Madhu Chopra
-
అమ్మా.. నేనూ నీతో వచ్చేస్తా...
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, వాళ్ల చిన్ననాటి సంగతులు తలచుకుని తల్లిదండ్రులు మురిసిపోతుండటం మామూలే. అయితే వారి హృదయాన్ని మెలిపెట్టి పశ్చాత్తానికి లోను చేసే జ్ఞాపకాలూ కొన్ని ఉంటాయి. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రాను ఇప్పటికీ బాధిస్తూ, కన్నీళ్లు పెట్టించే అలాంటి ఒక జ్ఞాపకం.. కూతురి చదువు విషయంలో తానెంతో కటువుగా ప్రవర్తించటం! ప్రియాంకను ఏడేళ్ల వయసులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు మధు చోప్రా‘‘నేను మంచి తల్లిని కాదేమో నాకు తెలీదు. ‘వద్దమ్మా.. ప్లీజ్..’ అని ఎంత వేడుకుంటున్నా వినకుండా నేను ప్రియాంకను బలవంతంగా బోర్డింగ్ స్కూల్లో చేర్పించాను. ప్రతి శనివారం సాయంత్రం నా డ్యూటీ అయిపోయాక ట్రెయిన్ ఎక్కి ప్రియాంకను చూడ్డానికి బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లే దాన్ని. ప్రియాంక అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. తను ఆ వాతావరణంలో ఇమడలేక పోయింది. ‘‘అమ్మా.. నేనూ నీతో ఇంటికి వచ్చేస్తా..’’ అని నన్ను చుట్టుకుపోయి ఏడ్చేది. ఆ ఏడుపు ఇప్పుడు గుర్తొస్తే నాకూ కన్నీళ్లొచ్చేస్తాయి. ‘లేదు, నువ్విక్కడ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది’ అని చెప్పేదాన్ని. తనకేమీ అర్థమయ్యేది కాదు. తన కోసం నేను ఆదివారం కూడా అక్కడే ఉండిపోయేదాన్ని. అది చూసి ప్రియాంక టీచర్ ఒకరోజు నాతో ‘మీరిక ఇక్కడికి రావటం ఆపేయండి’ అని గట్టిగా చెప్పేశారు..‘ అని ‘సమ్‌థింగ్ బిగ్గర్ టాక్ షో’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు మధు చోప్రా.ప్రియాంక తండ్రి అశోక్ చోప్రాకు ప్రియాంకను బోర్డింగ్ స్కూల్లో చేర్పించటం అస్సలు ఇష్టం లేదు. అయితే మధు చోప్రా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. కొంతకాలం ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు కూడా. (ఇప్పుడు ఆయన లేరు). ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ – ‘‘ప్రియాంక తెలివైన అమ్మాయి. ఆ తెలివికి పదును పెట్టించకపోతే తల్లిగా నా బాధ్యతను సరిగా నెరవేర్చినట్లు కాదు అనిపించింది. అందుకే లక్నోలోని లా మార్టినియర్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలనుకున్నాను. అందులో సీటు కోసం ప్రియాంక చేత ఎంట్రెన్స్ టెస్టు కూడా రాయించాను. తను చక్కగా రాసింది. అడ్మిషన్ వచ్చేసింది. ఆ విషయాన్ని నా భర్తకు చెబితే ఆయన నాపై ఇంతెత్తున లేచారు. ‘ఇదే నీ నిర్ణయం అయితే, వచ్చే ఫలితానికి కూడా నువ్వే బాధ్యురాలివి’ అని అన్నారు. ఏమైతేనేం చివరికి అంతా బాగానే జరిగింది. ప్రియాంక తన కాళ్లపై తను నిలబడింది’’ అని ΄ాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు మధు చోప్రా.పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు వారిని దూరంగా ఉంచవలసి వచ్చినందుకు బాధపడటం సహజమే. అయితే పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే యజ్ఞంలో ఆ బాధ ఒక ఆవగింజంత మాత్రమే. -
విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తర్వాత ప్రియాంక చోప్రా సినిమాల్లో అడుగుపెట్టింది. దళపతి విజయ్ 'తమిళన్' చిత్రంతో వెండితెరపై కథానాయికగా మెరిసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న కోరిక, ఇష్టం ప్రియాంకకు అస్సలు ఉండేది కాదని చెప్తోంది ఆమె తల్లి మధు చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రియాంక ఎన్నడూ అనుకోలేదు. ఆమెకు తొలిసారి సౌత్ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. ఛాన్స్ మిస్ చేసుకోవద్దని..ఆ విషయం తనకు చెప్తే ఏడ్చేసింది. నేను సినిమాలు చేయనని కన్నీళ్లు పెట్టుకుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పాను. అలా తమిళన్ చిత్రానికి సంతకం చేసింది. షూటింగ్ చేస్తుండేకొద్దీ తనకు యాక్టింగ్ మీద ఆసక్తి, ఇష్టం ఏర్పడింది. భాష రాకపోయినా ఎంజాయ్ చేసింది. చిత్రయూనిట్ కూడా తనను ఎంతో బాగా చూసుకుంది. హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనొక జెంటిల్మెన్. ఈ మూవీలో రాజు సుందరం కొరియోగ్రాఫర్. డ్యాన్స్ రాదుప్రియాంకకు పెద్దగా డ్యాన్స్ రాదు. విజయ్‌తో స్టెప్పులేసేందుకు చాలా కష్టపడింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొరియోగ్రాఫర్‌తో కలిసి ప్రాక్టీస్ చేసేది. ఇష్టంగా పని నేర్చుకుంది. ఆ వాతావరణం నచ్చడంతో సినిమాను కెరీర్‌గా ఎంచుకుంది అని తెలిపింది. తమిళ్లో ఒకే ఒక్క సినిమా చేసిన ప్రియాంక చోప్రా తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. అనంతరం హాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది.చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్ ఆంటోని -
