![Photos Free In Few Parks In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/21/park.jpg.webp?itok=BtDiJ2pf)
హైదరాబాద్: పార్కుల్లో ఇక నుంచి ఫొటోలు ఉచితంగా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు నగరంలోని పలు పార్కుల్లో ఫొటోలు తీసుకోవాలంటే వెయ్యి రూపాయాలు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం నగరంలోని పలు పార్కుల్లో మినహాయింపు కల్పించారు. (ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్!)
లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కులో కెమెరాలను తీసుకెళ్లవచ్చు. అక్కడి దృశ్యాలను తమ కెమెరాలతో బంధించవచ్చు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు హుడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్ అర్వింద్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. (విమానంలో సీటుకింద కేజీకిపైగా బంగారం)
Comments
Please login to add a commentAdd a comment