
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా హీరో రవితేజతో చేసిన చిట్‌చాట్‌లో తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి వెల్లడించారు.
నాని మాట్లాడుతూ.. 'నా ఫోటో ఆల్భమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిను. ఎక్కడా కనీసం నన్ను లోపలి కూడా రానివ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేద్దామన్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిదిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లాగా కూడా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకి నా ఎటీఎమ్‌లో పండగలకు బట్టలు కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులను కూడా కొట్టేశారు.
ఈ స్కాములన్నీ చూశాక ఇంక యాక్టింగ్ మళ్లీ మళ్లీ మోసపోవడం వల్ల కాదని, నటుడిగా ప్రయత్నాలు ఆపేసి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను' అని నాని చెప్పుకొచ్చాడు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment