Picnic
-
International Picnic Day : ఛలో పిక్నిక్...అటు విందు, ఇటు దిల్ పసందు
నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్‌లోని లిస్బన్లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్గా రికార్డుల కెక్కింది. రొటీన్ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్ డే ఉద్దేశం. పిక్నిక్లు పలు రకాలుచిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్‌లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్మెంట్ పార్క్‌లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి. ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్ సూపర్ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్.. -
విదేశాల్లో కూడా వనభోజన సంప్రదాయం.. ! ఐతే ఎలా ఉంటాయంటే..
ఇది కార్తీకమాసం. శివకేశవుల ఆరాధనకు విశిష్టమైన మాసం. కార్తీకమాసంలో దీపారాధన చేయడం, దాన ధర్మాలు చేయడం ఆచారంగా కొనసాగుతోంది. కార్తీకమాసం అంటే ఆలయ దర్శనాలు, పూజలు, వ్రతాలు మాత్రమే కాకుండా వనభోజనాలు కూడా గుర్తుకొస్తాయి. మన దేశంలో కార్తీక వనభోజనాలు సంప్రదాయ ప్రకారం కొనసాగుతున్నట్లే, వివిధ దేశాల్లో వనభోజనాలు చేసే సంప్రదాయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా కాస్త ముచ్చటించుకుందాం.. కార్తీకమాసంలో వనభోజనాలు చేయడం మనకు చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. శివకేశవులకు పవిత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, తర్పణాలు చేసేటప్పుడు జరిగిన లోపాల వల్ల సంభవించిన దోషాలను తొలగించుకోవడానికి తప్పనిసరిగా కార్తీకమాసంలో వనభోజనాలు చేసి తీరాలని ‘స్కాందపురాణం’ చెబుతోంది. ఈ పురాణం ప్రకారం కార్తీక వనభోజనాల కోసం ఎంపిక చేసుకునే వనంలో నానాజాతుల వృక్షాలు పుష్కలంగా ఉండాలి. వాటిలో ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పూజించి, పురోహితులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలను సమర్పించుకోవాలి. వనంలోనే వంటలు చేసుకుని, పురోహితులతోను, బంధుమిత్రులతోను కలసి భోజనాలు చేయాలి. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు నీడన సాలగ్రామాన్ని పూజించి, పురోహితులకు అన్నసంతర్పణ చేసి, వనభోజనాలు చేసి, కార్తీక మహాత్మ్యాన్ని విన్నవారికి సమస్త పాపాలు తొలగి, మరణానంతరం విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ‘కార్తీక పురాణం’ చెబుతోంది. చరిత్రలో వనభోజనాలు వన భోజనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కార్తీక వనభోజనాల ప్రస్తావన స్కాంద, కార్తీక పురాణల్లో ఉంది. వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. స్కాందపురాణం ప్రాచీన తాళపత్ర ప్రతి 1898లో దొరికింది. ఇది క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిదని పరిశోధకుల అంచనా. దీనిని బట్టి మన దేశంలో వనభోజనాల సంస్కృతి ఎనిమిదో శతాబ్దికి ముందు నుంచే ఉండేదని అర్థమవుతుంది. పలు ఇతర దేశాల్లో కూడా సంప్రదాయకమైన వనభోజనాల సంస్కృతి మధ్యయుగం నాటికే వ్యాప్తిలో ఉండేది. ఇంగ్లిష్‌లో వనభోజనాలకు ‘పిక్నిక్’ అనే పేరు ఉంది. ‘పెక్’ లేదా ‘పిక్’ అంటే ఏరడం, ‘నిక్’ అంటే స్వల్ప పరిమాణం అని అర్థం. ఇవి ఫ్రెంచ్ మాటలు. ‘పిక్’, ‘నిక్’ అనే ఈ రెండు మాటల కలయికతో ‘పిక్నిక్’ అనే మాట ఏర్పడింది. ఇంగ్లిష్‌లో ఈ మాట పదహారో శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో సంపన్నులు తీరిక వేళల్లో బంధుమిత్రులతో కలసి ఊళ్లకు దగ్గర్లో ఉండే వనాలకు వెళ్లి, రోజంతా అక్కడే విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత పద్దెనిమిదో శతాబ్ది నాటికి పిక్నిక్ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో బాగా వ్యాప్తి చెందింది. పాశ్చాత్య సాహిత్యంలో కూడా పిక్నిక్ల ప్రస్తావన కనిపిస్తుంది. ‘పిక్నిక్ భోజనం వంటి ఆహ్లాదకరమైన విషయాలు జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి’ అని ప్రసిద్ధ ఇంగ్లిష్ రచయిత సోమర్సెట్ మామ్ అన్న మాటలు ఆనాటి పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్ల ప్రశస్తిని తెలియజేస్తాయి. ఫ్రెంచ్ విప్లవకాలంలో ఫ్రాన్స్ నుంచి వచ్చి లండన్‌లో స్థిరపడిన సుమారు రెండువందల మంది సంపన్న ఫ్రెంచ్ యువకుల బృందం 1801లో లండన్‌లో ‘పిక్నిక్ సొసైటీ’ని నెలకొల్పింది. ‘పిక్నిక్ సొసైటీ’ నిర్వహించే వనభోజనాల్లో విందుతో పాటు వినోద కార్యక్రమాలు అట్టహాసంగా ఉండేవి. ఎలాంటి నటనానుభవం లేని అతిథులు సైతం ఈ పిక్నిక్ పార్టీల్లో నటీనటులుగా మారి నాటకాలు వేసేవారని ‘ది టైమ్స్’ దినపత్రిక అప్పట్లో ఒక కథనంలో పేర్కొంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఆధునిక వాహనాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా పిక్నిక్ సంస్కృతి మరింతగా విస్తరించింది. అయితే, పాశ్చాత్య ప్రపంచంలో పిక్నిక్లు వ్యాప్తిచెందడానికి శతాబ్దాల ముందు నుంచే చైనా, జపాన్ వంటి తూర్పు దేశాల్లో సంప్రదాయ వనభోజనాల సంస్కృతి ఉండేది. ప్రాక్ పాశ్చాత్య దేశాల్లో వనభోజనాల సంస్కృతీ సంప్రదాయాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్లీన్ మండే: గ్రీస్ క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘గ్రేట్ లెంట్’ తొలిరోజును ‘క్లీన్ మండే’ అంటారు. క్లీన్ మండే రోజున విందు వినోదాలతో గడుపుతారు. గ్రీస్‌లో క్లీన్ మండే రోజున ప్రజలు పార్కులు, తోటలు, చిట్టడవులు, సముద్ర తీరాల్లో గుమిగూడి పిక్నిక్లు జరుపుకొంటారు. పిక్నిక్ సందర్భంగా చిత్రవిచిత్రమైన రంగు రంగుల గాలిపటాలను ఎగురవేయడం గ్రీకు ప్రజల ఆనవాయితీ. పిక్నిక్ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, ఆల్చిప్పలు, ఆక్టోపస్, పీతలు, రొయ్యలతో చేసిన వంటకాలను ఆరగిస్తారు. మధ్యాహ్నం విందు తర్వాత పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తారు. బెర్రీ పికింగ్: ఐస్లాండ్ ఐస్లాండ్లో వేసవి మాత్రమే పిక్నిక్లకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన కాలాలన్నీ ఆరుబయట నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఐస్లాండ్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవికాలం ఉంటుంది. ఆగస్టు రెండోవారం నుంచి సెప్టెంబర్ రెండోవారం వరకు బెర్రీపండ్లు విరగకాస్తాయి. చెట్ల మీదనే బాగా పండినవి ఎక్కడికక్కడ రాలిపడతాయి. ఆరుబయటి వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. అందువల్ల ఐస్లాండ్ ప్రజలు బెర్రీలు విరగకాసే కాలంలో ‘బెర్రీ పికింగ్’ పేరుతో పిక్నిక్లు చేసుకుంటారు. పార్కులు, తోటలు, చిట్టడవుల్లో చేసుకునే ఈ పిక్నిక్‌లలో నేలరాలిన బెర్రీ పండ్లను ఏరుకోవడం పిల్లా పెద్దా అందరికీ ఒక కాలక్షేపం. బెర్రీ పికింగ్ పిక్నిక్ విందులో సంప్రదాయబద్ధంగా చేసే రొట్టెలు, మంటపై కాల్చిన గొర్రెమాంసం, కప్కేకుల్లాంటి సాఫ్ట్స్కోన్స్, సాల్మన్ చేపలు, చీజ్‌తో చేసిన వంటకాలను ఆరగిస్తారు. తిండి పోటీలు: అమెరికా అమెరికాలో నేషనల్ పిక్నిక్ డే ఏప్రిల్ 23న జరుపుకొంటారు. దేశంలో అప్పటి నుంచే పిక్నిక్ల హడావుడి మొదలవుతుంది. మే 27న జరుపుకొనే మెమోరియల్ డే మొదలుకొని నవంబర్ 11న జరుపుకొనే వెటరన్స్ డే వరకు అమెరికాలో పిక్నిక్ సీజన్‌గానే పరిగణిస్తారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4న ఎక్కువ మంది పిక్నిక్లు జరుపుకొంటారు. దాదాపు ఆరునెలల పాటు కొనసాగే పిక్నిక్ సీజన్లో బంధు మిత్రుల బృందాలు మాత్రమే కాకుండా, కార్పొరేట్ సంస్థలు కూడా ఉద్యోగుల కోసం పిక్నిక్ పార్టీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎక్కువగా పార్కులు, తోటలు, సముద్ర తీరాల్లో బార్బెక్యూ పిక్నిక్ పార్టీలు చేసుకుంటారు. పలు పిక్నిక్‌లలో తిండి పోటీలు నిర్వహిస్తుంటారు. భారీ పరిమాణంలో వంటకాలను తక్కువ సమయంలో భోంచేయడంలో జరిగే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉంటాయి. పిక్నిక్ డే: ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఆగస్టు మొదటి సోమవారాన్ని పిక్నిక్ డేగా పాటిస్తారు. వేర్వేరు చోట్ల నుంచి వచ్చి ఆస్ట్రేలియా గనుల్లో పనిచేసే గనికార్మికులు పంతొమ్మిదో శతాబ్దిలో ఇక్కడ పిక్నిక్ సంస్కృతిని ప్రారంభించారు. 1881లో బలారాట్ మైనర్స్ అసోసియేషన్ తొలిసారిగా అబ్బరీ బొటానికల్ పార్కులో వేలాదిమంది కార్మికులతో భారీ పిక్నిక్ నిర్వహించింది. ఆస్ట్రేలియాలో 1940ల నాటికి దేశవ్యాప్తంగా రైల్వేలైన్లు ఏర్పడటంతో ఆగస్టు మొదటి సోమవారాన్ని రైల్వే హెరిటేజ్ పిక్నిక్ డేగా పాటించడం ఆనవాయితీగా మారింది. ఆస్ట్రేలియన్లు పిక్నిక్‌లలో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యమిస్తారు. పిక్నిక్‌లలో నృత్య గానాలు, టగ్ ఆఫ్ వార్ వంటి వివిధ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. పిక్నిక్ టీ: న్యూజిలాండ్ న్యూజిలాండ్‌లో పిక్నిక్ సంస్కృతి పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ పాలకుల ద్వారా మొదలైంది. దక్షిణార్ధ గోళంలో ఉన్న న్యూజిలాండ్‌లో నవంబర్ నుంచి వసంత రుతువు మొదలవుతుంది. వసంతకాలంలో ఇక్కడ ఆరుబయట పిక్నిక్లు జరుపుకొంటారు. న్యూజిలాండ్ సంప్రదాయ పిక్నిక్‌లలో టీ పార్టీలు ప్రత్యేకం. పిక్నిక్ల కోసం జనాలు ఉదయాన్నే తోటలు, చిట్టడవులు, సముద్రతీరాలు వంటి ఆరుబయటి ప్రదేశాలకు చేరుకుంటారు. ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. మధ్యాహ్నం సంప్రదాయకమైన రొట్టెలు, కాల్చిన మాంసాహార వంటకాలతో విందు భోజనాలు ఆరగిస్తారు. పొద్దుగూకడానికి ముందు స్కోన్స్, బిస్కట్లు వంటి చిరుతిళ్లతో టీ పార్టీ చేసుకుంటారు. బాస్టీల్ డే రికార్డు నవ సహస్రాబ్దిలో వచ్చిన తొలి బాస్టీల్ డే సందర్భంగా 2000 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో అత్యంత భారీ పిక్నిక్ జరిగింది. ఈ పిక్నిక్ ఆరువందల మైళ్ల పొడవున డన్కిర్క్ నుంచి స్పెయిన్ సరిహద్దుల్లో ఉన్న ప్రాట్స్ డి మోలో వరకు 337 నగరాలు, పట్టణాల మీదుగా సాగింది. ఈ విందులో లక్షలాది మంది పాల్గొన్నారు. వెండితెర మీద పిక్నిక్ హాలీవుడ్ దర్శకుడు జోషువా లోగాన్ 1955 ‘పిక్నిక్’ సినిమాను తెరకెక్కించాడు. విలియమ్ హోల్డన్, కిమ్ నోవాక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆరు ఆస్కార్ నామినేషన్లు పొందింది. వాటిలో రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు పొందింది. ఫిల్మ్ ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో ‘పిక్నిక్’ సినిమా ఈ అవార్డులను దక్కించుకుంది. హనామీ: జపాన్ జపాన్‌లోని వనభోజనాలను ‘హనామీ’ అంటారు. మన కార్తీక వనభోజనాల వేడుకలను ఉసిరిచెట్లు ఉన్న వనాల్లో జరుపుకున్నట్లే జపాన్ ప్రజలు చెర్రీచెట్లు విస్తారంగా ఉన్న వనాల్లో వనభోజనాలు చేస్తారు. ఏటా చెర్రీ వృక్షాలు విరగబూసే కాలంలో గుంపులు గుంపులుగా చెర్రీ వనాలకు చేరుకుని, అక్కడ విందు వినోదాలతో ఘనంగా వనభోజనాలు చేస్తారు. జపాన్ దేశవ్యాప్తంగా మార్చి నుంచి మే వరకు చెర్రీపూత కాలం కొనసాగుతుంది. ఒకినావా దీవిలో మాత్రం జనవరిలోనే చెర్రీపూత మొదలవుతుంది. జపాన్ వాతావరణ శాఖ ప్రతి ఏడాది చెర్రీపూత కాలం తేదీలను వెల్లడిస్తుంది. చెర్రీవృక్షాలకు పూలు పూయడం మొదలైతే, వాటి పూత ఒకటి రెండు వారాల వరకు మాత్రమే ఉంటుంది. పూత ఉన్న సమయంలోనే జనాలు విందు వినోదాలతో వనభోజన వేడుకలను జరుపుకొంటారు. విందులో సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. జపాన్‌లో ఈ ‘హనామీ’ వనభోజనాల సంస్కృతి క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది ప్రారంభం నుంచి కొనసాగుతోంది. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో ‘హనామీ’ సంస్కృతి అమెరికా, కెనడా దేశాలకూ వ్యాపించింది. పిక్నిక్ డే: బ్రిటన్ బ్రిటన్‌లో ఏటా జూన్ 18న నేషనల్ పిక్నిక్ డేగాను, జూన్ 17 నుంచి 25 వరకు నేషనల్ పిక్నిక్ వీక్గాను పాటిస్తారు. జూన్ 18 ఇంటర్నేషనల్ పిక్నిక్ డే కూడా కావడం విశేషం. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా జనాలు ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకుంటారు. బ్రిటన్‌లో పద్దెనిమిదో శతాబ్ది నుంచి పిక్నిక్ సంస్కృతి ఉంది. పురాతన డిపార్ట్మెంట్ స్టోర్ ‘ఫోర్ట్నమ్ అండ్ మేసన్’ అప్పట్లో ప్రవేశపెట్టిన ‘స్కాచ్ ఎగ్’ను పిక్నిక్ విందుల్లో ప్రత్యేక వంటకంగా వడ్డించేవారు. సాసేజ్లో చుట్టిన గుడ్డును నిప్పుల మీద కాల్చి తయారు చేసే ఈ వంటకం సంపన్నుల పిక్నిక్ విందులో తప్పనిసరిగా ఉండేది. చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో నిప్పుల మీద కాల్చిన మాంసపు వంటకాలను ఆరగిస్తూ పిక్నిక్ విందులు జరుపుకోవడం బ్రిటిష్ సంస్కృతిలో భాగంగా మారింది. క్రిస్మస్ పిక్నిక్: అర్జెంటీనా అర్జెంటీనా ప్రజలు ఏటా క్రిస్మస్ సీజన్లో పిక్నిక్లు జరుపుకొంటారు. మంచు కురిసే ఈ కాలంలో ఆరుబయట వనభోజనాలు చేయడానికి అర్జెంటీనా ప్రజలు ఆసక్తి చూపుతారు. అర్జెంటీనాలో ఏటా డిసెంబర్ 8 నుంచి క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 8న ‘ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ డే’ జరుపుకొంటారు. ఆ రోజున మేరీమాత పాపవిమోచన పొందిందని కేథలిక్ల నమ్మకం. అర్జెంటీనాలో డిసెంబర్ 8న ప్రభుత్వ సెలవు దినం. దేశంలో పిక్నిక్ల సందడి కూడా అప్పటి నుంచే మొదలవుతుంది. కొందరు వనాల్లోను, తీరప్రాంతాల్లో ఉండేవారు సముద్ర తీరంలోను ఆరుబయట విందు వినోదాలతో పిక్నిక్లు చేసుకుంటారు. ఆరుబయట మంటలు వేసి, కోడి, టర్కీ, మేక, పంది వంటి వాటి మాంసాలను కాల్చుకుని, వాటితో విందు చేసుకుంటారు. హెరింగ్ లంచ్: ఫిన్లాండ్ ఫిన్లాండ్లో వసంత రుతువు కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మేడే నుంచి దేశంలో పిక్నిక్ల హడావుడి మొదలవుతుంది. నిజానికి మేడే పిక్నిక్ల కోసం జనాలు ఏప్రిల్ 30 నుంచే హడావుడి ప్రారంభిస్తారు. ఊళ్లకు వెలుపల ఉండే చిట్టడవులు, పార్కులు, సముద్ర తీరాల్లో ఎక్కువగా పిక్నిక్లు చేసుకుంటారు. అట్టహాసంగా విందు వినోదాలతో జరిగే పిక్నిక్‌లలో సంప్రదాయబద్ధంగా వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ‘హెరింగ్ లంచ్’ అంటారు. ఉప్పుచేపలు, ఊరవేసిన చేపలు, బంగాళ దుంపలు, ఆరుబయట నిప్పుల మీద కాల్చిన మాంసాహార పదార్థాలతో విందు భోజనాలు చేస్తారు. వెండిరంగులో మెరిసే చిన్నచేపలను ‘హెరింగ్’ అంటారు. సంప్రదాయక ఫిన్నిష్ పిక్నిక్ విందులో హెరింగ్ చేపలు తప్పనిసరి. పిక్నిక్ డే: ఫ్రాన్స్ ఫ్రాన్స్‌లో ఏటా జూలై 14న నేషనల్ పిక్నిడ్ డే జరుపుకొంటారు ఈ రోజు ‘బాస్టీల్ డే’ అని కూడా అంటారు. ఆ రోజున పిక్నిక్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రాన్స్‌లో ఏటా వేసవి పిక్నిక్లు జరుపుకోవడానికి అనుకూలమైన కాలం. అందువల్ల వేసవి పొడవునా ఫ్రెంచ్ ప్రజలు సెలవు రోజుల్లోను, తీరిక వేళల్లోను ఆరుబయట పిక్నిక్లు చేసుకుంటారు. ఫ్రెంచ్ విప్లవానికి ముందు పిక్నిక్ సంస్కృతి కేవలం సంపన్నులకే పరిమితమై ఉండేది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత సామాన్యులకు సైతం ఇది పాకింది. సంప్రదాయ ఫ్రెంచ్ పిక్నిక్ విందుల్లో సంప్రదాయ వంటకాలతో పాటు మద్యానికి కూడా అమిత ప్రాధాన్యం ఉంటుంది. వైన్, షాంపేన్, బ్రాందీ వంటి మదిరానంద పానీయాలు లేకుండా ఫ్రెంచ్ ప్రజలు పిక్నిక్లు జరుపుకోరు. పిక్నిక్ విందుల్లో ఎక్కువగా రకరకాల చీజ్‌తో చేసిన వంటకాలు, కాల్చిన మాంసాహార వంటకాలను ఆరగిస్తారు. నృత్యగానాలలో ఓలలాడతారు. (చదవండి: ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!) -
పిక్నిక్కు వెళ్లి మృత్యు ఒడిలోకి.. నదిలో మునిగి ఐదుగురు చిన్నారులు..
భోపాల్: మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా పిక్నిక్కు వెళ్లిన ఐదుగురు బాలురు కట్నీ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అందరీ వయసు 13-15 ఏళ్లే. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. గర్రా ఘాట్‌కు వెళ్లిన ఈ ఐదుగురు చిన్నారులు నదిలో స్నానం చేసేందుకు దిగే.. ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వాళ్ల కోసం వెతికారు. ఈ క్రమంలోనే పిల్లల దుస్తులు ఘాట్‌లో కన్పించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు. కానీ ఐదుగురు పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. అందరి మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం ఉదయం నది నుంచి బయటకు తీశారు. పసిప్రాయంలోనే ప్రపంచాన్ని వీడిన తమబిడ్డలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరిని చూసి స్థానికులు చలించిపోయారు. మరైవైపు.. మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. చదవండి: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు -
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
-
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో తెలుగు వాళ్లంతా కలిసి పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. సుమారుగా 200 ఫ్యామిలీస్ దీనిలో పాల్గొని ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బిర్యానీపాట్ రెస్టారెంట్లో భోజన సదుపాయాలు కల్పించారు. ఈ పిక్నిక్ విజయవంతం కావడానికి దీనికి సహకరించిన దాతలందరికి బిర్యానీపాట్ రెస్టురెంట్ ఓనర్ శ్రీధర్ కంచనకుంట్ల ధన్యవాదాలు తెలిపారు. -
స్నేహితులతో కలిసి పిక్నిక్.. అక్కడ ఏం జరిగిందో శవమై తేలాడు
సాక్షి,బొబ్బిలి(విజయనగరం): మండలంలోని భోజరాజపురం వేగావతి నది దగ్గరకు పిక్నిక్ వెళ్లిన ఓ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. పట్టణంలోని ఐటీఐ కాలనీకి చెందిన డి.సంతోష్‌కుమార్ (16) స్నేహితులతో కలిసి పిక్నిక్ కు వెళ్లి నదీతీరంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. కాగా సంతోష్‌కుమార్ తండ్రి మధుసూదనరావు, బంధువులు మాట్లాడుతూ ఫిట్స్ వల్ల సంతోష్‌కుమార్ మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు పాచిపెట: మండలంలోని చీపురువలస సమీపంలో ని పారమ్మకొండ వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలో ఒకే కుంటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు పారమ్మకొండకు అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా ఆటో బ్రేకులు ఫెయిలవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్ ఆటోను నియంత్రించే క్రమంలో ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు వెంటనే 108 సహాయంతో క్షతగాత్రులను సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రుల్లో నక్కాన అరుణ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ -
పిక్నిక్‌వెళ్లి తిరిగిరాని లోకాలకు..
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): సుభాష్‌నగర్‌కు చెందిన వెంకటనర్సయ్య, తిరుపమ్మల రెండో కుమారుడు తెల్లబోయిన కల్యాణ్ యాదవ్(24) పాలిట మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు అలుగు గుండం..మృత్యుగండంగా మారింది. మిత్రుడి జన్మదినం సందర్భంగా ఆదివారం తన బాల్య స్నేహితులు నలుగురితో కలిసి చెరువు వద్దకు పిక్నిక్కు వెళ్లాడు. అంతా సరదాగా కలియ తిరిగారు. మిగిలిన వారు అక్కడే వంట చేస్తుండగా కల్యాణ్ కొంత సమయం అలుగు వద్ద ఈత కొట్టాడు. మిగతా వారు తమకు ఈత రాదని..సమీపంలోనే వంట పనులో నిమగ్నమయ్యారు. భోజనం వండేశాక..వీరు పదే పదే కేకలు వేసినప్పటికీ రాలేదు. అలుగుకు ఎదురీదే క్రమంలో ఉధృతికి భీమునిగుండంలో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండడం, దరి దొరక్క అందులో మునిగిపోయాడు. పూర్తిస్థాయిలో ఈత రాకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సోమవారం అతడి మృతదేహం లభ్యమైంది. వద్దని ఎంత చెప్పినా వినకుండా స్నేహితుడు అరవింత్ పుట్టిన రోజు వేడుక చేసుకుంటామని వెళ్లాడని, ఇప్పుడు విగత జీవిగా వచ్చాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. స్నేహితులు, బంధువుల రోదనలతో సుభాష్‌నగర్‌లో విషాదం నెలకొంది. భీముని, రాముని గుండాలకు ఇల్లెందు ప్రాంతం నుంచి యువకులు ఎక్కువగా పార్టీలు, పిక్నిక్‌లకంటూ వెళుతూ..ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏడు బావుల జలపాతం వద్ద గత పదేళ్ల కాలంలో పదిమంది వరకు మృతి చెందారు. -
పిల్లలాడుకునే బొమ్మనుకుని ‘చావు’తో ఆడుకున్నారు..
వాషింగ్టన్: భార్యాభర్తలు పిల్లలతో కలిసి సరదాగా పిక్నిక్కు వెళ్లారు. అక్కడ నదిలో వారికి ఓ వింత వస్తువు కనిపించింది. చూడ్డానికి పిల్లలాడుకునే బొమ్మలా ఉన్న దాంతో కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఆ వస్తువును వారు నదిలో ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టారు. ఆ తర్వాత వస్తువు గురించి నిజం తెలిసి ఒక్కసారిగా గుండె జారినంత పనయ్యింది. ఎందుకంటే వారు పార్క్‌లో ఆడుకున్న వస్తువు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పేలని బాంబు. చదువుతుంటేనే గుండె జారి పోతుంది కదా.. ఆ వివరాలు.. అమెరికాకు చెందిన డేవిడ్, కరెన్ హబ్బర్ట్ తమ పిల్లలతో కలిసి నాటింగ్హామ్షైర్లోని నెవార్క్‌లోని థోర్స్బీ పార్క్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో డేవిడ్‌కు పక్కనే ఉన్న నదిలో ఓ వింత వస్తువు కనిపించింది. దాన్ని తెచ్చి భార్యకు చూపించాడు. ఈ ఇనుప వస్తువును చూస్తే.. ఏదో పేలుడు పదార్థంలాగా అనిపిస్తుంది అన్నాడు. కానీ డేవిడ్ భార్య అతడి మాటలు కొట్టి పారేసింది. దాన్ని కేవలం పిల్లలు ఆడుకునే వస్తువుగా తేల్చింది. దాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చాడో.. అక్కడే పెట్టమంది. భార్య మాట ప్రకారం డేవిడ్ దాన్ని నదిలో పెట్టేసి వచ్చాడు. ఆ తర్వాత వారు బాంబుకు పది మీటర్ల దూరంలో పిల్లలతో కలిసి చేపలు పట్టారు.. ఆడుకున్నారు.. తిరిగి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కరెన్ థోర్స్బీ పార్క్ ఫేస్బుక్ పేజ్‌లో తాము కనుగొన్న వస్తువు గురించి చూసి ఆశ్చర్యపోయింది. ఆ పోస్ట్ మొత్తం చదివి భయంతో కుప్పకూలింది. పార్క్ వారు తెలిపిన వివరాల ప్రకారం.. డేవిడ్ కనుగొన్న ఆ మెటల్ వస్తువు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబని.. దాని నుంచి దూరంగా ఉండాలని.. పట్టుకోవద్దని సూచించింది. పార్క్‌లో ఎక్కడైనా ఇలాంటి మెటల్ వస్తువులు కనిపిస్తే.. వెంటనే తమ పార్క్ సిబ్బందికి తెలపాలని.. వారు దాన్ని జాగ్రత్తగా డిఫ్యూజ్ చేస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా కరెన్ మాట్లాడుతూ.. ‘‘నిజం తెలిసిన తర్వాత దీని గురించి నా భర్తకు తెలపాలంటే భయపడ్డాను. నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు. నేను షాకయ్యాను’’ అన్నది. ఇక గతంలో ఈ పార్క్ రెండో ప్రపంచ యుద్ధ స్థావరంగా ఉండేదని తర్వాత తెలిసింది. చదవండి: రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు -
గజరాజుల పిక్నిక్: ఎక్కడికంటే?
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని ఆలయాలు, మఠాలకు చెందిన గజరాజులన్నీ పిక్నిక్కు వెళ్లాయి. వీటి కోసం భవానీనది తీరంలో పునరావాస కేంద్రం ఏర్పాటైంది. 26 ఏనుగులు ఆ నదీ తీరంలో 48 రోజుల పాటు సేద తీరనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గజరాజులు అంటే మక్కువ. ముఖ్య ఆలయాలకు వెళ్లినప్పుడు ఓ ఏనుగును విరాళంగా సమర్పించేవారు. వన్య ప్రాణులకూ మానసికోల్లాసం అవసరమని చెబుతుండేవారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా గజరాజుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించి, అక్కడ అవి సేద తీరే దిశగా చర్యలు తీసుకునేవారు. పునరావాసం.. జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే ప్రభుత్వం పునరావస శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈసారి ఏనుగులకు కరోనా పరీక్షలు చేయించి మరీ పిక్నిక్కు తీసుకెళ్లారు. తేక్కంపట్టి భవానీ నది తీరంలో ఏనుగులు ఉల్లాసంగా గడిపే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం వేకువజామున 4.30 గంటలకు పునరావాస కేంద్రంలో ప్రత్యేక యాగాది పూజలు జరిగాయి. అనంతరం వినాయకుడి ఆలయంలో జరిగిన పూజలతో గజరాజులు శిబిరంలోకి ప్రవేశించాయి. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు అటవీశాఖమంత్రి దిండుగల్ శ్రీనివాసన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో శిబిరం ప్రారంభమైంది. నెలన్నర పాటు ఏనుగులు ఇక్కడ సేదతీరనున్నాయి. చదవండి: భారీ బెలూన్‌తో నింగికి శాటిలైట్లు -
ఐస్లాండ్ ప్రమాదంలో భారతీయుల మృతి
లండన్: ఐస్లాండ్లో విహారయాత్రకు వెళ్లిన మహారాష్ట్రీయుల కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్‌లో ఉండే శ్రీరాజ్, సుప్రీం అనే సోదరులు తమ కుటుంబాలతో కలిసి ఐస్లాండ్లో ‘స్కీయోరార్సండర్’ పర్యాటక ప్రాంతానికి వాహనంలో బయలుదేరారు. గురువారం వేకువజామున నది వంతెన మీదుగా వెళ్తున్న ఆ వాహనం అదుపు తప్పి కిందకు పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఐస్లాండ్ పోలీసులు తెలిపారు. -
తెల్లముఖాలేశాం!
అవి ఇప్పటి వలే డిజిటల్ కెమెరాలు అందుబాటులో లేని రోజులు. మా ఫ్రెండ్ ఒకరి దగ్గర చిన్న కెమెరా ఒకటి ఉండేది. పిక్నిక్ మొదలు తీర్థయాత్రల వరకు రీల్లు కొనుక్కొని ఫోటోలు దిగేవాళ్లం. ఒకసారి ఫ్రెండు పెళ్లికి పూరీ(ఒడిషా)కి వెళ్లాం.పెళ్లి కార్యక్రమాలలో ఫోటోలతో పాటు జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో, సముద్రం దగ్గర ఫోటోలు దిగాలని కలలు కన్నాం.ఆ రోజు పూరీకి ప్రయాణం. హడావిడి పనులతో రీలు కొనడానికి సమయం చిక్కింది కాదు.ఒక పెద్దాయన మా బాధను చూసి...‘‘పూరీలో సవాలక్ష స్టూడియోలు ఉంటాయి. కావలసిన రీలు దొరకడం ఏమంత కష్టం కాదు’’ అనడంతో మా నిరాశ మాయమైంది. పూరీ చేరిన రోజు ఆదివారం కనుక దుకాణాలన్నీ మూసి ఉన్నాయి.‘అయ్యో!’ అనుకున్నాం.కూపీ తీస్తే ‘‘ఒక స్టూడియో ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ప్రయత్నించి చూడండి’’ అన్నాడు ఒక వ్యక్తి.రిక్షా మాట్లాడుకొని వెళ్లాం.అప్పటికీ చాలా సమయం వృథా అయింది.హడావిడిగా రిక్షా దిగి ఆ స్టూడియోలో రీలు కొని కెమెరాలో లోడు చేసి సముద్ర తీరం చేరుకున్నాం. వచ్చిపోయే కెరటాలతో రకరకాల ఫోజులలో ఫోటోలు దిగాం. ఆ తరువాత పెళ్లి ఫోటోలు తీయడం మొదలుపెట్టాం. అమ్మలక్కలైతే పనులు ఎగ్గొట్టి మరీ రకరకాల చీరల్లో ఫోటోలు దిగారు. మరునాడు రీలు ఇచ్చాం. సాయంత్రం వస్తే ఎన్ని కరెక్ట్‌గా వచ్చాయో చూసి చెబుతాను అన్నాడు ఫోటోగ్రాఫర్.సాయంత్రం స్టూడియోకు వెళ్లాం.ఫోటోలు ఎలా వచ్చాయో అనే ఆసక్తి మాలో అంతకంతకూ పెరుగుతోంది.ఫోటోగ్రాఫర్ రీలు విప్పి చూపించాడు.అంతా తెల్లగా కనబడింది.అది చూసి మేము తెల్లముఖాలేశాం.రీలు మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ అయిందట. హడావిడిలో ఇది మేము పట్టించుకోలేదు. ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని వెర్రి నవ్వొకటి నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం? – ఏ.గోవిందరాజులు ఖరగ్‌పూర్ -
ఆ స్నేహబంధాన్ని వాగు విడదీసింది..
ఆ నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా వారందరూ కలిసే వెళతారు. ఒకిరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహబంధం వారిది.. ఆ ఫ్రెండ్షిప్తోనే వారందరూ విహారయాత్రకు వెళ్లారు. సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యారు. అయితే విధి వక్రించింది. మారేడుమిల్లి మండలం పాములోరులో దిగిన వారిలో ఇద్దరు మృతి చెందారు.. చేతికి అందివస్తాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగాయి. కుమారులు కడుపుకోత మిగిల్చారంటూ వారి కన్నతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. గొల్లప్రోలు (పిఠాపురం), మారేడుమిల్లి (రంపచోడవరం): స్నేహితులతో కలిసి విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చి అక్కడ పాములేరువాగులోకి స్నానానికి దిగి గల్లంతైన గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన గ్రంధి బుచ్చిరాజు గుప్తా(21) మృతి చెందాడు. పాములేరు వాగు శివారు ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. అప్పటికే మృతి చెందిన నందికాళ్ల ఫణీంద్ర(21)తో పాటు బుచ్చిరాజుగుప్తా మృత దేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తులసీరామ్ తెలిపారు. కాగా ఫణీంద్ర, బుచ్చిరాజుగుప్తా కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయామని బుచ్చిరాజుగుప్తా తల్లిదండ్రులు రాంబాబు, సుజాత గుండెలవిసేలా రోధించిన తీరు పలువురిని కలచివేసింది. స్నేహితులతో విహారానికి వెళ్లి తిరిగిరాకుండా పోయావా! అంటూ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. మరో వైపు ఫణీంద్ర మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు వెంకన్న, వరలక్ష్మి మాటలేకుండా పడిపోయారు. వ్యాపారం చూసుకుంటూ ఉపాధి పొందుతున్నావను కుంటే ఇలా అర్ధాంతరంగా కడుపు కోత మిగులుస్తావా! అంటూ రోధించారు. పలువురు గ్రామస్తులు మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. నలుగురి స్నేహాన్ని చూడలేకపోయిన మృత్యుదేవత మృతులు ఫణీంద్ర, బుచ్చిరాజుగుప్తా, తేటకాయల నరేంద్ర, గాడిదల సుబ్రహ్మణ్యం చిన్ననాటి నుంచి విడదీయని స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా వారు నలుగురే వెళతారు. ఈ సందర్భంలోనైనా వారు ఒకరిని విడిచి ఒకరు ఉండరు.ఈ నేపథ్యంలో ఆ నలుగురు యువకులు మంగళవారం మారేడుమిల్లి మండలం జీఎంవలస పంచాయతీ పరిధిలోని పాములేరు గ్రామానికి విహారయాత్రకు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. విహారానికి వెళ్లిన వారిలో ఇద్దరిని మృత్యువు కాటేసింది. వారి స్నేహాన్ని మృత్యురూపంలో విడదీసిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
విహారంలో విషాదం
మారేడుమిల్లి/గొల్లప్రోలు: విహార యాత్రలో పెనువిషాదం చోటు చేసుకుంది. సరదాగా ప్రకృతి ఒడిలో సేదదీరుదామని వెళ్లిన యువకులను ప్రమాదం పలకరించింది. మారేడుమిల్లి మండలం జీఎం వలస సమీపంలోని పాములేరు వాగు వద్దకు విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యు వకులు స్నానానికి దిగి మంగళవారం సాయంత్రం గల్లంతయ్యారు. గొల్లప్రోలు మండలం చే బ్రోలు గ్రామానికి చెందిన నందిగాడ ఫణీంద్ర (21), యు.కొత్తపల్లి గ్రామానికి చెందిన గ్రంధి బుచ్చిరాజు గుప్తా(21) అనే ఇద్దరు పాములేరులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. అయితే ఫణీంద్ర మృతదేహం లభ్యం కాగా బుచ్చిరాజుగుప్తా ఆ చూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం రావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. వాగులో చిక్కుకొని.. గ్రామానికి చెందిన స్నేహితులు నందికాళ్ల ఫణీంద్ర(21), గ్రంధి బుచ్చిరాజు గుప్తా(21), గాడిదల సుబ్రహ్మణ్యం, తేటకాయల నరేంద్ర వేసవి విహారం కోసం మోటార్‌సైకిళ్లపై మారేడుమిల్లి వెళ్లారు. పాములేరు వాగులో స్నానానికి దిగిన ఫణీంద్ర , బుచ్చిరాజుగుప్తా వాగులో చిక్కుకున్నారు. దీంతో మిగిలిన ఇద్దరు çసుబ్రహ్మణ్యం, నరేంద్ర సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేశారు. మారేడుమిల్లి సీఐ రవికుమార్, ఎస్సై తులసీరావు సిబ్బందితో, గజఈతగాళ్లతో గాలింపు చర్యలకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే భారీ వర్షం కురవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. మృతులు గొల్లప్రోలు ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచీ స్నేహబంధం చిన్నప్పటి నుంచీ నలుగురు స్నేహితులు కలిసి మెలసి ఉంటున్నారు. చదువు అనంతరం ఎవరికి వారు స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకున్నారు. అయితే సరదాలకు, సంతోషాలకు నలుగురూ కలసి వెళ్తుంటారు. ప్రతిరోజు ఒకరిని ఒకరు కలుసుకుని మంచి, చెడు మాట్లాడుకుంటారు. వేసవి కావడంతో మారేడుమిల్లి వెళ్లి సరదాగా గడుపుదామని ఉదయం వెళ్లారు. ఇంతలో సాయంత్రానికి ఈ సంఘటనకు సంబంధించిన విషయం తెలియడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడని.. కాగా మృతి చెందిన ఫణీంద్ర అసలు గ్రామం కొత్తపల్లి మండలం మూలపేట. కాగా కొంతకాలంగా చేబ్రోలులో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు నందికాళ్ల వెంకన్న, వరలక్ష్మి ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడన్న వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. తల్లి వరలక్ష్మి గుండెలవిసేలా రోదించారు. గల్లంతైన గ్రంధి బుచ్చిరాజు గుప్తా ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క బిడ్డ ఏమయ్యాడో అని తల్లిదండ్రులు రాంబాబు, సుజాత ఆందోళన చెందారు. వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్న తన కుమారుడు ఎలా ఉన్నాడో అని ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి స్నేహితులు ఆందోళన చెందారు. -
విషాద యాత్ర
వారంతా చిన్నపాటి వ్యాపార లావాదేవీల్లో నిత్యం తలమునకలై ఉండేవారు. వేసవి సెలవులు రావడంతో సరదాగా విహారయాత్రకు కారులో బయలుదేరారు. కారు కాంచీపురం నుంచి కేరళ తేక్కడికి బయలుదేరింది. పెరంబలూరు నాలుగు రోడ్ల ప్రాంతంలో ఎదురుగా మరోకారు వచ్చి బలంగా ఢీకొంది. విహార యాత్రకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం చూపరులను కంటతడి పెట్టించింది. తమిళనాడు, కాంచీపురం: విహారయాత్రకు ఉల్లాసంగా కారులో బయలుదేరిన కుటుంబాన్ని గురువారం రాత్రి మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ సంఘటన పెరంబలూరులో చోటుచేసుకుంది. ఇందులో కాంచీపురానికి చెందిన ఒకే కుటుంబీకులు తొమ్మిదిమంది మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెరంబలూరు జిల్లా, పెరంబలూరు కల్యాణనగర్ ప్రాంతానికి చెందిన శక్తి శరవణన్ మాజీ సైనికుడు. ఇతను తిరుచ్చిలో తన స్నేహితుడి కారును తీసుకుని పెన్నాడంకు వ్యక్తిగత పనిపై గురువారం అర్ధరాత్రి బయలుదేరారు. ఈ కారు పెరంబలూరు నాలుగు రోడ్ల ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి వస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ మీడియన్‌ను స్వల్పంగా ఢీకొంది. తర్వాత కాంచీపురం నుంచి కేరళ తేక్కడికి విహారయాత్రకు వస్తున్న కారును ఢీకొంది. విహారయాత్రకు వస్తున్న కాంచీపురం కుటుంబీకుల కారు నుజ్జునుజ్జు అయ్యింది. వీరంతా కాంచీపురంలోని చిన్న కాంచీపురం తిరుమలై నగర్ పళనియప్పన్ వీధికి చెందిన వారు. వీరంతా శిథిలాల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పెరంబలూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని కారులోని మృత దేహాలను చాలాసేపు శ్రమించి వెలికితీశారు. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న కాంచీపురం వాసులు తొమ్మిది మందిమృతి చెందారు. వారి వివరాలు ఇలావున్నాయి. మోహన్ (39), భార్య లక్ష్మి (32), కుమార్తెలు పవిత్ర (13), నవిత (10), కుమారుడు వరదరాజన్ (05), మురళి (56), మేఘల (17), డ్రైవర్లు ప్రభాకరన్ (32), భూపతి (27) మృతి చెందారు. మృతి చెందిన మోహన్ ఎస్ఆర్ఎం సిల్క్స్ అండ్ గణేష్ శారీస్, ఎస్ఆర్ఎం ట్రావెల్స్ సంస్థలను నడుపుతున్నారు. మృతి చెందిన వారిలో మేఘల కాంచీపురంలో గల కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది మృతి చెందిన సంఘటన కాంచీపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పిక్నిక్కు వెళ్తుండగా...
కొల్హాపూర్: గణతంత్ర దినోత్సవాన సెలవు కావడంతో సరదాగా కుటుంబాలతో పిక్నిక్కు వెళ్తుంటే రోడ్డు ప్రమాదం రూపంలో ఆరుగురిని మృత్యువు కబళించింది. చెట్టుకు కారు ఢీకొన్న ఈ సంఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో శుక్రవారం జరిగింది. పూనె కేంద్రంగా నడుస్తున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలోని ఉద్యోగులు తమ కుటుంబీకులతో రత్నగిరి ప్రాంతానికి పిక్నిక్కు కారులో వెళ్తున్నారు. అయితే వీరి కారు అదుపుతప్పి తలవాడె గ్రామం వద్ద చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు కుటుంబీకులు సహా ఆరుగురు వ్యక్తులు మృతిచెందారని షాహువాడి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అనిల్ గడే తెలిపారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాక మృతిచెందారన్నారు. సంతోష్ రావత్(37), అతని భార్య స్నేహాల్(32), వారి ఆరేళ్ల కుమారుడు స్వనంద, ప్రశాంత్ పతంకర్(40), కారు యజమాని దీపక్ షెల్కండే(40), అతని కుమారుడు ప్రణవ్(3)లు మృతిచెందారు. సంతోష్, ప్రశాంత్, దీపక్‌లు యార్డి సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగులని సీఐ చెప్పారు. -
విహారయాత్రకు తీసుకెళ్లి అత్యాచారం
బనశంకరి: తనను విహారయాత్రకని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ యువతి తన ప్రియుడిపై ఆదివారం హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు..‘నాకు..నగరంలోని ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే దినేశ్‌తో పరిచయమై తర్వాత ప్రేమగా మారింది. త్వరలో వివాహం చేసుకుంటానని చెబుతూ వస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మురుడేశ్వర విహారయాత్రకు తీసుకెళ్లి కొబ్బరి బొండంలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకుంటానని పేర్కొనడంతో మిన్నకుండిపోయా. ఇటీవల మడికేరికి తీసుకెళ్లి మరోమారు అత్యాచారానికి పాల్పడి ఆదృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేశాడు. విషయం బయటిపెడితే అశ్లీల వీడియోను సామాజిక వెబ్సైట్లలో ఆప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు’ అని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది. -
విహారయాత్రలో విద్యార్థులకు మద్యం..
తుమకూరు: క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఉపాధ్యాయులు మద్యం మత్తులో తూగారు. విహారయాత్రకు వెంట తీసుకెళ్లిన విద్యార్థులకు మద్యం కలిపిన నీరు ఇచ్చి వారు అస్వస్థతకు గురయ్యేందుకు కారణమయ్యారు. ఈఘటన తుమకూరు జిల్లాలోని కొరటగెరె తాలూకా బొమ్మలదేవిపుర గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9,10వ తరగతి విద్యార్థులు 30 మందిని ధర్మస్థలం, హొరనాడు, దక్షిణ కన్నడ ప్రాంతాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచ్చిదానంద, ఉపాధ్యాయులు షేక్ ముజామిల్, రాథోడ్‌లు గత శుక్రవారం విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఉపాధ్యాయులు మద్యం సేవించారు. కొంత మద్యాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లతో కలిపి నిల్వ ఉంచారు. తమకు దాహంగా ఉందని అడగడంతో విద్యార్థులకు ఆ బాటిళ్లను అందించారు. వాటిని తాగిన విద్యార్థులు సోమవారం ఇంటికి చేరుకున్న తర్వాత వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వైద్యులకు చూపించగా మద్యం కలిసిన నీరు సేవించినట్లు తేలింది. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డారు. మధుగిరి డీడీపీఐ రవిశంకర్‌రెడ్డి పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. -
టాపర్ల.. షికార్లు!
నర్వ, మరికల్: ‘మంచి మార్కులు తెచ్చుకుంటే ముంబాయికి విహారయాత్రకు తీసుకెళ్తానని.. విమానంలో చక్కర్లు కొట్టిస్తానని.. నగరంలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నింటిని చూయిస్తానని పారిశ్రామికవేత్త నర్వ లక్ష్మికాంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాటిచ్చారు. చెప్పినట్టుగానే ఉత్తమ గ్రేడులు సాధించిన వారికి విమానంలో తీసుకెళ్లి.. నగరంలో విహారం చేయించారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం... నర్వ, మరికల్ మండలాలకు చెందిన టెన్త్ టాపర్లతోపాటు ఈ ఏడాది పదవ తరగతి చదివే విద్యార్థులకు స్ఫూర్తి యాత్ర నూతనోత్సాహం కలిగించింది. రెండు రోజులు కొనసాగిన ఈ యాత్రలో లక్ష్మీకాంత్‌రెడ్డి స్వయంగా శంషాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లారు. అక్కడి చారిత్రక, ప్రసిద్ధ స్థలాలను విద్యార్థులు వీక్షించారు. తాజ్హోటల్లో కాఫీలు, టిఫిన్లు.. జుహుబీచ్లో అరేబియా సముద్రపు అలల సోయగం.. గరంగరం మసాల దినుసుల ఆరగింపు.. ఆకాశాన్ని తాకే అంభానీ భవంతులు.. వింతలు.. విశేషాలు చూస్తూ విద్యార్థులు ఆనందంతో మునిగిపోయారు. అక్కడి జ్ఞాపకాలు వారి మాటల్లోనే విందాం.. మరిచిపోని అనుభూతి టెన్త్ పరీక్షల్లో టాపర్‌గా వచ్చినందుకు విమానంలో వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇందుకు లక్ష్మీకాంత్‌రెడ్డికి కృతజ్ఙతలు. ఇంకా బాగా చదివితే ఇలాంటి అవకాశాలు మెండుగా ఉంటాయని అనిపిస్తోంది. –శ్రావణి ఇంటర్ మీడియట్ మరికల్ గ్రామం విమాన ప్రయాణం బాగుంది టెన్త్‌లో మండల టాపర్‌గా వచ్చాను. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాను. సర్కారు బడుల్లో సత్తా చాటితే ఇలాంటి యాత్రలుంటాయని తెలిస్తే అందరు పోటీపడి చదువుతారు. – నర్మద, మరికల్ గ్రామం ముంబైలో మస్తుగ తిరిగినం ముంబై వీధుల్లో మస్తుగ తిరిగినం. అంబానీ భవంతి.. తాజ్‌హోటల్, ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద ఇళ్లు చూసినం. బీచ్‌లోని బాగా తిరిగినం. ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. – నందిని, నర్వ గ్రామం పిల్లలకు కొత్త ఉత్సాహం సర్కారు బడుల్లో చదివే పిల్లలు కారు ప్రయాణానికి కూడా నోచుకోరు. అలాంటిది లక్ష్మీకాంత్‌రెడ్డి సహకారంతో పేద విద్యార్థులు విమానంలో తిరిగారు. అందరు కష్టపడి చదివితే భవిష్యత్‌లో ఇలాంటి రోజులు నిత్యం వస్తాయి. – బాల్‌రాజు, ఎంఈఓ, నర్వ -
పిక్నిక్లో వివాదం... దారికాచి దాడి
బొబ్బిలి: పిక్నిక్లో చోటు చేసుకున్న చిన్న వివాదం చినికిచినికి గాలివానై చివరకు కొట్లాటకు దారి తీసింది. ఆదివారం సాయంత్రం రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వర్గానికి చెందిన తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. వెంటనే వీరిని స్థానిక సీహెచ్‌సీకి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పిన వివరాల ప్రకారం... పట్టణంలోని గొల్లవీధి, చిక్కాల రెల్లివీధులకు చెందిన వారు వేర్వేరుగా పిక్నిక్కు వెళ్లారు. బొబ్బిలి మండలం పెంట గ్రామం వద్ద వున్న వేగావతి నదిలో అందరూ సరదాగా స్నానానికి దిగారు. పిక్నిక్కు వచ్చిన వారిలో వర్గాల వారీ కాకుండా ఎవరికి తోచిన విధంగా వారు సరదాగా గడుపుతూ నదిలో కేరింతలు కొడుతున్నారు. ఈ సమయంలో చిక్కాల వీధికి చెందిన జె.శ్రీను అనే వ్యక్తి తన కుమార్తెకు స్నానం చేయిçస్తూ అదుపుతప్పి టీచర్స్ కాలనీ(గొల్లవీధి)కి చెందిన శ్రీను అనే వ్యక్తి మీద పడిపోయాడు. దీంతో క్షమాపణ కోరాడు. దీంతో గొడవ రేగి కులదూషణ చేస్తూ జె.శ్రీను అనే వ్యక్తిపై దాడికి దిగినట్టు చెప్పారు. అప్పటికి ఇరువర్గాలనూ అక్కడున్న వారు సముదాయించారు. అప్పటికి ఘర్షణ చల్లబడింది. అయితే సాయంత్రం ఇంటికి వస్తుండగా అప్పయ్యపేట రహదారి మధ్యలో గొల్లవీధికి చెందిన కొంత మందిని తీసుకువచ్చి జె.శ్రీను తదితరులపై దాడికి దిగారు. ఈ సమయంలో ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో పలువురు గాయపడ్డారు. చిన్నవారిని కూడా గాయపర్చారని చిక్కాల రెల్లివీధికి చెందిన వారు వాపోయారు. ఈ దాడిలో సోము యామిని, సోము రేణుక, శ్రీను, విష్ణు, ప్రశాంత్, రాజేష్, బంగారి శివ, దానాల కనకరాజు, గురుమూర్తి తదితరులు గాయపడ్డారు. వీరిలో రాజేష్ పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిహార్‌లో 9 మంది జల సమాధి
పట్నా: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల నీట మునిగి ఆదివారం 9 మంది మృతి చెందారు. రఘోపూర్ బ్లాక్‌లోని మస్తానా ఘాట్‌లో పూడిక మట్టితో ఏర్పడిన ఓ దిబ్బపై విహార యాత్రకు వచ్చిన వారు గుమిగూడినపుడు వైశాలి ఘటన జరిగింది. తొలుత ఓ చిన్నారి నదిలో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు మిగిలిన వారు కూడా నీటిలో దూకారు. ఈ క్రమంలో ఐదుగురు బాలికలు, ఒక మహిళ చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం నితీశ్ కుమార్ కార్యాలయం ప్రకటించింది. ఇక, సమస్తిపూర్ ఘటనలో మధురాపూర్ ధరమ్‌పూర్ ఘాట్ సమీపంలో 12 మందితో వెళ్తున్న పడవ భాగమతి నదిలో మునిగిపోవడంతో ముగ్గురు మహిళలు మృతిచెందారు. -
సరదాగా.. సతీ సమేతంగా..
సియోల్: అణుబాంబులు.. అమెరికా నాశనం.. యుద్ధం.. ఇవి తప్ప ఇంకో దాని గురించి ఆలోచించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నట్టుండీ విహారయాత్రకు వెళ్లారు. నిన్నటి దాకా అణు క్షిపణి పరీక్షలతో, అమెరికాపై యుద్ధానికి కాలుదువ్వుతూ బిజీగా ఉన్న కిమ్.. తన భార్య, సోదరితో కలసి దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఓ కాస్మొటిక్ ఫ్యాక్టరీని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమపై కిమ్ ప్రశంసలు కురిపించారని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ‘ఫ్యాక్టరీ నుంచి ప్రపంచస్థాయి ఉత్పత్తులు వస్తున్నాయి. మరింత అందంగా కనిపించాలనే మహిళల కలలను సాకారం చేసే ఉత్పత్తులు ఇక్కడ చేస్తున్నారు’ అని కిమ్ పొగిడినట్లు వెల్లడించింది. కిమ్ భార్య రి సోల్ జు, సోదరి కిమ్ యో జోంగ్తోపాటు అధికార పార్టీ నేతలు కూడా ఈ యాత్రలో ఉన్నారు. గతంలో ఉ.కొరియా అధినేతల భార్యలు, సోదరీమణులు సహా ఇతర మహిళలెవరూ బయటకు వచ్చేవారు కాదు. చాలా తక్కువగా ప్రజలకు కనిపించేవారు. అయితే 2011లో కిమ్ దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాత సంప్రదాయానికి స్వస్తి పలికారు. దీంతో భార్య, సోదరి ఆయనతో కలసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ గాయని కూడా అయిన కిమ్ భార్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇక యో జోంగ్.. పార్టీ పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యురాలు. 1948లో ఉ.కొరియా ఏర్పాటైనప్పటి నుంచి కిమ్ వంశస్థులే దేశాన్ని పాలిస్తున్నారు. -
విషాదం మిగిల్చిన విహారయాత్ర
ములుగు : సంతోషంగా విహార యాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకుంది. యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు కూతురును కోల్పోయారు. ఈ ఘటన గోవిందరావుపేట మండలం మచ్చాపురం పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. ములుగు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి కారులో శుక్రవారం లక్నవరానికి వెళ్లారు. కుక్కను తప్పించబోయి... విహారయాత్రను ముగించుకుని తిరిగివస్తున్న క్రమంలో గోవిదంరావుపేట మండలం మచ్చాపురం సమీపంలో ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనాన్ని ఒక్కసారిగా పక్కకు మళ్లించాడు. దీంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీ కొట్టింది. ప్రమాదసమయంలో కారు అద్దాల పక్కనే నిలబడిన చిన్నారి తేజస్వి(06) ఒక్కసారిగా కిందపడడంతో తలభాగంలో బలంగా గాయమైంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. వాహనంలో ఉన్న కుటుంబసభ్యులకు గాయాలు కావడంతో 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ తల్లి కమలమ్మను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, చిన్నారి మృతదేహాన్ని ఎస్సైలు దగ్గు మల్లేశ్‌యాదవ్, ఓదెల మల్లేశ్, సూర్యనారాయణలు పరి«శీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. -
లండన్‌లో బస్సు ప్రమాదం
♦ ముగ్గురు దుర్మరణం ♦ లండన్‌లో కంచి వ్యక్తులు మృతి ♦ మృతదేహాల రాకలో జాప్యం లండన్‌లో శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో కాంచీపురం పిల్లైయార్ పాళయం మండపం వీధికి చెందిన పన్నీర్ సెల్వం (63), అతని చెల్లెలు తమిళమణి, ఆమె భర్త అరుళ్ సెల్వం సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ సంఘటనతో కాంచీపురం పిల్లయార్ పాళయంలో విషాదం నెలకొంది. కేకే.నగర్: విహారయాత్ర నిమిత్తం లండన్‌కు వెళ్లిన ముగ్గురు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరుసగా రెండు రోజుల సెలవుల కారణంగా మృతదేహాలను తెప్పించడంతో తీవ్ర జాప్యం నెలకొనడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లండన్ బకింగ్‌హామ్ షయర్ ప్రాంతంలో శని వారం ఉదయం మినీ బస్సును రెండు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న కాంచీపురం పిల్లైయార్ పాళయం మండపం వీధికి చెందిన పన్నీర్ సెల్వం(63), అతని చెల్లెలు తమిళమణి, ఆమె భర్త అరుళ్ సెల్వం, కుంభకోణానికి చెందిన నలుగురు, కేరళకు చెందిన సిరియాక్ జోసఫ్ సహా ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పన్నీర్ సెల్వం కుమారుడు మనో రంజితం లండన్‌లో గల ప్రైవేటు ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. అతని ఇంటికి పన్నీర్ సెల్వం కుటుంబంతో సహా వెళ్లాడు. విహారయాత్రకు వెళ్లినపుడు ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పన్నీర్ సెల్వం భార్య వళ్లి, కుమారుడు మనోరంజితం, అతని భార్య సంగీత తీవ్ర గాయాలతో లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను కాంచీపురానికి తీసుకురావడానికి శని, ఆది వారాలు దౌత్య కార్యాలయానికి సెలవు కావడంతో ఆలస్యం అవుతోంది. మృతుల బంధువులు సోమవారం ఉదయం కాంచీపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి మృతదేహాలను తీసుకురావడంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
‘విషాద’యాత్ర
► కుంటాల జలపాతంలో అర్గుల్ వాసుల గల్లంతు ► గ్రామంలో విషాద ఛాయలు జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌రూరల్): విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకొనే క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కుంటాల జలపాతంలో పడి గల్లంతయ్యారు. జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన అన్సారి, ఫైజాన్ (21) రాజు, సాయిరాం, నరేశ్ స్నేహితులు. అన్సారీ బైక్ మెకానిక్‌గా పని చేస్తుండగా, ఫైజాన్ ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నాడు. ఐదుగురు మిత్రులు కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని అతి ఎత్తయిన కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఆదివారం కారులో బయల్దేరారు. జలపాతం వద్ద సెల్ఫీలు తీసుకొనే క్రమంలో అన్సారీ, ఫైజాన్ నీటిలోకి దిగారు. ఈ క్రమంలో జారిపడి గల్లంతయ్యారు. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. అర్గుల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్గుల్ నర్సయ్య ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఫోన్లో మాట్లాడి, వివరాలు తెలిపారు. గల్లంతైన యువకుల ఆచూకీ కనిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, అర్గుల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పాపికొండల్లో పర్యాటకులకు చుక్కలు
- రద్దీ పెరగడంతో బోట్లు లేవన్న నిర్వాహకులు - భద్రాచలంలో టికెట్లు కొన్నా.. 500 మంది వెనక్కే భద్రాచలం: పాపికొండల యాత్రకు వెళ్లిన పర్యాటకులకు ఆదివారం అక్కడి నిర్వాహకులు చుక్కలు చూపించారు. పరిమితికి మించి పర్యాటకులు రావటంతో అందుబాటులో బోట్లు లేవని నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో భద్రాచలం నుంచి టికెట్లు కొనుగోలు చేసి వెళ్లిన సుమారు 500 మంది పాపికొండల షికారుకు వెళ్లకుండానే వెనుదిరిగారు. వరుసగా సెలవులు రావటంతో పాపికొండల విహార యాత్రకు ఆదివారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. వీరంతా భద్రాచలంలోని ఏజెంట్ల వద్ద టికెట్లను కొనుగోలు చేసి, కొంతమంది తమ సొంతవాహనాల్లో, మరికొంతమంది అద్దె వాహనాల్లో వీఆర్ పురం మండలంలోని పోచవరం రేవుకు చేరుకున్నారు. పాపికొండల యాత్రలో బోట్లు, లాంచీలు కలుపుకొని మొత్తం 26 ఉన్నాయి. వీటిలో సుమారు 2 వేల మందిని బోటు షికారుకు తీసుకెళ్తారు. అయితే ఆదివారం సుమారు 2700 మంది పర్యాటకులు వచ్చినట్లు టికెట్ల విక్రయాల ద్వారా లెక్క తేలింది. లాంచీల్లో కొంతమందిని సర్ధుబాటు చేసి, నిర్వాహకులు పంపించినప్పటికీ, అందరినీ పంపిస్తే పాపికొండల వద్ద మధ్యాహ్న భోజనాలకు ఇబ్బందులు ఏర్పడతాయని, సుమారు 500 మందిని వెనక్కి పంపించారు. దీంతో పర్యాటకులు లాంచీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. -
విహారయాత్రలో విషాదం
♦ జలాశయంలో ఈతకు దిగి కప్పరాడ వాసి గల్లంతు ♦ జాడ లేని శివరామకృష్ణ ♦ కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు వారంతా కుటుంబ సభ్యులతో సరదాగా విహారానికి బయలుదేరారు. మార్గమధ్యలో సెల్ఫీలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా ప్రయాణం సాగించారు. ఇంతలోనే కళ్యాణపు లోవ వచ్చింది. ఎంతో ఉత్సాహంతో రిజర్వాయర్, చుట్టుపక్కల ప్రాంతాలు చూసి ముగ్ధులయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్‌లోకి దిగారు. అంతే వీరిలో ఓ వ్యక్తి గల్లంతు కావడంతో విషాదం అలుముకుంది. రావికమతం (చోడవరం): కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన బృందంలో ఓ వ్యక్తి కళ్యాణపులోవ జలాశయంలో గల్లంతు కావడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంచరపాలెంలోని కప్పరాడ ప్రాంతానికి చెందిన బిక్కవోలు శివరామకృష్ణ (26) జలాశయంలో గల్లంతయ్యాడు. శివరామకృష్ణ ఆయన సోదరి బంధువులు అడ్డురోడ్డు నుంచి కొరిబిల్లి రాజు, కాండ్రేగుల దొరబాబు, పలివెల అభిజ్ఞ, వరలక్ష్మి, రామలక్ష్మిలతో కలిసి రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్‌కు ఆదివారం విహార యాత్రకు బయలుదేరారు. వారం రోజులు క్రితం జోగుంపేటలోని అమ్మగారింటికి వెళ్లిన భార్య పార్వతిని రమ్మని శివరామకృష్ణ చెప్పాడు. మూడు ప్రాంతాల నుంచి వేర్వేరుగా వచ్చిన వీరు నర్సీపట్నంలో కలుసుకుని అక్కడ నుంచి కళ్యాణపులోవ రిజర్వాయర్ ప్రాంతానికి ఆటోలో పయనమయ్యారు. జలాశయం వద్ద పోతురాజుబాబు ఆలయాన్ని, రిజర్వాయర్ పరిసరాలను సందర్శించారు. అనంతరం శివరామకృష్ణ జలాశయంలో ఈతకని దిగాడు. అతనితో వచ్చిన వారు జలాశయంలో లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలోనే శివరామకృష్ణ జలాశయం క్లస్టర్ గేట్లు వద్ద గల ప్రాంతంలో ఉన్న నీటిలో స్నానం చేస్తానని భార్యకు, వెంట వచ్చిన వారికి చెప్పి అక్కడికి వెళ్లాడు. క్లస్టర్ గేట్లు వద్ద స్నానం చేయడం ప్రమాదమని, లోతు, నీటి మట్టం అధికంగా ఉంటుందని భార్య పార్వతి భర్తకు వివరించింది. అయితే తనకు ఈత వచ్చని, ఏమి కాదని చెప్పి క్లస్టర్ గేట్లుపై నుంచి నీటిలోకి దూకాడు. మొదటిసారి బయటకు వచ్చిన శివరామకృష్ణ రెండోసారి కుడా గేట్లపై నుంచి నీటిలోకి దూకాడు. అంతతోనే నీటిలో మునిగిపోతుండడంతో తన భర్తను రక్షించాలని భార్య పార్వతి, బంధువులు కేకలు వేశారు. దీంతో స్థానికులు వచ్చేలోగానే శివరామకృష్ణ నీటిలో మునిగిపోయాడు. వారు ఎంతగా జలాశయంలో వెదికినా శివరామకృష్ణ జాడ లభించలేదు. దీంతో భార్య పార్వతి, బంధువుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శివరామకృష్ణ 2013లో జోగుంపేటకు చెందిన పార్వతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల బాబు చందు ఉన్నాడు. గల్లంతైన సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వంజరి గంగరాజు, వీఆర్వో ఎ.ఎస్.నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కొత్తకోట పోలీసులకు తెలిపారు -
పిక్నిక్ ఆనందానికి చిల్లర కష్టాలు
-
విహారయాత్ర.. ఇలా జాలీగా
ఆఫీసులో సెలవుల లిస్టు రాగానే ముందుగా... వీక్లీ ఆఫ్ కూడా కలిసొచ్చేలా సుదీర్ఘ వారాంతపు సెలవలేమైనా ఉన్నాయేమోనని మనలో చాలా మంది చకచకా లెక్కలు కడుతుంటాం. ఒకవేళ ఒకరోజో, రెండు రోజులో మధ్యలో గ్యాప్ గానీ వస్తే వీలైతే లీవ్ పెట్టుకునైనా విహారయాత్రకు వెళ్లే వీలుంటుందేమో చూసుకుంటాం. ఏడాది పొడవునా ఉండే ఆఫీసు బాదర బందీ నుంచి దూరంగా కొంత సేపైనా గడిపితే బాగుంటుందనుకుంటాం. ఇదంతా బాగానే ఉంటుంది. కానీ నిజంగానే విహారయాత్రకు బయలుదేరాలంటే... ఎదురయ్యే ఖర్చులు కళ్లముందు కదులుతాయి. రైలు, బస్సు టికెట్ మొదలుకుని హోటల్లో గదుల అద్దె, తిండీ తిప్పలు, ప్రయాణ ఖర్చులూ అన్నీ గుర్తొస్తాయి. మూణ్నాలుగు రోజుల భాగ్యానికి అప్పు చేసి మరీ ఏడాది పొడవునా కట్టుకుంటూ కూర్చోవడం అవసరమా అనిపిస్తుంది. ప్రయాణం అటకెక్కుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే.. ఇలా వెకేషన్‌ను అటకెక్కించకుండా నిశ్చింతగా తిరిగి రావొచ్చు. అదెలాగో చూద్దాం. * వెకేషన్కూ ప్రతి నెలా కొంత కేటాయింపు * ముందస్తు ప్రణాళికతో ఖర్చుల అదుపు * రాయితీల మీద దృష్టి అవసరం నిజానికి విహారయాత్రనేది వృథా ఖర్చు కాదు. ఇది ఒకరకంగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన పెట్టుబడి. అందుకే నెలవారీగా మిగతా ఖర్చులు, పెట్టుబడులకు జీతంలో నుంచి కేటాయింపులు జరిపినట్లే.. దీనికి కూడా కొంత కేటాయించాలి. వెకేషన్ కోసం మీ వార్షికాదాయంలో కనీసం 5 శాతం కేటాయించొచ్చు. వెసులుబాటును బట్టి 7 శాతం దాకా పక్కన పెట్టొచ్చు. అంతకు మించి మరీ 10 శాతం దాకా పెడితే.. మీ పెట్టుబడి ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. బసకి హోమ్‌స్టే లేదా ఎయిర్‌బీఎన్‌బీ.. సుదీర్ఘమైన సెలవులు గడిపేందుకు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్స్ కోసం వెతుక్కుంటూ కూర్చోకుండా... స్వల్ప చార్జీలకు ఆతిథ్యమిచ్చే హోమ్‌స్టే అవకాశాలు కూడా పరిశీలించవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీఅండ్‌బీ) తరహా ఆతిథ్యమిచ్చే వారు ఉంటారు. వారాంతపు సెలవులో సైట్ సీయింగ్ లేదా ట్రెక్కింగ్ చేయదల్చుకుంటే.. ఇలాంటి హోమ్‌స్టే చౌకగాను, అనువుగాను ఉంటుంది. ఒకవేళ మీకేదైనా క్లబ్లో సభ్యత్వం ఉంటే.. మీరు వెళ్లే ప్రాంతాల్లో దానికి శాఖలు గానీ అనుబంధ ప్రాపర్టీలు గానీ ఉన్నాయేమో ఒకసారి పరిశీలిస్తే ఉపయోగ కరంగా ఉంటుంది. చాలా తక్కువ రేట్లకే స్టార్ హోటల్ సదుపాయాలు ఇలాంటి ప్రాపర్టీల్లో పొందవచ్చు. టైమ్ షేర్ లాంటివి కూడా ఉన్నప్పటికీ ముందుగా తెలియని ఖర్చులు, చార్జీలు, అవసరమైనప్పుడు గదులు దొరక్కపోవడం మొదలైన అంశాల కారణంగా వీటితో సంతృప్తి చెందిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇక పర్యాటకులకు గదులు అద్దెకిచ్చే వారి కోసం ఎయిర్‌బీఎన్‌బీ లాంటి వెబ్సైట్లలోనూ వెతుక్కోవచ్చు. రేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఇక ఒక్కొక్క సందర్భంలో హాలిడే రాయితీలు లభించే అవకాశాలూ ఉంటాయన్న విషయం గమనంలో ఉంచుకోవాలి. కొంత రాజీ పడటంలో తప్పు లేదు.. వెళ్లాలనుకున్న ప్రాంతం, టైమింగ్ లాంటి విషయాల్లో అవసరమైతే కొంత రాజీపడేందుకు వెనకాడనక్కర్లేదు. ఒకోసారి ఇలాంటి వాటి వల్ల ఊహించని కొంగొత్త అనుభవాలు ఎదురుకావొచ్చు. సెలవులు పేరుకుపోయిన పక్షంలో వీలైతే పనిదినాల్లో లీవ్ తీసుకుని హాలిడే వెకేషన్ గడిపేందుకు వెళ్లండి. పీక్ సీజన్ కానప్పుడు హోటళ్ళ టారిఫ్‌లు 50-75 శాతం దాకా తక్కువగా ఉంటాయి. రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి సర్వీసూ మెరుగ్గా ఉంటుంది. ఉదాహరణకు.. గోవా వెళ్లేందుకు నవంబర్ నుంచి మార్చి దాకా రద్దీ సీజన్‌గా ఉంటుంది. మన స్కూళ్లలో ఏప్రిల్, మే నెలల్లోనూ, అక్టోబర్‌లోను సెలవులుంటాయి. టూరిస్ట్ సీజన్‌తో పోలిస్తే ఆఫ్ సీజన్లో గోవాలో టారిఫ్‌లు పాతిక శాతం తక్కువగా ఉంటాయి. మళ్లీ డిసెంబర్ 20 నుంచి జనవరి 10 మధ్యలో రేట్లు ఒక్కసారిగా రెట్టింపయిపోతాయి. బీచ్ పక్కనే ఉండే 5 స్టార్ హోటల్, కాస్త కిలోమీటరు లోపల ఉండే 4 స్టార్ హోటల్లోనూ రేట్ల వ్యత్యాసం ఒకోసారి దాదాపు 50 శాతం దాకా కూడా ఉంటాయి. సీజన్లోనూ, ఆఫ్ సీజన్లోను దక్షిణ గోవాలోని రెండు హోటళ్లలో ఉన్న రేట్లను ఒకసారి పరిశీలించి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. (కింద బాక్స్ గమనించగలరు). చూశారు కదా.. ఇలా వెకేషన్కోసం ప్రతి నెలా కొంత కేటాయించి.. ప్రయాణం మొదలుకుని బస దాకా అన్ని విషయాల్లో కాస్తంత ముందస్తు ప్రణాళిక వేసుకుంటే సుదీర్ఘ వారాంతపు సెలవుల్లో విహారయాత్రలను జాలీగా గడిపేయవచ్చు. ప్రయాణానికి ముందస్తు ప్రణాళిక.. కాస్త ముందునుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే.. ప్రయాణం, బస మొదలైన ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. నా ఉదాహరణే తీసుకుంటే.. కొన్నాళ్ల క్రితం ముంబై నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కి ఫ్లయిట్ టికెట్స్‌ను కేవలం రూ. 700.35కే (వన్ వే-పన్నులు అదనం) కొన్నాను. ఇది నా మిత్రులు చాలా మంది ఇప్పటికీ నమ్మరు. కానీ ఇది నిజం. నా దగ్గర ఇంకా ఆ టికెట్స్ ఉన్నాయి. అప్పట్లో పీక్ వెకేషన్ సీజన్‌కి దాదాపు ఆరు నెలల ముందు కంపెనీ ప్రకటించిన ప్రోమో ఫేర్ ఆఫర్లో నేనా టికెట్లు కొన్నాను. కాబట్టి కాస్త ఓపికగా వెతుక్కోగలిగి, కాస్త ముందుగా కొనుక్కోగలిగితే ఇలాంటి మంచి మంచి డీల్స్ చాలానే దొరకవచ్చు. విమాన ప్రయాణాలే కాదు... రైలు, బస్సు టికెట్లు, హోటల్ ప్యాకేజీలకు కూడా ఇది వర్తిస్తుంది. -
ఇద్దరు టెక్కీల జల సమాధి
తుమకూరు(కర్ణాటక): విహారానికి వచ్చిన ఐదుగురు టెక్కీల్లో ఇద్దరు జల సమాధి అయ్యారు. ఈ ఘటన తుమకూరు నగర సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన కార్తీక్ (28), వరుణ( 26)తోపాటు మరో ముగ్గురు టెక్కీలు కోరమంగళలో ఉన్న హెచ్‌పీ కంపెనీలో పని చేస్తున్నారు. వీక్ఎండ్ కావడంతో ఆదివారం దేవరాయణదుర్గకు వచ్చారు. అక్కడ మద్యం తాగి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. కార్తిక్ నీటిలో మునిగి పోతుండగ కాపాడటానికి వెళ్లిన వరుణ కూడా గల్లంతయ్యాడు. మిగతా ముగ్గురు అప్రమత్తమై క్యాత్సంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం ఎగ్జామినేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
విహారయాత్రలో విషాదం
- రాయిచూర్ సమీపంలో కారు బోల్తా - పెద్దమంగళారం యువకుడి దుర్మరణం - మరో ముగ్గురికి తీవ్రగాయాలు మొయినాబాద్ (రంగారెడ్డి) : నలుగురు స్నేహితులు కలిసి వెళ్లిన విహార యాత్ర విషాదాంతమైంది. కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడటంతో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని పెద్దమంగళారానికి చెందిన పాటి సత్యనారాయణరెడ్డి(23), శ్రీరాంనగర్ నివాసి జంగం సన్నీ, చేవెళ్ల మండలం పలుగుట్ట గ్రామస్తులు శ్రీరాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు స్నేహితులు. వీరంతా కలిసి ఆదివారం మధ్యాహ్నం మారుతీ జెన్ కారులో విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ సమీపంలో వీరి కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కడీలను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పెద్దమంగళారం గ్రామానికి చెందిన పాటి సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో సన్నీ పరిస్థితి విషమంగా ఉంది. సత్యనారాయణ రెడ్డి మృతితో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సత్యనారాయణరెడ్డి మొయినాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
మీకు తెలుసా?
రష్యాకు చెందిన ఓ కుటుంబం విహార యాత్రకని అడవికి వెళ్లారు. అక్కడ వారి మూడేళ్ల పాప తప్పిపోయింది. పదకొండు రోజుల పాటు వెతికాక ఓ చోట కనిపించింది. అన్ని రోజులూ ఆ పాప ఓ గుంటలోని నీళ్లు తాగుతూ, రాలి పడిన బెర్రీస్ తింటూ గడిపిందట! జపాన్‌లోని టోక్యోలో హవారో అనే బేకరీ ఉంది. అక్కడి ఫుడ్‌కి ఉన్న గిరాకీ టోక్యోలోని మరే బేకరీ ఫుడ్‌కీ ఉండదు. కారణం... ఈ బేకరీ ప్రతి తినుబండారాన్నీ అందమైన పూలతో అలంకరిస్తుంది. అయితే ఆ పూలు కూడా తినేవే కావడం, వాటి రుచి అద్భుతంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారట! అలాస్కన్ ఉడ్ ఫ్రాగ్ జాతికి చెందిన కప్ప... చలికాలంలో పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. దాని ఊపిరి ఆగిపోతుంది. గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. అయితే వేసవి వేడిమి తగలగానే మళ్లీ మామూలుగా అయిపోయి, చక్కగా జీవిస్తుందట! అమెరికాలో ‘హెల్స్ కిచెన్ షో’ పేరుతో వంటల పోటీలు నిర్వహిస్తుందో చానెల్. హోరాహోరీగా జరిగే ఆ పోటీలో ఎలిమినేట్ అయ్యే ప్రతి ఒక్కరికీ మానసిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పోటీదారులు డిప్రెస్ అయ్యి, తమను తాము ఏమీ చేసుకోకుండా ఉండేందుకే ఆ ఏర్పాటట! యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదివిన విద్యార్థుల్లో ఇప్పటికి ఇరవై అయిదు మంది బిలియనీర్లు అయ్యారట. ప్రపంచంలోని మరే యూనివర్శిటీకీ ఈ ఘనత దక్కలేదు! -
విహారంలో విషాదం
♦ 14 మంది విద్యార్థుల జల సమాధి ♦ వీరిలో 10 మంది విద్యార్థినులు మహారాష్ట్రలోని మురూడ్-జంజీరా బీచ్‌లో ఘటన సాక్షి, ముంబై: ఆడుతూ పాడుతూ సాగాల్సిన విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మురూద్-జంజీరా తీరంలో సోమవారం 14 మంది కాలేజీ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతిచెందారు. మరొ విద్యార్థి సైఫ్ అహ్మద్ ఆచూకీ ఇంకా తెలియలేదు. మృతుల్లో 10 మంది విద్యార్థినులు ఉన్నారు. ఐదుగురు విద్యార్థినులకు కాపాడి, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. పుణేలోని ఇనాందార్ కాలేజీలో బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 116 మంది విద్యార్థులు మురూడ్-జంజీరాకు మూడు బస్సుల్లో వచ్చారు. వీరిలో కొందరు.. ఉపాధ్యాయులకు తెలియకుండా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈత కోసం సముద్రంలోకి దిగారు. అదే సమయంలో భారీ అలలు రావడంతో నీట మునిగి కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులూ మునిగిపోయారు. వీరి కేకలను విని జాలర్లు, స్థానికులు అక్కడికి పరుగున వెళ్లారు. ఐదుగురిని రక్షించి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. గల్లంతైనవారి కోసం గాలించి, 14 మృతదేహాలను బయటికి తీశారు. కోస్ట్‌గార్డ్, నేవీ హెలికాప్టర్లు, పడవలతో రాత్రి ఎనిమిది గంటల వరకు గాలింపు జరిపారు. మృతులను శిఫా కాజీ, సుమయా అన్సారీ, యూసుఫ్ అన్సారీ, సుప్రియా పాల్, ఫర్హిన్ సయ్యద్, ఇఫ్తిఖార్ శేఖ్, సాజిద్ చౌదరీ, రాజ్ తన్జినీ, స్వప్నాలి సంగత్, సమ్రిన్ శేఖ్, షఫియా అన్సారీ, రఫియా, సానా మునీర్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతివార్తతో ఇనాందార్ కాలేజీ క్యాంపస్ శోకసంద్రంలో మునిగిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విమానయానానికి జై
రెక్కలు విచ్చుకుంటున్న మధ్యతరగతి ♦ దేశ, విదేశీ ప్రయాణాలకు మొగ్గు ♦ ఆకట్టుకునే ఆఫర్లతో ఊరిస్తున్న విమాన సంస్థలు ♦ గణనీయంగా పెరుగుతున్న ఫ్లైట్ జర్నీలు.. ♦ ఆర్నెల్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 20 శాతం పెరుగుదల ♦ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్ విమానాశ్రయం ♦ ప్రయాణికుల్లో ‘కోటి’ మార్కు దాటిన జీఎమ్మార్ ♦ తిరుపతి, విజయవాడ, విశాఖకు రెట్టింపైన రాకపోకలు విహారయాత్ర.. ఒకప్పుడు ఖరీదైన వ్యవహారం! కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.దేశీ, విదేశీ యాత్రలకు మధ్య తరగతి జనం కూడా జై కొట్టేస్తున్నారు! తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్ని చుట్టేసేందుకు ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటున్నారు. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఉద్యోగులకు వేల రూపాయల జీతాలు, సులువుగా అప్పులిచ్చే బ్యాంకులు అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి విమాన ప్రయాణాలు పెరిగిపోయాయి. విమానయాన సంస్థలూ బంపర్ ఆఫర్లతో వారిని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖ, గోవాలతో పాటు అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ దేశాలకు సర్వీసులను రెట్టింపు చేశాయి. సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ, ఏపీల్లో ప్రయాణాలకు విమానయానం ఎంచుకుంటున్న వారి సంఖ్య గత ఆర్నెల్లలో 20 శాతం పెరిగింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర కాస్మోపాలిటన్ నగరాల్లో విమానయానాల సగటు 7.3 శాతం వృద్ధి మాత్రమే ఉండగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశ, విదేశాలను చుట్టి వస్తున్నారు. గడిచిన ఆర్నెల్లలో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో దక్షిణాదిన కొచ్చి (35.4 శాతం) తర్వాత అత్యధిక వృద్ధి రేటు హైదరాబాద్ విమానాశ్రయంలోనే (15.4 శాతం) నమోదైంది. తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన లెక్కల మేరకు దేశీయ ప్రయాణాల్లో 27.5 శాతంతో బెంగళూరు, 21.1 శాతంతో కొచ్చి, 20.4 శాతంతో హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆఫర్ల మీద ఆఫర్లు.. విమానయాన సంస్థలు వివిధ ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. తొంభై రోజుల ముందు రూ.2,001 చెల్లించి టికెట్ బుక్ చేసుకుంటే దేశంలో ఎక్కడికైనా విమానయానం చేయొ చ్చంటూ స్పైస్ జెట్ ఊరిస్తుంటే.. ‘‘మీ సెలవులను దుబాయ్‌లో ఎంజాయ్ చెయ్యండి.. హాలిడే సేవింగ్స్ అకౌంట్‌తో నెలకు కేవలం రూ.3,600 చెల్లిస్తే 8.25 శాతం వడ్డీ జత చేస్తాం. ఆ సొమ్ముతో దుబాయ్‌లో ఐదు రోజులు గడపవచ్చు. వచ్చే జనవరి ప్రయాణాలను ఇప్పుడే బుక్ చేస్తే 20 శాతం రాయితీ’ అంటూ ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ‘థామస్ కుక్ ఆఫర్ ఇచ్చింది. మరోవైపు అనేక ప్రైవేటు కంపెనీలు మొదలుకుని ప్రభుత్వ రంగ సంస్థలూ టార్గెట్లు దాటిన ఉద్యోగులకు ఫారెన్ ట్రిప్‌ను అందజేస్తున్నాయి. ‘కోటి’ దాటేసిన జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు కోటి ప్రయాణికుల మార్క్‌ను జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ దాటేసింది. 2014-15 వార్షిక సంవత్సరంలో ఈ మార్కును అధిగమించింది. మధ్యతరగతి కుటుంబాలు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగుల టూర్ ప్యాకేజీలతోపాటు ఉపాధి కోసం దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు, అమెరికా, బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులు దేశంలో తెలంగాణ, ఏపీ నుంచే అత్యధికంగా ఉన్నారు. దీంతో జీఎంఆర్ ఎయిర్పోర్ట్ టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. ప్రస్తుతం ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం కలిగిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను త్వరలో.. 2 కోట్ల ప్రయాణికులకు అనుగుణంగా విస్తరించనున్నారు. హైదరాబాద్ వైపు.. పక్క రాష్ట్రాల చూపు ప్రయాణికుల వృద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉండటంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను అమాంతం పెంచేశాయి. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి 20 దేశాలకు, దేశంలో 35 ప్రధాన కేంద్రాలకు నేరుగా విమాన సర్వీసులు అందు బాటులోకి వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు మొదలుకుని సమీపంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రయాణికులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. తిరుపతి, విశాఖ, విజయవాడకు రద్దీ గతంతో పోలిస్తే తిరుపతి, విజయవాడ, విశాఖలకు ఫ్లైట్ జర్నీలు రెట్టింపు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి 2014 తొలి ఆర్నెళ్లలో 1,11,169 మంది వెళ్లగా.. ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో 1,70,869 మంది వెళ్లారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య 2014 తొలి ఆర్నెల్లలో 93,338 మంది రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది 1,85,246 మంది (98 శాతం వృద్ధి) పెరిగారు. విశాఖ-హైదరాబాద్ మధ్య గతేడాది 5,30,546 మంది వెళ్లగా.. ఈ ఏడాది 7,57,183 మంది రాకపోకలు (42 శాతం వృద్ధి) సాగించారు. రద్దీకి తగ్గట్టు విమాన సంస్థలూ తమ సర్వీసులను రెట్టింపు చేశాయి. అందరికీ అందుబాటులో చార్జీలు విమాన చార్జీలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ బుకింగ్‌తోపాటు వివిధ దేశాలు, పర్యాటక ప్రదేశాలపై నెట్లో సమాచారం దొరుకుతోంది. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఆదాయాలు విహార యాత్రల్ని ప్రోత్సహిస్తున్నాయి. నేను ఇటీవల మరో నలుగురు మిత్రులతో కలసి థాయ్‌లాండ్ వెళ్లాను. విమాన టికెట్లు, తిండి, బస సహా అన్నింటికీ రూ.40 వేలు-రూ.50 వేలు ఖర్చవుతుంది. - సుకుమార్‌రెడ్డి, వ్యాపారవేత్త, హైదరాబాద్ టూర్‌కు మించిన అనుభూతి లేదు నేను అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు చూశాను. సింగపూర్ మహిళలకు చాలా సేఫ్ కంట్రీ. అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరగవచ్చు. మన దేశంలో గోవా, కేరళ నాకు ఫేవరేట్. అలెప్పి బ్యాక్ వాటర్స్, గోవా బీచ్‌లు అద్బుతం. టూర్ చేయడానికి మించిన అనుభూతి లేదు. ప్రతి ఒక్కరూ కొత్త ప్రాంతాలను చూసి అనుభూతులు మూటగట్టుకోవాలి. - అర్పిత, గృహిణి, హైదరాబాద్ -
టెడ్డీబేర్ కాదు.. నిజమైన బేర్!
మాస్కో: పిక్నిక్ వెళ్లేటప్పుడు పిల్లలు తమ వెంట ఆటబొమ్మలను కూడా తెచ్చుకోవడం.. ప్రత్యేకించి తమకు ఇష్టమైన టెడ్డీబేర్‌ను తెచ్చుకుని దాన్ని తమ ఫ్రెండ్‌లా చూసుకోవడం ఎక్కడైనా జరుగుతుంది. అయితే ఈ రష్యన్ కుటుంబానికి మాత్రం టెడ్డీబేర్ అవసరం లేదు. వీళ్లింట్లో పిల్లలు నిజమైన బేర్ (ఎలుగుబంటి) తోనే ఆడుకుంటారు. ఇటీవల ఆ కుటుంబం పిక్నిక్ వెళ్లినప్పుడు తమ పెంపుడు ఎలుగుబంటితో తీయిం చుకున్న ఫొటోలు బాగా పాపులర్ అయ్యా యి. మరి క్రూరజంతువుల విభాగంలోకే వచ్చే, మనిషిని చూస్తే దాడికి దిగే ఎలుగుబంటి వీళ్లకు ఎలా మచ్చిక అయ్యింది అంటే.. దాన్ని చిన్నప్పటి నుంచి వీళ్లే పెంచుతున్నారట. దత్తత తీసుకుని దానికి పళ్లు,పాలు పెట్టి పెంచారు. దీంతో అది సాధుజంతువులా పెరిగింది. మనుషుల సరదాలకు, స్నేహాలకు అలవాటు పడింది. ఇప్పుడు ఆ ఎలుగుబంటి సాంగత్యం వల్లనే ఆ రష్యన్ కుటుం బానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కుతోంది! -
టర్కీ పర్యటనలో సీఎం చంద్రబాబు
కుటుంబసభ్యులతో కలసి విహారయాత్ర.. 7వ తేదీన తిరిగిరాక హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలసి టర్కీ దేశంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ఆగస్టు 1వ తేదీ రాత్రి తన సతీమణితో కలసి టర్కీ పర్యటనకు వెళ్లారు. లోకేష్ అంతకంటే ఒకరోజు ముందు తన కుటుంబంతో టర్కీ వెళ్లారు. వారంతా టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌తో పాటు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనలో వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా పాల్గొంటున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఈ నెల ఏడో తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. టర్కీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. మీడియాకు కూడా వివరాలు చెప్పలేదు. -
ఓల్డ్ ఏజ్‌లోనూ... గోల్డెన్ ట్రిప్స్
విహారం ఆరుపదుల వయసు దాటిన వారు విహారయాత్రలకు వెళ్లాలనుకుంటే సరైన రక్షణ చర్యలు తీసుకొని ప్రయాణిస్తే ఆందోళనకు ఆమడ దూరం ఉండవచ్చు. ప్రయాణాన్ని ఆనందంగా మలచుకోవచ్చు.వయసు పైబడినవారు వెళ్లదలచుకున్న ప్రాంతాన్ని బట్టి ట్రావెల్ ఏజెంట్స్‌ను సంప్రదిస్తే ప్రత్యేక ప్యాకేజీల సమాచారం లభిస్తుంది. ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది.వృద్ధులు ఒక గ్రూప్‌గా కలిసి, విహారానికి వెళితే ఒంటరితనం దరిచేరదు. ఖర్చు పెరగదు. ఆనందాన్ని రెట్టింపుచేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెళ్లాలనుకున్న ప్రాంతాన్ని బట్టి ముందుగా టూర్ ఆపరేటర్ని సంప్రదిస్తే వీల్‌చైర్ వంటి మెరుగైన సేవలనూ పొందే అవకాశం ఉంటుంది.విహారయాత్రలో ఆరోగ్యపరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పలేం కాబట్టి, ప్రయాణ బీమా తీసుకోవడం మేలు.{పయాణానికి ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. అలాగే, వైద్యులు సూచించిన మందులు, వేళ ప్రకారం వాడవల్సిన మందుల జాబితా వెంట తీసుకెళ్లడం మంచిది. -
బాలికను మింగినది
గజపతినగరం రూరల్: వారంతా ఆటపాటలు, సరదా సంతోషాలు తప్ప, కల్లాకపటం తెలియని, ప్రమాద విషయాలు పట్టని చిన్నారులు. కార్తీకమాసం కదా అని అంతా కలిసి పిక్నిక్కి వెళ్లారు. మధ్యాహ్నం వరకు ఆటపాటలతో కేరింతలు కొట్టారు. భోజనాలు చేసి సరదాగా స్నానానికి వెళ్లారు. చిన్నారులు కదా నాతో జలకాలాడడానికి వచ్చారన్న జాలి లేకుండా చం పావతి నది నలుగురు చిన్నారులకు తన గర్భంలోకి లాగేసింది. అష్టకష్టాలు పడి ఓ ముగ్గురు చిన్నారులు బయట పడగలిగినప్పటికీ ఓ బాలిక మాత్రం విగతజీవిగా మారింది. విహారంలో విషాదం సంభవించిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త బగ్గాం గ్రామానికి చెందిన 15మంది పిల్లలు ఆదివారం ఇదే మండలంల్నో కొణిశ గ్రామానికి పిక్నిక్కు వెళ్లారు. చిన్నారులంతా ఆటపాటలతో గడిపి భోజనాలు చేసిన అనంతరం సమీపంలో ఉన్న చంపావతి నదిలో స్నానాల కోసం దిగారు. పిల్లల్లో కొంతమంది ఒడ్డున,మరికొంతమంది నది మధ్యలోకి వెళ్లి స్నానాలు చేయసాగారు. అందరూ 15సంవత్సరాల లోపు వయస్సు వారే.అయితే దురదృష్ట వశాత్తు సిరిపురపు రేణుక అనే బాలిక నదిలో స్నానం చేస్తుండగా పెద్దగోతిలో పడిపోయి రక్షించండి బాబోయ్ అని కేకలు వేస్తూ మునిగి పోతున్న సమయంలో ఒడ్డున కూర్చున్న అర్జి నాగలక్ష్మి రేణుకను రక్షించబోయి ఆమెతో పాటు నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది.ఇంతలో రేణుక తమ్ముడు రఘు, నాగలక్ష్మి తమ్ముడు నరేంద్ర అక్కలిద్దరినీ రక్షించబోయి వారు కూడా నదిలో మునిగి పోతూ పెద్ద కేకలు వేయగా అదే గ్రామానికి చెందిన కన్నూరి శ్రీను అనే వ్యక్తి పరుగుపరుగున వచ్చి ఆముగ్గురినీ ఒక్కొక్కరినీ బయటకు నెట్టివేసి వారి ప్రాణాలను కాపాడాడు. శ్రీను ఆసమయంలో లేక పోతే రేణుకతో పాటు ఆముగ్గురు విగత జీవులై ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. రేణుక ఆచూకీ కోసం మూడు గంటల పాటు వెతుకులాట నదిలో మునిగిపోయిన రేణుక కోసం స్థానికులతో పాటు ఎస్సై డి.సాయికృష్ణ బృందం,అగ్నిమాపక సిబ్బంది,స్థానిక తహశీల్దార్ ప్రసాద్ పాత్రో ఇతర అధికారులు శాయశక్తులా మూడుగంటల పాటు వెతికారు. అయితే చివరికి రేణు కకు వరుసకు అన్నయ్య అయిన సిరిపురపు సూర్యనారాయణ, పోలీసు బృందానికి ఆమె మృతదేహం దొరకింది. దీంతో రేణుక బంధువులు, గ్రామ ప్రజల కన్నీటితో గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రేణుక తల్లి దండ్రులు రమణ,సత్యవతి కూలి పనికోసం తిరుపతి వలస వెళ్లారు. ఆ దంపతులకు రేణుక,రఘు అనే ఇద్దరు పిల్లలు ఉండడంతో వారిద్దరు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. రేణుక మృతిచెందిన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు రోదిస్తూ తిరుపతి నుంచి బయల్దేరారు. గ్రామ సర్పంచ్ సంజీవరావు సహాయంతో పోలీసుల సమక్షంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో శవపంచనామా నిర్వహించారు. వేగావతిలో విద్యార్థి గల్లంతు విశ్వనాథపురం(పాచిపెంట): సాలూరులోని సత్యసాయి జూనియర్ కళాశాల విద్యార్థి దాసరి వంశీ (17) పాచిపెంట మండలం విశ్వనాథపురంలోని వేగావతి నదిలో ఆదివారం గల్లంగయ్యాడు. సహ విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలకు చెందిన విద్యార్థులు పిక్నిక్ కోసం వేగావతి నది వద్దకు వచ్చారు.సరదాగా నదిలో దిగిన విద్యార్థి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఎస్సై రవికుమార్‌తో పాటు ఉప తహశీల్దార్ గిరిధర్,సాలూరు అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం వరకూ గాలింపు చేపట్టినా మృతదేహం లభించలేదు. వంశీ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకును తల్లి పాచిపనులు చేసుకుంటూ చదివిస్తోంది. కుమారుడు గల్లంతయ్యాడన్న విషయం తె లుసుకున్న తల్లి భోరున విలపించడంతో ఎవరికీ ఆపతరం కాలేదు. వంశీ సాలూరు అగురువీధికి చెందినవాడు. -
అరట్లకోటలో విషాదం
పాయకరావుపేట: సముద్రస్నానం విషాదంతమైంది. రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిలి ంది. మండలంలోని పెంటకోటతీరంలో సోమవారం సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అరట్లకోట గ్రామానికి చెందిన 35 మంది యువకులు ఇదే మండలం గోపాలపట్నం ప్రాంతంలోని సీతమ్మవారి కొండకు పిక్నిక్కు వెళ్లారు. వనభోజనాలు అనంతరం కొందరు స్నానాల కోసం పెంటకోట తీరానికి వచ్చారు. ఇందులో ఐదుగురు అక్కడి లైట్‌హౌస్ ప్రాంతంలో సముద్రంలోకి దిగారు. పెద్ద ఎత్తున వచ్చిన కెరటానికి లోపలికి కొట్టుకుపోయారు. సమీపంలోనివారు బి.మురళి, బి.శ్రీకాంత్, నరేంద్రలను రక్షించారు. వంగలపూడి అనిల్ కుమార్(20), బారుగుల రామకృష్ణ(16)లు గల్లంతయ్యారు. అక్కడే ఉన్న మత్స్యకారులు వలలు వేసి బోట్లు ద్వారా వెదికినా ఇద్దరి ఆచూకీ లేకుండాపోయింది. అరట్లకోట,పెంటకోట గ్రామస్తులు, ఆయా కుటుంబసభ్యులు, బంధువులు తీరానికి చేరుకున్నారు. గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతయినవారిలోని అనిల్ కుమార్ పాయకరావుపేట మంగవరం రోడ్డులో సెల్‌షాపు నిర్వహిస్తున్నాడు. తండ్రిలేడు. తల్లి వెంకటలక్ష్మి.తమ్ముడుసాయి ఉన్నారు. కుటుంబానికి ఇతనే పెద్దదిక్కు. మరో యువకుడు రామకృష్ణకు తల్లిదండ్రులు,అన్నయ్య ఉన్నారు. పాత గోనెసంచుల వ్యాపారం చేస్తూ తండ్రి సత్తిబాబుకి చేదొడుగా ఉంటున్నాడు. ఇద్దరు యువకుల గల్లంతుతో అరట్లకోటలో విషాదం అలుముకుంది. రెండు కుటుంబాలవారు, బంధువులు తీరానికి చేరుకుని రోదిస్తున్నారు. -
థాయిలాండ్‌లో నగర జంట మృతి
విహార యాత్రలో స్పీడ్‌బోట్ పల్టీ కొట్టడంతో దుర్ఘటన మృతులు సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఈడీ యుష్ దంపతులు హైదరాబాద్: థాయిలాండ్‌కు విహార యాత్రకు వెళ్లిన ఓ జంట పడవ ప్రమాదానికి గురై మృతి చెందింది. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12కు చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, సూర్యలత స్పిన్నింగ్ మిల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ యష్ అగర్వాల్ (27) ఆయన భార్య పంకూరి మిట్టల్ (25) ఈ నెల రెండున థాయిలాండ్ విహార యాత్రకు వెళ్లారు. సోమవారం సాయంత్రం బీచ్‌కు వెళ్లి అక్కడ స్పీడ్ బోట్ ఎక్కారు. ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలల తాకిడికి బోటు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువ జంట గల్లంతైంది. బోటు నడుపుతున్న వ్యక్తికి ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో నౌకాదళ సిబ్బంది సోమవారం అర్ధరాత్రి రెండు మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు. వీరి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంజారాహిల్స్‌లో విషాదం అలుముకుంది. నగరంలో బడా పారిశ్రామిక వేత్తలో ఒకరైన మహేందర్‌కుమార్ అగర్వాల్ తనయుడైన యష్అగర్వాల్ గత ఏడాది నవంబర్‌లో ఛండీగఢ్‌కు చెందిన పంకూరి మిట్టల్‌ను వివాహం చేసుకున్నారు. కాగా సొంత విమానాలు కలిగి ఉన్న మృతురాలి తండ్రి.. కూతురు, అల్లుడి మృతదేహాలను థాయిలాండ్ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువస్తున్నారు. -
పాతికమంది పిల్లలతో విహారయాత్ర
హన్సిక ఎంతటి అందగత్తో... అంతటి మంచి అమ్మాయి. డబ్బున్న చాలామందికి లేని ఉదారగుణం హన్సిక సొంతం. తనకిప్పుడు పాతికేళ్లలోపే. ఇప్పటికి దాదాపు ఇరవై అయిదు మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని బయట ప్రస్తావించడానికి అస్సలు ఇష్టపడరు హన్సిక. దీన్ని బట్టి... హన్సికది ఎంత పెద్ద మనసో అర్థం చేసుకోవచ్చు. హన్సిక లాంటి సూపర్స్టార్లకు నిమిషం లక్షలతో సమానం. అందుకే... ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తుంటారు. హన్సిక కూడా ఇందులో మినహాయింపేమీ కాదు. అయితే... ఎంతో విలువైన తన సమయాన్ని కూడా దత్తత తీసుకున్న తన పిల్లల కోసం త్యాగం చేయనున్నారు హన్సిక. ఆమె చేతిలో కేవలం తమిళంలోనే అయిదారు సినిమాలున్నాయి. వాటన్నింటికీ వారం రోజులు విరామం ఇచ్చి... ఆ పాతిక మంది పిల్లలతో కులు-మనాలి విహార యాత్రకు వెళ్లనున్నారు. త్వరలోనే ఈ యాత్ర ఉంటుందని సమాచారం. ఓ నాలుగైదు రోజుల పాటు ఈ యాత్రలో హన్సిక పాల్గొంటారని, ఆ తర్వాత హన్సిక తల్లి మోనా ఈ టూర్‌ని పూర్తి చేస్తారని సమాచారం. భవిష్యత్తులో ఈ పిల్లలందర్నీ ఫారిన్ ట్రిప్‌కి కూడా తీసుకెళ్లాలనే ఆలోచన హన్సికకు ఉందట. నిజంగా హన్సిక గ్రేటే! -
విహారంలో విషాదం
నలుగురు ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల దుర్మరణం జెసల్మేర్: రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఐఐటీ-ఢిల్లీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు విహారయాత్రకు జైసల్మేర్ వెళ్లారు. ఆదివారం ఉదయం వీరంతా జైసల్మేర్ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. జైసల్మేర్ నుంచి ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయిన నలుగురిని దీక్షా గౌతమ్, పల్లవ్ అగర్వాల్, అర్చనా కుమారి, మయాంక్ గోయల్‌గా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులు స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. -
రైలు ఢీకొని ముగ్గురూ దుర్మరణం చెందారు
విజయనగరం క్రైం, నెల్లిమర్ల రూరల్: అసలే కార్తీక మాసం. ఎక్కడ చూసినా పిక్నిక్ ల సందడి. పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్తే చాలా సంతోషిస్తారని భావించిన ఆ తండ్రి భార్యాపిల్లలను పిక్నిక్కి తీసుకువెళ్లాడు. అయితే ఆ సంతోషం వారికి తిరిగి ఇంటికెళ్లిం దాకా కూడా మిగల్లేదు. రైలు రూపంలో ఆ తండ్రీకొడుకులను మృత్యువు కాటేసింది. నెల్లిమర్లలో ఆదివారం పాసిం జర్ రైలు ఢీకొట్టడంతో పిక్నిక్కు వెళ్లి వస్తున్న తండ్రీ కొడుకులు దుర్మర ణం చెందారు. స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం పట్టణంలోని కొత్తఅగ్రహారంలో బాలాజీసింగ్ (40) కుటుంబసభ్యులు నివాసం ఉంటున్నారు. బాలాజీసింగ్ కు భార్య అనుపమ, కుమారులు పురుషోత్తం (8), అనిష్(4) ఉన్నారు. బాలాజీసింగ్ హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థ ఆల్మార్క్ఫైనాన్స్లో కలెక్షన్ అఫీసర్. ఆయన భార్యాపిల్లలతో కలిసి నెల్లిమర్ల చంపావతి నది వద్దకు పిక్నిక్కు వెళ్లారు. పిక్నిక్ అంతా పిల్లలతో సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో నెల్లిమర్ల ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి పెద్దకుమారుడు పురుషోత్తం(8) బహిర్భూమికి వెళ్తానన్నాడు. బాలాజీసింగ్ ద్విచక్రవాహనాన్ని భార్య అనుపమను రోడ్డుమీద ఉంచి ఇద్దరు కుమారులను రైల్వే ట్రాక్ సమీపంలోకి తీసుకువెళ్లాడు. ట్రాక్ పక్కనే గెడ్డ ఉంది. పురుషోత్తం, అనిష్‌లను రెండు పట్టాల మధ్య ఖాళీ ప్రదేశంలో కుర్చోబెట్టాడు. పని పూర్తయ్యాక తిరిగి ముగ్గురూ పట్టాలు దాటుతున్నారు. ఉదయం పదిన్నర సమయంలో నెల్లిమర్ల నుం చి విజయనగరం వైపు గూడ్స్ రైలు వస్తోంది. ఇది గమనించిన బాలాజీసింగ్ వెంటనే ఇద్దరు కుమారులతో రెండో వైపు ఉన్న పట్టాలమీదకు వచ్చారు. అయితే అదే సమయంలో విజయనగరం నుంచి నెల్లిమర్ల వైపు పాసింజర్ రైలువస్తోంది. ఆ రైలును వీరు గమనించక పోవడంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సమీపంలో ఉన్న భార్య అనుపమ సంఘటన చూసి భోరున విలపించడంతో స్థానికులు వచ్చి చూసేసరికి ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను విజయనగరం, ఆమదాలవల స రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పురుషోత్తం విజయనగరంలోని శారదా విద్యాని కేతన్‌లో చదువుతున్నాడు చిన్న కుమారుడు అనిష్‌ను ఇంకా స్కూలులో చేర్చలేదు. ఇంటి వద్దనే ఉంటాడు. మృతుడు బాలా జీ సింగ్‌కు తల్లిదండ్రులు సరస్వతి బాయి,నారాయణ స్వామి, తమ్ముడు చంటి, అక్క మంగబాయి, చెల్లి భాగ్యలక్ష్మి ఉన్నారు. నన్నెందుకు బతికించావు తన కళ్లముందే భర్త బాలాజీసింగ్, కుమారులు పురుషోత్తం, అనిష్ రైలు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని భార్య అనుప మ జీర్ణించుకోలేకపోతోంది. భర్త, పిల్లలు మృతిచెందాక దేవుడా నన్నెందుకు బతికించావంటూ భోరున విలపిస్తోంది. పురుషోత్తం బహిర్భూమికి వెళ్తానని చెప్పగానే ఇంటికి వెళ్లిపోదామని తాను చెబితే..పురుషోత్తం ఇబ్బంది పడతాడని చెప్పి భర్త బాలా జీసింగ్ తీసుకువెళ్లాడని.. అలా మృత్యువు ఒడిలోకి చేరిపోయారని రోదిస్తోంది. మాతో చెప్పకుండా వెళ్లాడు.. ఎక్కడికి వెళ్లినా తమతో చెప్పే బాలాజీసింగ్ చెప్పకుండా వనభోజనాలకు వెళ్లాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇంత మంచి కొడుకును తాము ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ భోరున విలపిస్తున్నారు. మాకు తెలిస్తే పంపేవాళ్లం కాదని, ఇక తమకెవరు దిక్కని వారు రోదిస్తుంటే చూపరులు కంటతడి పెట్టారు. కుమారుడు లేకపోతే ఇంకా తాము ఎందుకు బతకాలంటూ వారు విలపిస్తున్నారు. అండగా ఉండేవాడు తమకు ఏ కష్టమొచ్చినా సోదరుడు బాలాజీసింగ్ అండగా ఉండేవాడని అక్కాచెల్లెళ్లు విలపిస్తున్నారు. బాలాజీసింగ్ రైలు ప్రమాదంలో మృతిచెందాడన్న విషయాన్ని నమ్మలేకపోయాన ని చిన్న బావ రామారావు రోదించాడు. తన భార్య భాగ్యలక్ష్మి,బావమరిది చంటిని రైల్వేలో గ్రూపు డీ పరీక్షను విశాఖపట్నం లో రాయడానికి తీసుకువెళ్లానని ఇంతలోనే ఇది జరిగిందని తెలిసి నమ్మలేకపోయానని భోరున విలపించాడు. కొత్తఅగ్రహారంలో విషాద ఛాయలు.. రైలు ప్రమాదంలో మృతిచెందిన బాలాజీసింగ్ నివాసం ఉంటు న్న కొత్తఅగ్రహారంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలాజీసింగ్‌కు పిల్లలంటే చాలా ఇష్టమని.. ఏ చిన్నపిల్లవాడు కనిపించినా ఎత్తుకుని ముద్డాడే వాడని స్థానికులు అంటున్నారు. అందరితో మంచిగా ఉండే బాలాజీసింగ్ మృత్యువాత పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
విహారం మిగిల్చిన విషాదం
సంగారెడ్డి మున్సిపాలిటీ/సంగారెడ్డి రూరల్/పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్ : స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో విహారయాత్రకు బయలుదేరిన ఐదుగురు మిత్రులను మృత్యువు వెంటాడింది. విహారయాత్ర ముగించుకుని తిరుగుపయనమైన వారు గమ్యం చేరుకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. మృతుల్లో ఒకరైన శశిభూషణ్ తన పుట్టిన రోజుకు ఒకరోజు ముందే మృతి చెందటం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. జిల్లా వాసులను కలచి వేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సమీపంలో షాంగ్లా గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన రాబిన్ స్వరాజ్(38), శ్రీకాంత్(26), ప్రదీప్‌కుమార్(25), శశిభూషణ్(26), ప్రణీత్‌రెడ్డి(25) మృతి చెందారు. వీరంతా మిత్రులు కాగా, గత శనివారం ఫ్రెండ్‌షిప్‌డే వేడుకలు గోవాలో సరదాగా జరుపుకోవాలని సంగారెడ్డి నుంచి ఇండికా వాహనంలో బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని మంగళవారం రాత్రి సంగారెడ్డి తిరుగుపయనమయ్యారు. అయితే బీజాపూర్ సమీపంలో షాంగ్లా వద్ద 218 జాతీయ రహదారిపై రాత్రి 7.30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఇండికా వాహనం బండరాళ్లలోడ్తో ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం పూర్తిగా ధ్వంసం కాగా మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. బీజాపూర్ సమీపంలోని కొల్లార్ పోలీసులు ఘటన స్థలం చేరుకుని మృతదేహాలను బీజాపూర్‌లోని అల్-ఇమామ్ ఆసుపత్రికి తరలించారు. ఇండికా వాహనంపై ఉన్న వాహనం సర్వీసింగ్ సెంటర్ స్టిక్కర్ ఆధారంగా కొల్లార్ స్టేషన్ పోలీసులు మృతుల వివరాలను ఆరా తీసి వారి కుటుంబీకులకు రాత్రి 11.30గంటల ప్రాంతంలో సమాచారం అందజేశారు. బుధవారం ఉదయం హుటాహుటీన బీజాపూర్ వెళ్లిన మృతుల కుటుంబీకులు అక్కడి అల్-ఇమామ్ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఆ తర్వాత వాహనాల్లో ఐదు మృతదేహాలను తీసుకుని రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సంగారెడ్డికి చేరుకున్నారు. ఆ వెంటనే రాబిన్‌స్వరాజ్, ప్రదీప్‌కుమార్, శశిభూషణ్, ప్రణీత్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, శ్రీకాంత్ అంత్యక్రియలు మాత్రం గురువారం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వేడుక చేసుకునేందుకు వెళ్లి... సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి కళాశాల స్థాయి నుంచి మిత్రులు. వీరికి మరో ఆరుగురు మిత్రులు సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో ఉన్నారు. మొత్తం 11 మంది మిత్రులు గతనెల 31న సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కలుసుకున్నారు. ఆగస్టు 4వ తేదీన ఫ్రెండ్‌షిప్‌డే ఉన్నందున గోవా విహారయాత్రకు వెళ్ళాలని, అక్కడే సరదాగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిలో ఆరుగురు మిత్రులు తమకు వీలుకాదని చెప్పటంతో రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి షిర్డీ మీదుగా గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత శనివారం రాబిన్ స్వరాజ్ మామయ్యకు చెందిన ఇండికా విస్టా కారులో ఐదుగురు మిత్రులూ సంతోషంగా గోవా బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని సంగారెడ్డికి తిరిగి వస్తుండగా బీజాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బర్త్‌డేకు ఒకరోజు ముందే... బర్త్‌డేకు కేవలం ఒక్కరోజు ముందే శశిభూషణ్ మృత్యువాత పడడం వారి కుటుంబసభ్యులను, మిత్రులను, బంధువులను తీవ్రంగా కలచివేస్తోంది. సంగారెడ్డి మండలం కవలంపేట గ్రామానికి చెందిన శశిభూషణ్ పుట్టినరోజు గురువారం(8వ తేదీ) కావడంతో ఆ రోజు కుటుంబసభ్యులతో గడపాలనుకున్నాడు. అందుకే బుధవారం నాటికే స్వగ్రామం చేరాలని గోవా నుంచి బయలుదేరాడు. అయితే పుట్టినరోజు వేడుకలు జరుపుకోకముందే శశిభూషణ్ మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. తమబిడ్డ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాల్సిన తాము అతని అంతిమయాత్రలో పాల్గొనాల్సి వచ్చిందని శిశిభూషణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే శిశిభూషణ్ మరణవార్త చివరి వరకూ ఆయన తల్లి శ్యామమ్మకు కుటుంబీకులు తెలియనివ్వలేదు. ఒక్కసారిగా కనిపించిన కుమారుడు మృతదేహాన్ని చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. కుటుంబాల్లో అంతులేని విషాదం సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి మృతితో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. మంగళవారం రాత్రి వారి మృతి వార్త విన్నవెంటనే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వారి ఇళ్లవద్ద విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాలను వారి బంధువులు, మిత్రులు పరామర్శించారు. మృతుల స్నేహితులంతా వారి ఇళ్లవద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఐదుగురు మిత్రుల మృతితో సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, రుద్రారం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల నేపథ్యమిది.... రాబిన్‌స్వరాజ్: సంగారెడ్డి పట్టణంలోని మార్క్స్‌నగర్‌కు చెందిన పభుత్వ ఆస్పత్రి విశ్రాంత ఉద్యోగి శాంతకుమార్ పెద్దకుమారుడు. ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న రాబిన్‌స్వరాజ్ సంగారెడ్డి ఐటీఐ ఎదురుగా శ్వాస క్లినిక్‌ను 8 నెలలుగా నడుపుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. తన మిత్రులతో కలిసి గత శనివారం తన మామయ్య వాహనంలో మిత్రులతో కలిసి రాబిన్‌స్వరాజ్ గోవా బయలుదేరి వెళ్లాడు. కె.శ్రీకాంత్: సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడలో నివాసం ఉంటున్న కె.శ్రీకాంత్ స్థానిక యాక్సిస్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నాడు. తండ్రి వెంకటేశ్వర్రావు 25 ఏళ్ల క్రితం నెల్లూరు నుంచి సంగారెడ్డికి వచ్చి ఇటుక వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. వెంకటేశ్వర్రావుకు ఇద్దరు కుమారులు కాగా వారిలో మృతుడు శ్రీకాంత్ చిన్నవాడు. సంగారెడ్డిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీకాంత్ ఇక్కడే యాక్సిస్ బ్యాంకులో రెండేళ్లుగా పనిచేస్తూ సహచరులతో కలుపుగోలుగా ఉండేవాడు. ఇటీవలే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ప్రదీప్‌కుమార్: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రదీప్‌కుమార్ సంగారెడ్డిలోని విద్యాభ్యాసం పూర్తి చేశాడు. హెచ్ఎండీఏ విశ్రాంత ఉద్యోగి అంజయ్య, శాంతమ్మ దంపతులకు ప్రదీప్‌కుమార్ ఏకైక కుమారుడు. హైదరాబాద్‌లో కంప్యూటర్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న ప్రదీప్‌కుమార్ మృతితో వారి కుటుంబం వారసున్ని కోల్పోయింది. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు తోబుట్టువులు ప్రదీప్ మరణవార్త విని హతాశులయ్యారు. ప్రణీత్‌రెడ్డి: పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన ప్రణీత్‌రెడ్డి ఇటీవలే ఎంసీఏ పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ప్రాజెక్టు చేస్తున్నాడు.