struggles
-
మిర్చి ధర ఢమాల్.. రైతుల విలవిల
-
హిట్ మ్యాన్ కాదు.. మ్యాగీమ్యాన్
-
పోరాడితేనే కాపాడుకోగలం!
మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి రైతాంగం, వ్యవసాయ రంగం పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని నమ్మబలికిన ఎన్డీయే పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గెలిచే వరకు మద్దతు ధర గురించి ఊదరగొట్టి, గెలిచిన తర్వాత సి2 + 50 సూత్రం (ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా అందులో సగభాగం కలిపి ఆ మొత్తంపై లెక్కగట్టటం) ప్రకారం తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం ద్వారా తన రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకొన్నది.ఇప్పటికే దేశంలోని 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని, వారి నెత్తిపై సగ టున 74,121 రూపాయల అప్పు ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో పంటల ధరలు గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల సుడి గుండంలో చిక్కుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. 2013 నుండి 2022 వరకు అధికారిక లెక్కల (ఎన్సీఆర్బీ) ప్రకారమే గత పదేళ్లలో లక్షా ఇరవై వేల మందికి పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారంటే రైతాంగం పరిస్థితి ఎంత దయ నీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ పంటలపై కార్పొరేట్ శక్తులకు అధి కారాన్ని కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉరితాళ్ల వంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధత అవకాశాల పరిశీలన కోసం ఉద్యమ నాయ కత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే మూడు సంవత్సరాలు దాటినా దీనిపై ఎలాంటి పురోగతి లేకపోగా తిరిగి దొడ్డి దారిన ఆ మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానిలో భాగంగానే కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2006 అటవీ హక్కుల చట్టానికి పాతరేయటానికి పూనుకున్నది. అటవీ సంరక్షణ నియమాల బిల్లు ఆమోదం పొందితే అడవులకు, అడవుల్లో నివసించే జన సమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని పార్లమెంట్ సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు తరపున 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు తమ సంతకాలతో లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ బిల్లును ఆమోదింప చేసు కుంది. మరోవైపు విద్యుత్ బిల్లు–2020ని చట్టం చేయడా నికి మార్గం సుగమం చేసుకుంది. కచ్చితంగా ఇది వ్యవ సాయ రంగంపై పెను భారం మోపే బిల్లు అనొచ్చు.వ్యవసాయ రంగంలో పని చేసే వారంతా రైతులే. వీరిలో కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. రైతును, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోలేక పోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికైనా రైతులు, రైతు సంఘాలు మేల్కొనాలి. ప్రమాదంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఉద్యమ శక్తుల ఐక్యత ద్వారానే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ కాపాడుకోగలుగుతాం. ‘అఖిలభారత రైతుకూలీ సంఘం’ అనే పేరుతో కొనసాగుతూ వస్తున్న రెండు వేర్వేరు నిర్మాణాలు ఈ నేపథ్యంలోనే ‘ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ’ (ఏఐకేఎంఎస్)గా ఒకటి అవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్‌లో విలీన సభ జరుపుకొంటున్నాయి.– గౌని ఐలయ్య,ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సమిధలవుతున్న సమరాంగనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీలు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్ (సీఎన్ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 40 శాతం మహిళలు ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. ఇందులో దక్షిణ బస్తర్ డివిజన్ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్ డివిజన్లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా పరిగణించే మాడ్ డివిజన్లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. మృతుల్లో పెరుగుతున్న మహిళలు సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెప్టెంబర్ 3న బీజాపూర్/దంతెవాడల్లో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. వెనుకబాటులో ఆదివాసీలే అధికం సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. -
అగమ్యగోచరం.. స్టీల్‌ప్లాంట్ భవితవ్యం
ఉక్కునగరం: రాష్ట్రంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ఒక బ్లాస్ట్ఫర్నేస్తో కనిష్ట ఉత్పత్తి సాధిస్తూ సమస్యల సుడిగుండలో చిక్కుకుంది. ఇప్పుడు ఉన్న బొగ్గు, ఐరన్ ఓర్ నిల్వలతో సింగిల్ ఫర్నేస్ తప్ప రెండు ఫర్నేస్‌లు నడిపే పరిస్థితి లేదు. సింగిల్ ఫర్నేస్‌తో నెలకు రూ. 1000 కోట్లకు మించి టర్నోవర్ సాధ్యం కాదు. తద్వారా మరిన్ని అప్పులు, ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నా రు. ఇదే పరిస్థితి కొనసాగి.. ఉన్న ఒక్క ఫర్నేస్‌లో సాంకేతిక లోపం తలెత్తితే జీరో ఉత్పత్తి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెయిల్‌లో విలీనమే శాశ్వత పరిష్కారమని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విలీ నం దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.ఇటీవల కాలంలో స్టీల్‌ప్లాంట్ పరిస్థితి అత్యంత క్లిష్టదశకు చేరుకుంది. మూడు బ్లాస్ట్ఫర్నేస్లలో ఒకటి మూడేళ్లుగా మూత పడి ఉంది. ఉన్న రెండింటిలో ఒక బ్లాస్ట్ఫర్నేస్లోనే కనిష్ట స్థాయి ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. గత మూడు రోజులుగా న్యూఢిల్లీ కేంద్రంగా ఉక్కు మంత్రిత్వశాఖ విస్తృతంగా జరిపిన చర్చల్లో ఉక్కు యాజమాన్య ప్రతినిధులు రూ.12 వేల కోట్లు బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని నివేదించారు. దీనిపై ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు అంతసాయం చేయలేమని, రూ.3,100 కోట్లు ఇవ్వగలమని, దానికి సంబంధించి ప్రణాళిక ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఉక్కు మంత్రిత్వశాఖ ఇస్తామన్న ప్యాకేజీ రూ.3,100 కోట్లు ముడి సరకులు కొనుగోలుకు ఉపయోగపడటం తప్ప ఇప్పటి వరకు ఉన్న బకాయిలు చెల్లించడానికి సరిపోయే పరిస్థితిలేదు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతితో ఆ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ స్టీల్‌ప్లాంట్ సింగిల్ ఫర్నేస్ నిర్వహణకు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని ఉక్కు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.పట్టించుకోని కూటమి ప్రభుత్వంఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేలను ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉక్కు అఖిలపక్ష నాయకులను అమరావతికి తీసుకెళ్లి సీఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేయించారు. ‘మీరు పని చేయండి.. నేను చూసుకుంటాను’ అని చంద్రబాబు చెప్పడం తప్ప.. ఆ దిశగా ఎటువంటి చర్యలు కనిపించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని మోదీని చంద్రబాబు కలిసినప్పటికీ స్టీల్‌ప్లాంట్ అంశాన్ని లేవనెత్తకపోవడం పట్ల ఉక్కు వర్గాలు విస్మయం చెందాయి. విశాఖ ఎంపీ భరత్‌ను కలిసి స్టీల్‌ప్లాంట్ పరిస్థితిని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వివరించారు. అతను కూడా కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడి ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత స్టీల్‌ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి 45 రోజులు సమయం ఇస్తే కచ్చితంగా మంచి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకీ అతీగతి లేదు. గత వారం ఉక్కు అధికారుల సంఘం నాయకులు కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్‌ను కలిసి సెయిల్‌లో విలీనం అంశంపై మాట్లాడారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణం జోక్యం చేసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇప్పించడంతో పాటు సెయిల్‌లో విలీనం చేసేలా ఒత్తిడి తేవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.స్టీల్‌ప్లాంట్‌ను కాపాడటం అందరి బాధ్యతస్టీల్ప్లాంట్ను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాట చెబితే ఆగుతుంది. 1,310 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఇతర స్టీల్ప్లాంట్ల కంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉండటం వల్లే అందరి కళ్లు ఈ ప్లాంట్‌పై పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్ సీఐటీయూప్రభుత్వ రంగం కోసమే భూములిచ్చారురాష్ట్రంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ కోసమే నిర్వాసితులు తమ భూములు, ఇళ్లు ఇచ్చారు. వారి పునరావాసం, ఉపాధి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే హక్కు కేంద్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీతో పాటు సెయిల్‌లో విలీనం చేసేలా చూడాలి.– మంత్రి రాజశేఖర్, ఐఎన్టీయూసీ ప్రధానకార్యదర్శి, స్టీల్ప్లాంట్విస్తరణ అప్పులు, వడ్డీ పదేళ్లు వాయిదా వేయాలిస్టీల్ప్లాంట్ విస్తరణకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ భారం వల్ల స్టీల్‌ప్లాంట్‌కు ఈ పరిస్థితి తలెత్తింది. దేశంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇచ్చినట్టే విస్తరణ అప్పులు, వడ్డీలను మాఫీ చేయడం లేదా కనీసం పదేళ్లపాటు వాయిదా వేయాలి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్థిక భారం తొలగించాలి. సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా ముడిసరకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.– డి.ఆదినారాయణ, గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి, స్టీల్ప్లాంట్ప్రభుత్వ రంగంలో సీట్లు పెంచాలినీట్లో 478 మార్కులు వచ్చాయి. దీని వల్ల ఏ–కేటగిరీకి బదులు బి–కేటగిరీ సీటు వచ్చింది. ఏలూరు ఆశ్రమ్ కాలేజీలో చదువుతున్నాను. రిజర్వేషన్ లేదు. మాలాంటి వారికి ఓపెన్‌లో ఏ–కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో సీటు రావాలంటే కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరగాలి. ప్రస్తుతం ఏడాదికి ఫీజు రూ.13 లక్షల ఫీజు కట్టాల్సి వస్తోంది. అదే ఏ –కేటగిరీ అయితే ఫీజు రూ.20 వేలు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ కాలేజీలు అయితే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పేద విద్యార్థులకు మేలు జరిగేలా తగిన నిర్ణయం తీసుకోవాలి. – గోపిశెట్టి గీత, మురళీనగర్ఆశలు నీరుగార్చవద్దు మెడిసిన్ చేయాలని ఎన్నో ఆశలతో చదువుతున్నాం. కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోంది. గత ప్రభుత్వం మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఐదు ప్రారంభమయ్యాయి. మరో ఐదు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 7 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కళాశాలలన్నీ పూర్తయితే మొత్తం 1,800 సీట్లు అందుబాటులో వస్తాయి. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి అవకాశం లభిస్తుందనుకొన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలపై కత్తి కట్టింది. దీని వల్ల నీట్ రాసి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ సీట్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది. – గొలగాని శ్రీరాజ్ఞ,పెదగదిలి -
కాలుష్య కోరల్లో కుత్బుల్లాపూర్
-
అరే.. పెద్ద కష్టమే వచ్చిందే..
-
నా జీవితంలో 20 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా: ప్రముఖ సింగర్
బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. టాప్-5లో నిలవాలని ఆశించినప్పటికీ ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. సింగర్‌గా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న నేహా భాసిన్.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర పోస్ట్ చేసింది. తన ఆరోగ్యానికి సంబంధించి తాను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంది. నేహా భాసిన్ మల్టీపుల్ డిజార్డర్స్‌తో బాధపడినట్లు వెల్లడించింది. ఆమెకు ప్రీమెన్స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (PMDD), అబ్సెసివ్-కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ (OCPD) ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా రెండేళ్ల క్రితమే ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది.భాసిన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను మీకు చాలా చెప్పాలనుకుంటున్నా. కానీ నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని చెప్పేందుకు ఎలా ప్రారంభించాలో తెలియలేదు. కొన్నేళ్ల తర్వాత నా జీవితంలో ఏదో ఆగిపోయిందని తెలిసింది. చివరకు వైద్యపరంగా మరింత అవగాహనతో ఈ రోజు వ్యాధి నిర్ధారణతో మీ ముందుకు వచ్చా. ఇది మానసిక, హార్మోన్ల వ్యాధులకు సరైన చికిత్సలను పొందడంలో సహాయపడుతుంది. వీటన్నింటిలో ప్రధానంగా అవగాహన చాలా ముఖ్యం. ప్రస్తుతానికి నా నాడీ వ్యవస్థ పూర్తిగా విరిగిపోయినట్లు అనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.శారీరక, మానసిక బాధ, ఆందోళన, డిప్రెషన్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి లాంటి వాటితో ఎక్కువగా బాధపడ్డానని తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితంలో వెనకడుగు వేయలేదని పేర్కొంది. అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ తాను బాధితురాలిని కాదని.. విజేతను అంటూ నేహా భాసిన్ చెప్పుకొచ్చింది. నాలాంటి వారిలో చాలామందికి ఓదార్పునివ్వాలనే ఆశతో తన అనుభవాన్ని పంచుకుంటున్నట్లు పోస్ట్ చేస్తున్నట్లు రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u) -
అందరు అనుకునే మనిషిని కాదు: బిగ్ బాస్ బ్యూటీ
టాలెంట్ ఉన్నా అవకాశాలు రావాలంటే అదృష్టం కూడా ఉండాలి. బహుశా అది లేకపోవడం వల్లేనేమో హీరోయిన్ గ్లామర్ ఉన్న బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్యకు మంచి ఆఫర్స్ రావడం లేదు. ఒకవేళ చిన్నచిన్న సినిమా ఆఫర్లు వచ్చినా పెద్దగా సక్సెస్ మాత్రం రావడం లేదు. తాజాగా తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను డబ్బు మనిషిని కాదని అన్నారు. అమ్మ కోసం నెలకు దాదాపు రూ.లక్షకు పైగా ఆస్పత్రికి ఖర్చవుతుందని తాను పడుతున్న బాధలను వివరించారు. శ్రీసత్య మాట్లాడుతూ..'జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని. నేను బాధల్లో ఉన్నానంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. తినడానికి కూడా ఫ్రీగా ఫుడ్ ఎవరు ఇవ్వరు. కానీ డబ్బు అందరికీ ఇంపార్టెంటే. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోరంతే. మమ్మీ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెకు నెలకు రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. కారు కొనడానికి నా వద్ద డబ్బుల్లేవు. 2019లో ఓ చిన్న కారు కొన్నా. అది పాడయిపోవడంతో ఎక్కువ ఖర్చవుతుందని అమ్మేశా. ఇప్పటికీ నా వద్ద కారు లేదు. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ అమ్మ ఆస్పత్రి ఖర్చులకే సరిపోతాయి' అని వెల్లడించింది. కాగా.. శ్రీసత్య బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. హౌజ్‌లో తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా బీబీ జోడి డ్యాన్స్ షోతో అలరించింది. -
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
-
అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! ఆవిషయంలో..
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. జులై 12న అంగరంగ వైభవంగా జరగనున్న పెళ్లితో ఇద్దరు ఒక్కటవ్వనున్నారు. వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఫ్రీ వెడ్డింగ్ వేడుకులు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ తాన ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యలు, ఆ విషయంలో తన భార్య మద్దతు, అందిస్తున్న సహాయ సహకారాల గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. నిజానికి అనంత్ అంబానీ చిన్నతనంలో అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నారట. జంతువులంటే తనుకు ఎంతో ఇష్టమని వాటితో స్పెండ్ చేయడమే తనకు ఇష్టమని అన్నారు. అలాంటి నాకు రాధికాను కలిసి ఆమెతో మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందని చెప్పుకొచ్చారు. ఆమె కూడా తనలా జంతువులతో మెలిగే ఆటిట్యూడ్ తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందన్నారు. అలాగే తాను ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యల పట్ల తన కాబోయే భార్య ఇచ్చిన మద్ధతు తనను మరింత ఆమెకు దగ్గరయ్యేల చేసిందని అన్నారు. ఆమె తన జీవితంలో భార్యగా అడుపెట్టడం తన అదృష్టం అంటూ రాధికా మర్చంట్‌పై ప్రసంశల జల్లు కురిపించారు. అనంత్ అధిక బరువు కారణం.. అనంత్ అంబానీ చిన్నతనం నుంచి ఊబకాయం, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అంతకు ముందు అనంత్ సుమారు 200 కిలోలకు పైగా బరువు ఉండేవాడు. ఆయనకు అత్యంత ఆస్తమా ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చిందని నీతా అంబానీ ఒక ఇంటర్యూలో తన కొడుకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆస్తమా చికిత్స వల్లే అనంత్ అంతలా బరువు పెరిగేందుకు దారితీసిందని అన్నారు. ఈ ఆస్తమా ట్రీట్మెంట్లో ఉపయోగించే టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ అనేవి అతడిలో ఆకలి కోరికను దారుణంగా పెంచేస్తాయిని, వాటి ఫలితంగానే అతడు అధిక బరువు ఉన్నాడని అన్నారు. ఈ ట్రీట్మెంట్ తీసుకునే వ్యక్తులు ఖర్చు చేసేదాని కంటే ఎక్కువ కేలరీలు తీసుకునేలా చేస్తాయట. అదీగాక ఈ కార్టికోస్టెరాయిడ్స్ జీవక్రియను మార్చి కొవ్వు నిక్షేపణను ప్రోత్సహించి, కండరాల ప్రోటీన్ సంశ్లేషను నిరోధిస్తాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీంతో ముఖం పొత్తి కడుపు, వీపు వంటి ప్రాంతాల్లో కొవ్వు చేరిపోయి అధిక బరువుకి కారణమవుతుంది. ఇలా దీర్ఘకాలికి లేదా అధిక మోతాదులో స్టెరాయిడ్ల వాడితే అది అధిక బరువుకి సంబంధించిన సమస్యలకు కారణమవుతుందని నీతా చెప్పుకొచ్చారు. ఇక అనంత్ ఎదుర్కొంటున్న ఈ ఆరోగ్య సమస్యల పట్ల ఆయన కాబోయ భార్య సానుకూలంగా స్పందించడమే తన వంతు మద్దతు సహాయ సహకారాలు అందిచేందుకు ముందుకు రావడం విశేషం. తన భార్య రాధికాను ఉద్దేశిస్తూ..ఏ భాగస్వామి అయినా ఇలాంటి మద్దుతు ఇస్తే ఆ వ్యక్తి సులభంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొననడమే గాక తొందరగా రికవరి అవ్వగలడని అనంత్ అంబాని ఉద్వేగంగా అన్నారు. దీనికి మించిన అద్భుతమైన మందు మరొకటి ఉండదన్నారు అనంత్ అంబానీ. కాగ, కొన్నేళ్ల క్రితం అనంత్ అంబానీ 2016లో ఒక్కసారిగా చాలా సన్నమై కనిపించారు. 208 కిలోల ఉండే అనంత్ దాదాపు 108 కిలోలు బరువు తగ్గి ఏకంగా 100 కేజీలకు చేరారు కూడా. దీని కోసం చాలా కష్టపడ్డారు. రోజుకు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేశారు. రోజూ 21 కిలోమీటర్ల వరకు నడిచారు. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఆధ్వర్యంలో కఠిన డైట్ పాటించి బరువు తగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు . కానీ ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే కొద్ది కాలంలోనే మళ్లీ అనూహ్యంగా బరువు పెరిగారు. (చదవండి: వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా చర్మం నిత్య యవ్వనంలా ఉండాలంటే..) -
మళ్లీ సెల్ఫీ తీసుకునేందుకు కష్టపడ్డ బాబు !
-
సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!
అలనాటి హీరోయిన్ శ్రీవిద్య పేరు 1970లో వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1953న 24 జూలై జన్మించిన శ్రీవిద్య 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించింది. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత మలయాళంలో తొలి అవకాశం వచ్చింది. 1971లో 'నోట్రుకు నురు' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఏడాదిలోనే ‘ఢిల్లీ టు మద్రాస్’ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాతమనవడు చిత్రంతో అరంగేట్రం చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా సినిమాల్లో నటించింది. అప్పటి హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా నిలిచింది. కుటుంబ నేపథ్యం శ్రీ విద్య తండ్రి కృష్ణమూర్తి తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడు.. తల్లి వసంతకుమారి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలోనే శ్రీవిద్య తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కుటుంబ పోషణకై ఆమె తల్లి కూలి పనికి వెళ్లేది. అప్పట్లో అమ్మకు కనీసం పాలివ్వడానికి కూడా సమయం సరిపోలేదని గతంలో శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వైవాహిక జీవితం శ్రీవిద్య సినిమాల్లో నటిస్తుండాగనే.. తమిళస్టార్ హీరో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే కమల్ హాసన్ మరో హీరోయిన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు భరతన్‌తో శ్రీవిద్య ప్రేమాయణం కొనసాగించినా.. ఆ బంధంఎక్కువ కాలం నిలవలేదు. చివరికీ మాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జార్జ్ థామస్‌ని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకుంది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్త వేధింపులు పెళ్లయిన తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని భర్త జార్జ్ షరతు పెట్టాడట. దీంతో శ్రీవిద్య పెళ్లికి ముందే బాప్టిజం పూర్తి చేసింది. పెళ్లి తర్వాత కూడా భర్త బలవంతం వల్లే మళ్లీ నటనలో అడుగుపెట్టింది. అయినప్పటికీ జార్జ్ శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు భరించలేక 1980లో విడాకులు తీసుకుని జార్జ్‌తో బంధానికి ముగింపు పలికింది. విడాకులిచ్చినా భర్త వదల్లేదు విడాకుల తర్వాత శ్రీవిద్య నటనలో కొనసాగింది. అయితే విడాకుల తర్వాత కూడా శ్రీవిద్యను జార్జ్ వదల్లేదు. ఆమె ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టులో శ్రీ విద్య విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీవిద్య చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడింది. క్యాన్సర్‌తో మరణం 2003లో శ్రీవిద్యకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. తాను చనిపోవడానికి 2 నెలల ముందు శ్రీవిద్య తన బంధువు సహాయంతో ఓ ట్రస్టు స్థాపించి.. ఆస్తినంతా పేద విద్యార్థులకు చదువు, సంగీతం, నాట్యం కోసం కేటాయించేలా వీలునామా రాసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కళాకారులను ఆదుకోవాలని వీలుమానాలో వెల్లడించింది. అంతేకాదు తన సోదరుడి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది. క్యాన్సర్‌తో చివరికి శ్రీవిద్య 19 అక్టోబర్ 2006న మరణించగా.. తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్, భర్త వేధింపులు, చివరికీ క్యాన్సర్‌తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి. -
మొదట్లో చాలా భయపడేదాన్ని: ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో భయపడినట్లు తెలిపింది. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. '20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకునేదాన్ని. మానసికంగా ఇబ్బందులు పడ్డా. ఏదైనా సినిమా ఫెయిలైనా.. ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధపడేదాన్ని. నేను చూసిన బిగ్గెస్ట్ స్టార్స్‌తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక ఓ కూతురు కూడా జన్మించింది. తన ముద్దుల కూతురికి మేరీ మాల్టా అని పేరు పెట్టింది. (ఇది చదవండి: పొలిటీషియన్‌ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!) -
అవకాశాలు ఇస్తామని నన్ను డ్రైవర్‌గా వాడుకున్నారు: నాని
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా హీరో రవితేజతో చేసిన చిట్‌చాట్‌లో తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. 'నా ఫోటో ఆల్భమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిను. ఎక్కడా కనీసం నన్ను లోపలి కూడా రానివ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేద్దామన్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిదిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లాగా కూడా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకి నా ఎటీఎమ్‌లో పండగలకు బట్టలు కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులను కూడా కొట్టేశారు. ఈ స్కాములన్నీ చూశాక ఇంక యాక్టింగ్ మళ్లీ మళ్లీ మోసపోవడం వల్ల కాదని, నటుడిగా ప్రయత్నాలు ఆపేసి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను' అని నాని చెప్పుకొచ్చాడు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు. -
నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్
నార్త్ నుంచి వచ్చి ముందు సౌత్‌లో స్టార్ హీరోయిన్ అయ్యారు రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్ 2’, ‘అయలాన్’లో నటిస్తున్నారు. కాగా హిందీలో ఆమె నటించిన ‘ఛత్రీవాలీ’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్ సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్‌గా నటించారు. ‘‘కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడం. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మనం మారాలి. పిల్లలకు అవగాహన కల్పించాలి. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ఇక.. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రకుల్ చెబుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. ముంబైలో నేను కాండీవాలీలో ఉండేదాన్ని. కానీ నా ట్రైనర్‌తో కలిసి బాంద్రాలో ఒక కేఫ్‌లో కూర్చుని, ఏయే ఆఫీస్‌కి వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలి? అని ప్లాన్ చేసేదాన్ని. బాంద్రా, అంథేరీల్లో ఏమైనా ఆడిషన్స్ ఉంటే వెళ్లొచ్చని ఆ కేఫ్‌కి వెళ్లేదాన్ని. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? బ్యాగులో కొన్ని డ్రెస్సులు పెట్టుకుని, కారులోనే మార్చుకునేదాన్ని. చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. ఒక్కోసారి నాతో షూటింగ్ చేసి, వేరే హీరోయిన్ని తీసుకునేవారు. ఇదంతా నేను పోరాటం అనుకోలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే ‘పోరాటం’ అనే పదం నాకు నచ్చదు. ఆ రోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అన్నారు. -
రెండు వారాలు వేశ్య గృహంలో ఉన్నా: మృణాల్ షాకింగ్ కామెంట్స్
మృణాల్ ఠాకుర్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సీతారామం మూవీతో రాత్రికిరాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో యువరాణిగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మృణాల్లో తొలి బిగ్గెస్ట్ కమర్శియల్ హిట్ అందుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మొదట బుల్లితెర నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది. హిందీతో పాటు తెలుగలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్‌తో నటిగా గుర్తింపు పొందింది. చదవండి: గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఆ తర్వాత హిందీ చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్గా మారింది. ఈ జర్నీలో తాను ఎన్నో స్ట్రగుల్స్ పడ్డానంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. తాను మొదట సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక అయినట్లు చెప్పింది. కానీ చివరకు చిత్రం నుంచి తనని తొలగించారని చెప్పింది. ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ.. ‘సుల్తాన్ చిత్రంలో అనుష్క శర్మ చేసిన పాత్రలో నేను నటించాల్సింది. ఈ సినిమా కోసం ఫైటింగ్లో కూడా శిక్షణ తీసుకున్నా. 11 కిలోల బరువు కూడా తగ్గాను. కానీ ఏమైందో ఏమో ఆ సినిమా నుంచి నన్ను తొలగించి అనుష్క శర్మను తీసుకున్నారు. దానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ, నేను ఎక్కువ బరువు తగ్గడమే దానికి కారణమని ఆ తర్వాత తెలిసింది’ అని చెప్పింది. ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని, ఈ సినిమా కోసం తాను రెండు వారాల పాటు వేశ్య గృహంలో ఉండాల్సి వచ్చిందంటూ షాకింగ్ విషయం చెప్పింది మృణాల్. ‘నేను చేసిన లవ్ సోనియాలో అక్రమ రావాణకు గురైన చెల్లిని రక్షించుకునే అక్క పాత్ర నాది. దానికి కోసం నేను వేశ్యగా మారాల్సి ఉంటుంది. చదవండి: యూట్యూబ్ ద్వారా గంగవ్వ నెల సంపాదన ఎంతంటే నా పాత్ర సహజంగా వచ్చేందుకు కోల్‌కతాలోని వేశ్య గృహంలో రెండు వారాల పాటు ఉన్నాను. అక్కడ వాళ్ళతో గడిపి వారి కథలు విన్నాను. వారి గురించి వింటుంటే నా గుండె చలించిపోయింది. ఆ తర్వాత ఎప్పడు నాకు వాళ్లే గుర్తోచ్చేవారు. ఆ సమయంలో డిప్రషన్‌లోకి కూడా వెళ్లాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా వారే గుర్తొచ్చేవారు. 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశమది. ఆ సీన్ చేస్తుంటే వేశ్యల కథలే కళ్ళముందు కదిలాయి. దీంతో నేను చేయలేను అంటూ ఏడ్చేశాను. కానీ డైరెక్టర్ నువ్వు ఈ సీన్ చేస్తే ప్రపంచం చూస్తుంది అని నాకు కౌన్సిలింగ్ ఇచ్చేశారు. ఆయన మాటలతో ధైర్యం తెచ్చుకుని యాక్ట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. -
చాలా కష్టాలు పడ్డా.. జీవితం చాలా పాఠాలు నేర్పింది: హీరోయిన్
చిన్నతనంలో ఐశ్వర్య రాజేష్ చాలా కష్టాలు పడిందట. పేరులో ఉన్న ఐశ్వర్యం తన జీవితంలో లేదని వ్యాఖ్యానించింది. ఇటీవల ఒక భేటీలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులు దుర్మరణం పాలయ్యారని తెలిపింది. జీవితం తనకు రకరకాల పాఠాలను నేర్పిందని, సినిమా రంగ ప్రవేశానికి ముందు ఆ తర్వాత కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయని వాపోయింది. స్టార్ కథానాయకి పేరు రాకపోయినా పర్వాలేదనీ, మంచి నటి అన్న పేరు తెచ్చుకుంటే చాలన్నారు. తాను నటించిన చిత్రాలు ప్రేక్షకుల మనసులో పదికాలాలపాటు నిలిచిపోతే చేయాలన్నదే తన ఆశని వివరించింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయికగా పేరు తెచ్చుకుంది. మాతృభాషలోనూ రాణిస్తోంది. చిన్న చిన్న పాత్రలతోనే ఈమె కెరీర్ ప్రారంభమైంది. కాక్కా ముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్ కేరీర్‌ను మలుపు తిప్పింది. అందులో ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అద్భుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా కథానాయికగా అవకాశాలు తలుపు తట్టాయి. కనా వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంల్లో నటించి తన నటనా సత్తాను చాటారు. ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. -
స్వేచ్ఛ.. ఆనంద హేతువు
స్వేచ్ఛ ఒక పోరాటం, ఆనంద స్థితి. సత్యావగాహన, ఆస్వాదనీయం. ఒక అభిలషణీయమైన, హర్షదాయకమైన మార్పు. మనిషి మనీషిగా రూపొందగల మార్గం. స్వేచ్ఛ ఒక బాధ్యత, ఐక్యత, గౌరవభావన. ఒక వృద్ధుడు రోడ్డు మీద నడుస్తూ తన చేతిలోని వాకింగ్ స్టిక్‌ని గిరగిరా తిప్పుతూ నడవసాగాడు. ఏదో కూనిరాగం తీస్తూ చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. తనొక్కడే రోడ్డుమీద ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆలా తిరిగే కర్ర దెబ్బ నుండి చాలా మంది తప్పించుకుంటూ, పెద్దవాడు కనుక ఏమనలేక తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. చివరకు ఒక విద్యార్థి ధైర్యంగా ఆ తిరుగుతున్న కర్రను చేత్తో పట్టుకుని ఆపి ఆయన తన స్వేచ్ఛనుకుంటూ చేస్తున్న ఆ పని వల్ల మిగిలినవారు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించాడు. అంతేకాదు, ఆ స్వేచ్ఛ లోని విశృంఖలతను ఆయన దృష్టికి తెచ్చి, ఆలోచింప చేసాడు. అంతేకాదు మనకూ దాన్ని స్ఫురింపచేసాడు. నవ్వు తెచ్చే సంఘటనగా ఉన్నా దీని వెనక ఎంత గొప్ప భావన ఉందో చూడండి. స్వేచ్ఛను నిర్వచించి దానికున్న పరిధులు ఉంటాయన్న ప్రాథమికమైన ముఖ్య విషయాన్ని ఆ రచయిత చిన్న ఉదాహరణ ద్వారా ఎంత సులభంగా వివరించాడో చూడండి. మనం స్వేచ్ఛను అనుభవించే పద్ధతి ఇతరుల స్వేచ్ఛను హరించకూడదన్న విషయాన్ని ఎంత బాగా చెప్పాడో చూసారు కదా! మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని గడపటమే వ్యక్తిగత స్వేచ్ఛ. ఆహార, ఆహార్యాలలో, మనదైన భావనలో, సిద్ధాంతాలతో, విశ్వాసాలతో మన చిత్తానికి తోచినట్టు జీవితాన్ని సాగించటంలో పూర్తి స్వాతంత్య్రం, అలాగే, మన విశ్వాసానికి అనుగుణంగా ఒక దైవాన్ని లేదా అనేక దైవాలను ఆరాధించటంతో పాటు ఆ దైవప్రదేశాల సందర్శన మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనకు నచ్చిన దైవాన్ని లేదా అందరి దైవాలను పూజించే హక్కు మన ప్రతి ఒక్కరికీ ఉంది. మన వ్యక్తిగతమైన ఈ స్వేచ్ఛకు అడ్డు చెప్పటం గాని అవరోధం కలిగించటం కాని, దీనిని తప్పు పట్టే అధికారం కాని ఇతరులకు లేదు. అలాగే మనకూ ఇతరుల స్వేచ్ఛలోకి చొరబడే హక్కు లేదని గ్రహించి అందుకు అనుగుణంగా వర్తించాలి. మన స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తూ ఇతరులకు ఉన్న ఆ స్వతంత్రతను గౌరవించటం మన సంస్కారాన్ని, విజ్ఞతను చాటుతుంది. మన భావప్రకటనా శక్తి కూడ మన స్వేచ్ఛను తెలియచేప్పేదే. విద్య, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలలోనే కాక ఇతర రంగాలలోనూ వచ్చే మార్పులకు మనం స్పందించి, దాన్ని వ్యక్తపరచటమూ మన స్వేచ్ఛను తెలియపరుస్తుంది. మన అభిప్రాయాలను స్పష్టంగా, సూటిగా తెలియపరచటంతో పాటు ఉచితమైన, ఆమోదయోగ్యమైన, మర్యాదకరమైన భాషను వాడాలి. సిద్ధాంతాలమీద, భావనల మీద మన ఉద్దేశాన్ని ఎంత నిర్కర్షగా మనం చెప్పదలచుకుంటే అంతగా చెప్పచ్చు. ఇక్కడ సమతౌల్యం, సంయమనం అవసరం. ఈ భావప్రకటనా స్వేచ్ఛ చక్కని ఆలోచనల, భావనల మార్పిడికి / బదిలీకి సహాయపడి మనలను వ్యవస్థను మెరుగు పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. విద్యలో స్వేచ్ఛ అత్యంతావశ్యకం. గురువులు చక్కని వాతావరణాన్ని సృష్టించాలి. ఆ ఉత్సాహభరితమైన, ఉల్లాసభరితమైన స్థితి విద్యార్థులను నిర్భయులను చేసి వారి సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచి నివృత్తి చేసుకునేటట్టు చేస్తుంది. ఇరువురి మధ్య విద్యాసంబంధమైన చనువుతో పాటు ఒక ఆత్మీయతను ఏర్పరుస్తుంది. గురుశిష్యులను దగ్గరకు చేరుస్తుంది. వారి బంధాన్ని దృఢం చేస్తుంది. గురువులు చెప్పే విద్యను వెంటనే అంగీకరించక పరీక్షించే గుణాన్నిస్తుంది. శోధించే తత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛా వాతావరణం ఉభయులకూ ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు, ఇద్దరినీ అప్రమత్తులను చేస్తుంది. స్వేచ్ఛ ద్విముఖి. సక్రమంగా వినియోగించుకున్నప్పుడు అనంత ప్రయోజనకారి. ఇది మనకు నిర్భయాన్నిస్తుంది. ధైర్య, స్థైర్యాలనిస్తుంది. స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇది మన ఊహాప్రపంచపు పరిధులను విస్తరింప చేస్తుంది. మన మేధను పదను పరుస్తుంది. మన సృజనకు నిత్య నూతనత్వాన్ని ఇస్తూ వికసింప చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఏ నిర్బంధానికి, సంకుచితత్వానికి, స్వార్థానికి లొంగక ప్రజలు నిర్భయంగా, ఆనందంగా సంచరించే స్వర్గధామమని అన్నారు విశ్వకవి రవీంద్రులు. స్వేచ్ఛ సహజంగా వీచే వాయువు లాంటిది. కాని అనేక కారణాలవల్ల ఆ స్వేచ్ఛావాయువును పీల్చు కోలేకపోతున్నాం. ముఖ్యంగా పిల్లలు. వీరి స్వేచ్ఛకు తల్లిదండ్రులు, గురువులు, సమాజం, దేశపరిపాలనా రీతి కారణం. కొన్ని యుద్ధ ఉన్మాద దేశాలలోని భయానక వాతావరణం కూడ పిల్లల స్వేచ్ఛను హరించి వేస్తుంది. ఆహారం కాదు ఆహ్లాదం, ఆనందం లేనిచోట స్వేచ్ఛ లేనట్టే. అందుకే ‘స్వేచ్ఛ కోరే మనసు ఉంటే పొందలేనిది ఏముంది’ ‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. కాని ప్రతి చోట బందీనే’ అంటారు రూసో. ఎలా..? ఏమిటీ సంకెలలు? బంధాలు,అనుబంధాల పై మితిమీరిన మమేకత, ప్రేమ, మమకారం, ఆకర్షణ. నేను, నాది , ఆస్తి పాస్తులు , చరాచరాస్తులు, చావు పుట్టుకల సహజత్వాన్ని అంగీకరించని తత్వం అనే అనేకానేక శృంఖలాలు. వీటినుండి బయటపడే నిజమైన స్వేచ్ఛ అసలైన స్వేచ్ఛ. స్వాతంత్య్రం. అద్భుతమైన ఈ దశకు మనస్సు చేరుకునేందుకే ఆధ్యాత్మిక సాధన, ఆ సాధనాపరుల తపన, లక్ష్యం. మనస్సు ఈ అరిషడ్వార్గాలనుండి విముక్తి పొందటమే ఎంతో ఉన్నతమైన స్వేచ్ఛ. అపుడంతా, అన్నిటా ఆనందమే. స్వేచ్ఛ పరమావధి బహ్మానందమే. మనస్సు ఒక స్వేచ్ఛా విహంగం. ఈ మాయామోహిత జగత్ప్రవాహంలో దాని రెక్కలు తడిసి ముద్దవుతుంటాయి. పక్షి తన పదునైన ముక్కుతో చిక్కుతీసుకుంటూ రెక్కలార్చుకుంటుంది. అలాగే మనిషి తన మనోవిహంగపు రెక్కలను భవబంధాల సంకెళ్ల నుంచి విడుదల చేసే యత్నానికే స్వేచ్ఛ అనే మరో పేరు. అపుడు మనోవిహంగపు సంచరించగల ఆవరణం అనంతం. బలమైన దేశాలు బలహీనమైన దేశాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ప్రజలను బానిసత్వవు ఊబిలోకి తోసేసేసిన వైనాలెన్నెన్నో. స్వేచ్ఛ అనే ప్రాణవాయువు అందక వారు ఎలా జీవచ్ఛవాలుగా మారారో చరిత్ర చెపుతుంది. అందుకే శ్రీ శ్రీ.. ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం.. అన్నాడు. స్వేచ్ఛ ప్రాణుల ఊపిరి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
రైతుల పాలిట శాపంగా మారిన మిర్చి పంట
-
రోజుకు రూ.500 ఇచ్చేవారు.. చాలా కష్టాలు పడ్డా: సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ఇండస్ట్రీకి రాకముందు సమంత కూడా సాధారణ అమ్మాయిలా ఎన్నో కష్టాలు ఎదుర్కొందట. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఈ విషయాలపై ఓపెన్ అప్ అయ్యింది. తల్లిదండ్రుల కోరిక మేరకు బాగా చదివి టాపర్‌గా నిలిచేదాన్ని అని చెప్పిన సామ్ పై చదువులకు డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్ కాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్కమ్ చెప్పే అమ్మాయిగా చేసిందట. దీనికి గాను రోజుకు రూ. 500 ఇచ్చేవారట. ఇక ఒకనొక సమయంలో డబ్బులు లేక ఒక్కపూట భోజనంతోనే దాదాపు రెండు నెలలు గడిపినట్లు సమంత పేర్కొంది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వెళ్తున్న సమయంలో కుటుంబసభ్యులు కొందరు నీకిది అవసరమా అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారని, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేసినట్లు చెప్పుకొచ్చింది. -
ఓ లక్ష్మి స్ఫూర్తి గాథ
పెళ్లంటే ఏమిటో తెలియని వయసులోనే ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నాడు తండ్రి. పెళ్లయిన తర్వాత అతి కష్టం మీద ప్రైవేటుగా టెంత్ వరకు చదువుకుంది. ముగ్గురు పిల్లలను పెంచుకుంటూ ఎలాగో పన్నెండో తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత అనుకోకుండా అనేక మలుపులు తిరిగింది ఆమె జీవితం. మహిళా చైతన్య ఉద్యమ సారథిగా మారింది. ఆమె మూలంగా కొన్ని వేలమంది జీవితాలు బాల్యవివాహమనే చీకటిలో చిక్కుకోకుండా ఒడ్డున పడ్డాయి. ఆమె చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. అందుకు స్ఫూర్తి ఎవరో కాదు... తనకు తనే!మహారాష్ట్రలోని తుల్జాపూర్‌కు చెందిన ఓ లక్ష్మి స్ఫూర్తి గాథ ఇది. పితృస్వామ్య ఆధిపత్యం వల్ల మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయం మీద గొంతు పెగల్చింది. తమకు హక్కులున్నాయనే నిజాన్ని మహిళలకు తెలియచెప్పింది. తమ జీవితంలో తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న నిర్ణయాల మీద గళం విప్పుతున్నారు అక్కడి మహిళలు. లక్ష్మి చేపట్టిన మహిళా చైతన్య ఉద్యమంలో ఇప్పటి వరకు పదిహేడు వేల మంది జీవితాలు గట్టున పడ్డాయి. బాల్యవివాహపు ఊబిలో చిక్కుకోకుండా రక్షణ పొందిన వాళ్లు కొందరు, రెండవ వివాహపు కోరల్లో చిక్కకుండా తప్పించుకున్నవారు మరికొందరు. పెద్దగా చదువు లేని, ఒక సామాన్య గ్రామీణ మహిళ... ఇంత పెద్ద ఉద్యమాన్ని చేపట్టడానికి స్ఫూర్తి ఎవరని లక్ష్మిని అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘నా జీవితం బాల్యవివాహం అనే సుడిగుండంలో చిక్కుకుపోయింది. నన్ను నేను నిలబెట్టుకోవడానికి... నేను చేసిన పోరాటం చిన్నది కాదు. ఇంతకంటే స్ఫూర్తి ఏం కావాలి?’ అని అడుగుతుంది. లక్ష్మిది మహారాష్ట్ర, తుల్జాపూర్లో చర్మకారుల కుటుంబం. ఎనిమిదేళ్లకే పెళ్లి. వరుడు మేనమామ. తనకంటే పదమూడేళ్లు పెద్దవాడు. ‘‘ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ సంబంధాలు వెతికి పెళ్లి చేయడం కంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఒక బాధ్యత తప్పుతుందని మా అమ్మానాన్నల ఆలోచన. అలా నాకు పెళ్లంటే ఏంటో తెలియని వయసులోనే పెళ్లయింది. కొంతలో కొంత మేలు ఏంటంటే... పెళ్లయిన తర్వాత బడికి వెళ్లగలగడం. అయితే తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు మెచ్యూర్ కావడంతో అక్కడితో చదువాగిపోయింది. చదువు కొనసాగించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. భోజనం మానేసి అలకబూనాను. చచ్చిపోతానన్నా కూడా మా అత్తవారింట్లో ఎవరూ నేను చదువుకోవడానికి ఒప్పుకోలేదు. పైగా వాళ్ల మాటను మా అమ్మ చేత చెప్పించి నా నోరు నొక్కేశారు. కొన్నేళ్ల తర్వాత ప్రైవేటుగా పదో తరగతి పూర్తి చేశాను. ముగ్గురు పిల్లలను పెంచుకుంటూ అతి కష్టం మీద పన్నెండు వరకు చదివాను. కానీ నాకు సంతృప్తి కలగలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మి. ఆర్థిక స్వావలంబన ప్రభుత్వ సూచనతో స్వయం సహాయక బృందాల ఏర్పాటులో కూడా లక్ష్మి చురుగ్గా ఉంటోంది. అయితే ఆమె భర్త నుంచి విడిపోయిన మహిళలు, వితంతు మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వాళ్ల కోసం విడిగా బృందాలు చేసింది. వాటి పేరు ఏకల్ మహిళా సంఘటన్. అంటే సింగిల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్. జిల్లా అధికారులతో మాట్లాడి సింగిల్ ఉమెన్‌కు ష్యూరిటీ అవసరం లేకుండా బ్యాంకు రుణాలు అందేటట్లు చొరవ తీసుకుంది. దాదాపు 200 మంది ఔత్సాహిక మహిళలకు శిక్షణనిచ్చింది. వారి ద్వారా మహిళలను చైతన్యవంతం చేసే మహోద్యమాన్ని విస్తృతం చేసింది. ఇలా రెండు దశాబ్దాల పాటు సాగిన ఆమె సామాజిక సహాయక ఉద్యమంలో లక్ష్మి ద్వారా ప్రత్యక్షం గా, పరోక్షంగా సహాయం పొందిన వాళ్లు పదిహేడు వేల మంది ఉన్నారని లక్ష్మిని సిఐఐ సీఈవో సీమా అరోరా ప్రశంసల్లో ముంచెత్తారు. పూల వర్షమే కాదు... లక్ష్మి జీవితంలో ఆటుపోట్లు, పోరాటాలు, ప్రశంసల పూల వానలు మాత్రమే కాదు, సూటిపోటి మాటల రాళ్లు కూడా ఉన్నాయి. ఆమె భర్త నిరక్షరాస్యుడు. గేదెలను మేపడం, సాయంత్రం మద్యం తాగి తూలుతూ రాత్రికి ఇంటికి రావడం అతడి దినచర్య. ‘ఊరిని ఉద్ధరించింది చాల’ని ఆమె మీద చెయ్యి చేసుకునేవాడు. ‘నీకింకా ముప్పై ఎనిమిదేళ్లు మాత్రమే. ఇంకా చాలా జీవితం ఉంది. ఈ ముళ్లు విడిపించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించ’మని చెప్పిన అక్కచెల్లెళ్ల లో ‘‘పిల్లల కోసం కొన్ని తప్పవ’’ంటుంది లక్ష్మి ఆవేదనగా. ముఖ్యంగా తల్లి కోసం మాత్రమే అతడిని భర్తగా భరిస్తున్నట్లు వాపోతుంటుంది. తన వైవాహిక జీవితాన్ని చూసిన ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలకు బాల్యవివాహాలు చేయరు. తన కష్టం మిగిలిన ఆడపిల్లలకు ఇలాగైనా ఉపయోగపడుతోంది, మంచిదేగా... అంటుంది పంటిబిగువున దుఃఖాన్ని అదిమిపెడుతూ. కొవ్వొత్తి కూడా తాను కాలిపోతున్నానని అనుకోదు. వెలుగునిస్తున్నానని మాత్రమే అనుకుంటుంది. లక్ష్మి కూడా అంతే. ఊరి డాక్టర్ మా ఊరిలో చదువుకున్న వాళ్లు చాలా తక్కువ. రెండు వేల సంవత్సరంలో భారత్ వైద్య ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వైద్య సహాయకురాలిగా పని చేయడానికి ఆ మాత్రమైనా చదివిన మహిళను నేను మాత్రమే. ఊరిలో హెచ్ఐవీ, టీబీ, ఇతర అనారోగ్యాల పాలైన వాళ్లను గుర్తించి వైద్య విభాగానికి రిపోర్టు ఇవ్వడంతో నా సర్వీస్ మొదలైంది. పంచాయితీ పెద్దల సూచనతో నాకు వైద్యంలో ప్రాథమిక నర్సింగ్ సేవల్లో శిక్షణ కూడా ఇచ్చారు. చిన్న చిన్న అనారోగ్యాలకు మందులివ్వడం, గర్భిణులను నెలనెలా పరీక్షల కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లడం వంటి పనులప్పగించారు. 300లతో మొదలైన నా జీతం ఇప్పుడు ఐదువేల రూపాయలైంది. ఒక్క సెంటు భూమి కూడా లేని నేను నా జీతం తో హాయిగా జీవిస్తున్నాను. ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాను. మా ఊరిలో వాళ్లు నన్ను చిన్న డాక్టరమ్మ అంటారు. వాళ్లకు నేను చెప్పేమాట మీద మంచి గురి. అందుకే దేహానికి వైద్యంతోపాటు సామాజిక వైద్యం కూడా చేస్తున్నాను. బాల్యవివాహాలను వద్దని చెప్తూ, నా పోరాటాన్నే వివరిస్తున్నాను. చదువుతో వచ్చే జ్ఞానం, వ్యక్తిత్వం, స్వయం సాధికారతకు కూడా నన్నే మోడల్‌గా చూస్తున్నారు. దాంతో నా మాటకు విలువ పెరుగుతోంది. – లక్ష్మి -
లాక్డౌన్ మూగజీవాలకు అందని పశుగ్రాసం
-
రెండో వైపు...
అన్నీ కష్టాలూ అనుభవించి జీవితంలో ఒక్కొక్క మెట్టూ అతికష్టం మీద ఎక్కి పైకి వచ్చిన వాడు ఎదుటివాడి కష్టాన్ని ఎందుకలా పూచిక పుల్లలా తీసేస్తున్నట్లు? ఆ రోజు కొత్త ఆఫీసరు డ్యూటీలో చేరుతున్నాడు. రెండు రోజుల క్రితం ఈ విషయం తెలిసినప్పట్నుంచీ, వచ్చే ఆయన ఎలా ఉంటాడన్న విషయం మీద ఆ కార్యాలయం సిబ్బందిలో ఎక్కడలేని ఉత్కంఠత. ముందు స్ట్రిక్ట్‌గా ఉండి తరువాత లాకులు లేపుతాడా? చివరదాకా ఒకలానే ఉంటాడా? నకిలీ మంచితనంతో ముందు మంచివాడనిపించుకుని తరువాత తనలోని అసలు శాడిజమ్ వేడి రుచి చూపుతాడా?పురుష వర్గం ఆలోచనలు ఇలా ఉంటే స్త్రీవర్గం ఆలోచనలు మరోలా ఉన్నాయి... పండుగలకీ పబ్బాలకీ సెలవలిస్తాడా? సాధారణ సెలవులు అయిపోతే ఫ్రెంచి లీవులు అనుమతిస్తాడా? ఇంటికి ఒక గంట ముందుగా వెళ్లటానికో ఆఫీసుకి ఒక అరగంట ఆలస్యంగా రావటానికో ఒప్పుకుంటాడా?అన్నీ ప్రశ్నలే–జవాబులు తెలియటానికి కొద్ది రోజులు పడుతుంది.∙∙ కొత్త ఆఫీసరు ఎలా ఉంటాడన్న విషయం మీద అందరూ ఎంత మల్లగుల్లాలు పడుతున్నా రామం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు తన పని తను చేసుకుపోతున్నాడు. డిపార్టుమెంటులో ఆయనకి ముప్ఫయ్ ఐదు సంవత్సరాల సర్వీసు. సీనియారిటీ మీద సెక్షన్ సూపర్ వైజర్ అయ్యాడు. వచ్చే సంవత్సరం రిటైరు కాబోతున్నాడు. తన సర్వీస్‌లో ఆయన చాలామంది ఆఫీసర్లదగ్గర పని చేశాడు. అనుభవం ఆయనకి నేర్పిన పాఠం ఒకటే. మన పని మనం సరిగా చేసుకుంటూ పోవటం ముఖ్యం. దానివల్ల ఆఫీసరుకు ప్రమోదం కలిగినా కలగకపోయినా ప్రమాదం మాత్రం ఉండదు. అలా కాక ఆయన వినోదం కోసం మనం పని చేస్తే చివరకి విషాదం మిగలటం ఖాయం. ఇదే సూత్రం పునాదిగా ఆయన ఇన్నాళ్లూ ఏ రిమార్కూ లేకుండా, రాకుండా పని చేయగలిగాడు. ఇంకొక్క సంవత్సరం ఇదే పద్ధతిలో పనిచేయగలిగితే ప్రశాంతంగా పదవీవిరమణ చెయ్యొచ్చు. ఆయన కోరికా అదే. నమ్మకం అదే. ∙∙ ఆఫీసరుగారి కారు వచ్చినట్టుంది. ఉన్నట్టుండి బయట అలజడి మొదలైంది. అందరితో పాటు రామం కూడా బయటికి వచ్చాడు. వచ్చిన ఆఫీసరుని చూసి నిర్ఘాంతపోయాడు. ఆయన ఎవరో కాదు... మెట్రిక్యులేషన్ వరకూ తన క్లాస్ మేట్ ఐన నాగేంద్ర. కొత్తగా వస్తున్న ఆఫీసరు పేరు నాగేంద్ర అనగానే ఆ పేరుతో చాలా మంది ఉంటారు కనక వస్తున్నది తన క్లాస్మేట్ అన్న ఆలోచన రామానికి కలగలేదు. ఆఫీసరు గారు కారు దిగగానే అందరూ ముక్తకంఠంతో గుడ్ మార్నింగ్ చెప్పారు. అకౌంటెంట్ అనసూయ గారు బొకే అందించారు. సెక్షన్ సూపర్ వైజర్ కనక రామంగారితో ఆఫీసరుగారికి పూల దండ వేయించారు. పూలదండ వేస్తున్న రామం ముఖంవంక ఆఫీసరు పరీక్షగా చూశాడు. అందరూ చప్పట్లు కొట్టి ఆఫీసరు గారు లోపలకి వెళ్లటానికి దారి ఇచ్చారు.మరొక రకంగా తెలిసిన వ్యక్తి ఆఫీసరుగా వస్తే ఆయన దగ్గర పని చేయటం సులభమా? తెలియని వ్యక్తి ఆఫీసరుగా వస్తే ఆయన గురించి తెలుసుకుని పని చేయటం సులభమా? కాక రెండూ కష్టమా? లేదా రెండూ సులభమా? ఏదో ఒకటే సులభమా? అలాగైతే ఏది సులభం? ఏది కష్టం?మనసులో జ్ఞాపకాల తేనెతుట్టె అప్రయత్నంగానే కదలగా లోపలికి వచ్చి తన కుర్చీలో కూలబడ్డ రామం ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి మళ్లాయి. ∙∙ రామం తండ్రి ప్రాథమిక పాఠశాల టీచరు. తను పని చేసే వూళ్లో సెకండరీ స్కూలు లేదు. కుటుంబాన్ని ప్రక్క వూళ్లో పెట్టి తను పని చేసే వూరికి తిరిగేవాడు. వృత్తిలోనే కాదు ప్రవృత్తిలోనూ ఉత్తముడని ఆయనకి పేరు. రామానికి తండ్రి తెలివి తేటలే కాదు– ఆయన గుణగణాలు కూడా వారసత్వంగా వచ్చాయి. రామం క్లాస్ లోనే నాగేంద్ర అనే అబ్బాయి కూడా ఉండేవాడు. నాగేంద్ర చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. ఒక్కడే కొడుకు. ఇంకో వూరునుంచి రోజూ నడిచి స్కూల్‌కి వచ్చి వెళ్లేవాడు. తల్లిదండ్రులు అతి కష్టం మీద అతడిని స్కూల్‌కి పంపించగలిగేవాళ్లు. క్లాస్‌లో ప్రతి సబ్జెక్టులోనూ రామానికీ నాగేంద్రకీ మార్కులు తెచ్చుకోవటంలో పోటీ ఉండేది. రామం తండ్రికి కూడా ఇది తెలుసు. ఆ స్పర్థ మానసికస్పర్థకి దారి తీయకూడదని అపుడపుడు కొడుక్కి సలహా చెప్పేవాడు. నాగేంద్ర తనని పట్టించుకోకపోయినా ఎందుకో అతడంటే రామానికి అభిమానం. తనతో సమానంగా చదివేవాళ్లంటే సామాన్యంగా ఏ విద్యార్థికైనా కొంత అసూయో, ద్వేషమో ఉంటుంది. కానీ నాగేంద్ర గురించి రామానికి అలాంటి ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. ఎవరి తెలివితేటలు వాళ్లవి అనుకొనేవాడు. కృషిని బట్టి ఫలితం అని నమ్మేవాడు. ఎందులోనైనా రామానికి మార్కులెక్కువ వస్తే మాత్రం నాగేంద్ర గింజుకొనేవాడు. నాగేంద్ర స్కూల్‌కి రాని రోజున, అతడు చదువుకోటానికి వీలుగా రామం తర్వాత రోజున తన నోట్స్ ఇచ్చేవాడు. ఒకటి రెండు సార్లు స్కూల్ ఫీజు కట్టటానికి నాగేంద్ర దగ్గర డబ్బులు లేక పోతే తన పాకెట్ మనీలో మిగుల్చుకున్న డబ్బుతో ఆ అవసరం కూడా తీర్చాడు. సంవత్సరం మొదట్లో తండ్రికి చెప్పి ఆయన స్టూడెంట్స్ దగ్గర ఉన్న తరగతి పుస్తకాలు పాతవి నాగేంద్రకి ఇప్పించేవాడు. ఇంకో నెలరోజుల్లో మెట్రిక్యులేషన్ పరీక్షలు జరుగుతాయనగా నాగేంద్ర తండ్రి అనుకోకుండా మరణించాడు. ఆ తర్వాత ఒక రోజు సాయంత్రం రామం నాగేంద్రని తన ఇంటికి తీసుకొచ్చాడు. నాగేంద్ర ఇంట్లో పరిస్థితి అతని చదువుకి అనుకూలంగా లేదనీ, ఒక నెలరోజులూ మన ఇంట్లోనే ఉండి పరీక్షలైన తరువాత వెళ్లిపోతాడనీ తండ్రికి చెప్పి ఒప్పించాడు. ఆ నెల రోజులూ నాగేంద్ర అవసరాలన్నీ రామమే చూశాడు. నాగేంద్ర పరిస్థితి తెలిసిన తండ్రికూడా ఏమీ మాట్లాడలేదు. రామం తల్లి కూడా ఆ నెలరోజులూ ఇద్దర్నీ సమానంగా చూసింది.పరీక్షలైపోయాక నాగేంద్ర తన ఇంటికి వెళ్లిపోయాడు.రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి పోటీలో నాగేంద్రకే నాలుగు మార్కులు ఎక్కువ వచ్చాయి. నాగేంద్ర అవసరానికి తను సాయపడటంలో కలిగిన సంతృప్తి ముందు ఆ తేడా రామానికి బాధ కలిగించలేదు. ఆ తర్వాత నాగేంద్ర రామానికి కనపడలేదు. ఆరా తీస్తే అతడిని తన మేనమామ తన ఇంటికి తీసుకు వెళ్లాడనీ తన దగ్గరే వుంచి చదివిస్తున్నాడనీ తెలిసింది. అదే విషయం తల్లిదండ్రులతో చెప్పాడు. ఇన్నాళ్లూ గుర్తు రాని మేనల్లుడు ఇప్పుడెలా గుర్తు వచ్చాడని రామం తల్లి భర్తని అడిగింది. ఆయన నవ్వుతూ నాగేంద్ర మేనమామకి ఒక కూతురు ఉందనీ, మంచి మార్కులతో మెట్రిక్యులేషన్ పాస్ కావడంతో మేనల్లుడి మీద ఆయన చూపు పడిందనీ చెప్పాడు. ఆ తర్వాత నాగేంద్ర ప్రస్తావన ఇంట్లో ఎపుడూ రాలేదు. స్కూల్ నుంచి సైకిలు మీద ఇంటికి వస్తూ అనుకోకుండా రామం తండ్రి యాక్సిడెంట్లో మరణించాడు. కుటుంబభారం మీద పడటంతో రామం పై చదువులు చదవకుండా డిగ్రీతోనే చదువు ఆపేశాడు. తండ్రి డ్యూటీలో ఉండగా మరణించాడు కాబట్టి ప్రభుత్వం రామానికి ఉద్యోగం ఇచ్చింది. టీచరు పోస్టులు ఖాళీ లేక వేరే డిపార్ట్ మెంట్లో రామం ఇప్పుడు చేస్తున్నదదే! కాలగర్భంలో ఎన్నో సంవత్సరాలు కలిసిపోయాయి. ఇపుడు మళ్లీ నాగేంద్ర కనపడటంతో ఎంతో ముందుకు వెళ్లిపోయిన రామం జీవనరథం ఒకసారి మళ్లీ స్మృతిపథంలోకి వెళ్లి వర్తమానంలోకి వచ్చింది. ∙∙ ఒక హోదా వచ్చిన తర్వాత, హోదా రావటానికి ముందు ఉన్న పరిచయాలు తమ కొత్త హోదాని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తాయేమోనన్న అపోహలో కొంతమంది ఉంటారు. ఇది అన్నివేళలా అందరి విషయంలో నిజం కాదు. అలాంటి ప్రయత్నాలకి పాత పరిచయమే కాకుండా ఒక్కోసారి ప్రస్తుత పరిచయం కూడా కారణమవుతుంది. ఉపయోగించుకోవటం ఐనా ఉపయోగపడటం ఐనా ఎక్కువగా మనిషి తత్వం, వ్యక్తిత్వం బట్టి నిర్ధారితమవుతుంది... పరిచయాల పాత్ర కొంతవరకే పరిమితం. కొత్త ఆఫీసరు చేరి వారం అవుతోంది. అప్పటికే ఆయన ప్రవర్తన మీద గుసగుసలు మొదలయ్యాయి. ఆయన దగ్గర ఒకటంటే తక్కువ రెండంటే ఎక్కువ. భిన్నాలు అంగీకరించడు. వెళ్లిన ఏ ఫైలూ సక్రమంగా వెనక్కి రాదు. కూతుర్ని కాలేజీలో చేర్చి రావటానికి సెలవు పెడితే పెండింగ్ పని పూర్తి చేసి వెళ్లమనీ, భార్య వైద్య చికిత్స కోసం అడ్వాన్స్ కావాలని దరఖాస్తు పెడితే ఫైల్ తర్వాత పెట్టమనీ ఒకటి కాదు రెండు కాదు... అభ్యంతరాలమీద అభ్యంతరాలు.ఇలాగైతే మేం పని చెయ్యలేమని స్టాఫ్ వచ్చి రామం దగ్గర మొర పెట్టుకున్నారు. కొన్నాళ్లు ఓపిక పట్టమనీ అప్పటికీ మార్పు రాకపోతే అందరం కలిసి వెళ్లి మాట్లాడదామనీ రామం స్టాఫ్ కి నచ్చ చెప్పాడు.∙∙ మరొక వారం గడిచింది. నెమ్మదిగా ఆఫీసులో యుద్ధవాతావరణం నెలకొంటోంది. ఒక రోజు...అకౌంటెంట్ పాస్ చేసిన బిల్లుల్ని చెక్ చేస్తున్న రామంగారి దగ్గరికి అటెండర్ వచ్చాడు. ఆఫీసరు గారు పిలుస్తున్నట్లు చెప్పాడు. చేస్తున్న పని ఆపి, రామం ఆఫీసరు గదిలోకి అడుగు పెట్టాడు. కొత్త ఆఫీసరు జాయినైన తర్వాత రామం ఆ గదిలోకి అడుగు పెట్టడం అదే మొదటిసారి. తాము పని చేస్తున్న ఆఫీసుహాలు వాతావరణంతో పోలిస్తే తను అడుగుపెట్టిన గది స్వర్గధామంలా ఉంది. కూర్చోమనకుండా ఆఫీసరు ముందు కుర్చీలో కూర్చోవటం రామానికి అలవాటు లేదు. అలాగని ఇంతవరకూ ఏ ఆఫీసరూ రామాన్ని కూర్చోమనకుండా ఉన్నదీ లేదు. ఏదో ఫైల్ చూస్తున్న ఆఫీసరు రామం వంక చూడటానికి ప్రయత్నం చేయలేదు. రెండు నిమిషాలు అలానే నిలబడ్డ రామం–‘‘సార్! రమ్మన్నారట,’’ అన్నాడు. తలెత్తిన ఆఫీసరు–‘‘ఒక్క నిమిషం వెయిట్ చేయలేరా?’’ అని పరుషంగా అని మళ్లీ తన పనిలో మునిగి పోయాడు. నిమిషం కాస్తా ఐదు నిమిషాలు అయింది. రామానికి తెలుసు ఆయన చూసే ఫైల్లో అంతసేపు చూడాల్సిందేమీ లేదని. మరి దేనికి ఆలస్యం?తనని ఉద్దేశ్యపూర్వకంగా నిలబెడుతున్నాడా అన్న అనుమానం వచ్చింది రామానికి. అతని మంచితనం అలా అయి ఉండదు అని మనసుని సముదాయించింది. అలానే నిలబడ్డాడు. కాసేపటికి తలెత్తిన ఆఫీసరు ‘‘రామం గారూ! అకౌంటెంట్ గారికి ఒక బిల్ ఇచ్చి పాస్ చేయమని చెప్పాను. ఇంతవరకూ అది నా బల్ల మీదకి రాలేదు. అకౌంటెంట్ గారిని పిలిచి అడిగాను.రూలు ప్రకారం అది పాస్ చేయకూడదని మీరు అన్నారట! నిజమేనా?’’ అని అడిగాడు.‘‘అవును సార్! ఆ బిల్ పాస్ చేయటానికి మన నిబంధనలు ఒప్పుకోవు. అదే విషయం చెప్పాను అకౌంటెంట్ గారితో,’’‘‘చేయమని నేను చెప్పిన దానికి కూడా నిబంధనలు అడ్డం వస్తాయా?’’‘‘పాస్ చేయకూడదనే కొత్త నిబంధన మీకు తెలియక అలా చెప్పి ఉంటారనీ, మీతో అదే విషయం చెప్పుదామనీ నా ఆలోచన. ఈ లోపులోనే మీరు పిలిచారు,’’‘‘ఐతే పాస్ చేయనంటారు,’’‘‘అలా నేననలేదు,’’‘‘మరి మీరన్నదానికి అర్థం ఏమిటి?’’‘‘నిబంధన ఉదహరించి బిల్లు ఫైలు మీ ఉత్తర్వులకోసం సమర్పిస్తాను. పాస్ చేయమని ఫైల్లో మీ ఆజ్ఞ నమోదు చేయండి. వెంటనే పాస్ చేయిస్తాను,‘‘‘‘ఐతే నా నోటి మాటకి విలువ లేదన్నమాట,’’ ‘‘క్షమించండి! మీరలా అర్థం చేసుకొంటే నేను మాట్లాడటానికి ఏమీ ఉండదు,’’‘‘నాకు అర్థమైంది. నా మాటకు మీరు విలువ ఇవ్వదలుచుకోలేదని. యు కెన్ గో!’’‘‘థాంక్యూ సర్!’’రామం ఆఫీసరు గదిలోంచి ఎర్రబడ్డ ముఖంతో బయటికొచ్చాడు. ఆయన వాలకం చూసిన స్టాఫ్‌కి అర్థమైంది. లోపల ఏదో జరగకూడనిది జరిగిందని. రామం గారి దగ్గరికి వచ్చి కూపీ లాగబోయారు.జరిగింది చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు రామం గారు.ఇంతలో ఉన్నట్లుండి బయటికి వచ్చాడు ఆఫీసరు. ‘‘ఏవిటిక్కడ గూడుపుఠాణీ?’’ అని గట్టిగా అరిచాడు. స్టాఫ్ నెమ్మదిగా ఎవరి సీట్లలోకి వాళ్లు సర్దుకున్నారు. ఆ రోజు ఆఫీసులో ఎవరికీ పని చెయ్యబుద్ధి కాలేదు. గుడ్డిలో మెల్లలా ఆఫీసరు సరిగ్గా అయిదింటికి ఇంటికి వెళ్లిపోయాడు. హమ్మయ్య అనుకొని స్టాఫ్ కూడా ఆ రోజుకి పని ముగించారు.ఆ తర్వాత కాసేపు ఆఫీసులోనే ఉన్న రామం– ఆఫీసరు ప్రవర్తననీ, తన ప్రవర్తననీ ఆయన కోణంలోంచి అర్థం చేసుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. ఆయన చికాకుకు కారణాలు వెతకటానికి నిజాయితీగా కృషి చేశాడు. కానీ– ఆయన కోపానికి అంగీకారయోగ్యమైన కారణం రామం మనసుకి ఒక్కటి కూడా తోచలేదు. ఎంత నిబద్ధతతో ఆలోచించినా తను చేసినది తప్పని కానీ, ఆఫీసరు చేసినది ఒప్పని కానీ అంగీకరించటానికి ఆయన మనసు సుతరామూ అంగీకరించటం లేదు. ఆఫీసరు కూడా జీవితంలో చిన్న చిన్న అవసరాలకి సైతం తడుముకున్నవాడే! జీవితంలో నిమ్నోన్నతాలు చూసినవాడే! అన్నీ కష్టాలూ అనుభవించి జీవితంలో ఒక్కొక్క మెట్టూ అతికష్టం మీద ఎక్కి పైకి వచ్చిన వాడు ఎదుటివాడి కష్టాన్ని ఎందుకలా పూచిక పుల్లలా తీసేస్తున్నట్లు?అవగాహనకందక వికలమనస్కుడై రామం కూడా ఇంటి ముఖం పట్టాడు. ఇంటి వెనక పూల మొక్కల మీద ఎగురుతూ వాలుతున్న సీతాకోకచిలుకని పట్టుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు రామం మనవడు. ప్రక్కనే మునగచెట్టునిండా గొంగళి పురుగులు. ఉరుకులు పరుగుల్లో అటువైపు వెళ్లి వాటిమీద పడి వొంటికి అతికించుకుంటాడేమోనని కోడలు భయం. అందుకే సున్నితంగా కొడుకుని వారిస్తోంది ఆమె. కానీ తూనీగలా పరిగెడుతున్న కొడుకుని ఆపటం ఆమె తరం కావటం లేదు. ఎంతసేపటికీ సీతాకోకచిలుక చేతికి చిక్కక పోవటంతో కాసేపటికి విసుగు వచ్చి ఇంట్లోకి వచ్చేశాడు రామం మనవడు. అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తాతయ్య దగ్గర చేరాడు. ‘‘తాతయ్యా! తాతయ్యా! సీతాకోకచిలుక అంత అందంగా ఎందుకుంటుంది?’’ అని అడిగాడు.‘‘దానికి అందమైన రెక్కలు ఉండటం వల్ల,’’ ‘‘అలాంటి రెక్కలు మొలిస్తే మనమూ అందంగా ఉంటామా?’’‘‘ఎందుకుండం?’’‘‘తాతయ్యా! సీతాకోకచిలుకకి పుట్టుకతోనే అందమైన రెక్కలు ఉంటాయా? తరువాత వస్తాయా?’’ ‘‘తర్వాతనే వస్తాయి’’‘‘తాతయ్యా! ఇది నిజమా?’’‘‘ఏంటమ్మా అది’’ అని మనవడ్ని భుజాలమీదకెత్తుకుని రామం అడిగాడు. ‘‘గొంగళి పురుగే కొద్దిరోజులకి రెక్కలు మొలిచి సీతాకోకచిలుక అవుతుందటగా?’’‘‘అవును! సైన్సు అదే చెపుతుంది’’‘‘కొద్ది రోజుల తర్వాత మళ్లీ రెక్కలు వూడిపోయి గొంగళి పురుగు అవుతుందా?’’‘‘కాదమ్మా! సీతాకోకచిలుకగానే ఉండిపోతుంది,’’‘‘ఇంకో చిన్న ప్రశ్న తాతయ్యా! సీతాకోకచిలుకకి తను ఒకప్పుడు గొంగళి పురుగుననే విషయం గుర్తుంటుందా?’’నిజం సీతాకోకచిలుకని గురించిన నిజం తనకి తెలీదు. మనుషుల్లో సీతాకోకచిలుకల గురించి తనకు తెలిసిన నిజం మనవడికి చెప్తే అర్థం చేసుకోగలిగిన వయసు కాదు. రామం మనవడి వంక అయోమయంగా చూశాడు.‘‘నేనే గెలిచా! అమ్మా! ఇన్నాళ్లకు తాతయ్య జవాబు చెప్పలేని ప్రశ్న నేనొకటి అడిగా!’’ అని అరుస్తూ సంతోషంతో రామం మనవడు తల్లి దగ్గరికి పరిగెత్తాడు. టి. చంద్రశేఖర రెడ్డి -
‘బ్యాడ్ టచ్’ గురించి బయటపెట్టిన గాయని
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై బాధితురాళ్ల బహిరంగ వెల్లడింపులతో సరిగ్గా ఏడాది క్రితం మొదలైన ‘మీ టూ’ మహిళా మహోద్యమం.. ఇన్నాళ్లకు మెల్లిగా బాలీవుడ్‌కూ ధైర్యాన్నిచ్చింది! పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఇప్పుడు బయట పెట్టడంతో, ఆ స్ఫూర్తితో.. మరికొంతమంది బాలీవుడ్ మహిళా ప్రముఖులు తమ జీవితంలోనూ జరిగిన అలాంటి చేదు అనుభవాలను ఒకరొకరుగా బహిర్గతం చేస్తున్నారు. సంఘటితం అవుతున్నారు. తాజాగా చెన్నై గాయని చిన్మయి శ్రీపాద.. ఎదుగుతున్న వయసులో తన మీద పడిన ‘బ్యాడ్ టచ్’ గురించి బయటికి చెప్పడంతో.. బాధితులకు మద్దతు లభిస్తోంది. మీ టూ కి.. ‘వియ్ టూ’ అని సపోర్ట్ ఇచ్చే వారి సంఖ్యా పెరుగుతోంది. తను పలికినా.. పాడినా మధురమే! ఇది చిన్మయి శ్రీపాద ఐడెంటిటీ. క్లాసిక్స్ నుంచి ‘మయ్యా.. మయ్యా..’ లాంటి ఐటమ్ సాంగ్స్ దాకా.. ఆమె నోట ఏ పాట విన్నా ప్రేక్షకులు మైమరిచిపోవాల్సిందే. డబ్బింగ్ చెప్పినా అంతే.. వింటూ ఉండిపోవాల్సిందే! అలాంటి చిన్మయి స్వరం ఈరోజు మారింది. బిటర్ చాక్లెట్ నమిలి మింగిన వికారాన్ని పంచుకుంది. ప్రపంచంలో ఎవరి.. ముఖ్యంగా ఏ అమ్మాయి బాల్యమూ భయం నీడ సోకకుండా సాగిన దాఖలా లేదు కదా అనిపిస్తోంది... ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ మూవ్మెంట్ స్టోరీస్ విన్నప్పటి నుంచీ. హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ దాష్టీకాల వల్ల ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం అయింది.లైంగిక వేధింపుల గురించి నోరు విప్పచ్చని.. అవి ఎప్పుడు జరిగినా చెప్పుకోవచ్చని.. వేధించిన వాడు సిగ్గు పడాలి కాని.. వేదనకు గురైన వారు కాదని బాధితులకు ధైర్యం ఇచ్చింది. అది మన వాళ్లకూ ప్లాట్‌ఫామ్ అయింది. టాలీవుడ్లో మెున్న శ్రీరెడ్డి.. బాలీవుడ్లో నిన్న తనుశ్రీదత్తా నిజాలను బయటపెట్టారు. ఇప్పుడు చిన్మయి గొంతు విప్పింది. చిన్నప్పటి అలాంటి సంఘటనలను ట్వీట్ చేసింది. ‘‘అప్పుడు నాకు ఎనిమిదేళ్లో... తొమ్మిదేళ్లో.. ‘సాంథోమ్ కమ్యూనికేషన్స్’ స్టూడియోలో మా అమ్మ తన డాక్యుమెంటరీ రికార్డింగ్‌లో ఉంది. నేను అక్కడే నిద్రపోతున్నాను. నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్టు అనిపించి దిగ్గున లేచేసరికి.. నా పక్కనే ఓ పెద్ద మనిషి! టీన్స్‌లో ఉన్నప్పుడు కిల్పాక్ (చెన్నై) బ్రిడ్జ్ దగ్గర ఒక ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్ వల్ల నా బైక్ యాక్సిడెంట్ అయి పడిపోయాను. నా కుడిచేయి కొట్టుకుపోయి.. కదల్లేని స్థితిలో నేనుంటే కొంతమంది మగవాళ్లు పడిపోయిన నా దగ్గరకు వచ్చి నా షర్ట్ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా చెస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నీచమైన ప్రవర్తన? ఇలాంటిది చాలామంది అమాయిలకు ఎదురయ్యే ఉంటుంది. నాకు పందొమ్మిదేళ్లప్పుడు.. మళ్లీ ఇంకో సంఘటన. ఈసారీ ఓ పెద్ద మనిషే. తన ఆఫీస్‌కు పిలిచాడు. నేను, అమ్మ ఇద్దరం వెళ్లాం. కాని నన్నొక్కదాన్నే లోపలికి రమ్మన్నాడు. బాగా పరియం ఉన్న వ్యక్తే కాబట్టి వేరే అనుమానాలు లేకుండా.. అసలు రాకుండా.. ఆయన క్యాబిన్లోకి వెళ్లాను. ఆయన టేబుల్ వెనకనుంచి వచ్చి.. నన్ను హగ్ చేసుకున్నాడు.. అసభ్యంగా ప్రవర్తించబోయాడు. చిన్మయి.. గత మూడేళ్లుగా ఆన్లైన్లో బెదిరింపులు, వేధింపులనూ ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి ఫిర్యాదూ చేసింది. వాళ్లు అరెస్టయ్యారు కూడా. అయితే అరెస్ట్ అయిన తర్వాతా ట్రోలింగ్ ఆగలేదు.పేరొందిన మహిళా రచయితలు, కార్యకర్తలూ ఆమెను ట్రోల్ చేశారు.. ‘మయ్యా.. మయ్యా.. లాంటి పాటపాడిన సింగర్ .. వేధింపులకు వ్యతిరేకంగా కంప్లయింట్ చేయకూడదు’ అనే కామెంట్స్‌తో! చాలామంది మగవాళ్లు, ఆడవాళ్లు సపోర్ట్ ఇచ్చారు ఆ మాటలకు. అంతేకాదు చిన్మయి మీద యాసిడ్ అటాక్ చేయాలని, రేప్ చేయాలని ఆగ్రహించిన మగవాళ్లూ ఉన్నారు. ఆడవాళ్లే ఆడవాళ్లకు సపోర్ట్ చేయని పరిస్థితి అని వాపోయింది చిన్మయి. ఇలా చిన్మయి మీద ఆన్లైన్లో కక్కుతున్న విషం చదివి.. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలు చెప్పే ప్రశాంత్ అనే క్రిటిక్.. చిన్మయికి తాను సపోర్ట్ చేస్తున్నాను అని చెబుతూ వెంటనే ‘‘డోంట్ వర్రీ స్వీట్హార్ట్/ డార్లింగ్.. ఐ విల్ సపోర్ట్ యూ’’ అని ట్వీట్ చేశాడు. ఆయనలా స్వీట్హార్ట్, డార్లింగ్ అని పిలవడం చిన్మయికి చిరాకు తెప్పించింది. వెంటనే ‘‘డోంట్ కాల్ మి స్వీట్హార్ట్’’ అని రిటార్ట్ ఇచ్చి ప్రశాంత్‌కి సంబంధించిన డైరెక్ట్ మెస్సేజెస్ అన్నీ డిలీట్ చేసేసింది చిన్మయి. ఇక అప్పటినుంచి ప్రశాంత్ కూడా చిన్మయికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మెుదలుపెట్టాడు. అప్పటిదాకా చాలా ఉదాత్తంగా మద్దతునిస్తానన్నవాడు తన అతిని ఆమె తిప్పికొట్టేటప్పటికి అసలు స్వభావం బయటపెట్టుకున్నాడు. చిన్మయి ట్వీట్ చేయడం చూసి ప్రశాంత్ బాధిత మహిళలంతా ఒక్కొక్కరే ట్వీట్స్ ద్వారా అతని వేధింపులను బయటపెట్టడం మొదలుపెట్టారు. దీంతో మీ టూ హాష్‌ట్యాగ్ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.సినిమా ఇండస్ట్రీ, జర్నలిజం ఫీల్డ్‌లోని లైంగిక వేధింపులన్నీ ఆన్లైన్లో పుటలు తెరిచాయి. ఉత్సవ్ చక్రబర్తీ అనే కమెడియన్ అసభ్యకర ప్రవర్తన గురించీ కొంతమంది మహిళలు రాశారు. హఫ్పోస్ట్ ఇండియా ట్రెండ్స్ మాజీ ఎడిటర్ అనురాగ్ వర్మ, బిజినెస్ స్టాండర్డ్ జర్నలిస్ట్ మయాంక్ జైన్, డీఎన్ఏ ముంబై ఎడిటర్ ఇన్ చీఫ్ గౌతమ్ అధికారి, నవలా రచయిత నాగర్కర్, కల్చరల్ క్రిటిక్ (సామాజిక ధోరణుల విమర్శకుడు) సదానంద్ మీనన్ వంటి వారి వేధింపుల పురాణాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో గంటగంటకు ఇలాంటి పేర్లు, హెరాస్మెంట్ నంబర్లతో మీ టూ జాబితా పెరుగుతూ ఉంది.సైలెన్స్‌ను బ్రేక్ చేస్తే వచ్చే నష్టమేమీ లేదు.. పరిష్కారం దొరకడం తప్ప. మహిళ.. మగవాడి సొత్తు కాదు. ఈ మాటను సుప్రీం కోర్టు కూడా తన తీర్పు (497ఏ కేసుకు సంబంధించి)లో చెప్పింది. ఆత్మగౌరవం ఆమె హక్కు కూడా. ఆ ఇంగితంతో మెదలుదాం! ముందుకు కదులుదాం. వీళ్లు కూడా.. కంగనా రనౌత్.. పదిహేడేళ్లకే సినిమారంగంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ ఇంట్లో ఉండేది. కంగనా పెద్ద స్టార్ అయ్యాక తనే ఆమె మెంటర్నని, గాడ్ఫాదర్నని చెప్పుకున్నాడు కూడా. అలాంటి వ్యక్తి తనను వేధింపులకు గురిచేశాడని, శారీరకంగా గాయపర్చాడనీ చెప్పింది కంగనా. అంతేకాదు ఆ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐర్ నమోదైందనీ తెలిపింది ఆమె. ఆ వ్యక్తి ఎవరో చెప్పడానికి కంగనా ఇష్టపడలేదు కాని ఆమె కెరీర్తొలినాళ్లలో గాడ్ ఫాదర్‌గా వ్యవహరించింది ఆదిత్య పంచోలి అనే ఊహగానాలూ ఉన్నాయి. కల్కి కోచ్లిన్ తొమ్మిదేళ్ల వయసులోనే అబ్యూజ్‌కు గురైన డార్క్ ఎక్స్‌పీరియెన్స్ ఆమెది. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా గొప్పవాళ్లుగా.. పెద్దవాళ్లుగా చలామణి అవుతున్న వారితోనూ వేధింపులు తప్పలేదని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది కల్కి. చిన్నప్పటి సంఘటనను ఇప్పటికీ ఓ శాపంలా తలచుకుంటానని అంటుంది కల్కి. సప్నా మోతీ భవ్నాని సెలెబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్.. సప్నా మోతీ భవ్నాని. చిన్నప్పటి నుంచి ప్రేమించి అబ్బాయినే పెళ్లి చేసుకున్నా గృహహింస తప్పలేదు. 24వ యేట షికాగో(అమెరికా) లో గ్యాంగ్‌రేప్‌కి గురైంది. దాన్నీ హింసకు ఒక ఆయుధంగా మలచుకున్నాడు భర్త. అయినా 20 ఏళ్లు సహించింది వివాహ, కుటుంబ వ్యవస్థల మీద గౌరవంతో. తన బలహీనత తన ప్రాణాలనే తీసే దశకు చేరుకున్నాక అప్పుడు ధైర్యం చేసింది. విడాకులు తీసుకొని స్వతంత్రంగా జీవిస్తోంది సప్నా. అనూష్క శంకర్ తెలుసు కదా.. ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు రవి శంకర్ కూతురు. తన తల్లిదండ్రులు నమ్మి, గౌరవించే వ్యక్తి చేతుల్లోనే చిన్నప్పుడు కొన్నేళ్లపాటు సెక్సువల్ అబ్యూజ్‌కు గురయ్యానని.. ‘విమెన్స్ రైట్స్ క్యాంపెయిన్ గ్రూప్’ వీడియోలో షేర్ చేసుకుంది అనూష్క. గ్లామర్ ఇండస్ట్రీనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఆ మాటకొస్తే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి విషాదాలు వినిపిస్తూనే ఉంటాయి అంటారు ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్. నిజమే.. అందుకే గొంతు పెగల్చాలి. ఇలాంటి వాటికి ఎండ్ చెప్పాలి. మళ్లీ జరక్కుండా చూడాలి. ‘మీ టూ’ కి.. వియ్ టూ (we too) అంటూ సపోర్ట్ చేయాలి. – శరాది -
ఎన్నాళ్లో వేచిన హృదయం
దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే. 2015లో.. ఎల్జీబీటీ యాక్టివిస్ట్ హరీష్ అయ్యర్ వాళ్ల అమ్మ పద్మాఅయ్యర్ ఓ ప్రకటన పట్టుకొని పత్రికాఫీసులన్నీ తిరిగింది. దాన్ని చూసిన వాళ్లంతా కనీసం మాట కూడా మాట్లాడకుండా ‘వేయలేం’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపి ఆమెను పంపించేశారు. చివరకు హిందుస్థాన్ టైమ్స్ ఒప్పుకుంది ఆ ప్రకటన వేయడానికి. అన్ని వార్తా పత్రికలు తిరస్కరించిన ఆ ప్రకటన ఏంటి?ఆమె కొడుకు కోసం పెళ్లికొడుకు ప్రకటన! ‘‘ఎన్జీవోలో పనిచేస్తున్న 36 ఏళ్ల నా కొడుకు కోసం వరుడు కావాలి. అయిదు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తుండే నా కొడుక్కి.. జంతు ప్రేమికుడు, శాకాహారి, మంచి ఉద్యోగం చేస్తున్నజతగాడు కావాలి. అయ్యర్ కులస్తులకు ప్రాధాన్యం. అయినా క్యాస్ట్ నో బార్’’ ఇదీ ఆ ప్రకటన సారాంశం. ఇది పత్రికల వాళ్లకే కాదు.. ఎల్జీబీటీలను పౌరులుగా చూడని చోట్లల్లా సంచలనమే అయింది. హరీష్ అయ్యర్‌కు లైఫ్ పార్టనర్ దొరికాడా లేదా అన్నది అప్రస్తుతం. ఒక తల్లి అభ్యర్థన ఎంత నవ్వుల పాలైంది? ఒక మనిషి వ్యక్తిగత ఆసక్తిని ఎందుకు కించపరిచారన్నది చర్చనీయాంశం. దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది. సుప్రీంకోర్టు తీర్పుతో. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) హక్కులనూ గౌరవిస్తూ.. వాళ్లనూ పౌరులుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. దేశంలో ఇంకేం సమస్యలు లేనట్టు కొంతమంది అసహజ ప్రవర్తనకు గ్రీన్ సిగ్నల్ రావడాన్ని ఇంత సంబరంగా ఎందుకు చూస్తున్నారు.. అని చాలా మంది ఈసడించుకున్నారు. ఇంకెంతో మంది ‘‘అయిపోయింది.. దేశం గంగలో కలుస్తోంది’’ అంటూ పెదవి విరిచారు. అతి కొద్ది మంది మాత్రమే ‘‘ఇన్నాళ్లకు వాళ్ల పోరాటం ఫలించింది. వాళ్ల ఆత్మగౌరవానికీ గుర్తింపు దొరికింది’’ అంటూ సంతోషపడ్డారు. నిజమే, దేశంలో చాలా సమస్యలు ఉండొచ్చు. ఆత్మాభిమానం దెబ్బ తినడం అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రపంచంలోని విప్లవాలన్నీ అస్తిత్వ పోరాటాల ఫలితాలే. ఈరోజు ఎల్జీబీటీలకు సంబంధించిన తీర్పు కూడా వాళ్ల అస్తిత్వ పోరాట ఫలితమే. ఆకలినైనా ఓర్చుకుంటాం.. కాని ఆత్మాభిమానం దెబ్బతింటే తట్టుకోలేం. పోరుకు సిద్ధపడతాం. మిగతా పోరాటాలన్నిటికీ అంగీకారం దొరికినప్పుడు ఎల్జీబీటీల స్ట్రగుల్ మాత్రం ఎందుకు సమ్మతం కాకూడదు? వాళ్ల హక్కులకు గుర్తింపు ఎందుకు ఉండకూడదు? దీని మీద న్యాయపోరాటానికి సిద్ధపడింది ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ‘‘స్వలింగ సంపర్కం నేరం కాదు. అది అసహజమూ కాదు.. అంటువ్యాధి అంతకన్నా కాదు! అదొక బయోలాజికల్ ఫెమినా..!’’ అంటూ తీర్పునిచ్చింది. ఎల్జీబీటీకి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377ను సడలించింది. నిజంగా ఇప్పుడు ఇది సంచలనమే. ద్వంద్వ ప్రమాణాల సమాజంలో ఎన్నో తర్జనభర్జనల అనంతరం సుప్రీం ఈ తీర్పునివ్వడం నిజంగా ఊరటే. ద్వంద్వ ప్రమాణాలు అంటే మనందరికీ కోపం రావచ్చు. ఖజురహోలో స్వలింగ సంపర్క శిల్పాలను కళగా ఆస్వాదిస్తాం.. ఆమోదిస్తాం. ఏ కళ అయినా సమాజ జీవితానికి ప్రతిబింబమే కదా! శిల్పాలుగా ఆ గోడల మీదకు ఎక్కాయి అంటే అది జనబాహుళ్యంలో ఉన్నట్టే కదా! బయట ఒప్పుకోవడానికి సంస్కృతీసంప్రదాయాలు అడ్డు తగులుతాయి. అందుకే ద్వంద్వప్రమాణాలు అన్నది. ఆకర్షణ బయోలాజికల్ ఇన్స్టింక్ట్. మానసిక రుగ్మత కాదు. ఎల్జీబీటీలను ఎల్‌జీబీటీలుగానే గుర్తించి.. గౌరవిస్తే.. సమాజమంతా ఎల్‌జీబీటీలుగా మారరు. అది ఫ్యాషన్ కాదు.. ట్రెండ్ కాదు.. సుప్రీంకోర్టే చెప్పినట్టు అంటువ్యాధి అంతకన్నా కాదు. గుర్తించకపోతేనే అనర్థం.అయితే కోర్టు తీర్పుతో అంతా మారిపోదు. ముందు ఇంట్లోంచే ఆమోదం మొదలు కావాలి. స్కూళ్లు, కాలేజీలు.. కార్యాలయాలు.. వాళ్లను థర్డ్ సిటిజన్స్‌గా కాదు.. సిటిజన్స్‌గా ఐడెంటిటీ ఇవ్వడం ప్రారంభించాలి. అభివృద్ధికి నమూనా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడటం కాదు.. అందరి హక్కులను గౌరవించడం. పౌరులు అందరికీ ఈక్వల్ స్పేస్ ఇవ్వడం! ప్రకృతే వీళ్లను ఆదరించినప్పుడు మనమూ దాని బిడ్డలమే.. వీళ్లకు సోదరీసోదరులమే కదా! మనమెందుకు అక్కున చేర్చుకోకూడదు?! సరస్వతి రమ -
బీసీసీఐ మీదే మా పోరాటం
కొరుక్కుపేట: బీసీసీఐలో అవినీతి పెరిగిందని బీహార్ కిక్రెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ ఆరోపించారు. అవినీతిదారుల భరతం పట్టేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు తాను వ్యతిరేకం కాదన్నారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ, జార్ఖండ్ క్రికెట్ సంఘం కోశాధికారి నరేష్ మకాణీ విలేకరులతో మాట్లాడారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను కలిసేందుకు తాము ఇక్కడికి వచ్చినట్టు వివరించారు. క్రికెట్ క్రీడాభివృద్ధి లక్ష్యంగా 2005 నుంచి తాను పోరాటాలు చేస్తున్నానని తెలిపారు. బీహార్, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అనేక అవినీతి అరోపణలున్న అమితాబ్చౌదరిని ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా నియమించారన్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సన్నిహితుడిగా ఆయన ప్రచారం చేసుకుంటూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. తన పోరాటం బీసీసీఐపైనే కానీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా మాత్రం కాదని స్పష్టం చేశారు. శ్రీనివాసన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని, ఆయన్ను కలిసి అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. -
పిడికిలిలోని పుష్పగుచ్ఛం
‘‘చెప్పండి గాంధీజీ.. అహింసా సిద్ధాంతాన్ని నిజంగానే మీరు విశ్వసిస్తున్నారా? లేక మాకు ప్రబోధిస్తున్నారా?’’ గాంధీజీని ఎవరో యువకుడు బహిరంగంగానే అడిగాడు! ముంబైలోని గొవాలియా ట్యాంక్ మైదానం అది. క్విట్ ఇండియా మూవ్మెంట్ అది.‘‘గాంధీజీ.. మీరు చెబుతున్న అహింస వల్ల ఏమాత్రమైనా ప్రయోజనం ఉంటుందా? శత్రువు దౌర్జన్యవాది. వాడి ముందు మనం చేతులు కట్టుకుని నిలుచుంటే బెదిరి పారిపోతాడా? చెప్పండి గాంధీజీ’’.. ఇంకో యువకుడు! అంతా గాంధీజీ సమాధానం కోసం చూస్తున్నారు. గాంధీజీ లేచి నిలబడ్డారు. ‘చరిత్రలో మనలాంటి దేశం మరొకటి లేదు. మనకున్నంత నిగ్రహ పటిమ మరొక దేశానికి లేదు. ఫ్రెంచి రెవల్యూషన్, రష్యా విప్లవం హింసాత్మక పోరాటాలు. అలాకాక, అహింసతో సాధించుకున్న ప్రజాస్వామ్యంలో మాత్రమే ప్రజలందరికీ సమానస్వేచ్ఛ ఉంటుంది. అలాంటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహింస సాధిస్తుంది. అహింస ఆయుధం మాత్రమే కాదు, ఆదర్శం కూడా’’ అన్నారు గాంధీజీ. ఆ ఆదర్శంతోనే.. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దేశం మనది. అదే ఆదర్శంతో ఏళ్లుగా మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. హింసకు హింసతో ఎప్పుడూ మనం సమాధానం చెప్పలేదు. 2001లో ఇదే రోజు.. డిసెంబర్ 13న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏకంగా మన పార్లమెంటు పైనే దాడికి తెగించి, కాల్పులు జరిపారు. ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సిబ్బంది, ఒక తోటమాలి వారి తూటాలకు బలయ్యారు. ఆ సమయంలో పార్లమెంటు హాలు లోపల హోమ్ మినిస్టర్ ఎల్.కె.అద్వానీ సహా పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. వాళ్లకు ప్రాణాపాయం తప్పింది. అంతటి ఘటన తర్వాత కూడా భారత్ తన శత్రుదేశంతో అహింసా ధర్మంతోనే వ్యవహరించింది. న్యాయ విచారణ, నిర్ధారణ తర్వాతే దోషులను శిక్షించింది. అదే భారత్ గొప్పతనం. అహింస మన పిడికిలిలో పుష్పగుచ్ఛంలా ఇమిడిపోయింది. -
పాపం పద్మ!
వీడని అత్తింటి వివక్ష పోరాడుతున్నా కనికరించని వైనం తల్లీబిడ్డలను పట్టించుకోని కుటుంబం దేవరపల్లి : అమ్మాయి పుట్టిందన్న సాకుతో భర్త, అత్తమామలు చూపుతున్న వివక్షపై పోరాడుతున్న ఆ తల్లికి మోక్షం కలగడం లేదు. పోలీసు కేసు నమోదై బాధితురాలికి మహిళా సంఘాలు, న్యాయస్థానం అండగా నిలిచినా ఆ కుటుంబం మాత్రం కనికరం చూపడం లేదు. మూడు రోజులుగా వర్షం పసిబిడ్డతో తడుస్తూ వారి ఇంటి ముందే ఎదురుచూస్తున్న ఆమెను చూసి గ్రామస్తులు చలించిపోయారు. శనివారం సర్పంచ్ సాయంతో ఆమె అత్తింటి తలుపు తెరిచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. అయితే తానకు, బిడ్డకు పోషణ ఎలా అని ఆ తల్లి రోదిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. ద్వారకాతిరుమల మండలంలోని మలసానికుంటలో ఆడబిడ్డ పుట్టిందని గురజాల పద్మను భర్త సత్యనారాయణ, అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులు పట్టించుకోకుండా అదే గ్రామంలోని తమ పొలంలోని ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. పద్మ అత్తింటి ముందు ఈనెల 5 నుంచి మౌనపోరాటం చేస్తుండగా 9న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా న్యాయమూర్తి గంధం సునీత సైతం స్పందించడంతో ఈనెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్టేషన్లో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. పద్మకు మహిళా సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి, మహిళా ఛైతన్య సమాఖ్య సంఘాలు అండగా నిలిచాయి. భర్త, అత్తమామలకు కౌన్సెలింగ్ నిర్వహించి ఆమెను వారికి అప్పగించారు. ఇంత జరిగినా అయితే అత్తింటి వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్లీ పద్మను ఇంటిబయటే వదిలేసి, వారంతా పొలంలోని ఇంటికి వెళ్లిపోయారు. పద్మ మాత్రం తన బిడ్డతో ఇంటి బయటే మౌనపోరాటం చేస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆరుబయట పసిపాపతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పద్మను చూసి చలించిన స్థానికులు గ్రామ సర్పంచ్ బత్తుల విజయశేఖర్‌కు విషయాన్ని తెలిపారు. దీంతో ఆయన, పలువురు పెద్దలు వారి ఇంటికి చేరుకుని, ఇంటి తలుపులు తెరచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని పద్మ వేడుకుంటోంది. -
కెరటం మాటున.. పోరాటం
నిత్యం గంగపుత్రుల జీవన పోరాటం వేట మానితే కడుపు నిండదు నీట మునిగితే సాయం అందదు పథకాలున్నా సవాలక్ష నిబంధనలు మత్స్యకారులకు అందని సాయం పథకాల్లో తికమకలు దీన స్థితిలో గంగ పుత్రుల కుటుంబాలు నరసాపురం: నీటి మధ్యే వారి జీవనం.. నిత్యం ఎదురొచ్చే అలలతో పోరాటం.. రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారులు. వేట కెళ్లని రోజు పస్తులుండాల్సిందే. ప్రమాదపుటంచున కష్టంతో కూడుకున్న ఈ వృత్తిలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రకృతి విపత్తులు తుఫాన్లు, వరదల రూపంలో కాటేస్తాయి. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా నీటి మధ్య సాగించే బతుకు పోరాటంలో ఏ క్షణాన్నైనా మృత్యువు కబళిస్తుంది. వేట సాగిస్తూ మృతి చెందిన మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అసలు ఎంత పరిహారం వస్తుందనే విషయంలో కూడా ఖచ్చితమైన స్పష్టత లేదు. వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధికసాయం విషయంలో గత ఐదేళ్లుగా అనేక మార్పులు వచ్చాయి. మొదట్లో రూ 30వేలు, రూ 40వేలు ఇచ్చేవారు. తరువాత రూ. 2 లక్షలు ఇస్తూ వచ్చారు. మళ్లీ రూ. 5 లక్షలు అన్నారు కానీ ఎవరికీ పైసా ఇచ్చిన పాపాన పోలేదు. చనిపోయిన వ్యక్తికి సంబంధించి పోస్టుమార్టమ్ నివేదికలు, ఫోరెన్సిక్ నివేదికలు, అసలు అతను వేటసాగించే మత్స్యకారుడే అని తేల్చిచెప్పడానికి అనేక ఆధారాలు చూపాలి. జీవించి ఉన్నన్నాళ్లూ నీటిలో బతుకు పోరాటం చేస్తాడు. తీరా అదే క్రమంలో మృత్యువాత పడితే ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా కోసం వారి కుటుంబాలు కూడా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ పోరాటం చేయాల్సి వస్తోంది. ఇదీ జిల్లాలో వేట సాగించే మత్స్యకారుల దీనస్థితి. ప్రత్యేకంగా వీరి బాగోగులు చూడాల్సిన మత్స్యశాఖ అలంకార ప్రాయంగా మారింది. చెరువులకు లైసెన్స్‌లు ఇప్పిండంలో చూపించే శ్రద్దలో ఒక వంతైనా మత్స్యకారులపై పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. అవినీతి ఊబిలో కూరుకుపోయిన మత్స్యకార సొసైటీలు, మత్స్యకారుల సంక్షేమాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశాయి. పరిహారంలో స్పష్టతా లేదు.. వేట సాగిస్తూ మృతి చెందిన మత్స్యకారులకు గతంలో పెద్దగా పరిహారం అందేది కాదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విషయంలో కాస్త కదలిక వచ్చింది. అప్పటి వరకూ రూ. 20 వేలు, రూ. 30 వేలు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 1 లక్షకు పెంచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ. 2లక్షలు చేశారు. రూ. 1 లక్ష కేంద్ర ప్రభుత్వం, మరో రూ. 1 లక్ష రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుతం కూడా అదే విధానం అమలవుతోంది. ప్రస్తుతానికి అందుతున్నది రూ. 2 లక్షలే. అది కూడా రావడానికి 18 నెలలు పైనే సమయం పడుతోంది. అదీ కొంత మందికే. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫిషరీష్ డెవలెప్మెంట్ బోర్డు(ఎన్ఎఫ్డీబీ) ద్వారా రూ. 1 లక్ష పరిహారం ఇస్తుంది. కేంద్రం నుంచి వస్తున్న సాయం మాత్రం ముందుగా బాధితులకు అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కోసం మత్స్యకార కుటుంబాలు ఎదురుచూడాల్సి వస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇది జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. చంద్రన్న బీమా పథకం కింద వేట సమయంలో మృతిచెందే మత్స్యకారులకు ఇచ్చే పరిహారాన్ని చేర్చారు. ఈ విధానం పక్కనున్న కృష్ణా జిల్లా, నెల్లూరు ప్రాంతాల్లో అమలవుతోంది కానీ ఇక్కడ మాత్రం జరగడం లేదు. పైపెచ్చు ఈ పథకంలో ఏడాదికి రూ. 15లు చెల్లించాలి. నిరక్షరాస్యులైన మత్స్యకారులకు దీనిపై సరైన అవగాహన లేదు. మత్స్యశాఖ అధికారులు కూడా అవగాహన పెంచే ప్రయత్నం చేయడంలేదు. పరిహారం కోసం ఎన్నో తిప్పలు.. జిల్లాలో నరసాపురంలో 19 కిలోమీటర్లు మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. 20 తీర గ్రామాల్లో పూర్తిగా చేపల వేట జీవనాధారం చేసుకుని జీవించే మత్స్యకారులు ఉన్నారు. నరసాపురం ప్రాంతంలోనే 25వేల కుటుంబాల వారు వేట సాగిస్తారు. సముద్రంలోనే కాకుండా గోదావరి , డ్రెయిన్లు, ఉప్పుటేరుల్లో వేట సాగించే సంప్రదాయ మత్స్యకారులు ఉన్నారు. జిల్లాలో మొత్తం వేట సాగించే మత్స్యకారుల సంఖ్య దాదాపు 60వేలు పైనే ఉంటుంది. గత మూడేళ్లలో ఒక్క నరసాపురం ప్రాంతంలోనే వేట సాగిస్తూ మత్యువాత పడినవారి సంఖ్య 16 వరకూ ఉంది. కానీ ఇందులో కేవలం ఆరుగురికి మాత్రమే నష్టపరిహారం అందింది. ఎందుకంటే పరిహారం అందిపుచ్చుకునే విషయంలో బాధితులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందు అతనికి గుర్తింపుకార్డు ఉండాలి. జిల్లాలో 260 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో 40వేల మంది వరకూ సభ్యులు ఉన్నారు. జిల్లాలో 60వేల మందిపైనే వేట సాగించే వారు ఉంటే, సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారిసంఖ్య తక్కువగా ఉంది. అలాగే డ్రెయిన్లు, ఉప్పుటేరుల్లో వేట సాగించే సంప్రదాయ మత్స్యకారుల్లో చాలామందికి గుర్తింపు కార్డులు లేవు. దీంతో వారికి సాయం అందడంలేదు. అదీకాక ఎవరైనా మత్స్యకారుడు మృతి చెందితే ముందుగా పోలీసు కేసు నమోదు కావాలి. తరువాత నష్టపరిహారం కోసం పోస్టుమార్టమ్, ఫోరెన్సిక్ నివేదికలు తదతర 16 రకాల డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వేటసాగించే మత్స్యకారుల్లో 90శాతం మంది అక్షరజ్ఞానంలేని వారు. వేలిముద్ర వేయడం తప్ప మరేమీ తెలియదు. దీంతో అధికారుల చుట్టూ తిరిగే కష్టాలు పడలేక, ఆర్ధికసాయం అందుకోలేక అవస్థలు పడుతున్నారు. తండ్రి పోవడంతో అనాధులుగా మిగిలిన పిల్లలు మొగల్తూరు మండలం ముత్యాలపల్లి చింతరేవు గ్రామానికి చెందిన కొల్లాటి పెంటయ్య(50)కు వేట తప్ప మరేమీ తెలియదు. గొంతేరు డ్రెయిన్‌లో వేట సాగించుకుని రాగా.. చేపలను భార్య మారెమ్మ గంపలో పెట్టుకుని ఇళ్లకు తిరిగి అమ్ముకునేది. 2015 జూలై 8వ తేదీ అర్ధరాత్రి గొంతేరు డ్రెయిన్‌లోకి వేటకు వెళ్లిన పెంటయ్య తిరిగిరాలేదు. మరునాడు పడవ పక్కన శవమైతేలాడు. అతని మృతితో భ్యార్యా పిల్లలూ అనాథలయ్యారు. వారికి ఒక్క రూపాయి పరిహారం అందలేదు. ఎందుకంటే పెంటయ్య సొసైటీలో సభ్యుడు కాదు, మత్స్యశాఖ నుంచి ఎలాంటి గుర్తింపుకార్డు లేదు. దీంతో కుటుంబం వీధిన పడింది. భర్త మృతి, పిల్లల బాధ్యతతో మారెమ్మ కష్టం రెట్టింపు అయ్యింది. చేపలు అమ్ముకుని కుటంబాన్ని పోషించుకుంటోంది. చదువులు కూడా లేకుండా అన్నా చెల్లెళ్లు వెంకటేశ్వరరావు, జ్యోతి ఇంటివద్దనే ఉంటున్నారు. 17 ఏళ్లకే కాటికి.. నరసాపురం మండలం ధర్బరేవు గ్రామానికి చెందిన కొల్లు వనమరాజు కుటుంబం 17 ఏళ్ల కొడుకుని దూరం చేసుకుని విలపిస్తోంది. కేవలం మూడు వారాల కిత్రం జరిగిన ప్రమాదంలో ఆ కుటుంబానికి పైసా సాయం దక్కలేదు. వనమరాజు కుటుంబం మొత్తం వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గోదావరిలోను, డ్రెయిన్స్లోను వేటసాగిస్తాడు. సముద్రంలో బోట్లపై వనమరాజు వేటకు వెళతాడు. అతని పెద్ద కొడుకు వెంకట్ గతనెల 10వ తేదీన దర్బరేవు డ్రెయిన్‌లో వేటసాగిస్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. వనమరాజుకు కూడా ఇదివరకటిలా ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ముందుముందు ఎలా బ్రతకాలా? అని ఆవేదన చెందుతున్నాడు. ఇతనికి మరో కొడుకు ఉన్నా అతను కూడా వేటే సాగిస్తున్నాడు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటే రెండో కొడుకును వేట మానిపించి చదివించుకుంటానని దీనంగా అర్ధిస్తున్నాడు. మత్స్యకారుల కష్టాలు పట్టడంలేదు బర్రి శంకరం, వైఎస్సార్సీపీ మత్స్యకారసంఘం రాష్ట్రనేత మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదు. మత్స్యశాఖ అలంకారప్రాయంగా మారింది. అసలు జిల్లాలో వేట సాగించే మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు. సముద్రంలో వేట సాటించేవారు ఎందరు, సంప్రదాయవేటలో ఉన్న వారు ఎందరు అనే లెక్కలు అసలు మత్స్యశాఖ అధికారుల వద్ద లేనేలేవు. మత్స్యకార సొసైటీలు ఉపయోగం లేకుండా ఉన్నాయి. వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారులకు రూ 5 లక్షలు ఆర్ధిక సహాయం ఇవ్వాలి ఎంత తిరిగినా సాయం అందలేదు తిరుమాని సోమరాజు, మొగల్తూరు నేను వేట చేసుకుని బతుకుతాను. మా అన్నయ్య వనమయ్య కూడా వేట చేసేవాడు. 2011లో సముద్రంలో వేటకు వెళ్లి అన్నయ్య చనిపోయాడు. రెండు రోజుల వరకూ శవం కూడా కనిపించలేదు. మా అన్నయ్యకు ముగ్గురు కూతుళ్లు. అన్నయ్య చనిపోయే నాటికి ఒక కూతురికే పెళ్లి చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని రూ. 14వేలు వరకూ ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలింతలేదు. తరువాత ఇద్దరు కూతుళ్ల òపెళ్లిళ్లు నేనే చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందితే ఉపయోగపడేది. ప్రస్తుతం మా వదిన సుభద్రమ్మ ఆ పనీ, ఈ పనీ చేసుకుని బతుకుతోంది. జాప్యం జరుగుతోంది అండ్రాజు చల్లారావు, మత్స్యకార సొసైటీల సంఘం జిల్లా అధ్యక్షుడు వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారులకు సాయం అందే విషయంలో జాప్యం జరుగుతోంది. కేంద్ర సాయం ముందుగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలస్యమవుతోంది. ఈ విషయమై అనేక సార్లు మత్స్యశాఖ అధికారులను కలవడం జరిగింది. ప్రస్తుతం వేట సాగిస్తూ మృతి చెందిన మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం రూ. 1 లక్ష, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష ఇస్తుంది. రూ. 5 లక్షల సహాయం ఇంకా అమలు కావడంలేదు. ప్రభుత్వ పథకాలను మత్ప్యకారులు వినియోగించుకునేలా సొసైటీల ద్వారా అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. పశ్చిమలోనే మరీ దారుణం కె.శ్రీనివాస్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మచిలీపట్నం రూ. 5 లక్షలు నష్టపరిహారం కృష్ణా జిల్లాలో అందుతోంది. పశ్చిమలో పరిస్థితి దారుణం. సముద్రంలోనే కాకుండా గోదావరి, డ్రెయిన్స్, ఉప్పుటేరుల్లో ఇక్కడ ఎక్కువమంది వేట సాగిస్తారు. కానీ వారికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. వేట నిషేధ సమయంలో కూడా ఎలాంటి పథకాలు అందకుండా నష్టపోతున్నారు. జిల్లాలో ముఖ్యంగా మత్స్యశాఖ పనితీరు దారుణంగా ఉంది. చంద్రన్న బీమా అమల్లో ఉంది కొత్త రమణకుమార్, మత్స్యశాఖ అధికారి నరసాపురం చంద్రన్న బీమా పథకం మత్స్యకారులకు అమల్లో ఉంది. ఏడాదికి రూ. 15లు చెల్లించాలి. ఈ పథకంలో రూ. 5 లక్షలు నష్టపరిహారం వస్తుంది. నిబంధనల మేర దరఖాస్తు చేసుకున్న వారందరికీ నష్టపరిహారం అందుతుంది. ఎవరికైనా అందకపోతే మమ్మల్ని సంప్రదిస్తే కారణాలు తెలుపుతాము -
పొంగిపొర్లుతున్న వాగులు
ఎడతెగని వానతో జనజీవనం అస్తవ్యస్తం లోతట్టు ప్రాంతాలు జలమయం నీటమునిగిన పంట పొలాలు దెబ్బతిన్న పలు రహదారులు ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు ః గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంగా జిల్లాలో సోమవారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో ఏజెన్సీ మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, దీంతో ఈ మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పంటపొలాలు నీట మునిగాయి. నారుమళ్లు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలేరుపాడు మండలంలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు,వాగు, లోతు వాగులు పొంగిపారాయి. మండల కేంద్రంలో రహదారులపై నీళ్ళు పారాయి. జగన్నాధపురం,ఎర్రబోరు. సంతబజారు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్ళు చేరాయి. పెదవాగు రెండు æ గేట్లు ఎత్తివేయడంతో మండలంలోని కమ్మరిగుడెం, ఒంటిబండ, రామవరం ఊటగుంపు, గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే రామవరం వద్ద లోతువాగు, పొంగిపొర్లుతోంది. జీలుగుమిల్లి వద్ద అశ్వారావుపేటవాగు రోడ్డు పైనుండి ప్రవహిçంచడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. లంకాలపల్లి వద్ద సంగం వాగు ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. ఎడ తెరపకుండ కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్ధంభించింది. జీలుగుమిల్లి దేవరపల్లి జాతీయ రహదారిపై గోతులు వర్షపు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. పోలవరం మండలంలో ఎల్‌ఎన్‌డిపేట వద్ద గల కొవ్వాడ రిజర్వాయర్‌లో కూడా భారీగా నీరు చేరింది. గుంజవరం వద్ద గల పేడ్రాల కాలువ, ప్రగడపల్లి వద్ద గల నక్కలగొంది కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ఎగువ ఏజన్సీ ప్రాంతంలోని కొండవాగులు కూడా పొంగుతున్నాయి. మొగల్తూరు మండలంలోని పడమటిపాలెం, ఇంజేటివారిపాలెం, రామన్నపాలెం అడవిపర్ర, కాళీపట్నం మాగలేరు ఆయకట్టు భూములు ముంపునకు గురయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు కలవరపడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రపు వేటకు వెళ్ళవద్దని అధికారులు మత్యకారులను హెచ్చరిస్తున్నారు. చిట్టవరంలో ముంపు నీరు లాగకపోవడంతో ఇటీవలే ఊడ్చిన సార్వా పంటచేను నీట మునిగింది. తీర ప్రాంత గ్రామాలైన పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాలలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. ఉంగుటూరు మండలంలో 150 ఎకరాలలో వరిచేలు ముంపునకు గురయ్యాయి. మంగళవారం రాత్రి వర్షాలు కొనసాగితే వరిచేలు ముంపు పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీరవాసరం, భీమవరం మండలాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వేసిన వరినాట్లు నీటిలో మునిగి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిప్పకాయలపాడులోని దళిత వాడలో భారీ వర్షానికి, ఈదురుగాలులకు ఒక ఇల్లు నేలమట్టమైంది. -
8000 దిగువకు కుప్పకూలిన నిఫ్టీ
మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు సన్నగిల్లడంతో ఈక్విటీ బెంచ్మార్కులు భారీగా కుప్పకూలుతున్నాయి. వరుసగా ఏడో సెషన్లోనూ నష్టాల్లో తాకిడి కొనసాగుతోంది. గురువారం ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడితో వంద పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, మధ్యాహ్నం సెషన్లో మరింత పతనమై 250 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 26వేల దిగువకు చేజారి 25,990వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 81.75 పాయింట్ల నష్టంలో 8000 దిగువకు పడిపోయింది. నిఫ్టీ మెటల్ షేర్లు 2 శాతానికి పైగా పతనమవుతున్నాయి. అదేవిధంగా బ్యాంకు ఇండెక్స్ సైతం అమ్మకాల తాకిడిని ఎదుర్కొంటోంది. టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నిఫ్టీ 50 స్టాక్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. ఈ రెండు కంపెనీల షేర్లు దాదాపు చెరో 3 శాతం చొప్పున పడిపోతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, మారుతీ సుజుకీ షేర్లూ 1-2 శాతం కుప్పకూలాయి. గ్లోబల్ ట్రెండ్ రిస్కులో కొనసాగుతుండటంతో వర్ధమాన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్టు మార్కెట్ విశ్లేషకుడు రాకేష్ అరోరా చెప్పారు. అంతేకాక పెద్ద నోట్ల రద్దు అనంతరం డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఎఫెక్ట్ కూడా మార్కెట్లపై చూపుతుందన్నారు. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు, డిసెంబర్ అమ్మకాల డేటా, ఎకనామిక్ డేటా ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. పాత నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థపై సమీప కాలంలో కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర గ్రోత్ రేటును కూడా అవి తగ్గించాయి. అయితే ఈ ఫలితం ఏ మేరకు ఉండబోతుందో వచ్చే నెలలో వెల్లడికాబోతుంది. -
గాడిన పడని ఆన్లైన్ వాహన రిజిస్ట్రేషన్
* షోరూం నిర్వాహకులకు అవగాహన లోపంతో దరఖాస్తుల తిరస్కరణ * రిజిస్ట్రేషన్ వారం నుంచి రెండు వారాల పాటు జాప్యం గుంటూరు (నగరంపాలెం): రవాణాశాఖలో వాహనదారులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వాహన డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ఇంకా గాడిన పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 17 నుంచి ద్విచక్ర, నాన్‌ట్రాన్స్‌పోర్ట్ లైట్ మోటర్ వాహనాలు కొనుగోలు చేసిన షోరూం లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి నంబరు కేటాయించే విధానం ప్రారంభించారు. దీని కోసం జిల్లాలోని సుమారు 40 వాహన షోరూంలకు, 150 మంది సబ్ డీలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం, షోరూంలో అప్లికేషన్ ఆన్లైన్లో అప్‌లోడ్‌కు ప్రత్యేక సాఫ్ట్వేర్ అందించారు. జిల్లాలో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసే గుంటూరు ఆర్టీఏ కార్యాలయానికి ఏపి07సిజడ్, నరసరావుపేట ఆర్టీఏ కార్యాలయానికి ఏపి07డిఏ, పిడుగురాళ్ళ యూనిట్ కార్యాలయానికి ఏపి07డీబీ, తెనాలి యూనిట్ కార్యాలయానికి ఏపి07డీసీ సిరీస్‌ను కేటాయించారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం మినహా అక్టోబర్ 17 నుంచి కొనుగోలు చేసిన నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు అన్నీ షోరూం ద్వారానే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే గత నెలరోజులుగా æ వాహన డీలర్ల నుంచి రవాణాశాఖ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులు చిన్నచిన్న సాంకేతిక సమస్యలతో ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. షోరూంలో వాహనం కొనుగోలు చేసిన తర్వాత పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌కు నగదు ద్వారా కొనుగోలు చేస్తే కొనుగోలుదారుని ఫొటో, వాహనం రెండు ఫొటోలు ఇతర పత్రాలు కలిపి మొత్తం 12 , ఫైనాన్స్ ద్వారా అయితే 15 పత్రాలను అన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయాల్సిన ఫారమ్స్ అన్నీ జీపీఆర్ఎస్ కోఆర్డినేషన్ ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా మాత్రమే ఫొటో తీయాల్సి ఉంటుంది. నివాస ధ్రువీకరణ పత్రాలతోనే ప్రధాన సమస్య.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్ నివాస ధ్రువీకరణ పత్రంపై సరైన అవగాహన షోరూం నిర్వాహకులకు లేకపోవడంతో ఎక్కువ శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఆధార్‌కార్డులో ఉన్న చిరునామా పోస్టల్ అడ్రస్, మండలాలు సక్రమంగా ఉండడం లేదు. అప్లికేషన్లో అప్లోడ్ చేసే ప్రూఫ్‌లు సక్రమంగా ఫొటో తీయలేకపోవడంతో క్లారిటీగా ఉండడం లేదు. ఇన్వాయిస్ల మీద, ఇతర ఫారమ్స్ మీద షోరూం మేనేజర్ల సంతకాలు ఉండడం లేదు. వాహనాలు సగం మాత్రమే కన్పించేలా ఫొటోలు తీస్తున్నారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయానికి గత నెలరోజులుగా సుమారు 900 వరకు ఆమోదం పొందితే 600 వరకు చిన్నచిన్న కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన వాటిలో కూడా ఎక్కువ శాతం ఒకటి కంటే ఎక్కువ సార్లు తిరస్కరణకు గురై సరిచేసి పంపినవే. తెనాలి, పిడుగురాళ్ళ, నరసరావుపేట కార్యాలయాల్లో ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. దీంతో 24 గంటల్లో జరగాల్సిన వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ వారం నుంచి పదిహేను రోజుల వరకు పడుతోంది. ఆన్లైన్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన ఫారమ్స్ క్లర్క్, ఎంవీఐ, ఏవో అన్ని పత్రాలపై కామెంట్ రాయాల్సి రావడంతో పనిభారం పెరుగుతోంది. షోరూం నిర్వాహకులకు త్వరలో శిక్షణ కార్యక్రమం –డీటీసీ డీలర్ల వద్ద వాహనాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో షోరూం నిర్వాహకులు అప్లోడ్ సక్రమంగా చేయకపోవడంతో ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనరు జీసీ రాజరత్నం తెలిపారు. ఆధార్ కార్డును చిరునామాగా చూపే సమయంలో చిరునామా పూర్తిగా నమోదు చేయడం లేదన్నారు. ఇతర అడ్రస్ ప్రూఫ్‌కు ఎక్స్ట్రా ఇమేజ్ ఆప్షన్‌ను వినియోగించడం లేదన్నారు. అప్లోడ్ చేసిన ప్రూఫ్లలోని వివరాలు సక్రమంగా కన్పించడం లేదన్నారు. డీలర్లు అప్లోడ్ చేసిన వివరాలను పరిశీలించడానికి మినహా సరిచేసే అవకాశం కార్యాలయ సిబ్బందికి లేకపోవడంతో తిరస్కరించక తప్పడం లేదన్నారు. దీనిపై డీలర్లకు అవగాహన కోసం మరోసారి స్వల్పకాలిక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
కర్షకుడికి కొత్త కష్టం
* రైతులకు ‘చిల్లర’ సమస్యలు * కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 6.50 లక్షల ఎకరాల్లో వరిపైరు కోతలకు సిద్ధం * కూలీలకు చెల్లించేందుకు రూ.100 నోట్ల కోసం అవస్థలు * రబీ పంటలపైనా ప్రభావం సాక్షి, అమరావతి బ్యూరో : చిల్లర సమస్య అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి రైతులపై నోట్ల రద్దు ప్రకటన తీవ్ర ప్రభావం చూపింది. కోతలకాలం దగ్గర పడటంతో కూలీలకు రూ.100 నోట్లు సర్దుబాటు చేసేదెలా.. అని రైతులు తల పట్టుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 6.50 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. ఆయా జిల్లాల్లో 70 శాతం మేర వరి పైరు కోత దశకు వచ్చింది. మిగిలిన పైరు కూడా మరో వారం రోజుల్లో కోతకు వస్తుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాలో ఉన్న డబ్బును తీసుకునేందుకు ప్రయత్నించినా, కేవలం రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారు. అయితే ఎకరా పంట ఇంటికి చేరాలంటే కనీసం రూ.10వేలు వరకు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే çకూలీలకు ఇచ్చేందుకు చిల్లర నోట్లు లేక, కోతలు కోసి, కట్టలు కట్టి, నూర్పిâýæ్లను పూర్తిచేసేదెలా.. అని రైతులు ఆందోâýæనకు గురవుతున్నారు. రబీ పంటలకూ నోట్ల కష్టాలు.. రబీ పంటల కోసం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే రైతులకూ నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాయితీ విత్తన కేంద్రాల్లోనూ రద్దయిన నోట్లను తీసుకోవడం లేదు. పైగా ఈ నెల 24వ తేదీ వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లందరూ రద్దయిన పాత నోట్లను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఎక్కడా అమలుకావడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్, ఏపీ మార్క్ఫెడ్లు మాత్రమే పెద్ద నోట్లు తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వుల్లో ఉందని ప్రయివేటు డీలర్లు చెబుతున్నారు. వారు రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితంగా విత్తనాలు, ఎరువులు, విత్తనాల విక్రయాలు సైతం భారీగా పడిపోయాయి. రూ.650 కోట్లు అవసరం.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణంగా 4లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేస్తారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో రెండు లక్షలు, గుంటూరులో 60వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేశారు. రెండు జిల్లాల్లో మొత్తం 6.50 లక్షల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఎకరాకు రూ.10వేలు చొప్పున కూలీలకు చెల్లించాల్సి ఉన్నదందున, రెండు జిల్లాల్లోనూ రూ.650 కోట్ల విలువైన చిన్ననోట్లు అవసరం. ఈ మేరకు నగదు బ్యాంకుల్లో లేదు. కొన్ని బ్యాంకుల్లో నగదు ఉన్నప్పటికీ రూ.2వేల నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రైతులు, కౌలు రైతులు చిల్లర కోసం నానా అవస్థలు పడుతున్నారు. తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.100 నోట్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. -
‘మిర్చి’ రైతు భగీరథయత్నం
-
ఇక కష్టాల ‘వంతు’
– రబీకి సాగునీటి కష్టాలు షరామాములే – 10 టీఎంసీలకుపైనే లోటు – సాగు గట్టెక్కాలంటే 77 నుంచి 80 టీఎంసీలు అవసరం – అందుబాటులో ఉండేది 68 టీఎంసీలే – 75 శాతం ఆయకట్టుకు మాత్రమే సరిపోతుందంటున్న అధికారులు – వంతులవారీ విధానం అమలు చేయాలని నిర్ణయం కొవ్వూరు : ఖరీఫ్ వరి కోతలు మొదలయ్యాయి. మాసూళ్లు పూర్తికాగానే.. రబీ నారుమడులు పోసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి కూడా రబీ పంటకు సాగునీటి కష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడింది. గోదావరిలో 10 టీఎంసీలకు పైగా నీటి లోటు ఉంటుందని, రబీ గట్టెక్కాలంటే మరో 15 టీఎంసీల వరకు నీరు అవసరమవుతుందని జల వనరుల శాఖ అంచనా వేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించడం కష్టమని అధికారులు తేల్చేశారు. రెండు జిల్లాల్లోని 8.86 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా 75.74 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంటుందని లెక్కగట్టారు. గురువారం కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఉభయ గోదావరిలో పూర్తి ఆయకట్టుకు నీరిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అధికారులు ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలంటే వంతులవారీ విధానం అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో 68 టీఎంసీలు రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరందించాలంటే 77 నుంచి 80 టీఎంసీల నీరు అవసరమవుతుంది. అయితే, గోదావరిలో 33 టీఎంసీలు, సీలేరు ద్వారా 35 టీఎంసీలు కలిపి మొత్తంగా 68 టీఎంసీలు అందుబాటులోకి వస్తుందని లెక్కగట్టారు. సాగు అవసరాలు తీరాలంటే మరో 15 టీఎంసీలు అవసరం అవుతుందని చెబుతున్నారు. మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయడం, ఆయిల్ ఇంజిన్ల వినియోగించడం ద్వారా మరికొంత నీటిని అందుబాటులోకి తెచ్చినా మరో 10 టీఎంసీలకు పైగా లోటు ఉంటుందని చెబుతున్నారు. ఈ దష్ట్యా వంతులవారీ విధానం, నీటి పొదుపు చర్యలు పాటించడం ద్వారా పంటల్ని గట్టెక్కించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల వల్ల శివారు ప్రాంత రైతులు ఈ ఏడాది రబీలోనూ సాగునీటికి కటకటలాడక తప్పని పరిస్థితి ఉంది. పొదుపు ^è ర్యలు పాటిస్తాం ఉభయ గోదావరి డెల్టా ఆయకట్టు అంతటికీ నీరందించడానికి సుమారు కనీసం 76 టీఎంసీల నీరు అవసరం. అందుబాటులో ఉన్న నీరు 75 శాతం ఆయకట్టుకు మాత్రమే సరిపోతుంది. నీటి పొదుపు చర్యల ద్వారా కొరతను అధిగమిస్తాం. ఆయిల్ ఇంజిన్ల వినియోగం, వంతులవారీ విధానం అమలు, మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయడం వంటి చర్యలు చేపడతాం. నీటి వినియోగం విషయంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచుతాం. – పి.రాంబాబు, ఎస్ఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం -
సంక్షోభంలో వరి సాగు
* కృష్ణా పశ్చిమడెల్టాలో దుర్భిక్ష పరిస్థితులు * కనీవినీ ఎరుగని నీటికొరత * వర్షాభావం కొంత... పుష్కర తాపత్రయం మరికొంత * 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు లక్ష ఎకరాల్లోనే సాగు * సాగునీటి కొరతతో ఎండుతున్న ‘వెద’జల్లిన వరి కృష్ణా పశ్చిమ డెల్టాలో వరిసాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఖరీఫ్ ఆరంభంలోనే సాగునీటి కొరతతో సాగుకు ఆదిలోనే అవాంతరం ఎదురైంది. వర్షాభావం ఒకపక్క, ప్రభుత్వ పెద్దల పుష్కరాల తాపత్రయం మరికొంత నీటి సమస్యను జటిలం చేసింది. వెదజల్లిన చేలల్లో నీరు లేక పంట దెబ్బతింటోంది. నాట్లు వేసుకుందామని పోసిన నారుమళ్లు జీవం కోల్పోతున్నాయి. నీటితడులకోసం రైతాంగం నానా అవస్థలు పడుతోంది. అరకొర నీటినే ఆయిల్ ఇంజిన్లతో తోడుతూ పంటచేలకు మళ్లిస్తూ సాగు సమరం చేస్తున్నారు. తెనాలి/ కొల్లిపర: పశ్చిమడెల్టాలో గత ఖరీఫ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనిపించటం లేదు. అధిక వర్షాలు కురుస్తాయన్న అంచనాలనే నమ్ముకొన్నట్టు ఆచరణలో కనిపిస్తోంది. తీరాచూస్తే గత సీజను ఆరంభంనాటి పరిస్థితులే ప్రస్తుత ఖరీఫ్‌లోనూ ఎదురవటం రైతుల దురదృష్టం. జూలై 6 నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేస్తున్నాం... 10వ తేదీ నుంచి నారుమళ్లు పోసుకోవచ్చని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని నమ్మిన రైతులు నిండా మునిగారు. ఆగస్టు మూడోవారం పూర్తికావస్తున్నా పంటకాలువలకు నీటి విడుదల కంటితుడుపుగానే కొనసాగింది. దామాషా ప్రకారం నీరివ్వకుండా సంబంధిత మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుడెల్టాకు పెద్దపీట వేశారు. పశ్చిమడెల్టాను నిర్లక్ష్యం చేశారు. కేవలం లక్ష ఎకరాల్లోనే సాగు... ఫలితంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిగా గల పశ్చిమ డెల్టాలో 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను కేవలం ఆగస్టు 16వ తేదీ వరకు లక్ష ఎకరాల్లో పంట వేయగలిగారు. ఇందులో నారుమళ్లతో పనిలేకుండా నేరుగా విత్తనాలు వెదజల్లిన విస్తీర్ణం 95 వేల ఎకరాలు. నాట్లు వేయగలిగింది కేవలం 5 వేల ఎకరాలేనంటే ఆశ్చర్యపోనవసరం లేదు. 10 వేల ఎకరాలకు సరిపడ నారుమళ్లు పెరుగుతున్నాయి. ఈ విస్తీర్ణం మొత్తం గుంటూరు జిల్లా పరిధిలోనే సుమా! పశ్చిమడెల్టా పరిధిలో ప్రకాశం జిల్లాలోని దాదాపు 70 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, నీటికొరత కారణంగా సాగుకు సమాయత్తమయే పరిస్థితి కనిపించటం లేదు. సాగునీటి అవసరాలు పట్టించుకోని ప్రభుత్వం... ఇలా వరిసాగు వివిధ దశల్లో వున్న మాగాణి భూములకు నీటి కొరత తీవ్రంగా వుంది. పుష్కరాల కోసమని ప్రకాశం బ్యారేజి వద్ద 11 అడుగులపైగా నీటిమట్టం వుండేలా చూసుకున్న ప్రభుత్వం, రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోలేదు. ఫలితంగా గత నెలరోజుల్లో పంటకాలువలకు కనీస నీటి సరఫరా ఇవ్వలే కపోయారు. అందులోనూ ఇరిగేషన్ మంత్రి కారణంగా పశ్చిమ డెల్టాపై వివక్ష చూపారని రైతాంగం ఆరోపిస్తోంది. ప్రస్తుత సీజనులో తూర్పుడెల్టాకు 8.6 టీఎంసీల నీరివ్వగా పశ్చిమడెల్టాకు 4 టీఎంసీలనే ఇచ్చారు. ఆ నీటిని ఆయకట్టు ప్రకారం ఇవ్వాల్సివుండగా, తెలుగుదేశం నేతల పలుకుబడితో కొన్ని కాలువలకు ఎక్కువ సరఫరా ఇస్తూ వస్తున్నారు. ఆయిల్ ఇంజిన్లతో నీటి సరఫరా.... ఆగస్టు నెలలో 20 రోజులుగా వర్షాలు జాడ లేకపోవడంతో 18 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో పాటు పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, పడమర గాలి వీస్తుండటంతో వరి పొలాలకు నీరు సరిపోవడం లేదు. బెట్టకు రాకుండా వరికి నీటితడుల కోసం రైతులు శ్రమించాల్సివస్తోంది. బోర్లు అందుబాటులో ఉన్న పొలాలకు ఆయిల్ ఇంజిన్లతో నీరు పెడుతున్నారు. ఇందుకోసం ఎకరాకు రూ.2000 వరకు ఖర్చవుతోందని సిరిపురం గ్రామానికి చెందిన రైతు పోపూరి సుబ్బారావు చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో టీఎస్ ఛానల్‌పై 2వ బ్రాంచిపై ఏడు ఆయిల్ ఇంజిన్లు, 3వ నంబరు బ్రాంచిపై పది అయిల్ ఇంజిన్లతో రైతులు నిరంతరం నీటిని తోడుతున్నారు. బ్రాంచి కాలువల్లోకి వచ్చిన నీటిని మళ్లీ చేలల్లోకి తీసుకెళ్లేందుకు అక్కడా అయిల్ ఇంజిన్లే శరణ్యం. ఒక్కో ఎకరాకు ఎలా లేదన్నా రూ.5–6 వేలు నీటి తడులకే వ్యయం చేస్తున్నారు. మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల పరిధిలోని హైలెవెల్ ఛానల్లోనూ ఇదే పరిస్థితి. ఇంతగా కష్టపడుతున్నా వెదజల్లిన చేలల్లో వరి ఎండిపోతోంది. మొక్కలు చనిపోతున్నాయి.. 20 రోజుల కిందట వెద పద్ధతిలో వరి సాగు చేశాను. నీళ్లు అందకపోవడంతో పైరు ఎండిపోతుంది. బోర్ల ద్వారా ఉప్పునీరు రావడంతో పైరు వెంటనే ఎండిపోతుంది. కాల్వల ద్వారా కొంత నీరు వచ్చిన పొలంలోకి ఎక్కడం లేదు. పంట కాల్వలపైన ఉన్న రైతులకు మాత్రమే నీరు సరిపోతుంది. దిగువున్న ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. – వినుకొండ సుబ్బయ్య, రైతు, అత్తోట -
చూడాలంటే ఎన్నో కష్టాలు
హారతి చూసేందుకు 2 కి.మీ. నడవాల్సిందే రకరకాల ఆంక్షలు భక్తులకు తీవ్ర ఇబ్బందులు ప్రాంగణమంతా ప్రభుత్వ సిబ్బందే పవిత్ర పుష్కరాల్లో చూసి తరించాల్సిందేనంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమం హారతి కార్యక్రమం అధికారులకు, వీవీఐపీలకే పరిమితమా?, సామాన్య భక్తులను ఆంక్షల పేరుతో అనుమతివ్వడమే గగనమైంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. విజయవాడ: పవిత్ర సంగమం వద్ద నిత్యహారతి కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నగరంలో పలు ప్రాంతాలనుంచి భక్తులను సాయంత్రం బస్సులో ఇబ్రహీంపట్నం తరలిస్తున్నారు. సాయంత్రం హారతి సమయానికి ఒక గంట ముందు ఇబ్రహీంపట్నం రింగ్ వరకు మాత్రమే బస్సులను అనుమతిస్తున్నారు. అక్కడికి చేరుకున్న భక్తులను బస్సుల్లోంచి దించి కాలినడకన ఘాట్‌వద్దకు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. మొదటి ఐదు రోజులు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఉచిత బస్సులపై ఆంక్షలు విధించారు. బస్సులను సాయంత్రం వేళల్లో అనుమతించకుండా శాటిలైట్ బస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బుడమేరు కట్టపై వేసిన రోడ్డుద్వారా ముఖ్యమంత్రి ఘాట్ వద్దకు చేరకుంటున్నారు. ఆ సమయంలో భక్తులను రింగ్ సెంటర్‌నుంచి కాలినడకన ఫెర్రీ రోడ్డులోకి పంపుతున్నారు. నవహారతులు చూడాలని వచ్చే భక్తులు ఘాట్ వద్దకు 2కి. మీ నడిచివెళ్లాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. హారతి కార్యక్రమానికి చేరుకోలేక కొందరు ఉసూరంటూ వెనుదిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చారా.. మరింత కష్టం ముఖ్యమంత్రి ఘాట్ వద్ద ఉన్న సమయంలో అయితే పరిస్థితి ఇంకా కష్టం. రకరకాల ఆంక్షలు విధించడంతో పాటు పోలీసు, పారిశుధ్య, వైద్య సిబ్బందితోనే ప్రాంగణం కిక్కిరిసి పోతోంది. ఇక సమయానికి చేరుకోవడం దుర్లభమే. హారతి కోసం వచ్చే భక్తులు దూరం నుంచి చూసి వెనుదిరగాల్సి వస్తోంది. గత ఐదు రోజుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముఖ్యమంత్రి వావానాలు నిలిపి ఉంచే చోట హారతి వీక్షించేందుకు వీలుగా చిన్న డిస్ప్లే ఏర్పాటు చేశారు. అయినా ప్రత్యక్షంగా చూడడానికి వస్తే టీవీ తెరపై చూసి తిరిగి వెళ్లాల్సి వస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. -
లాభనష్టాల ఊగిసలాటలో మార్కెట్లు
ముంబై : నష్టాల్లో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్‌మార్కెట్లు, ప్రస్తుతం లాభనష్టాలకు మధ్య ఊగిసలాటలో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 11.70 పాయింట్ల స్వల్ప లాభంతో 28,076 వద్ద, నిఫ్టీ 3.45 పాయింట్ల నష్టంతో 8,639 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని ఐటీ, హెల్త్ కేర్ స్టాక్స్‌లో నెలకొన్న బలహీనత కారణంగా మార్కెట్లు నష్టాల్లో ఎంట్రీ ఇచ్చాయి. నేడు రాత్రి విడుదల కానున్న ఫెడ్ జూలై పాలసీ మీటింగ్‌పై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. తాజాగా విడుదలైన మెరుగైన జాబ్స్ డేటా అనంతరం ఫెడ్ రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లపై ఏవిధమైన సంకేతాలు ఇవ్వనుందోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడుస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హీరో మోటాకార్పొ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ లాభాలు పండిస్తుండగా.. టీసీఎస్, సన్ ఫార్మా, లుపిన్, సిప్లా, ఎస్బీఐ నష్టాలను గడిస్తున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు కూడా నష్టాల్లోనే పయనిస్తూ.. నిఫ్టీలో టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. ఇన్ఫీ స్టాక్ 1.27 శాతం పడిపోయింది. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 66.76గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 241 రూపాయల లాభంతో రూ.31,460గా కొనసాగుతోంది. -
బతికి చూపిస్తున్నారు
కష్టంమే పెట్టుబడి.. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా... తొలుత సహాయకులుగా, తర్వాత నిర్వాహకులుగా తలెత్తుకుని బతుకుతున్న చిరు వ్యాపారులు ఇతరజిల్లాలు, రాష్ట్రాల నుంచి వలసలు వందలాది కుటుంబాలకు కేంద్రంగా గోపాలపట్నం వారంతా ఎక్కడెక్కడి వారో...జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఆకలి బాధలు, ఆర్థిక చిక్కులు, కష్టాలు...నష్టాలను చూసిన వారు. కన్నీళ్లను దిగమింగుకుని కుటుంబాలతో సహా పల్లెలను వదిలి పట్నం వచ్చేశారు. ఎలాగోలా బతికేయాలని మనసు చంపుకోలేదు. ఎలాగైనా బతికి చూపించాలనుకున్నారు. తొలుత అక్కడక్కడా పనులుచేసి కాస్త కూడబెట్టుకున్నారు. ఆ మొత్తంతో చిరు వ్యాపారాలు ప్రారంభించారు. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకు విజయం ఎప్పటికీ బానిసే అన్నట్టు వీరు ఆయా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. నగరం మొత్తంమ్మీద వేల సంఖ్యలో చిరువ్యాపారులుండగా, ఒక్క గోపాలపట్నంలోనే దాదాపు 300 మంది వరకూ బతుకుబళ్లు లాగుతున్నారు. ఒకప్పుడు గోపాలపట్నం కూడా పల్లేటూరు అయినా పట్నం మహానగరంగా విస్తరించడం, వ్యాపారాల వద్దకు జనం కాకుండా...జనం చెంతకే వ్యాపారసంస్థలు చేరడం వీరికి వరమయింది. ఇపుడు చిరువ్యాపారులంతా చక్కని ప్రణాళికలతో ప్రజల అవసరాలు తీర్చే వ్యాపారాలతో జీవితాల్ని సాఫీగా వెళ్లదీస్తున్నారు. అనేకరకాల పండ్లు, కొబ్బరిబొండాలు, పకోడీ, నూడిల్స్,ఇడ్లీలు,దోసెలు, ఫ్యాన్సీ వస్తువులు, పిల్లల ఆటవస్తువులు, ఇంటికి ఉపయోగపడే చిన్నపాటి గృహోపకరణాలు, సరబత్లు, బూరలు, దుస్తులు..ఇలా ఎన్నో విక్రయిస్తున్నారు. ఇక్కడ స్థానికేతర వ్యాపారులే అత్యధికంగా కనిపిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల వారే కాక తెలంగాణ, రాజస్తాన్, జైపూర్, దిల్లీ నుంచి కూడా వచ్చి గోపాలపట్నంలో బతుకుపోరు సాగిస్తుండడం విశేషం. -గోపాలపట్నం దివిసీమ ఉప్పెనతో వచ్చేశా మాది అమలాపురం. 1996లో దివిసీమ ఉప్పెనతో కుటుంబం మొత్తం రోడ్డునపడ్డాం. ఎలా బతకాలో...భవిష్యత్తుపై భయమేసింది. పొట్ట చేతపట్టుకుని భార్యాపిల్లలతో ఇక్కడకు వచ్చేశా. తొలుత అక్కయ్యపాలెంలో ఓ తోపుడుబండి వ్యాపారి వద్ద చేరి పని నేర్చుకున్నాను. ఇపుడు గోపాలపట్నంలో రోడ్డుపై పకోడీ, పానీపూరీ, జిలేబీలు అమ్ముతున్నాను. సొంత ఇల్లు కట్టుకుని భార్యాపిల్లలతో క్షేమంగా ఉన్నాను. -పి.శ్రీనివాసరావు, పకోడీబండి వ్యాపారి బతకడం తెలుసుకున్నా పద్దెనిమిదేళ్లుగా గోపాలపట్నంలో తోపుడుబండి వేసుకుని పండ్ల వ్యాపారం చేస్తున్నాను. స్వస్థలం విజయనగరం జిల్లాలో ఓ కుగ్రామం. భార్యా ఇద్దరు పిల్లలతో బతుకుదామన్న సొంత ఊళ్లో పనిలేదు. జీవితం ఎలాగని భయపడ్డాను. కష్టంపై భారం వేసి గోపాలపట్నం వచ్చాను. తోపుడు బండిపై సీజన్ వారిగా పండ్లు అమ్ముకుని ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాను. పిల్లలను అందరిలాగే బాగా చదివించుకుంటున్నాను. -జి.మురళి, పండ్ల వ్యాపారి కష్టాన్ని నమ్ముకున్నా... మాది తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని సీతారామపురం. నిరుపేదకుటుంబం. 1982లోనే భార్యాపిల్లలతో గోపాలపట్నం వచ్చాను. పనుల కోసం తిరిగాను. ఒకరోజు పని ఉంటే రెండ్రోజులు లేని పరిస్థితి. స్వయంగా ఎదగాలని ఆలోచించాను. వలసజనంతో కాలనీలు పెరిగాయి. వ్యాపారసంస్థలూ పెరిగాయి. హోల్‌సేల్‌లో కొంచెం కొంచెం గాజులు, ఫ్యాన్సీ సామగ్రీ తెచ్చి తోపుడు బండిపై అమ్ముతున్నాను. సాయంత్రం వేళ మెయిన్‌రోడ్డులో రద్దీ ప్రాంతంలో, ఇతర సమయాల్లో కాలనీల్లోకి తిరిగి వ్యాపారం చేస్తున్నాను. కష్టం లేకుండా భార్యాపిల్లలను పోషిస్తున్నాను. -సువర్ణవెంకటరమణ, గాజుల వ్యాపారి ఎన్నో ఊళ్లు తిరిగా... హర్యానా నుంచి బతుకు దెరువు కోసం చాలా ప్రాంతాలు తిరిగాను. హైదరాబాద్, నూజివీడు తదితర ప్రాంతాల్లో పనిచేశాను. చివరికి విశాఖ వచ్చి ఓ వ్యాపారి వద్ద చేరాను. అలా అంచెలంచెలుగా శ్రమించి కాస్త ఆర్థికంగా పరిస్ధితి మెరుగుపరచుకున్నాను. సొంతంగా స్టాకు తెచ్చుకుని గోపాపట్నంలో ఫుట్‌పాత్‌పై వస్త్రాలు అమ్మి బతుకుతున్నాను. విశాఖ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. -ఎం.సునీల్, వస్త్రవ్యాపారి సీజన్‌వారీగా వస్తుంటా తెలంగాణ నుంచి గోపాలపట్నం వచ్చి బతుకుతున్నాను. స్వస్థలంలో టీవీ కవర్లు, టేబుల్ కవర్లు అమ్ముతున్నా అక్కడ పోటీ విపరీతంగా ఉండడం, ధరలు గిట్టుబాటు కాకపోవడంతో ఇలా సీజన్ సమయాల్లో, పండుగల వేళల్లో గోపాలపట్నం వచ్చి చిరు వ్యాపారం చేసి వెళ్తుంటాను. బతకడానికి ఇక్కడ బాగుంది. -అల్లె వాసు, కల్వకుర్తి, తెలంగాణ -
పోలీసు సిబ్బందికి పుష్కరపాట్లు
కనీస సౌకర్యాలు లేవు ఎండా, వానల్లో విధుల నిర్వహణ పొంతనలేని డ్యూటీలు రాజమహేంద్రవరం క్రైం: అంత్య పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్లలో పహారా, ఘాట్లకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 2,800 మంది పోలీస్ సిబ్బంది వచ్చారు. వీరికి కేటాయించిన సత్రాలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో కనీస సౌకర్యాలను కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని పోలీసులు పేర్కొంటున్నారు. డ్యూటీలకు పొంతన ఉండడం లేదని, తాము ఉండే షెల్టర్‌కు కనీసం రెండు నుంచి మూడు కి.మీ. దూరంలో విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా షెల్టర్‌కు చేరుకుంటే తాగేందుకు, స్నానం చేసేందుకు నీరు ఉండడం లేదని వాపోయారు. కొన్ని కమ్యూనిటీ హాళ్లలో అపరి శుభ్రమైన వాతావరణం ఉండడంతో దోమలు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాళ్లలో మరుగుదొడ్డి వసతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఏ, డీఏలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని, తమకు కనీస సౌకర్యలు కల్పించకపోవడం దారుణమంటున్నారు. ఇప్పటికే ఐదు రోజులు పూర్తి అయ్యాయని, భక్తులు అంతగా లేని ఘాట్లలో అవసరం అయిన పోలీస్ సిబ్బందిని నియమించాలని, అదనంగా ఉన్న పోలీస్ సిబ్బందిని తమ పోలీస్ స్టేషన్లకు పంపించేస్తే ఇబ్బందులు తగ్గుతాయంటున్నారు. కృష్ణా పుష్కరాలకు వెయ్యిమంది పోలీస్ సిబ్బంది అంత్య పుష్కరాలకు వినియోగించే పోలీస్ సిబ్బందిని కృష్ణా పుష్కరాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన అంత్య పుష్కరాలలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తి అయిన వెంటనే 11వ తేదీ రాత్రి కృష్ణా పుష్కరాలకు వెయ్యి మంది పోలీసులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముందుగా ఏర్పాట్లు చూసేందుకు ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 20 మంది యాంటీ ఎలిమినేట్స్ స్క్వాడ్లు కృష్ణా పుష్కరాలకు తరలించారు. భక్తుల రక్షణే ముఖ్యం భక్తులు లేరని పోలీస్ సిబ్బందిని తగ్గించడం సాధ్యం కాదు. పోలీస్ శాఖ అన్ని శాఖల కంటే భిన్నమైంది. యాత్రికులు లేరని ఘాట్లలో పోలీస్ భద్రత తగ్గించలేము. ఘాట్లలో భక్తులు సౌకర్యంగా స్నానం అచరించి తిరిగి వెళ్లేలా చేయడంతో పాటు ఘాట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీస్ శాఖపై ఉంది. భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా పోలీస్‌లను భద్రత కోసం వినియోగించాల్సిందే. భక్తులు, యాత్రికుల సేప్టీ, సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. –ఎం. రామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ -
ఆయకట్టు.. తీసికట్టు
సిబ్బంది కొరతతో పొలాలకు చేరని నీళ్లు 2 వేల క్షేత్రస్థాయి సిబ్బందికి గాను ప్రస్తుతం 700 మందే.. రెండేళ్లుగా ఒక్క పోస్టూ భర్తీ చేయని టీడీపీ ప్రభుత్వం నాగార్జున సాగర్.. రెండు జిల్లాల ప్రజల గుండె చప్పుడు.. తన పాదస్పర్శతో బీడు భూములను సైతం సిరుల పంటగా మార్చి రైతు ముంగిళ్లను ఆనంద పరవళ్లు తొక్కించే ప్రజా బాంధవి. తొండలు గుడ్లు పెట్టే భూములని చెప్పుకునే వాటికీ రూ.లక్షల ధర పలికిస్తూ.. ఆయకట్టును సస్యశ్యామలం చేస్తూ రైతు జీవనయానంలో మమేకమై సాగిపోతున్న రైతు నేస్తం.. ఇలాంటి సాగర్ నేడు పర్యవేక్షణ కరువై.. వివాదాలకు నెలవై తన పరిధిలో ఆయకట్టును కన్నీరు పెట్టిస్తోంది. తన బాగోగులు చూసుకోవాల్సిన సిబ్బందిని ప్రభుత్వం నియమించకపోవడంతో నిత్యం వేదనతో ఘోషిస్తోంది. నరసరావుపేట: నియోజకవర్గంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు భూములు నానాటికీ కళ తప్పుతున్నాయి. ఒక ఏడు సరైన వర్షాలు లేక ప్రాజెక్ట్ నుంచి సాగు నీరందలేదు. కొద్దోగొప్పో నీటిని విడుదల చేసినా ఆ నీరు రైతుల పొలాలకు చేరలేదు. కనీసం పశువులు, తాగునీటి అవసరాలకు సక్రమంగా నీటిని పంపిణీ చేసేందుకు కూడా కాలువలపై క్షేత్రస్థాయి సిబ్బంది లేరు. దీంతో సాగు నీరు పెట్టుకునే విషయంలో రైతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాజెక్ట్ నిర్మించినప్పటి కంటే ఇప్పుడు ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది. అయినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. నాగార్జునసాగర్ కుడికాలువ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 202 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉంది. కుడికాలువ కింద బ్రాంచ్, మేజర్, మైనర్ కాలువలు వందల కిలోమీటర్లలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో 11.74 లక్షల ఎకరాల ఆయకట్టు సాగర్ జలాలపై ఆధారపడి ఉంది. దీంతోపాటు అనుమతిలేని, ప్రభుత్వ లెక్కల్లోలేని సుమారు లక్ష ఎకరాలకు పైబడి మాగాణి, మెట్ట పంటలకు సాగు నీరు అందాల్సి ఉంది. కాలువల డిజైన్ సమయంలో మెట్ట భూములుగా స్థిరీకరణ చేసిన 6.85 లక్షల ఎకరాల్లో సుమారు 3.5 లక్షల ఎకరాలు మాగాణి భూములుగా మారాయి. తాగు నీటికీ ఇదే ఆధారం.. కొన్ని వందల చెరువులకు తాగునీరు, లక్షల్లో పశువుల కుంటలకు తాగు నీరు అందిస్తూ ఏటా 25 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తికి ఈ నీరే ఆధారమవుతోంది. కానీ ప్రాజెక్ట్ పరిధిలో క్షేత్రస్థాయి సిబ్బంది అయిన లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు సరిపడినంతlమంది లేరు. పెరిగిన మాగాణి భూముల ఆయకట్టు, ప్రభుత్వ లెక్కల్లో లేని ఒక లక్ష ఎకరాల మెట్ట, మాగాణి భూములు కొత్తగా సాగులోకి రావటంతో చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. నియామకాల ఊసే లేదు.. కొంతకాలంగా ఉద్యోగ విరమణ చేసిన, లేదా సర్వీసులో మతి చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించలేదు. పదోన్నతిపై బదిలీ అయిన ఖాళీలు, క్ష్రేత్రస్థాయి సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శాశ్వత ప్రాతిపదికపైన 2 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం 700 మందే పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లల్లో ఉద్యోగ విరమణల రూపంలో భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇటీవల తాగునీటి కోసం సాగర్ జలాలు విడుదల చేసిన సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది లేక పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాల్సి వచ్చింది. సిబ్బంది లేకపోతే సాగు, తాగు నీరు వినియోగం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారుతోంది. -
రైతు సమస్యల సమరశీల పోరాటాలే ఎజెండా
–ఈనెల 29 నుంచి 31 వరకు కడపలో రాష్ట్రస్థాయి వర్కషాపు –ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామచంద్రయ్య కడప అగ్రికల్చర్ : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలే ఎజెండాగా ముందుకు సాగాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రామచంద్రయ్య పిలుపు నిచ్చారు. ఆదివారం కడప నగరంలోని ఎద్దుల ఈశ్వరరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలక ప్రభుత్వాలు అధికారంలోకి రాక ముందు సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కిస్తామని, రైతులు తీసుకున్న రుణాలన్నింటిని మాఫీ చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకోగానే రుణమాఫీ మరచి కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేశారని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు ఒరిగిందేమి లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి కొరవడిన కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని అన్నారు. అటు ప్రభుత్వం నుంచి పరిహారం అందక, మరో పక్క రుణమాఫీకాక, బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించలేక అవమాన భారాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధకరమన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చందరబాబునాయుడు అటు ఉద్యానశాఖకు నిధుల్లో కోతకోసి, సాగు నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయించకుండా సాగు నీరు ఎలా ఇస్తారో, ఎలా హబ్‌గా మారుస్తారో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకషంగా చర్చించడానికి ఈనెల 29 నుంచి 31 కడపలో రాష్ట్రస్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, చంద్ర, కార్యనిర్వహక అధ్యక్షులు ఏవి రమణ, రైతు సంఘం నాయకులు రాహుల్, బాలచంద్రయ్య, మల్లిఖార్జునరెడ్డి, రామలింగారెడ్డి, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.