ప్రియాంక భర్త డైరెక్ట్‌గా నన్నే అడిగాడు: హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఓ కూతురు కూడా జన్మించారు.అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా స్పందించారు. ఈ జంట మధ్య పదేళ్ల వయసు తేడా ఉండడంతో ఎలాంటి ప్రభావం ఉందన్న విషయంపై ఆమె మాట్లాడారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు వయసు అనేది పెద్ద మ్యాటర్ కాదని ఆమె అన్నారు.మధు చోప్రా మాట్లాడుతూ.."ప్రియాంక, నిక్ మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అబ్బాయి మంచివాడు. ఒకరినొకరు బాగా చూసుకుంటారు. నేను వారి గురించి చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలు వారి వయసు పట్ల ఏమైనా మాట్లాడతారు. కానీ అవేమీ నేను పట్టించుకోను. నిక్ ఇండియాకు వచ్చి ప్రియాంక లేనప్పుడు నన్ను లంచ్‌కి తీసుకెళ్లాడు. ప్రియాంక కోసం ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారని నిక్ నన్ను అడిగాడు. అన్ని లక్షణాలను అతనికి వివరించా. నా మాటలు విని నేను ఆ వ్యక్తిని కాగలనా? అని డైరెక్ట్‌గా అడిగాడు. ప్రియాంకను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని మాటిస్తున్నా అని చెప్పాడు. అతని మాటలకు నేను ఆశ్చర్యపోయా. కానీ వెంటనే ఓకే చెప్పాను' అని వివరించారు.కాగా.. ప్రియాంక, నిక్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అదే ఏడాది డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వారు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022లో కుమార్తె జన్మించింది. వీరి మధ్య పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. -
నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ
Madhu Chopra Respond On Her Priyanka Chopra And Nick Jonas Divorce Rumors: గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారా? అంటూ నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ ప్రొఫైల్‌లో నేమ్ నుంచి భర్త నిక్ జోనస్ ఇంటి పేరును తీసేసింది. దీంతో టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య-సమంత బాటలోనే ఈ గ్లోబల్ జంట నడుస్తుందని, త్వరలోనే వీరు కూడా విడాకుల ప్రకటన ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. చదవండి: Priyanka Chopra And Nick Jonas: భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? ఈ నేపథ్యంలో ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తలపై స్పందించింది. సోమవారం సాయంత్రం ఆమె న్యూస్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రియాంక-నిక్‌ల విడాకులంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక-నిక్ విడాకులపై వస్తున్న వార్తలను నమ్మొద్దని, అవన్నీ వట్టి పుకార్లేనని ఆమె స్పష్టం చేసింది. అంతేగాక ఇలాంటి ఆసత్య ప్రచారాలను వైరల్ చేయొద్దని ఆమె నెటిజన్లను కోరింది. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి కాగా ఇటీవల ప్రియాంక-నిక్‌లు కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గృహ ప్రవేశం చేసి కొత్త ఇంటికి మకాం మార్చిన ఈ జంట అక్కడ దీపావళి వేడుకులను ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వారి సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. కాగా 2018 డిసెంబర్ 1న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు రోజుల పాటు వీరి వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. -
మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత అమ్మ నాతో..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ నాటి సంఘటనను గుర్తు చేసుకుని ఆ క్షణంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వీడియోను ప్రియాంక మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాక తను కిరీటం ధరించిన అనంతరం ఆమె తల్లి మధు చోప్రా తనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘మిస్ వరల్డ్ 2000 నాటి వీడియో ఇది. అప్పుడే నాకు 18 సంవత్సరాలు నిండాయి. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నాను. ఆ తర్వాత స్టేజ్‌పై నా కుటుంబాన్ని కలుసుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెంటనే మా అమ్మ నాతో ‘బేబీ ఇప్పడు నీ చదువు సంగతేంటి? అన్నారు’ అంటూ ఇన్‌స్టాలో ప్రియాంక రాసుకొచ్చారు. ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియో.. ముగ్గురు ఫైనలిస్టులలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిందని ప్రకటించిన క్షణంతో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రియాంక భావోద్యేగంతో మిగతా ఇద్దరూ కంటెస్టంట్లను కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత ఆమె తలపై కిరీటాన్ని ధరిస్తారు. (చదవండి: హత్రాస్ ఘటన: ‘ఎంతమంది నిర్భయలు బలి కావాలి’) ఈ వీడియో గురించి ప్రియాంక ఆమె తల్లి మధు చోప్రా ఆ సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి మాట్లాడుకుంటారు. ప్రియాంక తన తల్లిని ‘మామ్ నేను కిరీటం గెలుచుకున్న క్షణాలు గుర్తున్నాయా’ అని అడుగుతుంది. దీనికి ఆమె తల్లి సమాధానం ఇస్తూ.. ‘ముగ్గురు ఫైనలిస్టులో నిన్ను విన్నర్‌గా ప్రకటించగానే హాల్ అంతా చప్పట్లు, అరుపులతో మారుమ్రోగింది. ఆ క్షణం నేను భావోద్యేగానికి లోనయ్యాను. నా కళ్ల నిండా నీళ్లు తిరగాయి. నేను నిన్ను కౌగిలించకున్నాక కిరీటం గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, నీకు శుభాకాంక్షలు తెలిపాలి. దానికి బదులుగా బేబీ ఇప్పుడు నీ చదువు విషయం ఏంటి అని తెలివి తక్కువగా ప్రశ్నించాను’ అని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక సోదరుడు కూడా వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. తన సోదరి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఆ క్షణంలో తనలో మెదిలిన ఆలోచనలు పంచుకున్నాడు. (చదవండి: అప్పుడు నేను ఏం ధరించాను? : ప్రియాంక) ‘అప్పుడు నేను 11 లేదా 12 సంవత్సరాలు ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. నువ్వు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోగానే నాలో ఎన్నో రకాల ఆలోచనలు ఒక్కాసారిగా మెదిలాయి. నువ్వు గెలిచినందుకు చాలా సంతోషించాను కానీ మరు క్షణమే నేను నా చదువుల కోసం అమెరికా వెళ్లాలని ఆలోచించాను’ అంటూ చెప్పకొచ్చాడు. దీంతో ప్రియాంక మధ్యలో స్పందిస్తూ.. అవును ఆక్షణాలు కొంచం గజిబిజిగా ఉన్నాయి. నేను కూడా నా విజయం తర్వాత నా కుటుంబం ఎలా స్పందిస్తుంది, ఏమి అనుకుంటుందో అని కూడా ఆలోచించలేదు’ అని అన్నారు. కాగా ప్రియాంక 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం ఒక విశేషం అయితే అదే ఏడాదిలో నటి లారా దత్తా కూడా మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకోవడం మరో విశేషం. భారత్ తరపు మిస్ వరల్డ్‌కు ప్రియాంక చొప్రా, మిస్ యూనివర్స్‌గా లారా దత్తాలు అందాలా పోటీ వేదికలకు ప్రాతినిధ్యం వహించి ఇండియాకు రెండు ప్రతిష్టాత్మక టైటిల్‌లను తెచ్చిపెట్టారు. -
ఆ డ్రెస్ నాకు బాగా నచ్చింది: ప్రియాంక తల్లి
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గ్రామీ ఫ్రాక్‌పై తాజగా ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు. ప్రియాంక ఓ ఆవార్డుల ఫంక్షన్లో ధరించిన గ్రామీడ్రెస్ తనకు బాగా నచ్చిందన్నారు. అంతేగాక ప్రియాంక డ్రెస్‌పై వచ్చిన విమర్శలు ఇంకా తనని బలవంతురాలిని చేశాయంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ప్రియాంక డ్రెస్ నచ్చింది. ముందే ఆ ఫ్రాక్ నమూనాను నాకు చూపించింది. అయితే అప్పుడు దానిని క్యారీ చేయడం కాస్తా కష్టమెమో అనుకున్నాను. కానీ ప్రియాంక దాన్ని అనుకున్నదాని కంటే బాగా హ్యండిల్ చేయగలిగింది. తాను ధరించే ఉత్తమమైనా దుస్తుల్లో ఇది ఒకటి’ అంటూ మధు చెప్పుకొచ్చారు. కాగా అమెరికా లాస్ఏంజెల్స్లో గ్రామీ అవార్డుల కార్యక్రమాన్ని ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్లో ప్రియాంక అందాలను ఆరబోస్తూ దుస్తులను ధరించింది. అయితే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రియాంక అలాంటి దుస్తులతో హాజరవడమేంటని ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రముఖ డిజైనర్ వెండల్ రాడ్రిక్స్ సైతం ఆమె డ్రెస్‌ను విమర్శించాడు. కొన్ని రకాల బట్టలు ఏ వయసులో వేసుకోవాలో ఆ వయసులోనే ధరించాలని ప్రియాంకకు సూచించాడు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అతను ఆ పోస్ట్‌ను తొలగించి.. తాను ప్రియాంక డ్రెస్సును మాత్రమే విమర్శించానని, ఆమెను కాదని వివరణ ఇచ్చాడు. -
నా బాయ్‌ఫ్రెండ్స్ నుంచి భర్త వరకూ..!
ఆకాశంలో సగం కాదు.. ఆకాశం మొత్తం తనే అయ్యారు ప్రియాంక. మామూలు ఆకాశం కాదు. సినీ వినీలాకాశం! నింగీ నాదే, నేలా నాదే అని చేతులు చాచారు. బాలీవుడ్ ఆమెదే అయింది. హాలీవుడ్ ఆమెదే అయింది. సినిమాలు.. సీరియళ్లు.. ప్రేమ.. పెళ్లి.. ఇప్పుడు..‘ది స్కై ఈజ్ పింక్’! ఈ చిత్రంతో ‘ప్రియాంక ఈజ్ ద స్కై’ అనిపించారు. ఈ ‘స్కై’ని సాక్షి అందుకుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ తీసుకుంది. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్ అయి హాలీవుడ్ వరకూ వెళ్లిన మీ జర్నీ గురించి కొన్ని మాటలు... ప్రియాంక: ఈ ప్రయాణంలో చాలామంది సహాయం ఉంది. వాళ్లందరికీ ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పనిని గుర్తించి అభినందించినప్పుడు కలిగే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అభినందనలే ఇంకా ఇంకా బాగా పని చేయడానికి ఉత్సాహాన్నిస్తాయి. ఎవరి అండా లేకుండా ఒంటరిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. చాలా హార్డ్‌వర్క్ చేశాను. నా ముఖం మీదే తలుపులేసిన సందర్భాలున్నాయి. అలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురైనప్పటికీ నేను అదృష్టవంతురాలినే. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడే అవకాశాలు కూడా వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ‘సక్సెస్’ ఖాయం అని నా ఒపీనియన్. ‘ఇది మన కెరీర్‌కి ఉపయోగపడుతుంది’ అనిపించిన ఏ అవకాశాన్నీ తేలికగా తీసుకోలేదు. ఆ క్యారెక్టర్ల కోసం ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. ఇప్పటికీ పడుతున్నాను. ఎప్పటికీ కష్టపడతాను. ఈ జర్నీలో రాళ్ల బాట చూశాను. పూల బాటకు ఆ రాళ్ల బాట ఉపయోగపడింది. కొన్నిసార్లు కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. అప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటి సమయాల్లో కొంచెం నిరుత్సాహం ఉంటుంది. అయితే జీవితంలో నేను నమ్మేదేంటంటే... ప్రతి ఫెయిల్యూర్ని సవాల్‌గా తీసుకుని ఎదగాలని. నాకెప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త పనులు చేయాలన్నా ఇష్టం. మీరు నా కెరీర్‌ని గమనిస్తే అది అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ‘ఇలాంటి పాత్రలే చేయాలి’ అనే హద్దులను నటిగా చెరిపేయాలనుకున్నాను. నిర్మాతగా కూడా జస్ట్ కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాదల్చుకోలేదు. మా పర్పుల్ పెబెల్ పిక్చర్స్‌పై తీసిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇంకా పంజాబీ, భోజ్‌పురి భాషల్లో కూడా మంచి సినిమాలు నిర్మించాం. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త సినిమాలను, తమను కదిలించే కథలను చూడ్డానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. వరల్డ్ సినిమాల్లో ఉండటానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. కథానాయికగా మరో మూడేళ్లల్లో 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటారు. హీరోయిన్గా తమిళ చిత్రం ‘తమిళన్’ (2002)తో స్టార్ట్ అయ్యారు. ఇన్నేళ్ల కెరీర్ మీకు నేర్పించిన విషయాలేంటి? జీవితం చాలా నేర్పిస్తుంది. ఒడిదుడుకులను దాటుకుంటూ ఈదమని చెబుతుంది. అలాంటి క్లిష్టమైన సమయాల్లో ఓ ‘వారియర్’లా మారిపోవాలి. ఆటను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాలి. పరిస్థితులు తలకిందులుగా ఉన్నప్పుడు మనం ఎలా లేవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం ఫెయిల్యూర్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఒక అపజయం తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మనకు మనమే ఆదర్శంగా నిలవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనం నమ్మాలి. సమస్యలు ఎదురైనప్పుడు ‘మన బలం ఏంటి?’ అని ఆలోచించా. ఆ బలం తెలుసుకుని, ఆ దిశగా వర్కవుట్ చేయడం మొదలుపెట్టా. నా ముఖం మీదే తలుపులు వేశారని చెప్పాను కదా. అప్పుడు నేనేం కుంగిపోలేదు. మనల్ని మనం నిరూపించుకుంటే మనం ఏ పని చేయాలనుకుంటున్నామో దాన్ని డిమాండ్ చేసే స్థాయిలో ఉంటాం అని నమ్మాను. నిరూపించుకోవడానికి కష్టపడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేస్తున్నాను. బాలీవుడ్ స్క్రీన్ మిమ్మల్ని బాగా మిస్సవుతోంది. మూడేళ్ల తర్వాత ‘ది స్కైజ్ ఈజ్ పింక్’తో మళ్లీ హిందీ తెరపై కనిపించారు. మీకెంతో ఇచ్చిన హిందీ పరిశ్రమను మిస్సవుతున్న ఫీలింగ్ లేదా? ‘జై గంగాజల్’ (2016) తర్వాత హిందీ సినిమా చేయాలనుకున్నాను. చాలా కథలు కూడా విన్నాను. అప్పటికే అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ టెలికాస్ట్ కూడా మొదలైంది. ఈ సిరీస్ త్రీ సీజన్స్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్‌కి ఎక్కువ టైమ్ పట్టేసింది. హిందీ సినిమా చేయాలని ఉన్నా చేయలేకపోయాను. ఫైనల్లీ ‘ది స్కై ఈజ్ పింక్’తో మళ్లీ హిందీ ప్రేక్షకులకు కనిపించాను. ఈ మూడేళ్లల్లోనే సినిమాలపరంగా చాలా మార్పొచ్చింది. }‘ది స్కై ఈజ్ పింక్’ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం మళ్లీ హిందీలో చేయాలనా? కథ బాగా నచ్చిందా? నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఈ కథ నా దగ్గరకు వచ్చింది. కథ చదివాక ఇది పక్కన పెట్టేసే స్క్రిప్ట్ కాదనిపించింది. ‘కేర్‌టేకర్స్’ గురించి ఆలోచింపజేసిన కథ అది. నాకు తెలిసి వాళ్లను ఎవరూ గుర్తు పెట్టుకోరు. నాకు మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేని రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు మా అమ్మగారు పక్కనే ఉండి చాలా కేర్ తీసుకున్నారు. ఒక వ్యక్తికి బాగా లేకపోతే ఇంటిల్లిపాదీ బాధపడతాం. మనకు ఇష్టమైన వ్యక్తి మన కళ్లముందే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. అది ఆ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలు ఆ కథలో ఉన్నాయి. వ్యక్తిగతంగా మా నాన్నగారి పరిస్థితి చూశాను. అలాంటి అంశాలతో ఉన్న ఈ కథ నన్ను బాగా కదిలించింది. ‘ది స్కైజ్ ఈజ్ పింక్’కి నటిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు తీసుకోవడం ఎలా అనిపించింది? ఒక ఆర్టిస్ట్‌గా సినిమా చేసిన తర్వాత జస్ట్ ప్రమోట్ చేస్తే చాలు. వేరే ఏ బాధ్యతలూ ఉండవు. కానీ నిర్మాత బాధ్యత చాలా పెద్దది. ఒక సినిమాకి 150 మంది పని చేస్తున్నారంటే అందరి బాధ్యత ఒక్క నిర్మాతదే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ చాలా పని ఉంటుంది. బరువైన బాధ్యత అయినా ఇష్టంగా చేశాను. ఎందుకంటే ‘ది స్కైజ్ ఈజ్ పింక్’ కథ అందరికీ చెప్పాలి. నటిగా తెరపై చెబుతాను. కానీ నిర్మాతగా కూడా చేస్తే ఇంకా సంతృప్తి ఉంటుందనిపించింది. అందుకే నేను ఒక నిర్మాతగా చేశాను. ఈ చిత్రం లొకేషన్లో మరచిపోలేని సంఘటన ఏదైనా జరిగిందా? ఇది చాలా ఎమోషనల్ మూవీ. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పిన తర్వాత బరువైన మనసుతో ఇంటికి వెళ్లేదాన్ని. సినిమాలో అయేషా చౌదరి (జైరా వాసిమ్) కి ఆరోగ్యం బాగుండదు. జీవితకాలాన్ని పొడిగించాలంటే తను ఆపరేషన్ చేయించుకోవాలి. కానీ దానివల్ల మంచాన పడే అవకాశం ఉన్నందున సర్జరీ చేయించుకోనని తల్లి అదితీ చౌదరీ (ప్రియాంకా చోప్రా)కి చెబుతుంది. కూతురి నిర్ణయాన్ని తల్లి ఆమోదిస్తుంది. ఓ తల్లి తన బిడ్డని కోల్పోవడం అంటే అది ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవడానికి తల్లే కానవసరంలేదు. కానీ ఈ సీన్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ ఎలా చూపించాలని చిత్రదర్శకురాలు సోనాలీ బోస్ దగ్గర అడిగాను. అప్పుడామె ‘నా నిజజీవితంలో జరిగిన ఘటన ఇది. అనారోగ్యంతో నా కుమారుడు చనిపోయాడు’ అని చాలా ఎమోషనల్‌గా అన్నారు. అంతే.. నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. ఆ రోజు షూటింగ్లో ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడు కలిగిన ఆ బాధను ఎప్పటికీ మరచిపోలేను. ‘ది స్కైజ్ ఈజ్ పింక్’ అంటే చాలు.. నాకు ఎక్కువగా గుర్తొచ్చే విషయం ఇదే. సినిమాలో ఓ తల్లిగా కూతురి మీద మీకు అమితమైన ప్రేమ ఉంది. నిజజీవితంలో మీ అమ్మ మధు చోప్రాతో మీ బాండింగ్ గురించి? ఈ సినిమాలో తల్లి తన కూతుర్ని చాలా ప్రేమిస్తుంది. ఓ ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తుంది. నిజజీవితంలో మా అమ్మ నాతో అలానే ఉంటారు. మేమిద్దరం కలిసి పార్టీలకు వెళతాం లేదా వేరే ఈవెంట్స్‌కి వెళతాం. నాకు సంబంధించిన ప్రతి విషయం ఆమెకు తెలుసు. నా బాయ్‌ఫ్రెండ్స్ నుంచి భర్త వరకూ ఇప్పటివరకూ నా జీవితంలో జరిగిన ప్రతిదీ మా అమ్మకు తెలుసు. నీ లైఫ్‌లో నీకు బెస్ట్ పర్సన్ ఎవరు? అంటే ‘మా అమ్మ’ అంటాను. నా తల్లి నాతో ఎలా ఉన్నారో నేను సినిమాలో అలానే ఉన్నాను. మీ భర్త నిక్ జోనస్ ‘స్కైజ్ ఈజ్ పింక్’ షూటింగ్ లొకేషన్‌కి వచ్చినప్పుడు కంట తడిపెట్టుకున్నారని విన్నాం. బహుశా మీరు ఎమోషనల్ సీన్లో నటిస్తున్నప్పుడే ఆయన ఎమోషన్ అయ్యారా? మా పెళ్లికి నాలుగు రోజుల ముందు వరకూ నేను ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. లొకేషన్‌కి నిక్ వచ్చేవాడు. షాట్ గ్యాప్‌లో మేమిద్దరం పెళ్లి పనుల గురించి మాట్లాడుకునేవాళ్లం. ‘పెళ్లి పనులు నేను చూసుకుంటాలే. నువ్వు కూల్‌గా షూటింగ్ చేసుకో’ అన్నారు. ఎందుకంటే ఇది ఎమోషనల్ మూవీ అని తనకు తెలుసు. నిక్ షూటింగ్ స్పాట్‌కి వచ్చిన రోజు ఎమోషనల్ సీన్ షూట్ జరుగుతోంది. మా సోనాలీకి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్లుగా వినిపించిందట. చూస్తే.. తన పక్కనే ఉన్న నిక్ ఏడుస్తుండటం ఆమెకు కనిపించింది. ‘నీ భర్తను ఏడిపించేశావ్. ఇది చాలా గొప్ప సీన్’ అని ఆమె అన్నారు. ఫైనల్లీ.. హైదరాబాద్ బిర్యానీ గురించి? నేను ఫుడ్ లవర్ని. నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. – డి.జి. భవాని ఇక్కడ తిరుగులేని స్టార్ హీరోయిన్ అనిపించుకుని, విదేశాల్లో కొత్త నటిగా జర్నీ మొదలు పెట్టినప్పుడు ఎలా అనిపించింది? వేరే దేశానికి వెళ్లి, ‘నేను ప్రియాంకా చోప్రా.. ఇండియన్ యాక్టర్‌ని’ అని పరిచయం చేసుకున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్డ్. అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడాలి. మామూలుగా చిన్న వయసులో కెరీర్ ఆరంభిస్తే, ఓ 30 ఏళ్లు వచ్చేసరికి సెటిల్ అయిపోతాం. బాలీవుడ్లో అలానే సెటిల్ అయ్యాను. కానీ, 30 ఏళ్లు దాటాక విదేశాల్లో కెరీర్లో మొదలుపెట్టడం సవాల్‌గా అనిపించింది. అయితే ఎంజాయబుల్గానే ఉంది. మీ భర్త నిక్ జోనస్‌తో విదేశాల్లో స్థిరపడటం ఎలా ఉంది? మ్యారీడ్ లైఫ్ ప్లాన్స్ గురించి? ముంబైకి దూరంగా ఉంటున్నాను. అయితే నేను ఎక్కడున్నా నా చుట్టూ నేను ప్రేమించేవాళ్లు ఉంటే చాలు.. నేను ఆనందంగా ఉంటాను. వైవాహిక జీవితం విషయానికి వస్తే... ప్రస్తుతం నా ‘విష్ లిస్ట్’లో ప్రధానంగా రెండు కోరికలు ఉన్నాయి. ఒకటి లాస్ ఏంజిల్స్‌లో ఇల్లు కొనడం.. రెండు.. తల్లి కావడం. మాతృత్వం తాలూకు అనుభూతిని ఆస్వాదించాలని ఉంది. అయితే అది వచ్చే రెండు మూడేళ్లల్లో మాత్రం ఉండదనే అనుకుంటున్నాను. ►గత గురువారం కర్వా చౌత్ పండగ. ఉత్తరాదివారు జరుపుకునే పండగ ఇది. భర్త క్షేమం కోరి రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రుడిని చూశాక ఆహారం తీసుకుంటారు. హిందీ పరిశ్రమలో చాలామంది తారలు ఉపవాసం ఉన్నారు. ఇది ప్రియాంకా చోప్రాకి తొలి కర్వా చౌత్. భర్తతో కాలిఫోర్నియాలో ఉన్న ప్రియాంకా కర్వా చౌత్ పండగ చేసుకున్నారు. ‘‘నా భార్య భారతీయురాలు. తను హిందు. తన సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు చెప్పింది. తనంటే నాకు చాలా ప్రేమ, ఆరాధన. పండగ రోజు మేం చాలా సరదాగా గడిపాం’’ అని నిక్ జోనస్ ఈ పండగ ఫొటోను షేర్ చేశారు. ‘‘మై ఎవిరీథింగ్’’ అని ప్రియాంక పేర్కొన్నారు. -
ఆ విషయం వాడినే అడగండి: ప్రియాంక
ఇతరుల జీవితం గురించి మాట్లాడే హక్కు తనకు లేదని గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తాను జోక్యం చేసుకోనని..తన తమ్ముడు కూడా ఇందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలం కిందట తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ.. పెళ్లికి కొన్నిరోజుల ముందే ఆమెకు బ్రేకప్ చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోవడానికి సిద్ధార్థ ప్రవర్తనే కారణం అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం అతడు నటి నీలం ఉపాధ్యాయతో డేటింగ్ చేస్తున్నట్లు బౌ-టౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇటీవల గణేశ్ చతుర్థి సందర్భంగా సిద్ధార్థ నీలంతో కలిసి అంబానీ ఇంట వేడుకలకు హాజరయ్యారు. అదే విధంగా ప్రతీ పార్టీకి నీలంతో కలిసి సందడి చేస్తున్నాడు. ఈ పార్టీలకు ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా హాజరవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. ఇప్పటికే ఓ అమ్మాయికి ఆశలు కల్పించి వదిలేశారు. మళ్లీ ఇలా చేయడం సరైందేనా అంటూ ప్రియాంక కుటుంబ సభ్యులను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడి వ్యవహారం గురించి ప్రియాంకను ప్రశ్నించగా..‘ ఇతరుల జీవితం గురించి నేను పట్టించుకోను. వేరే వాళ్ల వ్యక్తిగత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు. సిద్దార్థను కలిసినపుడు వాడినే వీటి గురించి అడిగితే బాగుంటుంది’ అని సమాధానమిచ్చారు. కాగా సిద్దార్థ- ఇషితాల నిశ్చితార్థానికి భర్త నిక్ జోనస్‌తో సహా ప్రియాంక హాజరైన సంగతి తెలిసిందే. -
అందుకే ఆ పెళ్లి ఆగిపోయింది!
హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే దానిపై ప్రియాంక తల్లి మధు చోప్రా పెదవి విప్పారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, కొంచెం సమయం కావాలని సిద్ధార్థ చెప్పడంతో పెళ్లి రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో సిద్ధార్థ చోప్రా వివాహం జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇషితకు అత్యవసర శస్త్రచికిత్స జరగడం వల్లే పెళ్లి రద్దైందని తొలుత ఊహాగానాలు వచ్చాయి. సిద్ధార్థ సిద్ధంగా లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయిందని తాజాగా రుజువైంది. మరోవైపు ఇషితా కుమార్‌కు ఆమె తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. పెళ్లి ఆగిపోయినందుకు బాధ పడొద్దని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భరోసాయిచ్చారు. సిద్ధార్థ కంటే మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరుకుతాడని ధైర్యం చెప్పారు. (చదవండి: ఆగిన ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి!) -
ప్రియాంకపై విమర్శలు.. మద్దతిచ్చిన తల్లి
ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్న దగ్గర నుంచి విమర్శించే వాళ్లు ఎక్కువ అయ్యారు. మొన్నటికి మొన్న హలీవుడ్ మ్యాగ్జైన్ ఒకటి ప్రియాంకను గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్ అని.. నిక్ జోనస్‌కి ఇష్టం లేకుండానే ప్రియాంక, అతన్ని పెళ్లి చేసుకుందని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిక్ ఆ బంధం నుంచి తప్పుకుంటే మంచిదని కారు కూతలు కూసిన సంగతి తెలిసిందే. కానీ ప్రియాంక మాత్రం ఈ విషయాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. తాజాగా మరో మహిళ ప్రియాంకను ఉద్దేశిస్తూ ఇలానే ఓ ట్వీట్ చేశారు. దీపికా భరద్వాజ్ అనే ట్విట్టర్ యూజర్ ‘గట్టిగా అరచి మరి చెప్తారు. కేవలం బిడ్డల్ని కనడానికే తప్ప ఇతర ఏ విషయాల్లోను నాకు పురుషుడితో అవసరం లేదు అని. కానీ వారికి తగిన వాడు దొరికిన మరు క్షణంలోనే అందరిలానే అందమైన వధువుగా తయారవుతారు. అతనో సూర్యుడు, చంద్రుడు, ఓ తార అన్నట్లు మాట్లాడతారు. సింధూరం ధరిస్తారు.. ఆఖరుకి పేరును కూడా మార్చుకుంటారు. ఇది బాలీవుడ్ మహిళావాదుల అసలు రూపం’ అంటూ ప్రియాంకను ఉద్దేశిస్తూ(ప్రియాంక తన పేరును ప్రియాంక చోప్రా జోనస్‌గా మార్చుకున్నారు) ట్వీట్ చేశారు. అయితే ఈట్వీట్ని ప్రియాంక పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రియాంక తల్లి మధు చోప్రా మాత్రం కాస్తా ఘాటుగానే స్పందించారు. ‘సిందూరం అనేది స్త్రీ జీవితాని ఆటంకం కాబోదు. త్వరలోనే ప్రియాంక ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తుంది’ అంటూ రీ ట్వీట్ చేశారు మధు చోప్రా. -
ఇప్పుడే కదా కలిసింది...
