
నార్త్ నుంచి వచ్చి ముందు సౌత్‌లో స్టార్ హీరోయిన్ అయ్యారు రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్ 2’, ‘అయలాన్’లో నటిస్తున్నారు. కాగా హిందీలో ఆమె నటించిన ‘ఛత్రీవాలీ’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్ సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్‌గా నటించారు. ‘‘కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడం.
చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు
అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మనం మారాలి. పిల్లలకు అవగాహన కల్పించాలి. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ఇక.. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రకుల్ చెబుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. ముంబైలో నేను కాండీవాలీలో ఉండేదాన్ని. కానీ నా ట్రైనర్‌తో కలిసి బాంద్రాలో ఒక కేఫ్‌లో కూర్చుని, ఏయే ఆఫీస్‌కి వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలి? అని ప్లాన్ చేసేదాన్ని. బాంద్రా, అంథేరీల్లో ఏమైనా ఆడిషన్స్ ఉంటే వెళ్లొచ్చని ఆ కేఫ్‌కి వెళ్లేదాన్ని.
చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా?
బ్యాగులో కొన్ని డ్రెస్సులు పెట్టుకుని, కారులోనే మార్చుకునేదాన్ని. చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. ఒక్కోసారి నాతో షూటింగ్ చేసి, వేరే హీరోయిన్‌ని తీసుకునేవారు. ఇదంతా నేను పోరాటం అనుకోలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే ‘పోరాటం’ అనే పదం నాకు నచ్చదు. ఆ రోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment