Nani Dasara Movie Makers Releases Friendship Day Poster Goes Viral - Sakshi
Sakshi News home page

Nani Dasara Movie Poster: నాని 'దసరా'స్పెషల్‌ పోస్టర్‌ చూశారా?

Aug 7 2022 5:55 PM | Updated on Aug 7 2022 6:42 PM

Makers Of Nani Dasara Releases Friendship Day Poster - Sakshi

నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్‌తో మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే నేడు(ఆదివారం)ఫ్రెండ్షిప్‌ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట సందడి చేస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement