నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్‌లోని లిస్బన్‌లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్‌గా రికార్డుల కెక్కింది.
రొటీన్ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్ డే ఉద్దేశం.
పిక్నిక్‌లు పలు రకాలు
చిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్‌లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.
ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్‌ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి.
ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.
పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్ సూపర్ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్‌కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్..
Comments
Please login to add a commentAdd a comment