Priyanka Chopra Open Up About The Initial Struggling Days Of Her Career In Bollywood - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: మానసికంగా ఇబ్బందులు పడ్డా.. కానీ ఇప్పుడు: ప్రియాంక చోప్రా

Published Sat, May 27 2023 10:02 PM | Last Updated on Sun, May 28 2023 12:25 PM

Bollywood Actress Priyanka Chopra Reveals Career Struggles In Bollywood - Sakshi

బాలీవుడ్‌లో నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది.  కెరీర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది.  ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో భయపడినట్లు తెలిపింది.

(ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!)

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. '20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకునేదాన్ని. మానసికంగా ఇబ్బందులు పడ్డా. ఏదైనా సినిమా ఫెయిలైనా.. ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధపడేదాన్ని. నేను చూసిన బిగ్గెస్ట్‌ స్టార్స్‌తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక ఓ కూతురు కూడా జన్మించింది. తన ముద్దుల కూతురికి మేరీ మాల్టా అని పేరు పెట్టింది. 

(ఇది చదవండి: పొలిటీషియన్‌ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement