Allu Sirish Announces His Next Movie, Swetha Naidu Plays Key Role - Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా స్టార్‌ శ్వేతా నాయుడుకి గిఫ్ట్‌ పంపిన అల్లు శిరీష్‌

Published Tue, May 30 2023 2:28 PM | Last Updated on Tue, May 30 2023 6:24 PM

Allu Sirish Announces His Next Movie Swetha Naidu Plays Key Role - Sakshi

యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత ఇంత వరకు మరో సినిమాకు కమిట్‌ అవ్వలేదు. అయితే తాజాగా అల్లు శిరీష్‌ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ మేరకు అఫీషయల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశాడు.

ఈ మేరకు మెట్రో ట్రైన్‌లో టెడ్డీబేర్‌తో ఉన్న ఓ పోస్టర్‌ని వదిలారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఇది తమిళంలో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయేషా సైగల్‌ నటించనున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ మూవీలో ఇన్‌స్టా స్టార్‌ శ్వేతా నాయుడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు టెడ్డీతో ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ..మీ డెటెక్టివ్‌ స్కిల్‌ను ఉపయోగించి ఈ గిఫ్ట్‌ను నాకు ఎవరు ఇచ్చారో చెప్పుకోండి చూద్దాం అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్టును షేర్‌ చేసింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement