parks
-
రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్
సాక్షి, సిటీబ్యూరో: పెంపుడు జంతువులు పెంచుకోవడం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. పెట్స్‌తో రక్షణతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుండటంతో ఇదో హాబీగా మారింది. చాలా మంది ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు కుక్కలు, పిల్లలు, కుందేళ్లు.. ఇలా రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. విదేశాల నుంచి కూడా పెట్స్‌ను కొనుగోలు చేస్తుంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో తమ వెంట పెట్స్‌ను రోడ్ల మీద, పార్క్‌లకు తీసుకెళ్తుంటారు. దీంతో ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చాలా మంది డెవలపర్లు నివాస సముదాయాల్లోనే పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా పెట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పెట్స్ పార్క్ ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది.వందకుపైగా వసతులుహైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ జేఎన్టీయూ సమీపంలో ఇక్సోరా పేరుతో ప్రీమియం హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 8.31 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు టవర్లుంటాయి. జీ+37 అంతస్తుల్లో మొత్తం 1,504 యూనిట్లు ఉంటాయి. 1,305 చ.అ. నుంచి 3,130 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలు ఉంటాయి. వెహికిల్ ఫ్రీ పోడియం పార్కింగ్, పెట్ పార్క్, యాంపీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ స్టేషన్, యోగా డెక్.. ఇలా వందకు పైగా వసతులుంటాయి.50 వేల చ.అ. క్లబ్‌హౌస్ కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌లో 80 శాతం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకు అందించాలనే లక్ష్యంగా శరవేగంగా నిర్మాణ పనులను చేపడుతున్నామని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ తెలిపారు. ఇప్పటికే టవర్ 1, 2లలో బేస్మెంట్ నిర్మాణం పూర్తయ్యిందని, గ్రౌండ్ ఫ్లోర్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. -
International Picnic Day : ఛలో పిక్నిక్...అటు విందు, ఇటు దిల్ పసందు
నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్‌లోని లిస్బన్లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్గా రికార్డుల కెక్కింది. రొటీన్ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్ డే ఉద్దేశం. పిక్నిక్లు పలు రకాలుచిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్‌లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్మెంట్ పార్క్‌లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి. ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్ సూపర్ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్.. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
పర్యాటకులను ఆకర్షించేలా జూ పార్క్‌ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని జూ పార్క్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి అధ్యక్షతన జూ అథారిటీ ఆఫ్ ఏపీ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించేలా విశాఖ, తిరుపతి జూ పార్క్‌లను తీర్చిదిద్దేందుకు.. దేశంలోని పలు జూ పార్క్‌ల అథారిటీలతో జంతువుల మారి్పడి కోసం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. జంతువులను సంరక్షించే సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్‌పై హేతుబద్ధత కోసం సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విశాఖ జూ పార్క్‌కు సంబంధించిన కొత్త లోగోను, జంతువులను పోలిన పలు వస్తువులను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. జంతువుల చిత్రాలతో రూపొందించిన టీషర్ట్లు, టోపీలు, గృహాలంకరణ వస్తువులను పరిశీలించారు. అటవీదళాల అధిపతి మధుసూదన్‌రెడ్డి, అడిషనల్ పీసీపీఎఫ్ శాంతిప్రియపాండే, అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, విశాఖ క్యూరేటర్ నందినీ సలారియా, తిరుపతి క్యూరేటర్ సెల్వం, విశాఖ సర్కిల్ హెడ్ శ్రీకంఠనాథరెడ్డి, తిరుపతి సర్కిల్ హెడ్ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! -
ప్రపంచంలోని టాప్ 10 జూలాజికల్ పార్కులు ఇవే!
-
భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే!
ఢిల్లీలో స్త్రీలకు ఉపశమనం. ఢిల్లీలోని 250 వార్డుల్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే ‘పింక్ పార్కు’లను ఏర్పాటు చేయనున్నారు. ఆకతాయుల వల్ల, దొంగల వల్ల పార్కులకు వెళ్లాలంటే భయపడే స్త్రీలు ఇళ్లల్లోనే మగ్గాల్సిన అవసరం లేకుండా చేసిన ఆ ఆలోచన మెచ్చుకోలు పొందుతోంది. బహుశా ప్రతి నగరంలో, పట్టణంలో ఇలాంటి పార్కులు ఉండాలేమో. ఆడవాళ్లు ఉదయాన్నే పార్క్‌కు వెళ్లి నడవాలనుకుంటారు. వారికి సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని నడుస్తుంటారు. కాని అలా నడిచేవారిని చూడటానికి కొందరు ఆకతాయులు వస్తుంటారు. ఇంకేం నడక? పార్కుకు వచ్చి యోగా మ్యాట్ పరిచి ఆసనాలు వేద్దామనుకుంటారు. అటుగా వెళుతున్న మగవారు ఒక నిమిషం ఆగి చూసినా వారికి అసౌకర్యమే. ఆడవాళ్లు పార్క్‌లో పిల్లలతో ఆడుకోవాలనుకుంటారు. పక్కనే ఒక తండ్రి వచ్చి తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వారు ఉండగలరా? పార్కుకు వచ్చి ఆడవాళ్లు అక్కడున్న జిమ్ పరికరాలతో ఏవో ప్రయత్నాలు చేయాలనుకుంటారు. మగవారు కూడా లోపల ఉంటే ఎంత ఇబ్బంది. పార్క్‌కు వచ్చిన ఆడవాళ్లు ఊరికే అలా బెంచీ మీద కూచుని పాటలు వినడమో, పుస్తకం చదువుకోవడమో చేయాలనుకున్నా కావలసిన ప్రైవసీ దొరుకుతుందా? ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ ఉండే గృహిణులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఉద్యోగం చేసి అలసొచ్చిన స్త్రీలు కాస్త తెరిపిన పడాలంటే ఆహ్లాదమైన, సురక్షితమైన పబ్లిక్ ప్లేస్ ఉంటే ఎలా ఉంటుంది? వీటన్నింటికి జవాబు ‘పింక్ పార్క్’. ఢిల్లీలో ఉన్న 250 వార్డుల్లో ప్రతి వార్డులోనూ తప్పనిసరిగా ఒక ‘పింక్ పార్క్’ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ‘ఢిల్లీలో కార్పొరేషన్ పరిధిలో 15000 పార్కులు ఉన్నాయి. ఇవి స్త్రీలు, పురుషులు ఉపయోగించడానికి వీలుగా మెయిన్‌టెయిన్ అవుతున్నాయి. కాని వీటిలోని జిమ్‌లను కాని, వాకింగ్ ట్రాక్‌లను కాని, పిల్లల ప్లే ఏరియాలను కాని ఉపయోగించుకోవడానికి స్త్రీలు ఇబ్బంది పడటం గమనించాం. అందుకే స్త్రీలకు మాత్రమే ప్రవేశం కల్పించే పింక్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాం’ అని కార్పొరేషన్ డిప్యూటి మేయర్ తెలియచేశారు. నేరాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో నేరాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. పార్కుల్లో ఆకతాయిల బెడద ఉంటుంది. పిల్లలను ఎత్తుకుని పోయేవారు కూడా ఉండొచ్చు. అందుకని చాలామంది తల్లులు భర్త తోడు లేకుండా రావడానికి సంశయిస్తుంటారు. వీరి కోసమే ‘పింక్ పార్కులు’ రానున్నాయి. స్త్రీల నిర్వహణ పింక్ పార్కులకు ప్రవేశ ద్వారాల దగ్గర మాత్రమే మగ గార్డులు ఉంటారు. లోపల పార్కు నిర్వహణకు, జిమ్‌కు, క్యాంటిన్ దగ్గర ఆడవాళ్లే పని చేస్తారు. ‘పదేళ్ల లోపు మగ పిల్లలను మాత్రమే ఈ పార్కుల్లో తల్లులతో పాటు అనుమతిస్తాం’ అని కార్పొరేషన్ బాధ్యులు తెలియచేశారు. సీసీ టీవీలు అడుగడుగునా ఉంటాయి. పిల్లలు ఆడుకునే చోట నిఘా ఉంటుంది. దీని వల్ల పిల్లలను ఆడుకోవడానికి వదిలి స్త్రీలు తమ వ్యాయామాలను, నడకను, జిమ్‌ను నిశ్చింతగా కొనసాగించవచ్చు. ‘అన్నింటికంటే ముఖ్యం పిల్లలతో హాయిగా ఆడుకోవాలనుకునే తల్లులు బిడియం అక్కర్లేకుండా ఆడుకోవచ్చు’ అంటున్నారు ఈ ఆలోచనకు బాధ్యులు. ప్రతి ఊరిలో అవసరం బిజీ లైఫ్‌లో స్త్రీలు కాసింత విరామాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటే అలాంటి వారికి పింక్ పార్కులు గొప్ప ఓదార్పు అవుతాయి. పిల్లల ఆరోగ్యం కోసం, కాలక్షేపం వారిని ఆడించాలనుకునే తల్లులు కూడా వీటి వల్ల మేలు పొందుతారు. తగిన చోటు లేక కనీసం వాకింగ్ కూడా చేయలేని స్త్రీలు వీటివల్ల చురుకుదనాన్ని, ఆరోగ్యాన్ని పొందే వీలుంటుంది. ఇన్నీ ప్రయోజనాలున్న ఆలోచనను ప్రతి రాష్ట్రంలో ప్రతిపాదించవచ్చు. స్త్రీలు విన్నవిస్తే ప్రభుత్వాలు వింటాయి కూడా. త్వరలో అన్ని ఊళ్లలో ఇలాంటి పార్క్‌లు రావాలని ఆశిద్దాం. -
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ప్రత్యేక ప్రణాళిక
-
అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూపార్క్లను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం అటవీశాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సందర్శకులను మరింతగా ఆకర్షించేలా తిరుపతి, విశాఖ జూపార్క్ లను తీర్చిదిద్దాలని కోరారు. దేశంలోని పలు జంతుసందర్శనశాలల్లో అదనంగా ఉన్న జంతువులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మన వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న జంతువులను ఇతర జూలకు ఇచ్చి, వారి వద్ద ఉన్న జంతువులను మనం తెచ్చుకునే విధానం ఉందని, దీనిపై అధికారులు కసరత్తు చేయాలని కోరారు. అలాగే జామ్ నగర్‌లోని ప్రైవేటు జూలో ఉన్న జంతువులను కూడా ఎక్స్చేంజ్, లేదా కొనుగోలు ద్వారా కూడా సమీకరించుకోవచ్చని సూచించారు. దీనిపై వన్యప్రాణి విభాగం అధికారులు డిపిఆర్లు సిద్దం చేయాలని, నిర్ధిష్ట సమయంలోగా వాటిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. తిరుపతిలో కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మెమో ట్రైన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జూపార్క్‌కు సందర్శకుల సంఖ్య పెరిగేలా చేయవచ్చని అన్నారు. వివిధ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకారాన్ని పొందాలని అన్నారు. తిరుపతి జూపార్క్‌లో వైట్ టైగర్ సఫారీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అటవీశాఖ నర్సరీల ద్వారా మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం లోని రీసెర్చ్ సెంటర్ల ద్వారా అధిక ఫలసాయం, కలపను అందించే మేలుజాతి మొక్కలను అభివృద్ధి చేయాలని అన్నారు. తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా ఎర్రచందనంపై పరిశోధనలు చేసి, మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రైతుల నుంచి ఎర్రచందనంపై డిమాండ్ ఎక్కువగా ఉందని, ప్రైవేటు నర్సరీలు ఎక్కువరేట్లకు మొక్కలను విక్రయిస్తున్నాయని చెప్పారు. అటవీశాఖ నర్సరీల ద్వారా అందుబాటు ధరలోనే ఎర్రచందనం మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెదురు, జీడిమామిడి, నేరేడు, ఉసిరి, చింత, యూకలిప్టస్ వంటి మొక్కలను నర్సరీల ద్వారా అందిస్తున్నామని, వీటిల్లో కూడా మరింత మేలైన జాతులను అభివృద్ధి చేయాలని సూచించారు. చదవండి: (సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు) రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా అటవీ అధికారుల శిక్షణకు అకాడమీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిదని అన్నారు. ఈ అకాడమీ ద్వారా అటవీశాఖ ఉద్యోగులు, అధికారుల్లో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచాల్సి ఉందని, అకాడమీకి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అంతరించి పోతున్న అరుదైన జీవ, జంతుజాలంను పరిరక్షించుకునేందుకు బయో డైవర్సిటీ బోర్డ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న నగరవనాల్లో అరుదైన మొక్కల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖతో సమన్యయం చేసుకుంటూ జీవవైవిధ్యం పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని బోర్డ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ గ్రీన్ కార్ఫ్స్ ద్వారా జిల్లా స్థాయిలో ఎకో క్లబ్ లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విద్యార్ధులకు పర్యావరణం పట్ల అవగాహనను కల్పించడం, స్థానికంగా ప్రజల్లోనూ పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్సెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎస్ఎఫ్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, డాక్టర్ బిఎంకె రెడ్డి (ఎపి బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్), ఇఎస్ఎఫ్&టి స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, వన్యప్రాణి విభాగం అడిషనల్ పిసిపిఎఫ్ శాంతిప్రియా పాండే, అడిషనల్ పిసిసిఎఫ్ (విజిలెన్స్) గోపీనాధ్, ఆర్పీ ఖజూరియా (పిసిసిఎఫ్- ప్రొడెక్షన్&అడ్మిన్), ఎకె నాయక్ (పిసిసిఎఫ్-ఐటి), పిఎవి ఉదయ్ భాస్కర్ (అకాడమీ డైరెక్టర్) తదితరులు పాల్గొన్నారు. -
ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు
రాజంపేట టౌన్ : గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు లేకపోవడంతో దసరా సెలవుల్లో విద్యార్థులు తమకు తోచిన రీతిలో ఆనందంగా గడపాలన్న ఉత్సుకతతో ఉంటారు. అయితే సంతోషం మాటునే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి వుంటాయన్న విషయాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. పిల్లలు ఆనందంగా గడిపేందుకు వారికి స్వేచ్ఛను ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అయితే వారిని ఒక కంటి కనిపెట్టి ఉంచాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులపై ఎంతైనా ఉందనే చెప్పాలి. సెలవుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటారు. మరికొంత మంది విహార యాత్రల పేరిట వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు నీటిలో దిగి ఈతకొట్టడం, బైక్ నడపడం నేర్చుకొని.. బైక్ నడిపేందుకు ఎంతో ఇష్టపడతారు. సెలవుల్లో ఈ విషయాలపైనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండాలి. లేకుంటే ఆనందమయం కావాల్సిన సెలవులు విషాదమయం కాగలవు. సెలవుల సందర్భంగా విద్యార్థులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ సంఘటనలు అన్నమయ్య జిల్లాలో అనేకం ఉన్నాయి. పిల్లల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆడుకోవడానికి ఎక్కువ దూరం పంపకూడదు. ► సమీపంలో ఉండే క్రీడామైదానాల్లోకి వెళ్లినా, వారి వెంట పెద్దలు ఎవరో ఒకరు వెళ్లాలి. ► క్రీడామైదానాల సమీపంలో, ఆడుకునే ప్రాంతాల సమీపంలో చెరువులు, బావులు, తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వంటివి ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు కూడా పంపక పోవడమే మంచిది. ► ఎత్తయిన భవనాల పైన, శిథిలావస్థలో ఉండే భవనాల్లో ఆటలు ఆడకుండా చూడాలి. ► యువకులు చిన్నపాటి వీధుల్లో కూడా బైక్‌లను వేగంగా నడుపుతుంటారు. అందువల్ల పిల్లలు వీధుల్లోని రోడ్లపై ఆడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఓ మోస్తారు పిల్లలు బైక్‌లను నడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అందువల్ల తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు బైక్‌లను తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడే ప్రమాదముంది. అందువల్ల పిల్లలు బైక్‌లను తీసుకెళ్లకుండా ఉండేందుకు బైక్ తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలి. ► ప్రస్తుతం చాలా మంది పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌ను ఎక్కువ చూసే అవకాశమున్నందున, సెల్‌ఫోన్‌పై వ్యాపకం లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి. ఇలా చేస్తే మంచిది ► సెలవుల్లో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వంటి క్రీడలు ఆడుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలి. ► ఇరుగు, పొరుగున ఉన్న పిల్లలందరికీ కూడా క్యారమ్, చెస్ బోర్డులను అందుబాటులో ఉంచితే పిల్లలు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఆడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ► తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి సమయం ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు తీసుకెళ్లి క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ వంటివి ప్రాక్టీస్ చేయిస్తే మరింత మంచిది. ఎందుకంటే ఈ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. ► ఈతకు వెళ్లడం, బైక్‌లను నడపడం వంటివి చేస్తే చోటు చేసుకునే ప్రమాదాలగురించి పిల్లలకు సున్నితంగా తెలియజేయాలి. ► పిల్లలను ఎగ్జిబిషన్, పార్కులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లాలి. సెలవుల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారికి సమీపంలో ఉండే చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా బయటకు వెళ్లాలన్న ఆలోచనలు రావు. ► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన విషయాలను తెలియ చేయాలి. అలాగే పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న వారి విజయగాధలను విషదీకరించి చెప్పాలి. ఇవి పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. ► పడుకునే సమయంలో పిల్లలకు మంచి విషయాలను చెబుతుండాలి. పూర్వం ఉండిన ఉమ్మడి కుటుంబాలు, అప్పట్లో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలపై తెలియ చేయాలి. ఇవి సన్మార్గం వైపు నడిచేందుకు దోహద పడగలవు. (క్లిక్: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..) తల్లిదండ్రులు స్నేహితుల్లా వ్యవహరించాలి తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితుల్లా వుండాలి. అప్పుడే ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా తల్లిదండ్రులకు నిర్భయంగా తెలపగలరు. అంతేకాక చెప్పిన విషయాలను కూడా చక్కగా ఆలకిస్తారు. ముఖ్యంగా సెలవుల సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు బయటికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది. సెలవుల సమయంలో పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – శివభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ, రాజంపేట -
భాగ్యనగరానికి పచ్చలహారం
సాక్షి, సిటీబ్యూరో: మహానగర అవసరాలకు అనుగుణంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి ఫలితాలనిస్తోంది. హరితహారంలో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ సిటీ అయిన నగరానికి పర్యావరణ అవసరాలు తీరేలా మొదటి దశలో 109 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులలో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 59 పార్కులు పూర్తి కాగా మరో 50 అర్బన్ పార్కులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆనందంగా విహరించేలా.. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా అనేక కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు వెలిశాయి. దీంతో శివారు ప్రాంతాలను ఆనుకొని ఉన్న పట్టణ అడవుల్లో కొంతభాగాన్ని ఉద్యానాలుగా మార్పు చేయడం వల్ల వివిధ ప్రాంతాల ప్రజలకు పార్కుల్లో ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. హెచ్ఎండీఏ పరిధిలో త్వరలో 59 పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 39 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయి, సందర్శకులను అనుమతిస్తున్నారు. మరికొన్ని పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 20 వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 59లో 27 పార్కులను అటవీ శాఖ అభివృద్ధి చేయగా, 16 పార్కులను హెచ్ఎండీఏ చేపట్టింది. టీఎస్ఐఐసీ, ఎఫ్డీసీ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ సంస్థలు మిగతా పార్కులను అభివృద్ది చేస్తున్నాయి. వాకింగ్ ట్రాక్‌లు, యోగా ప్లేస్‌లు.. ►ప్రతి అర్బన్ ఫారెస్ట్ పార్కులో తప్పనిసరిగా ప్రవేశ ద్వారం, నడకదారి, వ్యూ పాయింట్ ఏర్పాటు ఉండేలా ఏర్పాటు చేశారు. ►పిల్లలకు ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం వంటి వాటికి ఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. పార్కు కోసం కేటాయించిన అడవిని మినహాయించి మిగతా అటవీప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్‌గా పరిరక్షణ చర్యలు చేపడతారు. జీవ వైవిధ్యం, నీటి వసతి వంటి సదుపాయాల పెంపునకు చర్యలు చేపట్టారు. అర్బన్ పార్కులను గాంధారి వనం, ప్రశాంతి వనం, ఆక్సీజన్ పార్కు, శాంతి వనం, ఆయుష్ వనం, పంచతత్వ పార్క్ వంటి రకరకాల థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయడం విశేషం. పెరిగిన అడవుల విస్తరణ... ►హరితహారంతో నగరంలో అడవుల విస్తరణ 33.15 చదరపు కిలో మీటర్ల నుంచి 81.81 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది. అంటే ఏడాదికి సగటు విస్తరణ 4.3 నుంచి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించడం మరో విశేషం. నగరంలో పచ్చదనం పెంపుదలతో పాటు కాలుష్యం బారిన పడకుండా అటవీ, మున్సిపల్ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి ఎఫ్ఏఓ నుంచి ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్ లభించడానికి విశేషంగా కృషి చేశాయి. -
AP: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్కు ఏర్పాటు కానుంది. తద్వారా ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు పార్కుల్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రణాళిక రూపొందించింది. చదవండి: AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం లభించింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో 6 ఎకరాలు, కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్‌లో 7.5 ఎకరాలు, తిరుపతిలోని తుడా పరిధిలో ఉన్న వెంకటాపురంలో 6 ఎకరాలు, కడప నగరంలో ఏపీఐఐసీకి చెందిన 6 ఎకరాలను ఇప్పటికే పార్కుల కోసం కేటాయించారు. ఆ భూములను త్వరలో జీవవైవిధ్య మండలికి అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూమి అప్పగించిన వెంటనే పార్కుతోపాటు మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ పార్కులు, మ్యూజియంల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని జీవవైవిధ్య మండలి ఇప్పటికే కోరింది. కర్నూలు, అమరావతి, అనంతపురం జిల్లాల్లోనూ త్వరలో భూమిని కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
శ్రుతిమించిన ప్రేమికుల ప్రవర్తన.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో
తుమకూరు (కర్ణాటక): నగరంలోని ఉద్యానవనంలోకి వచ్చే ప్రేమికుల ప్రవర్తనపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడి స్మార్ట్‌సిటీ ఉద్యానవనానికి అనేక మంది ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరడానికి వస్తుంటారు. అదే సమయంలో కళాశాలల్లో చదువుకుంటున్న ప్రేమజంటలు ఇక్కడికి వచ్చి శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు. ఈ దృశ్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. కస్టమర్లు ఒప్పుకుంటే..) -
Seethampeta: వనవిహారీ.. ఇదీ దారి
వేకువ గాలులు నొసటన ముద్దాడుతూ ఉంటే ఈ కొండల్లో విహరించాలి. సూరీడి కిరణాలు నడినెత్తిపై వచ్చే వేళకు ఆ జలపాతం మన శిరసుపై నుంచి పాదాలపైకి దూకాలి. కడుపు లోపల చల్ల కదలకుండా సున్నపుగెడ్డ మధ్యన నడుం వాల్చాలి. వెలుతురు వెళ్లి చీకటి ఇంకా రాని ఆ కొన్ని ఘడియల పాటు చెమట్లు వచ్చేలా సాహస క్రీడల్లో మునిగి తేలాలి. కార్తీక వన విహారానికి ఇంతకు మించిన సాఫల్యత ఏముంటుంది..? ఇవన్నీ నిజం కావాలంటే మంచి సెలవు రోజు చూసుకుని చలో సీతంపేట అనేయడమే. సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): సీతంపేట రారమ్మంటోంది. కార్తీకంలో వన విహారానికి తన బెస్ట్ టూరిజం ప్రదేశాలను చూపిస్తూ ఆకర్షిస్తోంది. ఓ వైపు జలపాతాలు, మరోవైపు పార్కు, ఇంకో వైపు అడవుల అందాలతో మన్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఏటా ఎన్టీఆర్ అడ్వంచర్ పార్కు, జగతపల్లి, ఆడలి వ్యూపాయింట్లను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఇటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. సాహస క్రీడా వినోదం సీతంపేట అడ్వంచర్ పార్కు స్థానికంగా దోనుబాయి రహదారి మలుపునకు సమీపంలో ఉంది. ఇక్కడ జలవిహార్‌లో బోటుషికారు ఏర్పాటు చేశారు. సైక్లింగ్, జెయింట్‌వీల్, ఆల్టర్న్ వెహికల్, షూటింగ్, బంజీట్రంపోలిన్ వంటివి ఉన్నాయి. సున్నపుగెడ్డకు ఇలా.. ఏజెన్సీలోని సున్నపు గెడ్డ జలపాతానికి మంచి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తుంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సున్నపుగెడ్డ ఉంది. పొల్ల– దోనుబాయి మార్గంలో మేకవ గ్రామానికి సమీపంలో రోడ్డుదిగువ గుండా నడుచుకుంటూ వెళితే సున్నపుగెడ్డ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సులు పరిమితంగా ఉంటాయి. సీతంపేట వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. సదుపాయాలు అంతంత మాత్రమే. తిను బండారాలు ఇతర ఆహార సామగ్రి పర్యాటకులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మెట్టుగూడ.. ఇక్కడ.. ► మెట్టుగూడ జలపాతం మంచి ప్రాచుర్యం పొందింది. మా మూలు రోజుల్లో కూడా ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య అ ధికంగా ఉంటుంది. ► సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారిలో ఈ జలపాతం ఉంది. ► కొత్తూరు నుంచి వస్తే 10 కిలోమీటర్లు, పాలకొండ నుంచి వస్తే 17 కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ వస్తుంది. ► అక్కడ వాహనాలు దిగి కొద్ది దూరం నడిచి వెళ్తే జలపాతాన్ని చేరుకోవచ్చు. ► ఆర్టీసీ బస్సులు పాలకొండ–కొత్తూరు నుంచి అనునిత్యం తిరుగుతుంటాయి. పర్యాటకులకు అన్ని సౌకర్యాలున్నాయి. వ్యూపాయింట్ భలే పొల్ల: సున్నపుగెడ్డకు సమీపంలో పొల్ల వ్యూ పాయింట్ ఉంది. ఆడలి: ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లాలంటే కుశిమి జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో వెళ్లాలి. జగతపల్లి: సీతంపేట నుంచి7 కిలోమీటర్ల దూరంలో జగతపల్లి ఉంది. వీటిని వీక్షించడానికి ప్రత్యేక టూరిజం వెహికల్‌ను ఏర్పాటు చేశారు. -
నిజాంపేట్ కార్పొరేషన్లో ఆహ్లాద కేంద్రాలు అస్తవ్యస్తం!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు పార్కుల అభివృద్ధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేషన్‌లోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌లలో పార్కులు ఉండగా ఎక్కువగా ప్రగతినగర్‌లోనే ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో కొన్ని పార్కుల నిర్వహణ, అభివృద్ధి బాగానే ఉన్నా ఎక్కువ పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పలు పార్కుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పార్కుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కుల అభివృద్ధికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ప్రయోజనం కనపించడం లేదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆట పరికరాలు కరువు... ► కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని పార్కుల్లో పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తువులు లేకపోవడంతో పరిసర ప్రాంతల్లో నివసించే పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..) ► కేవలం కొన్ని పార్కుల్లోనే పిల్లల ఆట పరికరాలు ఉండటంతో అనేక మంది అట్టి పార్కులకు వెళ్తుండటంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. ఓపెన్ జిమ్‌లు కూడా... ► అదే విధంగా ఓపెన్ జీమ్‌లు కూడా అన్ని పార్కుల్లో లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ► ప్రతి కాలనీలో ఉన్న పార్కులో ఓపెన్ జీమ్‌లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పార్కుల నిర్వహణలో లోపం... పార్కుల నిర్వహణలో క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు. ► పార్కుల్లో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ► పెద్దపెద్ద రాళ్లు కూడా పార్కుల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి. ► అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రీనరీ కోసం నీటిని కూడా సక్రమంగా పట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ► పార్కులకు ఉన్న గేట్లు కూడా సరిగ్గా లేకపోవడంతో పశువులకు పార్కులు అవాసాలుగా మారాయని వాపోతున్నారు. ► కొన్ని పార్కుల్లో అయితే చెత్తాచెదారం పేరుకుపోయి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. నిర్వహణ నిరంతరం చేయాలి పార్కుల అభివృద్ధి, నిర్వహణ నిరంతరం కొనసాగాలి. ప్రజలు ప్రతి రోజు ఆహ్లాదం కోసం పార్కులకు వస్తుంటారు. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ప్రకృతి, గ్రీనరీతో అనుభూతి పొందాలి. కానీ అలాంటి పరిస్థితి అనేక పార్కుల్లో లేదు. కేవలం కొన్ని పార్కుల్లోనే ఉంది. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఉన్న పార్కుల్లో గ్రీనరీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి జీమ్‌లు, ఆట పరికారాలు లేని పార్కుల్లో వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – మురళి, స్థానికుడు అభివృద్ధి, నిర్వహణకు చర్యలు తీసుకుంటా.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధికి నోచుకొని పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అదే విధంగా నిర్వహణకు నోచుకొని పార్కులను వెంటనే గుర్తించి ప్రతి రోజు పార్కుల నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తా. అదే విధంగా పార్కుల్లో గ్రీనరీ పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటా. – శంకరయ్య, కమిషనర్, నిజాంపేట్ -
Hyderabad: పార్కుల్లో ఫొటోలు తీస్తారా?
హైదరాబాద్: పార్కుల్లో ఇక నుంచి ఫొటోలు ఉచితంగా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు నగరంలోని పలు పార్కుల్లో ఫొటోలు తీసుకోవాలంటే వెయ్యి రూపాయాలు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం నగరంలోని పలు పార్కుల్లో మినహాయింపు కల్పించారు. (ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్!) లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కులో కెమెరాలను తీసుకెళ్లవచ్చు. అక్కడి దృశ్యాలను తమ కెమెరాలతో బంధించవచ్చు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు హుడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్ అర్వింద్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. (విమానంలో సీటుకింద కేజీకిపైగా బంగారం) -
జీవీఎంసీ పరిధిలో పార్కుల అభివృద్ధి
-
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన
-
కరోనా ఎఫెక్ట్: ఏపీలో జూ పార్క్‌లు మూసివేత
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్‌ల్లో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది. ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ.. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపట్నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. మధ్యాహ్నం 12 తరువాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. చదవండి: తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన.. తెరిచి చూస్తే షాక్.. రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
కోవిడ్ సెకండ్ వేవ్ :పార్కులపై పడ్డ ప్రభావం
-
రూ.92 కోట్లతో పార్కులు.. పచ్చదనం
సాక్షి, అమరావతి: ‘ఆట విడుపు, వాహ్యాళికి పార్కులు లేవు.. ఆహ్లాదానికి పచ్చదనం లేదు..’ అని చింతపడుతున్న పట్టణ ప్రజలకు ఊరట కలిగించేందుకు పురపాలకశాఖ సమాయత్తమైంది. కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో.. అమృత్ పథకంలో భాగంగా పార్కుల నిర్మాణం, పచ్చదనం పెంపొందించేందుకు కార్యాచరణ చేపట్టింది. మొదటిదశలో లక్షలోపు జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో 125 పార్కుల నిర్మాణంతోపాటు పచ్చదనం పెంపొందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పార్కుల నిర్మాణం, ఖాళీ ప్రదేశాల నిర్వహణ చేపడుతోంది. ప్రతి మునిసిపాలిటీలో కనీసం రెండు పార్కుల చొప్పున మొత్తం మీద 125 పార్కులు నిర్మిస్తారు. ఇందుకోసం అధికారులు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించారు. విశాలమైన పార్కు, వాటిలో వ్యాయామ ఉపకరణాలు, ఫౌంటేన్ నిర్మాణంతోపాటు ల్యాండ్ స్కేపింగ్ చేపడతారు. పట్టణాల్లో ప్రధాన రోడ్ల వెంబడి మొక్కలు పెంచుతారు. ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో అర్బన్ ఫారెస్ట్రీ కింద దట్టంగా మొక్కలు పెంచుతారు. మొత్తం మీద పార్కులు, పచ్చదనం పెంపొందించేందుకు రూ.92.10 కోట్లతో 95 పనులు చేయనుంది. ఇప్పటికే 87 పనులు మొదలయ్యాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. పట్టణాల్లో పార్కుల నిర్మాణం, నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఖాళీ ప్రదేశాల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలకశాఖ అనుసరిస్తోంది. పట్టణాల్లోని కాలనీల్లో పార్కులు 5 వేల చదరపు మీటర్లు, కమ్యూనిటీ పార్కులు 10 వేల నుంచి 15 వేల చ.మీ., జిల్లా కేంద్రంలోని ప్రధాన పార్కు 50 వేల నుంచి 2.50 లక్షల చదరపు మీటర్లలో నిర్మిస్తారు. ఇక మునిసిపాలిటీల్లో ప్రతి పౌరుడికి 10 నుంచి 12 చదరపు మీటర్ల వంతున ఖాళీ జాగా ఉండాలి. ఆ ప్రకారం పట్టణాలను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. పెద్ద మునిసిపాలిటీలు ఏ గ్రేడ్‌లో, చిన్న మునిసిపాలిటీలు బీ గ్రేడ్‌లో ఉండాలని నిర్దేశించారు. సీ గ్రేడ్‌లో ఒక్కటి కూడా ఉండకుండా చూడాలని పురపాలకశాఖ మునిసిపల్ కమిషనర్లకు స్పష్టం చేసింది. పార్కులు నిర్మించి పట్టణాల్లో పచ్చదనం పెంపొందిస్తామని ఈఎన్సీ చంద్రయ్య చెప్పారు. చదవండి: చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. 17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు -
కోటి ఆశలతో.. కొత్త ఏడాదిలోకి..
-
పార్కుల్లో సీసీటీవీలు..
సాక్షి, హైదరాబాద్: వినోదపు పార్కులు, ఫుడ్‌కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్ ఏరియాల్లో వినోదపు పార్కులు తెరవ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి జరగకుండా వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వినోద కేంద్రాలకు, పార్కుల్లోకి సందర్శకులు విశ్రాంతి, వినోదం కోసం పెద్దసంఖ్యలో వస్తారు. కాబట్టి కరోనా నివారణ చర్యలు పాటించడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పింది. ఇవీ మార్గదర్శకాలు ► కనీసం ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. మాస్క్ తప్పనిసరి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. లేకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను వాడాలి. ఉమ్మివేయడం నిషేధం. ►65 ఏళ్లు పైబడిన, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి. ►పార్కుల్లో పనిచేసే వారిలో అనారోగ్యంతో ఉన్నవారు, వయసు పైబడిన, గర్భిణులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా విధులు నిర్వహించాలి. ► ఫుడ్‌కోర్టులు ఇతర చోట్ల రద్దీని గుర్తించడానికి íసీసీటీవీలతో పర్యవేక్షించాలి. ► ప్రాంగణం లోపల, వెలుపల భౌతికదూరాన్ని పాటించేలా నేలపై నిర్ధిష్ట గుర్తులుపెట్టాలి. ప్రాంగణం లోపల, వెలుపల క్యూ పాటించాలి. క్యూ, భౌతికదూరం పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని నియమించాలి. ► ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యం అనుమతించకూడదు. ఫుడ్‌కోర్టు సిబ్బంది లేదా వెయిటర్లు మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించాలి. ► మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు మొదలైన వాటితో పాటు డోర్ హ్యాండిల్స్, ఎలివేటర్ బటన్లు, కుర్చీలు, బెంచీలు, అంతస్తులు, గోడలు మొదలైనవాటిని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి. ► వాష్‌రూమ్‌లలో సబ్బు, ఇతర సాధారణ ప్రాంతాల్లో హ్యాండ్ శానిటైజర్లను తగినంత పరిమాణంలో ఉంచాలి. మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులు, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం, ఇతరత్రా లాజిస్టిక్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ► సందర్శకులు, ఉద్యోగులు ఉపయోగించిన మాస్క్‌లను ప్రత్యేక కవర్ డబ్బాలలో పారవేసేలా ఏర్పాట్లు చేయాలి. ►స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసివేయాలి. నీటితో కూడిన వినోదం అందించే పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటిచోట్ల నీటి వడపోత, క్లోరినేషన్ తప్పనిసరి. ►రద్దీ ఎక్కువుండే వారాంతం, సెలవు రోజుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ►ఆన్లైన్ టిక్కెట్ సదుపాయాన్ని ప్రోత్సహించాలి. టికెట్లు జారీ చేసేటప్పుడు చేయవలసిన, చేయకూడని సూచనలతో కూడిన కరపత్రాలు పంచాలి. లేదా టికెటట్లపైనే వాటిని ముద్రించవచ్చు. ►సహజ వెలుతురు ఉండాలి. క్రాస్ వెంటిలేషన్ తగినంతగా ఉండాలి. ►ఎవరైనా కోవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే పార్కును సందర్శించవద్దని తెలపాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి ప్రవేశం లేదు. ► కోవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లను, స్థానిక ఆరోగ్య అధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి. ►ప్రవేశద్వారం వద్ద శానిటైజర్ డిస్పెన్సర్, థర్మల్ స్క్రీనింగ్ తప్పక ఏర్పాటుచేయాలి. ఎగ్జిట్ మార్గాల కోసం వీలైనన్ని గేట్లు ఏర్పాటు చేయాలి. ►వాలెట్ పార్కింగ్ అందుబాటులో ఉంటే మాస్క్‌లు ధరించిన ఆపరేటింగ్ సిబ్బందితో పనిచేయించాలి. వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, కీలు మొదలైన వాటిని శుభ్రపరచాలి. ►పార్క్ ప్రాంగణంలో కుర్చీలు, బెంచీలు మొదలైన వాటి మధ్య ఆరడుగుల దూరం ఉండాలి. ► కాంటాక్ట్‌లెస్ ఆర్డరింగ్ మోడ్, డిజిటల్ మోడ్ చెల్లింపులను ప్రోత్సహించాలి. -
వాకింగ్‌కు ఏదీ అవకాశం!
సాక్షి, హైదరాబాద్: రోజూ ఉదయంపూట నడక.. రోగాలను దూరంగా ఉంచుతుందంటారు. అయితే కరోనా వైరస్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో నగరజీవి ఉదయంపూట నడకకు దూరం కావాల్సి వచ్చింది. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలని సూచిస్తున్న వైద్యులు, తగిన వ్యాయామం కూడా అత్యవసరమని చెబుతున్నారు. ఇంతకాలం పార్కుల్లో నిత్యం ఉదయం, సాయంత్రం నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారు ఇప్పుడు నాలుగు నెలలుగా నడకకు దూరం కావాల్సి వచ్చింది. దానికి లాక్డౌన్ నిబంధనలే అడ్డుగా మారటం గమనార్హం. నాలుగు నెలలుగా దూరం.. మార్చిలో జనతా కర్ఫ్యూ తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో మున్సిపల్ పార్కులన్నింటిని మూసేశారు. అప్పుడు మూసుకున్న గేట్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. హైదరాబాద్‌లోని చాలా కాలనీలు, బస్తీల్లో మున్సిపల్ పార్కులు తప్ప నడకకు సరైన ప్రదేశాలంటూ లేవు. దీంతో శారీరక ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా పార్కుల్లోనే వాకింగ్ చేసేవారు. కానీ, లాక్‌డౌన్‌తో పార్కులు మూసేసిన తర్వాత వారికి వాకింగ్ చేసే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో కొందరు గత్యంతరం లేక రోడ్లపైనే నడుస్తున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవటంతో వారు రోడ్లపై నడిచేందుకు భయపడుతున్నారు. ఇతర పనులకు నడుచుకుంటూ వెళ్లేవారికి దగ్గరగా నడవాల్సి రావటంతో వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మరింతగా భయపడుతున్నారు. వైరస్ సోకుతుందన్న భయంతో అసలు వాకింగ్‌కే వెళ్లటం మానేశారు. పార్కులు తెరిచి ఉంటే ధైర్యంగా నడిచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా.. పార్కులను మాత్రం తెరవకపోవటంతో వాకర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్కులు మూసి ఉండటంతో ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారు సరైన నడక లేక ఇబ్బంది పడుతున్నారు. దుకాణాలు, హోటళ్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడేవారిని నియంత్రించటంలో విఫలమవుతున్న అధికార యంత్రాంగం, అతి తక్కువ మంది వచ్చే పార్కులను పూర్తిగా మూసి ఉంచటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్కులు తెరవండి క్రమబద్ధమైన నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. నా దగ్గరికి వచ్చే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కచ్చితంగా వాకింగ్ సిఫారసు చేస్తాను. కానీ ఇప్పుడు వాకింగ్ చేసేందుకు అనువైన పార్కులు లేకపోవటంతో చాలామంది ఆ ప్రక్రియకు దూరమై మధుమేహాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. కరోనా భయంతో ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమవుతున్నవారు.. ఓ రకమైన మానసిక సమస్యలోకి జారుకుంటున్నారు. వీరికి నడక చాలా అవసరం. అలాగే కరోనా సోకకుండా ఉండాలంటే శరీరం కూడా ఫిట్‌గా ఉండాలి. దానికి వాకింగ్ ఎంతో అవసరం. పార్కులకు నిర్ధారిత వేళలు విధించటం, వాకర్స్ మాత్రమే పార్కులను వినియోగించుకునేలా చూడ్డం ద్వారా కరోనా భయం లేకుండా చేయొచ్చు. – డాక్టర్ సీతారాం, డయాబెటాలజిస్టు -
స్థలాలు,పార్కుల రక్షణ కోసం ఫిర్యాదు అందించవచ్చు
-
పార్కులు వెలవెల
ముషీరాబాద్/వెంగళరావునగర్: పార్కులు వెలవెలపోయాయి. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో పార్కులను మూసివేశారు. మరికొన్ని పార్కుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సంవదర్శకులను సైతం అనుమతించలేదు, ‘తాము ప్రేమికులం కాద’ని చెప్పినప్పటికీ అనుమతించలేదని పలువురు సందర్శకులు విస్మయం వ్యక్తం చేశారు. వాలెంటైన్స్‌డే బహిష్కరించాలని భజరంగ్‌దళ్ తదితర సంస్థలు కొంత కాలంగా పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి రోజు సందర్శకులతో కిటకిటలాడే ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్‌పార్కు తదితర పార్కులు జన సంచారం లేక బోసిపోయాయి. ఇదిలా ఉండగా ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చే వాకర్లు, ఇతర సందర్శకులు సైతం ఇబ్బందికి గురయ్యారు. జీహెచ్ఎంసి పార్కును మూసివేయాలంటే అటు పోలీసులు, లేదా అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు గాని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే అలాంటి ఉత్తర్వులు లేకపోయినా వెంగళరావునగర్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడకు చెందిన కొందరు యువకులు బుధవారం తెల్లవారుజామున కృష్ణకాంత్ పార్కుకు వచ్చి సెక్యూరిటీని బెదిరించి తాళాలు వేయాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది భయపడి పార్కుకు తాళాలు వేయకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. అదే సమయంలో పార్కుకు వచ్చిన వాకర్స్, సీనియర్ సిటిజన్స్, మహిళలు పార్కుకు వచ్చినప్పటికీ వారిని లోపలికి అనుమతించలేదు. పోలీసుల అదుపులో కృష్ణకాంత్‌పార్కు... కొందరు వాకర్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ సిబ్బంది హుటాహుటిన పార్కు వద్దకు చేరుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కేవలం మగవారిని మాత్రమే లోపలికి ప్రవేశించడానికి అటు పోలీసులు, ఇటు పార్కు అధికారులు అనుమతించారు. అంతేగాకుండా బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం వరకు పార్కుకు వచ్చిన ప్రేమికులు, సందర్శకులను అనుమతించకపోవడంతో నిరుత్సాహంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో పార్కులో 50 టిక్కెట్లు కూడా (ప్రైవేటు స్కూల్ చిన్నారులు మినహా) విక్రయించలేదని సిబ్బంది తెలిపారు. నిత్యం పండగ వాతావరణాన్ని తలపించే పార్కుల బయట కూడా కళా విహీనంగా మారిపోయింది. -
పార్కులో గుడి కడుతుంటే చూస్తుంటారా?
సాక్షి, హైదరాబాద్ : పార్కులు, ఖాళీ స్థలాల్లో ఇప్పుడు ఆలయాన్ని కడుతుంటే అధికారులు అడ్డుకోకపోతే రేపు మసీదులు, చర్చిలు, గురుద్వార్ వంటివి కూడా అక్రమంగా నిర్మించేస్తారని హైకోర్టు హెచ్చరించింది. దేవుడి పేరుతో ఈ విధంగా ఆక్రమణలకు పాల్పడుతుంటే అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఇంత ఉదాసీనంగా అధికారులు ఎందుకు ఉన్నారో ఫిబ్రవరి 26న జరిగే తదుపరి విచారణ సమయంలో తమకు స్వయంగా వివరించాలని పలువురు అధికారులను ఆదేశించింది. ఈమేరకు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఎండీఏ కమిష నర్, సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి, అమీన్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశిస్తూ సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ధర్మం దారి తప్పినప్పుడు దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడని, చట్టమే ప్రమాదంలో పడితే ఏం చేయాలని వ్యాఖ్యానించింది. అమీన్పూర్ గ్రామం లోని మాధవపురి హిల్స్‌లోని రాక్ గార్డెన్స్‌లో ఆలయాన్ని నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
కొత్త ఆశలతో..
