రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. జులై 12న అంగరంగ వైభవంగా జరగనున్న పెళ్లితో ఇద్దరు ఒక్కటవ్వనున్నారు. వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఫ్రీ వెడ్డింగ్ వేడుకులు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ తాన ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యలు, ఆ విషయంలో తన భార్య మద్దతు, అందిస్తున్న సహాయ సహకారాల గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
నిజానికి అనంత్ అంబానీ చిన్నతనంలో అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నారట. జంతువులంటే తనుకు ఎంతో ఇష్టమని వాటితో స్పెండ్ చేయడమే తనకు ఇష్టమని అన్నారు. అలాంటి నాకు రాధికాను కలిసి ఆమెతో మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందని చెప్పుకొచ్చారు. ఆమె కూడా తనలా జంతువులతో మెలిగే ఆటిట్యూడ్ తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందన్నారు. అలాగే తాను ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యల పట్ల తన కాబోయే భార్య ఇచ్చిన మద్ధతు తనను మరింత ఆమెకు దగ్గరయ్యేల చేసిందని అన్నారు. ఆమె తన జీవితంలో భార్యగా అడుపెట్టడం తన అదృష్టం అంటూ రాధికా మర్చంట్‌పై ప్రసంశల జల్లు కురిపించారు.
అనంత్ అధిక బరువు కారణం..
అనంత్ అంబానీ చిన్నతనం నుంచి ఊబకాయం, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అంతకు ముందు అనంత్ సుమారు 200 కిలోలకు పైగా బరువు ఉండేవాడు. ఆయనకు అత్యంత ఆస్తమా ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్‌లు ఇవ్వాల్సి వచ్చిందని నీతా అంబానీ ఒక ఇంటర్యూలో తన కొడుకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆస్తమా చికిత్స వల్లే అనంత్ అంతలా బరువు పెరిగేందుకు దారితీసిందని అన్నారు. ఈ ఆస్తమా ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ అనేవి అతడిలో ఆకలి కోరికను దారుణంగా పెంచేస్తాయిని, వాటి ఫలితంగానే అతడు అధిక బరువు ఉన్నాడని అన్నారు.
ఈ ట్రీట్‌మెంట్ తీసుకునే వ్యక్తులు ఖర్చు చేసేదాని కంటే ఎక్కువ కేలరీలు తీసుకునేలా చేస్తాయట. అదీగాక ఈ కార్టికోస్టెరాయిడ్స్ జీవక్రియను మార్చి కొవ్వు నిక్షేపణను ప్రోత్సహించి, కండరాల ప్రోటీన్ సంశ్లేషను నిరోధిస్తాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీంతో ముఖం పొత్తి కడుపు, వీపు వంటి ప్రాంతాల్లో కొవ్వు చేరిపోయి అధిక బరువుకి కారణమవుతుంది. ఇలా దీర్ఘకాలికి లేదా అధిక మోతాదులో స్టెరాయిడ్‌ల వాడితే అది అధిక బరువుకి సంబంధించిన సమస్యలకు కారణమవుతుందని నీతా చెప్పుకొచ్చారు.
ఇక అనంత్ ఎదుర్కొంటున్న ఈ ఆరోగ్య సమస్యల పట్ల ఆయన కాబోయ భార్య సానుకూలంగా స్పందించడమే తన వంతు మద్దతు సహాయ సహకారాలు అందిచేందుకు ముందుకు రావడం విశేషం. తన భార్య రాధికాను ఉద్దేశిస్తూ..ఏ భాగస్వామి అయినా ఇలాంటి మద్దుతు ఇస్తే ఆ వ్యక్తి సులభంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొననడమే గాక తొందరగా రికవరి అవ్వగలడని అనంత్ అంబాని ఉద్వేగంగా అన్నారు. దీనికి మించిన అద్భుతమైన మందు మరొకటి ఉండదన్నారు అనంత్ అంబానీ.
కాగ, కొన్నేళ్ల క్రితం అనంత్ అంబానీ 2016లో ఒక్కసారిగా చాలా సన్నమై కనిపించారు. 208 కిలోల ఉండే అనంత్ దాదాపు 108 కిలోలు బరువు తగ్గి ఏకంగా 100 కేజీలకు చేరారు కూడా. దీని కోసం చాలా కష్టపడ్డారు. రోజుకు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేశారు. రోజూ 21 కిలోమీటర్ల వరకు నడిచారు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఆధ్వర్యంలో కఠిన డైట్ పాటించి బరువు తగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు . కానీ ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే కొద్ది కాలంలోనే మళ్లీ అనూహ్యంగా బరువు పెరిగారు.
(చదవండి: వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా చర్మం నిత్య యవ్వనంలా ఉండాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment