
ఇషితా కుమార్, ప్రియాంక చోప్రా (ఫైల్)
హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే దానిపై ప్రియాంక తల్లి మధు చోప్రా పెదవి విప్పారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, కొంచెం సమయం కావాలని సిద్ధార్థ చెప్పడంతో పెళ్లి రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో సిద్ధార్థ చోప్రా వివాహం జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారు.
ఇషితకు అత్యవసర శస్త్రచికిత్స జరగడం వల్లే పెళ్లి రద్దైందని తొలుత ఊహాగానాలు వచ్చాయి. సిద్ధార్థ సిద్ధంగా లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయిందని తాజాగా రుజువైంది. మరోవైపు ఇషితా కుమార్‌కు ఆమె తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. పెళ్లి ఆగిపోయినందుకు బాధ పడొద్దని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భరోసాయిచ్చారు. సిద్ధార్థ కంటే మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరుకుతాడని ధైర్యం చెప్పారు. (చదవండి: ఆగిన ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి!)
Comments
Please login to add a commentAdd a comment