call off
-
పప్పీకోసం...బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్, పెళ్లి క్యాన్సిల్
ఒక్క బుజ్జి కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకోవడం ఒకపుడు ఫ్యాషన్ .. కానీ ఇపుడు అదొక ఎమోషన్‌గా మారిపోయింది. పెంపుడు జంతువులను తమ కుటుంబంలో ఒకరిగా ప్రేమించడం, పుట్టినరోజులు జరపడం, చనిపోతే ఆత్మీయులు చనిపోయినంతగా బాధపడటం, అంత్యక్రియలు జరిపించడం లాంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ కుక్క పిల్లకోసంఏడేళ్ల బంధాన్ని వదులుకున్న వైనాన్ని విన్నారా? అవును, పెళ్లి తర్వాత తన కుక్కను తనతో తీసుకురావాలనే కోరికను అత్తగారు నిరాకరించడంతో బాయ్ ఫ్రెండ్‌కు బై బై చెప్పేసింది. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ప్రియాంక అనే ఇంటర్నెట్ యూజర్ తన కథను ఇలా వివరించింది. ఏడేళ్ల తరువాత మా బంధం ముగిసిపోయింది. అయితే ఇది నా వల్లనో, నా బాయ్ ఫ్రెడ్ వల్లనో కాదు. కేవలం అతని తల్లి వల్ల. మధ్యలో తల్లులు ఎందుకు రావాలి..ఎందుకు? ఏడేళ్లంటే మాటలా?’’ అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.అయితే, విషయం ఏమిటంటే ప్రియాంక, ఒక అబ్బాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. ఇరు కుటుంబాలుమాట్లాడుకున్నాయి. కానీ పెళ్లి తర్వాత తన వెంట కుక్కను కూడా తీసుకొస్తానని ప్రియాంక చెప్పింది. అందుకు ప్రియుడి తల్లి వ్యతిరేకించింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు వద్దన్నాడు అతగాడు. అయితే తన ఇంట్లో తల్లి అనారోగ్యం కారణంగా కుక్కను చూసుకోలేకపోతోంది. బాధ్యతలను తానే ఎక్కువగా చూసుకుంటున్నాను. పైగా అదిలేకుండా జీవించ లేను అని భావించింది ప్రియాంక. అయితే అత్తగారింట్లో ఇప్పటికే ఒక కుక్క ఉందని, రెండు కుక్కలను పెంచుకోవడం ఇష్టం లేక తన కుక్కనుఅత్తగారు వారించిందని తెలిపింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌కు కటీఫ్ చెప్పేసానని తెలిపింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పెంపుడు కుక్క ఉన్న ఇంట్లో ఆడపిల్లలకు నిజంగా ఇది చాలా కష్టం. అయినా సర్దుబాట్లు, త్యాగాలు తప్పవు అని ఒకరు నిట్టూర్చగా, అది అతని ప్రాధాన్యత, ఇది మీ ప్రాధాన్యత అని ఇంకో వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇది చిన్నపిల్ల ట్వీట్లా ఉంది ఇంకొకరు కమెంట్ చేశారు. అమ్మాయిల డిమాండ్లు అసాధారణంగా ఉంటాయి. అయినా, ఇది చాలా సున్నితమైన అంశం. ఆమె ఇప్పటికే తల్లిని, కుక్కను విడిచిపెట్టి అతని ఇంటికి వెళుతోంది. కానీ అతను మాత్రం తల్లిదండ్రులు, కుక్కతో కలిసి హ్యాపీగా అతని ఇంట్లోనే ఉంటాడు. ఆ అవకాశం అమ్మాయికి లేదు కదా? మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని..అవమానంతో యువకుడు మృతి
ఒక వ్యక్తి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని అవమానంతో ఆత్యహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితుడు తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయడంతో.. సదరు మహిళ కుటుంబసభ్యలు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మృతుడుని 29 ఏళ్ల మోహన్ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. అతనికి కావ్య శ్రీ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి తర్వాత కూడా చదువకోవచ్చని ఆమెకు అబ్బాయి కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే బాధితుడు మోహన్ వివాహ ఏర్పాట్ల కోసం సుమారు రూ. 10 లక్షలు కాబోయే భార్య కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఐతే మోహన్ గురించి అమ్మాయి కుటుంబ సభ్యులు కొన్ని రూమర్లు విని పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మోహన్, అతడి కుటుంసభ్యులను అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించి....వివాహం రద్దు చేసుకోవాలని సూచించారు. అలాగే డబ్బులు వెనుకకు ఇచ్చేందుకు నిరాకరించడమే గాక పెళ్లిని రద్దు చేసుకోమని ఒత్తిడి చేశారు. అలాగే అమ్మాయిని ఇక ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తిందని, అలాగే తమను బయటకు గెట్టివేసి అవమానించినట్లు మోహన్ తండ్రి రంగస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అవమానం తోపాటు పెళ్లి కూడా రద్దు కావడంతో తన కొడుకు మోహన్ కలత చెంది ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలిపాడు. మోహన్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజులానే ఆరోజు కూడా డ్యూటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన కాబోయే భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటనతో నిందితులు పరారీలో ఉన్నారు. ఈమేరకు పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం) -
మహిళా కండక్టర్ల కంటతడి..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమించినందున తమను విధుల్లోకి తీసుకోవాలంటూ మంగళవారం సూర్యోదయానికి ముందే వచ్చి డిపో గేట్ల వద్ద ఎదురుచూసిన కార్మికులకు చివరకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున తాము విధుల్లోకి తీసుకోబోమని డిపో మేనేజర్లు తెగేసి చెప్పటంతో వారిలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. ముఖ్యంగా మహిళా కండక్టర్లు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. 2 నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, కుటుంబం గడవటమే కష్టంగా ఉన్నందున కనికరించాలంటూ కాళ్లావేళ్లా పడ్డా అధికారులు స్పందించని దుస్థితి ఎదురైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు డిపోల వద్దే పడిగాపులు కాశారు. కొందరు ఆవేదనతో ఆవేశానికిలోనై అధికారులతో వాదనకు దిగారు. వారు డిపోలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని చివరకు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పిల్లలతో వచ్చిన కొందరు మహిళా సిబ్బందిని పోలీసులు అలాగే స్టేషన్లకు తరలించారు. ఇలాగే వ్యవహరిస్తే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 6గంటలకే.. రికార్డు స్థాయిలో 52 రోజులపాటు నిర్వహించిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకే విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లాల్సిందిగా జేఏసీ నేతలు సూచించారు. దీంతో చాలా డిపోల వద్ద ఉదయం 5 గంటలకే కార్మికుల రాక మొదలైంది. సమ్మెను విరమించినా, కోర్టులో కేసు తేలే వరకు విధుల్లోకి తీసుకోవటం సాధ్యం కాదని సోమవారం రాత్రే ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎవరినీ డిపోల్లోకి కూడా రానీయొద్దని, విధుల్లో చేరతామంటూ ఇచ్చే లేఖలు కూడా తీసుకోవద్దంటూ అధికారుల నుంచి డిపో మేనేజర్లకు రాత్రే ఆదేశాలు అందాయి. మూకుమ్మడిగా కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు భద్రత ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. దీంతో డిపో మేనేజర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి డిపోలు, బస్టాండ్ల వద్ద భద్రత కల్పించాల్సిందిగా కోరారు. దీంతో అన్ని చోట్లకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం వచ్చే కార్మికులు డిపోల వద్దకు చేరుకోకుండా ముందే అడ్డుకున్నారు. తాము గొడవ చేయటానికి రాలేదని, తాము సమ్మెలోనే లేమని, డిపో మేనేజర్లను కలసి డ్యూటీ కేటాయించాలని కోరుతామని అడిగినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పలు డిపోల్లో మహిళా సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని చోట్ల పోలీసులతో కార్మికులు వాదనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేదాకా తాము చేసేదేమీ లేదని డిపో మేనేజర్లు స్పష్టం చేయటంతో వారు నిరాశతో వెనుదిరిగారు. బుధవారం ఉదయం కూడా కార్మికులంతా డిపోల వద్దకు వెళ్లి డ్యూటీలు వేయాలని కోరాల్సిందిగా జేఏసీ నేతలు మంగళవారం సూచించారు. పోలీసులు అరెస్టు చేసినా వెనుకంజ వేయొద్దని చెప్పారు. రాజధానిలో ఇలా.. బస్‌భవన్, మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లు, అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల నుంచే పోలీసులు డిపోలను తమ స్వాధీనంలోకి తీసుకొని కార్మికులు డిపోల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ముషీరాబాద్, రాణీగంజ్, మియాపూర్, హెచ్‌సీయూ, ఫలక్‌నుమా, ఫారూక్‌నగర్, ఉప్పల్, చెంగిచెర్ల, కుషాయిగూడ, కంటోన్మెంట్, పికెట్, దిల్సుఖ్నగర్, బర్కత్‌పురా, కాచిగూడ, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, జీడిమెట్ల, తదితర అన్ని డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వందలాది మంది కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బందిని అరెస్టు చేశారు. మేడ్చల్ డిపోలో కార్మికులు పోలీసులను ప్రతిఘటించారు. మహిళా కండక్టర్లు కన్నీటి పర్యంతమయ్యారు. జూబ్లీబస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్‌లో పోలీసుల భద్రతా చర్యల వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు, ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడంతో ప్రయాణికులు బస్స్టేషన్లకు వెళ్లలేకపోయారు. కాగా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో సుమారు 1,500 బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లో ఇలా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటల నుంచి డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. డిపోల ముందుకు వచ్చిన కార్మికులతో పాటు పరిసరాల్లో గుంపులుగా ఉన్న ఆర్టీసీ కార్మికులను గుర్తించి స్టేషన్లకు తరలించారు. మహిళా కండక్టర్లను సైతం పోలీసులు వదల్లేదు. ఉదయం 6.30 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సరైన భోజన వసతి కల్పించలేదని, దీంతో మధుమేహ వ్యాధి ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యా క్షమించండి! ‘మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి అద్దే. ఇతర అవసరాలకు డబ్బులు లేక కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. అయ్యా కేసీఆర్ సార్ తప్పయ్యింది.. మరో సారి సమ్మె చెయ్యం.. నువ్వు చెప్పినట్టే వింటాం’అంటూ ఆర్టీసీ కార్మికులు నిజామాబాద్ డిపో మేనేజర్ కాళ్లపై పడి వేడుకున్నారు. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డిపో–1, నిజామాబాద్ డిపో–2లకు కార్మికులు ఉదయం 5 గంటలకు విధుల్లో చేరడానికి వచ్చారు. కార్మికులను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డిలో 120 మంది, బాన్సువాడలో 80, బోధన్‌లో 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ కార్యాలయంపైకి ఎక్కి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధుల్లో చేరేందుకు ఆర్టీసీ డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆరు డిపోల వద్ద కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో కార్మికులు, పార్టీల నేతలు ఖమ్మం బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు మహిళా కండక్టర్లు, కార్మికులు ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంపైకి ఎక్కి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ముగ్గురికి అస్వస్థత.. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 10 డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు మంగళవారం ఉదయం 5 గంటల నుంచే డిపోల వద్దకు చేరి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళనలు నిర్వహించారు. దీంతో జిల్లా ఆర్టీసీ జేఏసీ నేతలు, దాదాపు 300 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు ఆర్టీసీ కార్మికులు కిష్టయ్య, జీఎస్ రెడ్డి, పద్మలు అస్వస్థతకు గురికావడంతో పోలీసులు ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, మంథని డిపోల వద్ద కూడా కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుల పర్వం.. మహబూబ్‌నగర్ రీజియన్, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అన్ని డిపోల్లో ఉదయం విధుల్లో చేరడానికి యత్నించిన కార్మికులు పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ రీజియన్‌లో 835 బస్సులకుగాను 655 బస్సులు నడిచాయి. సంగారెడ్డి డిపోలో పనిచేస్తున్న భీమ్లాల్ అనే కండక్టర్ విధుల్లో చేరడానికి ఉదయమే డిపోవద్దకు వచ్చాడు. పోలీసులు అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అకస్మాత్తుగా అతను కిందపడిపోవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీపీ వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. జహీరాబాద్, సిద్దిపేట, హుస్నాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట డిపోల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. యాదగిరిగుట్ట డిపోవద్ద 85 మంది కార్మికులను అరెస్ట్ చేశారు. కోదాడ, సూర్యాపేట డిపోలకు చెందిన సుమారు 200 మంది కార్మికులతో పాటు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి సమ్మె విరమించినా ఆర్టీసీ కార్మికులను అధికారులు విధులకు అనుమతించట్లేదని మనస్తాపం చెంది ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడ్‌కు డ్రైవర్ కర్ణం రాజేందర్ (52) సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మాకు ఇవ్వండి.. ఆర్టీసీని నిలబెడతాం: జేఏసీ విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్టు చేయటాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. నెలన్నర ముందే సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించకుండా కాలయాపన చేసి, సమ్మెలోకి వెళ్లేలా చేసి ఇప్పుడు నెపాన్ని కార్మికులపై నెట్టడం సరికాదని జేఏసీ మండిపడింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలేవీ సరి కావని, ఆర్టీసీ నిర్వహణ కష్టమని చెప్పటం తప్పేనని పేర్కొంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన రీయింబర్స్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ, నష్టాల రూట్లలో పన్ను మినహాయింపు ప్రకటించి తమకు అప్పగిస్తే ఆర్టీసీని కాళ్లమీద నిలబడేలా చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళవారం జేఏసీ నేతలు సమావేశమై కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవటాన్ని ఖండించారు. -
అందుకే ఆ పెళ్లి ఆగిపోయింది!
హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే దానిపై ప్రియాంక తల్లి మధు చోప్రా పెదవి విప్పారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, కొంచెం సమయం కావాలని సిద్ధార్థ చెప్పడంతో పెళ్లి రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో సిద్ధార్థ చోప్రా వివాహం జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇషితకు అత్యవసర శస్త్రచికిత్స జరగడం వల్లే పెళ్లి రద్దైందని తొలుత ఊహాగానాలు వచ్చాయి. సిద్ధార్థ సిద్ధంగా లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయిందని తాజాగా రుజువైంది. మరోవైపు ఇషితా కుమార్‌కు ఆమె తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. పెళ్లి ఆగిపోయినందుకు బాధ పడొద్దని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భరోసాయిచ్చారు. సిద్ధార్థ కంటే మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరుకుతాడని ధైర్యం చెప్పారు. (చదవండి: ఆగిన ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి!) -
దీక్ష విరమించా.. ధర్నా కొనసాగిస్తా: సంగీత
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డి నుంచి తనకు న్యాయం చేయాలని ఆయన భార్య సంగీత చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని, తనకు, తన పిల్లవాడికి న్యాయం చేయాలని కోరుతూ బోడుప్పల్‌లోని అతని ఇంటి ముందు ఆమె 52 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సంగతి విదితమే. మహిళా సంఘాలు, సామాజికవేత్త దేవి సూచనల మేరకు ఆమె దీక్షను విరమించింది. నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అయితే ధర్నాను మాత్రం కొనసాగిస్తానని సంగీత స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఆమెకు న్యాయం చేయాలని దేవి విజ్ఞప్తి చేశారు. కాగా, తన భర్త, అత్తమామలతో మాట్లాడి న్యాయం చేయాలని సంగీత వేడుకుంటున్నది. -
గుళ్లు కూల్చినందుకు క్షమించండి
స్వామీజీలను కలిసిన మంత్రి మాణిక్యాలరావు సాక్షి, అమరావతి : విజయవాడ నగరంలో కూల్చిన మూడు ఆలయాలకు రాజీవ్‌గాంధీ పార్క్‌లో స్థలం కేటాయిస్తున్నట్లు దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టీడీపీ ప్రభుత్వం ఇటీవల నగరంలోని ఆలయాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాలను పునర్మించటం, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పుష్కరాల ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామీజీల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇవ్వటంతోపాటు పుష్కరాలు ప్రారంభానికి ముందే కూలగొట్టిన ఆలయాలను పునర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలరోజులు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేరకపోవటంతో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ధర్మకర్త, స్వామీజీ శ్రీ జమునాదాస్, çశృంగేరి పీఠాధిపతి సచ్చిదానంద తీర్థస్వామి అలంకార్ సెంటర్లో నిరాహారదీక్ష చేపట్టారు. వీరితోపాటు ఎల్లాప్రగడ విజయలక్ష్మి, బెహరా చందన్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనను విరమింపజేసేందుకు దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. శ్రీరామాలయం, శ్రీఅభయాంజనేయస్వామి, శనేశ్వరాలయాల నిర్మాణానికి నగరంలోని రాజీవ్‌గాంధీ పార్క్‌లో స్థలం కేటాయించనున్నట్లు స్వామీజీలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ఆలయాల కూల్చివేతకు ప్రభుత్వం తరుపున క్షమాపణలు కోరారు. ఇకపై ఆలయాలను తొలగించాల్సి వస్తే స్వామీజీలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నిరసన చేస్తున్న స్వామీజీలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. -
దీక్షలు విరమించండి
ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుంది డీఎంహెచ్‌వో వెంకట్ వినాయక్‌నగర్ : రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని డీఎంహెచ్‌వో వెంకట్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో రెండో ఏఎన్ఎంలు చేపట్టిన దీక్షలు సోమవారానికి పదిహేను రోజులకు చేరాయి. సోమవారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడానికి సర్కారు సానుకూలంగా ఉన్నందున దీక్షలు విరమించి, విధుల్లో చేరాలని సూచించారు. అయినా వారు వినకుండా ఎన్టీఆర్ చౌక్‌లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రమేశ్‌బాబు మాట్లాడుతూ రెండో ఏఎన్ఎంలకు కనీస వేతనం రూ. 21,300 ఇవ్వాలని, సబ్ సెంటర్ అద్దె, టీఏ, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, సంజూ జార్జ్, శ్రామిక మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నూర్జహాన్, సీపీఎం నాయకులు గోవర్ధన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హమ్మయ్యా... లారీలు రోడ్డెక్కాయి
సాక్షి, హైదరాబాద్: ఒకరోజు సమ్మె అనంతరం తిరిగి లారీలు రోడ్డెక్కాయి. తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించటంతో సమ్మెకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన సమ్మె బుధవారం తీవ్ర ప్రభావం చూపటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. బుధవారం ఎరువులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది ఎదురుకావటంతో విషయాన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయా శాఖల మంత్రులు సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు వివరించారు. వ్యవసాయక్షేత్రంలో ఉన్న ఆయన వెంటనే లారీ యజమానుల సంఘంతో చర్చించి సమ్మెను నిలిపివేసేలా చూడాలని ఆదేశించటంతో గురువారం ఉదయం రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావులు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సచివాలయంలో చర్చించారు. మొత్తం 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన సంఘం సభ్యులు... త్రైమాసిక పన్నును జనాభా నిష్పత్తిలో తగ్గించాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లారీలు సంచరించేలా రూ.5 వేల వరకు తీసుకుని వార్షిక కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలనే తొలి రెండు డిమాండ్లపై పట్టుపట్టారు. ఇవి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అయినందున వాటిపై మంత్రులు తొలుత స్పష్టత ఇవ్వలేదు. వాటిని అంగీకరిస్తేనే సమ్మె విరమిస్తామని సంఘం ప్రతినిధులు పట్టుపట్టడంతో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లకు సమ్మతిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన త్రైమాసిక పన్ను తగ్గింపు సహా మిగతా డిమాండ్లపై స్పష్టత ఇచ్చేందుకు కొంత గడువు కావాలని, రావాణ రంగంతో ముడిపడిన విభాగాల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆ బాధ్యతను దానికి అప్పగిస్తామని మంత్రులు ప్రతిపాదించారు. దీనికి లారీ యజమానుల సంఘం సభ్యులు సమ్మతించారు. కమిటీ మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని, దాని సిఫారసుల ఆధారంగా ఆ డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని మంత్రులు ప్రకటించారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ లారీ యజమానుల సంఘం సభ్యులు ప్రకటించారు. గుజరాత్ విధానాల అధ్యయనం... దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలో రవాణారంగ విధానాలు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో వాటిని అధ్యయనం చేసేందుకు అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించినట్టు సమావేశానంతరం మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అక్కడి విధానాలను పరిశీలించి వాటిల్లో ఉన్నతంగా ఉన్నవాటిని ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. రవాణ, వాణిజ్య పన్నులు, పోలీసుశాఖలు వేధిస్తున్నాయనే లారీ యజమానుల సంఘం ఆరోపణల నేపథ్యంలో ఆ మూడు విభాగాల ఉన్నతాధికారులు, లారీల సంఘం ప్రతినిధులతో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిపై చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని హైవేలపై ప్రత్యేకంగా లారీల కోసం పార్కింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని, 38 రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో డ్రైవర్ల శిక్షణకు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. డ్రైవర్లు కోరకుండానే వారికి రూ.5 లక్షల వరకు ప్రమాద బీమాను ముఖ్యమంత్రి ప్రకటించినట్టు గుర్తుచేశారు. రూ.5 వేలు చెల్లిస్తే రెండు తెలుగు రాష్ట్రాల పర్మిట్... రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా త్రైమాసిక పన్ను విధింపు అమలులోకి వచ్చింది. తాజా చర్చల్లో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రప్రభుత్వం అంగీకరిస్తే...వార్షికంగా రూ.5 వేలు చెల్లించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. ఆ పర్మిట్లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న ఒప్పందం తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కోసం ఏపీకి లేఖ రాయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. చర్చల్లో సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ కూడా పాల్గొన్నారు. హాజరైన కడియం...కానీ.. ఈ చర్చలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా హాజరయ్యారు. కానీ చర్చలో మాత్రం పాల్గొనలేదు. ఆ సమావేశమందిరంలో కడియం శ్రీహరి పాల్గొనే మరో సమావేశం జరగాల్సి ఉంది. కానీ లారీ సంఘ ప్రతినిధులతో ఇద్దరు మంత్రుల చర్చలు ఎక్కువ సేపు కొనసాగటంతో చేసేదిలేక ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వచ్చి సమావేశం ముగిసేవరకు ఆ హాలులో కూర్చోవాల్సి వచ్చింది. -
'జూడాలు 48 గంటల్లోగా సమ్మె విరమించాలి'
-
'జూడాలు 48 గంటల్లోగా సమ్మె విరమించాలి'
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను 48 గంటల్లోగా విరమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. జూడాల ఆందోళనపై హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ఈ 48 గంటల్లో జూడాలపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. జూడాల ఆందోళన చట్ట వ్యతిరేకమని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామీణ సర్వీసు మినహా జూడాల మిగత అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో జూడాలు సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. అందుకోసం జీవో 107 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై ఆగ్రహించిన జూడాలు అక్టోబర్ 1వ తేదీన సమ్మె బాట పట్టారు. నాటి నుంచి వారు నిరవధిక సమ్మెకు చేయడంతో... రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.