ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కమాండర్ స్థాయి పైలట్‌ను స్పైస్‌జెట్ సంస్థ శనివారం విధుల నుంచి తొలగించింది.
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కమాండర్ స్థాయి పైలట్‌ను స్పైస్‌జెట్ సంస్థ శనివారం విధుల నుంచి తొలగించింది. ఫిబ్రవరి 28న కోల్‌కతా-బ్యాంకాక్ విమానంలోని కమాండర్.. ఎయిర్ హోస్టెస్‌ను కాక్‌పిట్‌లో కూర్చోవాలని వేధించాడు. అంతేకాకుండా తన సహచర పైలట్‌ను తాను చెప్పేంత వరకు లోనికి రావొద్దని బెదిరించాడు.
క్యాబిన్ సిబ్బంది పట్ల దురుసుగా, అసభ్య పదజాలంతో మాట్లాడాడు. మరుసటిరోజు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన స్పైస్‌జెట్ కమిటీ.. కమాండర్‌ను దోషిగా తేల్చింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం పైలట్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.