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా...హాలీవుడ్ సింగర్, ఆర్టిస్ట్ నిక్ జోనస్ ప్రస్తుతం బీ టౌన్లో బాగా వినిపిస్తున్న పేర్లు వీరిద్దరివే. ఇటీవలే ప్రియాంక చోప్రా ముంబైలో తన నూతన గృహప్రవేశానికి గెస్ట్‌గా బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌ను ఆహ్వానించారు. పనిలో పనిగా తన తల్లి మధుకు నిక్‌ను పరిచయం చేశారు ప్రియాంక. ఈ సందర్భంగా మధు తన కూతురు ప్రియాంక, నిక్‌తో కలిసి ముంబైలోని ఒక టాప్ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ‘నిక్ గురించి మీ అభిప్రాయం ఏంట’ని మీడియా మధు చోప్రాను ప్రశ్నించగా ఆమె కాస్తా భిన్నంగా స్పందించారు. ఈ విషయం గురించి మధు చోప్రా ‘మేము కేవలం డిన్నర్ చేయడం కోసం మాత్రమే వెళ్లాము. అప్పుడు అక్కడ నిక్ కూడా ఉన్నాడు. కానీ అప్పుడు అతనితో మాట్లాడ్డానికి కుదరలేదు. ఆ సమయంలో దాదాపు పదిమంది దాకా నిక్ జోనస్ చుట్టూ మూగారు. దాంతో అతని గురించి తెలుసుకోవడానికి నాకు అవకాశం లభించలేదు. అయినా నేను నిక్‌ను కలవడం ఇదే తొలిసారి. ఇంత తక్కువ సమయంలో అతని గురించి అప్పుడే ఒక నిర్ణయానికి రాలేను’ అని తెలిపారు. కాగా గతంలో ప్రియాంక తల్లి మధు విదేశీయుడికి తన కూతురిని కట్టబెట్టడం ఇష్టం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే నిక్ ఇప్పటికే ప్రియాంకను తన కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. నిక్ తరఫు బంధువుల పెళ్లికి కూడా ప్రియాంక హాజరయ్యారు. -
నా బలం, బలహీనత తనే : ప్రియాంక చోప్రా
నా బలం, బలహీనత రెండూ మా అమ్మే అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన తల్లి మధు చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అందమైన మహిళకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా బలం, బలహీనత రెండూ ఒక్కరే. నీ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. నీతో కలిసి వేడుక చేసుకునేందుకు వేచి చూస్తున్నాను అమ్మా’ అంటూ ప్రేమపూర్వక సందేశాన్ని ఫొటోకు జతచేశారు. అయితే గత కొన్ని రోజులుగా హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌తో ప్రియాంక ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ నెట్టింట్లో వార్తలు ప్రచారం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల నిక్ జోనాస్‌తో కలిసి అతడి బంధువుల పెళ్లికి వెళ్లి ఆ వార్తలకు బలం చేకూర్చారు ప్రియాంక. కాగా ఈ విషయంపై స్పందించిన ప్రియాంక తల్లి మధు చోప్రా సదరు వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఒకవేళ నిక్‌తో ప్రియాంక పెళ్లికి సిద్ధపడితే అందుకు తాను ఒప్పుకోనని చెప్పారు. విదేశీయుడిని ప్రియాంక పెళ్లి చేసుకుంటే తాను భరించలేనన్నారు. ప్రియాంక జీవితాంతం వివాహం చేసుకోకపోయినా తనకు ఇష్టమే కానీ, విదేశీయుడిని చేసుకోవడానికి మాత్రం అంగీకరించనని ఆమె పేర్కొన్నారు. అయితే నిక్‌తో ప్రేమ వ్యవహారంపై గానీ, తల్లి అభిప్రాయంపై గానీ ప్రియాంక ఇంతవరకు స్పందించలేదు. Happy Birthday beautiful lady.. my strength my weakness all rolled into one. I wish you the best year ever.. with everything you wished for. Can’t wait to celebrate with u Ma.. ❤️ @madhumalati A post shared by Priyanka Chopra (@priyankachopra) on Jun 15, 2018 at 1:15pm PDT -
ప్రియాంక పెళ్లిపై ఆందోళన లేదు
ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ వెలిగిపోతోంది. బాలీవుడ్, హాలీవుడ్ అవకాశాలతో ఈ బ్యూటీ తీరికలేకుండా ఉంది. ప్రియాంకకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని ఆమె తల్లి మధు చోప్రా చెప్పింది. కెరీర్లో, జీవితంలో ప్రియాంక సంతోషంగా ఉందని, ఆమె పెళ్లి గురించి తాను ఆందోళన చెందడం లేదని తెలిపింది. అందరి తల్లుల మాదిరిగా తాను కూడా ప్రియాంక పెళ్లి గురించి ఆందోళన చెందానని మధు చోప్రా చెప్పింది. అయితే తాను సంతోషకర, సురక్షిత స్థానంలో ఉన్నానని ప్రియాంక ధైర్యం చెప్పిందని వెల్లడించింది. పెళ్లి చేసుకోవాలని తన కుమార్తెను ఒత్తిడి చేయబోనని మధు చోప్రా చెప్పింది. క్వాంటికో టీవీ సిరీస్‌లో నటించడం ద్వారా ప్రియాంక హాలీవుడ్లో పాపులర్ అయ్యింది. క్వాంటికో సీజన్ 2లోనూ ఆమె నటిస్తోంది. అలాగే హాలీవుడ్ సినిమా బేవాచ్‌లోనూ ప్రియాంకకు ఆఫర్ వచ్చింది. -
ఆ హీరోయిన్ తల్లి నటించడంలేదు
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తెరంగేట్రం చేస్తుందని వచ్చిన వార్తలు నిరాధారమని ఆమె ప్రతినిధి స్పష్టం చేశాడు. మరాఠి సినిమా వెంటిలేటర్లో మధు చోప్రా నటించనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజేష్ మాపుస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ప్రత్యేక పాత్రలో నటించనుంది. ఈ సినిమాలో ప్రియాంక తల్లిగా మధు చోప్రా స్క్రీన్‌పై కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధు చోప్రా ప్రతినిధి స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. మధు చోప్రా సినిమాలో నటించడంలేదని చెప్పాడు.