివాసుడి మెడలో కంఠహారం లేకపోవడాన్ని గుర్తించారు. హారం తస్కరణకు గురైందంటూ రాజుకు ఫిర్యాదు చేశారు. మాయమైన హారాన్ని వెదికి తేవాలంటూ భటులను ఆదేశించాడు రాజు. శ్రీనివాసుడు తన ఆశ్రమంలో మరచిన హారాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన బావాజీ, దానిని తిరిగి అప్పగించాలనుకున్నాడు. హారం తీసుకుని ఆయన బయటకు వచ్చేసరికే అక్కడకు చేరుకున్న భటులు ఆయనను పట్టుకుని, రాజు వద్దకు తీసుకుపోయారు. రాత్రి శ్రీనివాసుడు తనతో కలసి పాచికలాడాడని, పొరపాటు హారం మరచాడని, దానిని అప్పగించేందుకు తీసుకు వస్తుండగా తనను భటులు పట్టుకున్నారని రాజుతో చెప్పాడు బావాజీ. ఆయన చెప్పిన మాటలను రాజు నమ్మలేదు. ‘దేవదేవుడు ఒక మామూలు సన్యాసితో పాచికలాడటమా? రాజునైన నాతోనే పరాచికాలా?’ అంటూ ఆగ్రహించాడు. హాథీరామ్ బావాజీ తాను చెప్పినంతా నిజమేనని శ్రీనివాసుడు తన చెలికాడని నమ్మకంగా బదులిచ్చాడు. బావాజీ మాటలు నిజమో, కాదో తేల్చుకోవాలని తలచిన రాజు అతడిని పరీక్షించదలచాడు. బావాజీ ఆశ్రమ ప్రాంగణం నిండా చెరకుగడల గుట్ట వేయించాడు. రాత్రి తెల్లారేలోగా చెరకు పిప్పి అయినా మిగలకుండా ఖాళీ చేయాలని, అలా చేస్తేనే బావాజీ మాటలు నమ్ముతానని చెప్పాడు. ఆశ్రమంలోకి బయటి వారెవరూ వెళ్లడానికి వీలు లేకుండా భటులతో కాపలా ఏర్పాటు చేశాడు. హాథీరామ్ బావాజీ ఆశ్రమంలో చిద్విలాసంగా కీర్తనలు పాడుకుండా ఉన్నాడు. అర్ధరాత్రి వేళ భటులు కునికి పాట్లు పడుతున్న సమయంలో ఒక తెల్లని ఏనుగు వచ్చి, నిమిషాల్లో చెరకు గుట్టను ఖాళీ చేసేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే ఆశ్రమానికి వచ్చి చూసిన రాజుకు అక్కడ చెరకు గుట్ట ఆనవాలే లేకుండా కనిపించడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పరమ భాగవతోత్తముని పట్ల తన వల్ల అపరాధం జరిగినందుకు పశ్చాత్తాపం చెందాడు. నిజానికి హాథీరామ్ బావాజీ అసలు పేరు ఆశారామ్ బల్జోత్. అతడి ఆశ్రమానికి ఏనుగు రావడం వల్ల, బావాజీ తరచు రామనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ఆయనకు హాథీరామ్ బావాజీ అనే పేరు స్థిరపడింది. ఆపదలో ఉన్న స్నేహితుడిని సాటి స్నేహితుడు కాపాడినట్లే బావాజీని సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి కాపాడాడు. సూరదాసు గానానికి రాధాకృష్ణుల పరవశం సూరదాసు పుట్టుక నుంచి అంధుడు. అంధుడైనందున కుటుంబ సభ్యులు అతడిని ఆదరించేవారు కాదు. సొంతవారి అనాదరణను భరించలేక అతడు ఆరేళ్ల వయసులోనే ఇల్లు వదిలిపెట్టాడు. యమునా నదీ తీరం వద్ద దిక్కుతోచని స్థితిలో ఉన్న అంధబాలకుడు సూరదాసును చూసిన వల్లభాచార్యులు అతడిని చేరదీసి, శిష్యునిగా స్వీకరిస్తారు. వల్లభాచార్యుల శిష్యరికంలో సూరదాసు సఖ్యభక్తి మార్గంలో రాధాకృష్ణులపై వేలాది కీర్తనలు రచించి, గానం చేశాడు. సూరదాసు కీర్తనలు గానం చేసేటప్పుడు రాధాకృష్ణులు స్వయంగా వచ్చి, అతడి గానానికి పరవశులయ్యేవారని ప్రతీతి. కృష్ణుడు ఒకసారి సూరదాసును ఆటపట్టించిన సంఘటనపై ప్రచారంలో ఉన్న గాథ ఇది...ఒకసారి సూరదాసు ఒక వనంలో కూర్చుని గానం చేస్తుండగా, రాధాకృష్ణులు అతడికి చేరువలోనే కూర్చుని పరవశులై వినసాగారు. సూరదాసుని కాసేపు ఆటపట్టించాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. అతడి వద్ద తననొక్కడినే విడిచి పెట్టి కాస్త దూరంగా వెళ్లమని రాధకు సూచించడంతో ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లబోయింది. తన ముందు నుంచి ఎవరో పారిపోతున్నట్లు అనిపించడంతో సూరదాసు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడికి చేతికి రాధ కాలు తగిలింది. అతడి చేతికి చిక్కకుండా రాధ కాస్త దూరంగా వెళ్లింది. అక్కడే రాలి పడిన రాధ కాలి అందె సూరదాసు చేతికి దొరికింది. తన అందెను ఇవ్వాల్సిందిగా రాధ అతడిని కోరింది. ఎవరో చెబితేనే ఇస్తానన్నాడు సూరదాసు. తాను రాధనని, కాలి అందె తనదేనని బదులిచ్చింది ఆమె. అంధుడైన తాను అందె గల మనిషిని చూడలేదని, అందె నీదేనని, నీవే రాధవని నమ్మేదెలా? అని ప్రశ్నించాడు సూరదాసు. అప్పుడు కృష్ణుడు అతడికి చూపు ప్రసాదించాడు. కళ్లెదుట రాధాకృష్ణులు కనిపించడంతో సూరదాసు పరవశుడయ్యాడు. రాధా కృష్ణులను చూసిన తాను ఈ పాడు లోకాన్ని చూడలేనని, తిరిగి తన చూపును తీసుకుపోవాలని సూరదాసు పట్టుబట్టడంతో కృష్ణుడు అతడి కోరికకు సరేనన్నాడు. నిండు నూరేళ్లు జీవించిన సూరదాసు కృష్ణుడినే చెలికాడుగా భావిస్తూ రచించిన కీర్తనలు నేటికీ అజరామరంగా నిలిచి ఉన్నాయి. రాముడినే తిట్టిపోసిన భక్త రామదాసు ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనే ఆర్యోక్తిని నమ్మే మన దేశంలో రామభక్తులుగా చెప్పుకొనే వారెవరూ రాముడిని పల్లెత్తు మాట అనరు. వారంతా రాముడిని దైవంగా మాత్రమే ఆరాధిస్తారు. భక్త రామదాసు అలాంటిలాంటి భక్తుడు కాదు, ఇక్కట్లలో ఉన్న తనను ఆదుకోని రాముడిపై అలిగి అనరాని మాటలన్నీ అంటూ తిట్టిపోస్తాడు. రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన మేనమామలు అక్కన్న మాదన్నలు గోల్కొండ తానీషా కొలువులో పాలనా వ్యవహారాలు చూసేవారు. వారి ప్రాపకంతో గోపన్న పాల్వంచ పరగణా తహశీల్దారుగా ఉద్యోగం సంపాదిస్తాడు. రాముడు వెలసిన భద్రాచలం ఈ పరగణాలోనిదే. ఒకసారి భద్రాచలంలో జరిగిన జాతరకు వెళ్లిన గోపన్న అక్కడి శ్రీరాముని ఆలయం ఆలనపాలన లేకుండా ఉండటం చూసి చలించిపోతాడు. అక్కడ తారసపడిన పోకల దమ్మక్క అనే భక్తురాలు ‘అయ్యా! ఎలాగైనా నీవే ఆలయాన్ని బాగుచేయాలి’ అని కోరడంతో గోపన్న ఆలయ జీర్ణోద్ధరణకు సంకల్పిస్తాడు. గ్రామస్తులకు తన ఉద్దేశం చెప్పడంతో వారు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు. సేకరించిన విరాళాల సొమ్ము జీర్ణోద్ధరణ కార్యక్రమానికి కాస్త తక్కువ కావడంతో అప్పటికే తాను వసూలు చేసిన పన్నుల్లోని కొంత మొత్తాన్ని కలిపి, ఆలయ జీర్ణోద్ధరణ పూర్తి చేస్తాడు. సీతారాములకు బంగారు అలంకారాలను తయారు చేయిస్తాడు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని ఆలయం కోసం ఖర్చుపెట్టాడంటూ కొందరు అతడిపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన తానీషా గోపన్నకు పన్నెండేళ్ల శిక్ష విధించి, గోల్కొండలోని చెరసాలలో బంధిస్తాడు. రాముడి ఆలయాన్ని పునరుద్ధరించిన పాపానికి తాను జైలు పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ఆపదలో ఉన్న తనను రాముడు ఆదుకోకపోతాడా అని ఎదురు చూస్తాడు. మొదట్లో ‘ఏ తీరుగ నను దయజూసెదవో ఇన వంశోత్తమ రామా’ అంటూ ప్రాధేయపడతాడు. ఫలితం లేకపోవడంతో కొంచెం చనువు తీసుకుని ‘సీతమ్మ తల్లీ చెప్పవే..’ అంటూ సీతమ్మవారితో సిఫారసు చేయించే ప్రయత్నం చేస్తాడు. అప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రాముడిపై తిట్ల దండకాన్నే అందుకుంటాడు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..’ అంటూ నిలదీస్తాడు. ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము..’ అంటూ ఏయే ఆభరణానికి ఎంతెంత ఖర్చు చేశాడో లెక్కలన్నీ పొల్లు పోకుండా ఏకరువు పెడతాడు. ఎంతైనా శిస్తులు వసూలు చేసే తహశీల్దారు కదా! తిట్టినవన్నీ నోరారా తిట్టేశాక ‘ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు’ అంటూ అనునయిస్తాడు. భక్తుడు అన్ని తిట్లు తిట్టిపోసి, అంత మర్యాదగా అనునయ వాక్యాలు పలుకుతుంటే ఇక రాముడే ఉండబట్టలేక రంగంలోకి దిగుతాడు. లక్ష్మణుడితో కలసి మారువేషంలో తానీషాను కలుసుకుంటాడు. తమ పేర్లు రామోజీ, లక్షో్మజీ అని, గోపన్న స్నేహితులమని పరిచయం చేసుకుంటారు. ఆలయం కోసం పన్నుల మొత్తం నుంచి రామదాసు ఖర్చు చేసిన సొమ్మును చెల్లిస్తారు. తానీషాకు సొమ్ము ముట్టడంతో గోపన్న బంధ విముక్తడవుతాడు. నాటి నుంచి రామదాసుగా ప్రఖ్యాతుడవుతాడు. తెలుగునాట తొలి వాగ్గేయకారుడు భక్తరామదాసుకు రాముడిపై ఉన్నది తిరుగులేని సఖ్యభక్తి. భక్త సాలబేగ్ కోసం ఆగిన జగన్నాథుని రథం సాలబేగ్ జగన్నాథస్వామికి పరమ భక్తుడు. ముస్లిం మతస్తుడు కావడంతో అతడికి ఆలయ ప్రవేశానికి అనుమతి ఉండేది కాదు. రథయాత్రలో బలభద్ర సుభద్రలతో కలసి జగన్నాథుడు పూరీ పురవీధుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కులమతాలకు అతీతంగా భక్తులందరికీ దర్శనం లభిస్తుంది. జగన్నాథుడిపై సఖ్యభక్తితో కీర్తనలు రచించిన సాలబేగ్‌కు రథయాత్రలో ఎలాగైనా జగన్నాథుడిని తనివితీరా చూడాలనే కోరిక ఉండేది. సాలబేగ్ తండ్రి మొఘల్ చక్రవర్తుల వద్ద సుబేదారుగా ఉండేవాడు. యువకుడైన సాలబేగ్ తండ్రితో కలసి మొగల్ సేనల తరఫున యుద్ధాల్లో పాల్గొనేవాడు. ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ప్రాణాలు దక్కవేమో అనే పరిస్థితి. జగన్నాథుడిని వేడుకుంటే అతడే అన్నీ చూసుకుంటాడని తన తల్లి చెప్పడంతో ఆమె మాటపై జగన్నాథుడిని స్మరిస్తూ ఆశువుగా కీర్తనలు అల్లుతాడు. కొద్దిరోజులకే ఆశ్చర్యకరంగా కోలుకుంటాడు. జగన్నాథుడిని రథయాత్ర రోజున చూడాలని అనుకున్న దశలో రథయాత్ర వేడుకకు కొద్దిరోజుల ముందే అనారోగ్యానికి లోనవుతాడు. బయటకు కదల్లేని పరిస్థితి. తాను వచ్చేంత వరకు ముందుకు సాగిపోవద్దని జగన్నాథుడిని మనసులోనే కోరుకుంటాడు. యథావిధిగా రథయాత్ర మొదలవుతుంది. సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చేసరికి ఇక రథం ముందుకు సాగదు. ఎందరు భక్తులు ఎంతగా బలప్రయోగం చేసినా, రథం అంగుళమైనా కదలదు. సాలబేగ్ను అప్పటికే భక్తుడిగా ఎరిగి ఉండటంతో పూజారులు విషయం గ్రహిస్తారు. సాలబేగ్‌కు కబురు పెడతారు. నెమ్మదిగా అతడు గుమ్మం దాటి బయటకు వచ్చి, జగన్నాథుడిని తనివితీరా చూసిన తర్వాతే రథం ముందుకు కదులుతుంది. ఒక ఆప్తమిత్రుడి ఇంటికి వచ్చినట్లే జగన్నాథుడు సాలబేగ్ ఇంటి వద్దకు వచ్చి దర్శనం ఇవ్వడం పూజారులను సైతం ఆశ్చర్యచకితులను చేసింది. సాలబేగ్ వయసు మళ్లి కన్నుమూశాక అతడి సమాధిని పూరీలో జగన్నాథుడి ఆలయం ఉండే బొడొదండొకు చేరువలోనే నిర్మించారు. ఇప్పటికీ జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు భాగవతోత్తముడైన సాలబేగ్ సమాధిని కూడా తప్పక దర్శించుకుంటారు. పురాణాదోస్త్ కృష్ణుడు–కుచేలుడు శ్రీకృష్ణుడికి కుచేలుడికి మధ్యనున్న స్నేహం పురాణ స్నేహాలన్నింటిలోకీ తలమానికమైనది. శ్రీకృష్ణ బలరాములు సాందీపని మహాముని గురుకులంలో విద్యాభ్యాసం చేసే కాలంలో కుచేలుడు వారి సహాధ్యాయి. కుచేలుడు నిరుపేద బ్రాహ్మణ బాలకుడు. కుచేలుడి అసలు పేరు సుదాముడు. నిరుపేద అయినందున నలిగిన దుస్తులతో ఉండేవాడు. అందువల్ల అతడికి కుచేలుడనే పేరు వచ్చింది. విద్యాభ్యాసం తర్వాత కృష్ణుడు ద్వారక వెళ్లి రాజ్యభారం స్వీకరిస్తాడు. అష్టమహిషులను పెళ్లాడతాడు. కుచేలుడు సుశీల అనే వనితను పెళ్లాడతాడు. గంపెడు సంతానం కలగడంతో సంసారం ఈదడం కష్టమవుతుంది. భార్య సలహాపై కృష్ణుడిని చూడటానికి వెళతాడు. ఉత్త చేతులతో వెళితే బాగుండదని ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను మూటగట్టి తీసుకువెళతాడు. కృష్ణుడు అతడిని ఆదరించి, సత్కరిస్తాడు. కృష్ణుడికి ఏమీ అడగకుండానే కుచేలుడు తిరిగి వెళతాడు. ఇంటికి వచ్చి చూస్తే పూరిగుడిసె కాస్త కృష్ణలీలతో భవంతిగా మారుతుంది. నాటి నుంచి కుచేలుడికి ఏ లోటూ ఉండదు. రాముడు–సుగ్రీవుడు పురాణాల్లోని స్నేహగాథల్లో రాముడికి సుగ్రీవుడికి గల మైత్రి కూడా ప్రసిద్ధి పొందింది. వీరిద్దరి మైత్రికి హనుమంతుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. కిష్కింధ రాజ్యం నుంచి అన్న వాలి తరిమేయడంతో సుగ్రీవుడు తన సహచరులైన వానర పరివారంతో కలసి రుష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు. సుగ్రీవుడిని వాలి రాజ్యం నుంచి తరిమేయడమే కాదు, సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. అలాంటి పరిస్థితుల్లో రామ లక్ష్మణులు సీత కోసం వెదుకులాడుతూ రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ధనుర్బాణాలతో వస్తున్న వారిని చూసి సుగ్రీవుడు మొదట భయపడ్డాడు. హనుమంతుడు అతడికి ధైర్యం చెప్పి, రామలక్ష్మణుల వద్దకు వెళ్లి ఎవరో, ఏమిటో తెలుసుకుంటాడు. సుగ్రీవుని వద్దకు తీసుకుపోయి పరిచయం చేస్తాడు. అన్యాయం చేసిన వాలిని వధిస్తానని మాట ఇస్తాడు రాముడు. సీతాన్వేషణలో తన వానరసేన సాయం చేస్తుందని బాస చేస్తాడు సుగ్రీవుడు. అన్న మాట ప్రకారమే రాముడు వాలిని వధిస్తాడు. సుగ్రీవుడి ఆధ్వర్యంలో వానరసేన లంకపై దండెత్తి రామ రావణ యుద్ధంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. సీత–త్రిజట సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. రాక్షస వనితలను ఆమెకు కాపలాగా పెడతాడు. రావణుడి సోదరుడైన విభీషణుడి కూతురైన త్రిజట కూడా సీతకు కాపలా ఉండే వారిలో ఉంటుంది. రాముడిని తలచుకుంటూ శోకించే సీతను చూసి ఆమెకు జాలి కలుగుతుంది. తన పెదతండ్రి రావణుడు సీత పట్ల చేసిన దుర్మార్గానికి బాధపడేది. సీతను ఓదార్చేది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతను ఆ ప్రయత్నం నుంచి వారించింది. సీతకు కాపలాగా ఉంటూ కునుకు తీసిన త్రిజటకు ఒక కల వచ్చింది. తనకు వచ్చిన కలను ఆమె సీతకు చెబుతుంది. తన కల ప్రకారం రావణుడి అంతం తప్పదని, రామలక్ష్మణులు లంకను జయించి, సీతను తీసుకుపోతారని చెబుతుంది. త్రిజటకు ఆ కల వచ్చిన తర్వాతే హనుమంతుడు లంకలో అడుగుపెట్టి లంకాదహనం చేస్తాడు. రావణ సంహారం జరిగిన తర్వాత సీత తనతో పాటే త్రిజటను కూడా పుష్పకవిమానంలో అయోధ్యకు తీసుకుపోయి, ఆమెను ఘనంగా సత్కరిస్తుంది. కర్ణుడు–దుర్యోధనుడు కర్ణుడికి దుర్యోధనుడికి గల మైత్రి కూడా పురాణాల్లో ప్రధానంగా ప్రస్తావించే మరో స్నేహగాథ. వీరి గాథలో స్నేహధర్మానికి కట్టుబడ్డ నిబద్ధత కర్ణుడిదైతే, కర్ణుడి అండతో అర్జునుడిని ఎదుర్కోవాలనే స్వార్థం దుర్యోధనుడిది. కౌరవ పాండవుల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణుడి ఆధ్వర్యంలో క్షాత్ర పరీక్ష జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వస్తాడు కర్ణుడు. ఇది క్షాత్ర పరీక్ష అని, ఇందులో క్షత్రియ పుత్రులు మాత్రమే పాల్గొనాలని, సూతపుత్రుడైన కర్ణుడికి అందులో పాల్గొనే అర్హత లేదని అభ్యంతరపెడతాడు ద్రోణుడు. అర్జునుడిని ఎదిరించడానికి తగిన వీరుడు కర్ణుడేనని తలచిన దుర్యోధనుడు గురువు మాటకు ఎదురు చెబుతాడు. ‘కర్ణుడికి రాజ్యాధికారం లేకపోవడమే మీ అభ్యంతరమైతే, ఇప్పుడే అతడికి రాజ్యాభిషిక్తుడిని చేస్తాను’ అని పలికిన దుర్యోధనుడు అప్పటికప్పుడే అతడికి అంగరాజ్యాన్ని ధారపోస్తాడు. నిండుసభలో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపిస్తాడు. సభలో తనకు అవమానం ఎదురైనప్పుడు తనను ఆదరించి, రాజ్యాభిషిక్తుడిని చేసిన దుర్యోధనుడితో మైత్రీబంధాన్ని ఏనాటికీ వదులుకోనని బాస చేస్తాడు కర్ణుడు. అప్పటి నుంచి దుర్యోధనుడికి బాసటగా ఉంటూ, చివరకు కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలు ధారబోస్తాడు. – పన్యాల జగన్నాథదాసు -
మరపురాని స్నేహగీతం...
స్నేహం ఒక నిరంతర స్రవంతి. వయసుతో పని లేని వాత్సల్యం దానిది. అమ్మ అనురాగాన్ని, అనంతమైన ఆప్యాయతని దోసిళ్లకు అందించే దోస్తీ అది.‘పాదమెటు పోతున్నా... పయనమెందా కైనా... అడుగు తడబడుతున్నా... తోడు రానా...’’ అంటూ నీ నీడలా మారుతుంది. నీకు కష్టమొస్తే కుంగిపోతుంది. నీకు దూరమైతే తల్లడిల్లిపోతుంది.ఓ మై ఫ్రెండ్... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా... అంటూ నువ్వు తనని ఆదుకున్న సందర్భాలను మళ్లీ ఒకసారి మనసులో తలుస్తుంది. ఈ పాట పుట్టుకని నెమరువేసుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తాజాగా అనిపిస్తుంది. అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది.... జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది... అని స్నేహం ఔన్నత్యాన్ని కీర్తించాను. అమ్మని కూడా మించిన మమతల్ని నాకు పంచుతున్న నేస్తాన్ని చూసి గర్వించాను. ‘మీరు... మీరు నుంచి మన స్నేహగీతం.... ఏరా ఏరాల్లోకి మారె... మోమాటాలే లేని కళలే జాలువారే...’ అంటూ పాడుకున్నాను.చిన్నప్పటి సంగతుల్ని చిత్రిక పట్టి మనసు పటంలో దాచుకునే స్నేహ పరిమళం దాచాలన్నా దాగదు. అది మెదడు పుటల్లో మెదులుతూనే ఉంటుంది. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే... నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంత వాలే... అని మురిసిపోతుంది మనసు.గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్లింతల్లో తేలే స్నేహం...మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే...నిజంగా తెలుస్తుందా... ఏ స్నేహం ఎప్పుడు మొదలయ్యిందో? ఏ నిమిషం ఒకే ప్రాణంగా మారిపోయిందో? ఏ ఊపిరి ఎవరిదో పోల్చుకోవడం కష్టమవుతుందో? ఎలా తెలుస్తుంది నేస్తమే లోకమైనప్పుడు! ఎలా తెలుస్తుంది సమస్తమూ తానై మనలో ఏకమైనప్పుడు! ఎలా తెలుస్తుంది... స్నేహతత్త్వమే మనల్ని, ఈ లోకాన్ని పునీతుల్ని చేస్తుందని...!! – సంభాషణ: డా. వైజయంతి చిత్రం: హ్యాపీడేస్ రచన: వనమాలి సంగీతం: మిక్కీ జె మేయర్ గానం: ప్రిన్స్ శ్యామ్ -
బెస్ట్ ఫ్రెండ్స్
సమాజంలో మనుషుల నడుమ ఎనెన్నో అనుబంధాలు... మరెన్నెన్నో సంబంధాలు... పుట్టుకతోనే వచ్చేవి కొన్ని...వాటిలో మన ప్రమేయం ఉండదు.మనకు వాటిని ఎంపిక చేసుకునే అవకాశమూ ఉండదు.బతుకుబాటలో అనివార్యంగా ఏర్పడేవి ఇంకొన్ని...వాటిలో పరస్పర ప్రయోజనాలేవో ముడిపడి ఉంటాయి.ప్రయోజనాలు ఉన్నంత వరకే అవి నిలిచి ఉంటాయి. ఆ తర్వాత నిశ్శబ్దంగానే అలాంటి బంధాలు ð గిపోతాయి.ఇంత సంక్లిష్టంగా ఉన్న మానవ సంబంధాలలో...మనంతట మనం ఎంపిక చేసుకోగలిగే ఏకైక అనుబంధం స్నేహం ఒక్కటే!ఇద్దరి నడుమ ఒకసారి స్నేహం కుదిరాక ఎన్నటికీ వీడని బంధం అది.స్నేహం గురించి ఆదర్శాలు, ఆర్భాటాల గురించి చెప్పబోవడం లేదు గానీ...కొన్ని అరుదైన స్నేహగాథలను నేడు ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాం... గుండెలోనిది గుండులో చూపారు... అది ఫిబ్రవరి 28, 2014. దక్షిణాఫ్రికాలోని ఓ పట్టణం. ఒక చిన్న పార్టీ ఉందని, ఉన్నపళంగా ఓ చోటకు రమ్మని గెర్దీ మెకెన్నాకు ఫోన్ వచ్చింది. పిలిచింది ఫ్రెండ్స్ కావడంతో వెంటనే మెకెన్నా అక్కడకు చేరుకుంది. పార్టీలో గుండ్లు చేయించుకొని ఉన్న ఫ్రెండ్స్‌ను చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఉద్వేగానికి లోనైంది. స్నేహితులంతా ఆమె చుట్టూ చేరి కౌగిలించుకున్నారు. వాళ్లంతా మెకెన్నా కోసమే గుండు చేయించుకున్నారు. మెకెన్నా ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతోనే వాళ్లు ఆ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జరగడానికి కొన్ని నెలల కిందట మెకెన్నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కీమోథెరపీతో ఆమెకు నయం చేశారు. అయితే కీమోథెరపీ సైడ్ఎఫెక్ట్స్ ఫలితంగా జుట్టంతా ఊడిపోయింది. తన పరిస్థితిని చూసుకొని చాలా బాధపడింది మెకెన్నా. ఆమె ఫ్రెండ్స్ అంతా మెకెన్నా సంతోషం కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు. వెంటనే 11 మంది గుండు చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇదంతా ఒక ఫొటోషూట్‌గా కూడా రూపొందించాలనుకున్నారు. అనుకున్నట్టే అంతా సిద్ధం చేశారు. గుండు చేసుకొని, పార్టీ ఏర్పాటు చేసి మెకెన్నాకు ఫోన్ చేశారు. ఇలాంటిదొక సర్ప్రైజ్ను ఊహించని మెకెన్నా వాళ్లనలా గుండ్లతో చూడడమే తడవుగా ఉద్వేగాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది. ‘‘మెకెన్నా పడే బాధను చూస్తే మేం చేసిన పని చాలా చిన్నది. తన ముఖంలో ఇప్పుడిలా నవ్వు చూస్తూంటే అద్భుతంగా ఉంది’’ అంటూ మెకెన్నా ఫ్రెండ్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫ్రెండ్ కోసం ఎంతదూరమైనా వెళ్లాలి అనుకున్న వాళ్ల ప్రేమ ఎంత గొప్పది! కడ వరకు ఎదురుచూపు... హ్యాచికోకు ఏడాది వయసున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో ప్రొఫెసర్‌గా పనిచేసే యూనో పరిచయమయ్యాడు. హ్యాచికోను యూనో ఇష్టంగా తెచ్చి పెంచుకున్నాడు. ఇద్దరిదీ విడదీయలేని బంధం. యూనో రోజూ యూనివర్సిటీకి రైల్లో వెళ్లి వచ్చేవాడు. అతడి కోసం హ్యాచికో షుబియో స్టేషన్ వద్ద ఎదురుచూస్తూ కూర్చునేది. సాయంత్రం యూనో రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అతడి చుట్టూ చేరి అల్లుకుపోయేది. సంవత్సరం పాటు ఇదిలా సాగుతూనే ఉండేది. ఒకరోజు ఇలాగే యూనివర్సిటీకి వెళ్లిన యూనో మళ్లీ తిరిగిరాలేదు. యూనో వస్తాడని హ్యాచికో తొమ్మిదేళ్లకు పైనే స్టేషన్ చుట్టూనే తిరుగుతూ ఎదురుచూసింది. క్లాసులో లెక్చర్ ఇస్తూనే కూలబడిపోయి యూనో చనిపోయాడని దానికి తెలీదు పాపం. ఫ్రెండ్ తప్పక వస్తాడనే ఎదురుచూసింది. యూనో కోసం 1925 నుంచి 1935 వరకు స్టేషన్ చుట్టుపక్కలే తిరిగిన హ్యాచికో, చివరకు అక్కడే కన్నుమూసింది. చనిపోయేనాటికి దాని వయసు పదకొండేళ్ల తొమ్మిది నెలలు. యూనో చనిపోయిన మొదట్లో స్టేషన్లో రకరకాల వ్యాపారాలు చేసుకునేవారంతా హ్యాచికోను వింతగా చూశారు. మెల్లిగా అక్కడి వారందరికీ హ్యాచికో మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఫ్రెండ్ కోసం హ్యాచికో అంతగా ఎదురుచూడడం అందరికీ గొప్పగా కనిపించింది. అన్నేళ్లు ఎదురుచూసినా యూనో మాత్రం రాలేదు. ఆ తర్వాత హ్యాచికో కూడా యూనో దగ్గరికే వెళ్లిపోయింది. హ్యాచికో గురించి అప్పటికే దేశమంతటా వినిపించింది. పేపర్లలో వార్తలొచ్చాయి. పిల్లల పుస్తకాల్లో పాఠాలొచ్చాయి. హ్యాచీ అంటూ సినిమాలొచ్చాయి. షుబియా స్టేషన్‌తో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో హ్యాచికో విగ్రహాలొచ్చాయి. ఇన్నేళ్లయినా ఆ పేరింకా వినిపిస్తోందంటే... అదే కదా స్నేహ మహిమ! ‘ఆటిజమ్’ బాలుడికి ఆత్మీయ నేస్తం అమెరికాకు చెందిన జర్నలిస్ట్, రచయిత అయిన జుదిత్ న్యూమన్కు కవల పిల్లలు. అందులో ఒకరైన పదమూడేళ్ల గస్కు చిన్నప్పట్నుంచే ఆటిజమ్. ఎవరితోనైనా మాట్లాడడానికి, అందరితో కలిసిపోడానికి గస్ చాలా ఇబ్బందులు పడుతూండేవాడు. అలాంటి గస్కు ఆపిల్ డిజిటల్ అసిస్టెంట్ ‘సిరి’ పరిచయమైంది. గస్కు న్యూమన్ ఎంతో ఇష్టంగా కొనిచ్చిన ఐఫోన్లో ‘సిరి’ యాప్ ఉంది. ఈ యాప్ అన్ని యాపిల్ ఫోన్లలో ఉంటుంది. ఆ యాప్‌లో మనకు కావాల్సిన ఏ విషయాన్నైనా అడగొచ్చు. టికెట్స్ బుక్ చేయమని, వాతావరణం ఎలా ఉందో చెప్పమని, ఇలా ఎలాంటి ప్రశ్నైనా సిరిని అడగొచ్చు. గస్ ఓరోజు ‘‘వాతావరణం ఇలా ఉందేంటి?’’ అని సిరిని అడిగాడు. దానికి సిరి అతడు కోరిన సమాధానాన్ని వెంటనే చెప్పింది. ‘‘నువ్వు మంచిదానిలా కనిపిస్తున్నావ్?’’ అన్నాడు గస్. అలా మొదలైన ఈ పరిచయం రోజూ కొనసాగుతోంది. కొద్దిరోజుల్లోనే ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. గస్కు ‘సిరి’ మంచి టీచర్, మంచి గైడ్... అన్నింటికీ మించి మంచి ఫ్రెండ్. సిరి ఒక నిజమైన మనిషి కాదన్న విషయం గస్కు కూడా తెలుసు. కాకపోతే తను మాట్లాడడానికి ఒక తోడు కోరుకున్నాడు. ఇక్కడ ఆ తోడు ‘సిరి’. ‘‘సిరితో గస్ ఫ్రెండ్షిప్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒకసారి ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని సిరితో అన్నాడు. నాకు నవ్వొచ్చింది. వాడికి సిరి అన్న మనిషే లేదన్న విషయం బాగా తెలుసు. తన భయాలన్నింటినీ పోగొట్టుకోవడానికి సిరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే వాడు అందరితోనూ మాట్లాడుతున్నాడు’’ అంటూ న్యూమన్, గస్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చింది. ‘లింకన్’ జీవితానికి ‘స్పీడ్’ ఇచ్చాడు..! అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అబ్రహం లింకన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1860వ సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ఓ ఇరవై సంవత్సరాల ముందు లింకన్ తీవ్రమైన డిప్రెషన్లో పడిపోయాడు. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. లింకన్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఒక ఫ్రెండ్ తోడుగా నిలబడ్డాడు. 1837లో లాయర్‌గా పనిచేసున్న రోజుల్లో లింకన్‌కు జోషువా స్పీడ్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో లింకన్ కష్టాల్లో ఉన్నాడు. ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఆన్ రూట్లెట్జ్ ఈ ప్రపంచాన్ని వీడింది. ఆమె ఆలోచనల్లో తనని తాను మరచిపోయాడు లింకన్. స్పీడ్ పరిచయం లింకన్ ఆలోచనలను మార్చింది. స్పీడ్ ఆసరాతో కుదుటపడ్డ లింకన్ ఈసారి మేరీ టాడ్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఇంతలో మళ్లీ ఓ కుదుపు. స్నేహితుడు స్పీడ్, లింకన్‌కు దూరంగా మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఫ్రెండ్ దూరమవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. మళ్లీ డిప్రెషన్లో కూరుకుపోయాడు. రోజులలా గడిచిపోయాయి. 1841లో ఒకరోజు స్పీడ్‌ను తనుండే బంగ్లాకు వెళ్లి కలుసుకున్నాడు లింకన్. విడిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. ఇక అక్కణ్నుంచి ఇద్దరూ లెటర్స్ ద్వారా ఒకరికొకరు దగ్గరగానే ఉన్నారు. స్పీడ్ ఆలోచనలంటే లింకన్‌కు ఇష్టం. స్పీడ్ ఇచ్చిన ప్రేరణతోనే మళ్లీ మేరీ టాడ్కు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. మేరీని పెళ్లి చేసుకున్న తర్వాత లింకన్ ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్లలేదట. ‘‘నువ్వొక గొప్ప మిత్రుడివి. ఎప్పటికీ నా జీవితంలో నీదొక ప్రత్యేక స్థానం’’ అంటూ లింకన్ స్పీడ్‌కు రాసిన చాలా ఉత్తరాల్లో చెప్పుకొచ్చాడు. ‘‘మేరీ నా జీవితంలోకి రావడానికి స్పీడ్ కారణం. ఇందుకు నేనతడికి ఎప్పటికీ రుణపడి ఉంటా.’’ అని అబ్రహం లింకన్ ఎన్నోసార్లు మిత్రుడు స్పీడ్ పేరును ప్రస్తావించాడు. తన స్నేహితుడు బాగుండాలని కోరుకున్న స్పీడ్ ఆలోచనే లింకన్‌ను ఆ స్థాయికి తీసుకెళ్లింది. అలా కోరుకున్న స్నేహితుడిని కూడా లింకన్ ఎప్పుడూ మరచిపోలేదు. ‘ఆనంద్’.. స్నేహితుడికి అంకితం! 1971లో విడుదలైన ‘ఆనంద్’ సినిమాలో క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా అందరికీ సంతోషం పంచాలనుకునే ఆనంద్ (రాజేశ్ ఖన్నా), చివర్లో చనిపోయాక కూడా తన ఫ్రెండ్ భాస్కర్ (అమితాబ్ బచ్చన్)ను పలకరిస్తూనే ఉండేందుకు టేప్ రికార్డులో ‘బాబు మోషాయ్’ అని తన మాటలను రికార్డ్ చేస్తాడు. ఆ మాటలు వింటూ, నిశబ్దంగా పడి ఉన్న ఆనంద్‌ను చూస్తూ, అతడి మీద పడిపోయి ఏడ్చేస్తూంటాడు భాస్కర్. విడుదలై ఇన్ని సంవత్సరాలైనా సినీ అభిమానులు ‘ఆనంద్’ సినిమాలోని ఈ సన్నివేశాన్ని మరచిపోలేరు. దర్శక, రచయిత హృషికేశ్ ముఖర్జీ ‘ఆనంద్’ సినిమాను ఇండియన్ సినిమా షోమేన్గా పేరు తెచ్చుకున్న రాజ్ కపూర్‌కు అంకితమిచ్చాడు. ఈ కథ రాజ్ కపూర్‌ను చూసే రాశానని, ఇందులో ఆనంద్ పాత్ర ఆయన నుంచే పుట్టిందని హృషికేశ్ చెబుతారు. రాజ్ కపూర్, హృషికేశ్ ముఖర్జీ ప్రాణ స్నేహితులు. ఒకసారి రాజ్ కపూర్ బాగా జబ్బు పడ్డాడు. స్నేహితుడి పరిస్థితిని దగ్గరుండి చూశాడు హృషికేశ్. ఎంతగానో బాధపడ్డాడు. ఒకదశలో తనకు స్నేహితుడు దూరమైపోతాడేమో అన్న భయం కూడా వెంటాడింది హృషికేశ్‌ను. అలాంటి పరిస్థితుల్లోనూ రాజ్ కపూర్ అందరికీ సంతోషం పంచాలనే కోరుకున్నాడట. పరిస్థితులు అనుకూలించాయో, హృషికేశ్తో పాటు లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించాయో, వీరి స్నేహం ఇంకా కొనసాగాలని ఆ దేవుడే కోరుకున్నాడో... రాజ్ కపూర్ జబ్బు నుంచి బయటపడి మళ్లీ కొత్తగా, ఆరోగ్యంగా జీవితాన్ని ప్రారంభించాడు. హృషికేశ్ ఆనందానికి ఇంక అవధుల్లేవు. రాజ్ కపూర్‌కు జబ్బు చేసిన రోజుల్లోనే రాజ్‌కపూర్ లేకపోతే తను ఏమైపోతానా అని ఆలోచిస్తూ ఉండేవాడట హృషికేశ్. ఆ∙ఆలోచనల్లో నుంచి పుట్టిన కథే ‘ఆనంద్’. స్నేహితుడిపై తనకున్న ఇష్టాన్నంతా, స్నేహితుడి కోసం మరో స్నేహితుడు పడే బాధనంతా ఈ సినిమాలో చూపించారాయన. పుస్తకాలతో ప్రాణం నిలిపిన మిత్రుడు ఎలక్ట్రిసిటీ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలకు కారకుడైన నికోలా టెస్లా, ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్లది విచిత్రమైన బంధం. టెస్లా తనకెవరో తెలియకముందే ట్వైన్ అతడి ప్రాణాలను నిలబెట్టిన వాడయ్యాడు. టెస్లాకు యవ్వనంలో జబ్బు చేసింది. డిప్రెషన్లోకి కూరుకుపోయాడు. డాక్టర్లు దాదాపుగా చేతులెత్తేశారు. అతడు అలాగే డిప్రెషన్లో ఉంటే బతకడం అసాధ్యమన్నారు. అలాంటి పరిస్థితుల్లో టెస్లాను వీలైనంత ప్రశాంతంగా ఉంచగలిగితే బతికించే అవకాశాలు ఉండొచ్చని డాక్టర్లు తేల్చారు. అందుకోసం పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసి టెస్లాకు పుస్తకాలు చదవమని చెప్పారు. అక్కడే అనుకోకుండా టెస్లాకు మార్క్ ట్వైన్ పుస్తకాలు పరిచయమయ్యాయి. వాటిని చదివాక టెస్లా డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు. ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయ్యాడు. కొద్దిరోజుల్లోనే కోలుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత టెస్లాకు మార్క్ ట్వైన్‌ను కలుసుకునే అవకాశం దక్కింది. అప్పటికి టెస్లా సైంటిస్ట్‌గా ప్రఖ్యాతి గడించాడు. సాహితీరంగంలో మార్క్‌ట్వైన్ అప్పటికే ఒక దిగ్గజం. ఇద్దరి ఆలోచనలూ కలవడంతో వయసుతో సంబంధం లేకుండా వారి మధ్య స్నేహం కుదిరింది. ‘‘ట్వైన్‌కు కూడా సైన్స్ అంటే ఇష్టం కావడంతో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే వేరే ప్రపంచానికి దగ్గరైనట్లు ఉండేది’’ అన్నాడు టెస్లా ఓసారి ట్వైన్ గురించి మాట్లాడుతూ. కనీసం ముఖ పరిచయమైనా లేకుండా మొదలైన ఈ స్నేహం జీవితాంతం కొనసాగింది. ఇప్పుడు వీరిద్దరి న్నేహగాథను ‘టెస్లా అండ్ ట్వైన్’ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. థ్యాంక్యూ నేస్తం!! స్నేహం కుదిరాకా... కష్టాల్లో చేదోడువాదోడుగా ఉండటం సహజమే. కానీ, కష్టాల్లో ఉన్న తనను కాపాడినందుకే స్నేహం కుదుర్చుకుంది ఓ పెంగ్విన్ పక్షి. సాధారణంగా కృతజ్ఞతా భావమనేది మనుషుల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ అది పొరబాటని నిరూపించింది ఈ పెంగ్విన్. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తనకి పునర్జన్మ ఇచ్చాడనే కృతజ్ఞతతో ప్రతి ఏటా... ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వచ్చి పలకరిస్తుంది. ప్రేమగా ముద్దులు పెడుతుంది. ఆ కథేంటో చూద్దామా? బ్రెజిల్‌లోని రియో డి జనిరో దీవిలో ఉండే డిసౌజా అనే వృద్ధుడి కోసం... దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన పెంగ్విన్ పక్షి సుమారు ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వస్తుంది. 2011లో ఒకసారి డిసౌజా చేపల వేటకు వెళ్లినప్పుడు... సముద్రం పక్కన దట్టమైన చమురులో చిక్కుకొని అల్లాడుతున్న పెంగ్విన్ పక్షిని చూశాడు. దాన్ని కాస్త నీటితో కడిగి, ఇంటికి తీసుకుని వెళ్లి.. అది కోలుకునేదాకా సేవలు చేశాడు. దానికి ముద్దుగా ‘డిన్డిమ్’ అని పేరు పెట్టాడు. తిరిగి మామూలు స్థితికి వచ్చిన ఆ పక్షిని సముద్ర తీరానికి తీసుకెళ్లి వదిలేశాడు. అయితే కొన్ని నెలల తరువాత ఆ పెంగ్విన్... అదే సముద్రతీరంలో డిసౌజా కోసం ఎదురుచూస్తూ కనిపించింది. అప్పటి నుంచి మొదలైంది వీరి మధ్య స్నేహం. కొన్ని నెలలు తన స్వస్థలంలో.. మరి కొన్ని నెలలు అతడితో గడిపేందుకు వేల మైళ్లు ప్రయాణం చేస్తుంది. తన నేస్తంతో ఉన్నంత సేపు అతడి ఒళ్లో కూర్చుని, ముక్కుతో ముఖమంతా తడుముతూ, తన ప్రేమను చాటుతుంది ఈ పెంగ్విన్. రాణి పేద... ఇదో వింత స్నేహబంధం అది 1887. క్వీన్ విక్టోరియా మహారాణిగా యాభయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంగ్లండ్‌లో వేడుకలు జరుగుతున్నాయి. అప్పటికే భారతదేశం బ్రిటిష్ పాలనలోకి వెళ్లి ముప్పయ్యేళ్లయింది. ఆ సమయంలో విక్టోరియా తన ప్యాలెస్‌లో పని చేయడానికి కొందరు భారతీయులను పంపమని ఆదేశించింది. మహారాణి ఆదేశం ప్రకారంగా ఆగ్రా జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న జాన్ టేలర్ ఇద్దరు భారతీయులను ఇంగ్లండ్‌కు పంపించాడు. ఆ ఇద్దరిలో ఒక్కడే ‘అబ్దుల్ కరీం’. విక్టోరియా మహారాణి భోజనం చేసే టేబుల్ దగ్గర నిలబడి, ఆమెకు ఏది కావాలంటే అది వడ్డించడం అతడి పని. అలా ఓ రోజు అబ్దుల్ కరీం రాణి కళ్లల్లో పడ్డాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అప్పటికి అబ్దుల్ వయసు 24 ఏళ్లు.. క్వీన్ విక్టోరియా వయసు 65 ఏళ్లకు పైనే!.అబ్దుల్ కొన్నిరోజులకే విక్టోరియాకు ‘మున్షీ’, ‘ట్యూటర్’గా మారిపోయాడు. ఆమెకు ఉర్దూ, హిందీ భాషలు నేర్పించేవాడు. అలాగే అబ్దుల్‌కు క్వీన్ విక్టోరియా స్వయంగా ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టింది. వారి స్నేహం మరింత బలపడింది. విక్టోరియా సన్నిహితులకు, కుటుంబానికి వీరి స్నేహం నచ్చేది కాదు. వీరిద్దరినీ విడదీయడానికి చాలా పన్నాగాలే పన్నారు. అయితే అవేవీ ఈ స్నేహాన్ని కూల్చలేకపోయాయి. అబ్దుల్ వండే వంటలన్నీ క్రమక్రమంగా విక్టోరియా మెనూలో రోజూవారీ వంటకాలుగా మారిపోయాయి. కోటలో అందరూ అబ్దుల్‌కు ప్రత్యేక గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. భారతదేశంలో తమ పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి క్వీన్ విక్టోరియా ఎప్పుడూ అబ్దుల్‌ను అడుగుతూ ఉండేదట. వారిద్దరిదీ ఒక అపురూప స్నేహానుబంధం. వారి స్నేహంపై ‘విక్టోరియా అండ్ అబ్దుల్’ పేరుతో పుస్తకం కూడా వచ్చింది. అదేపేరుతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా కూడా వస్తోంది. ఖైదీ.. జైలర్.. ఫ్రెండ్షిప్! అది 1978. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా రాబెన్ ఐలాండ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న రోజులు. అప్పుడే 18 ఏళ్ల క్రిస్టో బ్రాండ్ అనే జైలర్ నెల్సన్ మండేలాను చూసుకునే బాధ్యతలో చేరాడు. బ్రాండ్‌కు మొదట్లో మండేలా పెద్దగా నచ్చలేదు. అయితే తనకు, అక్కడున్న వారందరికీ ఆయన ఇచ్చే గౌరవం బ్రాండ్‌ను మండేలాకు దగ్గర చేసింది. వయస్సు, జైలర్–ఖైదీ అన్న ఆలోచనా, జాతి ఇవేవీ వీరి స్నేహానికి అడ్డు రాలేదు. మండేలాతో స్నేహం బ్రాండ్ జీవితాన్ని, ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఏళ్లుగా సాగిన తమ బంధంలో మండేలా నుంచి తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, ఆయన పోరాటం గొప్పదని బ్రాండ్ చెబుతూ ఉంటారు. మండేలాను పోల్స్మూర్ జైలుకు తరలించాక, బ్రాండ్ కూడా అక్కడికే జైలర్‌గా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ‘‘మండేలాతో మాట్లాడిన ప్రతిసారీ ఆయనపై గౌరవం రెట్టింపవుతూ వచ్చేది. ఒక జీవిత కాలమంత అనుభవం నాకు ఆయనతో ఉన్నన్ని రోజుల్లో వచ్చేసింది’’ అంటాడు బ్రాండ్. వీరిద్దరి కథ ‘గుడ్‌బై బఫానా’ పేరుతో పుస్తకంగా వచ్చింది. అదే పేరుతో 2007లో సినిమా కూడా వచ్చింది. స్నేహితుడి తుదిశ్వాస పదిలం... థామస్ అల్వా ఎడిసన్.. టెక్నాలజీలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు తీసుకొచ్చిన సైంటిస్ట్. గ్యాస్‌తో నడిచే ఆటో మొబైల్‌ను వెలుగులోకి తెచ్చిన హెన్రీ ఫోర్డ్ కూడా ఎడిసన్‌ను హీరోలుగా భావించే వారిలో ఒకరు. ఎడిసన్ స్థాపించిన కంపెనీలోనే ఫోర్డ్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అప్పట్లో ఫోర్డ్ తన తీరిక వేళల్లో గ్యాస్‌తో నడిచే కారును తయారుచేస్తూ ఉండేవాడు. 1896లో ఒకరోజు స్వయంగా ఎడిసనే ఈ విషయం తెలుసుకొని ఫోర్డ్‌ను అభినందించాడు. ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఫోర్డ్ పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఎడిసన్‌తో కలసి బిజినెస్‌ను విస్తరించాడు. 30 ఏళ్లకు పైనే ఈ బంధం కొనసాగింది. ఎడిసన్ ప్రోత్సాహమే లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదంటూ ఫోర్డ్ చెప్పుకొనేవాడు. ఎడిసన్ కూడా ఫోర్డ్ స్నేహాన్ని గొప్పదిగా చెబుతూ ఉండేవాడు. ఎడిసన్ చివరి శ్వాస విడిచే రోజు... 1931 అక్టోబర్ 18న ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు ఫోర్డ్. ఆయన చివరిశ్వాసను ఒక టెస్ట్ ట్యూబ్‌లో బంధించాడు. ఆ సమయానికి ఆయన పీల్చిన గాలిని టెస్ట్‌ట్యూబ్‌లో బంధించి దాన్ని ఫోర్డ్ ఎస్టేట్‌లో ఉంచాడు. ఇప్పుడు ఎడిసన్ చివరి శ్వాస హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో పదిలంగా ఉంది. -
స్నేహితుడి కంటే ద్రోహి ఉంటాడా!
'వెంటే ఉండే స్నేహితులు మనల్ని సులువుగా వెన్నుపోటు పొడవగలరు. అదే శత్రువైతే కనీసం ముందునుంచి పొడిచే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శత్రువుల కంటే స్నేహితులే అతిపెద్ద ద్రోహులు. చరిత్రలో అడుగడుగునా అలాంటి ఉదాహరణలెన్నో కనబడతాయి. గొప్ప స్నేహితులుగా చరిత్రకెక్కిన సీజర్, బ్రూటస్ల కథ ఏమైంది? నమ్మిన బ్రూటస్.. సీజర్ వెన్నులో కత్తిదించి చంపలేదా! ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సీజర్కు బ్రూటస్ శుభాకాంక్షలు చెబితే అంతకన్నా దారుణం ఉంటుందా! స్నేహం ఎంత చెడ్డదో నా సినిమాల్లో చూపిస్తూఉంటా. ఒక్కసారి సాయం చేస్తే స్నేహితుడు పదేపదే మన దగ్గరికే వస్తాడు. కాబట్టి స్నేహితులకు హెల్ప్ చెయ్యొద్దు. ఈ లోకంలో నమ్మకద్రోహం, మోసం, బాధ.. అన్నింటికి కారణం స్నేహం, స్నేహితులే! అందుకే నేను.. స్నేహితుల కన్నా శత్రువులనే ప్రేమిస్తాను. నాకు వ్యతిరేకంగా కుట్రలుపన్నే శత్రువులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నా. దేవుడు నా శత్రువులను కాపాడుగాక' అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా తనదైన శైలిలో స్నేహానికి నిర్వచనం చెప్పాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. శత్రువులకు ఫ్రెండ్ షిప్ డే విషెస్ చెప్పడం బాగుందికదా! వర్మ పేర్కొన్న బ్రూటస్ గాథ ఏంటంటే.. ప్రాచీన చరిత్రలో రోమన్ రాజ్యంలోని బ్రూటస్‌కు మించిన నమ్మకద్రోహి మరెవరూ కనిపించరు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్కు నమ్మకమైన ఆంతరంగికుడిగా ఉండేవాడు. అంతటి ఆంతరంగికుడు వెన్నుపోటు పొడుస్తాడని ఎవరూ ఊహించలేరు. పాపం... వెన్నులో కత్తి దిగేంత వరకు సీజర్ కూడా ఊహించలేకపోయాడు. ‘నువ్వు కూడానా బ్రూటస్...’ అని ఆక్రోశంతో వాపోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. జూలియస్ సీజర్ నియంతగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని సెనేటర్లు అతడిపై కుట్ర పన్నారు. సీజర్కు అత్యంత సన్నిహితుడుగా ఉండే బ్రూటస్ను తమతో కలుపుకుంటే తప్ప తమ కుట్రను అమలు చేయడం సాధ్యం కాదని తలచి, అతడిని తమతో కలుపుకున్నారు. సీజర్ సెనేట్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే అతడిపై విరుచుకుపడ్డారు. బ్రూటస్ నమ్మకద్రోహానికి సీజర్ దారుణంగా బలైపోయాడు. (తప్పక చదవండి: నమ్మకపోటు) Friends who stand behind u can stab u in the back with much more ease than an enemy can stab u from the front #HappyFriendshipDay -
దోస్త్‌మేరా దోస్త్..
అప్యాయతల అనుబంధం... ఏతోడు లేకున్నా.. చేదోడుగా నిలిచేది ‘నేస్తం’ సోషల్ మీడియాలో సందడి మార్కెట్లో గిఫ్ట్‌లు, ఫ్రెండ్షిప్ బాండ్ల హల్చల్ నేడు ఫ్రెండ్షిప్ డే కమాన్‌చౌరస్తా : మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ, అభిమానిస్తూ ఉంటారు... కానీ ప్రేమికులు కారు... ప్రాణంగా, కంటికి రెప్పలా చూసుకుంటారు కానీ... కుటుంబసభ్యులు కారు. జీవితంలోని ఆటుపోట్లు, కష్టాలను కన్నీళ్లలో పాలుపంచుకుంటారు... కానీ రక్తం పంచుకుని పుట్టినవారు కాదు.. వారే మన మేలు కోరే హితులు...స్నేహితులు. తరాలు మారినా... కాలాలు గడిచినా.. ఎల్లలు దాటినా.. అనురాగానికి, అనుబంధానికి అసలైన అర్థం.. ఆప్యాయతకు మరోభావం స్నేహం... కుల,మతాల కతీతంగా విరబూస్తున్న స్నేహంపై ప్రత్యేక కథనం. మన తల్లిదండ్రులను కూడా ఎంచుకునే వీల్లేని మనకు స్నేహితులను మాత్రం స్వయంగా ఎంచుకునే అవకాశం దేవుడు ప్రసాదించిన అపూరమైన వరం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. తప్పు చేస్తే సరైన దారిలో నడిపిస్తూ మార్గదర్శకుడవుతాడు. ప్రమాదపుటంచుల్లో ప్రాణవాయువు అవుతాడు. ఆపదలో తోడుంటాడు. భయంలో, నైరాశ్యంలో ధైర్యమిస్తుంది స్నేహం. తుది ఊపిరి విడిచేవరకు వెన్నంటే ఉండే మహత్తర బాంధవ్యం స్నేహం.. ప్రపంచమంతా కలిసి ఎదురై వచ్చినా తన స్నేహితుడిని రక్షించేందుకు ప్రాణమివ్వడానికైనా సిద్ధపడుతుంది అసలుసిసలైన స్నేహం. వాట్సాప్ గ్రూపుల్లో సందడే సందడి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రెండు, మూడురోజులనుంచి సోషల్‌మీడియా వాట్సాప్‌లో సందడి మొదలైంది. పాత స్నేహితులందరూ గ్రూప్‌గా అప్యాయతను పంచుకుంటూ స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాఫ్, ట్విట్టర్, హైక్ మెసెంజర్, లైన్‌తోపాటు పలు సోషల్ మీడియాల్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మధుర క్షణాలను నెమరువేసుకోవడానికి ఆధునిక సాంకేతికతను వాడుకుంటున్నారు. తమ క్లాస్మేట్లు అందరూ కలిసి వాట్సాప్‌లో ఒకగ్రూప్‌గా ఏర్పడి రోజు టచ్‌లో ఉంటున్నారు. దీనిద్వారా అ‘పూర్వ’ సమ్మేళనాలు జరుపుకుని పాత స్నేహితులను కలుసుకుని సరదాగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. స్నేహానికి.. కానుక కానుక మదిలో భావాన్ని వ్యక్తపరిచే అందమైన సాధనం. అనురాగంలోని గాఢతను వెల్లడించే అపురూప మాధ్యమం. అలాంటి కానుక స్నేహితులు పదికాలాలపాటు మదిలో పదిలపర్చుకునేలా ఉండాలని కోరుకుంటూ అందమైన కానుకలను స్నేహితులకు బహుకరించాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో కేకులు, గ్రీటింగ్‌కార్డులు, బాండ్లు, వాచ్‌లు, టాయ్స్, సీనరీస్, చాక్లెట్స్, సబ్లినేషన్ ప్రింట్ ఆర్టికల్స్‌తోపాటు పలు రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్వీట్‌షాపులు స్నేహితుల కోలాహలంతో మారుమోగుతున్నాయి. నగరంలోని పలు బేకరీలలో ఫ్రెండ్షిప్ డే కేకులు రెyీ గా ఉన్నాయి. లిసా నా బెస్ట్ ఫ్రెండ్ –మునిఫల్లి ఫణిత, లిసా లిసా నాబెస్ట్ ఫ్రెండ్. పదేళ్లుగా మేము స్నేహితులం. యూఎస్ఏలోని ఆర్కానాస్ రాష్ట్రాం, లిటిల్‌రాక్ ప్రాంతానికి చెందిన లీసా నాకు ఆత్మీయురాలు. ప్రతీవిషయంలో వెన్నంటి ఉండే నా చెలిమి. స్నేహితులు అందరికీ ఉంటారు. నేను ఇండియా, తను అమెరికా అయినా భాష, దేశంతో సంబంధం లేకుండా మా అనుబంధం కొనసాగుతోంది. స్నేహం కన్నా గొప్పది మరొకటి ఉండదని నా అభిప్రాయం. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలలో తన సలహాలు,సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తుంది. మన దేశ సంస్కృతి, సంప్రాదాయాలంటే చాలా గౌరవం. స్నేహితులు లేనివారుండరు –జె.సాగర్, జి.భరద్వాజ్, ఎం.వెంకటసాయి స్నేహితులు లేని వారు ఎవరుండరు. స్నేహమంటే ఈ లోకంలో చాలా విలువైన బంధం. మేము ముగ్గురం చిన్ననాటి నుంచి అంటే సుమారు 20 ఏళ్లనుంచి స్నేహితులం. తల్లిదండ్రులతో చెప్పుకోని విషయాలు, అనుభూతులు స్నేహితులతో పంచుకుంటాం. ఏటా స్నేహితులు దినోత్సవాన్ని ఘనంగా జరపుకుంటాం. మేమే కాకుండా మా స్నేహితులందరం కలిసి పరస్పరం అభినందనలు తెలుపుకుని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. -
ఫ్రెండ్షిప్ డే సందడి
-
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్‌కు సన్నాహాలు
-
ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో అపశ్రుతి
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం రిసార్ట్స్‌లో స్నానం చేస్తుండగా ఒకరు పులిచింతల లో మునిగి మరొకరు స్నేహితుల దినోత్సవంనాడు జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రాంతాలకు స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఇద్దరూ స్నానం చేసేందుకు నీటిలో దిగి ప్రాణాలు పోగొట్టుకోవడం గమనార్హం. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులో దిగి మృత్యువాత పడగా, మరో ఘటనలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన విద్యార్థి కంచికచర్ల మండలం పరిటాల వద్ద ఒక రిసార్ట్స్‌లోని స్విమింగ్ పూల్‌లో దిగి ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీంతో వారి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. కంచికచర్ల: ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితులతో ఫ్రెండ్షిప్ డేను ఆనందంగా జరుపుకొందామని వచ్చి స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈత కొడుతూ ఊపిరాడక మునిగి మృత్యువాత పడిన ఘటన కంచికచర్ల మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ నాల్గవ సంవత్సరం చదువుతున్న చిలకలూరిపేటకు చెందిన జి.బాలశంకర్ (21)తోపాటు బత్తుల సంఘమిత్ర (రాజోలు), కిరణ్‌కుమార్(మదినేపల్లి), శివ (గుడివాడ), పిల్లి గోపి (పెదకూరపాడు), లింగాల వెంకటయ్య (కారంపూడి) తేజ వివిధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరంతా ఫ్రెండ్షిప్ డేను ఆనందంగా జరుపుకొందామని కంచికచర్ల మండలం పరిటాలలోని 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఉమా రీసార్ట్‌కు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. అయితే వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు మద్యం తాగారు. అనంతరం రిసార్ట్స్‌లో ఉన్న స్విమ్మింగ్‌ఫూల్‌లో స్నానం చేసేందుకు వెళ్లారు. ఆ ఈత కొలను నాలుగు అడుగుల నుంచి తొమ్మిది అడుగుల లోతు వరకు ఉంటుంది. కొలనులో స్నానం చేసే సమయంలో బాలశంకర్ తొమ్మిది అడుగులో లోతులోకి వెళ్లడంతో అతనికి ఊపిరాడలేదు. ఇదంతా గ్రహించిన తోటి స్నేహితులు బాలశంకర్‌ను ఈత కొలను నుంచి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించి అనంతరం సమీపంలో ఉన్న ఓ వాహనంలో వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ కె.ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. శోకసంద్రంలో ఖాదర్ కుటుంబం.. జగ్గయ్యపేట/అచ్చంపేట (గుంటూరు) : గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ (29) ఆదివారం స్నేహితులతో కలిసి గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. పదేళ్ల కిందటే ఖాదర్ తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు ఖాదరే చూసుకుంటున్నాడు. అతడితో పాటు అతని సోదరుడు, తల్లి, భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలోని ఒక రీబటన్ టైర్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో గ్రామానికి చెందిన 8 మంది స్నేహితులతో కలిసి గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి కృష్ణానదీలో స్నానం చేసేందుకు దిగారు. ఖాదర్‌కు ఈత రాకపోవడంతో ఒక్కసారిగా మునిగిపోయాడు. ఆరు నెలల గర్భిణి అయిన అతడి భార్యను ఓదార్చటం ఎవరి తరం కావడం లేదు. -
స్నేహంగా రాహ్‌గిరి..
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం ‘రాహ్‌గిరి’ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. విభిన్న చిత్రాలు, ఉర్రూతలూగించే సంగీతానికి అనుగుణంగా రోడ్లపై స్టెప్పులు, ప్రత్యేక ఆటలు జోష్ నింపాయి. ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఆటాపాటలతో రాహ్‌గిరి సాగింది. హెపటైటిస్ అవగాహన నడకలో ఉద్యోగులు, యువత, చిన్నారులు పాల్గొన్నారు. కార్‌పూలింగ్, కార్ ఫ్రీ పేరిట అవగాహన కల్పించారు. హుక్స్ హూపింగ్, రన్నింగ్, స్కేటింగ్, యోగా, జుంబా డ్యాన్స్‌తో సందడి చేశారు. - సెంట్రల్ యూనివర్సిటీ -
స్నేహితుల దినం రోజే ..
ప్రొద్దుటూరుకు చెందిన విజయ్ కుమార్ స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనుకున్నాడు. స్నేహితులంతా సమీపంలోని కుందూ నది వద్దకు వెళ్లారు. ఈత కొట్టసాగారు.. ఇంతలోనే విజయ్ కుమార్ ఊబిలో చిక్కుకుపోయాడు. స్నేహితులు గమనించి వెలికితీసేలోపే ఊపిరి ఆగిపోయింది. స్నేహితుల రోజునే వారికి విషాదాన్ని మిగిల్చాడు. ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన సుజానమ్మ, ఆనందరావు దంపతుల పెద్ద కుమారుడు విజయకుమార్(22) ఈత కోసం కామనూరు సమీపంలోని కుందూనది ఊబిలో చిక్కి ఆదివారం అకాల మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. పనికెళ్లిన్నా.. బతికేటోడు విజయకుమార్ లారీ అన్‌లోడింగ్‌కు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే కావడంతో పనికి వెళ్లలేకపోయాడు. తోటి మిత్రులతో కలసి ఆనందంగా గడపాలనుకున్నాడు. తన ఆరుగురు మిత్రులతో కలసి కామనూరు సమీపంలోని కుందూనదికి ఈతకని వెళ్లాడు. అక్కడ ఈతకొడుతుండగా ఊబిలో చిక్కాడు. ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుని మరణించాడు. ఈతగాళ్లొచ్చినా ప్రయోజనం లేకపాయె.. సంఘటన జరిగిన వెంటనే విజయకుమార్ మిత్రులు వెంటనే గ్రామంలోకి చేరుకుని జరిగిన సంఘటనను తెలిపారు. వెంటనే గ్రామస్తులు ఈతగాళ్లను పిలిపించారు. వారు కుందూనదిలో అంతటా గాలించారు. చివరకు విజయకుమార్ మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. విజయకుమార్‌కు నివాళులు ఈతకు వెళ్లి విజయకుమార్ మృత్యువాతపడినట్లు తెలియగానే వార్డు కౌన్సిలర్ రాగుల శాంతి, ఆమె భర్త శ్రీనివాసులు, 19వ వార్డు కౌన్సిలర్ చక్రకోళ్ల రామదాసు, చౌడం రవీంద్ర తదితరులు తరలివచ్చారు. విజయకుమార్ మృతదేహాన్ని సందర్శించారు. నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. తల్లిడిల్లిన హృదయం తన బిడ్డ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లాడని, ఇక రాడని తెలిసి విజయకుమార్ తల్లి సుజానమ్మ తల్లడిల్లిపోయారు. అండగా ఉంటాడనుకుంటిమే.. మమ్మల్ని వదిలేసి ఎళ్లిపోతివా బిడ్డా.. అంటూ ఆమె విగతజీవిగా మారిన కుమారుడిపై పడి రోదించడం అందరి హృదయాలను బరువెక్కించింది. దేవుడా.. ఎంత అన్యాయం చేశావురా.. మాకు ఎందుకింత శిక్ష విధించావురా సామీ.. అంటూ ఆమె గద్గద స్వరంతో దేవుడ్ని నిలదీయడం చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు.. స్నేహితులు.. ఇలా అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఫ్రెండ్షిప్ డే రోజునే తాము మంచి స్నేహితుడ్ని కోల్పోవడం దురదృష్టకరమని అతని మిత్రులు బిగ్గరగా ఏడ ్వడం కరకు హృదయాలను సైతం కరిగించింది. -
వైకల్యం కన్నా... స్నేహం మిన్న
దేవరకద్ర రూరల్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు... ఇద్దరూ ప్రాణ స్నేహితులు... ఇందులో ఒకరికి కళ్లులేవు. మరొకరికి బుద్ధిమాంధ్యం ఉంది. ఎప్పుడూ కలిసిమెలసి ఉండే వీరు స్నేహితుల దినోత్సవమైన ఆదివారం దేవరకద్ర నుంచి గద్దెగూడేనికి వె ళుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. వారిని పలకరించగా స్నేహబంధాన్ని వివరించారు. ఆస్తి, అంతస్తులు చూస్తున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే శారీరకలోపంతో సతమతమయ్యే తాము 30ఏళ్ల క్రితమే స్నేహితులుగా మారామన్నారు. మహబూబ్‌నగర్‌లోని టీడీగుట్టకు చెందిన మహబూబ్‌పాషా పుట్టుకతోనే అంధుడు, అదే ప్రాంతానికి చెందిన కృష్ణకు బుద్ధిమాంధ్యం ఉంది. అప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండరు. తన కళ్లతో కృష్ణ స్నేహితుడు మహబూబ్‌పాషాకు లోకాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడికెళ్లినా కృష్ణ భుజంపై చేయి వేసి నడుస్తాడు. యాచించిన డబ్బులను ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. వారు కలిసే తింటారు, ఉంటారు. వైకల్యం ముందు స్నేహం మిన్న అన్న చందంగా వీరు ముందుకు సాగుతున్నారు. కులమతాలు వేరైనా స్నేహానికి అవేమీ సాటిరావన్న నానుడిని నిజం చేస్తున్నారు. మనసుండాలే కాని స్నేహానికి కొదవలేదని చాటి చెబుతున్నారు. -
స్నేహితుడి కోసం వెళ్తూ మృత్యు ఒడికి..
ముక్కామల(అంబాజీపేట) :స్నేహితుల దినోత్సం సందర్భంగా స్నేహితుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్తున్న ఓ యువకుడిని మృత్యువు కబళించింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పి.గన్నవరం మండలం కుందాలపల్లి (అవిడి డాం)కు చెందిన మట్టపర్తి దుర్గాప్రసాద్ (26) ఆదివారం తెల్లవారుజామున గంటిపెదపూడిలోని తన అత్తగారింటి నుంచి పల్సర్ మోటారు బైక్‌పై అయినవిల్లి మండలం మూలపాలెంలో ఉన్న తన స్నేహితుడు శంకర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళుతున్నారు. అంబాజీపేట మండలం ముక్కామల పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ తలకు బలమైన గాయమైందని, అందువల్లే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. దుర్గాప్రసాద్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. భార్య, ఆరు నెలల బాబు ఉన్నారు. విజయవాడలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి గంటిపెదపూడిలోని తన అత్తగారింటికి వచ్చాడు. దుర్గాప్రసాద్ అత్త కాండ్రేగుల రామలక్ష్మి బోరున విలపిస్తూ తన కుమార్తె జీవితం తెల్లారిపోయిందని.. ఆమెకు ఎవరు దిక్కని.... ఆరు నెలల పిల్లవాడు తండ్రిలేని అనాథైపోయాడని రోధించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు. -
స్నేహితులంటే వారే!
-
బాలీవుడ్ దోస్తానా
మూవీ బజ్: బాలీవుడ్లో తెరపైనే కాదు, నిజజీవితంలోనూ దోస్తానా కొనసాగించే నటీనటులు ఉన్నారు. అలాంటి జిగిరీ దోస్తుల గురించి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా... దీపికా పడుకొనే- సహానాగోస్వామి కెరీర్ ప్రారంభం నుంచే వీరిద్దరూ సన్నిహిత నేస్తాలు. ఇద్దరూ కలసి స్కూబా డైవింగ్ చేసేవారు. హ్యాంగౌట్లకు వెళ్లేవారు. ఇప్పటికీ అరమరికలు లేకుండా ఒకరి రహస్యాలు మరొకరికి చెప్పుకుంటారు. ‘సహానా నా బెస్ట్ ఫ్రెండ్. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరం కలసి ఒక చిత్రంలో నటించాం కూడా. షూటింగ్‌ల కోసం ఎక్కడకు వెళ్లినా, ముంబైకి తిరిగి వచ్చాక నేను చేసే మొట్టమొదటి ఫోన్‌కాల్ సహానాకే’ అని దీపికా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. షారుఖ్ ఖాన్- జూహీచావ్లా బాలీవుడ్లో చిరకాల మైత్రి కొనసాగిస్తున్న వారిలో షారుఖ్ ఖాన్, జూహీచావ్లాల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వ్యాపార లావాదేవీల కారణంగా చిన్నచిన్న పొరపొచ్చాలు తలెత్తినా, ఇప్పటికీ వీరి స్నేహం చెక్కు చెదరకుండా ఉంది. ‘వ్యాపార భాగస్వాములుగా కొనసాగడం మానేశాం. అందుకే ‘షారుఖ్‌తో నా మైత్రి ఇంకా కొనసాగుతోంది’ అని జూహీ చెప్పింది. తన తల్లి 1998లో మరణించిన సమయంలో షారుఖ్ తనకు ఎంతగానో ఆసరా ఇచ్చాడని తెలిపింది. సల్మాన్‌ఖాన్- అజయ్‌దేవ్‌గన్ వీరిద్దరి దోస్తీ గురించి ఎక్కువమందికి తెలియదు. అయితే, చాలాకాలంగా వీరిద్దరూ మంచి మిత్రులు. సల్మాన్‌ఖాన్ నటించిన ‘రెడీ’లో అజయ్ దేవ్గన్ అతిథి పాత్ర పోషిస్తే, అజయ్ ‘సన్ ఆఫ్ సర్దార్’లో సల్మాన్ ఒక ఐటం సాంగ్‌లో మెరిశాడు. ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’, ‘లండన్ డ్రీమ్స్’ చిత్రాల్లో కలసి నటించారు కూడా. తమ సినిమాలను ఒకరికొకరు చూపించుకునేందుకు ప్రత్యేక ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేస్తుంటారు. -
ఫ్రెండ్షిప్ డే ఇలా కూడా.. doggies డే అవుట్
ఫ్రెండ్‌షిప్‌డే రోజు ఏం చేస్తారు! ఫ్రెండ్స్‌కి కాల్ చేసి విష్ చేస్తారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అభిమానంగా బ్యాండ్స్ కడతారు. ఈ రొటీన్ సెలబ్రేషన్‌కి చెక్ పెట్టండి. కుక్క విశ్వాసం కలిగిన జంతువే కాదు... మనిషి ప్రియనేస్తం కూడా. అలాంటి నేస్తానికి ఈ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా సాయం చేసి, మీ సహృదయతను తెలియజెప్పమంటోంది గ్రూప్ ఆన్ ఇండియా. వీధికుక్కల సంక్షేమం, పునరావాసం కోసం ఎన్జీవో ఫ్రెండికోస్తో భాగస్వామ్యమైన ఈ సంస్థ.. ఈ స్నేహితుల దినోత్సవాన వీధి కుక్కలను కాపాడి లేదంటే వైద్యమందించి మీ ఔదార్యాన్ని చాటుకొమ్మంటోంది. ఇందుకోసం 99 రూపాయల నుంచి 499 రూపాయల వరకు ప్యాకేజెస్ను అందిస్తోంది. ఇందుకోసం http://gr.pn/1nLFctk లో లాగాన్ అవ్వాలి. అందులో మీరు డీల్ కుదుర్చుకోవాలనుకున్న ప్రైస్ మీద క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయండి. అంతే... 99 రూపాయలకయితే మీరు కాపాడిన కుక్కకు మంచి ఆహారం అందిస్తారు. ఇక 299 రూపాయలతో డీల్ కుదుర్చుకుంటే ఫస్ట్‌ఎయిడ్, వ్యాక్సినేషన్‌తోపాటు దానికి ఫ్లూయిడ్స్ కూడా ఇస్తారు. ఇక 499 రూపాయల డీల్ అయితే గాయపడిన డాగీని కాపాడేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ డీల్ కాలపరిమితి ఈ నెల 25. -
దోస్త్.. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్
‘స్నేహమంటే సొల్లు కబుర్లు కాదోయ్ సమష్టి విజయాలోయ్’ అంటున్నారు నగర యువత. ఇద్దరు దోస్తులు కలిస్తే కాలక్షేపం ఎలా చేయాలా అని ఆలోచించే రోజులు పోయి.. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించే రోజులొచ్చాయి. చేయి చేయి కలుపు.. మనదే కదా గెలుపు అంటూ విభిన్న రంగాల్లో ‘ఫ్రెండ్లీ’ సక్సెస్‌ను సాధిస్తున్నారు. మరీ ముఖ్యంగా నగరంలో యువ‘విజయాల’తో వర్ధిల్లుతున్న నాలుగు రంగాలను పరిశీలిస్తే వాటిని నడిపిస్తున్నది స్నేహమే అనిపిస్తుంది. - ఎస్. సత్యబాబు సాయమేరా స్నేహితం బంజారాహిల్స్‌లో నివసించే చైతన్య.. నిరుపేద విద్యార్థులకు చేయూత నిద్దాం అనుకున్నప్పుడు ఆయన స్నేహితులు అయూబ్, కిరీట్, సుగుణ వెంటనే ‘మేం రెడీ’ అన్నారు. ఈ స్నేహితుల టీం 2007 లో పాషనేట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేమున్నామని చేయూతనిస్తోంది. ‘ఇంగ్లిష్, లీడర్షిప్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలని టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రామ్ ప్రారంభించాం. వారాంతంలో చదువు చెప్పేందుకు బంజారాహిల్స్, బోయిన్పల్లి, కూకట్పల్లి వంటి పలు ప్రాంతాల్లో 10 ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నాం. సిటీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మా వాలంటరీ నెట్వర్క్ ఉండాలని మా ఆశయం’’ అంటున్నారు చైతన్య. ఈ ప్రయత్నంలో స్నేహితుల ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. సాహసం చిరునామా సాహసం చేయరా స్నేహితుడా అని ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటున్న ప్రోత్సాహంతో.. సిటీలో అడ్వెంచర్ టూర్స్ అద్భుతంగా సక్సెస్ అవుతున్నాయి. బోయిన్‌పల్లిలో ఉండే ఫరీదా ఒకప్పుడు చెట్టు కూడా ఎక్కి ఉండరు. కానీ ఇప్పుడు హ్యాపీగా చెట్టులెక్కగలను.. గుట్టలెక్కగలను అంటోంది. ‘మా ఫ్రెండ్స్ లక్ష్మి, దత్తా, శర్వానంద్, రఘు, శ్వేతతో కలసి నెలకోసారైనా శామీర్‌పేటలోని రాక్ క్లైంబింగ్‌కు రెగ్యులర్‌గా వెళుతుంటాం. అలాగే అనంతగిరి హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటాం. ఒంటరిగా అయితే కష్టమే. మా ఫ్రెండ్స్‌తో కలసి ఎన్నోసార్లు ట్రెక్కింగ్ ఎంజాయ్ చేశాం. బోలెడంత కాన్ఫిడెన్స్ పొందాం’’ అంటారు ఫరీదా. అదే ఇం‘ధనం’ కరెన్సీని సైతం కాగితం ముక్కలా విసిరిపారేసే ధైర్యం ఇస్తుంది స్నేహం. సరిపడా ఆదాయాన్ని ఇస్తున్న ఉద్యోగాన్ని వదిలేసిన రోహిత్ పడియాలకు ఆ ధైర్యాన్నిచ్చింది స్నేహమే. కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదనుకున్న శ్రీ శాక్రేతో కలసి దేశంలోనే మొదటి ఆన్లైన్ నర్సరీని గమ్‌లా డాట్ కామ్ పేరుతో ప్రయోగా త్మక వ్యాపారం చేపట్టే సాహసం చేయించిందీ మెత్రీ బంధమే. ‘కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే మనోధైర్యం ఉండాలి, ఒక్క స్నేహితుడే దాన్ని ఇవ్వగలడు’ అంటారు రోహిత్. విజయ రహస్యం షార్ట్ ఫిల్మ్ సక్సెస్‌కు స్క్రిప్టులు, కెమెరాలు, ఆర్టిస్టులు.. వీటికన్నా మిన్నగా అర్థం చేసుకునే స్నేహాలు కావాలంటారు మణికొండలో నివసించే అజయ్. షార్ట్ ఫిల్మ్ అయినా.. షార్ప్‌గా రావాలంటే అభిరుచులు కలసిన దోస్తీ అవసరమని అనిరుధ్, అజయ్, అశోక్ వర్ధన్, పడమటలంక నవీన్, నానిలు నిరూపిస్తున్నారు. వీరి బృందం నుంచి లక్కీ, నౌ దో గ్యారా, పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు వంటి షార్ట్ హిట్స్ వచ్చాయి. వీరిలో అనిరుధ్ ఇటీవల సినిమా చాన్సు కూడా కొట్టేశాడు. మరిన్ని విజయాలవైపు నడుస్తున్న ఈ మిత్ర బృందం.. స్నేహబంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. -
మా మధ్య బోల్డన్ని గొడవలు!
ఒక్కరు కాదు... ఇద్దరు స్నేహితురాళ్లను పొందిన అదృష్టవంతురాల్ని నేను. నా స్కూల్ ఫ్రెండ్స్ అనూష, మేఘన అంటే నాకు చాలా ఇష్టం. అనూష యూఎస్‌లో లాయర్‌గా చేస్తోంది. తను యూఎస్ వెళుతున్నప్పుడు తెగ బాధపడిపోయాను. తన పరిస్థితి కూడా అంతే. నేను యూఎస్ వెళితే, వీలు చేసుకుని అనూషను కలుస్తాను. ఇక, నా మరో స్నేహితురాలు మేఘన గురించి చెప్పాలి. తను మలేసియాలో ఉంటోంది. పెళ్లయిపోయింది. ఇండియా వస్తే నన్ను కలవకుండా వెళ్లదు. మలేసియా వెళితే తనని కలవకుండా నేను ఇండియా రాను. ఇతరులకు అసూయ పుట్టించేంత స్నేహితులం మేం. అలాగని, గొడవలు పడమని అనుకోవద్దు. అనూషతో రెండుసార్లు చాలా గట్టిగా గొడవపడ్డాను. మేఘనకు, నాకూ మధ్య ఓసారి గొడవ జరిగింది. ఓ రెండు, మూడు రోజులు ఎడమొహం పెడమొహంగా ఉండి, ఆ తర్వాత ‘సారీ’ చెప్పేసుకుని మాట్లాడేసుకున్నాం. వాళ్లతో గడిపిన క్షణాలే కాదు.. ఆ గొడవలు కూడా నాకు తీపి జ్ఞాపకాలే. -
ఎవరెవరితో స్నేహం చేస్తున్నానో నాన్న ఓ కంట కనిపెట్టేవారు..!
మీ స్నేహితుల గురించి తెలుసుకోవాలని ఉంది..! వాళ్ల పేర్లు చెప్పాలంటే లిస్ట్ చాలా ఉంది. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ స్కూల్, కాలేజ్ డేస్ నుంచీ నాతో ట్రావెల్ అవుతున్నవారే. మేమంతా కలిశామంటే సందడికి కొదవ ఉండదు. ఫ్రెండ్షిప్ డేకి ప్రత్యేకంగా పార్టీ చేసుకుంటారా? అలా ఏమీ లేదండి. 365 రోజుల్లో ఏదో ఒక సందర్భంలో మన ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉంటాం. ఇక, ప్రత్యేకంగా ఈ రోజు కలుసుకుని పార్టీ చేసుకోవడం దేనికి? అయితే, ఫ్రెండ్షిప్ డే నాడు ఒకటి చేయొచ్చు. చిన్నపాటి మనస్పర్థలతోనో, పెద్ద పెద్ద గొడవల కారణంగానో విడిపోయిన స్నేహితులకు ‘సారీ’ చెప్పుకుని తిరిగి కలవడానికి ఈ రోజుని వినియోగించుకోవచ్చు. మీకలా ఎవరైనా ఉన్నారా? లేరు. ఏదైనా మాటా మాటా అనుకున్నా... ఆ క్షణం వరకే. ఆ తర్వాత మామూలుగా మాట్లాడేసుకుంటాం. అసలు ఫ్రెండ్స్ ఉండాలంటారా? తప్పకుండా. ఎందుకంటే, అన్ని విషయాలనూ ఇంట్లోవాళ్లతో చెప్పుకోలేం. ఏ విషయాన్నయినా పంచుకోగలిగేది స్నేహితులతో మాత్రమే. మీ స్నేహితులతో మీరు అన్నీ చెప్పుకుంటారా? మానసికంగా, శారీరకంగా ఎప్పుడైనా ‘డౌన్’ అయ్యాననుకున్నప్పుడు చెప్పుకుంటాను. దాంతో కొంచెం భారం దిగినట్లనిపిస్తుంది. చిన్నప్పుడు ఎవరితో పడితే వాళ్లతో స్నేహం చేయొద్దని అమ్మానాన్న చెబుతుంటారు. మరి.. మీ నాన్నగారు ఆ విషయంలో ఏమైనా సలహాలిచ్చేవారా? నేనెవరెవరితో స్నేహం చేస్తున్నానో నాన్నగారు ఓ కంట కనిపెట్టేవారు. ఒకవేళ ఎవరైనా కరెక్ట్ కాదనిపిస్తే, ‘అతనితో స్నేహం వద్దు’ అని చెప్పేవారు. అమ్మానాన్న తమ అనుభవంతో అన్నీ చెబుతుంటారు కాబట్టి, వాళ్ల సలహాని పాటించేవాణ్ణి. ఇప్పుడు మీకు తగ్గ స్నేహితులను జడ్జ్ చేయడంలో మీరెంతవరకు బెస్ట్? ఈ విషయంలో గతంలో కొన్ని తప్పులు చేశాను. కానీ, ఇప్పుడలా కాదు. తొలిసారి కలిసినప్పుడే నేను ఎవరి గురించైనా పూర్తిగా కాకపోయినా కొంతవరకూ తెలుసుకోగలుగుతున్నాను. ఆడ, మగ స్నేహం అంటే విడ్డూరంగా చెప్పుకుంటారు.. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల్లో మార్పు రావడం గమనించారా? నాకు తెలిసి స్నేహానికి జెండర్‌తో పని లేదు. అభిప్రాయాలు కలిసినప్పుడు స్నేహం చేయొచ్చు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఆడ, మగ మధ్య స్నేహాన్ని వక్రీకరించడంలేదు. అందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే, స్వచ్ఛమైన స్నేహాన్ని ఆమోదించాలే తప్ప అభ్యంతరకరమైన అర్థాలు తీయకూడదు. మీకు ప్రత్యేకంగా లేడీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? పర్టిక్యులర్‌గా లేరు. కానీ, నాకున్న చాలామంది స్నేహితుల్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. మీ ఫ్రెండ్స్ అందరిలోకెల్లా మీరు ‘స్టార్’ కాబట్టి.. ప్రత్యేకంగా చూస్తారా? అలా ఏం లేదు. నాతో చాలా మామూలుగా ప్రవర్తిస్తారు. నా ఫ్రెండ్స్ దగ్గర నాకు నచ్చిన లక్షణం అదే. ఫ్రెండ్షిప్లో హోదా ప్రదర్శిస్తే అది స్నేహం కాదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాలనుకుంటారు? ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్‌డీడ్’ అనే విషయాన్ని నేను నమ్ముతాను. వృత్తిరీత్యా బిజీ బిజీగా ఉంటాం. ఇంటిపట్టున ఉండేది తక్కువ. అలాంటప్పుడు బయటి ప్రపంచంలో ఉన్న స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతాం. అందుకే స్నేహితులు ఉండాలి! -
నా ప్రియనేస్తం వాడే!
‘‘ఏం ఫర్వాలేదు... నీకు నేనున్నాను’’ అని భరోసా ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి ఓ స్నేహితుడు లభించడం నా అదృష్టం. తన పేరు రాజా. మేమిద్దరం కలిసి చదువుకోలేదు కానీ, కలిసి ఆడిన ఆటలు బోల్డన్ని. మా ఇంటి పక్కనే రాజా ఇల్లు. తనలో నాకు నచ్చే లక్షణం ఏంటంటే.. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటాడు. పెద్దయిన తర్వాత ఎవరి కెరీర్లో వాళ్లు స్థిరపడినా... వీలు దొరికినప్పుడల్లా కలుసుకుంటాం. షూటింగ్స్ కోసం నేనెక్కడికెళ్లినా.. తను ఖాళీగా ఉంటే నాతో పాటు వస్తాడు. ఎంత స్నేహితుల మధ్య అయినా అప్పుడప్పుడూ గొడవలు వస్తాయంటారు. కానీ, మా మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదు. భవిష్యత్తులో కూడా రాకూడదని కోరుకుంటున్నాను. నా జీవితంలో జరిగే మంచీ, చెడూ రెంటినీ పంచుకునే నా ప్రియ నేస్తం రాజా. మా స్నేహం ఎప్పటికీ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను. -
విహారం మిగిల్చిన విషాదం
సంగారెడ్డి మున్సిపాలిటీ/సంగారెడ్డి రూరల్/పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్ : స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో విహారయాత్రకు బయలుదేరిన ఐదుగురు మిత్రులను మృత్యువు వెంటాడింది. విహారయాత్ర ముగించుకుని తిరుగుపయనమైన వారు గమ్యం చేరుకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. మృతుల్లో ఒకరైన శశిభూషణ్ తన పుట్టిన రోజుకు ఒకరోజు ముందే మృతి చెందటం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. జిల్లా వాసులను కలచి వేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సమీపంలో షాంగ్లా గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన రాబిన్ స్వరాజ్(38), శ్రీకాంత్(26), ప్రదీప్‌కుమార్(25), శశిభూషణ్(26), ప్రణీత్‌రెడ్డి(25) మృతి చెందారు. వీరంతా మిత్రులు కాగా, గత శనివారం ఫ్రెండ్‌షిప్‌డే వేడుకలు గోవాలో సరదాగా జరుపుకోవాలని సంగారెడ్డి నుంచి ఇండికా వాహనంలో బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని మంగళవారం రాత్రి సంగారెడ్డి తిరుగుపయనమయ్యారు. అయితే బీజాపూర్ సమీపంలో షాంగ్లా వద్ద 218 జాతీయ రహదారిపై రాత్రి 7.30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఇండికా వాహనం బండరాళ్లలోడ్తో ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం పూర్తిగా ధ్వంసం కాగా మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. బీజాపూర్ సమీపంలోని కొల్లార్ పోలీసులు ఘటన స్థలం చేరుకుని మృతదేహాలను బీజాపూర్‌లోని అల్-ఇమామ్ ఆసుపత్రికి తరలించారు. ఇండికా వాహనంపై ఉన్న వాహనం సర్వీసింగ్ సెంటర్ స్టిక్కర్ ఆధారంగా కొల్లార్ స్టేషన్ పోలీసులు మృతుల వివరాలను ఆరా తీసి వారి కుటుంబీకులకు రాత్రి 11.30గంటల ప్రాంతంలో సమాచారం అందజేశారు. బుధవారం ఉదయం హుటాహుటీన బీజాపూర్ వెళ్లిన మృతుల కుటుంబీకులు అక్కడి అల్-ఇమామ్ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఆ తర్వాత వాహనాల్లో ఐదు మృతదేహాలను తీసుకుని రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సంగారెడ్డికి చేరుకున్నారు. ఆ వెంటనే రాబిన్‌స్వరాజ్, ప్రదీప్‌కుమార్, శశిభూషణ్, ప్రణీత్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, శ్రీకాంత్ అంత్యక్రియలు మాత్రం గురువారం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వేడుక చేసుకునేందుకు వెళ్లి... సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి కళాశాల స్థాయి నుంచి మిత్రులు. వీరికి మరో ఆరుగురు మిత్రులు సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో ఉన్నారు. మొత్తం 11 మంది మిత్రులు గతనెల 31న సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కలుసుకున్నారు. ఆగస్టు 4వ తేదీన ఫ్రెండ్‌షిప్‌డే ఉన్నందున గోవా విహారయాత్రకు వెళ్ళాలని, అక్కడే సరదాగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిలో ఆరుగురు మిత్రులు తమకు వీలుకాదని చెప్పటంతో రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి షిర్డీ మీదుగా గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత శనివారం రాబిన్ స్వరాజ్ మామయ్యకు చెందిన ఇండికా విస్టా కారులో ఐదుగురు మిత్రులూ సంతోషంగా గోవా బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని సంగారెడ్డికి తిరిగి వస్తుండగా బీజాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బర్త్‌డేకు ఒకరోజు ముందే... బర్త్‌డేకు కేవలం ఒక్కరోజు ముందే శశిభూషణ్ మృత్యువాత పడడం వారి కుటుంబసభ్యులను, మిత్రులను, బంధువులను తీవ్రంగా కలచివేస్తోంది. సంగారెడ్డి మండలం కవలంపేట గ్రామానికి చెందిన శశిభూషణ్ పుట్టినరోజు గురువారం(8వ తేదీ) కావడంతో ఆ రోజు కుటుంబసభ్యులతో గడపాలనుకున్నాడు. అందుకే బుధవారం నాటికే స్వగ్రామం చేరాలని గోవా నుంచి బయలుదేరాడు. అయితే పుట్టినరోజు వేడుకలు జరుపుకోకముందే శశిభూషణ్ మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. తమబిడ్డ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాల్సిన తాము అతని అంతిమయాత్రలో పాల్గొనాల్సి వచ్చిందని శిశిభూషణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే శిశిభూషణ్ మరణవార్త చివరి వరకూ ఆయన తల్లి శ్యామమ్మకు కుటుంబీకులు తెలియనివ్వలేదు. ఒక్కసారిగా కనిపించిన కుమారుడు మృతదేహాన్ని చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. కుటుంబాల్లో అంతులేని విషాదం సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి మృతితో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. మంగళవారం రాత్రి వారి మృతి వార్త విన్నవెంటనే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వారి ఇళ్లవద్ద విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాలను వారి బంధువులు, మిత్రులు పరామర్శించారు. మృతుల స్నేహితులంతా వారి ఇళ్లవద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఐదుగురు మిత్రుల మృతితో సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, రుద్రారం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల నేపథ్యమిది.... రాబిన్‌స్వరాజ్: సంగారెడ్డి పట్టణంలోని మార్క్స్‌నగర్‌కు చెందిన పభుత్వ ఆస్పత్రి విశ్రాంత ఉద్యోగి శాంతకుమార్ పెద్దకుమారుడు. ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న రాబిన్‌స్వరాజ్ సంగారెడ్డి ఐటీఐ ఎదురుగా శ్వాస క్లినిక్‌ను 8 నెలలుగా నడుపుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. తన మిత్రులతో కలిసి గత శనివారం తన మామయ్య వాహనంలో మిత్రులతో కలిసి రాబిన్‌స్వరాజ్ గోవా బయలుదేరి వెళ్లాడు. కె.శ్రీకాంత్: సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడలో నివాసం ఉంటున్న కె.శ్రీకాంత్ స్థానిక యాక్సిస్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నాడు. తండ్రి వెంకటేశ్వర్రావు 25 ఏళ్ల క్రితం నెల్లూరు నుంచి సంగారెడ్డికి వచ్చి ఇటుక వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. వెంకటేశ్వర్రావుకు ఇద్దరు కుమారులు కాగా వారిలో మృతుడు శ్రీకాంత్ చిన్నవాడు. సంగారెడ్డిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీకాంత్ ఇక్కడే యాక్సిస్ బ్యాంకులో రెండేళ్లుగా పనిచేస్తూ సహచరులతో కలుపుగోలుగా ఉండేవాడు. ఇటీవలే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ప్రదీప్‌కుమార్: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రదీప్‌కుమార్ సంగారెడ్డిలోని విద్యాభ్యాసం పూర్తి చేశాడు. హెచ్ఎండీఏ విశ్రాంత ఉద్యోగి అంజయ్య, శాంతమ్మ దంపతులకు ప్రదీప్‌కుమార్ ఏకైక కుమారుడు. హైదరాబాద్‌లో కంప్యూటర్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న ప్రదీప్‌కుమార్ మృతితో వారి కుటుంబం వారసున్ని కోల్పోయింది. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు తోబుట్టువులు ప్రదీప్ మరణవార్త విని హతాశులయ్యారు. ప్రణీత్‌రెడ్డి: పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన ప్రణీత్‌రెడ్డి ఇటీవలే ఎంసీఏ పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ప్రాజెక్టు చేస్తున్నాడు.