సాకులు
న్యూలుక్
సాగిపోయాయనో, పాతబడ్డాయనో, మోడల్ ఛేంజ్ అయ్యిందనో... ఎన్నో సాకులు చూపి సాక్స్ మూలనపడేస్తుంటారు. అలా వాడకుండా వదిలేసిన సాక్స్‌ను ఉపయోగంలోకి తేవడం ఎలాగో చూద్దాం...
♦ షూ, శాండల్ సాక్స్‌లలో ఎన్నో మోడల్స్, డిజైన్స్, కలర్స్... ఆకర్షించేలా ఉంటాయి. వాటి క్లాత్ కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎందుకు వదిలేయడం. కట్ చేసి చేతికి ఫింగర్‌లెస్ గ్లౌజ్‌లుగా మార్చేయచ్చు.
♦ మార్నింగ్ వాక్, జిమ్ చేసే సమయంలో ఫోన్ లేదా ఐ పాడ్ పట్టుకొని వెళ్లడం పెద్ద సమస్య. సాక్స్‌ను ఇలా షోల్డర్ బ్యాండ్‌గా మార్చేయండి. అందులో ఫోన్‌ని సెట్ చేయండి, హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టేసి జాగింగ్ ఎంజాయ్ చేయచ్చు.
♦ టెడ్డీ బేర్ కొనాలంటే అనవసరపు ఖర్చు అనుకుంటున్నారా! అయితే, రంగు రంగుల సాక్స్‌లలో గుడ్డ ముక్కలు లేదంటే స్పాంజ్‌తో నింపేసి, కుట్టి నచ్చిన బొమ్మలను రూపొందించుకోవచ్చు.
♦ చిన్న పిల్లల సాక్స్‌లు రకరకాల ప్రింట్లతో క్యూట్‌గా ఉంటాయి. వీటిని ఫోన్ విత్ మనీ పర్స్‌గా తయారుచేసి, ఉపయోగించుకోవచ్చు.
♦ టీ షర్ట్‌కి కలర్‌ఫుల్ సాక్స్ ముందు భాగం కత్తిరించేసి స్లీవ్స్‌కి జత చేయండి. కొత్త లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ రెడీ.
♦ చేతులకు అందమైన గ్లౌజ్‌లుగా... షోల్డర్ బ్యాండ్‌గా!