sacks
-
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
Ticket Checker Pees :టీసీపై సస్పెన్షన్ వేటు విధించిన రైల్వే మంత్రి
రైలులో ప్రయాణిస్తున్న మహిళపై టీసీ మూత్ర విసర్జనకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి టీసీపై సస్పన్షన్ వేటు విధించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన రోజు సదరు నిందితుడు టీసీ సెలవులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఉత్తర మద్య రేల్వేకి రాసిన లేఖలో..మహిళలను అగౌరవపరిచే ప్రవర్తన తీవ్ర దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. వ్యక్తిగా అతనికే కాకుండా సంస్థగా మొత్తం రైల్వేలకు చెడ్డపేరు వచ్చేలా చేశాడు. రైల్వే ఉద్యోగిగా అతని అనుచిత ప్రవర్తనకు గానూ అతన్ని విధుల నుంచి తొలగించడమే సరైన శిక్ష అని భావిస్తున్నా. అందువల్ల అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించండి అని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన లేఖను కూడా రైల్వే మంత్రి అశ్వనీ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా అకాల్ తఖ్ ఎక్స్‌ప్రెస్ ఏ1 కోచ్‌లో ఒక మహిళ తన భర్తతో కలసి ప్రయాణిస్తుంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న టీసీ అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె కేకలు పెట్టడంతో వెంటనే ఆమె భర్త, ప్రయాణికులు స్పందించి..అతడికి దేహశుద్ధి చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు. (చదవండి: మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్) -
మస్క్‌తో తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, ఏం జరిగిందంటే?
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత కొత్తబాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ వరుసగా ఉద్యోగులను తొలగించడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటికే సీఈవో సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్ తాజాగా ఒక ఉద్యోగిపై పబ్లిగ్గానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆండ్రాయిడ్ యాప్‌పై వాదన నేపథ్యంలోఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్ ఎరిక్ ఫ్రోన్హోఫెర్ అనే ఉద్యోగిపై వేటు వేశారు ఎలాన్ మస్క్. ట్విటర్లో ఆండ్రాయిడ్‌లో ట్విటర్ ఎందుకు స్లో అయింది, దాని పరిష్కరించడానికి మీరు ఏమి చేసారు? అనే దానిపై మొదలైన వాదన వరుస ట్వీట్లలో మరింత వేడి పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఆగ్రహానిక గురైన మస్క్ హి ఈజ్ఫైర్డ్ అంటూ ట్వీట్ చేశారు. సిస్టమ్ లాక్ అయిన పిక్‌ను షేర్ చేసిన, ఎరిక్ తన తొలగింపును ధృవీకరించారు. దీంతో తనను బహిరంగంగా విమర్శించే కంపెనీ ఇంజనీర్లను తొలగించే పనిలో ఉన్న మస్క్ తన కోపాన్ని ప్రదర్శించారంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ వ్యవహారంలో బాస్‌తో ప్రయివేటుగా మాట్లాడి ఉండి ఉండాల్సింది.. ఇలా పబ్లిక్‌గా బాస్‌తో వాదించడం తగదు అంటూ 20 ఏళ్ల అనుభవం ఉన్న మరో యాప్ డెవలవర్ ట్వీట్ చేశారు. అంతకు ముందు ట్విటర్లో దాదాపు పదేళ్లపాటు సేవలందించిన మరో ఇంజనీర్ బెన్ లీబ్ని కూడా మస్క్ ఇదే విధంగా తొలగించారు. 🫡 https://t.co/YpaQysrIv0 — Eric Frohnhoefer @ 🏡 (@EricFrohnhoefer) November 14, 2022 Unbelievable exchange. Can I write this up as a teaching case for my management classroom? pic.twitter.com/lYteE7d4N8 — Sandy Piderit (@SandyPideritPhD) November 14, 2022 కాగా చాలా దేశాల్లో ట్విటర్ నెట్ వర్క్స్‌లో కావడంపై మస్క్ యూజర్లకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ యాప్ స్లో అయినందుకు, ముఖ్యంగా కొన్ని దేశాలలో వినియోగదారులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ట్విటర్ కొనుగోలు తరువాత సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత ఇటీవల మొత్తం 5,500 కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 4,400 మందిని ఎలాంటి ముదస్తు నోటీసు లేకుండానే నిలిపివేశారు. How to be the ultimate professional and still utterly destroy someone, a masterclass by @EricFrohnhoefer pic.twitter.com/mgUHJ0xLbH — Dan Kim (@dankim) November 14, 2022 -
ఎయిరిండియాలో అర్థరాత్రి తొలగింపుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 48 మంది పైలట్లను తొలగిస్తూ రాత్రికి రాత్రి ఆదేశాలు జారీ చేయడం కలకలం సృష్టించింది. కరోనా సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. సకాలంలో జీత భత్యాలు చెల్లించలేదంటూ జూలై, 2019 న ఈ 48 మంది పైలట్లు రాజీనామా చేశారు. అయితే 6 నెలల నోటీసు పీరియడ్ లో ఈ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. దీనికి అధికారిక ఆమోదం తరువాత ప్రస్తుతం వీరంతా ఎయిర్ బస్ విధుల్లో ఉన్నారు. అయితే గత రాత్రి హఠాత్తుగా తొలగింపు ఆదేశాలివ్వడం ఆందోళన రేపింది. ఇది తెలియని కొంతమంది పెలట్లు ప్రస్తుతం విధుల్లో ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారీ నష్టాల్లో ఉన్నాం.. ఆర్థిక సామర్థ్యం లేదంటూ ఎయిరిండియా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పైలట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలనంటూ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఐ) పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరికి, ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ కు ఒక లేఖ రాసింది. అక్రమ తొలగింపులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు కొందరు పైలట్లు న్యాయం కోరుతూ కోర్టు మెట్లు ఎక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. -
300 మందిని తొలగించిన టెక్ జెయింట్
టెక్నాలజీ జెయింట్ ఐబీఎం భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. సర్వీసు డివిజన్‌నుంచి, ముఖ్యంగా సాప్ట్వేర్ సర్వీసుల ఉద్యోగులను 300 మందిని విధుల నుంచి తప్పించింది. సంస్థ పునరుద్ధరణలో భాగంగా, వినియోగదారుల ఆధునిక అవసరాలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్ధ్యాలపై ఐబీఎం దృష్టిపెట్టనుంది. తమ వ్యాపారంలో మారుతున్న అవసరాలు, కస్టమర్లకు ఆధునిక, మెరుగైన సేవలను అందించడంలో సంస్థ సరికొత్త వ్యుహాలతో పనిచేస్తోందని ఐబీఎం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారని ఈటీ నౌ రిపోర్టు చేసింది. -
భారీగా ఉద్యోగులపై వేటువేస్తున్నవిప్రో
న్యూఢిల్లీ: దేశంలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో కూడా ఉద్యోగులపై భారీగా వేటు వేయనుంది. వార్షిక "పనితీరు అంచనా" లో భాగంగా వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. సుమారు 600 మంది ని ఇంటికి పంపించనుంది. అయితే ఈ సంఖ్యంగా మరింత పెరిగనుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సంఖ్య 2వేలమంది కంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం. అయితే దీనిపై స్పందించిన విప్రో రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఈ తొలగింపులని పేర్కొంది. తన క్లయింట్ రిక్వైర్మెంట్స్, సంస్థ వ్యూహాత్మక ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగులను క్రమబద్ధీకరించే క్రమంలో "కఠినమైన పనితీరును అంచనా వేసే ప్రక్రియ" నిర్వహిస్తామని తెలిపింది. ఈసమగ్రమైన పనితీరు అంచనా ప్రక్రియలో ఉద్యోగుల మార్గదర్శకత్వం, పునః శిక్షణ, అప్ స్కిల్లింగ్ కూడా ఉంటుందని చెప్పింది. అలాగే సంస్థ నుంచి కొందరు ఉద్యోగులపై వేటుకు దారితీయవచ్చని ఈ సంఖ్య సంవత్సర సంవత్సరానికి మారుతూ ఉంటుందని తెలిపింది. అయితే ఎంతమందిని తొలగించిందీ స్పష్టం చేయలేదు. కాగా డిసెంబరు 2016 చివరి నాటికి, బెంగళూరుకు చెందిన కంపెనీకి 1.79 లక్షల ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్ 25 న నాలుగవ త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించనుంది. -
సాకులు
న్యూలుక్ సాగిపోయాయనో, పాతబడ్డాయనో, మోడల్ ఛేంజ్ అయ్యిందనో... ఎన్నో సాకులు చూపి సాక్స్ మూలనపడేస్తుంటారు. అలా వాడకుండా వదిలేసిన సాక్స్‌ను ఉపయోగంలోకి తేవడం ఎలాగో చూద్దాం... ♦ షూ, శాండల్ సాక్స్లలో ఎన్నో మోడల్స్, డిజైన్స్, కలర్స్... ఆకర్షించేలా ఉంటాయి. వాటి క్లాత్ కూడా చాలా మృదువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎందుకు వదిలేయడం. కట్ చేసి చేతికి ఫింగర్‌లెస్ గ్లౌజ్లుగా మార్చేయచ్చు. ♦ మార్నింగ్ వాక్, జిమ్ చేసే సమయంలో ఫోన్ లేదా ఐ పాడ్ పట్టుకొని వెళ్లడం పెద్ద సమస్య. సాక్స్‌ను ఇలా షోల్డర్ బ్యాండ్‌గా మార్చేయండి. అందులో ఫోన్‌ని సెట్ చేయండి, హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టేసి జాగింగ్ ఎంజాయ్ చేయచ్చు. ♦ టెడ్డీ బేర్ కొనాలంటే అనవసరపు ఖర్చు అనుకుంటున్నారా! అయితే, రంగు రంగుల సాక్స్లలో గుడ్డ ముక్కలు లేదంటే స్పాంజ్‌తో నింపేసి, కుట్టి నచ్చిన బొమ్మలను రూపొందించుకోవచ్చు. ♦ చిన్న పిల్లల సాక్స్‌లు రకరకాల ప్రింట్లతో క్యూట్‌గా ఉంటాయి. వీటిని ఫోన్ విత్ మనీ పర్స్‌గా తయారుచేసి, ఉపయోగించుకోవచ్చు. ♦ టీ షర్ట్‌కి కలర్‌ఫుల్ సాక్స్ ముందు భాగం కత్తిరించేసి స్లీవ్స్‌కి జత చేయండి. కొత్త లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ రెడీ. ♦ చేతులకు అందమైన గ్లౌజ్లుగా... షోల్డర్ బ్యాండ్‌గా! -
కీచక పైలట్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కమాండర్ స్థాయి పైలట్‌ను స్పైస్‌జెట్ సంస్థ శనివారం విధుల నుంచి తొలగించింది. ఫిబ్రవరి 28న కోల్‌కతా-బ్యాంకాక్ విమానంలోని కమాండర్.. ఎయిర్ హోస్టెస్‌ను కాక్‌పిట్‌లో కూర్చోవాలని వేధించాడు. అంతేకాకుండా తన సహచర పైలట్‌ను తాను చెప్పేంత వరకు లోనికి రావొద్దని బెదిరించాడు. క్యాబిన్ సిబ్బంది పట్ల దురుసుగా, అసభ్య పదజాలంతో మాట్లాడాడు. మరుసటిరోజు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన స్పైస్‌జెట్ కమిటీ.. కమాండర్‌ను దోషిగా తేల్చింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం పైలట్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. -
కాక్‌పిట్‌లో పైలట్ పోకిరీ వేషాలు
విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎయిర్ హోస్టెస్‌ని తన పక్కన కూర్చోమన్న ఓ పైలట్ ఉద్యోగం ఊడింది. కాక్ పిట్లో చీఫ్ ఎయిర్ హోస్టెస్‌ని తన పక్కన కూర్చోమన్నందుకు, స్పైస్ జెట్ పైలట్‌ని విధుల్లోంచి తొలగించింది. ఫిబ్రవరి 28న బోయింగ్ 737 విమానం కోల్‌కతా నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానం తిరుగు ప్రయాణంలోనూ పైలట్ ఎయిర్ హోస్టస్‌ను వేధించడం ఆపలేదు. అదే సమయంలో కో-పైలెట్ టాయిలెట్‌కు వెళ్లాడు. అతనికి కాక్ పిట్లోకి చాలా సేపటి వరకు లోపలికి రావడానికి పైలెట్ అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటనపై ఎయిర్ హోస్టస్ ఫిర్యాదు మేరకు స్పైస్ జెట్ విచారణ ప్రారంభించింది. అంతే కాకుండా తనతో అసభ్యకరంగా పదజాలంతో పైలెట్ దూషించాడని ఎయిర్ హోస్టస్ ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై సిబ్బంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత సదరు పైలెట్‌ను స్పైస్ జెట్ సస్పెండ్ చేసింది. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత దోషిగా తేలితే పైలెట్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. -
మంత్రుల మెడపై కత్తి
పార్టీ, మంత్రి పదవుల నుంచి ఔట్ పార్టీ బాధ్యతల నుంచి ఆరోగ్యమంత్రి తొలగింపు నెలరోజుల్లో రెండో వేటు చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి జయలలిత మరో మంత్రికి ఉద్వాసన పలికారు. పశుసంవర్ధక శాఖా మంత్రి టీకేఎస్ చిన్నయ్యను మంత్రి, పార్టీ పదవులను తప్పించారు. సీఎం సిఫార్సులను అమోదిస్తూ మంత్రి చిన్నయ్యను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లుగా గవర్నర్ కె.రోశయ్య బుధవారం ప్రకటించారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఒక ప్రకటన విడుదల చేశారు.పార్టీలోనైనా, ప్రభుత్వ పాలనలోనైనా ప్రతిష్టను దెబ్బతీసే పనులకు పాల్పడితే జయలలిత సహించే ప్రశ్నేలేదు. సంజాయిషీకి ఏమాత్రం అవకాశం లేకుండా వేటు వేయడం జయలలిత నైజం. రెండేళ్ల క్రితం రాత్రికి రాత్రే అసెంబ్లీ స్పీకర్ జయకుమార్‌ను పదవీచ్యుతులను చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ జయకుమార్ పేరున ఆయన అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమే వేటుకు కారణమని అంచనా వేశారు. వాస్తవాలు నేటికీ వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం మంత్రివర్గంలోనే ఉన్న గోకుల ఇందిరను తొలగించి మళ్లీ పదవి ఇచ్చారు. తిరువళ్లూరు జిల్లాలో పార్టీకి బలమైన నేతగా మాజీ మంత్రి రమణకు పేరుంది. పార్లమెంటు ఎన్నికల్లో తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచేలా రమణ కృషి చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే మంత్రి పదవిని కోల్పోయారు. సుమారు ఆరునెలల విరామం తరువాత రమణకు మళ్లీ మంత్రి పదవి దక్కింది. సుమారు నెల రోజుల క్రితం రమణ ఆయన సతీమణితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వాట్సాప్‌లో చలామణి కావడంతో మరోసారి వేటుకు గురయ్యారు. గత ఐదేళ్ల కాలంలో 23 సార్లు మంత్రి వర్గ పునర్వస్థీకరణ జరుగగా, అందులో రెండుసార్లు మాత్రమే మంత్రుల మరణం వల్ల మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్నబోయిన చిన్నయ్య అన్నాడీఎంకే 2011లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి పదవులను కోల్పోవడం, మళ్లీ పొందడం సహజంగా మారింది. తాజాగా పశుసంవర్ధకశాఖా మంత్రి టీకేఎస్ చిన్నయ్యపై సీఎం జయలలిత వేటువేశారు. చిన్నయ్య పర్యవేక్షిస్తున్న పశుసంవర్ధకశాఖను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వలర్మతికి అదనపు బాధ్యతలుగా అప్పగించారు. అలాగే అన్నాడీఎంకే కాంచీపురం తూర్పు జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి సైతం తప్పించారు. పుదుక్కోట్టై జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యతల నుంచి మంత్రి డాక్టర్ విజయభాస్కర్‌ను తప్పిస్తూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రకటించారు. మరి కొందరు తృతీయశ్రేణి నేతలను సైతం పార్టీ నుంచి జయలలిత పంపించివేశారు. రాజకీయ చిచ్చు రచ్చకెక్కింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జయలలిత పార్టీ కేడర్‌పై డేగకన్ను వేసి ఉంచినట్లు ఇటీవల జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పార్టీ వైద్యమంత్రి విజయభాస్కర్ పదవిని మాత్రమే పోగొట్టుకుని బతుకుజీవుడా అంటూ బైటపడ్డారు. అయినా ఆయనలో ఏదోమూల మంత్రి పదవిపై భయం నెలకొని ఉంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా పరిగణించబడుతున్న ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం కుటుంబంలో రాజకీయ చిచ్చు రచ్చకెక్కింది. ఆయన ఇద్దరు కుమారులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పట్టుపడుతున్నారు. పెద్ద కుమారుడు ఇటీవల సచివాలయానికి వచ్చి సీఎం దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. అలాగే మరో కుమారుడు ప్రజాపనులశాఖ కాంట్రాక్టరుగా కొనసాగుతూ ఆ శాఖపై పెత్తనం సాగిస్తున్నాడు. ఇతని అనుమతి లేనిదే ప్రభుత్వ పనులు ఎవ్వరికీ అప్పగించకూడదనే స్థాయిలో అనధికార అజమాయిషీ చేస్తున్నాడు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తండ్రిపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలో పన్నీర్‌సెల్వం నెంబర్‌టూగా కొనసాగడాన్ని జీర్ణించుకోలేని ఓ వర్గం జయలలిత నెచ్చెలిని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా ఓపీ కుమారుల వ్యవహారాన్ని సైతం భూతద్దంలో చూపడం ద్వారా చెక్‌పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. మధురై సహా దక్షిణ తమిళనాడులో ఓపీకి మంచి బలగం ఉండడం, విశ్వాసపాత్రుడుగా కొనసాగడం వల్ల జయలలిత ఓపీని వదులుకోక పోవచ్చు. అయితే అమ్మ అంతరంగంలోని ఆలోచనలను ఎవ్వరూ పసిగట్టలేరని అందరూ ఎరిగినదే. -
63 మంది అధికారుల 'బలవంతపు' పదవీవిరమణ
శ్రీనగర్: అవినీతి ఊబిలో కూరుకుపోయిన అధికారులపై జమ్ముకశ్మీర్ సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తోన్న 63 మంది అధికారులు తక్షణమే స్వచ్ఛంద పదవీవిరమణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రికిరాత్రే ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ పేరుతో సదరు అధికారులకు లేఖలు పంపారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని రూపుమాపేందుకు కొద్ది నెలలుగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగానే అధికారుల తొలిగింపు ప్రక్రియకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గత మార్చి నెలలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ కందాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవినీతి ప్రక్షాళన కమిటీ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలకు దిగింది.