టెడ్డీబేర్ కాదు.. నిజమైన బేర్!
మాస్కో: పిక్నిక్ వెళ్లేటప్పుడు పిల్లలు తమ వెంట ఆటబొమ్మలను కూడా తెచ్చుకోవడం.. ప్రత్యేకించి తమకు ఇష్టమైన టెడ్డీబేర్‌ను తెచ్చుకుని దాన్ని తమ ఫ్రెండ్‌లా చూసుకోవడం ఎక్కడైనా జరుగుతుంది. అయితే ఈ రష్యన్ కుటుంబానికి మాత్రం టెడ్డీబేర్ అవసరం లేదు. వీళ్లింట్లో పిల్లలు నిజమైన బేర్ (ఎలుగుబంటి) తోనే ఆడుకుంటారు. ఇటీవల ఆ కుటుంబం పిక్నిక్ వెళ్లినప్పుడు తమ పెంపుడు ఎలుగుబంటితో తీయిం చుకున్న ఫొటోలు బాగా పాపులర్ అయ్యా యి.
మరి క్రూరజంతువుల విభాగంలోకే వచ్చే, మనిషిని చూస్తే దాడికి దిగే ఎలుగుబంటి వీళ్లకు ఎలా మచ్చిక అయ్యింది అంటే.. దాన్ని చిన్నప్పటి నుంచి వీళ్లే పెంచుతున్నారట. దత్తత తీసుకుని దానికి పళ్లు,పాలు పెట్టి పెంచారు. దీంతో అది సాధుజంతువులా పెరిగింది. మనుషుల సరదాలకు, స్నేహాలకు అలవాటు పడింది. ఇప్పుడు ఆ ఎలుగుబంటి సాంగత్యం వల్లనే ఆ రష్యన్ కుటుం బానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కుతోంది!