సాక్షి, సిటీబ్యూరో: పెంపుడు జంతువులు పెంచుకోవడం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. పెట్స్‌తో రక్షణతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుండటంతో ఇదో హాబీగా మారింది. చాలా మంది ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు కుక్కలు, పిల్లలు, కుందేళ్లు.. ఇలా రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. విదేశాల నుంచి కూడా పెట్స్‌ను కొనుగోలు చేస్తుంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో తమ వెంట పెట్స్‌ను రోడ్ల మీద, పార్క్‌లకు తీసుకెళ్తుంటారు. దీంతో ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చాలా మంది డెవలపర్లు నివాస సముదాయాల్లోనే పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా పెట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పెట్స్ పార్క్ ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది.
వందకుపైగా వసతులు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ జేఎన్‌టీయూ సమీపంలో ఇక్సోరా పేరుతో ప్రీమియం హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 8.31 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు టవర్లుంటాయి. జీ+37 అంతస్తుల్లో మొత్తం 1,504 యూనిట్లు ఉంటాయి. 1,305 చ.అ. నుంచి 3,130 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలు ఉంటాయి. వెహికిల్ ఫ్రీ పోడియం పార్కింగ్, పెట్ పార్క్, యాంపీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, ఫిట్‌నెస్ స్టేషన్, యోగా డెక్.. ఇలా వందకు పైగా వసతులుంటాయి.
50 వేల చ.అ. క్లబ్‌హౌస్ కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌లో 80 శాతం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందించాలనే లక్ష్యంగా శరవేగంగా నిర్మాణ పనులను చేపడుతున్నామని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ తెలిపారు. ఇప్పటికే టవర్ 1, 2లలో బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయ్యిందని, గ్రౌండ్ ఫ్లోర్ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment