
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల తన సోదరుడి పెళ్లిలో మెరిసిన ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో నటించనుంది. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కించబోతున్న ఎస్ఎస్‌ఎంబీ29లో ప్రియాంక కనిపించనుంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ విచ్చేసిన ముద్దుగుమ్మ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించింది. ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసమే భాగ్యనగరానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి.
అయితే ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మధు చోప్రా తన కూతురి సినీ కెరీర్ గురించి మాట్లాడింది. గతంలో దళపతి విజయ్ సరసన ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. విజయ్‌కు జంటగా తమిజాన్ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ప్రియాంక చోప్రా నో చెప్పిందని ఆమె తెలిపింది. అయితే మూవీ మేకర్స్ నా భర్తను కలిసి మాట్లాడారని వెల్లడించారు. దీంతో ఆయన మాట కాదనలేక ప్రియాంక నటించిందని అసలు విషయం చెప్పింది మధు చోప్రా.
మధు చోప్రా తమిజన్ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ప్రియాంక మొదట ఆ ప్రాజెక్ట్‌కి నో చెప్పింది. కానీ వారు ప్రియాంక సోదరుడిని కలిశారు. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి మాట్లాడారు. కేవలం రెండు నెలల పాటు వేసవి సెలవుల్లో మా మూవీ షూట్‌కు సమయవివ్వండి అని అడిగారు. వారి మాట కాదనలేక ప్రియాంక చోప్రా ఫాదర్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి మాట కోసం ప్రియాంక చోప్రా నటించింది" అని తెలిపింది.
విజయ్ అంటే ప్రియాంకకు చాలా గౌరవం ఉందని మధు చోప్రా తెలిపింది. విజయ్ చాలా ఓపికతో ప్రియాంకకు సెట్స్‌లో సాయం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రభుదేవా బ్రదర్ రాజు సుందరం కొరియోగ్రాఫీలో స్టెప్పులు చాలా కఠినంగా ఉన్నాయి.. విజయ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్.. అతనితో ప్రియాంక డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడిందని పేర్కొంది. అలాగే కొత్త భాష నేర్చుకోవడం, డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడంలో విజయ్ సాయం సాయం చేశాడని మధు చోప్రా గుర్తు చేసుకుంది. ఇకపోతే ప్రియాంక చోప్రా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హెడ్స్ ఆఫ్ స్టేట్‌లోనూ కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment