Telugu Heros Friendship Day Special Story | Chiranjeevi, Nagarjuna, Prabhas, Ram Charan, Jr NTR, Rana Daggubati - Sakshi
Sakshi News home page

Friendship Day Special: తెలుగు హీరోల దోస్తీ.. ఏదేమైనా సరే!

Published Sun, Aug 6 2023 12:56 PM | Last Updated on Sun, Aug 6 2023 2:12 PM

Telugu Heros Friendship Day Special Story - Sakshi

స్నేహితులు.. ఫ్రెండ్స్.. దోస్తులు.. ఏ భాషలో ఏ పేరుతో పిలిచినా పలికే వ్యక్తులు కొందరు ఉంటారు. కష్టసుఖాల్లో తోడుండటమే కాదు.. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమని చూపిస్తారు. అయితే టాలీవుడ్‌లోనూ ఇలాంటి దోస్తులు చాలామందే ఉన్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్రెండ్‌షిప్ విషయంలో మాత్రం వీళ్లు చాలా స్పెషల్. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి స్టోరీలు?

(ఇదీ చదవండి: సర్కారు నౌకరి టీజర్‌.. ఎమోషనలైన సింగర్‌ సునీత)

చిరంజీవి-నాగార్జున
ఒకే టైంలో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి, నాగార్జున కోట్లాదిమంది అభిమానుల‍్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే వీళ్లిద్దరి స్నేహం గురించి పెద్దగా చెప్పుకోరు. కలిసి సినిమాలు చేయలేదు గానీ ఒకరి మూవీకి మరొకరి సాయం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కలిసి టీవీ ఛానెల్, ఫుట్‌బాల్ టీమ్ కొనడం లాంటి బిజినెస్‌లు కూడా చేశారు. ఇప్పటికీ వీళ్ల బాండింగ్ అంతే స్ట్రాంగ్‌గా ఉంది.

రామ్‌ చరణ్- జూ.ఎన్టీఆర్
టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే చరణ్-తారక్ కచ్చితంగా గుర్తొస్తారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కలిసి నటించారు. ఒక్కటిగా ప్రమోషన్ చేశారు, హిట్ కొట్టారు, ఆస్కార్ వరకు వెళ్లారు. దీనంతటికీ వీళ్ల మధ్య ఉన్న బాండింగ్, ఫ్రెండ్‌షిప్ ప్రధాన కారణం. వీళ్లది అలాంటి ఇలాంటి దోస్తానా కాదు.. కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఔటింగ్‌కి వెళ్తారు. బోలెడన్ని క్రేజీ అడ్వెంచర్స్ చేస్తుంటారు. 

(ఇదీ చదవండి: రామ్‌ చరణ్‌,జూ.ఎన్టీఆర్‌.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?)

రామ్ చరణ్ - రానా
దగ్గుబాటి హీరో రానా.. టాలీవుడ్‌లో అందరికీ ఫ్రెండ్. కాకపోతే రామ్ చరణ్‌ మాత్రం రానాకు జిగిరి దోస్త్. చిన్నప్పుడు కలిసి చదువుకున్నప్పుడు మొదలైన ఈ స్నేహం.. స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కెరీర్, ఫ్యామిలీ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కలుస‍్తూనే ఉంటారు. కాకపోతే ఈ విషయం పెద్దగా బయటకు తెలియనివ్వరు.

ప్రభాస్ - గోపీచంద్
'వర్షం' మూవీలో హీరో విలన్‌గా ప్రభాస్, రానా అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మొదలవక ముందు నుంచే వీళ్లు ఫ్రెండ్స్. డార్లింగ్ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయినా సరే.. గోపీచంద్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఒకరి గురించి ఒకరు టీజ్ చేసుకుంటుంటారు. కొన్నాళ్ల ముందు 'అన్ స్టాపబుల్' షోలోనూ కలిసి సందడి చేశారు. 

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్‌)

నితిన్ - అఖిల్
యంగ్ హీరో నితిన్.. అక్కినేని అఖిల్‌కి మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలోకి అఖిల్ రాకముందు నుంచే అఖిల్.. నితిన్ కు ఫ్రెండ్ అయ్యాడు. అది అలా కొనసాగుతూ వచ్చింది. అలానే అఖిల్ ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది నితిన్ కావడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలనప్పటికీ వీళ్ల స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదు.

అల్లరి నరేశ్ - నాని
యంగ్ హీరోలు అల్లరి నరేశ్, నాని స్నేహం గురించి పెద్దగా జనాలకు తెలీదు. నాని హీరోగా కెరీర్ మొదలుపెట్టే సమయానికి నరేశ్ ఆల్రెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే నరేశ్ తో ఏరా అనిపించుకునేంత క్లోజ్‌నెస్ నానికి ఉండేది. ఇప్పటికీ అది అలానే కొనసాగుతుంది. ఏరా అనే పిలుపు కాస్త బాబాయ్ అనేంత వరకు మారింది. 

వీళ్లతోపాటు రజినీకాంత్-మోహన్ బాబు, రామ్ చరణ్- శర్వానంద్, ఎన్టీఆర్ - మంచు మనోజ్, బాలకృష్ణ- శివరాజ్ కుమార్, మహేశ్ బాబు- వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్- సునీల్ కూడా చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్.

(ఇదీ చదవండి: 'ఆరు నెలల పాటు సినిమాలు వదిలేశా '.. నాగార్జున)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement