Teddy bear
-
ఈ సినిమాలో హీరో నేను కాదు..ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యా: అల్లు శిరీష్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ నటిస్తోన్న తాజా చిత్రం 'బడ్డీ'. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ..' లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా? అని అడిగారు. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్‌తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో నేను కాదు.. టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశా. పుష్ప -2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి.' అని అన్నారు.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెగ ఆకట్టుకుంటోంది. అన్యాయంపై పోరాడే టెడ్డీబేర్‌ను మీరెప్పుడైనా చూశారా..? అంటూ చెప్పే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా చూశారా? అంటూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేశారు. కాగా.. టెడ్డీ బేర్‌కు సాయం చేసే కెప్టెన్ పాత్రలో హీరో అల్లు శిరీష్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత అజ్మల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్‌కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్‌లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్‌లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్‌కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్‌కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్‌లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్‌గా ఈ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్‌కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్‌కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్‌ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్‌ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్‌కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్‌ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
ఇన్‌స్టా స్టార్ శ్వేతా నాయుడుకి గిఫ్ట్ పంపిన అల్లు శిరీష్
యంగ్ హీరో అల్లు శిరీష్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత ఇంత వరకు మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. అయితే తాజాగా అల్లు శిరీష్ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు అఫీషయల్ అనౌన్స్మెంట్ చేశాడు. ఈ మేరకు మెట్రో ట్రైన్లో టెడ్డీబేర్‌తో ఉన్న ఓ పోస్టర్ని వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది తమిళంలో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయేషా సైగల్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఇన్‌స్టా స్టార్ శ్వేతా నాయుడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు టెడ్డీతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..మీ డెటెక్టివ్ స్కిల్‌ను ఉపయోగించి ఈ గిఫ్ట్‌ను నాకు ఎవరు ఇచ్చారో చెప్పుకోండి చూద్దాం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టును షేర్ చేసింది. View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) -
పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి
కొత్తగా ఏదైనా షాప్ ఓపెన్ అయినప్పుడు.. కార్టూన్ క్యారెక్టర్స్ వేషంలో ప్రమోషన్స్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. టెడ్డీబేర్‌ను మరీ కొత్తగా వాడాడు మాంచెస్టర్‌కు చెందిన ఓ యువకుడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి టెడ్డీబేర్‌లో దాక్కున్నాడు. అసలేం దొంగతనం చేశాడు? అలా ఎలా దాక్కున్నాడంటే? 18 ఏళ్ల జాషువా డాబ్సన్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల ఓ కారును దొంగిలించాడు. దాంట్లో ఫ్యూయల్ పోసుకుని బంక్‌లో డబ్బులు కట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో అతనిమీద మరో రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు తనకోసం వెతుకుతుండటంతో భయపడ్డ డాబ్సన్ దాక్కోవడానికి గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదు అడుగుల టెడ్డీబేర్‌ను కట్‌చేసి, అందులో కొంత స్టఫ్ తీసేసి, మనోడు అందులో కూర్చున్నాడు. పోలీసులు చివరకు డాబ్సన్ గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెదకడం మొదలుపెట్టారు. టెడ్డీబేర్ శ్వాస తీసుకుంటున్న చప్పుడు రావడంతో అనుమానం వచ్చి దాన్ని కట్ చేసి చూశారు. ఇంకేముంది... అందులోంచి డాబ్సన్ బయటికొచ్చాడు. కార్ల దొంగతనంతోపాటు, అతనిపై రెండుమూడు పెటీ కేసులు కూడా ఉండటంతో డాబ్సన్కు కోర్టు తొమ్మిదినెలల జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్ చేయకుండా అతనిపై 27 నెలలపాటు నిషేధించింది. మాంచెస్టర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వార్త వైరల్ అవుతూ నెటిజన్స్‌కు నవ్వులు పంచుతోంది. ‘సూపర్ క్రియేటివిటీ’, ‘పా పెట్రోల్’, ‘‘అన్ ‘బేర’బుల్’’, ‘టెడ్డీబేర్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: ఇదేం పెళ్లి.. భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చి -
Teddy Day 2022: టెడ్డీ డే స్పెషల్
-
కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బొమ్మలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వాటిని చూస్తుంటూ.. నిజమైనవేవో, టెడ్డీ బొమ్మలేవో గుర్తుపట్టలేనంతగా ఒకేలా ఉంటున్నాయి.. తాజాగా జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ ఘటన యూకేలోని క్లీవ్ ల్యాండ్ జరిగింది. అమీ క్విల్లెన్ అనే మహిళ.. తన కూతురు డార్సితో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్లింది. డార్సి తాను.. ఆడుకుంటున్న చిన్న బొమ్మను కారు ముందటి సీటులో పెట్టింది. అది అచ్చం చిన్నారిని పోలి ఉంది. అమీ క్విల్లెన్ షాప్‌లోపలికి వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అతను కారులో ఒక చిన్నారి ఉండటాన్ని గమనించాడు. దానికి సీటు బెల్టు కూడా ఉంది. వెంటనే ఆశ్చర్యపోయాడు. అతను.. చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశాడు. కారు యజమాని కోసం వెతికారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో చిన్నారిని చూశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కారు అద్దాలను పగులగొట్టారు. అప్పుడు వారు కారు సీటులో ఉన్న చిన్నారిని చూసి షాకింగ్‌కు గురయ్యారు. కారులో ఉన్నది.. నిజమైన చిన్నారి కాదు.. కేవలం బొమ్మమాత్రమే. పాపం.. ఆ బొమ్మ.. అచ్చం చిన్నారిని పోలీ ఉండటం వలన స్థానికులతో పాటు.. పోలీసులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న అమీ క్విల్లెన్కు, పోలీసులు జరిగిన విషయం తెలిపారు. ఆ బొమ్మ.. తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు. క్రిస్టమస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని తెలిపారు. కాగా, దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత , కారు మరమ్మత్తుల కోసం డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. చదవండి: ‘కొందరు మనుషుల కన్నా.. నోరు లేని జీవాలే నయం’ . వైరల్ వీడియో -
వైరల్: మెట్రోలో యువతికి సీటు ఆఫర్.. విషయం తెలిసి షాక్!
వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చాలా సదరాగా ఉంటాయి. మరికొన్ని మనుషుల్లో భయాన్ని పుట్టిస్తాయి. ప్రతిరోజూ బస్సులు, మెట్రోలలో ప్రయాణించే వ్యక్తులు వృద్ధులకు, మానసిక వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలని ఒడిలో మోసుకెళ్ళే మహిళల కోసం తమ సీట్లను ఆఫర్ చేస్తుంటారు. తాజాగా ఓ మెట్రో రైలులో తన ముందు నిల్చున్న అమ్మాయికి ఓ యువకుడు తన సీటు ఇచ్చాడు. దీంతో ఆమె ఏమీ మాట్లాడకుండా సంతోషంగా ఆఫర్‌ను అంగీరించి సీటులో కూర్చుంది. అయితే నల్ల దుప్పటి కప్పి ఓ చిన్నపిల్లాడిని ఆమె చేతుల్లో ఎత్తుకున్నట్లు కనిపించడంతో ఆ యువతికి ఈ ఆఫర్ ఇచ్చాడు. తర్వాత ఆమె చేతిలో పట్టుకున్న దుప్పటిని తీయడంతో.. టెడ్డీ బేర్ పట్టుకున్నట్లు తెలిసి షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ ఏమైనప్పటికీ నీ దయార్థ హృదయం నాకు నచ్చింది. నీకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ ‘‘ సీటు కోసమే అలా చేసిందా..యాధృచ్ఛికంగా జరిగిందా..?’’ అంటూ ప్రశ్నించాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ✌️URBAN._JATTS✌️ (@urban._jatts) -
మరణించిన కుమారుడి గుండె చప్పుడు విని..
వాషింగ్టన్: చెట్టంత ఎదిగిన బిడ్డ చేతికి అందివచ్చే సమయంలో మరణిస్తే.. ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ వర్ణించడానికి మాటలు చాలవు. జీవితాంతం ఆ కడుపుకోత వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఇలాంటి కష్ట సమయంలో కూడా కొందరు తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. తమను వదిలిపోయిన బిడ్డ అవయవాలను దానం చేసి.. మరి కొందరి కడుపుకోతను దూరం చేస్తారు. వారిలో తమ బిడ్డను చూసుకుంటారు. అమెరికాకు చెందిన జాన్ రెయిడ్ కూడా ఇదే పని చేశాడు. 2019 లో డిన్విడ్డీ కౌంటీలో జరిగిన బహుళ వాహన ప్రమాదంలో జాన్ రెయిడ్ కుమారుడు(16) మరణించాడు. దాంతో అతడి అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణం పోశాడు జాన్ రెయిడ్. ఇలా అవయవాలు పొందిన వారిలో రాబర్ట్ ఓ'కానర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మసాచుసెట్స్‌కు చెందిన రాబర్ట్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. దాంతో జాన్ రెయిడ్ కుమారుడి గుండెని అతడికి అమర్చారు. (చదవండి: ఐదుగురికి లైఫ్ ఇచ్చిన చిన్నారి) ఆపరేషన్ విజయవంతం అయ్యి.. రాబర్ట్ కోలుకుని ఇంటికి వెళ్లాడు. తర్వాత తనకు గుండెని దానం చేసి పునర్జన్మ ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపాలని భావించాడు. దాంతో తన హార్ట్‌బీట్‌ని రికార్డు చేసి.. ఓ టెడ్డీ బేర్ బొమ్మలో అమర్చి.. దాన్ని రెయిడ్‌కు బహుమతిగా పంపాడు. రాబర్ట్ పంపిన గిఫ్ట్బాక్స్ని ఒపెన్ చేసిన రెయిడ్ దానిలోని టెడ్డీ బేర్ బొమ్మను బయటకు తీసి చెవి దగ్గర పెట్టుకుని హార్ట్‌బీట్‌ని విన్నాడు. ఒక్కసారిగా కుమారుడే తన దగ్గర ఉన్నట్లు భావోద్వేగానికి గురయ్యాడు రెయిడ్. గుండె చప్పుడు వింటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ దృశ్యాన్ని రెయిడ్ భార్య వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక టెడ్డీ బేర్ షర్ట్ మీద ‘బెస్ట్ డాడ్ ఎవర్’ అని ఉంది. ఆ కోట్ని వాస్తవం చేసి చూపారు అంటూ నెటిజనులు రెయిడ్ని ప్రశంసిస్తున్నారు. -
దాన్ని తెచ్చిస్తే 5 వేల డాలర్లు: హీరో
వాషింగ్టన్: కెనడాకు చెందిన మారా సోరియాన్ అనే మహిళ జూలై 24న ఇల్లు మారే క్రమంలో తన టెడ్డీబేర్ కనిపించట్లేదని గమనించింది. మొత్తం అన్నీ వెతుకుతుండగా తన ఐపాడ్ కూడా కనిపించకపోవడంతో ఎవరో దొంగతనం చేశారని అర్థమైంది. అది మామూలు బొమ్మ అయితే పట్టించుకునేది కాదేమో కానీ, ఆ బొమ్మలో నుంచి "ఐ లవ్ యూ", "నిన్ను చూసి గర్విస్తున్నాను", "నేనెప్పుడూ నీ వెంటే ఉన్నాను" అన్న మాటలు వినిపిస్తాయి. ఇవి గతేడాది చనిపోయిన ఆమె తల్లి చివరి మాటలు.. దీంతో ఆమె తన టెడ్డీబేర్ తిరిగిచ్చేయండంటూ సోషల్ మీడియాలో వేడుకుంది. (ధ్రువ సర్జా, రష్మికా ‘పొగరు’) ఈ పోస్ట్ డెడ్‌పూల్ స్టార్ హీరో ర్యాన్ రెనాల్డ్స్ కంటపడింది. వెంటనే ఆయన ఆ బొమ్మను ఆమె దగ్గరికి చేర్చినవారికి 5 వేల డాలర్లు ఇస్తానని ప్రకటించారు. ఆమెకు తిరిగి బొమ్మ దొరికేంతవరకు మనమందరు సాయం చేయాలని చెప్పుకొచ్చారు. మహిళకు మద్దతు తెలుపుతూ ఆమె పోగొట్టుకున్న బొమ్మ కోసం నజరానా ప్రకటించడంపై ర్యాన్ అభిమానులు హీరోను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. "ఇందుకే మేము మీకు అభిమానులమయ్యాము" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆ బొమ్మకు ఏమీ కావద్దని, అది తిరిగి సదరు మహిళ చెంతకు చేరాలని ప్రార్థిస్తున్నారు. (అత్యాచారం కేసులో నటుడి అరెస్ట్) Vancouver: $5,000 to anyone who returns this bear to Mara. Zero questions asked. I think we all need this bear to come home. https://t.co/L4teoxoY50 — Ryan Reynolds (@VancityReynolds) July 25, 2020 -
టెడ్డీ ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది..
నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టెడ్డీ. ఇది పలు విశేషాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్. ఈయన ఇంతకు ముందు టిక్ టిక్ టిక్ అనే స్పై చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ఈయన తాజా చిత్రం టెడ్డీలోనూ గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందట. ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషాసైగల్ నటిస్తున్న చిత్రం ఇది. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆర్య వెనుక టెడ్డీబేర్ నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెడ్డీ చిత్రం కథేంటి? టెడ్డీబేర్ పాత్ర విశేషాలు ఏమిటి? గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఎంత? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ! ఆ సందేహాలను చిత్ర దర్శకుడిని అడిగి తెలుసుకుందాం! ప్ర: ఈ చిత్రానికి టెడ్డీ అని పేరు నిర్ణయించడానికి కారణం? జ: చిత్రంలో ఆర్యకు టెడ్డీబేర్‌కు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి చాలా పేర్లను పరిశీలించాం. చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం. టెడ్డీ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తేనే టైటిల్ ప్రాముఖ్యత మీకు అర్థం అయ్యి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకూ ఎలా టెడ్డీబేర్‌ను ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు. అలా చిత్రాన్ని తయారు చేయడానికి శ్రమిస్తున్నాం. ప్ర: ఇంతకు ముందు బ్యాంకు దోపిడీ. జోంబి, అంతరిక్షం నేపథ్యాల్లో చిత్రాలను తెరకెక్కించారు. మరి ఈ టెడ్డీ ఏ జానర్లో ఉంటుంది? జ: దీన్ని ఒక్క మాటలో పలానా జానర్ చిత్రం అని చెప్పడం కుదరదు. చిత్రంలో హీరోతో పాటు కంప్యూటర్‌కు సంబంధించిన పాత్ర ఉంటుంది. దాన్ని రూపాన్ని గ్రాఫిక్స్‌లో మాత్రమే ఆవిష్కరించాల్సి ఉంటుంది. అదే టెడ్డీబేర్ పాత్ర. ఇదే చిత్రంలో ప్రత్యేకం. చిత్రంలో సెకెండ్ పాత్ర ఇదే. టెడ్డీబేర్‌ను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సహజత్వానికి అద్దం పట్టేలా రూపొందిస్తున్నాం. ఈ టెడ్డీబేర్ ఫైట్స్ కూడా చేస్తుంది. అదే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్ర: వివాహానంతరం ఆర్య, సాయేషాలను హీరోహీరోయిన్లుగా నటింపజేయాలన్న ఆలోచన గురించి? జ: నిజం చెప్పాలంటే వారిద్దరినీ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి భయపడ్డాను. అయితే కథ విన్న వారం రోజుల్లోనే పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటి సాయేషా నటించడానికి అంగీకరించారు. ప్ర: అజర్బైజాన్ దేశంలో షూటింగ్ చేయడానికి కారణం? జ:అది చాలా పురాతన దేశం. ఇప్పుడు అదే రష్యా. అప్పట్లో భారతీయ చిత్రాలను అక్కడి ప్రజలు ఎక్కువగా చూసేవారు. నటి సాయేషా ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్ మనవరాలు అని తెలవగానే అక్కడి ప్రజలు సంతోషంగా దిలీప్‌కుమార్ అంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఒక బామ్మ నటుడు ఆర్యను పట్టుకుని అటూ ఇటూ ఊపేసింది. ఎందుకమ్మా? అని అంటే మదరాసు పట్టణం చిత్ర సీడీ చూపించి ఇందులో నటించింది నువ్వేగా అని అడిగింది. అంతగా ఇండియన్ చిత్రాలను ఇప్పటికీ య్యూట్యూబుల్లో అక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్ర: చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజా గురించి? జ: టిక్ టిక్ టిక్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్‌రాజాను కలిశాను. బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్ వంటివి ఏమీ అడగకుండా చిత్రం చేద్దాం అని చెప్పారు. ఇప్పటికీ ఇంత బడ్జెట్ అని నిర్ణయించలేదు. చిత్రానికి అవసరం అయిన వన్నీ సమకూర్చుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిర్మాణ సంస్థలో చాలా మైలురాయి చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఈ టెడ్డీ చిత్రం కూడా చేరుతుందని చెప్పగలను -
టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!
పేద్ద తల... చిన్ని కళ్లు.... గుండ్రటి ముక్కు... చూడగానే హత్తుకోవాలి అనిపించే ‘సుతిమెత్తని’ రూపం.. ప్రేయసి అలకను తీర్చేందుకు ప్రియుడు... పిల్లల మారాన్ని ఇట్టే మాయం చేసేందుకు పెద్దలు.. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరినైనా ఆకట్టుకునే.. అందరికీ అందుబాటులో ఉండే ముచ్చటైన బహుమతి బుజ్జి ఎలుగుబంటి అదేనండీ టెడ్డీబేర్. సాక్షి, వెబ్ప్రత్యేకం : చిన్నా, పెద్దా అందరికీ ప్రియనేస్తంగా మారిన టెడ్డీబేర్ గుర్తుగా జూలై 10న కెనడా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రత్యేకంగా టెడ్డీబేర్ పిక్నిక్ డేని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బోలెడన్నీ టెడ్డీబేర్ల మధ్య తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి కిండర్‌గార్డెన్‌లో టీ పార్టీ చేసుకుని సరదాగా గడుపుతారు. 1988 నుంచి వివిధ దేశాల్లో దీనిని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దాదాపుగా ప్రతీ చిన్నారి చేతిలో కనిపించే ఈ టెడ్డీబేర్ పుట్టుక, టెడ్డీబేర్ పిక్నిక్ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది తెలుసా!! మనసొప్పక వదిలేశారు! 1902 నవంబరులో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. ఈ క్రమంలో వేటకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రజలు ఆయనకు ఓ గాయపడిన ఎలుగుబంటిని బహూకరించారు. చెట్టుకు కట్టేసి దానిని కాల్చాలని కోరారు. అయితే బుజ్జి పిల్ల అయిన ఆ ఎలుగుబంటి ప్రాణాలు తీయడానికి రూజ్వెల్ట్కు మనసొప్పక.. జాలితో దానిని విడిచిపెట్టేశారు. ఈ సంఘటన గురించి క్లిఫార్డ్ బెర్రీమ్యాన్ అనే కార్టూనిస్టు చక్కని కార్టూన్ రూపొందించారు. ఓ పత్రికలో ప్రచురితమైన ఈ కార్టూన్ ఆధారంగా బొమ్మల షాపు యజమానులు రోజ్, మోరిస్ మిచ్‌టమ్ ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి అధ్యక్షుడి అనుమతితో దానికి ‘టెడ్డీబేర్’ అని నామకరణం చేశారు. ఈ విధంగా ‘నిన్ను నేను సంరక్షిస్తాను’ అనే భావనకు ప్రతిరూపంగా ‘టెడ్డీ బేర్’ అనే బొమ్మ ప్రపంచానికి పరిచయమైంది. అలా మొదలైంది!! జాన్ వాల్టర్ అనే అమెరికన్ మ్యూజిక్ కంపోజర్ 1907లొ ది టెడ్డీ బియర్స్ పిక్నిక్ అనే పాటను రాశారు. ఎంతో హృద్యంగా సాగిపోయే ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1932లో జేమ్స్ కెన్నడీ మరో రైటర్ ఇదే పాటను కాస్త మార్చి చిన్నారుల గుండె తాకేలా కంపోజ్ చేశారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్స్ సాంగ్‌ను దాదాపుగా అందరూ టాప్ మ్యూజిషియన్స్ సరికొత్తగా రూపొందించడం మొదలుపెట్టారు. కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన ఈ పాట అందరి మనుస్సుల్లో చెరగని ముద్ర వేసింది. ఈ క్రమంలో టెడ్డీబేర్స్ పిక్నిక్ ఆధారంగా1988లో కలెక్టిబుల్స్(వివిధ రకాల వస్తువుల సేకరించే) డీలర్ రాయల్ సెలాంగర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కంపెనీ జ్యువెల్లరీ బాక్సులు, ఆట వస్తువుల విడుదల సందర్భంగా టెడ్డీబేర్ పిక్నిక్ డే పేరిట వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా కేరింతలు కొడుతున్న చిన్నారులను చూసిన చాలా మంది తల్లిదండ్రులు.. వారి పిల్లల పుట్టినరోజున ఇదే థీమ్‌తో పార్టీలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ విధంగా అనతికాలంలోనే టెడ్డీబేర్ పిక్నిక్ డే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో జూలై 10 ను జాతీయ టెడ్డీబేర్ పిక్నిక్ డేగా యునైటెట్ స్టేట్స్ ప్రకటించింది. క్రమేపీ కెనడా, యూరోప్, ఆస్ట్రేలియాల్లో కూడా ఈరోజును హాలీడేగా ప్రకటించి.. కిండర్గార్డెన్లలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందంచడం మొదలుపెట్టాయి. అలా కిండర్గార్డెన్లలో తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆడుకునేలా సరికొత్త సంప్రదాయానికి తెరతీశాయి. ఇక ఆనాటి బుజ్జి ఎలుగుబంటి పుణ్యమాని నేటికీ చిన్నారుల కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఓ రోజును కేటాయిస్తూ వారితో గడిపే అవకాశం దక్కింది. ఒక్కోచోట ఒక్కోలా... టెడ్డీబేర్ పిక్నిక్ డేను ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారు. కెనడాలో చిన్నా, పెద్దా అంతా తమ టెడ్డీలతో కలిసి ‘ది టెడ్డీబేర్ మ్యాన్’ను చూసేందుకు వెళ్తారు. అనంతరం అతడితో కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇక ఆస్ట్రేలియాలోని వెస్ట్మీడ్లో సిటీ అంతటా పిక్నిక్ డే కార్యక్రమం ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బును చిన్నారుల ఆస్పత్రికి విరాళంగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల బాల్యం నుంచే పిల్లల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించడం వారి ఉద్దేశం. ఇదండీ.... చుట్టూ ఎవరూ లేనప్పుడు మన భావోద్వేగాలకు సాక్షీభూతంగా నిలిచే ప్రియనేస్తం టెడ్డీబేర్ కథాకమామీషు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టెడ్డీబేర్‌ను తీసుకుని ప్రియమైన వారితో కలిసి మీకు ఇష్టమైన చోటికి వెళ్లి హాయిగా గడపండి!! - సుష్మారెడ్డి యాళ్ల -
సాకులు
న్యూలుక్ సాగిపోయాయనో, పాతబడ్డాయనో, మోడల్ ఛేంజ్ అయ్యిందనో... ఎన్నో సాకులు చూపి సాక్స్ మూలనపడేస్తుంటారు. అలా వాడకుండా వదిలేసిన సాక్స్‌ను ఉపయోగంలోకి తేవడం ఎలాగో చూద్దాం... ♦ షూ, శాండల్ సాక్స్లలో ఎన్నో మోడల్స్, డిజైన్స్, కలర్స్... ఆకర్షించేలా ఉంటాయి. వాటి క్లాత్ కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎందుకు వదిలేయడం. కట్ చేసి చేతికి ఫింగర్‌లెస్ గ్లౌజ్లుగా మార్చేయచ్చు. ♦ మార్నింగ్ వాక్, జిమ్ చేసే సమయంలో ఫోన్ లేదా ఐ పాడ్ పట్టుకొని వెళ్లడం పెద్ద సమస్య. సాక్స్‌ను ఇలా షోల్డర్ బ్యాండ్‌గా మార్చేయండి. అందులో ఫోన్‌ని సెట్ చేయండి, హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టేసి జాగింగ్ ఎంజాయ్ చేయచ్చు. ♦ టెడ్డీ బేర్ కొనాలంటే అనవసరపు ఖర్చు అనుకుంటున్నారా! అయితే, రంగు రంగుల సాక్స్లలో గుడ్డ ముక్కలు లేదంటే స్పాంజ్‌తో నింపేసి, కుట్టి నచ్చిన బొమ్మలను రూపొందించుకోవచ్చు. ♦ చిన్న పిల్లల సాక్స్‌లు రకరకాల ప్రింట్లతో క్యూట్‌గా ఉంటాయి. వీటిని ఫోన్ విత్ మనీ పర్స్‌గా తయారుచేసి, ఉపయోగించుకోవచ్చు. ♦ టీ షర్ట్‌కి కలర్‌ఫుల్ సాక్స్ ముందు భాగం కత్తిరించేసి స్లీవ్స్‌కి జత చేయండి. కొత్త లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ రెడీ. ♦ చేతులకు అందమైన గ్లౌజ్లుగా... షోల్డర్ బ్యాండ్‌గా! -
టెడ్డీబేర్ కాదు.. నిజమైన బేర్!
మాస్కో: పిక్నిక్ వెళ్లేటప్పుడు పిల్లలు తమ వెంట ఆటబొమ్మలను కూడా తెచ్చుకోవడం.. ప్రత్యేకించి తమకు ఇష్టమైన టెడ్డీబేర్‌ను తెచ్చుకుని దాన్ని తమ ఫ్రెండ్‌లా చూసుకోవడం ఎక్కడైనా జరుగుతుంది. అయితే ఈ రష్యన్ కుటుంబానికి మాత్రం టెడ్డీబేర్ అవసరం లేదు. వీళ్లింట్లో పిల్లలు నిజమైన బేర్ (ఎలుగుబంటి) తోనే ఆడుకుంటారు. ఇటీవల ఆ కుటుంబం పిక్నిక్ వెళ్లినప్పుడు తమ పెంపుడు ఎలుగుబంటితో తీయిం చుకున్న ఫొటోలు బాగా పాపులర్ అయ్యా యి. మరి క్రూరజంతువుల విభాగంలోకే వచ్చే, మనిషిని చూస్తే దాడికి దిగే ఎలుగుబంటి వీళ్లకు ఎలా మచ్చిక అయ్యింది అంటే.. దాన్ని చిన్నప్పటి నుంచి వీళ్లే పెంచుతున్నారట. దత్తత తీసుకుని దానికి పళ్లు,పాలు పెట్టి పెంచారు. దీంతో అది సాధుజంతువులా పెరిగింది. మనుషుల సరదాలకు, స్నేహాలకు అలవాటు పడింది. ఇప్పుడు ఆ ఎలుగుబంటి సాంగత్యం వల్లనే ఆ రష్యన్ కుటుం బానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కుతోంది! -
బహుమెత్తని బహుమతి
మన ఇష్టాన్ని అవతలివారికి తెలియజేయడానికి పడే కష్టాన్ని తగ్గించేది.. అవతలివారి ఇష్టాన్ని చూరగొనడానికి చేసే ప్రయత్నం ఫలించేలా చేసేది ఒకటుంది. అదేంటో తెలుసా..? కానుక. అవును. ఓ మంచి కానుక మనం చెప్పకుండానే మన మనసును అవతలివారి ముందు పరుస్తుంది. వారి మనసులో మనమీద ఓ ముద్ర వేస్తుంది. తగిన స్థానాన్నీ కల్పిస్తుంది. అందుకే మన అనుకునేవారికి, మనవాళ్లని చేసుకునేందుకు మనం ఎంచుకున్న వారికి.. మంచి కానుకను ఇవ్వడానికి ఓ రోజును సృష్టించారు. అదే ‘టెడ్డీ డే’! ..:: సమీర నేలపూడి వాలెంటైన్ వీక్‌లో నాలుగో రోజైన ‘టెడ్డీ డే’ నాడు ప్రతి ప్రేమికుడూ తన ప్రేయసికి ఓ టెడ్డీ బేర్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. టెడ్డీ బేర్నే ఎందుకు ఇస్తారు అన్నది తెలుసుకోవాలంటే.. ముందు ఆ బొమ్మ చరిత్రను తెలుసుకోవాలి. నిజానికి టెడ్డీ బేర్ అనే బొమ్మ పుట్టుక వెనుక పెద్ద కథే ఉంది. 1902లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. తీరిక సమయంలో మిసిసిపీలో వేటకు వెళ్లారు. అప్పుడాయనకు ఓ ఎలుగుబంటి కంటబడింది. వెంటనే దాన్ని వేటాడాలనుకున్నారు రూజ్వెల్ట్. కానీ అది బుజ్జి పిల్ల. ఎంతో ముద్దుగా ఉంది. దాంతో కాల్చడానికి ఆయనకు మనసొప్పలేదు. జాలితో విడిచిపెట్టేశారు. మర్నాడు ఓ పత్రికలో క్లిఫార్డ్ బెర్రీమ్యాన్ అనే కార్టూనిస్టు వేసిన చక్కని కార్టూన్ ప్రచురితమైంది. దాన్ని చూసిన ఓ బొమ్మల కంపెనీ యజమానురాలు, ఎలుగుబంటి పిల్ల రూపంలో ఓ బొమ్మను తయారుచేసింది. దాన్ని రూజ్వెల్ట్కు పంపిస్తూ... ‘ఆ బొమ్మకి టెడ్డీ బేర్’ అని పేరు పెట్టుకోవచ్చా’ అంటూ లేఖ రాసింది. ఆయన అనుమతినివ్వడంతో టెడ్డీ బేర్ అనే బొమ్మ ఈ ప్రపంచానికి పరిచయమైంది. సాఫ్ట్ గిఫ్ట్.. ఆనాడు అలా రూజ్వెల్ట్ ఎలుగు పిల్లను సంరక్షించడం వల్లే టెడ్డీ బేర్ పుట్టుకొచ్చింది కాబట్టి, టెడ్డీ బేర్‌ను సంరక్షణకు ప్రతిరూపంగా భావిస్తున్నారు. అందుకే వాలెంటైన్ వీక్‌లో ‘టెడ్డీ డే’నాడు.. నిన్ను జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకుంటాను అని వాగ్దానం చేస్తూ ప్రేమికులు తమ ప్రియసఖులకు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం జరుగుతోంది. ఈ మధ్య కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిలకు టెడ్డీ బేర్ కీ చెయిన్లు, టెడ్డీ బొమ్మలు ముద్రించిన గ్రీటింగ్ కార్డులూ ఇస్తున్నా.. ఎక్కువగా ఇచ్చేది మాత్రం అబ్బాయిలే. అబ్బాయిలే అమ్మాయిలకు ఎందుకు ఇస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. మొదటిది.. అమ్మాయిలే సాఫ్ట్ టాయిస్ని ఇష్టపడతారు. రెండవది.. ఎప్పుడూ పురుషుడే స్త్రీని సంరక్షించాల్సిన స్థానంలో ఉంటాడు. అందుకే టెడ్డీ డే రాగానే ప్రతి ప్రేమికుడూ తన ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తూ.. ఆమెను కాపాడతానని భరోసా ఇస్తూ.. అందమైన టెడ్డీ బేర్‌ని ప్రేయసి చేతుల్లో పెడతాడు. ఆమె మనసును, నమ్మకాన్ని గెలుచుకుంటాడు! అద్దాల అల్మరాల్లోంచి.. భాగ్యనగరంలో టెడ్డీ డే సందడి చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సంవత్సరమంతా దుకాణాల్లోని అద్దాల అల్మరాల్లో కూర్చుని జాలిగా చూసే టెడ్డీ బేర్లు.. టెడ్డీ డే దగ్గర పడుతోందంటే రోడ్ల మీదకు వచ్చి సందడి చేస్తుంటాయి. ఎరుపు, తెలుపు, గులాబి, ఆరెంజ్ తదితర రంగుల్లో మెరిసిపోతుంటాయి. అయితే ప్రేమికుల మనసుకు దగ్గరగా ఉండే గులాబి రంగు టెడ్డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. మెడకు అందమైన రిబ్బన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టెడ్డీ మెత్తని రూపం.. చెలి నులివెచ్చని కౌగిలిలో నలిగిపోతుంది. వాలెంటైన్స్ డే పూర్తయ్యే వరకూ రోడ్ల పక్క ఎక్కడ చూసినా టెడ్డీలు కనిపించి మురిపిస్తుంటాయి. ఈ ఏడాది కూడా వీటి సందడి ఎక్కువగానే ఉంది. ఎక్కడ చూసినా ప్రేమికులు టెడ్డీలను కొంటూ కనిపిస్తున్నారు. తమ ప్రేమ కానుకను ప్రేమించిన వారికి అందించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
టెడ్డీబేర్ అలా పుట్టింది...
పిల్లల బొమ్మ చిన్నారులను అమితంగా ఆకట్టుకొనే టెడ్డీబేర్ పుట్టుక ఇలా జరిగింది: అమెరికాకు చెందిన మోరిస్ మిచ్థమ్ టెడ్డీబేర్ సృష్టికర్త. అయితే, 1901 నుంచి 1909 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉండిన థియోడర్ రూజ్వెల్ట్ ఈ బొమ్మ పుట్టుకకు కారణం! అమెరికా 26వ అధ్యక్షుడైన ఆయనను ‘టెడ్డీ’ రూజ్వెల్ట్ అని కూడా పిలుస్తారు. స్వతహాగా మంచి షూటర్‌గా పేరున్న టెడ్డీకి వేట అంటే ఆసక్తి. ఒకసారి ఆయన తన పరివారంతో కలసి వేటకు వెళ్లారు. ఒక ఎలుగుబంటి వారి మీద దాడి చేసింది. చేతిలో పిస్టల్ ఉన్నా కాల్చకుండా, దాన్ని తరిమికొట్టారు. ఈ ఎలుగుబంటి అనుభవం అమెరికా మీడియాలో బాగా ప్రచారానికి నోచుకొంది. ఈ సంఘటన స్ఫూర్తితో కార్టూన్లు, కామిక్స్ పుట్టుకొచ్చాయి. ఇదే ఊపులో మోరిస్ మిచ్థమ్ ఎలుగుబంటిని ఒక సాఫ్ట్‌టాయ్ రూపంలో తయారు చేసి, దానికి ‘టెడ్డీ’ బేర్ అని పేరు పెట్టాడు. అది బ్రహ్మాండమైన ఆదరణకు నోచుకొంది. కాలక్రమంలో ఐకానిక్ టాయ్లలో ఒకటిగా నిలిచింది. -
టెడ్డీ టేల్
బేర్‌మంటూ మారాం చేసే పిల్లలను ఊరుకోపెట్టాలంటే కావాలొక టెడ్డీబేర్. ముచ్చటైన అమ్మాయిలు ఎత్తుకుని ఆడించేందుకు వారికీ కావాలొక టెడ్డీబేర్. చిన్నారులైనా, ఆరిందాలైనా.. నిద్రపోయేటప్పుడు వెచ్చగా హత్తుకోవడానికి వారికీ కావాలొక నిలువెత్తు టెడ్డీబేర్. ఇంపైన ఇళ్లలో తీర్చిదిద్దిన డ్రాయింగ్ రూముల్లోని షోకేసుల్లో ఒక టెడ్డీబేర్ అయినా కనిపించి తీరుతుంది. అది లేకుంటే ఆ అలంకరణలోనే ఏదో లోటు కనిపిస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బొవ్మును సిటీవాసులు ఏనాడో రెడ్‌కార్పెట్ పరచి ఆహ్వానించారు. తవు ఇళ్లలో చోటిచ్చి ఆనందిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే అందరి బంధువుగా మారిన టెడ్డీబేర్ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్వెల్ట్ కొనసాగుతున్న కాలం. మిసిసిపీలో భల్లూకాల బెడద ఎక్కువగా ఉండేది. వాటిని అరికట్టేందుకు వేటకు రావాలంటూ గవర్నర్ ఆండ్రూ హెచ్ లాంగినో 1902 నవంబర్‌లో రూజ్‌వెల్ట్‌ను ఆహ్వానించాడు. వేటగాళ్ల బృందంతో కలసి రూజ్వెల్ట్ అడవికి వెళ్లాడు. బృందంలోని చాలామంది వేటగాళ్లు దొరికిన జంతువునల్లా వేటాడుతూ ముందుకు సాగుతుండగా వారికొక ఎలుగు పిల్ల చిక్కింది. దానిని ఉచ్చువేసి బంధించారు. దానిని కాల్చి చంపాల్సిందిగా రూజ్‌వెల్ట్‌ను కోరితే, పసితనం వీడని జంతువును వేటాడటం వేటగాడి లక్షణం కాదంటూ ఆయన కాల్పులు జరిపేందుకు నిరాకరించాడు. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఈ ఉదంతాన్ని 1902 నవంబర్ 16 సంచికలో ప్రముఖంగా ప్రచురించింది. కథనానికి అనుబంధంగా కార్టూన్‌ను వేసింది. ఇది ఆకట్టుకోవడంతో టాయ్స్ కంపెనీ మోరిస్ అండ్ రోజ్ మిక్టమ్ ఎలుగు పిల్ల బొమ్మను రూపొందించింది. దానికి ‘టెడ్డీబేర్’గా నామకరణం చేసేందుకు రూజ్వెల్ట్ అనుమతి కోరడంతో, ఆయన అంగీకరించారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. హైదరాబాద్ సహా భారత్‌లోని నగరాల్లోనూ టెడ్డీబేర్ బొమ్మలకు దశాబ్దాలుగా విపరీతమైన క్రేజ్ ఉంది. టెడ్డీబేర్ తర్వాత మార్కెట్లోకి చాలారకాల సాఫ్ట్‌టాయ్స్ వచ్చినా, వాటి స్థానం టెడ్డీబేర్ తర్వాతే. టెడ్డీబేర్ డే... అమెరికాలో కొందరు సెప్టెంబర్ 9న టెడ్డీబేర్ డే జరుపుకుంటూ వస్తున్నారు. మిగిలిన దేశాల్లోనూ చాలామంది ఇదేరోజును అనుసరిస్తున్నారు. వాలెంటైన్స్ డే తర్వాత తొమ్మిదోరోజు.. ఫిబ్రవరి 22న కూడా కొందరు టెడ్డీబేర్ డే జరుపుకుంటున్నారు. అమెరికాలోని టెడ్డీబేర్ బొమ్మలు తయారు చేసే వెర్మంట్ టెడ్డీబేర్ కంపెనీ నవంబర్ 13వ తేదీని జాతీయ టెడ్డీబేర్ డేగా ప్రకటించింది. టెడ్డీబేర్ డేను జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, ఇలాంటి రోజులు చిన్నారులు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా, గడపడానికి దోహదపడతాయి. మరిన్ని.. టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా లాభసాటి వ్యాపారాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2006 నాటికి ఈ వ్యాపారం టర్నోవర్ 1,300 కోట్ల డాలర్లకు పైమాటే. 1980ల తర్వాత టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం విపరీతంగా పుంజుకుంది. టెడ్డీబేర్ల కోసం తొలిసారిగా 1984లో ఇంగ్లండ్‌లో హాంప్‌షైర్ ప్రాంతంలోని పీటర్స్ఫీల్డ్లో మ్యూజియం వెలిసింది. ఇది 2006లో మూతబడింది. అయితే, ఈలోగా ప్రపంచంలో చాలాచోట్ల టెడ్డీబేర్ మ్యూజియంలు మొదలయ్యాయి. విపత్తులు, ప్రమాదాలు తలెత్తినప్పుడు విధులు నిర్వర్తించే పోలీసులకు అమెరికా ప్రభుత్వం టెడ్డీబేర్ బొమ్మలను ఇస్తుంది. విపత్తుల్లో చిక్కుకున్న చిన్నారులకు ఈ బొమ్మలు ఇస్తే, వారు తేలికగా ఊరట చెందుతారనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. - పన్యాల జగన్నాథదాసు -
కిర్రాఖీ
అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. పేగుతో పంచుకున్న అనుబంధాన్ని దారంతో ముడివేసి తోబుట్టువు గుర్తు చేస్తే.. చిన్ని దారానికే వెన్నలా కరిగిపోయి అన్ని వేళల్లా తోడుంటానని సోదరుడు ఇచ్చే భరోసాకు సందర్భమే రాఖీపండుగ. అలాంటి పండుగకు నాలుగు రోజుల ముందునుంచే కళకళలాడుతోంది నగరం. కొనుగోలు దారులతో స్టాల్స్ సంద డిగా మారాయి. అయితే ఏయేటికాయేడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కస్టమర్లు. వారి అభిరుచికి అనుగుణంగా రాఖీల తయారీలో క్రియేటివిటీని చూపిస్తున్నారు తయారీదార్లు. మార్కెట్లో ఈ యేడూ భిన్నమైన రాఖీలు తమ వైవిధ్యాన్ని చాటుకుంటున్నాయి. ఆకట్టుకుంటున్న థాలీ ఇదేదో భోజనం అని కంగారుపడిపోకండి. కొత్తదనాన్ని కోరుకునే హైదరాబాదీలకు కనువిందు చేస్తోంది ఈ రాఖీ. సాధారణంగా రాఖీ అనగానే... రాఖీలు ఒక చోట, అందుకు అవసరమైన కుంకుమ మరోచోట.. ఇక స్వీట్స్ ఇంకో చోట.. ఇలా షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ థాలీతో ఆ బెడద తప్పినట్లే. వెడల్పాటి ఆకర్షణీయమైన ప్లేటు(థాలీ), అందులో అందంగా అలంకరించిన డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, కుంకుమ, రాఖీతో కలిపి తయారీదారులు ఒక ప్యాకేజీగా అందిస్తున్నారు. చూడగానే ఆకట్టుకునేలా ఉండటంతో పాటు, అన్నీ ఒకే చోట ఉండటంతో ఎంపిక సమయమూ కలిసి వస్తోంది. దీంతో ఈ థాలీ కోసం వాలిపోతున్నారు కస్టమర్లు. అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలు 100 నుంచి 1,000 రూపాయల వరకు ఉన్నాయి. పిల్లల కోసం.. మారుతున్న జనరేషన్‌తో పాటు పిల్లల రాఖీల్లో ట్రెండ్స్ మారిపోతున్నాయి. గతంలో టెడ్డీ బేర్ రాఖీలకు డిమాండ్ ఉండేది. పిల్లల మనసుకు దగ్గరగా వెళ్లి వారికి నచ్చేలా తయారుచేసిన రాఖీలెన్నో మార్కెట్లో కొలువుదీరాయి. వాటిలో రకరకాల కార్ల బొమ్మలు, లైట్ గన్స్, జంతువుల బొమ్మలు.. పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బొమ్మ రాఖీలు 40 నుంచి 150 రూపాయల వరకు పలుకుతున్నాయి. టాయ్స్ తరువాత పిల్లలు అత్యధికంగా ప్రిఫర్ చేస్తున్న రాఖీలు కార్టూన్ క్యారెక్టర్స్వి. చోటాభీమ్, యాంగ్రీబర్డ్స్, బెన్‌టెన్, క్రిషర్ రాఖీలు కార్టూన్ రాఖీల కొనుగోలులో ముందు వరసలో ఉన్నాయి. వీటితోపాటు పిల్లలు ఇష్టపడుతున్న రాఖీల్లో మిక్కీ మౌస్, డోనాల్డ్డక్, ట్వీటీ, మోగ్లీ, క్యాస్పెర్, స్పైడర్‌మ్యాన్ కూడా ఉన్నాయి. ‘ప్రతి ఏడూ రాఖీ తయారీలో కొత్త దనం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. నిజానికి ఈ రాఖీ థాలీని మార్వాడీల కోసం తయారు చేయించేవాళ్లం. ఆకర్షణీయంగా కనిపిస్తున్న వీటిని చూసి, మిగిలినవారూ ఆసక్తి చూపుతున్నారు. దీంతో రక్షాబంధన్‌కి థాలీ మార్కెట్ బాగుంది. పిల్లల రాఖీలు కావాలని రకరకాల బొమ్మలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించాం.’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు శ్రద్ధ ఎక్స్టెన్షన్ యజమాని ఉమాకాంత్. మోస్ట్ పాపులర్.. మోడీ రాఖీ అన్నింటినీ మించి ఈ ఏడాది ఆకట్టుకుంటున్న రాఖీ మరోటి ఉంది. అది ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న రాఖీల్లో ఇది ఒకటి. పార్లమెంటులో అడుగుపెడుతూనే ప్రధానిపీఠాన్ని అధిష్టించిన ఈ పొలిటికల్ హీరో రాఖీ కొనేందుకు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. - విజయారెడ్డి