-
షాకింగ్: పార్కుల్లో అమ్మాయిలను చూసి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై వేధింపులకు అడ్డే లేకుండాపోయింది. హస్తినలో మహిళలు నిత్యం ఎక్కడో చోట లైంగిక వేధింపులకు, అసభ్య చర్యలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పార్కులో అమ్మాయిలను చూడగానే.. బహిరంగంగా లైంగిక అసభ్య చర్యలకు పాల్పడుతున్న ఓ కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని పలు విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్న పార్కుల్లో అమ్మాయిలను చూడగానే నిందితుడు బహిరంగంగా లైంగిక స్వయం సంతృప్తి చర్యలకు పాల్పడేవాడు. తాజాగా చిత్తరంజన్ పార్కులో వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలకు ఇదే షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదకొండు రోజులు గాలించిన పోలీసులు.. అమ్మాయిలు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడి పేరు మిథున్ బెనర్జీ. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన అతడు గత రెండేళ్లుగా ఢిల్లీలోని గోవింద్‌పురిలో నివాసముంటున్నాడు. స్టెపంబర్ 5వ తేదీన పార్కులో వాకింగ్ చేస్తున్న ముగ్గురు అమ్మాయిలను చూసి.. నిందితుడు బహిరంగంగా లైంగిక అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. అంతేకాదు, అతడు గతంలో అలకనంద, గ్రేటర్ కైలాశ్ పార్కుల్లోనూ ఇదే విధంగా అమ్మాయిలు ఎదురుగా అసభ్య చర్యలకు దిగాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. చదవండి: యువతి ఎదుట ఆటోడ్రైవర్ లైంగిక అసభ్య చర్య! -
పార్కుల్లో మందు‘పార్టీలు’
సాక్షి, పరవాడ: ఆహ్లాదాన్ని పంచే పార్కులు అసాంఘి క కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నా యి. తీర ప్రాంతాల్లోని పార్కుల్లో నిత్యం మందు‘పార్టీలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వచ్చే పర్యాటకులు, సందర్శకులు నానా అవస్థలు పడుతున్నారు. ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కులు అధ్వానంగా తయారయ్యాయి. తీరంలో సేద దీరడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సీ వాటర్ పార్కు, మినీ పార్కుల దుస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇక్కడ పార్కులకు విశాఖ స్టీల్ ప్లాంటు, గాజువాక, అగనంపూడి, సబ్బవరం, అనకాపల్లి, పరవాడ, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల నుంచి ప్రతీ ఆదివారం, సెలవు దినాల్లో పర్యాటకులు నిత్యం అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వేసవి సెలవుల్లో నిత్యం విద్యార్థులతో తీర ప్రాంతాలతో పాటు పార్కులు కళకళలాడుతుంటా యి. అయితే కొందరు ఆకతాయిల వల్ల ఇవి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే యువకులు పుట్టిన రోజు, పెళ్లి రోజు పేరుతో నిత్యం మందు పార్టీలు చేసుకుంటున్నారు. పర్యాటకానికి దెబ్బ... తాగిన మద్యం సీసాలు, ఆకులు, ప్లేట్లు, డ్రింకు బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులను ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు. కొందరు ఆకతాయిలు ఖాళీ మద్యం సీసాలను చితక్కొట్టి విసేరేస్తున్నారు. చితికిన గాజు పెంకులు ఇసుకలో కూరుకుపోయి ఉంటున్నాయి. బీచ్‌లకు వస్తున్న పర్యాటకులు ఆట పాటలతో సరదాగా గడుపుతున్న సమయంలో ఇసుకలో ఉన్న గాజుపెంకులు కాళ్లకు గుచ్చుకొని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు అనేకం. తిక్కవానిపాలెం తీరంలో ఎన్టీపీసీ జెట్టీ వద్ద ఏర్పాటు చేసిన సీ వాటర్ పార్కును ఆకతాయిలు పాల్పడుతున్న ఆసాంఘిక కార్యకలాపాల వల్ల పార్కు లోపటికి సందర్శకులను అనుమతించడం మానేశారు. ఇక్కడి మినీ పార్కును ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. పార్కులో నిర్మించిన గొడుగుల కింద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత ఎక్కడ పడితే అక్కడ మద్యం సీసాలు, గాజు పెంకులు పడేస్తూ వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీని కూడా ఉపయోగించడం లేదు. ఆదివారమైతే అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి ఇక్కడి సరుగుడు, జీడి మామిడి తోటల్లో జూదం ఆడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లను ఎత్తివేయడంతో ఆకతాయిలకు ఆగడాలకు అడ్డూ అదుపులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పార్కులూ వదలట్లే!
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఏడు దుకాణాలు, ఒక డెయిరీ పార్లర్ ఉన్నాయి. వీటిని చూసిన వారెవరైనా అవి లేఅవుట్ స్థలమో లేక పార్కునో కబ్జా చేసి కట్టినవంటే నమ్మలేరు. కానీ అవి ఆక్రమించిన స్థలంలో కట్టినవేనని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం తనిఖీల్లో తేలింది. ఇవేకాదు.. నగరవ్యాప్తంగా ఎన్నెన్నో లేఅవుట్లలో ఉండాల్సిన ఖాళీ స్థలాలు, పార్కు స్థలాలు దురాక్రమణకు గురయ్యాయి. వాటిలో దుకాణాలు, నివాసాలు సైతం వెలిశాయి. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసే నగరంలో లేఅవుట్లలోని పార్కులు, ఖాళీస్థలాలను వదలకుండా దొరికినంతా ఆక్రమించేశారు. ఇలాంటి స్థలాల్లో కొందరు ఇళ్లుఇంకొందరు దుకాణాలు నిర్మించుకోగా.. మరికొందరు ప్రహరీలు నిర్మించి చిన్న గుడిసెలో, ఏసీ షీట్లతో గదులో వేశారు. కొన్ని చోట్ల అయితే ప్రార్థనా మందిరాలు సైతం కట్టేశారు. అయితే బల్దియా అధికారులు కాలనీల్లోని పార్కులు, ఓపెన్‌స్పేస్‌ల లెక్క తేల్చేందుకు నడుం బిగించింది. నమూనాగా సర్కిల్‌కు ఓ పార్కు/ఓపెన్ స్పేస్ చొప్పున లెక్కించగా.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో కబ్జాల పాలైనవి 20 వేల గజాలకు పైగా ఉన్నట్టు తేలింది. ఎంత లేదన్నా ఈ స్థలం విలువ కనిష్టంగా రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక గ్రేటర్ వ్యాప్తంగా అన్ని పార్కుల లెక్కా తీస్తే ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు కబ్జా పాలయ్యాయో చెప్పలేం. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కబ్జాల పాలైనవి కొన్నయితే, రౌడీయిజంతో పరుల పాలైనవి ఇంకొన్ని. ఇతరత్రా మార్గాల్లో ప్రైవేట్ పరమైనవి కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సర్వేలో కబ్జాపాలైనట్లు గుర్తించిన స్థలాల్లో తొలిదశలో ఒక్కో సర్కిల్లో ఒక్కో పార్కు/ఓపెన్ స్థలంలోని కబ్జాలను తొలగించి, తగిన రక్షణ ఏర్పాట్లు చేసి మున్ముందు కబ్జా కాకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఈవీడీఎం విభాగం నిర్ణయించింది. ఇందుకు ఆయా పార్కులను తగిన విధంగా అభివృద్ధి చేయడంతో పాటు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి తెలిపారు. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో ఆయా లేఅవుట్లలోని ఒక్కో ఖాళీ స్థలం లేదా పార్కును పరిగణనలోకి తీసుకుంటే ఉండాల్సిన మొత్తం స్థలం 47,902 చదరపు గజాలు కాగా, వాటిలో 20 వేల చదరపు గజాలకు పైగా ఆక్రమణలకు గురైనట్లు వెల్లడైంది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని, భద్రత కల్పించే చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. కబ్జాకు గురైన పార్కులు,ఖాళీ ప్రదేశాలు ఇలా.. ఏఎస్రావు నగర్‌లోని న్యూఫ్లోరా హోటల్ సమీపంలో, ఉప్పల్ సర్కిల్లో కాకతీయ కాలనీ, హయత్‌నగర్‌లో జైపురికాలనీ, ఎల్బీనగర్లో అగ్రికల్చర్ కాలనీ, సరూర్‌నగర్‌లో జైస్వాల్ కాలనీ, మలక్‌పేట సర్కిల్లో సెయింట్ డోమ్నిక్స్ స్కూల్ పక్కన, సంతోష్‌నగర్‌లో సింగరేణి కాలనీ, చాంద్రాయణగుట్టలో రాజన్నబౌలి దగ్గర, ఫలక్‌నుమాలో బహదూర్‌పురా హౌసింగ్‌బోర్డు కాలనీ, రాజేంద్రనగర్ సర్కిల్లో గోల్డెన్ హైట్స్ కాలనీ, మెహదీపట్నంలో ఏజీఎస్ ఆఫీస్ కో–ఆపరేటివ్ సొసైటీ, కార్వాన్లో సాలార్జంగ్ కాలనీ, కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, గోషామహల్ సర్కిల్లో మహేశ్‌నగర్, జూబ్లీహిల్స్‌లో ప్రశాసన్‌నగర్, అంబర్‌పేట సర్కిల్లో పటేల్‌నగర్, మల్కాజిగిరిలో దుర్గానగర్, బేగంపేటలో సింధికాలనీ, యూసుఫ్‌గూడలో మధురానగర్ ఎఫ్ బ్లాక్, శేరిలింగంపల్లి సర్కిల్లో నల్లగండ్ల, చందానగర్‌లో భవానీపురం కాలనీ, ఆర్సీపురం, పటాన్చెరు సర్కిల్లో సింఫనీకాలనీ, మూసాపేట సర్కిల్లో కేపీహెచ్‌బీ 4వ ఫేజ్, కూకట్‌పల్లిలో ఆదిత్యానగర్, కుత్బుల్లాపూర్‌లో ప్రతాప్‌రెడ్డి కాలనీ, గాజులరామారంలో మిథిలానగర్, అల్వాల్ సర్కిల్లో తిరుమల ఎన్క్లేవ్ ప్రాంతాలు ఉన్నట్లు విజిలెన్స్ సర్వేల్లో గుర్తించారు. 30 సర్కిళ్లలో వెరసి దాదాపు వంద ఆక్రమణలు జరిగాయి. -
ఆడుకుంటూ బాలుడి మృతి.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు ఆడుకుంటూ మృతి చెందాడు. జనప్రియ అపార్ట్మెంట్లోని పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశాంత్ శర్మ సిమెంట్ బెంచ్‌పై ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా కిందపడిపోయాడు.. సిమెంట్ బెంచ్ ఆ బాలుడిపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విరిగిపోయిన కుర్చీ ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. పార్క్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే.. బాలుడు మరణించినట్టు అపార్ట్‌మెంట్‌వాసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రా‘బంధువులవుదాం’
సాక్షి, హైదరాబాద్: అంతరించిపోతున్న అరుదైన జాతి రాబందులను సంరక్షించేందుకు బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపింది. జెజ్జూరుతో పాటు గూడెం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి ‘జటాయు’ పేరుతో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతంలో గల పాలరాపుగుట్ట మీద రాబందుల ఉనికిని 2013లో గుర్తించారు. 200 మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న పాలరాపుగుట్టపై 100 మీటర్ల ఎత్తులో రాబందులు ఆవాసం ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. రాబందుల పునరుత్పత్తి, ఆవాసాలకు రక్షణ కల్పించేందుకు అదే సంవత్సరం నుంచి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. 2013లో 10 రాబందులు మాత్రమే ఇక్కడ ఉండగా, 2016–17 నాటికి 30కి పెరిగాయి. ఏటా సగటున 6 నుంచి 8 రాబందుల పిల్లలు పుడుతున్నాయి. వీటి పరిరక్షణకు బెజ్జూరు రిజర్వ్ అటవీ ప్రాంతం, గిరెల్లి అటవీ బ్లాకులను కలిపి 397.99 చ.కి.మీ. మేర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం అవసరమని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అటవీ శాఖ నివేదించింది. పులుల రక్షణకు కూడా.. మహారాష్ట్రలోని తాడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇం ద్రావతి పులుల సంరక్షణ కేంద్రాల నుంచి రాష్ట్రం లోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రానికి పులుల రాకపోకలకు బెజ్జూరు రిజర్వు అటవీ ప్రాంతం కారిడార్‌గా ఉపయోగపడుతోంది. 2016 తర్వాత కెమె రాలకు 7 పులులు చిక్కాయి. ఈ ప్రాంతంలో చిరు తలు, ఎలుగుబంట్లు, చౌసింగా, సాంబార్, నీల్గాయ్ జింకలు, దుప్పులూ నివాసముంటున్నాయి. వాస్తవానికి 2016 డిసెంబర్లో జరిగిన రాష్ట్ర వన్య ప్రాణుల బోర్డు సమావేశంలో కాగజ్‌నగర్ డివిజన్‌ను రాబందుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన తదుపరి బోర్డు సమావేశంలో బెజ్జూరును వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పా టుచేస్తే అంతరించిపోతున్న పులులు, రాబందులు, ఇతర వన్యప్రాణులకు రక్షణ లభిస్తుందని తీర్మానించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటిస్తే అందులోకి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం అమల్లోకి రానుంది. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు సైతం లభించనున్నాయి. ఆహారం కోసం గడ్చిరోలికి.. రాష్ట్రంలో పాలరాపుగుట్టపైనే రాబందులున్నా యి. దక్షిణ భారత్‌లో రాబందుల అతిపెద్ద నివాస ప్రాంతం ఇదే. భారత్, పాకిస్తాన్, నేపాల్‌లో ఈ జాతి రాబందులు అరుదుగా కనిపిస్తున్నాయి. పాలరాపుగుట్టపై ఉండే రాబందులకు పశువుల కళేబరాలను ఆహారంగా వేసినా తినకుండా గడ్చిరోలికి వెళ్తున్నాయని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
పార్కుల్లో ప్రవేశం మరింత భారం
సాక్షి, హైదరాబాద్: కుటుంబంతో సరదాగా గడిపేందుకు.. బంధుమిత్రులతో ఆనందంగా ఉండేందుకు పార్కులకు వచ్చే సందర్శకులకు ప్రవేశ రుసుం ఇక మరింత భారం కానుంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) ఆధ్వర్యంలో నడుస్తున్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కులలో ప్రవేశ రుసుం పెంచాలని అధికారులు నిర్ణయించారు. పిల్లల ప్రవేశ రుసుంను రూ.10 నుంచి రూ.15కు, పెద్దల ప్రవేశ రుసుం రూ.20 నుంచి రూ.25కు పెంచారు. పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు అడ్డా.. ఎన్టీఆర్ గార్డెన్తో పాటు లుంబినీ పార్కులు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు అడ్డాగా మారాయి. శని, ఆదివారాల్లో కుటుంబసభ్యులు పిల్లలతో కలిసి ఈ పార్కులకు క్యూ కడుతుంటారు. ఇప్పటికే ఈ మూడు పార్కుల నుంచి నెలసరి ఆదాయం సీజన్లో రూ.1.20 కోట్ల వరకు వస్తుండగా, అన్‌సీజన్‌లో రూ.75 లక్షలు వస్తోంది. తాజాగా ప్రవేశ రుసుం పెంపుతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బీపీపీ అధికారులు భావిస్తున్నారు. వాకర్లకు తప్పని పెంపు.. సంజీవయ్య పార్కులో ప్రతిరోజూ ఉదయం వేళలో దాదాపు 500 మందికిపైగా వాకర్లు వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నడవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే వీరికి నెలసరి పాస్ కింద రూ.75 వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రవేశ రుసుం పెంపు నిర్ణయంతో వాకర్లకు కూడా నెలకు వసూలు చేస్తున్న రూ.75ను రూ.100కు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
‘మిథ్యా’న వనాలు
అవి పార్కులు.. మామూలుగా అయితే పచ్చని చెట్లు, మొక్కలు.. పిల్లల ఆట పరికరాలు.. ఆహ్లాదకర వాతావరణం ఉండాలి.. కానీ అక్కడ చెట్లు, మొక్కలు కాదుకదా గడ్డి కూడా ఉండదు.. అంతా చెత్తాచెదారం.. ఆ కాస్త భూమీ ఆక్రమణల మయం.. ఓ చోట వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోతే.. మరోచోట నివాస భవనాలు వెలిశాయి.. ఇక వివిధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ భవనాలు భూత్ బంగ్లాలుగా మారిపోతున్నాయి.. ఇదీ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్ల దుస్థితి. పార్కులు, కమ్యూనిటీ హాళ్ల పరిస్థితిపై ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్నో విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. – సాక్షి నెట్వర్క్ ఆనవాళ్లు కూడా లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పేరుకు పార్కులు ఉన్నా.. చాలా చోట్ల వాటి ఆనవాళ్లు కూడా లేవు. పిల్లలకు క్రీడా వసతులు, ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్‌ల వంటివేమీ లేవు. పచ్చదనం కనుమరుగై, పరికరాలు తుప్పుపట్టిపోయినవి కొన్ని అయితే.. ఎడాపెడా కబ్జాల పాలవుతున్నవి మరికొన్ని. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలూ పార్కుల స్థలాల్లోనే.. ఇక స్థలాల కొరత పేరుతో.. చాలా చోట్ల పార్కుల స్థలాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. వనపర్తి, తాండూరు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పార్కు స్థలాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. పలుచోట్ల స్త్రీశక్తి భవనాలు, గ్రంథాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు పార్కు స్థలాలనే కేటాయిస్తున్నారు. ఇక బెల్లంపల్లి, జనగామ, పెద్దపల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, బాన్స్వాడ తదితర మున్సిపాలిటీల్లో అసలు పార్కులే లేవు. ప్రస్తుతం అమృత్ పథకం కింద ఎంపికైన పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వందకుపైగా పార్కులు రూపుదిద్దుకోనున్నాయి. వాటికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఖాళీ జాగా.. వేసెయ్ పాగా చాలా చోట్ల పార్కులు కబ్జాల పాల వుతున్నాయి. ‘ఇది ప్రభుత్వ భూమి’అని తెలిపే బోర్డు సహా దురాక్రమణకు గురవుతున్నా అడిగేవారు లేరు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో మాత్రం పార్కులు, పార్కు స్థలాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. మిగతా ఏ జిల్లాలో నూ ఉద్యానవనాలు, వాటి స్థలాలు చేతులు మారడమో, కబ్జా కావడమో జరిగినట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. వరంగల్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పార్కు స్థలాలపై అధికారుల వద్ద లెక్కాపత్రం కూడా లేకుండా పోయింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పార్కుల స్థలాల్లోనే గుడిసెలు, దుకాణాలు వెలిశాయి. వాటికి ఇంటి నంబర్లు కూడా ఇచ్చేయడం గమనార్హం. అలాంటి చోట తొలుత పేదల పేరుతో గుడిసెలు వేస్తున్నారు. కొంతకాలం తర్వాత భారీ భవంతులు నిర్మిస్తున్నారు. పార్కు స్థలం.. ప్రైవేట్ స్కూల్ పార్కింగ్ ప్లేస్ మెదక్ జిల్లా కేంద్రం నడిబొడ్డున జంబికుంట వీధిలోని పార్కు స్థలం ఇది. దీని విలువ కోటి రూపాయలకు పైమాటే. పక్కనే ఉన్న ఓ ప్రైవేటు స్కూలు నిర్వాహకులు ‘ఇది పార్కు స్థలం’అనే బోర్డు సహా ఆ స్థలాన్ని కబ్జా చేసేశారు. ఏకంగా ప్రహరీ కూడా కట్టేసి.. వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. కానీ ఇదేమిటని అడిగేవారెవరూ లేరు. మనుగడ కోల్పోతున్న కమ్యూనిటీ హాళ్లు మున్సిపాలిటీల పరిధిలోని వార్డులు, బస్తీలు, కాలనీల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ప్రభుత్వపర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. సరైన నిర్వహణ లేక చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల కమ్యూనిటీ హాళ్లు స్త్రీశక్తి భవనాలుగా మారిపోగా.. చాలా తక్కువ భవనాలు మాత్రమే కమ్యూనిటీ హాళ్లుగా వినియోగంలో ఉన్నాయి. ఇక పదులకొద్దీ మున్సిపాలిటీల్లో అసలు కమ్యూనిటీ భవనాలే లేకపోవగం గమనార్హం. కొన్ని చోట్ల ఉన్నా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఉదాహరణకు నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో పది కమ్యూనిటీ భవనాలున్నా.. చిన్నపాటి కార్యక్రమం కూడా నిర్వహించలేనంత ఇరుగ్గా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీలో ఉన్న ఓ పార్కు మిషన్ భగీరథ పంపుహౌస్‌గా మారిపోయింది. సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, మెదక్ మున్సిపాలిటీల్లోని ఐదు పార్కుల్లో ఒక్క నిమిషం గడపలేని పరిస్థితి ఉంది. పాత ఖమ్మం జిల్లా పరిధిలోని పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్వహణ లోపించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 20 పార్కుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నా.. పనులు మొదలు కాలేదు. చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జా అయ్యాయి. పాత రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల పార్కుల స్థలాలు కబ్జాల పాలయ్యాయి. తాండూరులో ఉన్న పార్కులో జిల్లా ఆస్పత్రిని నిర్మించారు. నిజామాబాద్ పట్టణంలో పేరుకు చాలా పార్కులున్నా ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయి. పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పేరుకే పార్కులు.. ఎక్కడా వసతులు లేవు. పలు చోట్ల పార్కుల కోసం ఉద్దేశించిన స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. కమ్యూనిటీ హాళ్లు అయితే పాడుబడిన బంగళాలను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా పార్కుల స్థలాలు పరాధీనమైపోయాయి. ఉన్న ఒకటి రెండు చోట్లా సౌకర్యాలేవీ లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇదే దుస్థితి. గోదావరిఖనిలో ఖాళీ స్థలంలో పార్కు, ఆస్పత్రి నిర్మాణంపై వివాదం నెలకొంది. లక్ష జనాభా ఉన్న జగిత్యాలలో ఒకే పార్కు ఉంది. -
హైదరాబాద్ లో పార్కులు మూసివేత
సాక్షి, హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే) సందర్భంగా హైదరాబాద్‌లో పార్కులు మూసివేశారు. ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్ దళ్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో భజరంగ్ దళ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మారువేశాల్లో షీ టీమ్స్ నిఘా పెట్టాయి. అంతేకాక పార్కులు, హోటల్స్, పబ్బులు, బార్ల వద్ద పోలీస్ బందోబస్తు పెరిగిపోయింది. నగరంలో హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డులో పోలీసులు బందోబస్తును పెంచారు. మరోవైపు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాలంటైన్ వేడుకలను నిషేధించిన లక్నో వర్సిటీ లక్నో: వాలంటైన్స్ డే వేడుకలను లక్నో యూనివర్సిటీ నిషేధించింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని అధికారులు బుధవారం వర్సిటీకి సెలవు ప్రకటించారు. వాలంటైన్స్ డే కూడా కావటంతో విద్యార్థులెవరైనా క్యాంపస్‌లో తిరిగినా, కూర్చున్నట్లు కనిపించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 14వ తేదీన తమ పిల్లలను వర్సిటీకి పంపవద్దంటూ తల్లిదండ్రులకు కూడా సమాచారం పంపారు. విదేశీ సంస్కృతి మోజులో పడిన కొందరు గత ఏడాది వర్సిటీ క్యాంపస్‌లో వాలంటైన్స్‌డే జరిపినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
పార్కులుగా మార్చడం సరైనదే..
ప్రభుత్వ స్థలాలపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను పార్కులుగా మార్చడం సరైనదేనని, ఎన్ని వీలుంటే అన్ని పార్కులు ఏర్పాటు చేయడం వల్ల లాభాలే ఎక్కువని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉంటే ఆక్రమణలకు గురవుతాయని, వాటిని పార్కులుగా మార్చితే తప్పేంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. సనత్‌నగర్ భరత్‌నగర్‌కాలనీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించింది. ఆ స్థలాన్ని క్రీడా మైదానంగా చేసుకుని పిల్లలు ఆడుకుంటున్నారని, ఇప్పుడు ఆ స్థలాన్ని పార్కుగా మార్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్ని పార్కుగా మార్చడంపై ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఇలాంటి అంశాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని స్పష్టం చేసింది. -
నాటి ప్రేమికుల కలకలం నేడెక్కడ?
న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు పెళ్లిళ్లపైనే కాదు ప్రేమికులపై కూడా ప్రభావం చూపిస్తోంది. నగరాల్లోని పార్కుల్లో ప్రేమికుల రాక తగ్గిపోయి బెంచీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. పల్లి, బఠాణీలు అమ్మేవారికి బోణీలేక పార్కుల్లో దీనంగా కూర్చుంటే, ఐస్‌క్రీమ్, టీబండ్లు నడిపేవారు రోడ్లపక్కనా దిగులుగా దిక్కులు చూస్తున్నారు. ఎప్పుడు కాలేజీ అమ్మాయిలతో, అబ్బాయిలతో కలర్ ఫుల్‌గా కనిపించే కాఫీ హౌజ్‌లు కలకలం తగ్గి వెలవెల బోతున్నాయి. మల్లీప్లెక్స్ థియేటర్లు కూడా యువతీ యువకుల కోలాహలం తగ్గి కూనిరాగాలు తీస్తున్నాయి. ఆ పక్కనే పాప్‌కార్న్ బిజినెస్ పడిపోయిన యువకుడి ముఖంలో విషాధ చిత్రం చూస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఘుమఘుమలాడే బిర్యాని తింటే కమ్మని కాఫీతోపాటు చల్లటి కోన్‌ను ఉచితంగా ఇస్తామంటూ రిస్టారెంట్ వాళ్లు రా, రమ్మని పిలుస్తున్నా పలికేవాళ్లు లేరు. ఇంకోపక్క పిడుగుల్లాంటి పిల్లల అల్లరితో ఎప్పుడూ సందడిగా కనిపించే వీడియో గేమ్స్ కూడా మూగబోయాయి. నోట్ల కష్టాలు మొదలవక ముందుదాకా ఆకాశంలో నెలరేడు పక్కన నక్కిన చుక్కలను లెక్కించిన ప్రేమికులు... ఇదివరకటిలా రోజు కలసుకోకపోయినా అప్పుడప్పుడు కలసుకొని కొత్త నోట్లను ఎంత పొదుపుగా వాడాలో లెక్కిలేసుకుంటున్నారు. అనువైన ఏటీఎంల వద్ద కలుసుకునేందుకు సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. క్యూలో ఒకరి కోసం ఒకరు నిలబడాలని కూడా బాస చేసుకుంటున్నారు. బర్గర్లు, పిజ్జాల స్థానంలో సమోసాలు, బజ్జీలతో బొజ్జలు నింపుకుంటున్నారు. కాఫీకి సెలవిచ్చి టీలను అరువు తీసుకుంటున్నారు. కారులో షికార్లు కొట్టే హైటెక్ ప్రేమికులు మాత్రం పాత నోట్లతో కూడా పండుగ చేసుకుంటున్నారు. పాత నోట్లను తీసుకుంటామంటూ స్పెషల్ ఆఫర్లు ఇస్తుండడంతో పబ్బులు, గిబ్బులని గోల చేస్తున్నారు. వారి త్రీస్టార్, ఫైవ్ స్టార్ జల్సాలకు, జాయ్ రైడ్లకు కొదవ లేకుండా పోయింది. ఇక రకరకాలు కార్డులతో రంగుల ప్రపంచంలో విహరించే ప్రేమికులకు నోట్లు పాతవైతేనీమీ, కొత్తవైతేనేమి. (సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యల ఆధారంగా ఈ కథనం) -
నగరంలో పార్కుల అభివృద్ధికి చర్యలు
మంచినీరు, పారిశుద్ధ్యం,రోడ్లపై ప్రత్యేక దృష్టి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం కమర్షియల్ జోన్లలో రోడ్డుపై కాగితం పడితే రూ.500 ఫైన్ విలేకరుల సమావేశంలో మేయర్ డాక్టర్ పాపాలాల్ ఖమ్మం మామిళ్లగూడెం: నగరంలో పార్కులు అధ్వానంగా ఉన్నాయని,వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నట్లు నగర మేయర్ డాక్టర్ పాపాలాల్ అన్నారు.మంగళవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు అవసరమైన మంచినీరు,పారిశుద్ధ్యం,రోడ్లపై దృష్టి సారించినట్లు, ఇక నుంచి నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటును కూడా నిషేధించినట్లు చెప్పారు.నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వాటర్‌ట్యాంకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళల కోసం షీ టాయిలెట్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూలై 2 వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు. కార్పొరేషన్‌లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ జోన్లలో కాగితం వేస్తే రూ.500 జరిమానా వైరారోడ్డులోని పలుసెంటర్లను కమర్షియల్ జోన్లుగా గుర్తించి ఆ ప్రదేశాల్లో కాగితాలు వేస్తే రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు శుభ్రం చేసేందుకు స్వీపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వైరా రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందితోపాటు పార్కింగ్ ఇబ్బంది కూడా ఉందని, అందుకు చేపల మార్కెట్ కోసం నిర్మించే నూతన భవనంలో అండర్ గ్రౌండ్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ నిర్మాణంపై స్టే ఉందని చెప్పారు. పంపులకు మోటార్లు పెడితే కఠిన చర్యలు.. నగరంలో పంపులకు మోటార్లు పెట్టి ఎవరైనా నీటిని వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆమోదం పొందని ఇళ్లకు నోటరీ ద్వారా పంపు కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఫంక్షన్‌హాళ్లలో చెత్త తొలగింపు కోసం ప్రస్తుతం రూ.1000 వసూలు చేస్తున్నట్లు,దీనిపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి రేటు పెంచి 4 ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నాగరాజు పాల్గొన్నారు. -
పార్కుల ఆహ్లాదం ఎక్కడ..
–పార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టని పాలకవర్గం –గాంధీ పార్కులో సైతం కానరాని పచ్చదనం కోదాడఅర్బన్: సుమారు 65వేల జనాభా, ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కోదాడ పట్టణ ంలో ప్రజల ఆహ్లాదం కోసం కనీసం ఒక్క పార్కు కూడా లేదు. సాయంత్రం వేళల్లో సరదాగా కాసేపు గడిపేందుకు అనువైన స్థలాలు పట్టణ వాసులకు కరువువయ్యాయి. మున్సిపాలిటీగా ఏర్పడి 5సంవత్సరాలు గడుస్తున్నా నేటివరకు ఒక్క కొత్త పార్కు కూడా రూపొందలేదు. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతీ సందర్భంలోనూ చెప్పే పాలకవర్గం కూడా నేటివరకు పార్కుల ఏర్పాటుపై ఏ సమావేశంలోనూ చర్చించిన దాఖలాలు లేవు. పార్కుల అభివృద్ధిపై శీత కన్ను.. పట్టణంలో ప్రస్తుతం ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. పేరుకు ఇది పార్కే కానీ ఇందులో పచ్చదనం మాత్రం కానరాదు. ఈ పార్కు స్థలంలో గ్రంథాలయం, మండల సమాఖ్యల కార్యాలయాలు నిర్మించడంతో విస్తీర్ణం తగ్గిపోయింది. మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన తరువాత బైపాస్‌రోడ్‌లోని ఓ వెంచర్లో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర గడిచినా, నేటివరకు పనులు పూర్తికాలేదు. ఈ పార్కును అక్కడి రియల్ ఎస్టేట్ వెంచర్ అభివృద్ధి కోసమే ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పట్టణంలో ఖళీగా ఉన్న మున్సిపల్ స్థలాలను మినీ పార్కులుగా అభివృద్ధి చేస్తే అవి కొంత మేరకైనా ఉపయోగపడతాయని పలువురు బావిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్కులు అభివృద్ధి చేయాలని పలవురు పట్టణ వాసులు కోరుతున్నారు. పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: వంటిపులి అనిత, చైర్పర్సన్ కోదాడ పట్టణంలోని ప్రజల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గాంధీపార్కుని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించాం. మున్సిపాలిటీకి రావాల్సిన లేఅవుట్ స్థలాలను స్వాధీనం చేసుకుని పార్కులను అభివృద్ధి చేస్తాం. -
ఉద్యాన వనాలుగా శ్మశానాలు
సిడ్నీ: ఊరవతలి దిబ్బపైనున్న శ్మశానంలో ఎండుటాకుల మధ్య నిట్ట నిలువుగా నిలబెట్టిన సమాధి రాళ్లను చూస్తే పగలే భయం వేస్తుంది. ప్రేతాత్మలను నమ్మే వారి సంగతి ఇక చెప్పక్కర్లేదు. అలాంటి చోటుకు వెళ్లి గతించిన ఆత్మీయులను తలచుకోవాలంటే, వారికి శ్రద్ధాంజలి ఘటించాలంటే గుండెల్లో గుబులు తప్పదు. ఆధునిక జీవన శైలిలో భాగంగా శ్మశానాలు కూడా ఇప్పుడు సుందర నందన ఉద్యాన వనాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సమాధి రాళ్ల స్థానంలో చెట్లు పుట్టుకొచ్చాయి. ఆత్మీయులను సమాధి చేసిన చోట పెంచుతున్న మొక్క ఏపుగా పెరుగుతుందా, లేదా ? ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, అసలు ఆ మొక్క ఎక్కడుందో గుర్తించేందుకు మొబైల్ యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ అదే కోవలో ఎకో ఫ్రెండ్లీ శ్మశానానికి డిజైన్ చేసింది. పరిసరాలు అహ్లాదకరంగా ఉండేందుకు చుట్టూ చెట్లు నాటినా, శ్రద్ధాంజలికి సంబంధించిన సంస్కారాలు చేసేందుకు వీలుగా సమాధి స్థలాన్ని ఖాళీగానే వదిలేస్తున్నారు. వాటిపై సమాధి రాళ్లు కూడా ఉండవు. పేరు, ఊరు రాసి మార్కు చేసి కూడా ఉండదు. అయితే ఎవరి సమాధి ఎక్కడుందో గుర్తించేందుకు వీలుగా జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వ్యవస్థ ద్వారా సమాధుల జాడ కచ్చితంగా తెలుసుకోవచ్చు. సిడ్నీకి శివారులో ఓ 25 ఎకరాల స్థలంలో ‘అకేషియా రిమంబ్రెన్స్ సాంక్చరీ’ అనే సంస్థ, సిడ్నీలోని క్రోఫీ ఆర్కిటెక్ట్స్‌తో కలసి ఉద్యానవనం లాంటి ఈ ఎకో ఫ్రెండ్లీ శ్మశానాన్ని నిర్మిస్తోంది. అందమైన ల్యాండ్ స్కేప్తోపాటు గలగలపారే సెలయేళ్లు, వివిధ రకాల పుష్పాలతో బంధువులు సేదతీరేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామని సాంక్చరీ యజమానులు తెలియజేస్తున్నారు. లండన్‌లో కూడా ఇలాంటి ఓ శ్మశాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందని వారు చెప్పారు. -
చల్ల‘ధనం’
డార్జిలింగ్ : టూర్‌దర్శన్ మండించే వేసవిలో మంచులాంటి చల్లదనం ఎక్కడ దొరుకుతుంది? విసుగెత్తే సెలవుల్లో ఉల్లాసాన్ని కలిగించే వినోదం ఎక్కడ లభిస్తుంది? కుటుంబంతో కలిసి వెళ్లాలి. పిల్లల సరదా తీరాలి. పెద్దల మనసులు ఆధ్యాత్మిక తీరాలను తాకాలి. యువకులు ప్రకృతి కన్య సొగసుకు పరవశించిపోవాలి. మహిళలు తనివి తీరా షాపింగ్ చేయాలి. శరీరం అలసిపోకూడదు. మనసు మాత్రం మైమరచిపోవాలి. ఇవన్నీ జరగాలంటే... డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్) వెళ్లాలి. సంవత్సరమంతా ధనం సంపాదించడానికి ఆఫీసుల చుట్టూ పరుగులు తీస్తాం. కానీ వేసవిలో మాత్రం డార్జిలింగ్కి పరిగెట్టాలి. ఎందుకంటే అసలు సిసలు ధనం అక్కడే దొరుకుతుంది. అదే... చల్ల‘ధనం’! మరి వెళ్లి మూటగట్టుకోండిక... ఏం చూడాలి? డార్జిలింగ్ వెళ్లగానే మొదట చూడాల్సింది కాంచన్‌జంగా పర్వతాన్ని. ఇది ప్రపంచంలోనే మూడో ఎత్తై పర్వతం. ఇక్కడ స్నో లెపర్డ్, హిమాలయన్ బ్లాక్ బేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పర్వతం చుట్టుపక్కల ఉండే జలపాతాలు, తోటల అందాలు కళ్లను చెదర గొడుతుంటాయి. దాని దగ్గరే ఉన్న డార్జిలింగ్ వార్ మెమోరియల్, టైగర్ హిల్ మంచి సందర్శనీయ స్థలాలు. ఉదయం నాలుగు గంటలకు టైగర్ హిల్ మీది నుంచి సూర్యోదయాన్ని చూడటం ఓ గొప్ప అనుభూతి. డార్జిలింగ్‌లో పార్కులు ఎక్కువ. ముఖ్యంగా పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు పిల్లలను బాగా ఆకట్టు కుంటాయి. పద్మజా నాయుడు పార్కు 67 ఎకరాల విస్తీర్ణంలో, మైదానం మీది నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. దేశంలో అత్యంత ఎత్తై ప్రదేశంలో ఉన్న పార్కుగా దీనికి గొప్ప పేరుంది. చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం 960.31 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. వర్షాకాలంలో (జూన్ 16- సెప్టెంబర్ 15) ఈ పార్క్‌ను మూసి వేస్తారు. మిగతా అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుంది. * డార్జిలింగ్ మంచి ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ముఖ్యంగా మహాకాల్ మందిరం. హిందూ, బౌద్ధం... రెండు మత సంప్రదాయాలనూ ఈ మందిరంలో చూడవచ్చు. ఇందులో మూడు గోల్డ్ ప్లేటెడ్ విగ్రహాలుంటాయి. వాటిని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులుగా కొలుస్తారు భక్తులు. అలాగే పీస్ పగోడా అనే బౌద్ధాలయంలో బంగారు పూత పూసిన బుద్ధుని విగ్రహం ఉంటుంది. అక్కడ గోడలపై ఉండే రాతి శిల్పాలు బుద్ధుని జీవిత చరిత్ర చెబుతుంటాయి. * డార్జిలింగ్కి అతి పెద్ద ఆకర్షణ టీ ఎస్టేట్స్. మొత్తం 86 టీ తోటలు ఉన్నాయి. ఉత్తమజాతి తేయాకును పండిస్తారు. టీపొడి అక్కడే అమ్ము తారు కూడా. రుచి చూశాకే కొనుక్కో వచ్చు. * డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేనే ‘డార్జిలింగ్ టాయ్ ట్రెయిన్’ అంటారు. ఈ రైల్లో నుంచి హిమాలయాల అందాలను వీక్షిస్తే జన్మలో మర్చిపోలేరు. ఇది వివిధ స్టేషన్లలో ఆగుకుంటూ వెళ్తుంది. ఓ చోట 360 డిగ్రీలు తిరుగుతుంది. అప్పుడు ప్రపంచాన్నే చుట్టేసిన అనుభవం కలుగుతుంది. బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో ఈ టాయ్ ట్రెయిన్‌ను బాగా ఉపయో గించుకుంటారు. టికెట్ మనిషికి రూ.360 ఉంటుంది. ఉదయం 9:00 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ ట్రెయిన్లో ప్రయాణించొచ్చు. * రోప్‌వేపై కేబుల్ కార్లలో ప్రయాణిస్తూ డార్జిలింగ్ ఓవర్వ్యూ చూస్తుంటే... ఆ అందాలను చూడటానికి రెండు కళ్లూ చాలవు! ఏం కొనాలి? డార్జిలింగ్‌లో షాపింగ్ భలే సరదాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భారతీయ వస్తువులు, దుస్తులతో పాటు టిబెట్, నేపాల్, భూటాన్ ప్రాంతాలకు చెందిన వస్తువులు, దుస్తులు కూడా విరివిగా దొరుకుతాయి. చౌరస్తా అనే ప్రాంతం షాపింగ్‌కి ప్రసిద్ధి. ఇక్కడ లేని వస్తువు ఉండదు. హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, సిల్క్ దుస్తులు, ఉన్ని వస్త్రాలు రకరకాల మోడళ్లలో దొరుకుతాయి. వెదురుతో చేసిన వస్తువులైతే మతి పోగొడుతుంటాయి. ఇక్కడ దొరికే టిబెటన్ కార్పెట్లు చూస్తే కొనకుండా వదిలి పెట్టబుద్ధి కాదు. ట్రెక్కింగ్ షాప్స్ కూడా ఉంటాయి. వాటిలో ట్రెక్కింగ్, ర్యాఫ్టింగ్ వంటి వాటికి అవసరమయ్యే దుస్తులు, షూస్, రోప్స్ లాంటివి అమ్ముతారు. ‘గుడ్రికీ’ అన్న దుకాణాన్ని ద హౌస్ ఆఫ్ టీ అంటారు. ఇక్కడ రకరకాల టీపొడి అమ్ముతారు. రేట్లు మరీ ఎక్కువేమీ ఉండవు. అతి తక్కువ ధర నుంచీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, పటాలు వంటివి అమ్మే షాపులూ ఎక్కువే! ఏం చెయ్యాలి? డార్జిలింగ్‌లో పర్వతాలు ఎక్కువ. దాంతో ట్రెక్కింగ్ ప్రియులకు బోలెడంత టైమ్‌పాస్. ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్పే కేంద్రాలు కూడా అక్కడ ఉన్నాయి. పర్వత ప్రాంతాలన్నీ అందమైన పూల మొక్కలతో నిండి ఉంటాయి. ఆ పూల అందాలను చూస్తూ, వాటి పరిమళాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ చేయడంలో ఉండే అనుభూతే వేరు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హిమాలయాలను అధిరోహించడానికి చాలామంది ముచ్చట పడుతుంటారు. ఎక్కగలిగినంత మేర ఎక్కి ముచ్చట తీర్చుకుంటారు. అలాగే అటవీ ప్రాంతంతో అడ్వెంచరస్ యాత్రలు చేయడం కూడా మంచి అనుభవం. అయితే దట్టమైన అడవుల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ ఉండే గైడ్స్‌ని వెంట తీసుకెళ్లడం మర్చిపోకూడదు. ఏం తినాలి? డార్జిలింగ్‌లో నేచర్ బ్యూటీనే కాదు... టేస్టీ టేస్టీ ఫుడ్‌ని కూడా చూసి రావాలి. ముఖ్యంగా మామోస్ని తినకుండా వచ్చారంటే మంచి స్నాక్‌ని మిస్సైపోయినట్టే. కూరగాయల ఫిల్లింగ్తోటీ, మాంసం ఫిల్లింగ్తోటీ కూడా చేసే ఈ స్నాక్ డార్జిలింగ్ స్పెషల్. అలాగే థుప్కా అనే టిబెటన్ నూడుల్ సూప్ కూడా చాలా ఫేమస్. డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్టే పచ్చళ్లు సూపర్బ్‌గా ఉంటాయి. దోసకాయలతో పెట్టే పచ్చడి అయితే నోటిలో నీళ్లు ఊరేలా చేస్తుంది. ఆవుపాలతో చేసే చుర్పీ, మాంసంలో బ్రెడ్ పెట్టి చేసే షఫలాయ్, వెదురు బొంగుల్లో సర్వ్ చేసే తోంగ్బా అనే బీర్ లాంటి పానీయం, డార్జిలింగ్‌లో పండే స్వచ్ఛమైన తేయాకుతో చేసే టీ... వీటన్నిటినీ ఒక్కసారైనా రుచి చూడకుండా మాత్రం రాకండి. ఎలా వెళ్లాలి? ఫ్లయిట్లో: హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌లోని బాగ్దోగ్రా విమానాశ్రయానికి ఫ్లయిట్లో వెళ్లవచ్చు. రాను పోను కలిపి పదహారు వేల పైన ఉంటుంది టిక్కెట్ వెల. ప్యాకేజీ తీసుకుంటే రానుపోను విమాన ఖర్చులతో పాటు మూడు రాత్రులు, నాలుగు పగళ్లకు వసతి, భోజనం, విహార ఖర్చులన్నీ కలిపి ముప్ఫై వేల వరకూ అవుతాయి. డార్జిలింగ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చూపించే ప్యాకేజీలు ఉన్నాయి. రైల్లో: హైదరాబాద్ నుంచి డార్జిలింగ్‌కు నేరుగా రైళ్లు లేవు. కోల్‌కతాకు వెళ్లి, అక్కడ్నుంచి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జల్పాయ్గూర్ వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. బస్సులో: డెరైక్ట్ బస్సులు కూడా లేవు. హైదరాబాద్ నుంచి బెంగలూరు వెళ్లి, అక్కడ్నుంచి రైల్లో కానీ విమానంలో కానీ బాగ్దోగ్రా వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటికీ ఇరవై గంటల పైనే పడుతుంది. -
జనాలు మెచ్చే వనాలు..
సాక్షి: పట్టణాల్లో నివసించే ప్రజలను కాసేపైనా కాలుష్యం నుంచి దూరం చేసి ప్రశాంతతను చేకూర్చేందుకు ఉద్యానవనాలు తోడ్పడుతున్నాయి. పచ్చని చెట్లతో రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా ముస్తాబైన గార్డెన్లో సేదతీరడం ఎంతో హాయిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం కొన్ని వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తే అదో ప్రత్యేక ప్రపంచమే. పర్యాటకులకు కన్నుల పండువ చేస్తున్న ప్రపంచంలోని కొన్ని ప్రత్యేక గార్డెన్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..! నాంగ్ నూచ్ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్.. థాయ్‌లాండ్‌లోని చోన్బురికి 163 కిలోమీటర్ల దూరంలో ఉంది. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ వైజ్ఞానిక పరిశోధనా కేంద్రంగా కూడా సేవలందిస్తోంది. జన్యు బ్యాంక్‌ను స్థాపించిన సైకాడ్స్కు దీన్ని అంకితం చేశారు. 1954లో పండ్లసాగు చేద్దామనే ఉద్దేశంతో పిసిట్, నాంగ్నూచ్లు 600 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే తర్వాత నిర్ణయం మార్చుకుని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ పేరుతో ఉష్ణమండల వాతావరణానికి సరిపడే పూలమొక్కలను పెంచడం ప్రారంభించారు. 1980 నుంచి సందర్శకులను అనుమతించడం మొదలు పెట్టారు. క్యూ గార్డెన్స్.. 1759లో బ్రిటన్ రాణి అగస్టా ఏర్పాటు చేశారు. పశ్చిమ లండన్‌లోని రిచ్మండ్లో ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ జాతులకు చెందిన మొక్కలను కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 50,000 రకాల మొక్కలు కొలువుతీరాయి. 326 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్లో పగోడా, ది టెంపెరేట్ హౌస్.. వంటి ప్రసిద్ధి చెందిన భవనాలు మరో ప్రత్యేక ఆకర్షణ. 2003లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. లండన్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఇదీ ఒకటి. దీని సంరక్షణ కోసం 1847లో స్వయంగా ఒక ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 750 మంది ఉద్యోగులు ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారు. వెర్సెల్లైస్ గార్డెన్.. ఫ్రాన్స్‌లోని వెర్సెల్లైస్లో ఉంది. సుమారు 1900 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఉద్యాన వనంలో 2 లక్షల మొక్కలు ఉన్నాయి. ఏటా 3 లక్షల వరకు పుష్పాలను అందిస్తుంది. వీటితో పాటు 50 ఫౌంటెయిన్లు, 620 వాటర్ జెట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. డిజైనర్లు ఆండ్రూ లే నోట్రే, చార్లెస్ లే బ్రన్, లూయిస్ లేవా, హాడ్రూయిన్ మన్సార్ట్లు దీనికి రూపకల్పన చేశారు. 1979లో దీనికి వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కింది. కెకెన్ హోప్ గార్డెన్స్.. దీన్ని ‘గార్డెన్ ఆఫ్ యూరప్’ అని పిలుస్తారు. నెదర్లాండ్స్‌లోని లిస్సే పట్టణంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ‘ఫ్లవర్ గార్డెన్స్’లో ఇదీ ఒకటి. 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనంలో ఏటా 70 లక్షలకు పైగా పుష్పాలు వికసిస్తున్నాయి. ఇన్ని రకాల పుష్పాలు ఒకేచోట కొలువుతీరడం ప్రపంచ రికార్డు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు. దీన్ని సందర్శించేందుకు ఏప్రిల్ అనుకూల సమయం. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఫ్లవర్ పరేడ్ నిర్వహించారు. బట్చార్ట్ గార్డెన్స్.. కెనడాలోని బ్రిటిష్కొలంబియాలో ఉంది. ఏటా 10 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ గార్డెన్‌ను సందర్శిస్తున్నారు. సిమెంట్ తయారీ సంస్థ అధినేత రాబర్ట్ పిమ్ బట్చార్ట్ దీన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో ఆయన ఇంటి పరిసర ప్రాంతంలో సొంత గార్డెన్‌గా ప్రారంభించారు. బట్చార్ట్ భార్య ఉత్సుకతతో ఇందులో శాంక్చురీ కూడా ప్రారంభమైంది. దేశవిదేశాలకు చెందిన అనేక రకాల పక్షులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. వేసవిలో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. డిసెర్ట్ బొటానికల్ గార్డెన్.. ‘ది డిసెర్ట్ బొటానికల్ గార్డెన్’ సెంట్రల్ ఆరిజోనాలోని గాల్విన్ పార్క్‌వే సమీపంలో ఉంది. విస్తీర్ణం 140 ఎకరాలు. 1937లో అరిజోనా కాక్టస్ అండ్ నేటివ్ ఫ్లోరా సొసైటీ 1937లో దీన్ని స్థాపించింది. ప్రస్తుతం ఇందులో 21,000 మొక్కలు ఉన్నాయి. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న 139 రకాల జీవ జాతులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. -
సుందరీకరణకు.. ‘నీళ్లు’
- పార్కు చూడు... పార్కు అందం చూడు - వృథాగా కోట్ల రూపాయల వ్యయం - నిర్వహణ లోపంతో ఎండిపోతున్న మొక్కలు - డివైడర్‌పై వేసిన మొక్కలదీ అదే పరిస్థితి - పట్టించుకోని పురపాలక సంఘం కొవ్వూరు : ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టు ఉంది కొవ్వూరు పురపాలక సంఘం పరిస్థితి. సరైన నిర్వహణ లేక పట్టణంలోని పార్కులు ఘోరంగా ఉన్నాయి. గోదావరి పుష్కరాల పుణ్యమా అని కోట్లాది రూపాయలు రావడంతో ఏకంగా కిలోమీటర్ల తరబడి సుందరీకరణ పనులు చేపట్టారు. పట్టణ శివారున ఉన్న రెండో రోడ్డు వంతెన నుంచి టోల్ జంక్షన్ (రోడ్డు కం రైలు వంతెన వరకు) వరకు సుమారు 2.7 కిలోమీటర్ల పొడవున సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9.17 కోట్లు ఖర్చు చేశారు. పట్టణ వ్యాప్తంగా డివైడర్లు, జంక్షన్లు, గతంలో ఉన్న పార్కుల సుందరీకరణకు ఈ నిధులు ఖర్చు చేశారు. పుష్కరాలకు ఏటిగట్టుపై లాన్ గడ్డివేసిహడావిడిగా పలు రకాల మొక్కలు నాటారు. వీటికి కనీసం నీళ్లు పోసే నాథులు లేకపోవడంతో అప్పుడే మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. డివైడర్లపై వేసిన మొక్కలు ఒక్కొక్కటి మోడు వారుతున్నాయి. లాన్గడ్డి ఎక్కడికక్కడే ఎండిపోతోంది. జంక్షన్ల వద్ద వేసిన మొక్కలు, లాన్ గడ్డిది అదే పరిస్థితి. నిర్వహణను పట్టించుకోని పురపాలక సంఘం మొదట్లో పార్కుల్లోను, డివైడర్ మొక్కలు, లాన్ గడ్డికి నీళ్లు పోసినప్పటికీ పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి వీటి నిర్వహణను పురపాలక సంఘం పూర్తిగా విస్మరించింది. దీంతో పుష్కరాలు పూర్తికాకుండానే చాలాచోట్ల మొక్కలు మోడు వారాయి. పుష్కరాలు పూర్తయినా మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో ఎక్కడిక్కడే ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా వీటికి నీళ్లు పోయకపోతే లక్షలు ఖర్చు చేసి వేసిన మొక్కలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. అనాలోచిత నిర్ణయంతో రూ.కోట్లు వృథా పట్టణంలో గత పుష్కరాల సమయంలో గోదావరి మాత విగ్రహం నుంచి గోష్పాద క్షేత్రం వరకు ఐదు బ్లాకుల్లో సుమారు కిలోమీటరుకు పైగా పార్కులు ఏర్పాటు చేశారు. అవన్నీ పుష్కరాలు అయిన తర్వాత చిట్టడవులు మాదిరిగా తయారయ్యాయి. తర్వాత వచ్చిన పాలకవర్గం రూ.35 లక్షలు ఖర్చు చేసి రెండు బ్లాకులను సుందరీకరించి మళ్లీ పార్కులకు కొత్త రూపు తెచ్చింది. వీటిని నిర్వహించడమే పురపాలక సంఘానికి తలకు మించిన భారం అవుతోంది. ఇప్పుడు ఏకంగా 2.7 కిలోమీటర్లు పొడవునా సుందరీకరణ చేపట్టడంతో పురపాలక సంఘం ఏవిధంగా నిర్వహిస్తుందనేది అర్థం కావడం లేదు. నిర్వహణ గురించి ఆలోచించకుండా కోట్లు ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం వృథా అయ్యింది. కొందరు కౌన్సిల్ సభ్యులు సుందరీకరణ నిధులను పట్టణంలో వెచ్చిస్తే అభివృద్ధి నాలుగు కాలాలు పాటు గుర్తుండిపోతుందని మొత్తుకున్నా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. -
అతనితో సహజీవనం?
ఇలా పార్కులు, రెస్టారెంట్లూ అని ఎన్నాళ్లు తిరుగుతాం.. అదే ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది? అని ప్రేమ పక్షులు సిద్ధార్థ్, ఆలియా భట్ అనుకుంటున్నారట. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా సిద్ధార్థ్‌తో సహజీవనం సాగించాలని ఆలియా బలంగా నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఈ ఇద్దరూ మంచి ఫ్లాట్ వెతికే పని మీద ఉన్నారని భోగట్టా. -
‘ఏబీసీ’తో పార్కుల అభివృద్ధి
పురపాలక మంత్రి, అధికారులకు సీఎం ఆదేశం ముగిసిన బాబు బృందం సింగపూర్ పర్యటన.. హైదరాబాద్‌కు చేరిక నేడు మంత్రివర్గ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సచివాలయం ఎల్ బ్లాక్‌లోని సీఎం చంద్రబాబు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన, రాజధాని మాస్టర్‌ప్లాన్ తయారీ తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే శాఖాధిపతులు, కలెక్టర్లతోపాటు మంత్రులతో సీఎం సమావేశమవుతారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పార్కులను సింగపూర్ అనుసరిస్తున్న ‘ఏబీసీ’ విధానం ద్వారా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పార్కుల అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని పురపాలక మంత్రి పి.నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్‌కు ఆయన సూచించారు. సింగపూర్ పర్యటన రెండోరోజున చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం బిషన్ పార్కుతోపాటు టొపయొ పట్టణాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా పార్కులో కలియతిరిగిన చంద్రబాబు బృందం పచ్చదనం, పరిశుభ్రతను పరిశీలించింది. ఒక డ్రెయిన్‌ను నదిగా ఎలా మార్చామో అక్కడి అధికారులు చంద్రబాబుకు వివరించారు. పార్కుల అభివృద్ధితో పరిసరాల్లో ఆస్తుల విలువ భారీగా పెరిగిందని తెలిపారు. చురుకుదనం, అందం, పరిశుభ్రత (ఏక్టివ్, బ్యూటిఫుల్, క్లీన్-ఏబీసీ) అనే నీటి విధానాన్ని అమలు చేయడం ద్వారా పార్కులను అభివృద్ధి చేస్తున్నట్టు వారు వివరించారు. దీంతో ఏపీలో కాలువలు, నదులను చురుకుగా, అందంగా, పరిశుభ్రంగా మార్చేందుకు సింగపూర్ నిపుణులు తోడ్పడాలని సీఎం కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం కెప్పెల్ ఎనర్జీ ప్లాంటును సందర్శించింది. ట్వాస్ వద్ద ఉన్న ఈ ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్ తయారీకి అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. 54 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్న ఈ ప్లాంటులో సింగపూర్ ప్రభుత్వానికి 24.5 శాతం వాటా ఉంది. ఈ తరహా ప్లాంటును ఏపీలో ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సింగపూర్‌లోని హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డునూ సీఎం బృందం సందర్శించింది. ఇదిలా ఉంటే చంద్రబాబు బృందం రెండు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకుంది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం.. ఏపీలో సులభంగా వ్యాపారం చేయటమెలా అనే అంశంపై ఏపీ ప్రభుత్వం, సింగపూర్ జాతీయ వర్సిటీ మధ్య ఒప్పందం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) కూడా ఈ ఒప్పందంలో భాగస్వామిగా ఉంది. -
ఇల్లు.. ఆఫీసు పక్క పక్కనే!
- ఇంటి దగ్గరే విద్య, వైద్య, వాణిజ్య సంస్థలు, పార్కులూ ఉండాలంటున్న కొనుగోలుదారులు - దీంతో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌ల వైపే మొగ్గు చూపుతున్న బిల్డర్లు సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంటి పక్కనే ఆఫీసు. కాలుష్యం, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా రోజూ నడుచుకుంటూ వెళ్లొచ్చు. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేసేందుకు షాపింగ్ మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్లుండాలి. అవి కూడా ఇంటిదగ్గర్లోనే. విద్య, వైద్య సదుపాయాలూ ఉండాల్సిందే. అవి కూడా చేరువలోనే’’ ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటాయా? అది కూడా కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో. కానీ, ఇలాంటి ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లే కావాలంటున్నారు కొనుగోలుదారులు. ఇంకేం మరి బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి కొన్ని నగరాలకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్‌లు ఇప్పుడు భాగ్యనగరానికీ వచ్చేశాయి. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్‌లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆసుపత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి. నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ‘‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచ్చిబౌలి, మాదాపూర్లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతున్న శ్రీశైలం హైవేలో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామన్నారు. ఈ రోడ్లో 3 వేల ఎకరాల్లో హార్డ్‌వేర్ పార్క్, వేల ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ పార్కులు, 5 కి.మీ. దూరంలో ఉన్న ఆదిభట్లలోని ఏరోస్పేస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలూ ఉన్నాయి. మహేశ్వరంలో ఫ్యాబ్‌సిటీ, ముచ్చర్లలో ఫార్మాసిటీలు కూడా రానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో తక్కువలో తక్కువగా 40-50 వేల ఉద్యోగులు రానున్నారు. వీరందరికీ నివాస సముదాయాలే కాదు వాణిజ్య, నిత్యావసరాలూ కావాలి. అందుకే ఈ ప్రాంతంలో 3,600 ఎకరాల్లో బటర్ ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. నగరం చుట్టూ.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకూ ఊపొచ్చింది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పైనా ఆఫీసులకు వెళ్లొచ్చు కూడా. 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ! ఫ్లాట్లు అమ్మేశామా.. చేతులు దులుపుకున్నామా అన్న రీతిలో కాకుండా కొనుగోలుదారులకు ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా కందుకూరు మండలంలోని కర్తాల్ గ్రామంలో 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీని నిర్మిస్తున్నామని సంస్థ సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. ప్రాజెక్ట్ మొత్తాన్ని 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసి సరికొత్త నగరంగా రూపుదిద్దుతాం. ⇒ 3 వేల ఎకరాల్లో రెసిడెన్షియల్, 600 ఎకరాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్లొస్తాయి. ప్రస్తుతం నివాస సముదాయాలను విక్రయిస్తున్నాం. 50 ఎకరాలు డాక్టర్స్ కాలనీ, 150 ఎకరాలు టెమ్స్-1,2, 50 ఎకరాలు క్లౌడ్ పార్క్, 500 ఎకరాలు ఎన్నారై టౌన్షిప్, 1,000 ఎకరాలు ఎవరెస్ట్, 200 ఎకరాలు వీకెండ్ హోమ్స్‌లకు కేటాయించాం. ⇒ ఎన్నారై టౌన్షిప్లో 500 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.3,500. ఎవరెస్ట్‌లో 200, 267, 300, 400 గజాల ప్లాట్లున్నాయి. గజం ధర రూ.2,200. వీకెండ్ హోమ్స్‌లో 800 విల్లాలుంటాయి. 1,200 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉండే ఒక్కో విల్లా ధర రూ.40 లక్షలు. ⇒ వచ్చే జూలైలో కమర్షియల్ ప్రాజెక్ట్‌నూ మార్కెట్లోకి తీసుకొస్తాం. ఇందులో విద్యా, వైద్య సంస్థలు, షాపింగ్ మాల్స్, క్రీడా మైదానాలు, అమ్యూజ్మెంట్ పార్క్.. ఇలా ప్రతీ విభాగానికి కొంత స్థలాన్ని కేటాయిస్తాం. అయితే ఆయా విభాగాన్ని ఏదో అమ్మేశాం అన్న రీతిలో కాకుండా అంతర్జాతీయ సంస్థలతో కలసి జాయింట్ వెంచర్‌గా చేపడతాం. విద్యుత్ సమస్యేమీ లేకుండా సొంతంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ కేంద్రాన్ని కూడా నెలకొల్పుతున్నాం. -
ఆ పార్కులు మీవే..!
జీహెచ్ఎంసీకి హెచ్ఎండీఏ విజ్ఞప్తి మార్చి నెలాఖరుకు అప్పగింత బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నిర్ణయం శివార్లలో పచ్చదనంపై అర్బన్ ఫారెస్ట్రీ దృష్టి సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, రోడ్ మీడియన్స్, ఐల్యాండ్స్, ఎస్టీపీల నిర్వహణ బాధ్యతను ఇక తాము మోయలేమంటూ హెచ్ఎండీఏ చేతులెత్తేసింది. హెచ్ఎండీఏ పరిధిలో విస్తృతంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాల్సి ఉన్నందున గ్రేటర్ పరిధిలోని పార్కులు, మీడియన్స్ నిర్వహణ బాధ్యత నుంచి వైదొలుగుతున్నట్లు అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గతంలో ఆయా పార్కులు, మీడియన్స్ బాధ్యత జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఉండేదని, అప్పటి ప్రభుత్వం సూచనల మేరకు వాటి నిర్వహణ బాధ్యతను హెచ్ఎండీఏ చేపట్టిందని చెబుతున్నారు. ఇప్పుడు హెచ్ఎండీఏ ఆర్థిక సమస్యల్లో చిక్కుకొన్నందున ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పార్కుల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకొంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో పచ్చదనాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదే కనుక మొత్తం 39 పార్కులు, మీడియన్స్, ఐల్యాండ్స్ తదితరాల నిర్వహణ బాధ్యతను ఏప్రిల్ 1 నుంచి వారికి అప్పగించనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ ఎక్స్‌ప్రెస్ హై వే పైన నిర్వహణ బాధ్యతలు జీహెచ్ఎంసీ చూస్తుండగా, ఫ్లైఓవర్ కింద మీడియన్‌లో మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు పచ్చదనాన్ని హెచ్ఎండీఏ నిర్వహిస్తోంది. ఇలా ఒకే ప్రాంతాన్ని రెండు విభాగాలు చూడటం కంటే ఆ బాధ్యతను జీహెచ్ఎంసీయే చేపట్టడం శ్రేయస్కరం అని హెచ్ఎండీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు... నిత్యం ప్రముఖులు రాకపోకలు సాగించే శంషాబాద్ రోడ్, మాదాపూర్ ఫ్లైఓవర్, స్పయినల్ రోడ్, కావూరి హిల్స్, తదిరత ప్రాంతాల్లో పచ్చదనం పర్యవేక్షణ బాధ్యతలు ఇరువిభాగాలు నిర్వహిస్తున్నాయి. దీనివల్ల సొమ్ము హెచ్‌ఎండీఏది... సోకు జీహెచ్ఎంసీది అన్న చందంగా మారిందని ఇకపై హెచ్ఎండీఏ పరిధిలో గ్రీనరీపెంచేందుకే నిధులు వెచ్చించాలని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నిర్ణయించిం ది. ఈమేరకు బుధవారం హెచ్ఎండీఏ పాలకవర్గం సమావేశంలో కూడా ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథార్టీ పరిధిలోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్ల నిర్వహణను మాత్రం హెచ్ఎండీఏనే చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీకి అప్పగించనున్న పార్కులు పేరు ప్రాంతం తిరుమలహిల్స్ పార్కు ముసారాంబాగ్ ఇందిరా ప్లే పార్కు వనస్థలిపురం రాజీవ్‌గాంధీ పార్కు వనస్థలిపురం ప్రియదర్శిని పార్కు సరూర్‌నగర్ మేల్కోటి పార్కు నారాయణగూడ బాపూఘాట్ లంగర్‌హౌస్ శాస్త్రిపురంకాలనీ పార్కు బహదూర్‌పురా ఎల్ఐజీ-22 పార్కు వనస్థలిపురం సాయినగర్ కాలనీ పార్కు వనస్థలిపురం ఫేజ్-2 కాలనీ పార్కు వనస్థలిపురం పటేల్‌కుంట పార్కు కూకట్పల్లి చిన్నతాళ్లకుంట పార్కు అత్తాపూర్ ఆస్బెస్టాస్ కాలనీ పార్కు జగద్గిరిగుట్ట -
పార్కులు వెలవెల!
వీహెచ్‌పీ, బజరంగ్దళ్ హెచ్చరికల ఎఫెక్ట్! పోలీసులు అండగా నిలిచినా.. స్వాగతం పలికేందుకు సీపీఐ నాయకులు వచ్చినా... పార్కులకు రాని ప్రేమికులు కవాడిగూడ/వెంగళరావునగర్: ప్రేమికులతో ప్రతి రోజూ కళకళలాడే పార్కులు శనివారం ప్రేమికుల దినోత్సవం రోజున మాత్రం బోసిపోయాయి. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్, కేబీఆర్ తదితర పార్కులన్నీ వెలవెలబోయాయి. పాశ్చాత్య సంస్కృతికి చిహ్నమైన ప్రేమికుల రోజును బహిష్కరిస్తున్నట్లు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సంస్థలు ప్రకటించడంతోపాటు, ప్రేమికులు పార్కుల్లోనూ, రహదారుల వెంట కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా ప్రేమికులను అడ్డుకున్నా, వారి పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించినా తీవ్రచర్యలు తీసుకుంటామని, ప్రేమికులకు అండగా ఉంటామని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించి, ఇందిరాపార్కును సందర్శించినా ప్రేమికులు వచ్చేందుకు సాహసించలేదు. ఇందిరాపార్కు ప్రవేశ రుసుం రూ.5, బైక్, ఫోర్ వీలర్ వాహనాల పార్కింగ్‌కు కనీసం రూ. 10 ఉంటుంది. ప్రతిరోజు దాదాపు రూ.7 వేలకు పైగా ఆదాయం వస్తుంది. పార్కింగ్‌కు రూ.3 వేలకు పైగా వస్తాయి. అలాంటిది శనివారం మాత్రం ఎంట్రెన్స్ టెకెట్లకు రోజంతా కనీసం వెయ్యి రూపాయలు రాలేదు. అలాగే పార్కింగ్ కౌంటర్‌కు కనీసం రూ. 600 కూడా రాలేదు. కాగా ముందు జాగ్రత్తగా నగరంలో 36 మందిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. సీపీఐ గులాబీ పూల స్వాగతం... ప్రేమికులకు గులాబీ పూలతో స్వాగతం పలికేందుకు సీపీఐ హైదరాబాద్ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్‌తో పాటు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ కార్యకర్తలు ఇందిరాపార్కు వద్ద ఎదురు చూశారు. కానీ ప్రేమికులెవరూ కన్పించలేదు. కార్యక్రమంలో సీపీఐ నగర నాయకులు రాకేష్ సింగ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, నాయకులు సత్యప్రసాద్, దర్మేంధర్, వంశీ, ఏఐవైఎఫ్ నాయకురాలు ఉషారాణి, నాయకులు రాజేందర్, బాలు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ముందుజాగ్రత్తగా పోలీసులు ప్రేమికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులు వేణు, కృష్ణ నాయక్, నరేష్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా యూసుఫ్‌గూడ కృష్ణకాంత్పార్కుకు జూబ్లీహిల్స్ పోలీసులు ఉదయమే వచ్చి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్వైజర్లకు, సెక్యూరిటీ గార్డులకు సూచించారు. ఉదయం 11 గంటల తర్వాత పార్కు తెరిచి పోలీసులు కాపలాగా ఉన్నప్పటికీ యువతీయువకులెవరూ రాలేదు. కనీసం సందర్శకులు కూడా రాకపోవడంతో పార్కు బోసిపోయింది. -
రాజధాని తొలిదశకు 21వేల కోట్లు
30 వేల ఎకరాలు పట్టణాభివృద్ధిశాఖ అంచనా రూపకల్పన విజయవాడకు 12 కి.మీ. వాయవ్యంగా.. గుంటూరుకు 20 కి.మీ. ఈశాన్యంగా రాజధాని సాక్షి, హైదరాబాద్: రాజధానికి తొలిదశలో 30 వేల ఎకరాలు అవసరమని, నిర్మాణానికి 20,935 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అంచనాలను రూపొందించింది. తొలిదశ రాజధాని నిర్మాణం మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 31 గ్రామాలు, నివాస ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది. గుంటూరు జిల్లాలోని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు వస్తాయి. ఈ రాజధాని కృష్ణానదిని ఆనుకుని విజయవాడ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో వాయవ్యదిశగా, గుంటూ రు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యదిశగా ఉంటుందని మున్సిపల్ శాఖ పేర్కొంది. తొలిదశ రాజధాని నిర్మాణంలో భాగంగా 8.5 లక్షల జనాభాకు సరిపడా వచ్చే పదేళ్లలో ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ ప్రాంతం ఐటీ, వ్యాపారం, పర్యాటక, వైద్య సౌకర్యాలతో ఉంటుంది. పార్కులు, రిక్రియేషనల్ సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా సిటీ, క్రీడా ప్రాంగణాలు ఉంటాయి. కృష్ణానది వ్యూతో నిర్మిస్తున్నందున పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుందన్నారు. నూతన రాజధాని తొలిదశ నిర్మాణ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. C - కమర్షియల్ జోన్ JB - జంగిల్ సఫారీ LH - లాజిస్టిక్ హబ్ KP - నాలెడ్జ్ పార్క్ CM - సీఎం ఇల్లు G - స్టేట్ గెస్ట్ హౌస్ CH - సర్క్యూట్ హౌస్ RF - రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ GQF - గవర్నమెంట్ హౌసింగ్ ఫీచర్ GQ - గవర్నమెంట్ హౌసింగ్ R - రెసిడెన్షియల్ జోన్ MQ - మినిస్టర్స్ క్వార్టర్స్ OQ - ఆఫీసర్స్ క్వార్టర్స్ R - రెసిడెన్షియల్ జోన్ VS - విధాన సభ CC - క్యాపిటల్ కాంప్లెక్స్ GO - గవర్నమెంట్ ఆఫీస్ CP - సెంట్రల్ పార్క్ CBD - సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ OC - ఆఫీస్ కాంప్లెక్స్ I - ఇండస్ట్రియల్ జోన్ గృహ నిర్మాణాలకు రిజర్వ్ చేసే విస్తీర్ణం రంగాల వారీగా ఈ విధంగా ఉంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గృహాలకు - 400.62 హెక్టార్లు తక్కువ ఆదాయ వర్గాల గృహాలకు - 801.24 హెక్టార్లు మధ్య ఆదాయ వర్గాల గృహాలకు- 934.78 హెక్టార్లు అధిక ఆదాయ వర్గాల గృహాలకు- 534.16 హెక్టార్లు రాజధాని ప్రాంతంలో భూ వినియోగం ఇలా.. 1. హౌసింగ్ డెవలప్మెంట్ కోసం రిజర్వు చేసింది: 22% 2.నగరస్థాయి మౌలిక సదుపాయాలకు: 20% 3. రంగాలవారీ మౌలిక సదుపాయాలకు: 15% 4. రాజధాని కాంప్లెక్స్, ప్రభుత్వ భవనాలకు: 5% 5.గవర్నర్, సీఎం, మంత్రుల నివాసాలకు: 1% 6.ప్రభుత్వ గృహాల కోసం: 1% 7.సామాజిక మౌలిక సదుపాయాలకు:3% 8.రిక్రియేషన్‌కు:5% 9.ప్రాజెక్టు బాధితులకు: 9% 10. పర్యావరణ ప్రాజెక్టులకు: 8% 11.సి.బి.డి. కోసం : 1% 12.కార్యాలయాలకు: 2% 13.బహిరంగ ప్రాంగణం కోసం : 8% -
పీచుమిఠాయి... చేయడం సులువేనోయి!
పీచుమిఠాయి పేరు చెబితే చాలు... పిల్లలూ పెద్దలూ కూడా ఎగిరి గంతేస్తారు! సన్నగా దూదిలా ఉండే పీచు మిఠాయిని మెలమెల్లగా చప్పరించడం ఓ సరదా అందరికీ! అయితే అది మనకి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే దొరుకుతుంది. అంటే... ఎగ్జిబిషన్లు, తీర్థాలు, పార్కులు, థియేటర్లు వంటిచోట మాత్రమే లభిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తినాలంటే ఎలా? దానికి సమాధానం... ఇదిగో, ఈ మెషీన్ చెబుతుంది! దీన్ని ‘కాటన్ క్యాండీ ఫ్లాస్ మేకర్’ అంటారు. రూ. 1900 నుంచి మూడు వేల రూపాయల వరకూ రకరకాల ధరల్లో, సైజుల్లో దొరకుతోందీ యంత్రం. ఇది కరెంటుతో పని చేస్తుంది. తేలికగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. పీచు మిఠాయిని చేసుకోవడం కూడా చాలా సులభం. చక్కెరతో చేసిన క్యాండీలు మార్కెట్లో దొరకుతాయి. వాటిని తెచ్చి, ఈ యంత్రానికున్న గుండ్రటి ట్రేలో వేసి, స్విచ్ ఆన్ చేస్తే చాలు. పల్చటి దూదితెరల్లా పీచుమిఠాయి పైకి లేస్తుంది. దాన్ని పుల్లకు చుట్టుకుని తినడమే తరువాయి! -
నోయిడా పార్కుల్లో ‘మహిళా శక్తి’
నోయిడా: మహిళా శక్తి సమాజిక్ సమితి సభ్యులు గ్రేటర్ నోయిడా నగరంలోని పార్కుల్లో ఆకస్మిక తనిఖీలను మళ్లీ ప్రారంభించారు. పార్కుల్లోని ఆహ్లాదకరమైన వాతావారణాన్ని ఆస్వాదించాలే తప్ప అసభ్యంగా ప్రవర్తించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నామని సమితి సభ్యులు చెబుతున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా జంటలు వ్యవహరించాలని సూచిస్తున్నామని అంటున్నారు. కానీ, ఇది ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని, అయితే స్వచ్ఛందంగా సమితి సభ్యులు పార్కులను తనిఖీలు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెలలో జంట పట్ల దురుసుగా.. గత నెలలో నగరంలోని పార్కుల్లో నైతిక పరివర్తన పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సమితి సభ్యులు ఓ జంట పట్ల దురుసుగా వ్యవహరిం చారు. దీంతో సభ్యులకు పోలీసులు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇది గడిచి నెల రోజులు కాక ముందే సమితీ సభ్యులు మళ్లీ గురువారం పార్కుల్లో నైతిక ప్రవర్తనపై పర్యాటకులకు అవగాహన కల్పించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పర్యాటకుల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సమితి చర్యలను పోలీసులు తప్పుబడుతున్నారు. నైతిక ప్రవర్తనపై అవగాహన కల్పిస్తున్నాం.. రూపా గుప్తా సమితి అధ్యక్షురాలు రూపా గుప్తా మాట్లాడుతూ.. సమితికి చెందిన ఆరుగురు మహిళలు, స్థానికులు కలిసి రోజూ సాయంత్రం పార్కులను తనిఖీలు చేస్తారని చెప్పారు. ఈ తనిఖీల ద్వారా అనుకూల ఫలితాలు సాధించామని చెప్పారు. మొదటి డ్రైవ్‌లోనే చాలామంది ప్రజల్ని పార్కుల్లో గౌరవంగా ఉండేలా అవగాహన కల్పించామని చెప్పారు. పార్కుల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే అంశాలపై కొన్ని జంటలకు అవగాహన కల్పించామని చెప్పారు. అసభ్యంగా వ్యవహరించడం తప్పుగా సూచించామని, ఇలాంటి దృశ్యాలు పార్కులకు వచ్చే చిన్నారులపై దుష్ర్పభావాన్ని చూపుతాయని సూచించారు. ప్రధానంగా భారతీయ సమాజం ఉన్నతిని పరిరక్షించే నైతిక విలువ గురించి వివరించామని చెప్పారు. గతవారం చేపట్టిన ‘పార్కుల్లో నైతిక ప్రవర్తనపై స్పెషల్ డ్రైవ్’ సత్ఫలితాలిచ్చిందని అన్నారు. ఇలాంటి సమయంలో నగర పోలీసులు సమితి సభ్యులకు సహకరించాలని కోరారు. తనిఖీల సమయంలో పోలీసులు దూరంగా ఉండాలని కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ఎస్హెచ్ఓ ‘మేం కూడా పార్కుల్లో నైతిక పరివర్తనపై పర్యాటకులకు అవగాహ కల్పించాలని నిర్ణయించాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తాం, కానీ సమితీ సభ్యులతో కలిసి పనిచేయలేమని ఎస్హెచ్ఓ సమర్జిత్సింగ్ కాసనా అన్నారు. గతవారం సమితి సభ్యులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో దురుసుగా వ్యవహరించారని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. -
జమ్మి చెట్టుని చూడాలని..
సంస్కృతిని భావి తరాలకు అందించడానికి ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యుషన్’ పనిచేస్తోంది. ఏటా విజయ దశమి సందర్భంగా జమ్మి మొక్కలను ఉచితంగా అందజేస్తోంది. ఇప్పటి వరకు విజయవంతంగా నాలుగేళ్లుగా పంపిణీ చేస్తూ వచ్చింది. పంచ మహా వృక్షాల్లో భాగమైన జమ్మితోపాటు... మారేడు, మర్రి, రావి, మేడి మొక్కలనూ అందజేస్తోంది. ప్రకృతి - సంస్కృతి.. నీలా లక్ష్మారెడ్డి ‘గ్రీన్ రెవల్యూషన్’ సంస్థను 2010లో స్థాపించారు. వాస్తవంగా ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం ఆవిర్భవించింది. అంతటితో ఆగకుండా ప్రకృతితో ముడిపడిఉన్న సంస్కృతిని భావితరాలకు అందించడం కోసం నడుంబిగించింది. 2011 నుంచి ‘ప్రకృతి - సంస్కృతి’ పేరుతో ఐదు రకాల మొక్కలు పంపిణీ చే స్తోంది. ఇప్పటి వరకు నగరంలో మూడు వేలకుపైగా మొక్కలు నాటిం చారు. పార్కులు, ఆలయాల ప్రాంగణాల్లో, వీధుల వెంట నాటారు. కొన్ని ప్రాంతాల్లో మొదట్లో నాటిన మొక్కలు ఓ మోస్తారుగా ఎదిగాయి. ఈ దసరాకు అక్కడి స్థానికులకు జమ్మి దర్శనభాగ్యం కలుగనుంది. జమ్మితో పాటు.. రామాయణం, మహాభారతం నుంచి పంచమహావృక్షాలను పూజించే సంస్కృతి ఉంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ సంస్కృతి కొనసాగుతోంది. నగరంలో ఆ చెట్లు లేక పోవడంతో పూజలు చేయలేకపోతున్నారు. అందుకే మేం జమ్మితో పాటు.. పంచ మహా వృక్షాల జాబితాలోని ఇతర మొక్కలను పంపిణీ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆగస్టు 29, 30 తేదీల్లో కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ ఆలయం వద్ద మొక్కలను పంపిణీ చేశాం. - లీలా లక్ష్మారెడ్డి, ట్రస్ట్ ప్రెసిడెంట్ -
రియల్టీపై రాబడి రావాలంటే..
రియల్టీపై రాబడి రావాలంటే.. పెట్టిన పెట్టుబడి కాస్త సురక్షితంగా ఉండి.. కొంత మెరుగైన రాబడి అందించగలిగే అనువైన సాధనాల్లో స్థిరాస్తి కూడా ఒకటి. కొన్ని సందర్భాలు మినహా రియల్ ఎస్టేట్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండవు. అయితే, మంచి రాబడులు అందుకోవాలంటే ప్రాపర్టీ ఎంపికలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. సిటీ మధ్యలో ప్రాపర్టీ తీసుకోవాలంటే వేతన జీవికి తలకు మించిన భారమే అవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగినా ఏ చిన్న దాంతోనో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లోనైతే ప్రాపర్టీ కొంత చౌకగా.. కాస్త పెద్దదే లభిస్తుంది. క్రమక్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న కొద్దీ రియల్టీ విలువ కూడా పెరిగి.. పెట్టిన పెట్టుబడిపై రాబడి మెరుగ్గా అందుకోవచ్చు. {పాపర్టీ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన మరో విషయం.. కీలకావసరాలైన సదుపాయాలు అందుబాటు దూరంలో ఉన్నాయా లేక సమీప భవిష్యత్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది. ఉదాహరణకు షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కులు, పిల్లల కోసం ప్లేగ్రౌండ్స్ మొదలైనవి ఉంటే ఆ ప్రాంతం వైపు చాలా మంది మొగ్గు చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఏరియాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఇటువంటి సదుపాయాలకు తగినంత స్థలం ఉంటుంది. ఇలాంటి ఆకర్షణలు వచ్చే కొద్దీ అక్కడి ప్రాపర్టీకి క్రమక్రమంగా విలువ పెరుగుతుంది. దీనివల్ల అక్కడి స్థిరాస్తి విలువా పెరుగుతుంది. అలాగే, స్కూళ్లు, ఆస్పత్రులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నగరాల్లో ప్రస్తుతం చాలామందికి ఇల్లు ఈ మూల ఉంటే.. ఆఫీసు మరో మూల ఉంటోంది. ఫలితంగా రోజూ కిలోమీటర్లు, గంటల కొద్దీ ప్రయాణాలు తప్పడం లేదు. దీని వల్ల పెట్రోలు కోసం బోలెడంత వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే బస్సులు, ఎంఎంటీఎస్ వంటి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు చూసి, ఎంపిక చేసుకోవడం ఉత్తమం. శివారు ప్రాంతాలకు కూడా మెట్రో రైళ్ల లాంటి రవాణా సాధనాలు వస్తున్నందున వాటికి సమీపంలోనివి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు, ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, కంపెనీలు మొదలైనవి ఉన్నా లేక వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వాటిల్లో పనిచేసే ఉద్యోగులు దగ్గర్లో ఉండటానికి మొగ్గు చూపుతారు కాబట్టి.. అక్కడి రియల్టీ రేట్లూ పెరిగే అవకాశాలు ఉంటాయి. -
నగరంలోనైట్ షెల్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తోడుగా ఉండేందుకు వచ్చిన వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు రాత్రి వేళల్లో కనీసం నిలువ నీడ లేక.. ఆస్పత్రి ఆవరణలు, సమీపంలోని ఫుట్‌పాత్‌లు, పార్కులు, రోడ్డు డివైడర్లపై గడపాల్సిన దుస్థితి.అలాంటి వారికి నీడనిచ్చేందుకు నైట్ షెల్టర్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఎంపిక చేసిన ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రానున్న చలికాలంలోగా వాటి ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది చలికాలంలో ఈ తరహా బాధితుల వేదనపై ‘సాక్షి’లో వెలువడిన కథనానికి అప్పట్లోజీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పందించారు. బంజారాహిల్స్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నైట్‌షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దాని వల్ల ఎందరికో మేలు జరుగుతోంది. మిగతా ఆస్పత్రుల వద్ద పేషెంట్లు, తోడుగా వచ్చే వారు ఉండేందుకు నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. ఆస్పత్రుల ఉన్నతాధికారులతో చర్చించి, వారిని ఒప్పించారు. మరి కొద్ది రోజుల్లో చలికాలం రానుండటంతో ఆలోగా ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. దీనికి నివేదికలు రూపొందించాల్సిందిగా కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ టెండర్ ప్రకటన జారీ చేశారు. ఒక్కో ఆస్పత్రి వద్ద డిజైన్‌కు రూ.69 వేల వంతున ఏడు ఆస్పత్రులకు మొత్తం రూ.4.83 లక్షలకు సేవలందించేందుకు ముందుకొచ్చిన సంస్థకు పనులు అప్పగించారు. ఈ సంస్థ నుంచి నివేదిక అందగానే నైట్‌షెల్టర్ల పనులు ప్రారంభించనున్నారు. అమలుకు నోచని ‘సుప్రీం’ఆదేశాలు.. ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఐదు లక్షల మందికి ఒక నైట్‌షెల్టర్ చొప్పున ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు చాలా కాలం క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఆ లెక్కన నగరంలో దాదాపు వంద నైట్‌షెల్టర్లు ఉండాలి. కానీ, ఇప్పటి వరకు 14 మాత్రమే ఏర్పాటు చే శారు. వాటిలోనూ దాదాపు పది మాత్రమే సక్రమంగా నడుస్తున్నాయి. నగరానికి దూరంగా ఎక్కడెక్కడో వాటిని ఏర్పాటు చేయడంతో వినియోగించుకునే వారు లేక కొన్నింటిని మూసేశారు. -
ఇక హరిత వనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ హరిత వనం కానుంది. కార్పొరేషన్ పరిధిలో 40-45 పార్కులు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటికి ప్రహరీలు నిర్మించేందుకు నిధులు కూడా విడుదలయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ ఖాళీ స్థలాలను పార్కులుగా మారుస్తామని, మూడునెలల్లో జిల్లా కేంద్రంలో వీటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెపుతున్నారు. మరోవైపు ఖమ్మం నగర శివార్లలో ఒక పెద్ద పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆయన ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు. కబ్జా కోరల నుంచి రక్షించేందుకే... జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరమయినప్పటికీ ఖాళీగా ఉన్న స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఇందులో ప్రభుత్వ భూములు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు కబ్జాకు గురయిన వాటిని పక్కనపెడితే... ఇప్పటికీ కార్పొరేషన్ ఆధీనంలోనే కొన్ని ఖాళీ స్థలాలున్నాయి. వీటిని రక్షించాలన్న ఆలోచనతో పాటు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు ఈ ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హోదాలో ఇలా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది కార్పొరేషన్ పరిధిలో 40-45 స్థలాలను గుర్తించారు. ఇప్పుడు వీటికి ప్రహరీ గోడలు ఏర్పాటు చేయించేందుకు యుద్ధప్రాతిపదికన రూ.1.65 కోట్లు కేటాయించారు. ఇందులో సగం 13వ ఆర్థిక సంఘం నిధులు కాగా, మరో సగం కార్పొరేషన్ నిధులు. వీటితో గుర్తించిన ఖాళీ స్థలాలకు ప్రహరీల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత వాటన్నింటినీ పార్కులుగా మార్చనున్నారు. జీహెచ్ఎంసీ తరహాలో... ఈ పార్కులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని పార్కుల తీరులోనే నిర్వహిస్తామని అధికారులు చెపుతున్నారు. కాలనీ, రెసిడెంట్స్ అసోసియేషన్లకు ఈ పార్కుల నిర్వహణ బాధ్యత అప్పగించనున్నారు. కొంత మున్సిపల్ నిధులు, మరికొంత అసోసియేషన్ నిధులతో ఈ పార్కులు నిర్వహిస్తారు. పార్కు విస్తీర్ణాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరు వాచ్మెన్లను కూడా నియమించనున్నారు. ఇక.. నగర శివార్లలో భారీ పార్కు నిర్మాణానికి కూడా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్కుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చేందుకు ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయేమో అన్న ఆలోచనతో జిల్లా కలెక్టర్ తన హయాంలోనే ఈ పార్కులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఐఏఎస్ ఉంటేనే మేలు ఇక, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఉంటేనే మంచిదనే కోణంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే కార్పొరేషన్ అయినా ఖమ్మం నగరం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పాటు యేటా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ను ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ఈ పోస్టును ఐఏఎస్‌లకు అప్పగిస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వ స్తుండడం గమనార్హం. -
ప్రణాళిక తో పరుగులు
సాక్షి, హైదరాబాద్: సొంతింటి వెలుగులు జీవితాంతం ఆస్వాదించాలంటే స్థలం ఎంపికలో జాగ్రత్తగా అడుగులేయాలి. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడే సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించొచ్చు. ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే స్థిరాస్తిలో నష్టభయం తక్కువే. ఒక్కోసారి ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం గిట్టుబాటవుతుంది. అయితే మధ్యవర్తులు, రియల్టర్లు చెప్పే మాటలకు బోల్తాపడి తుది నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ప్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు తక్కువ సమయంలో అధిక రాబడిని అందుకోవడానికి పరుగులు పెట్టకూడదు. ఇది అన్ని వేళలా మెరుగైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. వీలైతే కనీసం ఐదేళ్ల పాటు ఆయా పెట్టుబడిపై రాబడిని ఆశించకూడదు. ఆ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు. ప్రస్తుతం తక్కువ రేటుకు కొనేసి ఐదేళ్లయ్యాక అధిక రేటుకు అమ్ముకునేలా ప్రణాళికలుండాలి. అయితే స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రస్తుత పరిస్థితులపై చక్కటి అవగాహన పెంచుకోవాలి. తర్వాత పరిస్థితి ఎలా మారడానికి అవకాశముందో అంచనా వేయాలి. మరి, ఏయే సందర్భాల్లో స్థలాలపై అధిక రాబడి అందుకోవడానికి అవకాశముందో ఓసారి చూద్దామా.. అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ప్రాంతాల్లోనే స్థలాన్ని కొనాలి. ఒకవేళ ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కొందామంటే.. రేటు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. అయినా అక్కడే కొనాలన్న నిర్ణయానికొస్తే విస్తీర్ణం తక్కువ గల స్థలం లేదా ఇంటితో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశమేమిటంటే.. ఇదివరకే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మనం ఊహించినంత వేగంగా రేట్లు పెరగకపోవచ్చు. అంతేకాదు కొంతకాలం అయ్యాక ధరలు అక్కడే స్థిరపడొచ్చు కూడా. అందుకే అభివృద్ధికి ఆస్కారమున్న చోట కొన్నారనుకోండి ఊహించిన దానికంటే అధిక రాబడి గిట్టుబాటవుతుంది. మౌలిక సదుపాయాలు.. మనం కొనాలని భావించే స్థలానికి చేరువలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా లేదా అనే విషయాన్ని చూడాలి. ఉదాహరణకు స్థలానికి చేరువలో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్, ఉద్యానవనాలు, స్విమ్మింగ్‌పూల్ వంటి సదుపాయాలున్నాయనుకోండి.. అక్కడ నివసించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఫలితంగా భవిష్యత్తులో ధరలూ పెరుగుతాయి. ప్రస్తుతం అలాంటి సదుపాయాలు లేకపోయినా రానున్న రోజుల్లో వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వపరంగా చర్యలేమైనా తీసుకుంటారా? లేదా ప్రైవేటు సంస్థలు అలాంటి సదుపాయాల్ని పొందుపరుస్తాయా? వంటి అంశాల్ని కనుక్కోవాలి. ఏదేమైనా కొన్నాళ్ల తర్వాత ఆయా ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నమ్మకం ఏర్పడాలి. కొన్ని స్థిరాస్తి సంస్థలు చెప్పే కబుర్లకు బోల్తాపడి మీ సొమ్మును పెట్టుబడిగా పెట్టకండి. వాస్తవాల్ని గమనించాకే అడుగు ముందుకేయాలి. ప్రజా రవాణా వ్యవస్థ.. మనం తీసుకునే స్థలం దాకా ప్రజా రవాణా వ్యవస్థ సదుపాయం లేకున్నా పర్వాలేదు. కనీసం రానున్న రోజుల్లో అయినా అట్టి సౌకర్యం అందుబాటులోకి వస్తుందా? ఈ అంశాన్ని పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్తులో ధర పెరిగే అవకాశముంటుంది. దగ్గర్లో రైల్లే స్టేషన్ లేకున్నా పర్వాలేదు. బస్‌డిపో లేకపోయినా పర్వాలేదు. నిత్యం రాకపోకలు సాగించడానికి బస్టాండ్ ఉంటే సరిపోతుంది. ఇదే అంశం ఆధారంగా చాలామంది ప్లాట్లను కొంటుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ప్లాట్ల ధరలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం.. మెట్రో రైలే. యమజోరుగా జరుగుతోన్న మెట్రో పనుల్ని చూసి ప్లాట్లను అమ్ముకోవడానికి ఎవరూ సాహసించట్లేదు. అయితే నగరంలో ఖాళీ స్థలాలు పెద్దగా లేవు కాబట్టి రానున్న రోజుల్లో ధరలు తగ్గే అవకాశమే లేదు. కాబట్టి స్థలాలు కొనేవారెవరైనా అభివృద్ధి చెందడానికి ఆస్కారముండి, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి మరి. పాఠశాలలు, ఆసుపత్రులు.. స్థలం కొనేముందు, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయా అనే అంశాన్ని గమనించాలి. ఇప్పుడే కాకపోయినా ఓ ఐదేళ్ల తర్వాతైనా అవి ఏర్పాటవ్వడానికి వీలుంటుందా అనే విషయాన్ని గమనించాలి. పేరు ప్రఖ్యాతలున్న పాఠశాలలుంటే భవిష్యత్తులో రేటు పెరగొచ్చు కూడా. బడా కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల్ని విస్తరించడానికి అవకాశముందనే విషయాన్ని వీలైతే తెలుసుకోండి. ఏదేని కొత్త ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల్ని కల్పించే సంస్థ ఏర్పాటైతే.. అక్కడి స్థలాల ధరలు పెరుగుతాయి. కొన్నిసార్లు సహజంగా పెరగకపోయినా.. మధ్యవర్తులు, రియల్టర్లు ఉంటారు కదా రేట్లు పెంచడానికి. అలా చేయడం వల్లే ప్రస్తుతం శంషాబాద్, మహేశ్వరం చుట్టుపక్కల స్థలాల్ని కొనేవారే కరువయ్యారు. కాబట్టి ప్లాట్ల రేట్లు సహజంగా తప్ప కృత్రిమంగా కాదు. -
కుక్కలు వస్తే చిక్కులు
గ్రేటర్ నోయిడా: శునకాలకు అనుమతి లేదంటూ పార్కుల్లో ప్రత్యేకంగా బోర్డులు అమర్చినా యజ మానులు ఖాతరు చేయకుండా వాటిని తీసుకురావడం గుర్గావ్ పార్కుల్లో సర్వసాధారణమే. అయితే వీటి సంచారం వల్ల కాలనీ పార్కులు తీవ్రంగా దెబ్బతింటున్నట్టు గుర్తించిన నోయిడాలోని బెటా-1 సెక్టార్ నివాసుల సంక్షేమ సంఘం (ఆర్డబ్ల్యూఏ) పెంపుడు జంతువుల సంచారంపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కాలనీ పార్కుల్లోకి కుక్కలను తీసుకువస్తే ఇక నుంచి రూ.21 వేల జరిమానా వేస్తామని హెచ్చరించింది. జంతువులను తీసుకురాకూడదని ఎన్నిసార్లు చెప్పి నా యజమానులు వినడం లేదని, గ్రేటర్ నోయిడా ప్రాధికార సంస్థ కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్డబ్ల్యూఏ వివరణ ఇచ్చింది. ‘బెటా సెక్టార్లో దాదాపు 1,800 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఎనిమిది పార్కులు ఉన్నాయి. చాలా మం దికి ఒకటి కంటే ఎక్కువ కుక్కలు ఉన్నాయి. వీటిని తీసుకురాకూడదని ఎంత చెప్పినా యజమానులు చెవికెక్కించుకోవడం లేదు. పార్కులను అందరి సౌకర్యం కోసం నిర్మించారు. పెంపుడు జంతువుల వల్ల అవి తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ విష యం గురించి గ్రేటర్ నోయిడా మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదు’ అని ఆర్డబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి హరీందర్ భట్టి వివరించారు. కుక్కలను తీసుకువస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ప్రతి పార్కులో రెండు బోర్డులు పెడతామని తెలిపారు. పెంపుడు జంతువుల తీసుకురావడాన్ని ప్రోత్సహించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. బెటా ఆర్డబ్ల్యూఏ మాదిరిగానే మిగతా సంఘాలు కూడా ఇదే బాటను అనుసరించాలని భావిస్తున్నాయి. కుక్కల యజమానులు మాత్రం ఆర్డబ్ల్యూఏ నిర్ణయంపై మండిపడుతున్నారు. గ్రేటర్ నోయిడా మున్సిపాలిటీ మాత్రం ఈ విషయంపై ఏమీ చెప్పడం లేదు. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జంతు సంక్షేమ సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం హౌసింగ్ సొసైటీలు పెంపుడు జంతువుల సంచారంపై నిషేధం విధించడం కుదరదు. జరిమానాలు విధించడం కూడా చట్టవిరుద్ధమే. పార్కుల్లోకి జంతువులను తీసుకురావడానికి నిర్దేశిత సమయాన్ని సూచించవచ్చు. -
నిండా ప్రేమలో మునిగాక.. ముసుగే శరణ్యం!!
-
హాయిగా ఆడుకోనివ్వండి
మైదానాలు లేక, పార్కుల్లో చోటు లేక పిల్లలు ఏం కావాలని హైకోర్టు ఆవేదన 14వేలల్లో పిల్లలకు 126 మాత్రమేనా? మున్సిపాలిటీలకు సూటిప్రశ్న రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ఆటస్థలాలు లేవు. వీధుల్లో ఆడుకునే పరిస్థితి లేదు. పార్కులు పెద్దవారికే పరిమితమవుతున్నాయి. పిల్లలను ఓ మూలకు నెడుతుండడంతో వారు ఆడుకోలేని పరిస్థితి. దీంతో శారీరక వ్యాయామం లేక పిల్లలు అధిక బరువుతోనో, మరే ఇతర రుగ్మతలతోనో బాధపడుతున్నారు. న్యూఢిల్లీ : నగరంలోని మూడు కార్పొరేషన్స్‌లో 14వేల పార్కులున్నాయి. కానీ అందులో కేవలం 126 మాత్రమే పిల్లలవి. సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్నుండి వచ్చిన లేఖకు స్పందించిన ఢిల్లీ హైకోర్టు... నగరంలోని పార్కుల పరిస్థితిని, వాటి నిర్వహణ వివరాలను రెండు వారాల్లోగా తమకు నివేదించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. పిల్లలు ఆడుకోకుండా ఆభరణాలుగా ఉన్న పార్కులు అంతరించి పోతాయని తెలిపింది. పిల్లలకు పార్కులు సరిగా లేకపోవడం, ఉన్న పార్కుల్లో ఆడుకునే స్థలం ఎక్కువగా లేకపోవడానికి ఒక్క ప్రభుత్వ సంస్థలనే దూషించాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆటలాడి ఇళ్ల అద్దాలు పగలగొడతారేమో, ప్రజలను గాయపరుస్తారేమో, గడ్డి పాడవుతుందనో పార్కుల్లో పిల్లలను ఆడుకోనియకుండా పెద్దలే ప్రధాన శత్రువులవుతున్నారు. పార్కుల్లో ‘పిల్లలు ప్రవేశించరాదు, ఇది తాకరాదు, అది తాకరాదు’ అంటూ బోర్డులు పెడతారు. చివరకు పోలీసులు కూడా ఆడుకోనివ్వకుండా పిల్లలను పార్కులనుంచి వెళ్లగొడుతున్నారు. క్రీడా మైదానాలుండవు. వీధుల్లో మొత్తం వాహనాలే ఉంటాయి? మరి పిల్లలెక్కడికి వెళ్లాలి? ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. చిత్తరంజన్ పార్కులో ఒకటో బ్లాకు చాలా అందంగా ఉంటుంది. అక్కడి వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి కిటికీకి తగిలి గాజు కిటికీ పగిలిపోయింది. దాంతో వీధుల్లో వారిని ఆడుకోనివ్వడం లేదు. ‘‘పార్కులోకి గార్డు మమ్మల్ని అనుమతించడు. బ్యాడ్మింటన్ గ్రౌండ్ ఉన్నా అది ఎప్పుడూ పెద్దవాళ్లతో నిండిపోయి ఉంటుంది. వాళ్లు మమ్మల్ని వేరే పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. ఇంకో పార్కుకు వెళ్లి ఆడుకోమంటారు. కానీ అది మా ఇంటికి చాలా దూరం కావడంతో మా అమ్మానాన్న అక్కడికి పోనివ్వరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చిన్నారి శుభం. ఇదిలా ఉంటే.. ఆ పార్కును ఓ టెంట్ హౌజ్ ఉపయోగించుకుంటోంది. ప్రతిచోటా ఏదో ఒక అడ్డంకి. మరి పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడికి పోవాలి? ‘‘పార్కుల్లో పిల్లలు ఆడుకోవడం వల్ల అక్కడే వాకింగ్ చేస్తున్న మాలాంటివాళ్లకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అందుకే బాల్వంటివి లేకుండా ఇతర ఆటలు ఆడుకొమ్మని చెబుతున్నాం’’ అన్నాడు భార్యతో కలిసి వాకింగ్‌కు వచ్చిన స్థానిక వాసి గోపాల్పాండే. అయితే దీన్ని అందరూ అంగీకరించడం లేదు. ఆడుకోవడానికి మైదానాలు లేక పిల్లలు అధిక బరువు పెరుగుతున్నారు. ప్రతిచోటా పిల్లలకోసం స్థలం కేటాయించాలని ఎంపీడీ-2021 చెప్పినా... అవి చెట్ల పెంపకానికే పరిమితమై చూడటానికే ఉన్నాయి తప్ప పిల్లలు ఆడుకోవడానికి లేదని, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో సభ్యత్వం తీసుకునే స్తోమత ప్రతి ఒక్కరికీ ఉండదు కదా అంటున్నారు స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అశోక్ బోస్. అయితే పిల్లల కోసం ప్రతి వార్డులో పార్కు, స్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కార్పొరేషన్ ప్రణాళిక కాగితాలకే పరిమితమైపోయింది. కొన్ని అకాడమీలతో తాము మాట్లాడామని, త్వరలోనే అవి ఓ రూపుదాల్చుతాయని అంటున్నారు దక్షిణ ఢిల్లీ మేయర్ సరితా చౌదరి. పిల్లలను ఆడుకోవడానికి పార్కుల్లోకి అనుమతించినా పిల్లల భద్రత కోసం ప్రతి పార్కులో సిబ్బందిని ఏర్పాటు చేయలేమన్నది అధికారుల వాదన. ఇదిలా ఉంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి ఏటా 300 కోట ్ల రూపాయలను పార్కుల మీద ఖర్చు చేస్తోంది. కానీ ఆ పార్కుల్లో పిల్లలను ఓ మూలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.కేవలం పిల్లలు మాత్రమే ఆడుకుంటున్న ఒకే ఒక్కటి ద్వారకా సెక్టార్ 11లోని పార్కు . ఇది పిల్లల కోసమేనని రెండేళ్ల కిందటే ప్రకటించారు. మానసిక, శారీరక వైకల్యంతో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి అందులో ఏర్పాట్లు చేశారు. -
ప్రేమ..ఓ మధురానుభూతి
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్ : ప్రేమ.. ఓ అనిర్వచనీయమైన అద్భుత కావ్యం, ప్రేమ.. ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమ.. ఓ రాగరంజిత రసానుబంధం. ప్రేమ అనే రెండక్షరాలు రెండు మనసులను దగ్గర చేస్తుంది. ప్రేమించేదే హృదయం..తపించేదే జీవితం. జీవితం అంటేనే ప్రేమైక అనుభూతి. ప్రేమే మానవ పరమావధి. ఒక్క యువతరానికే కాక వయోవృద్ధుడిని సైతం జవసత్వాలతో నడిపించే ఒక రసానుభూతి ప్రేమ. ప్రేమలేనిదే సృష్టి లేదు, జీవితం లేదు, మనిషి లేడు. అలాంటి ప్రేమకు చలించని వారే లేరు. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఫిబ్రవరి 14 (ప్రేమికులరోజు) రానే వచ్చేసింది. ఈ రోజే ఒకరికి ఒకరు తమ ప్రేమను వ్యక్త పరుచుకుంటారు. అప్పటికే ప్రేమలో ఉండే వారు ప్రేమలోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని శుక్రవారం జరుపుకునేందుకు యువతరం సిద్ధమైంది. కళాశాలలు, పార్కులు, సినిమాహాల్స్ వంటివి సందడిగా మారనున్నాయి. అయితే యువత ప్రేమలో పడినా దాన్ని అందమైన జీవితంగా మార్చుకోవాలని, అలా కాక ప్రేమ అనే ముసుగులో ఒకరిని మరొకరు మోసం చేసుకోని జీవితాలను నాశనం చేసుకోవద్దని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. ఆకట్టుకుంటున్న బహుమతులు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ దుకాణాల్లో ప్రియుడు ప్రేయసికి, ప్రేయసి ప్రియునికి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన బహుమతులు ఆకట్టుకుంటున్నాయి. గ్రీటింగు కార్డులు, బొ మ్మలు, కీచైన్లు, బ్రాస్లెట్లు, వాచీలు టీషర్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకించి టీకప్పులపై ప్రియుని ఫొటో ముద్రించి ఇచ్చేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. గ్రీటింగు కార్డులు రూ.50 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. బహుమతులను రూ.150 నుంచి రూ.5వేల వరకు అందుబాటులో ఉంచారు. ప్రేమికులకు ప్రత్యేకమైంది రోజాలు. ఎరుపు రంగులోని గులాబీ పూలు ప్రేమకు చిహ్నాలు. దీంతో గులాబీలకు ఈ రోజు డిమాండ్ ఏర్పడుతుంది. గురువారం సాయంత్రమే నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజా పూలను బండ్లపై పెట్టి విక్రయిస్తున్నారు. సినిమాల్లో చూపించేది ప్రేమకాదు : మాది ప్రేమ వివాహం. తిరుపతిలో చదువుకునే సమయంలోనే ఇరువురికీ పరిచయం ఏర్పడింది. 1992లో ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం. ఆరేళ్లు ప్రేమించుకున్నాం. 1998లో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు శ్రీలాస్య, శ్రీమయి. మేం చాలా హాయిగా ఉన్నాం. ఎలాంటి ఒడిదుడుకులు లేవు. నేటి యువతపై పూర్తిగా సినిమా ప్రభావం పడింది. సినిమాల్లో చూపించేదే ప్రేమగా భావించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకర్ని ఒకరు ఇష్టపడాలంటే వారు రెండు విషయాల్లో పరిజ్ఞానులై ఉండాలి. ఆలోచించే వయసు, తమ కాళ్లపై తాము నిలబడగలిగి సంపాదించుకోవాలి. అలాగే ఇరువురి అభిరుచులు కూడా కలవాలి. అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా పెళ్లి అయిన తర్వాత ఒక రోజు ఇరువురిలో ఎవరోకరు బాధపడక తప్పదు. - డాక్టర్ శ్రీనివాసతేజ, సైక్రియార్టిస్ట్, గౌరి, అధ్యాపకురాలు వందరెట్లు ప్రేమ పెరిగింది : బెంగళూరులో నృత్య కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది నవ్య. నెల్లూరులోనూ డ్యాన్స్‌లో తనకంటూ ఓ పేరును సాధించాడు రమణ. 2004లో అనుకోకుండా ఒక రోజు బెంగళూరులో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో ఇరువురి గ్రూపులు పోటీపడ్డారు. అప్పుడు ఇరువురికీ పరిచయం ఏ ర్పడింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ఒకరి మనసులో భావాలు మ రొకరు పంచుకున్నారు. మూడేళ్ల పా టు వీరి ప్రేమ సాగింది. 2007లో వివాహం చేసుకుని ప్రస్తుతం తమ తల్లిదండ్రులతో కలిసి నగరంలోని బ్యాంక్ కాలనీలో ని వాసం ఉంటున్నారు. ఇద్దరూ డ్యాన్సర్లు కావడంతో వేదాయపాళెంలో స్టెప్అప్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ‘ప్రస్తు తం ప్రేమ అనేది నిర్లక్ష్యంగా మారుతోంది, ప్రేమిస్తే పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలి, మేము ప్రేమించుకునేటప్పటికంటే ప్రస్తుతం ఒకరిపై మరొకరికి ప్రేమ పెరిగింది’ అని చెబుతున్నారు వారు. - రమణ, నవ్య కష్టాలను ఇష్టాలుగా ప్రేమించేదే ప్రేమ : జీవితంలో కష్టాలు, ఇష్టాలు రెండూ ఉంటాయి. కష్టాలను కూడా ఇష్టాలుగా ప్రే మించేదే నిజమైన ప్రేమ. అవి నేను ఎంబీబీఎస్ చదివే రోజులు. నా వయసు 22 ఏళ్లు. మాది అల్లూరు దగ్గర సింగపేట. మూలాపేటలోని నా స్నేహితుడి నివాసానికి అప్పుడప్పుడూ వస్తూఉండేవాడిని. ఈ క్రమంలో 1979 డిసెంబర్ 31వ తేదీన నా స్నేహితుని నివాసం వద్ద పద్మావతిని చూశా. అప్పుడు తన వయసు 16. చూడగానే తననే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఎలాగో కష్టపడి నువ్వంటే ఇష్టం అని చెప్పా. తను ఒప్పుకుంది. తన వయసు, నా చదువు దీంతో ఐదేళ్లపాటు ప్రేమించుకునేందుకు కాలం కలిసి వచ్చింది. ఈ సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి బంధం ఏర్పడింది. మా ప్రేమకు గమ్యం పెళ్లికి దారితీసింది. 1984లో మేము ఇరువురం పెళ్లి చేసుకున్నాం.’ ఇప్పుడు మాకు ఇంటర్మీడియట్ చదివే కుమారుడు ఉన్నాడు. ప్రేమకు వయసుతో పనిలేదు. ప్రేమపెళ్లిళ్లు ప్రేమికులకు ఆదర్శంగా నిలవాలి. - డాక్టర్ ఈదూరు సుధాకర్, పద్మావతి -
ఆస్తులున్నా.. ‘లెక్కే’లేదు
‘గ్రేటర్’ నిర్లక్ష్యం ఆస్తుల వివరాలు లేవు సిబ్బంది ఇష్టారాజ్యం కార్పొరేషన్‌కు టోపీ ‘నాక్కొంచెం తిక్క ఉంది... దానికో లెక్క ఉంది...’ ఆ మధ్య హిట్టైన సిన్మాలో హీరో పాపులర్ డైలాగ్ ఇది. సరదాకే అన్నా తిక్కకూ ఓ లెక్క ఉందన్నది ఆ హీరో వాదన. ఘనత వహించిన మన జీహెచ్ఎంసీ వద్ద అసలు దేనికీ లెక్కే లేదు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, చెరువులు, పార్కులు, హోర్డింగ్‌లు, శ్మశానవాటికలు.. వెరసి తమకెన్ని ఆస్తులున్నాయో తెలీదు. ఈ దుస్థితిపై ఎవరన్నా ఏమన్నా అంటారన్న భయం అంతకన్నా లేదు. ఉన్నదేమైనా ఉందంటే.. అది లెక్కలేనితనమే. సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు అవసరమైన రహదారులు, పారిశుధ్యం తదితర సేవలెన్నో అందించడంతోపాటు ఇంటి నిర్మాణం జరపాలన్నా, వ్యాపార సంస్థలకు లెసైన్సులివ్వాలన్నా, ఐదంతస్తుల్లోపు ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసీ ఇవ్వాలన్నా జీహెచ్ఎంసీకే అధికారం ఉంది. అంతేకాదు.. తనకున్న ఎన్నో షాపింగ్ కాంప్లెక్సుల్లోని ఎన్నో దుకాణాల్ని ఎందరికో అద్దెలకిచ్చింది. ఇన్ని ఆస్తులు, బాధ్యతలున్న జీహెచ్ఎంసీ వద్ద వాటికి సంబంధించిన వివరాలన్నీ ఉండాలి. కానీ.. కార్పొరేషన్లో ఏ ఒక్కదానికీ లెక్కాపత్రం ఏమీ లేదు. ఆటస్థలాలు ఎన్ని కబ్జా అయ్యాయో తెలియదు! పార్కు స్థలాలు ఎన్ని పరాధీనమయ్యాయో రికార్డుల్లేవు. ఏయే శ్మశానవాటికల్లో ఎవరు తిష్ట వేశారో లెక్కల్లేవు! ఎన్ని మార్కెట్లలో ఎవరుంటున్నారో.. ఏ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎవరికి దుకాణాలు కేటాయించారో.. వాటిల్లో ఎవరుంటున్నారో సమాచారం లేదు!! లీజు పొందిన స్థలాలు, భవనాల్లో ఎందరు లీజు సొమ్ము చెల్లిస్తున్నారో.. ఎవరెంత చెల్లించారో కూడా తెలియదంటే తెలియదు. ఎన్ని బహిరంగ ప్రదేశాలున్నాయో.. ఎన్ని భవనాలకు అనుమతులిచ్చారో.. ఎన్ని అక్రమ భవనాలు వెలిశాయో కూడా వివరాలు లేవు. నగరంలో తాను వేసిన రోడ్లు ఎన్ని ఉన్నాయో.. వేటిని ఎవరు పర్యవేక్షించాలో కనీస సమాచారం కూడా ఇంతవరకూ లేదు. ఆస్తిపన్ను వసూళ్లు తదితరమైన వాటిదీ అదే దారి! ఇలా చెప్పుకుంటూ పోతే.. జీహెచ్ఎంసీకి తెలియని జాబితా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీరు ! సిబ్బంది ఇష్టారాజ్యం ఆస్తులకు సంబంధించి.. రావాల్సిన ఫీజులు, పన్నులకు సంబంధించి సరైన లెక్కలంటూ ఉంటే లోపాలెక్కడున్నాయో తెలుసుకోవచ్చు. వివరాలే లేనప్పుడు ఎవరెంత దోచుకున్నా గుర్తించడం తరం కాదు. జీహెచ్ఎంసీలో జరుగుతున్నదదే. రికార్డులు లేని పరిస్థితిని ఆసరా చేసుకున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా సొంత వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికితోడు అధికారుల అంతులేని నిర్లక్ష్యమూ ఇబ్బందికరంగా మారింది. ఆయా ప్రాంతాల్లోని అక్రమాలపై ప్రజలు సమాచారమిస్తున్నా చర్యలు లేవు. కబ్జాపాలవుతున్న చెరువులు, పార్కులపై సమాచారమిచ్చినా పట్టించుకోరు. దొంగ రసీదులతో వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ముడుపులు పుచ్చుకొని ప్లింత్ ఏరియాను తక్కువ చూపుతూ జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్నారు. ఆస్తిపన్ను అసెస్మెంట్లలో ఎక్కువ విస్తీర్ణంలోని భవనాలను తక్కువ విస్తీర్ణంలో చూపుతూ ప్రైవేటు వ్యక్తులకు సాయపడుతున్నారు. అందుకుగాను వారిచ్చే ముడుపులతో లాభపడుతున్నారు. జీహెచ్ఎంసీలోని కొన్ని విభాగాలను పరిశీలించినా దాని పనితీరు ఎలా ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఎన్ని విద్యాసంస్థలకు, ఎన్ని ప్రార్థనా మందిరాలకు ఆస్తిపన్నులో మినహాయింపు ఉందో తెలపాల్సిందిగా కోరినా.. ఏ సర్కిల్/జోన్లో ఎన్ని భవనాలకు అనుమతిచ్చారో తెలపాలని ఆర్టీఐల ద్వారా కోరినా సమాధానం లేదు. చెరువుల లెక్కల్లేవు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని చెరువులున్నాయో.. వాటిల్లో వేటి ఎఫ్టీఎల్ ఎంతో.. ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయో కచ్చితమైన సమాచారం లేదు. తొలుత 178 చెరువులున్నాయన్నారు. అనంతరం వాటిని 168గా తగ్గించి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో 126కు మించి కనిపించడం లేవని చెబుతున్నారు. చెరువుల భూములు కబ్జా కాకుండా ఎఫ్టీఎల్ నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ, ఆ పని పూర్తికాకముందే ఆయా చెరువులకు ఫెన్సింగ్ పేరిట రూ.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. ప్రకటనలపైనా పట్టింపు లేదు గ్రేటర్‌లోని ప్రకటనల ఆదాయం మొత్తం జీహెచ్ఎంసీకే చెందాల్సి ఉండగా.. నగరంలో ఎన్ని హోర్డింగులున్నాయో వివరాల్లేవు. ఆదాయం వచ్చే ప్రకటనల్లో ముఖ్యమైనవి.. హోర్డింగులు, నియాన్/ గ్లో సైన్‌బోర్డులు, ఆర్చిలు, గోడలపై పెయింటింగ్‌లు, ఫ్లెక్సీబోర్డులు, గ్లాస్ పోస్టర్లు, షాప్ షట్టర్లు, లాలీపాప్స్, బస్షెల్టర్లు, బెలూన్లు. వీటిద్వారా ఏటా రూ. 100 కోట్ల మేర ఆదాయం రావాలి. కానీ చూసీ చూడనట్లు వదిలేస్తుండటంతో రూ.25 కోట్లు కూడా వసూలు కావడం లేదు. ఏదీ ఫైర్‌సేఫ్టీ ? ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే జీహెచ్ఎంసీ.. తర్వాత ఆ విషయం మరచిపోతుంది. ఫైర్‌సేఫ్టీ లేని సంస్థల లెసైన్సులు రద్దు చేస్తామని మూడేళ్లుగా చెబుతున్నప్పటికీ ఫైర్‌సేఫ్టీ లేని సంస్థలు నగరవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో సమాచారమే లేదు. ఆయా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు హూంకరింపులు తప్ప.. ఆపై చర్యలు లేవు. ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ టింబర్‌డిపోలు ఏర్పాటైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, పాఠశాలల సమాచారం కోసం జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆస్పత్రుల సమాచారం కోసం ‘అప్నా’కు, సినీ సంస్థలకు సంబంధించిన సమాచారం కోసం ఫిల్మ్‌చాంబర్‌కు లేఖలు రాశారు. 2009 నుంచి ఈ విభాగం పని ప్రారంభించినప్పటికీ , కావాల్సిన సమాచారాన్నే ఇంతవరకు సమకూర్చుకోలేకపోయింది. ఏవీ లేవు.. టౌన్‌ప్లానింగ్ ఎన్ని భవనాలకు అనుమతులున్నాయో డేటా బేస్ లేదు. ఎన్ని సెల్ టవర్లున్నాయో లెక్క లేదు. శిథిల భవనాలు సిటీలైట్ హోటల్ ప్రమాదం జరిగినప్పుడు శిథిల భవనాలపై నిద్ర లేచారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు కాకముందు ఎప్పుడో చేసిన గణాంకాలతో 558 శిథిల భవనాలున్నాయన్నారు. సిటీలైట్ ప్రమాదం తర్వాత 737 ఉన్నట్లు చెప్పారు. అంతకన్నా ఎక్కువే ఉంటాయనేది అంచనా. గుర్తించిన శిథిల భవనాలపై తగు చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇంజనీరింగ్ ఏ డివిజన్లో ఎన్ని కి.మీ.ల మేర రోడ్లున్నాయో.. వాటిమరమ్మతులను పర్యవేక్షించే ఇంజనీర్లెవరో తెలియదు. ఏ రోడ్డును ఎప్పుడు నిర్మించారో తెలియదు. అవి ఎప్పటిదాకా మన్నికగా ఉండాలో తెలియదు. ఏ రోడ్డు కింద ఏ పైపులున్నాయో తెలియదు. గోతులేర్పడ్టప్పుడు మాత్రం హడావుడి చే యడం.. ఆపై మరచిపోవడం పరిపాటిగా మారింది. ఫ్లై ఓవర్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారమూ లేదు. ఆరోగ్యం, పారిశుధ్యం ఏయే మార్గాల్లో ఎవరు ఏయే విధులు నిర్వహిస్తున్నారో ఇప్పటిదాకా తెలియదు. ఇటీవలే.. ఇందులో సంస్కరణలు ప్రారంభించారు. కొనసాగిస్తారో, అర్ధాంతరంగా ఆపేస్తారో తెలియదు. ఎస్టేట్స్ ఎస్టేట్స్ విభాగమంటూ ఒకటి ఉన్నప్పటికీ.. ఎన్ని ఆస్తులున్నాయో.. లీజుదార్లెందరో.. అద్దెలెన్ని వస్తున్నాయో, ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో తెలియదు. సాక్షాత్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే.. కార్పొరేషన్‌తో సంబంధం లేనివారు యూనియన్ల పేరిట, అసోసియేషన్ల పేరిట కార్యాలయాలను ఆయాచితంగా వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ట్రేడ్ లెసైన్సులు ఆదాయ వనురుల్లో ఒకటైన ట్రేడ్ లెసైన్సులకు సంబంధించిన డేటాబేస్ లేకపోవడంతో లెసైన్సులే లేని వ్యాపారసంస్థలెన్నో తెలియదు. లెసైన్సులు పొందాక సక్రమంగా ఫీజులు చెల్లించని వారెందరో.. వారి నుంచి ఎంతమొత్తం రావాలో వివరాల్లేవు. ఏ దుకాణం నుంచి ఎంత ఫీజు వసూలు కావాలో రికార్డుల్లేవు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యం సాగుతోంది. ఎలక్ట్రికల్ విభాగం ఏ వీధిలోఎన్ని విద్యుత్ దీపాలు ఎప్పుడు వేసిందీ లెక్కలుండవు. కొత్త బల్బులు వేసినప్పుడు పాత బల్బులనేం చేస్తున్నారో తెలియదు. ఇక ఆయా ప్యాకేజీల్లో ఉండాల్సినంతమంది కార్మికులు విధుల్లో ఉంటున్నదీ లేనిదీ తెలియదు. అంతా అయోమయం. రవాణా విభాగం ఇందులో అక్రమాలకు అంతు లేదు. కార్మికుల నుంచి ఇంధనం దాకా, అద్దె వాహనాల నుంచి స్పేర్‌పార్ట్స్ దాకా అంతా అక్రమాలే. అన్నింటికీ విద్యార్థులే.. ప్రకటనల హోర్డింగుల్ని గుర్తించడం జీహెచ్ఎంసీ సిబ్బంది వల్ల కాకపోవడంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు వాటికి సంబంధించిన సర్వే బాధ్యతలు అప్పగించారు. ఫైర్‌సేఫ్టీ లేని భవనాలను గుర్తించే పనినీ, ఇంటినెంబర్లకు సంబంధించిన సర్వే పనిని సైతం వారికే అప్పగించారు. ఏ విభాగంలోనూ తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సర్వే వంటి ఏ పని చేయాలన్నా పాలిటెక్నిక్ విద్యార్థులకు అప్పగించడమో.. ప్రైవేటు సంస్థలకు అప్పగించడమో చేస్తున్నారు. వాటి ద్వారానైనా మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారా అంటే అదీ లేదు. అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ట్రేడ్ లెసైన్సుల కోసం వాణిజ్య సంస్థల సర్వే, ఆస్తిపన్ను వసూళ్లకు భవనాల సర్వేను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. అవి ఎంతవరకు పూర్తయిందో తెలియదు. -
ఆహ్లాదం..అందనంత దూరం
సాక్షి, కర్నూలు: ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు అసౌకర్యాలతో ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. అవినీతి మాటున కనీస సౌకర్యాలకు ఇవి నోచుకోవడంలేదు. ఏటా లక్షలాది రూపాయల నిధులు కేటాయిస్తున్నా కర్నూలు నగరంతోపాటు జిల్లాలో పట్టణ, మండల కేంద్రాల్లో నందనవనాలు బాగుపడటం లేదు. నగర, పట్టణ జీవనంలో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే జనానికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచేవివే. పిల్లాపాపలతో కాసింత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేసే వీటి ప్రాధాన్యం చెప్పలేం. ఇలాంటి వాటి స్థితిగతులపై సాక్షి బృందం పరిశీలన చేసింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్న కొన్నింటిని నమూనాగా తీసుకొని తీరుతెన్నులను పరిశీలించగా.. నివ్వెరపోయే నిజాలెన్నో వెలుగు చూశాయి. మన అధికారుల ఉదాసీనం, అవినీతి.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. వెరసి పార్కుల ప్ర‘గతి’కి శాపంగా మారాయి. స్ఙానికంగా ఉన్న వాటిలో కనీస వసతులు కూడా లేవు. అలంకార ప్రాయం ఎమ్మిగనూరు పట్టణంలో వూచాని సోవుప్ప (పెద్దపార్క్) పార్క్‌ను దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించారు. మొదట్లో పార్కు ఎంతో సుందరంగా ఉండేది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడేది. సందర్శకుల కోసం పార్కులో ప్రత్యేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు ఊగే ఊయలలు, జారుడు బల్లలు, ఇతర ఆటవస్తువులు అందుబాటులో ఉండేవి. అయితే పదేళ్లుగా వుున్సిపల్ పాలకులు, అధికారులు దీనిని బాగోగులు పట్టించుకోవడం వూనేశారు. దీంతో పచ్చిక బయళ్లు.. చెట్లు, అలంకార మొక్కలు పూర్తిగా నాశనం అయ్యాయి. పిచ్చిమొక్కలు పెరిగాయి. పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు పూర్తిగా పాడైపోయాయి. ఇక నందమూరి తారక రామారావు పార్కు(చిన్నపార్క్) నిర్వహణ గాలికొదిలేయడంతో అది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. స్థలానికే పరిమితం మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నగర పంచాయతీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పట్ణణం ఒక పార్కుకు కూడా నోచుకోలేదు. పట్ణణ ప్రజలు సేదతీరాలంటే.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానం లేదా ఆర్టీసీ బస్టాండే పార్కులా ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తికాదు. అయితే పార్కు కోసం అధికారులు స్థలం గుర్తించినా కార్యారూపం దాల్చకపోవడంతో ఆ స్థలం నేడు పండ్లవ్యాపారులకు చెత్తకుండీగా ఉపయోగపదుతోంది. ఆహ్లాదంగా గడపాలని భావించే వారు ఇక్కడికి చేరువలోనే ఉన్న శ్రీశైలం, మహానంది పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. అలాగే నల్లకాల్వ సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ స్మృతివనం సందర్శిస్తున్నారు. ఆదరణ కరువు పదేళ్ల కిందట బనగానపల్లెలో ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ‘ఉయ్యాలవాడ నరసంహారెడ్డి’ పార్కుకు నేడు ఆదరణ కరువైంది. వాటర్ ఫౌంటైన్, వాటర్‌పాల్, కలర్ లైటింగ్ సహా చిన్నారుల కోసం ఎన్నో ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ పార్కు సందర్శించే వారి నుంచి ప్రత్యేక రుసుం కూడా వసూలు చేశారు. అయితే ఐదేళ్లుగా ఈ పార్కు నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. వాటర్ ఫౌంటైన్, వాటర్ పాల్, కలర్ లైటింగ్లు పనిచేయడం లేదు. చిన్నారుల ఆట స్థలం నిరుపయోగంగా మారింది. పచ్చదనం మాయం డోన్ పట్టణం కేవీఎస్ కాలనీలో మున్సిపాల్ పార్కు అభివృద్ధి జరిగినా నీరులేక పచ్చదనం కరువైంది. పిల్లలు ఆడుకునేందుకు తగిన ఆట వస్తులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు పిల్లాపాపలతో అక్కడికి వెళ్లలేకపోతున్నారు. వసతులేమి.. కోవెలకుంట్ల పట్టణంలోని గ్రామ పంచాయతీ పక్కన ఏర్పాటు చేసిన బీవీ సుబ్బారెడ్డి మెమోరియల్ పార్కులోమౌలిక వసతులు కరువయ్యాయి. 90 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ పార్కును రెండేళ్ల కిందట సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. ప్రతి ఆదివారం ఈ పార్కులోకి ప్రజలకు ప్రవేశముంటుంది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడకు వచ్చే మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. -
గుడ్డి దర్బార్
=ఆస్తుల వివరాలు, రికార్డులు లేని జీహెచ్ఎంసీ = పరిహారం పేరిట రూ. 17 కోట్ల ఫలహారానికి రెడీ =తనిఖీలతో వెల్లడైన అక్రమం సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో ఎన్ని చెరువులున్నాయో తెలియదు.. వాటిలో ఎన్ని పరుల పాలయ్యాయో వివరాలు లేవు.. పార్కుల విస్తీర్ణమెంతో తెలిపే రికార్డులైనా ఉన్నాయంటే అవీ లేవు.. ఏ పార్కులు ఏ అక్రమార్కుల చెరలో మగ్గుతున్నాయో అంతకన్నా తేలీదు.. ఎస్టేట్ విభాగానికి సంబంధించి ఏ ఆస్తుల్లో ఎందరు థర్డ్పార్టీలున్నారో.. వాటిలో ఎన్నింటికి లీజు చెల్లించడం లేదో సమాచారం లేదు.. అంతేకాదు కనీసం ఎక్కడెక్కడ ఏయే రోడ్లున్నాయో తెలీని దుస్థితి. ఇంకా.. ఇంకా.. ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలియకపోవడమే కాక స్వయానా మునిసిపల్ రోడ్లను సైతం తమ ఆస్తులని లబ్ధిదారులు చెబితే, కళ్లు మూసుకొని లెక్కలు కట్టి, పరిహారం చెల్లించే స్థితిలో ఉంది మన ఘనత వహించిన జీహెచ్ఎంసీ. ఉప్పల్ చౌరస్తా-నల్లచెరువు రోడ్డు విస్తరణ కోసం తమ రోడ్డు ఉన్న స్థలానికే దాదాపు రూ.17 కోట్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధపడిన ఉదంతమే ఇందుకు అత్యుత్తమ నిదర్శనం. ఉప్పల్ చౌరస్తా నుంచి నల్లచెరువు వరకు వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు రహదారి విస్తరణ అవసరమని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అందుకుగాను విస్తరణలో ఆస్తులో కోల్పోనున్న వారిని ఒప్పించేందుకు చాలాకాలం పాటు సంప్రదింపులు జరిపారు. భూసేకరణ ద్వారా అయితే ఆలస్యం అవుతుందని భావించి.. సాధ్యమైనన్ని ఆస్తుల్ని సంప్రదింపుల ద్వారానే సేకరించేందుకు సిద్ధమయ్యారు. స్థానిక కార్పొరేటర్‌తో సహా పలువురు అధికారులు తమ వంతు సహకారం అందించారు. మొత్తం 181 ఆస్తులకుగాను 70 మంది తమ ఆస్తులిచ్చేందుకు ముందుకొచ్చారు. అక్కడ మార్కెట్ ధర చదరపుగజానికి రూ. 25 వేలుండగా, అంతకంటే మరో రూ.5 వేలు ఎక్కువతో (20 శాతం అదనం) చదరపు గజానికి రూ. 30 వేల వంతున పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించారు. అందుకు జీహెచ్ంఎసీ స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. దాంతో.. ఆస్తుల సేకరణ కోసం కొలతలు తీసిన అధికారులు వేటికి ఎంత చెల్లించాల్సి ఉంటుందో లెక్కలు వేశారు. చెల్లింపులకు ముందు.. టైటిల్ వెరిఫికేషన్స్ కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఉన్నతాధికారులు.. జీహెచ్ఎంసీ రోడ్డు భాగాన్ని సైతం లబ్ధిదారుల ఆస్తిలో కలిపి లెక్కించినట్లు గుర్తించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తెలియక జరిగిన పొరపాటన్నారు. దాంతో.. తిరిగి సర్వే నిర్వహించి, కచ్చితంగా లెక్కలు తీయాల్సిందిగా ఆదేశించడంతో తిరిగి ఆ పనిలో పడ్డారు. లేనిపక్షంలో రోడ్డున్న స్థలానికి కూడా నష్టపరిహార చెల్లింపులు జరిగేవి. అది తక్కువలో తక్కువ రూ. 17 కోట్లు. ఇదీ జీహెచ్ఎంసీ నిర్వాకం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లకపోతే.. రూ.17 కోట్లు హాంఫట్ అయ్యేవే. కొత్త చట్టం సాకు చూపుతూ.. జరిగిన పొరపాటు బయట పడనీయకుండా స్థానిక అధికారులు కొత్త భూసేకరణ చట్టాన్ని లబ్ధిదారుల ముందుంచారు. కొత్త చట్టం వల్ల ఎక్కువ నష్టపరిహారం అందనుండటంతో.. లబ్ధిదారులు సైతం ఇప్పుడు దాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. కొత్త చట్టం పుణ్యమా అంటూ జీహెచ్ఎంసీ చేసిన తప్పిదం మరుగున పడిపోనుంది. జీహెచ్ఎంసీ అడ్డగోలు పాలనకు ఇదో నిదర్శనం మాత్రమే. బయటకు పొక్కకుండా లోలోపలే జరుగుతున్న అవకతవకలు.. అక్రమాలు.. పొరపాట్లు.. ఇంకా ఎన్నెన్నో! రానున్న జనవరి 1 నుంచి అమల్లోకి రాగలదని భావిస్తున్న కొత్త భూసేకరణ చట్టం మేరకు భూ నిర్వాసితులయ్యే వారికి మార్కెట్ ధర కంటే 70 శాతం అదనంగా గిట్టుబాటవుతుంది. దాన్ని చూపుతూ లబ్ధిదారుల నుంచి ఒత్తిడి రాకుండా చేయడమే కాక.. ఆ చట్టమే వర్తింపచేయాలని వారి నుంచే డిమాండ్ వచ్చేలా చేశారు. -
ఉద్యానవనాల పెంపుపై అనాసక్తి
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మామిడి తోటలు, ఇతర పండ్ల తోట లను విస్తృతంగా పెంచాలని ఉపాధిహామీ పథ కం ద్వారా ప్రభుత్వం జిల్లాకు లక్ష్యాన్ని నిర్ణయించినప్పటికీ ఉద్యానవనాల పెంపకం పట్ల రైతులకు అవగాహన కల్పించడంలో అధికారు లు విఫలం అయ్యారు. దీంతో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఉద్యానవనాల పెంపుదల సాగే అవకాశం కనిపించడం లేదు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే ఉద్యానవనాల పెంపున కు దరఖాస్తులను స్వీకరించి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలి. అయితే రైతుల నుంచి స్పందనలేక పోవడంతో తక్కువ విస్తీర ్ణంలోనే ఉద్యానవనాల పెంపకం చేపట్టనున్నారు. జిల్లా లో ఇప్పటివరకు కేవలం 700 ఎకరాల్లోనే ఉద్యానవనాలను ఏర్పాటు చేయడానికి రైతులు ముందుకు వచ్చారు. లక్ష్యం రెండు వేల ఎకరా లు ఉండగా కనీసం 50 శాతం లక్ష్యం చేకూరే అవకాశం కనిపించడం లేదు. రైతులు ఎన్ని ఎకరాల్లోనైనా పండ్ల తోటలను పెంచవచ్చు. ఎలాంటి పరిమిత విస్తీర్ణం లేకుండా వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో పండ్ల మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించారు. మొక్కలు నాట డం, వాటికి నీటిని అందించడానికి డ్రిప్ ఏర్పా టు, మొక్కలను పరిరక్షించడానికి అవసరమైన కూలీలను ఉపాధిహామీ పథకం నుంచి ఏర్పా టు చేస్తారు. ఇతరత్రా ప్రోత్సాహకాలను ఉద్యానవనాల కోసం అందించనున్నారు. రైతు తన కు ఉన్న భూమిని చూపిస్తే ఉద్యానవనాలను ఉపాధిహామీ పథకం ద్వారా అభివృద్ధి చేయ డం జరుగుతుంది. ఉద్యానవనాలను విస్తరించడానికి ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉపాధిహామీ పథకం ద్వారా పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం గురించి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిం చడం అధికారుల బాధ్యత. ఉద్యానవనాలకు ప్రభుత్వ ఇస్తున్న ప్రోత్సాహాకాలను రైతులకు తెలియచేసి విస్తారంగా పండ్ల తోటలను పెం చాల్సి ఉంది. మార్కెట్లో అన్ని రకాల పండ్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఉద్యానవనాలను పెంచిన రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. కాగా రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు శ్రద్ధ వహించకపోవడం వల్లే ఉద్యానవనాల పెంపు పట్ల ఎవరూ ఆసక్తిని చూపడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్యానవనాల ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా సాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరు తున్నారు.