ఒక్క బుజ్జి కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో పెంచుకోవడం ఒకపుడు ఫ్యాషన్ .. కానీ ఇపుడు అదొక ఎమోషన్‌గా మారిపోయింది. పెంపుడు జంతువులను తమ కుటుంబంలో ఒకరిగా ప్రేమించడం, పుట్టినరోజులు జరపడం, చనిపోతే ఆత్మీయులు చనిపోయినంతగా బాధపడటం, అంత్యక్రియలు జరిపించడం లాంటి ఘటనలు ఎన్నో చూశాం. కానీ కుక్క పిల్లకోసంఏడేళ్ల బంధాన్ని వదులుకున్న వైనాన్ని విన్నారా? అవును, పెళ్లి తర్వాత తన కుక్కను తనతో తీసుకురావాలనే కోరికను అత్తగారు నిరాకరించడంతో బాయ్ ఫ్రెండ్‌కు బై బై చెప్పేసింది. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.
ప్రియాంక అనే ఇంటర్నెట్ యూజర్ తన కథను ఇలా వివరించింది. ఏడేళ్ల తరువాత మా బంధం ముగిసిపోయింది. అయితే ఇది నా వల్లనో, నా బాయ్ ఫ్రెడ్ వల్లనో కాదు. కేవలం అతని తల్లి వల్ల. మధ్యలో తల్లులు ఎందుకు రావాలి..ఎందుకు? ఏడేళ్లంటే మాటలా?’’ అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.
అయితే, విషయం ఏమిటంటే ప్రియాంక, ఒక అబ్బాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. ఇరు కుటుంబాలుమాట్లాడుకున్నాయి. కానీ పెళ్లి తర్వాత తన వెంట కుక్కను కూడా తీసుకొస్తానని ప్రియాంక చెప్పింది. అందుకు ప్రియుడి తల్లి వ్యతిరేకించింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు వద్దన్నాడు అతగాడు. అయితే తన ఇంట్లో తల్లి అనారోగ్యం కారణంగా కుక్కను చూసుకోలేకపోతోంది. బాధ్యతలను తానే ఎక్కువగా చూసుకుంటున్నాను. పైగా అదిలేకుండా జీవించ లేను అని భావించింది ప్రియాంక. అయితే అత్తగారింట్లో ఇప్పటికే ఒక కుక్క ఉందని, రెండు కుక్కలను పెంచుకోవడం ఇష్టం లేక తన కుక్కనుఅత్తగారు వారించిందని తెలిపింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌కు కటీఫ్ చెప్పేసానని తెలిపింది.
అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పెంపుడు కుక్క ఉన్న ఇంట్లో ఆడపిల్లలకు నిజంగా ఇది చాలా కష్టం. అయినా సర్దుబాట్లు, త్యాగాలు తప్పవు అని ఒకరు నిట్టూర్చగా, అది అతని ప్రాధాన్యత, ఇది మీ ప్రాధాన్యత అని ఇంకో వినియోగదారు వ్యాఖ్యానించారు. ఇది చిన్నపిల్ల ట్వీట్‌లా ఉంది ఇంకొకరు కమెంట్ చేశారు. అమ్మాయిల డిమాండ్లు అసాధారణంగా ఉంటాయి. అయినా, ఇది చాలా సున్నితమైన అంశం. ఆమె ఇప్పటికే తల్లిని, కుక్కను విడిచిపెట్టి అతని ఇంటికి వెళుతోంది. కానీ అతను మాత్రం తల్లిదండ్రులు, కుక్కతో కలిసి హ్యాపీగా అతని ఇంట్లోనే ఉంటాడు. ఆ అవకాశం అమ్మాయికి లేదు కదా? మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment