సినిమాల్లో వాడిన ఈ వెహికల్స్‌ గురించి తెలుసా? | Friendship Day Special Vintage Vehicles On Silver Screen | Sakshi
Sakshi News home page

Friendship Day 2021: ఫ్రెండ్స్‌.. ఫన్‌ రైడ్‌.. వింటేజ్‌ వెహికల్స్‌

Published Sun, Aug 1 2021 1:36 PM | Last Updated on Sun, Aug 1 2021 2:37 PM

Friendship Day Special Vintage Vehicles On Silver Screen - Sakshi

షోలే సినిమాలో ‘యే దోసితీ హమ్‌ మగర్‌ ఛోడేంగే’ అంటూ అమితాబ్‌-ధర్మేంద్రలు చేసే బైక్‌ జర్నీ వీడిపోని స్నేహానికి గుర్తుగా మిగిలిపోయింది. ఒక్క షోలేలోనే కాదు వెండితెరపైన బ్యాచిలర్‌ ఫ్రెండ్స్‌ చేసిన అనేక రోడ్‌ ట్రిప్‌లు మన మదిపై చెరగని ముద్రను వేశాయి. వారు ఉపయోగించిన  వెహికల్స్‌ మనలో చాలా మందికి ఓ ఫాంటసీలా ఉండిపోయాయి. 

దిల్‌ చాహ్‌తా హై సినిమాలో హీరోలు అమీర్‌ఖాన్‌, సైఫ్‌ఆలీఖాన్‌, అక్షయ్‌ఖన్నాలు ముంబై నుంచి గోవా వెళ్లేందుకు ఉపయోగించిన కారు మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ఎల్‌ 300 మోడల్‌. ఈ వింటేజ్‌ కారు ప్రస్తుతం మార్కెట్‌లో లేదు. అయితే దీని తర్వాత వచ్చిన ఎస్‌ఎల్‌ 350 వింటేజ్‌ కారు మార్కెట్‌లో కోటి రూపాయల దగ్గర లభిస్తోంది. దిల్‌ చాహ్‌తా హై దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌కి వింటేజ్‌ కార్లంటే ఇష్టం. అందుకే ఏరి కోరి ఈ సినిమాలో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ఎల్‌ 300 కన్వర్టబుల్‌ మోడల్‌ని ఫర్హాన్‌ ఉపయోగించాడు. 

దిల్‌ చాహ్‌తాహై తర్వాత మరోసారి హృతిక్‌ రోషన్‌, అభయ్‌ డియోల్‌, ఫర్హాన్‌ అక్తర్‌లతో​ మరోసారి రోడ్‌ ట్రిప్‌ మూవీని తెరకెక్కించాడు ఫర్హాన్‌ అక్తర్‌. అయితే ఈసారి మరో వింటేజ్‌ కారు బ్విక్‌ సూపర్‌పై మనసు పారేసుకున్నాడు. ఈ కారుని 1940 నుంచి 1956 మధ్యన బ్విక్‌ కంపెనీ ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ఈ కార్లు  మార్కెట్‌లో అందుబాటులో లేవు. జిందగి సినిమా కోసం ప్రత్యేకంగా ఈ కారును తీసుకొచ్చారు. 

ఇక ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ షోలేలో అమితాబ్‌ , ధర్మేంద్రలు ఉపయోగించింది  బీఎస్‌ఏ డబ్ల్యూఏ 500 సీసీ బైక్‌. 1942లో ఈ బైకు మార్కెట్‌లోకి వచ్చింది. ఆ తర్వాత 1975లో షోలే రిలీజ్‌ తర్వాత ఈ బైక్‌ అప్పటి యువతకి కిర్రెక్కించింది. ఈ బైక్‌ ఇప్పుడు మార్కెట్‌లో లేకపోయినా... షోలే నమూనా బైక్‌లు అనేక వింటేజ​ థీమ్‌ హోటళ్లు, రెస్టారెంట్లలో కనిపిస్తూనే ఉంటాయి. 

మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌, ఏస్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక‌్షన్‌లో వచ్చిన త్రీ ఇడియట్స్‌  సంచలన విజయం సాధించింది, ఈ మూవీలో లైట్‌ వెయిట్‌ వెహికల్‌  మహీంద్రా ఫ్లైటీ స్కూటీపై  అమీర్‌ఖాన్‌, మాధవన్‌, శర్మాన్‌జోషిలు చేసిన విన్యాసాలు ఎ‍ప్పటికీ గుర్తుండి పోతుంది. మహీంద్రా ఫ్లైట్‌ ఇప్పటికీ మార్కెట్‌లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement