Air Hostess
-
అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి
ముంబై : ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే అంధేరీలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె గొంతుపై ఎవరో కత్తితో కోసిన గుర్తు ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే (25) ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. ఇదే ఏడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ నుంచి ముంబై మకాం కూడా మార్చారు. అంధేరీ హౌసింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అయితే కొద్దీ రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి గొంతుపై కత్తితో కోసిన గాటు ఉందని.. అంధేరీ పోలీసులు బృందాలుగా విడిపోయి హంతకుల గురించి గాలిస్తున్నట్లు తెలిపారు. విచారణ నిమిత్తం ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నామని హౌసింగ్ సొసైటీలోని సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రూప ఓగ్రే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం ఆమె హ్యండిల్స్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది. An airhostess - Rupal Ogrey - was found dead at her luxury flat in Mumbai. She was a trainee air hostess. It is reported that her throat has been slit.She had joined the training last April and was residing with her beau and brother. The incident came to light when police paid… pic.twitter.com/CUKzwGksgI— NewsFirst Prime (@NewsFirstprime) September 4, 2023 ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం -
ఇండిగో విమానంలో ‘నేషనల్ హీరో’: ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి...
ISRO Chief S Somanath: చంద్రయాన్ -3 సక్స్‌స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లను ప్రశంసలను దక్కించుకుంటున్నారు. చందమామ దక్షిణ ధృవంపై కాలిడిన తొలి దేశంగా భారత్న తన ప్రత్యేకతను చాటుకుంది. ఆగష్టు 23, చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి పరితలంపై ల్యాండ్ అయ్యి కొత్త చరితను లిఖించింది. చంద్రయాన్ -3 లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూయడ్ రికార్డు దక్కించుకుందనే ఈ ప్రాజెక్ట్‌పై గ్లోబల్‌గా ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశీయ విమానంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. వివరాలను పరిశీలిస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇండిగో విమానంలో పయనించారు. ఆయన విమానం ఎక్కగానే ఇండిగో సిబ్బంది,ప్రయాణీకుల నుండి అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా సోమనాథ్‌ను గుర్తుపట్టిన ఎయిర్ హోస్టెస్ నేషనల్ హీరోకి వెల్కం.. అందరూ ఆయనను ఆహ్వానించండి అంటూ గర్వంగా ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇంతలో మరో ఫ్లైట్ ఎటెండెంట్ గూడీస్‌తో ఆయనను సత్కరించింది. ఈ విషయాన్ని పూజా షా తన సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈసందర్భంగా ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు నెటిజన్లు. అలాగే అంతటి గొప్ప వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఉన్నారుఅంటూ కొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pooja Shah (@freebird_pooja) -
నాన్న ముద్ద
పిల్లలు స్కూలుకెళ్లే హడావుడిలో ఉంటే అమ్మలు అన్నం ముద్ద కలిపి పెడతారు. ఇక్కడ కూతురు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీకి వెళ్లే హడావుడిలో ఉంటే నాన్న బతిమాలి అన్నం తినిపిస్తున్నాడు. ఇండిగో ఎయిర్‌హోస్టెస్ పూజా బిహాని పెట్టిన ఈ ΄ోస్టు క్షణాల్లో వైరల్‌గా మారి అందరి చేతా తల్లినో, తండ్రినో గుర్తుకు తెప్పిస్తోంది. ‘తల్లి బిడ్డ కడుపు చూస్తుంది’ అంటారు. తండ్రికి మాత్రం బిడ్డ ఆకలి పట్టదా? తల్లి కష్టపడ్డా, తండ్రి కష్టపడ్డా బిడ్డల కోసమే. జీవులకు లోకంలో అన్నింటి కంటే తృప్తినిచ్చేది తమ సంతానానికి ఆహారం అందించడమేనట. పిల్లలు తింటూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం. వారు ఖాళీ కడుపులతో ఉంటే బాధ. ముద్దుకోసమో మురిపెం కోసమో పిల్లలకు ఎన్నేళ్లొచ్చినా గోరుముద్దలు తినిపించే తల్లులు ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి మార్కులు కొట్టేశాడు. ఇండిగోలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న పూజా బిహాని డ్యూటీకి టైమయ్యి మేకప్ వేసుకుంటూ ఉంటే ఎక్కడ ఖాళీ కడుపుతో క్యాబ్ ఎక్కి తుర్రుమంటుందోనని ఆమె తండ్రి అన్నం తినిపించాడు. ఆ వీడియోను పూజా ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేస్తే క్షణాల్లో 8.6 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి’ అని ఒకరంటే ‘తల్లిదండ్రులు మాత్రమే పిల్లల బాగోగుల గురించి పట్టించుకుంటారు’ అని మరొకరు అన్నారు. ‘నాన్న గుర్తొస్తున్నారు’ అని ఒకరంటే ‘ఆ రోజులు మళ్లీ రావు’ అని మరొకరు బాధ పడ్డారు. చిన్న చిన్న ఆనందాల జీవితం అంటే ఇదేనని అందరూ అన్నారు. -
విమానంలో మహిళలపై వేధింపులు.. అభ్యంతకర ఫొటోలు తీసి..
ఢిల్లీ: ఢిల్లీ-ముంబయి విమానంలో ఓ ప్రయాణికుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విమాన సిబ్బందితో పాటు తోటి మహిళా ప్యాసింజర్ల అభ్యంతకర ఫొటోలను తీశాడు. బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. సదరు ప్రయాణికునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. SG 157 విమానం ఆగష్టు 2న ఢిల్లీ నుంచి ముంబయి బయలు దేరింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు సిబ్బంది, తోటి మహిళా ప్రయాణికుల అభ్యంతకర ఫొటోలను తీశాడు. ఇది గమనించిన సిబ్బంది అతన్ని పట్టుకుని ఫోన్లో నుంచి ఫొటోలను డిలీట్ చేయించారు. క్షమాపణలు కోరుతూ లేఖను రాయించారు. అయినప్పటికీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. నిందితున్ని శిక్షించాలని పోలీసులను కోరారు. 'విమానాల్లో లైంగిక వేధింపులు సహించరానివి. నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. పౌరవిమానయాన సంస్థ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు.' అని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఇన్ని రోజుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులకు , విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన -
విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు
అమృత్సర్: అంతర్జాతీయ విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన ఘటన మరోటి వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం.. శనివారం షార్జా నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరిన ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమానంలో పంజాబ్‌లోని కోట్లీ గ్రామానికి చెందిన రాజీందర్ సింగ్ ప్రయాణిస్తున్నారు. విమానంలో తప్పతాగాక అతను విమాన మహిళా సిబ్బంది(ఎయిర్ హోస్ట్) ఒకరితో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఆమెను లైంగికంగా వేధించాడు. గొడవను గమనించిన తోటి విమాన సిబ్బంది వెంటనే అమృత్‌సర్‌లోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే రాజీందర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. భారత శిక్షాస్మృతిలోని 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. చదవండి: కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన -
ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా.. దాదాపు 8 వేల మందికి
ముంబై/న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ఆఫర్ ఇచ్చింది. శాశ్వత ఉద్యోగులకు ‘ఎంప్లాయీస్ షేర్ బెనిఫిట్ (ఈఎస్‌బీ) స్కీమ్, 2022’ కింద 98 కోట్ల షేర్లను కేటాయించనుంది. 2022 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియా నియంత్రణ టాటా గ్రూపు చేతికి వెళ్లడం తెలిసిందే. ఈ స్టాక్ ఆప్షన్ పథకం కింద 8,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నట్టు ఎయిర్ ఇండియా ఉద్యోగి ఒకరు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా చేసుకున్న షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ప్రైవేటీకరించే నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్ బెనిఫిట్ పథకాన్ని ఆఫర్ చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇందులో ఉండే దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఉద్యోగులకు తెలియజేస్తామని పేర్కొంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసే శాశ్వత ఉద్యోగులు అందరికీ ఈ పథకం కింద అర్హత ఉంటుంది. కొనుగోలు చేసే నాటికి ఒక్కో షేరు పుస్తక విలువ 87–90 పైసలు ఉంటే, తాజా పథకంలో భాగంగా ఒక్కో స్టాక్ ఆప్షన్‌ను 27 పైసలకు ఆఫర్ చేసినట్టు తెలిసింది. చదవండి: Union Budget 2023: 6 నెలల నుంచి మొదలు, బాబోయ్ బడ్జెట్ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా! -
‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసలు
ప్రముఖ ఏవీయేషన్ సంస్థ ఇండిగో సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వివాదంలో మరో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎయిర్ హోస్టెస్‌కు సపోర్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండిగో సంస్థ ఇస్తాంబుల్- ఢిల్లీ విమానాల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. డిసెంబర్ 16న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తానుకోరుకున్న ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో లేవని వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్‌లో ఉన్న ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఆర్.గూర్ప్రీత్ సింగ్ మెన్స్ వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది తెగ చక్కెర్లు కొడుతోంది. వాళ్లూ మనుషులే As I had said earlier, crew are human too. It must have taken a lot to get her to breaking point. Over the years I have seen crew slapped and abused on board flights, called "servant" and worse. Hope she is fine despite the pressure she must be under. https://t.co/cSPI0jQBZl — Sanjiv Kapoor (@TheSanjivKapoor) December 21, 2022 ఈ తరుణంలో ఫ్లైట్‌లో ప్రయాణికులు-ఎయిర్ హోస్టెస్ మధ్య జరిగిన ఘర్షణపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందించారు. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని వ్యాఖ్యానించారు. ‘నేను ముందే చెప్పినట్లు,సిబ్బంది కూడా మనుషులే.నేను గత కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిని..చెంపదెబ్బలు కొట్టడం దూర్భాషలాడడం చూశాను. ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదంలో ఆమె తీవ్రంగా త్తిడికి గురైంది. ఇప్పుడు ఆమె బాగుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఎయిర్ హోస్టెస్‌కు అండగా నెటిజన్లు సీఈవో వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించారు.హెచ్ఆర్, యాజమాన్యం మహిళా సిబ్బందికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. వారు ఈ స్థాయిలో చేరేందుకు ఎంతో కష్టపడిందో అర్ధం చేసుకోవాలంటూ అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో మహిళా సిబ్బంది తప్పు లేదని, ఎంతో ఓర్పుతో సమాధానం ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. ఫ్లైట్‌లో ఏం జరిగింది ఇండిగోకు విమానం ‘6ఈ 12’ ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ప్రయాణ సమయంలో ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఓ ఎయిర్ హోస్ట్ కన్నీటి పర్యంతమైంది. దీంతో మరో ఎయిర్ హోస్టెస్ వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రయాణికుడు మరింత రెచ్చిపోయాడు. గొడవను సద్దుమణించేందుకు ప్రయత్నించిన సదరు మహిళా ఉద్యోగిని వైపు చేత్తో సంజ్ఞలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె ప్రయాణికుడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. Tempers soaring even mid-air: "I am not your servant" An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv — Tarun Shukla (@shukla_tarun) December 21, 2022 "నువ్వు నా వైపు వేలు చూపుతూ ఎందుకు అరుస్తున్నావు. నీ వల్ల నా సిబ్బంది ఏడుస్తున్నారు. దయచేసి పరిస్థితని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిపడ భోజనాలు (విమానంలో) ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం’ అని మాట్లాడుతుండగా ప్రయాణికుడు అడ్డు తగిలాడు "ఎందుకు అరుస్తున్నావు?" అని ప్రయాణికుడు గట్టిగా అరిచాడు. ఎయిర్ హోస్ట్ తన స్వరం పెంచుతూ...ఎందుకంటే మీరు మా మీద అరుస్తున్నారు. నీ మీ పని మనిషిని కాదు సార్. ఎయిర్ హెస్ట్ని. ఇండిగో సంస్థ ఉద్యోగిని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. శాండ్ విచ్ లేదని.. ఫ్లైట్ వివాదంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. ప్రయాణీకుడు శాండ్విచ్ అడిగారని, విమానంలో ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌పై అరవడం ప్రారంభించాడు. దీంతో భయాందోళనకు గురైన ఎయిర్ హోస్ట్ ఏడ్చినట్లు తెలిపింది. -
ఫుల్లుగా తాగొచ్చి మహిళపై అత్యాచారం.. రూంలో లాక్ చేసిన బాధితురాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను తెలిసిన వ్యక్తే రేప్ చేశాడు. తాగిన మత్తులో ఆమె ఇంటికి వెళ్లి ఈ అఘాత్యానికి ఒడిగట్టాడు. దక్షిణ ఢిల్లీ మెహ్రౌలీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. అయితే ఘటన అనంతరం బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించింది. నిందితుడు గదిలో ఉండగా.. ఎలాగోలా తాను బయటకు వచ్చి తాళం వేసింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. రంగంలోకి దిగిన వాళ్లు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నిందితుడు ఖాన్పూర్కు చెందిన హర్జీత్ యాదవ్ అని పోలీసులు వెల్లడించారు. ఇతడు బాధితురాలికి 45 రోజులుగా తెలుసని పేర్కొన్నారు. అంతేకాదు అతడు ఓ రాజకీయ పార్టీకి బ్లాక్ స్థాయి అధ్యక్షుడు అని వివరించారు. మద్యం మత్తులో వెళ్లి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. చదవండి: పీఎఫ్ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు -
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?
ఎయిర్‌హెస్టెస్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది.. విమాన ప్రయాణీకులకు వెల్కమ్ చెప్పడం, లోపల అతిథి మర్యాదలు చేయడం. కాగా, ఓ మహిళా ఎయిర్‌హెస్టెస్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. దుబాయ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలోకి ఎక్కేందుకు ఓ చిన్నపిల్లవాడు పాస్‌పోర్టు, వీసాతో వెళ్లాడు. ఇంతలో విమానం గేటు వద్ద ఓ ఎయిర్‌హెస్టెస్.. అతని చేతిలోని బోర్డింగ్ పాస్ తీసుకొని కౌగిలించుకుంది. వెంటనే అతడిని హత్తుకుని చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఎందుకంటే ఆ విమానం ఎక్కిన ప్యాసింజర్.. సదరు ఎయిర్‌హోస్టెస్ కుమారుడు కావడమే. ఆ తర్వాత వెనక్కు తిరిగి కెమెరా వైపు చేతులు ఊపుతూ లోపలకు వెళ్లాడు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) ఈ వీడియోను షేర్ చేసిన సదరు ఎయిర్‌హోస్టెస్..‘నా జీవితంలో విమానంలోకి ఆహ్వానించిన అతి పెద్ద వీఐపీ’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. బావోద్వేగానికి గురువుతున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) -
65ఏళ్లుగా ఒకే రూట్లో ఎయిర్‌హోస్టెస్‌గా..
ఒకే కంపెనీలో 20 ఏళ్లు పనిచేయడం కష్టం. ఎందుకంటే ప్రయివేటు ఉద్యోగాల్లో ఉద్యోగికి కోపం వచ్చినా, యజమానికి కోపం వచ్చినా పోయేది ఎంప్లాయ్ జాబే. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఒకచోట కాకుండా వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. కానీ, 65 ఏళ్లుగా ఒకే సంస్థలో, ఒకే రూట్లో సేవలందిస్తూ... అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ఎయిర్‌హోస్టెస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిందో మహిళ. బోస్టన్లోని మసాచుసెట్స్‌కు చెందిన బెట్ నాష్‌కు ఇప్పుడు 86 ఏళ్లు. 1957లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆరున్నర దశాబ్దాలుగా న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీ వయా బోస్టన్ రూట్లోనే సేవలందిస్తోంది. ప్రయాణికుల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తించే బెట్... తరచుగా ఆ మార్గంలో ప్రయాణించే ఎంతోమందికి అభిమాన ఎయిర్హోస్టెస్గానూ మారిపోయింది. వేరే మార్గాన్ని ఎంచుకునే అవకాశమున్నా ఆమె ఆ రూట్లోనే పనిచేయడానికో కారణం ఉంది. అది ఆమె కొడుకు. వైకల్యంతో బాధపడుతున్న అతడికి తల్లి అవసరం ఎంతో ఉంది. ఇక ఆ రూట్ అయితే రాత్రికల్లా ఇంటికి చేరుకుని కొడుకును చూసుకునే సౌలభ్యం ఉంది. ఇన్నేళ్లుగా ఇటు ఉద్యోగాన్ని, అటు కొడుకు బాధ్యతలను అవిశ్రాంతంగా కొనసాగిస్తోంది. ఒకే కంపెనీలో 84ఏళ్లుగా సేవలందిస్తున్న వ్యక్తిగా ఇటీవలే వందేళ్ల వయసున్న బ్రెజిల్‌కు వ్యక్తి వాల్టేర్ ఆర్థ్మన్ రికార్డు సాధించాడు. -
ఎయిర్ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!
కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఆయా కార్యాలయాల్లో పని పూర్తిగా ఆగిపోయేలా చేసి తమ డిమాండ్లు నెరవేర్చుకుంటారు. అలాగే ఈ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్‌లకు కూడా తమ ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యాయట. దీంతో వినూత్నంగా నిరసనలు చేపట్టారు. ఆ వివరాలు.. ఇటలీలోని కాంపిడోగ్లియోలో సుమారు 50 మంది ఎయిర్ హోస్టెస్‌లు రోడ్డు మీదకు వచ్చి బట్టలు విప్పి నిరసన చేపట్టారు. జీతంలో కోతలు, ఉద్యోగాల నష్టంపై మనస్తాపం చెందారని, అందుకే తాము నిరసన చేపట్టామని మీడియాకు వెల్లడించారు. ఇంత హఠాత్తుగా వారి ఉద్యోగాల్లో మార్పులు ఎందుకువచ్చాయంటే.. చదవండి: ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! అలిటాలియా ఎయిర్‌లైన్స్ తాజాగా ఐటీఏ ఎయిర్వేస్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే ఈ పరిణామం అలిటాలియా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అలిటాలియా ఎయిర్‌లైన్స్ దాదాపు 10,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ అయితే ఐటీఏ ఎయిర్వేస్లో మాత్రం కేవలం 2,600 మంది ఉద్యోగులు మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారట. మరోవైపు ఐటీఏ ఎయిర్వేస్కు చెందిన ఓ ఉద్యోగి.. సీనియారిటీ ప్రకారం రావల్సిన ఉద్యోగాలు కూడా మాకు దక్కలేదు, శాలరీలు కూడా బాగా తగ్గించారు, ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియని సందిగ్థంలో ఉన్నామని’ విచారం వ్యక్తం చేశారు. దీని గురించి ఐటిఎ ఎయిర్వేస్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడో అల్టావిల్లాను అడిగితే.. ‘అందరు ఉద్యోగులందరూ కంపెనీ నిబంధనలను అనుసరించి ఒప్పందంపై సంతకం చేసారు. ఉద్యోగులు సమ్మె చేస్తారని నేను భావింలేదు. అలా చేస్తే, వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని మీడియాకు తెలిపారు. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
13 మిలియన్ల వ్యూస్: ఎయిర్‌హోస్టెస్ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా
ముంబై: రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలంటే కేవలం సోషల్ మీడియా వల్లనే సాధ్యం. ఇందుకు ఉదాహరణలుగా నిలిచే సంఘటనలో కోకొల్లలు. తాజాగా బుల్లెట్ బండి పాట ఎంత హిట్ అయ్యిందో.. దానికి ఓ నవ వధువు డ్యాన్స్ వేసిన వీడియో కూడా అదే రేంజ్లో ఇంటర్నెట్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే స్టార్డం సాంపాదించుకుంది సదరు పెళ్లి కుమార్తు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే కొన్ని రోజులుగా ‘మాణికే మాగే హితే’ అనే ఓ పాట ఇంటర్నెట్‌ని తెగ షేక్ చేస్తోంది. ఒరిజినల్‌గా ఈ పాట సింహళి భాషలో(శ్రీలంక)ఉంది. కానీ ఈ పాట పాడిన గాయని గొంతులోని మాధుర్యం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రసుత్తం ఇది పలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యి.. ఇక్కడి జనాలను కూడా తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాట మీద రికార్డయిన ఇన్‌స్టా రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో తాజాగా మాణికే మాగే హితే పాటకు ఓ ఎయిర్‌హోస్టెస్ వేసిన క్యూట్ స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పాట ఎంత క్యూట్‌గా ఉందో మీ ఎక్స్‌ప్రేషన్స్ కూడా అంత అందంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటికే ఈ వీడియో 13 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. ఆ వివరాలు.. (చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా) ఇండిగోలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న ఆయాత్ ఉర్ఫ్ అఫ్రీన్ విమానం ఆగి ఉన్న సమయంలో మాణికే మాగే హితెకు పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా యూనిఫామ్‌లో. ఇక అఫ్రీన్ డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె సహచరులలో ఒకరు వీడియోని రికార్డ్ చేశారు. అనంతరం దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ పాటకు అఫ్రీన్ వేసిన స్టెప్పులు ఎంతో అందంగా, క్యూట్‌గా ఉండి నెటిజనులను ఫిదా చేస్తున్నాయి. (చదవండి: హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో) ఈ వీడియో చూసిన వారంతా.. ఆ పాటకు మీ ఎక్స్ప్రెషన్స్ సరిగా సెట్ అయ్యాయి.. ఆ పాట.. మీ ఆట బాగా సింక్ అయ్యాయి.. చాలా క్యూట్‌గా డ్యాన్స్ చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఈ పాటకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఫిదా అయ్యానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aᴀʏᴀᴛ urf Afreen (@_aayat_official) పాట చరిత్ర ఏంటంటే.. ‘మాణికే మాగే హితే’ పాటను అలపించింది శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ యొహాని డిసెల్వా. ఆమె కేవలం పాప్ సింగర్ మాత్రమే కాదు.. పాటల రచయిత, నిర్మాత, బిజినెస్ వుమెన్ కూడా. యొహాని తండ్రి మాజీ ఆర్మి అధికారి. తల్లి ఎయిర్‌హోస్టస్. దీంతో యొహాని చిన్నతనంలోనే మలేసియా, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించి వాళ్లమ్మ.. ఎంతో ప్రోత్సాహం అందించారు. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. ‘దేవియంగే బారే’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ వేదికగా ఇలా ఎన్నో పాటలు విడుదల చేసి అందరి మన్ననలు పొందారు. ఈ క్రమంలోనే ‘రాప్ ప్రిన్సెస్’ అనే బిరుదు ఆమెను వరించింది. ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న యొహాని 2021 మే నెలలో ‘మాణికే మాగే హితే’ పాట పాడి సోషల్‌మీడియాను షేక్ చేశారు. ఇప్పటివరకూ ఈ పాటను 9 కోట్ల మందికి పైగా వీక్షించారు. చదవండి: బుల్లెటు బండి ! ఆ డుగ్ డుగ్ వెనుక కథ ఇదేనండి !! -
ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచి మత్తుమందు కలిపి..
అహ్మదాబాద్: ఇది ఇంటర్నెట్ యుగం. ప్రపంచంలోని అనేక విషయాలు అర చేతిలోని ఫోన్లో ఇట్టే తెలుసుకోవచ్చు. సోషల్ మీడియా పుణ్యమా అని ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన కొన్ని స్నేహాలు మోసాలకు దారితీస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పరిచయమైన ట్రెయినీ ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు కలిపిన పానీయం తాగించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: తీహార్ జైల్లో కర్రలతో కొట్టి గ్యాంగ్‌స్టర్ గుజ్జర్ హత్య పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం వేజల్పూర్ ప్రాంతానికి చెందిన త్రివేది (22)కి ఏడు నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి (22) పరిచయమైంది. అనంతరం వారిద్దరూ తరచూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో తమ ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్నాళ్లకు వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో త్రివేది తన ఇంటికి ఆ యువతిని పిలిచాడు. ఇంటికొచ్చిన అమ్మాయిపై మోజు పెరిగింది. దీంతో ఆమెపై కోరిక తీర్చుకోవాలని భావించి పానీయంతో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ తప్పింది. అనంతరం అతడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా నిందితుడు ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసి వాటిని చూపించి ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ వీడియోలతో భయపడుతూ ఆమెపై తరచూ బలత్కారం చేస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఆ యువతి ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అజిత్ త్రివేదిని వేజల్పూర్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను.. -
ఐసీయూలో ఐస్‌క్రీం తిని అత్త.. హోటల్ రూంలో మేనల్లుడు మృతి
గురుగ్రామ్: తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ ఎయిర్‌హోస్టెస్ ఐసీయూలో ఐస్ క్రీం తిని మృతి చెందగా.. మరుసటి రోజే ఆమె మేనల్లుడు హోటల్ రూంలో విగతజీవిగా కనిపించాడు. వీరిద్దరి మృతి పట్ల సోషల్ మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతుండటంతో మేఘాలయా తురా పార్లమెంట్ సభ్యుడు అగాథ సంగ్మా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వం శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. నాగాలాండ్‌కు చెందిన రోసి సంగ్మా (29) ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మేనల్లుడి సామువేల్ సంగ్మాతో కలిసి హరియాణ గురుగ్రామ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 23న రోసి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. కాళ్లు,చేతుల్లో విపరీతమైన నొప్పి, తీవ్ర రక్తస్రావంతో బాధపడింది. దాంతో సామువేల్, రోసిని ఢిల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరుసటి రోజు ఉదయం అనగా జూన్ 24 ఉదయం, రోసిని గురుగ్రామ్ సెక్టార్ 10లోని ఆల్ఫా హాస్పిటల్‌కు తరలించారు. ఆల్ఫా ఆస్పత్రి ఐసీయూలో చేర్చిన తర్వాత రోసి కోలుకుందని తెలిపాడు సామువేల్. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇబ్బంది పడిన రోసి ఆ తర్వాత ఆల్ఫా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐస్‌క్రీం తిన్నదని తెలిపాడు. ఆ సమయంలో రోసి ఎదురుగా డాక్టర్లు ఉన్నారని.. కానీ ఆమెను వారించలేదని ఆరోపించాడు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయి.. మరణించిందని తెలిపాడు సామువేల్. దీని గురించి ప్రశ్నించిన తనను ఆల్ఫా ఆస్పత్రి సిబ్బంది కిందపడేసి చితకబాదారన్నాడు. రోసి చనిపోయిన విధానం తెలియజేస్తూ సామువేల్ వీడియో రూపొందించి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజే ఓ హోటల్ రూంలో సామువేల్ మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపింది. సామువేల్, రోసిల మృతిపై సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజనులు. సామువేల్ మృతి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకుని సామువేల్ చనిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆల్ఫా హాస్పిటల్ యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించింది. తమ ఆస్పత్రికి వచ్చాక రోసి ఆరోగ్యం మెరుగైందని.. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ ఐస్‌క్రీం తినడం చూసిన రోసి.. తనకు కూడా కావాలని అడిగిందని తెలిపారు. రోసి తన ఇష్టప్రకారమే ఐస్ క్రీం తిన్నదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఇక సామువేల్‌పై తాము దాడి చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై సామువేల్ తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదు. రోసికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. చనిపోయే రోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాకు కాల్ చేసి మాట్లాడాడు. మరికాసేటికే చనిపోయాడని తెలిసింది. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది’’ అన్నాడు. -
సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు.. పళ్లు రాలగొట్టింది
వాషింగ్టన్: సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు ఎయిర్‌హోస్టెస్ పళ్లు రాలగొట్టింది ఒక మహిళ. ఈ సంఘటన అమెరికా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. ‘‘విమానం ల్యాండ్ అవ్వబోతుంది. సీట్ బెల్ట్ ధరించండి’’ అని చెప్పినందుకు సదరు ప్రయాణికురాలు ఇంత దారుణానికి తెగబడింది. విమానంలో ఉన్న ప్యాసింజర్ ఒకరు దీన్ని వీడియో తీసి షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. విమానం ల్యాండ్ అవబోతుందనగా ఎయిర్ హోస్టెస్ విమానంలో ఉన్న 28 ఏళ్ల ప్రయాణికురాలు వైవియానా క్వినోనెజ్ని సీట్ బెల్ట్ ధరించాల్సిందిగా కోరింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోననై క్వినోనెజ్ని ఫ్లైట్ అటెండెంట్ మీద దాడి చేసింది. ఆమె ముఖం మీద గట్టిగా కొట్టింది. పక్కనున్న ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నించారు వీలు కాలేదు. ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ మీద ఇలా దాడి చేయడం మంచి పద్దతి కాదని వారించాడు. కానీ ఆ ప్రయాణికురాలు వారి మాటలు వినిపించుకోలేదు. ఈ డాడిలో ఎయిర్‌హోస్టెస్ రెండు పళ్లు ఊడిపోయాయి, ఆమె ముఖానికి తీవ్ర గాయలైనట్లు తెలిసింది శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత క్వినోనెజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆమెను బ్యాటరీ కోసం అరెస్టు చేసినట్లు పోర్ట్ ఆఫ్ శాన్ డియాగో హార్బర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఎయిర్ హోస్టెస్ వ్యభిచార ప్రచారం: విమానంలో.. -
రిపోర్టర్లను, సిబ్బందిని ఫూల్స్ చేసిన జో బైడెన్ భార్య
వాషింగ్టన్: ఏప్రిల్ ఫస్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న ఫ్రాంక్‌లు చేస్తూ.. స్నేహితులను, సన్నిహితులను సరదాగా ఆటపట్టిస్తారు. ఏప్రిల్ ఫూల్స్‌ని చేసే విషయంలో సెలబ్రిటీలు కూడా ముందుంటారు. తాజాగా ఈ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడి భార్య, ఫస్ట్ లేడి జిల్ బైడెన్ కూడా చేరారు. ఎయిర్‌హోస్టెస్‌గా వచ్చి.. రిపోర్టర్లను, సిబ్బందిని ఏప్రిల్ ఫూల్స్ చేశారు. కాలీఫోర్నియా పర్యటన ముగించుకుని వస్తుండగా.. విమానంలో జిల్ బైడెన్ ఈ ప్రాంక్ చేశారు. ఎయిర్హోస్టెస్లాగా డ్రెస్ చేసుకుని.. నల్లటి మాస్క్ ధరించి.. జాస్మిన్ అనే నేమ్ ట్యాగ్ తగిలించుకుని క్యాబిన్లో ప్రవేశించారు జిల్ బైడైన్. అనంతరం అందులో ఉన్న వారందరికి స్వీట్ సర్వ్ చేశారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ‘జాస్మిన్’ వారి ముందే విగ్, మాస్క్ తీసేసి చిరునవ్వులు చిందిస్తూ ‘ఏప్రిల్’ ఫూల్ అని అరిచారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతసేపు తమ ముందు ఎయిర్‌హోస్టెస్‌గా తిరిగిన వ్యక్తి ఫస్ట్ లేడా అని ఆశ్చర్యపోయారు. ఇక జిల్ బైడెన్ సర్వ్ చేసిన స్వీట్లానే ప్రాంక్ కూడా సూపర్‌గా ఉందని ప్రశంసించారు సిబ్బంది. అయితే జిల్ బైడెన్ ఇలాంటి చిలిపి పనులు చేయడం ఇదే ప్రథమం కాదట. గతంలో ఇలా రెండు మూడు సార్లు తమతో ప్రయాణిస్తున్న వారిని ఆటపట్టించారట. చదవండి: విడాకులు తీసుకోకపోతే బైడెన్‌ను కలిసే అవకాశం వచ్చేది కాదు.. -
ఎయిర్ హోస్టెస్ వ్యభిచార ప్రచారం: విమానంలో..
లండన్ : ‘‘ మీరు విమానంలో శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా? అయితే మీరు నాకు కొంత డబ్బులు చెల్లించండి. మీరు కోరుకున్న విధంగా గడపండి’’ అంటూ బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థ సోమవారం స్పందించి, విచారణకు ఆదేశించింది. ప్రస్తుతానికి ఆచూకీ తెలియని సదరు ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియా వేదికగా విమానంలో వ్యభిచరిస్తానంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం పోస్టులు, విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫొటోలను ఉంచింది. తన లోదుస్తులను కూడా అమ్ముతానని ప్రచారం మొదలుపెట్టింది. (ఉటా ఎడారి: ఎలా వచ్చిందో.. అలానే వెళ్లింది) లోదుస్తుల ధర దాదాపు 2,500 రూపాయలు ఉంటుందని తెలిపింది. ఈ పోస్టులు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆదివారం చాలా వరకు పోస్టులను తొలిగించింది. అయితే సదరు ఎయిర్ హోస్టెస్ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భద్రంగా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మా తోటి ఉద్యోగుల నుంచి అన్ని వేళలా.. అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నాము. దీనిపై విచారణ చేపట్టాము’’ అని పేర్కొన్నాడు. -
కుళ్లిన స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతదేహం
సాక్షి, ముంబై: ఓ ఎయిర్ హోస్టెస్ తన అపార్ట్మెంట్లో కుళ్లిన స్థితిలో శవమై తేలిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానా షైక్ అనే యువతి "గో ఎయిర్" విమానాశ్రయ సంస్థలో పని చేస్తోంది. ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమె ముంబైలోని పోద్దార్ వాడి ప్రాంతంలో నివసిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడానికి ముందే ఆ ఇద్దరు ముంబై విడిచి వెళ్లిపోయారు. దీంతో అపార్ట్మెంట్లోని తన గదిలో ఒక్కతే నివసిస్తోంది. బుధవారం నాడు ఆమె ఇంటి నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆమె గదిలో ఎలాంటి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (దారుణం : హత్య చేసి శవాన్ని ఇంట్లోనే ..) (తల్లి మందలించిందని..) -
పెళ్లి పేరుతో మోసం.. ఎయిర్‌హోస్టెస్ కంప్లైంట్
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని ఎయిర్‌హోస్టెస్‌ను నమ్మించి నాలుగేళ్లు సహజీవనం చేసి ఆమె నుంచి రూ.లక్షలు తీసుకుని తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేసిన విదేశీ యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీ, ఆర్కేపురం, మహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన యువతి సౌదీలోని రియాద్‌లో ఉంటూ సౌదీ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. 2015 మార్చిలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా విమానంలో రియాద్‌కు చెందిన అలీ–అల్–ఖఫియా సాలెం అలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనను యమన్ దేశస్తుడిగా పరిచయం చేసుకున్న అతను రియాద్‌లో ఉంటానని హైదరాబాద్‌లోని ఫరా ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నట్లు చెప్పాడు. పారామౌంట్ కాలనీలో ఉంటూ కాలేజీకి వెళుతున్నట్లు చెప్పాడు. వీరిద్దరి పరిచయం స్నేహానికి ఆ తరువాత ప్రేమకు దారితీసింది. తరచూ ఇద్దరూ కలుసుకునేవారు. పెళ్లి చేసుకుంటానని సాలెం చెప్పడంతో ఇద్దరూ పారామౌంట్ కాలనీలోని అతడి ఇంట్లోనే సహజీవనం చేశారు. నాలుగేళ్లుగా సాలెం ఆమె నుంచి పలుదపాలుగా రూ.15 లక్షల వరకు తీసుకున్నాడు. ఈ నెల 6న విమానంలో రియాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పెళ్లి విషయమై చర్చజరిగింది. అయితే తనకు పెళ్లిచేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు. తాను ఇండియాకు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్‌కు వచ్చి నాలుగైదు రోజులపాటు సాలెంతోనే ఉండేదానినని అతను తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాలెం కోసం గాలింపు చేపట్టగా ఇంటికి తాళంవేసి పరారయ్యాడు. నాలుగురోజులుగా హైదరాబాద్‌లోనే తిష్టవేసిన బాధితురాలు సాలెం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చేపట్టింది. నిందితుడు తరచూ బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌కు వస్తాడని తెలియడంతో రెండు రోజులుగా అక్కడే మాటు వేసింది. ఈ నెల 22న సాలెం సదరు పబ్‌కు రావడాన్ని గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సాలెంపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్ నిర్వాకం
-
ఫోన్లో నగ్న వీడియోలు తీసి.. ఎయిర్‌హోస్టెస్ నిర్వాకం
సాక్షి, హైదరాబాద్ : హనీట్రాప్‌తో బాధితుడి నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టిన ఓ ఎయిర్‌హోస్టెస్‌ను, ఆమె భర్తను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాధితుడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేయడంతో పాటుగా తుపాకీతో అతడిని బెదిరించిన కేసులో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కనిష్క అనే మహిళ గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసింది. ఈ క్రమంలో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కనిష్క, ఆమె భర్త విజయ్‌కుమార్ సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించారు. ఇందులో భాగంగా కనిష్క ఓ వ్యాపారవేత్తను ట్రాప్ చేసింది. పరిచయం పెంచుకుని అతడిని రెస్టారెంట్లు, పార్కులకు తీసుకువెళ్లేది. ఈ క్రమంలో శంకర్పల్లి రిసార్ట్‌లో రూం బుక్ చేసిన కనిష్క.. వ్యాపారిని అక్కడికి పిలిపించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న కనిష్క భర్త సహాయంతో అతడికి మత్తు మందు ఇచ్చింది. అనంతరం వారిద్దరు నగ్నంగా ఉన్న దృశ్యాలను విజయ్‌కుమార్ సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత రాసలీలకు సంబంధించిన దృశ్యాలు సదరు వ్యాపారవేత్తకు పంపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కనిష్క దంపతులకు బాధితుడు రూ. 20లక్షలు ఇచ్చాడు. అయినప్పటికీ వాళ్లు అతడిని విడిచిపెట్టలేదు. రూ. కోటి ఇవ్వాలంటూ బాండ్ రాయించుకున్నారు. దీంతో విసుగెత్తిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనిష్క దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కాగా వీరు గతంలో కూడా ఓ మతప్రచారకుడిని ఈ విధంగానే హనీట్రాప్ చేసి లక్షలాది రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం. అంతేగాకుండా మరో ఎన్నారైని కూడా వీరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. -
ఎయిర్‌హోస్టెస్ చేసిన పనికి ప్రశంసలు
వికలాంగులు అంటే మనలో చాలా మందికి ఎంతో చిన్న చూపు. వారికి సాయం చేయాల్సింది పోయి చీదరించుకుంటారు చాలా మంది. ఇక ప్రయాణాల్లో అయితే వేరే చెప్పక్కర్లేదు. సాయం చేయకపోగా సూటి పోటీ మాటలంటూ వారిని బాధపెట్టేవారిని నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఓ వికలాంగురాలి పట్ల ఓ ఎయిర్‌హోస్టెస్ చూపించిన కేర్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంది. ఈ సంఘటన డెల్డా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎండీవర్ విమానంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఆష్లే అనే యువతి ఎండీవర్ విమానంలో ప్రయాణించింది. అయితే ఆమెకు వినికిడి లోపం ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఎయిర్‌హోస్టెస్ జన్నా, ఆష్లేకి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో.. ఓ కాగితం మీద విమానంలో ఉన్న సౌకర్యాల గురించి రాసిచ్చింది. ‘దానిలో హాయ్ ఆష్లే.. ఈ రోజు నేను ఈ ఫ్లైట్ అటెండెంట్‌ని. నీవు కూర్చున్న సీటు పై భాగంలో అనగా నీ తలపైన రెండు బటన్లు ఉన్నాయి. వాటిలో పసుపుపచ్చది లైట్‌ని కంట్రోల్ చేస్తుంది. నీకు నాతో ఏమైనా అవసరం ఉంటే బూడిదరంగులో పెద్దగా ఉన్న బటన్‌ను ప్రెస్ చేస్తే నేను నీ దగ్గరకు వస్తాను. అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. నీ వెనకే ఉన్న ఎక్జిట్ బటన్‌ను ప్రెస్ చేయ్. నీకు ఏ సాయం కావాలన్న నన్ను అడుగు. మొహమాట పడకు’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. దీన్ని ఆష్లే తల్లి తన ట్విటర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. జన్నా మంచిమనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. My daughter who is Deaf took a flight by herself ! The attendant handed her this note on the plane ! Delta makes it amazing! @Delta pic.twitter.com/KQGVBq9uVC — bostonober (@oberlynn13) July 6, 2019 -
ఎయిర్ హోస్టెస్ ముఖంపై వేడి నీళ్లు.. జరిగిందేమిటంటే!
చూడటానికి అందంగా కనిపించే ఎయిర్ హోస్టెస్ తమ విధులు సక్రమంగా నిర్వహించడానికి ఎంత కష్టపడతారో చాలా మందికి తెలియదు. విమానంలోని ప్రయణికులకు ఆహారం అందించడంతో పాటు వారిని జాగ్రత్తగా చూసుకోవడమనేది చిన్న విషయం కాదు. ప్రయాణికులు తమ పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించిన వారు నిస్సహాయులుగా ఉండిపోవాల్సిందే. వారు కోపానికి వచ్చిన, అసభ్య పదజాలం వాడిన కూడా భరించాల్సిందే. వారికి తిరిగి ఎదురుచెప్పే అవకాశం ఉండదు.. ఒకవేళ అలా చేస్తే ఉద్యోగం ఉండదనే భయం. ఇది వారి పరిస్థితి. గత కొంతకాలంగా ఎయిర్ హోస్టెస్‌లతో కొందరు ప్రయాణికులు అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలు బయటికొస్తున్న.. ఇంకా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అటువంటి వారిపై సంబంధిత అధికారులు కానీ, సంస్థలు కానీ కఠిన చర్యలు తీసుకోకపోవడమే అందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట ఎయిర్ ఏషియాకు చెందిన ఫ్లైట్‌లో జరిగిన ఓ భయానక సంఘటనను తాను ఇప్పటికి మరచి పోలేకపోతున్నానని చెబుతున్నారు ఓ ఎయిర్ హోస్టెస్. ఎయిర్ ఏషియాలో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్న నురాలియా మజ్లాన్.. తన సహోద్యోగిపై జరిగిన దాడిని వివరించారు. ‘కొన్నాళ్ల కిందట ఆ ఎయిర్ హోస్టెస్‌తో చైనాకు చెందిన ఓ ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది. అదే ఫ్లైట్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్ పక్కన ఆమెకు కూర్చొనే అవకాశం దక్కలేదు. సీట్ల మార్పుకు ఇతర ప్రయాణికులు అంగీకరించలేదు. దీంతో ఆవేశానికి లోనైన ఆమె ఎయిర్ హోస్టెస్‌పై దాడి చేసింది. ఎయిర్ హోస్టెస్ ముఖంపై న్యూడిల్స్ కప్‌లోని వేడి నీళ్లను విసిరింది. అంతటితో ఆగకుండా ఎయిర్ హోస్టెస్‌పై పెద్దగా కేకలు వేసింది. అసలు ఏ మాత్రం సంబంధం లేని అంశంలో ఎయిర్ హోస్టెస్‌పై తన కోపాన్ని ప్రదర్శించింది. ఎందుకంటే తిరిగి ఆమె ప్రశ్నించలేదనే ధీమాతో. దీనిని గమనించిన ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెని సముదాయించే ప్రయత్నం చేస్తూంటే.. ఆమె మాత్రం ఇంకా తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తర్వాత అక్కడికి చేరుకున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా విమానాన్ని పేల్చి వేస్తానని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత విమానం ల్యాండ్ కాగానే ఆమెను ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించిన ఆమెను మాత్రం సదురు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించార’ని నురాలియా తెలిపారు. తాము యూనిఫామ్ ధరించి నిస్సహాయంగా ఉంటాం కాబట్టే కొందరు ప్రయాణికులు ఇలా దురుసుగా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆ సేవలు..
సాక్షి, న్యూఢిల్లీ : రైళ్లలోనూ విమానాల్లో మాదిరి ఎయిర్‌హోస్టెస్, స్టివార్డ్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారతీయ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. దేశంలో ప్రీమియం ట్రైన్‌గా నిలిచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించే బాధ్యతను రైల్వే శాఖ ఐఆర్సీటీసీకి అప్పగించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇప్పటికే ఎయిర్‌హోస్టెస్, స్టివార్డ్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో ఐఆర్సీటీసీ 34 మంది సుశిక్షితులైన ఎయిర్‌హోస్టెస్, ఫ్లైట్ స్టివార్డ్‌లను వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆరు నెలల పాటు పనిచేసేందుకు నియమించింది. ఈ సేవలు మంచి ఫలితాలను ఇస్తే మిగిలిన రైళ్లలోనూ ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఢిల్లీ -వారణాసి మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రూ 25,000 వేతనంతో ఎయిర్‌హోస్టెస్, ఇతర సిబ్బందిని మెరుగైన సేవలు అందించేందుకు నియమించామని ఐఆర్సీటీసీ ప్రతినిధి సిద్ధార్ధ సింగ్ తెలిపారు. -
చెవి కత్తిరించిన రౌడీ షీటర్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు : ప్రేమను నిరాకరించడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్షతో ఎయిర్‌హోస్టెస్ చెవి కత్తిరించిన రౌడీషీటర్‌ను యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్న అజయ్ కుమార్ అలియాస్ జాకీని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (ప్రేమించలేదని ఎయిర్‌హోస్టెస్ చెవి కట్ చేశాడు) మొదట చైన్ దోపిడీ గత నెలలో ఎయిర్‌హోస్టెస్, కుటుంబసభ్యులు యశవంతపుర పరిధిలో కారులో వెళుతుండగా రౌడీషీటర్ అజయ్‌కుమార్ అలియాస్ జాకీ అడ్డుకుని బెదిరించి దాడి చేశాడు. బంగారు చైన్ లాక్కెళ్లాడు. ఈ ఘటనపై భాదితులు యశవంతపుర పోలీస్‌స్టేషన్‌లో అజయ్‌కుమార్ పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో అతడు అగ్రహోదగ్రుడయ్యాడు. ఈ నెల 12 తేదీ సాయంత్రం 4.30 సమయంలో ఎయిర్‌హోస్టెస్ విధులు ముగించుకుని ఇంటికి క్యాబ్‌లో బయలుదేరింది. హెబ్బాల లైప్ ఓవర్ సిగ్నల్ వద్ద క్యాబ్ నిలపడంతో పొంచి ఉన్న అజయ్‌కుమార్ లోనికి చొరబడి తనను ప్రేమించాలంటూ ఆమెతో గొడవకు దిగాడు. కత్తితో ఆమె చెవిని కట్ చేసి అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితురాలు కొడిగేహల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన యశవంతపుర, కొడిగేహళ్లి పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టి దుండగున్ని పట్టుకున్నారు. ప్రస్తుతం యశవంతపుర పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు బాధిత ఎయిర్‌హోస్టెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఎయిర్‌హోస్టెస్ చెవి కట్ చేశాడు..
సాక్షి, బెంగళూరు: ప్రేమకు నిరాకరించిందని, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న పగతో ఓ రౌడీషీటర్, ఎయిర్‌హోస్టెస్‌పై దాడి చేసి చెవిని కత్తిరించిన ఘటన ఐటీ సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై కొడిగెహళ్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా రౌడీషీటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అజయ్ అలియాస్ జాకీ. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఓ ఎయిర్‌హోస్టెస్ బాధితురాలు. మే 12 తేదీన హెబ్బాల వద్ద క్యాబ్‌లో ఈ దురాగతానికి uమొదటిపేజీ తరువాయి పాల్పడ్డాడు. ప్రేమించాలని వేధింపులు ఎయిర్హొస్టెస్ను ఫిబ్రవరి నుంచి ప్రేమించాలని రౌడీషీటర్ అజయ్ వెంటబడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో తెలిపింది. కుటుంబసభ్యులు రౌడీషీటర్ అజయ్‌ను హెచ్చరించడంతో కోపోద్రిక్తుడైన జాకీ ఎయిర్‌హొస్టెస్ ఇంటిముందు వీరంగం సృష్టించాడు. వారి కారు అద్దాలు, బైక్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఘటనతో రౌడీషీటర్ అజయ్‌పై జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జాకీని పిలిచి హెచ్చరించారు. అప్పటి నుంచి ఎయిర్‌హోస్టెస్‌పై మరింత కసి పెంచుకున్నాడు. కారులో చొరబడి దాడి ఈ నెల 12 తేదీన ఎయిర్‌హోస్టెస్ కెంపేగౌడ విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళుతుండగా, తెలుసుకున్న డీషీటర్ జాకీ హెబ్బాల వద్ద కారును అటకాయించాడు. డ్రైవరును బెదిరించి కారులో ఎక్కి కారును పోనివ్వాలని హెచ్చరించాడు, డ్రైవర్ నిరాకరించడంతో చాకుతో భుజంపై పొడిచాడు. తరువాత తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఎయిర్‌హోస్టెస్‌ను జాకీ బెదిరించగా, ఆమె తిరస్కరించింది. కోపోద్రిక్తుడైన దుండగుడు ఆమె చెవిని చాకుతో కత్తిరించి ఉడాయించాడు. దాడిలో గాయపడిన బాధితురాలు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పై కొడిగేహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. -
కూతురు కోసం 6 టికెట్లు కొన్నాడు..!
లోకంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ఎవరూ ప్రేమించలేరు. అనంతమైన వారి ప్రేమ మన జీవితాలకు ఎంతో అవసరం కూడా. పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు.. తమ జీవితంలో వచ్చే అన్ని పండుగలు, సంతోషాలు, సంబరాలను వారితోనే కలిసి జరుపుకోవాలనుకుంటారు. కానీ నేటి కాలంలో ఉద్యోగాల వల్ల పిల్లలు ఒక చోట.. తల్లిదండ్రులు ఒక చోట ఉండాల్సిన పరిస్థితి. దాంతో సంవత్సరానికి ఒకటి, రెండు పండుగలను మాత్రమే అందరు కలిసి జరుపుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది హాల్ వాఘన్ అనే వ్యక్తికి. కూతురుతో కలిసి పండుగ జరుపుకోవడం కోసం ఆ తండ్రి చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఆ వివరాలు.. పియర్స్ వాఘన్ అనే యువతి డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తుంది. క్రిస్టమస్ సీజన్ దృష్టా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమెకు పండుగ నాడే కాక మరుసటి రోజు కూడా సెలవు దొరకలేదు. దాంతో పండుగ రోజున కూతురుతో ఉండాలనుకున్న హాల్, కూతురు డ్యూటి నిమిత్తం వెళ్లే ప్రతి ప్రాంతానికి తాను వెళ్లాలని భావించాడు. అందుకోసం ఆరు టికెట్లను కొన్నాడు. దాంతో పండుగ రోజున తండ్రి, కూతుళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు. మైక్ లేవి అనే ప్రయాణికుని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చంది. లేవి, హాల్‌తో పాటు అదే విమానంలో కలిసి ప్రయాణించాడు. మాటల సందర్భంలో లేవికి, హాల్ ప్రయాణం గురించి తెలిసింది. పియర్స్ పట్ల ఆమె తండ్రికున్న ప్రేమ చూసి ముగ్ధుడైన లేవి ఈ విషయం గురించి తన ఫేస్బుక్లో షేర్ చేశారు. దాంతో ఈ తండ్రికూతుళ్ల అనురాగం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు కూడా పియర్స్ తండ్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
ఈ ఎయిర్ హోస్టెస్‌కు సోషల్ మీడియా సలాం!
సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ ఎయిర్ హోస్టెస్‌కు హ్యాట్సాఫ్ చెబుతోంది. ఆకలితో గుక్కపట్టిన ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్ హోస్టెస్. దీంతో మొన్నటిదాకా ఎవ్వరికీ తెలియని ఆమె పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ విషయాన్ని ఆమె ‘చాలా తృప్తి పడే పనిచేశాను.. సంతోషంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్ట్‌కు ఏకంగా 35 వేలకు పైగా షేర్లు, 8.1 వేల కామెంట్లు రావడం విశేషం. ఆ పోస్ట్ ఏంటంటే.. ‘ఫ్లైట్‌లో ఆకలితో ఉన్న ఓ పసిపాపకు నా పాలిచ్చాను. రోజువారి పనిలో భాగంగానే ఫ్లైట్‌లో నా పని నేను చేసుకుంటున్నాను. ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. ఇంతలో నాకు ఓ పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో నేను ఆ పసిపాప తల్లి వద్దకు వెళ్లాను. ఆ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నది. ఎందుకమ్మా, పాప ఏడుస్తున్నది.. ఆకలితో ఉన్నట్టుంది.. పాలు పట్టండి అన్నాను. పాపకు పట్టే ఫార్ములా పాలు అయిపోయాయని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఫ్లైట్‌లోని తోటి ప్రయాణీకులంతా ఏమైందని అడుగుతున్నారు. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. విమానంలో మామూలు పాలు తప్పా ఫార్ములా పాలు లేవు. ఆ పాప ఏడుపు, తోడుగా ఆ తల్లిని చూస్తే బాధేసింది. నాకు ఎక్కడో కదిలినట్టు అనిపించింది. నా బిడ్డ గుర్తకొచ్చింది. వెంటనే నా పాలు ఇచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చాలనుకున్నాను. ఆ పాపను నా ఒడిలోకి తీసుకొని పాలు పట్టాను. చాలా ఆకలితో ఉందేమో, పాప ఆతృతగా తాగింది. ఆ పాప ఏడుపు ఆపి, నిద్రపోయాక ఆ తల్లికి అప్పగించాను. ఆ తల్లి నాకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ క్షణాన ఆ బిడ్డ ఆకలి తీర్చే శక్తినిచ్చినందుకు ఆ దేవునికి ధన్యవాదాలు. ఇదేమీ గొప్పపని కాదు. కానీ తృప్తినిచ్చే పని. ఈ రోజు నా ఫ్లయింగ్ కెరీర్లోనే ఓ అద్భుతమైన రోజు.’ అని ఆ ఫొటోను షేర్ చేసింది. -
విమానం నుంచి కిందపడిన ఎయిర్ హోస్టెస్
-
విమానం నుంచి పడిపోయిన ఎయిర్ హోస్టెస్
ముంబై : బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి పడిపోవడంతో ఓ మహిళా ఎయిర్ హోస్టెస్(53)కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఏఐ 864 ఎయిరిండియా విమానంలో పనిచేస్తున్న సదరు ఎయిర్ హోస్టెస్ డోర్‌ను క్లోస్ చేసే క్రమంలో విమానంలోంచి పడిపోయినట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం చికిత్సం కోసం ఆ ఎయిర్ హోస్టెస్‌ను నానావతి ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది. -
ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
శంషాబాద్: ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అజయ్ రెడ్డిగా గుర్తించారు. అజయ్ రెడ్డిపై ఎయిర్‌హోస్టెస్, విమాన పైలట్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన శంషాబాద్‌లోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అజయ్‌ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. -
మాల్యా మూడో పెళ్లిపై నెటిజన్ల జోక్స్
సాక్షి, న్యూఢిల్లీ: ‘భారతీయ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా మూడో పెళ్లి వెనుక కుట్ర దాగి ఉంది. పింకీ లల్వాణీ మాల్యాని పెళ్లి చేసుకున్న తర్వాత.. తమ కుటుంబాన్ని కలిసేందుకు రమ్మని.. అతన్ని బలవంతపెడుతుంది. అప్పుడు మాల్యా భారత్ రాక తప్పదు. అప్పుడు అతన్ని పట్టుకోవచ్చని ఇంటలిజెన్స్ వర్గాలు ప్లాన్ చేశాయి. ఇది హనీ ట్రాప్.. పింకీని ఐబీయే రంగంలోకి దింపింది..’ అంటూ విజయ్ మాల్యా మూడో పెళ్లిపై ఓ నెటిజన్ వేసిన జోక్ ఇది.. ఎయిర్ హోస్టెస్ పింకీ లాల్వాణీని విజయ్ మాల్యా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ మాల్యా మూడో పెళ్లి ట్విటర్లో ట్రెండింగ్‌గా మారిపోయింది. ఆయన వివాహంపై నెటిజన్లు జోకుల మీద జోకులు వేస్తున్నారు. విజయ్ మాల్యా పెళ్లి రోజున ఎస్బీఐ జాతీయ సెలవుదినంగా ప్రకటిస్తుందని ఒక నెటిజన్ చమత్కరించగా.. ఇది మాల్యాను పట్టుకునేందుకు ఐబీ పన్నిన హనీట్రాప్ అని మరొకరు సెటైర్ వేశారు. లండన్‌లో ఒంటరితనం అనుభవించలేక.. మాల్యా మూడో పెళ్లి చేసుకుంటున్నాడని, త్వరలోనే మరో ముగ్గురిని కూడా అతను చేసుకుంటాడని ఇంకొకరు ట్వీట్ చేశారు. There's a conspiracy theory that Vijay Mallya's marriage is actually a honey trap. The girl is planted by intelligence agencies. After marriage she will force Mallya to visit her family in India. And then police will arrest him. 😁🔫 — Nimit (@nimitarora1991) March 28, 2018 Vijay Mallya getting married again because he was feeling a loan. — InGenious (@Bees_Kut) March 28, 2018 *Normal zindagi* Son : Papa ek ladki hai jisse mai shaadi karna chahta hun *Mentos zindagi* Vijay Mallya : beta ek ladki hai jisse mai shaadi karna chahta hun — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 28, 2018 -
క్యూట్ లవ్ ప్రపోజల్.. వైరల్ వీడియో
ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరూ ఓ మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు పుట్టినరోజున, కొందరైతే తాము ఏదైనా సాధించిన రోజు ఇలా చెప్పుకుంటూ పొతే ఏన్నో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓ లవ్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన లవ్ ప్రపోజల్ వైరల్ గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టతలేదు కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఎయిర్ హోస్టెస్ తమ పనుల్లో మునిగిఉండగా ఇంతలో పైలట్ అక్కడకు వచ్చాడు. విమానంలో ఉండే ఫోన్ లో ఏదో విషయం చెప్పగానే ఓ ఎయిర్ హోస్టెస్ అతడివైపు కదిలింది. ఇంతలో అతడు మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె చేతిని పట్టుకుని ప్రేమిస్తున్నట్లు చెప్పి.. జీవితాంతం ఈ చేతిని వదలను అంటూ ఆమె కళ్లలోకి చూసి చెప్పాడు. మొదట ఆమె షాక్ తిన్నా.. వెంటనే పైలట్ ప్రపొజల్ కు ఒకే చెప్పింది. సినిమా సీన్ లా ప్రయాణికులు చూస్తుండగానే పైలట్, తన ప్రియురాలికి రింగ్ తొడిగి తన ప్రేమను గెలిపించుకున్నాడు. అందరూ చప్పట్లుకొడుతుండగా ఈ ప్రేమికులు ముద్దుల్లో మునిగితేలారు. ఆ వెంటనే విమానంలోని ఫోన్ తీసుకుని తన వేలికి ఉంగరాన్ని చూపిస్తూ ఎయిర్ హోస్టెస్ తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. -
ఎయిర్‌హోస్టెస్‌పై దారుణం
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న ఎయిర్‌హోస్టెస్ మీద గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈశాన్య బెంగళూరులో బాగా ధనవంతులు ఉండే ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి కూడా వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో బయటకు వచ్చింది. ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఓ ఎయిర్ హోస్టెస్ హెచ్ఆర్బీఆర్ లే అవుట్‌లోని తన ఇంటినుంచి స్నేహితురాలితో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా, బైకు మీద వచ్చిన ఓ వ్యక్తి వారికి సమీపంగా వచ్చాడు. అతడు మొఖం మొత్తం కవర్ అయ్యే హెల్మెట్ ధరించి, ఎయిర్‌హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆమె ధరించిన టాప్ చింపేశాడు. ఆ దాడిలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలూ గట్టిగా అరవడంతో అతడు అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ కేసులో నిందితులు ఎవరన్నది మాత్రం తెలియలేదు. -
విన్నపాలు వినవలె.. వింతవింతలూ..!
1. హోస్టెస్ లియా 2. హోస్టెస్ హెదర్ పూల్ బస్సుకీ రైలుకీ తేడా ఉంటుంది. రైలుకీ విమానానికీ తేడా ఉంటుంది. అయితే బస్సైనా, రైలైనా, విమానం అయినా.. ప్రయాణికుల్లో మాత్రం తేడా ఉండదు! మనుషులం కదా. స్వభావాలన్నీ ఒకేలా ఉంటాయి. రోడ్డు మీద వెళుతున్నామని ఒకలా, పట్టాలపై జారుతున్నామని ఒకలా, గాల్లో ఎగురుతున్నామని ఒకలా బిహేవ్ చెయ్యం. బస్సులో, రైల్లో హోస్టెస్‌లు ఉండరు కాబట్టి మన వల్ల వారికి ప్రాబ్లం ఉండదు. విమానంలోనే.. పాపం ఎయిర్‌హోస్టెస్‌లు మనతో వేగవలసి వస్తుంది. ‘విన్నపాలు వినవలె వింత వింతలు’ అని అన్నమయ్య పాడినట్టు.. విమాన ప్రయాణికులు ఫ్లైట్‌లో కోరే కోరికలకు ఒక్కోసారి ఎయిర్ హోస్టెస్‌లకు మతిపోతుందట! అలా.. వాళ్లకు ఎదురైన కొన్ని అనుభవాలు ఎలా ఉన్నాయో చూడండి. నీతో కలిసి డ్యాన్స్ చెయ్యొచ్చా? హెదర్ పూల్ యు.ఎస్. ఎయిర్ హోస్టెస్. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక పెద్దాయన విమాన ప్రయాణంలో ఆమెను అడిగాడట.. ‘అమ్మాయ్... నీతో కలిసి నేనిక్కడ డాన్స్ చెయ్యొచ్చా?’ అని! ఇక్కడ.. అంటే ఫ్లయిట్ లోపల ప్రయాణికులు కూర్చునే రెండు వరుసల మధ్య ఖాళీ స్థలంలో! ఆ రిక్వెస్టుకు ఆమె ఒప్పుకుంది. ఆయనతో కలిసి డాన్స్ చేసింది. నిబంధలన ప్రకారం అయితే ఎయిర్‌హోస్టెస్ అలా చేయడానికి లేదు. ఈ సంగతిని హెదర్ పూల్ ‘క్రూయిజింగ్ యాటిట్యూడ్: టేల్స్ ఆఫ్ క్రాష్ప్యాడ్, క్రూ డ్రామా అండ్ క్రేజీ ప్యాజింజర్స్’ అనే పుస్తకంలో రాసుకున్నారు. ఆ పుస్తకం.. కొన్నాళ్ల పాటు న్యూయర్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్‌గా నిలబడింది. ఈ నేప్కిన్ తనకి ఇవ్వగలరా? ‘8సి’లో ఒక అందమైన ప్రయాణికురాలు కూర్చొని ఉంది. ఆ అమ్మాయిని చూసి అదే ఫ్లయిట్లో ఉన్న ఇంకో ప్రయాణికుడు మనసు పారేసుకున్నాడు. ‘ఐ లవ్ యు’ అని ఆమెకు చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పడానికి బిడియపడుతున్నాడు. ఎయిర్ హోస్టెన్ను పిలిచాడు. హోస్టెస్ లియా వోల్పే చిరునవ్వు నవ్వి ‘చెప్పండి.. మీకేం సహాయం చేయగలనో’ అని అడిగింది. నేప్కిన్ మీద తన పేరు, తన ఫోన్ నెంబరు రాసి, 8సి ప్యాసింజర్‌కు ఇవ్వమని కోరాడు! లియా వోల్పే అదే చిరునవ్వుతో, అతడిచ్చిన నేప్కిన్ తీసుకెళ్లి 8సి అమ్మాయికి ఇచ్చింది. నేప్కిన్ అందుకున్న అమ్మాయి బుగ్గల్లో సిగ్గులు, ఇక్కడ ఈ అబ్బాయి కళ్లల్లో మెరుపులు. ఫ్లయిట్ గమ్యానికి చేరాక.. ఆ అమ్మాయి, ఆమెకు ప్రపోజ్ చేసిన అతను ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. పిల్లాడిని పైనే ఉంచేయండి ప్లీజ్! నెత్తిపైన లగేజీ పెట్టుకునే ప్లేస్‌ని విమానాల్లో ‘ఓవర్‌హెడ్ బిన్’ అంటారు. ఫ్లయిట్ సిబ్బంది అంతా రెడీ అయి, లోపలి చెకింగ్స్ అన్నీ అయ్యాక ఫ్లయిట్ పైకి లేవబోతుండగా ఓవర్‌హెడ్ బిన్లో రెండు బ్యాగుల మధ్య ఒత్తేసినట్లున్న నెలల పిల్లాడిని చూసి ఎయిర్‌హెస్టెస్ హెదర్ పూల్ షాక్ తింది! ఆ బిడ్డను జాగ్రత్తగా రెండు చేతులతో కిందికి దింపి, తల్లి చేతుల్లో పెట్టింది. కానీ ఆ తల్లి.. ‘బేబీకి అక్కడ కంఫర్ట్‌గా ఉంది, అక్కడే ఉంచేయండి’ అని కోరింది. హెదర్ పూల్‌కి అది రెండో షాక్! ‘‘లేదు.. లేదు.. ఫ్లయిట్ నిబంధనలు ఒప్పుకోవు’ అని ఆ తల్లిని ఒప్పించడానికి పూల్ నానా తిప్పలు పడింది. మీ షూజ్ మెయిల్ చెయ్యండి..! ఏ వృత్తిలో ఉన్న వాళ్లు ఆ వృత్తిలోని సూక్ష్మమైన విషయాలను ఇట్టే గ్రహించేస్తుంటారు. ఓసారి ఫ్లయిట్లో ఓ ప్యాసింజర్.. ఎయిర్‌హోస్టెస్ హెదర్ పూల్ షూజ్‌ని గమనించి చెప్పాడు, ‘‘మీ షూజ్ రిపేరుకు వచ్చాయి. వాటిని ఓ బాక్స్‌లో పెట్టి నాకు మెయిల్ చెయ్యండి’ అని! హెదర్ పూల్ ఆశ్చర్యపోయి, తన షూజ్ చూసుకుంది. నిజమే. కాస్త దెబ్బ తిన్నాయి. షూజ్‌ని మెయిల్ చెయ్యమని చెప్పిన ఆ ప్రయాణికుడు ఓ ఫుట్‌వేర్ కంపెనీ ఓనర్. ‘ఇ–బే’లో ఎయిర్ హోస్టెస్‌లు వాడేసిన షూజ్కి మంచి ధర వస్తుంది. ఈ అడ్రెస్‌కి మీ షూజ్’ పంపండి అని అతడు తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్లాడు. మాబాధనుఅర్థంచేసుకోగలరా? ఓసారి విమానంలోకి హనీమూన్ జంట ఎక్కింది. ఆ కొత్త కపుల్ ఒకళ్ల చేతులను ఒకళ్లు క్షణమైనా వదిలిపెట్టి కూర్చోలేకపోతున్నారు. ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. మాటిమాటికీ హగ్ చేసుకుంటున్నారు. హోస్టెస్ లియా వోల్పే, వాళ్లను దాటుకుంటూ వెళుతుంటే ఆమెను ఆపి.. ‘మేము.. మైల్–హై క్లబ్ లో జాయిన్ కావచ్చా?’ అని అడిగారు. దీనర్థం ఏంటంటే.. కొన్ని నిమిషాల సెక్స్‌కి మాకు ఏకాంతం కల్పించగలరా అని! (విమానంలో ప్రయాణిస్తూనే సెక్సువల్ ఇంటర్కోర్సులో పాల్గొనడాన్ని ‘మైల్–హై’ అంటారు). పాపం మన హోస్టెస్.. ఆ దంపతుల బాధను అర్థం చేసుకున్నారు. తన బాధలేవో తను పడి వారికి అక్కడే ఓ మూల.. కొన్ని నిమిషాల పాటు ఏకాంతం కల్పించగలిగారు. ఒక్కటికూడాకాల్చలేదుతెలుసా?! విమానం ఎక్కే ప్రయాణికులు ఎవరైనా మొదట తెలుసుకోవలసింది.. విమానం లోపల సిగరెట్ తాగడానికి ఉండదని. కానీ ఓ ప్రయాణికుడైతే కాళ్లా వేళ్ల పడినంతగా హెదర్ పూల్‌ను ప్రాధేయపడ్డాడు. ‘సిగరెట్ తాగకుండా ఐదు గంటలు ఫ్లయిట్లో కూర్చొవడం నా వల్ల కావడం లేదు. నాలుక పీకేస్తోంది. ల్యావెట్రీలో కూర్చొని ఒక్క సిగరెట్ తాగొస్తాను ప్లీజ్’ అని అడిగాడు. డోర్ దగ్గర అతడు యాష్ ట్రే చూశాడట. అందుకనే అడిగాడు. కానీ ఆ ట్రే.. సిగరెట్ తాగాలనుకున్న వాళ్ల కోసం కాదు. దొంగచాటుగా సిగరెట్ తాగుతూ పట్టుబడిన వాళ్ల ‘పీకల్ని’ లాగి అందులో పడేయడానికి. ట్రాష్ క్యాన్‌లో ఆ సిగరెట్ పీకను వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని యాష్ ట్రే పెడతారు. ఇక్కడ కోడిగుడ్లు దొరుకుతాయా? ఒక ప్రయాణికురాలు కోడిగుడ్ల కోసం పట్టుపట్టింది. ‘సారీ మ్యామ్. స్టాక్ అయిపోయింది’ అని చెప్పిన పూల్ మీద గుడ్లు ఉరిమింది. ‘నా వెకేషనంతా పాడు చేశావ్ పిల్లా’ అని అర్థం వచ్చేలా తిట్ల దండకం ఎత్తుకుంది. బిజినెస్ క్లాస్‌లో గుడ్లు లేకపోవడం ఏంటని పెద్దగా అరిచేసింది. ‘‘పిల్లలకు గుడ్లు తినిపించడానికి లేదు. ఎంత పాపిష్టిదాన్ని, ఫ్లయిట్లో ఉంటాయిలెమ్మని గుడ్డిగా ఎక్కేశాను’’ అని కూడా ఆమె బాధపడిందట! పూల్ కూడా ఆ మాటకు ఫీల్ అయింది. కానీ తను మాత్రం ఏం చేస్తుంది? కోడిగుడ్ల కోసం అప్పటికప్పుడు ఫ్లయిట్‌ని ల్యాండ్ చేయించలేదు కదా. ఒక ఫ్లాజుంటివ్వమ్మో! డెంటల్ ఫ్లాస్ అంటే.. పళ్లను క్లీన్ చేసుకోడానికి వాడే సన్నటి దారం. మనం పుల్లలు పెట్టి పళ్లను గిల్లేస్తుంటాం కానీ, విదేశీయులలో చాలామందికి ఫ్లాస్ అలవాటు. ఏ రేంజ్ అలవాటంటే... పక్కవాళ్లను ‘ఓ ఫ్లాస్ ఉంటే ఇద్దురూ’ అని అడిగేంత అలవాటు. అప్పుడప్పుడు విమాన ప్రయాణికులు కూడా కొందరు.. ‘ఒక ఫ్లాజుంటివ్వమ్మో’ అని ఎయిర్ హోస్టెస్‌ని రిక్వెస్ట్ చేస్తుంటారట! పూల్‌కి కూడా ఇలాంటి అనుభవాలు ఒకటీ అరా ఉన్నాయి.‘వింతగా ఉంటుంది.. వాళ్లు మనల్ని ఫ్లాజ్ అడగడం, మనం వెళ్లి వాళ్ల కోసం ఇంకొకరిని ఫ్లాజ్ అడగడం’ అని నవ్వుతూ అంటారు పూల్. డాక్టర్ పెప్పర్ అండ్ రెడ్ వైన్ డాక్టర్ పెప్పర్ అనేది అమెరికన్ సాఫ్ట్ డ్రింక్. ఇక రెడ్ వైన్ అంటే తెలిసిందే. చిక్కటి ద్రాక్ష రసం. (మన భాషలో ద్రాక్ష సారాయి). ఈ రెండిటినీ మిక్స్ చేసి ఇమ్మని అడుగుతుంటారట కొంతమంది ప్రయాణికులు! అదేం కాంబినేషనో మరి. తర్వాత్తర్వాత ఎయిర్ హోస్టెస్ పూల్‌కి అర్థమైందట.. ఈ కాక్టైల్ ఫేమస్ అని. అన్నట్టు ఈ కాక్టైల్కో ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. కానీ లైకులే.. తక్కువ. ఇదేమంత వింత రిక్వెస్టు కాదు కానీ, కొన్నిసార్లు.. కాక్టైల్ సరిగా మిక్స్ అవలేదని ఎయిర్ హోస్టెస్‌ను తిడతారట! ప్లే గ్రౌండ్ లేకపోవడం ఏంటి?! ఒకావిడ పిల్లలతో ఫ్లయిట్ ఎక్కారు. ఫ్లయిట్ టేకాఫ్ అయింది. పిల్లలు ఆటలు మొదలు పెట్టారు. అన్నీ అవుట్ డోర్ గేమ్సే! ఆ తల్లి.. మన హోస్టెస్ హెదర్ పూల్‌ను పిలిచింది. ‘ఆట స్థలం ఎక్కడ?’ అని అడిగింది! పూల్ వేరే వైపు చూస్తూ నవ్వు ఆపుకుంది. ‘విమానంలో ఆట స్థలం ఉండదు మ్యామ్’ అని చెప్పింది. ఆ తల్లి చికాకు పడింది. ‘ఇంత పెద్ద విమానంలో ప్లే గ్రౌండ్ లేకపోవడం ఏమిటి?’ అని విసుక్కుంది. ‘ఇకనైనా ప్లే ఏరియాకు ప్లేన్‌లో కొంత ప్లేస్ ఉంచండి’ అని సలహా ఇచ్చింది. పూల్ ఏమంటుంది? ‘సరే మ్యామ్’ అంది. నాకేదోఅవుతోంది!అక్సిజన్తక్కువైందా? ఫ్లయిట్ టేకాఫ్ అవగానే ఓ పెద్దాయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ‘‘ఇక్కడేంటో తేడాగా ఉందమ్మాయ్. ఈ ప్రయాణమంతా నేనిలా ఆక్సిజన్ మాస్క్ పెట్టునే ఉండాలా?’’ అని వోల్పేని అడిగారు. ‘అవసరం లేదండీ.. ఎమర్జెన్సీలో ఎలాగూ ఫ్లయిట్లో అదనపు ఆక్సిజన్ ఉంటుంది’’ అని వోల్పే చెప్పింది. అయినప్పటికీ ప్రయాణమంతా ఆయన బ్రీథింగ్ ఎక్సర్సైజ్లు చేస్తున్నట్టుగా ఛాతీ నిండా గాలి పీల్చి వదులుతూనే ఉన్నారు. ఫస్ట్ టైమ్ ఫ్లయిట్ జర్నీలో కొందరికి ఇలా ఉండడం సహజమేనని వోల్పే నవ్వుతూ ప్రయాణికులకు ధైర్యం చెప్పేవారట. నాదినేనివ్వను..నీదినాక్కావాలి! ‘చార్జర్ ఒకసారి ఇస్తారా?’ అని అడిగేవారు ఎక్కడైనా ఉంటారు. విమానంలోనూ ఉంటారు. కానీ తన చార్జర్ అడిగితే మాత్రం చిరాగ్గా ఉంటుందట పూల్‌కి. ఎవరికి ఇచ్చానో గుర్తు తెచ్చుకుని వెళ్లి అడిగి తెచ్చుకునేంత టైమ్ ఉండదని ఆమె బాధ. నిజమే. హోస్టెస్ ఉన్నది విమాన సేవలు అందించడానికే కానీ, వ్యక్తిగతంగా సేవలు అందించడానికి కాదు కదా. ఒకవేళ అందించాలన్నా ప్రతిసారీ అలా కుదరదు. ఈ విషయం గ్రహించలేక కొంతమంది హోస్టెస్‌ల మీద మండిపడుతుంటారు. నిందలు వేస్తుంటారు. ఎవరి వస్తువులూ వారు ఇవ్వరు కానీ, అప్పుడప్పుడు తన జంప్ సీట్ (వేరుగా ఉండే సీటు)లో ఉండే ఎగ్ మెక్మఫిన్స్ మాయం అవుతుంటాయట! ఏమిటో ఈ మనుషులు అని నవ్వుతారు పూల్. -
ఎయిర్‌హోస్టెస్ నుంచి హీరోయిన్గా...
రాజమహేంద్రవరం : తెలుగు చిత్రపరిశ్రమలో తనకు గుర్తింపు వచ్చిందని హీరోయిన్ రిచా పనాయ్ అన్నారు. సునీల్ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా పాట విడుదల సందర్భంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘మా సొంతూరు లక్నో. చదువుకునే సమయంలో సినిమాలపై ఆసక్తి కలిగింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్ పనిచేసేదాన్ని. మనసులో ఉన్న కోరికతో సినిమాల్లో ప్రయత్నం చేశా. మలయాళం సినిమా ‘వాడమల్లి’లో తొలి అవకాశం వచ్చింది. తెలుగులో తొలిసారిగా అల్లరి నరేష్ హీరోగా నటించిన యముడికి మొగుడు చిత్రంలో నటించాను. ఆ తర్వాత చందమామ కథలు, మనసును మాయ చేయకే ఉన్నాయి. లవకుశ విడుదలవ్వాలి. డబ్బు అనేది అందరికీ అవసరమే. కాని మంచి పాత్ర వస్తే దానిమాట పక్కనపెడతా. ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలో మంచిపాత్ర చేశాను. డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. గుర్తింపు వచ్చే ఏ పాత్ర అయినా చేస్తా. నంబర్ వన్ హీరోయిన్గా స్థిరపడతా. ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ విలేకరుల సమావేశంలో హీరో సునీల్ అశోకా థియేటర్లో పాట విడుదల తాను నటించిన సినిమాలన్నింటిలో ‘ఈడు గోల్డ్ ఎహే’ ఎంతో ఇష్టపడి చేశానని హీరో సునీల్ అన్నారు. ఆ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా రాజమహేంద్రవరంలోని షెల్టాన్ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సినిమా యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మర్యాద రామన్న తర్వాత అంతటి మంచి సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ అన్నారు. హాస్యం, థ్రిల్, క్రైంతో కూడుకుని కుటుంబ మొత్తాన్ని ఆహ్లాదపరిచేలా కథ ఉంటుందన్నారు. హీరోయిన్ రిచాపనాయ్ మాట్లాడుతూ ఈ చిత్రంతో తనకు పేరు, గుర్తింపు వస్తుందన్నారు. దర్శకుడు వీరు పోట్ల మాట్లాడుతూ రూ.10 కోట్లతో ఈ సినిమా తీశామని, పెద్ద సినిమాల కోవలోనే విలువలు ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించామన్నారు. సహాయ నటుడు బెనర్జీ, విలన్ చరణ్ మాట్లాడారు. అనంతరం రాత్రి అశోక థియేటర్లో మూడో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా హీరో సునీల్‌ను వింటేజ్ క్రియేషన్స్ నిర్వాహకుడు జేకే రామకృష్ణ పూలమాలలతో అభినందించారు. -
ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం
అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిపై క్యాబ్ డ్రైవర్ కన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం రాజేంద్రనగర్ ప్రాంతంలో ఘటన సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై వెళుతున్న ఎయిర్‌హోస్టెస్ పై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్లొద్దంటూ మభ్యపెట్టాడు.. కావాల్సిన చోటికి తీసుకెళ్లి వదిలిపెడతానంటూ నమ్మించి క్యాబ్ ఎక్కించుకున్నాడు.. ఆనక ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు.. గట్టిగా కేకలు వేయడంతో చివరికి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు.. ఆ దుర్మార్గుడిని నిలువరించే యత్నంలో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఆమెను రక్షించారు. హైదరాబాద్ శివార్లలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యపీహోమ్స్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (24) ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఆమెకు మందులు అవసరం ఉండడంతో పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 216 ప్రాంతానికి వచ్చింది. అక్కడ షాపులన్నీ మూసి ఉండడంతో రోడ్డు పక్కన నిలబడి ఉండగా... ఓ తెలుపు రంగు క్యాబ్ వచ్చి ఆమె వద్ద ఆగింది. దాని డ్రైవర్ ఆ యువతి వద్దకు వచ్చి ఇక్కడ ఎందుకు నిల్చున్నావని ప్రశ్నించాడు. ఆ ప్రాంతం మంచిది కాదని, ఒంటరిగా ఉండడం ప్రమాదకరమన్నాడు. ‘మీ ఇంటిదగ్గర వదిలేస్తా రమ్మ’ని నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నాడు. వేగంగా రాజేంద్రనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఆ యువతి గట్టిగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. అయినా ఆమె నిలువరించడం, గట్టిగా కేకలు వేస్తుండడంతో... ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. వెంటనే ఆ యువతి రోడ్డుపైకి వచ్చి సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారయత్నం, దోపిడీ కింద కేసులు నమోదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితుడిని కోసం గాలింపు చేపట్టారు. శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి ఆధ్వర్యంలోని ఈ బృందాలు రాజేంద్రనగర్, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాయి. అందులోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. -
కెరీర్ కౌన్సెలింగ్
I want to become an air hostess. Please tell me about the institutes that provide the training? - Rupa, Hyderabad ⇒ The basic requirement to pursue career as Air hostess is, formal training in the specific area. Then there are some age, height and weight restrictions. The candidate should have normal eye sight and be proficient in English and Hindi. Proficiency in foreign languages is an added advantage. The recruitment of air hostesses involves stages like written test and interview. The following are the details of some institutes offering air hostess training: ⇒ Fly High Institutes of Air Hostess and Hospitality, Sri Nagar Colony, hyderabd offers six-months diploma in Air hostess training. The eligibility criteria are +2 as academic qualification and age between 18-24. The admission is based on performance at personal interview. ⇒ Avalon Academy, Masab Tank, hyderabd. offers Diploma in Cabin Crew. The eligibility criterion is +2. - T. Muralidharan T.M.I. Network -
కీచక పైలట్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కమాండర్ స్థాయి పైలట్‌ను స్పైస్‌జెట్ సంస్థ శనివారం విధుల నుంచి తొలగించింది. ఫిబ్రవరి 28న కోల్‌కతా-బ్యాంకాక్ విమానంలోని కమాండర్.. ఎయిర్ హోస్టెస్‌ను కాక్‌పిట్‌లో కూర్చోవాలని వేధించాడు. అంతేకాకుండా తన సహచర పైలట్‌ను తాను చెప్పేంత వరకు లోనికి రావొద్దని బెదిరించాడు. క్యాబిన్ సిబ్బంది పట్ల దురుసుగా, అసభ్య పదజాలంతో మాట్లాడాడు. మరుసటిరోజు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన స్పైస్‌జెట్ కమిటీ.. కమాండర్‌ను దోషిగా తేల్చింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం పైలట్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. -
కాక్‌పిట్‌లో పైలట్ పోకిరీ వేషాలు
విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎయిర్ హోస్టెస్‌ని తన పక్కన కూర్చోమన్న ఓ పైలట్ ఉద్యోగం ఊడింది. కాక్ పిట్లో చీఫ్ ఎయిర్ హోస్టెస్‌ని తన పక్కన కూర్చోమన్నందుకు, స్పైస్ జెట్ పైలట్‌ని విధుల్లోంచి తొలగించింది. ఫిబ్రవరి 28న బోయింగ్ 737 విమానం కోల్‌కతా నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానం తిరుగు ప్రయాణంలోనూ పైలట్ ఎయిర్ హోస్టస్‌ను వేధించడం ఆపలేదు. అదే సమయంలో కో-పైలెట్ టాయిలెట్‌కు వెళ్లాడు. అతనికి కాక్ పిట్లోకి చాలా సేపటి వరకు లోపలికి రావడానికి పైలెట్ అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటనపై ఎయిర్ హోస్టస్ ఫిర్యాదు మేరకు స్పైస్ జెట్ విచారణ ప్రారంభించింది. అంతే కాకుండా తనతో అసభ్యకరంగా పదజాలంతో పైలెట్ దూషించాడని ఎయిర్ హోస్టస్ ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై సిబ్బంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత సదరు పైలెట్‌ను స్పైస్ జెట్ సస్పెండ్ చేసింది. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత దోషిగా తేలితే పైలెట్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. -
ఎయిర్ ఇండియాపై ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు
♦ విధులు కేటాయించలేదని ఎస్టీ కమిషన్‌కు ఆవేదన ♦ 2008 నుంచి వేతనం ఇవ్వలేదని ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: తనకు అకారణంగా ఎయిర్ హోస్టెస్‌గా విధులు కేటాయించకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని ఎయిర్ ఇండియా ఉద్యోగిని బి.ఝాన్సీరాణి సంబంధిత సంస్థపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా.. ‘నేను షెడ్యూలు తెగకు చెందిన కోయ సామాజిక వర్గానికి చెందిన మహిళను. భద్రాచలం ఏజెన్సీ నుంచి వచ్చి ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివసిస్తున్నా. నేను ఎయిర్ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశా. దాదాపు 27 ఏళ్ల పాటు పనిచేసిన నాకు ఎయిర్ హోస్టెస్‌గా విధులు కేటాయించడం మానేశారు. 2008 నుంచి నాకు ఇప్పటి వరకు వేతనం చెల్లించలేదు. వైద్య ప్రయోజనాలు కల్పించలేదు. ఇప్పటివరకు అటు పీఎఫ్ గానీ, గ్రాట్యుటీ చెల్లింపు విషయంగానీ తేల్చలేదు. నాపై ఆధారపడిన నా ఇద్దరు కూతుళ్లకు నేను చదువుకునేందుకు డబ్బులు చెల్లించలేకపోతున్నా. ఇప్పటివరకు నా కుటుంబాన్ని పోషించుకునేందుకు నానాకష్టాలు పడ్డా. ఈ వయసులో నేను కొత్తగా ఉద్యోగాన్ని పొందలేక పోతున్నా. అందువల్ల నాకు రావాల్సిన వేతనం ఇప్పించాలని వేడుకుంటున్నా. నన్ను ఇన్నాళ్లు వేధించినందుకు నాకు పరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నా. నా తోటి ఉద్యోగులకు ఇచ్చిన తరహాలో అన్ని రకాల పదోన్నతులతో సహా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నా. నాకు, నాకుటుంబానికి మనోవేదన కలిగించినందుకు రూ. 5 కోట్ల పరిహారం ఇప్పించాలని ప్రార్థిస్తున్నా.. ’ అని ఆమె తన ఫిర్యాదులో ఎస్టీ కమిషన్‌కు వేడుకున్నారు. -
మహిళ ఎంతెత్తుకైనా...ఎందాకైనా....
సాధారణంగా విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌లు మాత్రమే మహిళలు ఉంటారు. కానీ, అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా లేడీస్ స్పెషల్ విమానాన్ని నడిపింది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదుగానీ.. ఈ విమానంలో మొత్తం అందరూ మహిళలే. కాక్‌పిట్ క్రూ.. కేబిన్ క్రూ.. చెక్ ఇన్ స్టాఫ్.. వైద్య బృందం.. కస్టమర్ కేర్ సిబ్బంది.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీమ్.. గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్.. ఇలా అన్ని విభాగాలను అతివలే నిర్వర్తించడం ఈ ఫ్లైట్ స్పెషాలిటీ. అంతేకాదు.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరానికి అంటే సుమారు 14 వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేసి రికార్డు సృష్టించింది. ఈ నెల 6న ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ నాన్‌స్టాప్ ఫ్లైట్ గమ్యస్థానం చేరేందుకు సుమారు 17 గంటల సమయం పట్టింది. ఎయిరిండియా సీఎండీ అశ్వినీ లోహనీ దీనిని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. మహిళా సిబ్బందితో సుదూర ప్రయాణం చేసిన విమానంగా ఇది రికార్డు సృష్టించిందన్నారు. - న్యూఢిల్లీ -
ఎయిర్ హోస్టెస్‌లు తొలగింపు
చెన్నై : స్థూలకాయం కలిగిన విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్‌లకు ఎయిరిండియా సంస్థ ఉద్వాసన పలికింది. ఎయిర్ హోస్టెస్లుగా పనిచేసేవారికి అందం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ప్రధానంగా స్థూలకాయంగా ఉండరాదు. ఎయిరిండియా విమాన సంస్థలో పనిచేస్తున్న 125 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. స్థూలకాయం కలిగిన 600 మంది విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్లను గుర్తించారు. వ్యాయామం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఇచ్చారు. వ్యాయామం చేసినా శరీర బరువు తగ్గని 125 మందికి ఎయిరిండియా విమాన సంస్థ ఉద్వాసన పలికింది. వీరికి 18 నెలల గడువు ఇచ్చామని, అయినా వారు స్థూలకాయాన్ని తగ్గించుకోలేకపోయారని, దీంతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ఆ సంస్థ తెలిపింది. -
ఎయిర్ హోస్టెస్‌ను వీడియో తీసి..
హైదరాబాద్: విమానంలో బుద్ధిగా కూర్చుని రాకుండా ఓ యువకుడు ఎయిర్‌హోస్టెస్‌ను వీడియో తీసి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన ప్రణవ్ అనే యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించాడు. విమానంలో ఆయన అత్యుత్సాహం చూపి ఎయిర్‌హోస్టెస్‌ను వీడియో తీశాడు. ఈ ఘటనపై ఎయిర్‌హోస్టెస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సుష్మా జీ.. నా సోదరిని రక్షించండి
తక్షణం స్పందించిన సుష్మా... యువతికి వీడిన చెర దుబాయ్: ఆమె ఓ ఎయిర్ హోస్టెస్. మంచి కెరీర్ కోసమని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లింది. అయితే ఉద్యోగాల పేరిట తీసుకెళ్లిన ఏజెంట్లు ఆమెనక్కడ మరికొందరితో కలిసి నిర్బంధించారు. ఉద్యోగరీత్యా ఖతార్‌లో ఉంటున్న ఆమె సోదరుడు దేవ్ తంబోలికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఈనెల 21న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. ‘సుష్మా జీ... నా సోదరి ఈనెల 14న యూఏఈకి వెళ్లింది. ఏజెంట్లు ఆమెనక్కడ నిర్బంధించారు. కొడుతున్నారట కూడా... దయచేసి సహాయం చేయండి’ అని కోరాడు. దాంతో సుష్మా స్పందించి యూఏఈలోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని రంగంలోకి దింపారు. స్థానిక పోలీసులు, ప్రవాస భారతీయుల సహాయంతో మొత్తం మీద 33 ఏళ్ల యువతిని రక్షించారు. ఈ విషయాన్ని సుష్మా వెంటనే తంబోలికి ట్వీట్ ద్వారా తెలిపారు. రాయబార కార్యాలయం నడిపే శరణాలయానికి తరలించామని, ఆమె క్షేమంగా ఉందని తెలిపారు. -
వివాదంలో మరో ఎంపీ
న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన ఎంపి పప్పూ యాదవ్ విమాన సిబ్బందిని వేధించిన వివాదంలో ఇరుక్కున్నారు. పాట్నా నుండి ఢిల్లీకి బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మిగిలిన ఆహార పదార్థాలను కింద వేయొద్దు అని ఎంపీని వారించినందుకు తనపై అన్యాయంగా విరుచుకు పడ్డారని, వేధించారని ఎయిర్ హోస్టెస్ ఆరోపించారు. దీనిని జెట్ ఇండియా వర్గాలు వర్గాలు ధృవీకరించాయి. విమానం ఢిల్లీలో దిగేముందు రక్షణ కావాలని కెప్టెన్ తమకు సమాచారం అందించారని తెలిపాయి. ఓ ప్రయాణీకుడు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని..సెక్యూరిటీ సాయం కావాలనే కోరడంతో అప్రమత్తమైనట్లు వెల్లడించాయి. అయితే ఈ వివాదంలో ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. కాగా ఈ ఆరోపణలను ఎంపీ పప్పూ యాదవ్ ఖండించారు. ఇదంతా తనపై రాజకీయంగా జరుగుతున్న కుట్ర అన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రాష్ట్రీయ జనతాదళ్ గత మే నెలలో పప్పూని పార్టీని తొలగించింది. -
ఆకాశయానంలో పేదరాలు.
-
రీతూను చంపింది భర్తే
వీడిన మాజీ ఎయిర్ హోస్టెస్ హత్య కేసు మిస్టరీ నేరాన్ని అంగీకరించిన ఆమె భర్త సచిన్ హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ పరిధి ఇందిరానగర్‌కు చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూను ఆమె భర్తే అంత మొందించాడు. ఆమె ముఖంపై దిండుతో అదిమి ప్రాణాలు తీసినట్లు రీతూ భర్త సచిన్ ఉప్పల్ నేరాన్ని అంగీకరించాడు. కేసు వివరాలను గురువారం ఉప్పల్ ఏసీపీ కార్యాలయంలో మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. రీతూ ఈ నెల 19 న హత్యకు గురైన సంగతి విదితమే. భార్య మీద అనుమానంతో పాటు తనను స్నేహితుని ముందు అవమానించిందన్న ఆగ్రహంతో ఆమెను భర్తే అంతమొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మద్యం తాగి..స్నేహితునితో వచ్చి.. ఈ నెల 19వ తేదీ రాత్రి సచిన్ తన స్నేహితుడు కోటగిరి రాకేశ్‌తో కలిసి హిమాయత్ నగర్‌లోని ఓ బార్లో మద్యం తాగాక 10.30 గంటల సమయంలో అతన్ని తీసుకొని తమ ప్లాట్‌కు వచ్చాడు. అలా రావడాన్ని భార్య రీతూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని పట్టించుకోని సచిన్ ఆమె టీవి చూస్తుండగా రిమోట్ తీసుకొని స్నేహితునితో కలిసి చూసేందుకని క్రికెట్ మ్యాచ్ పెట్టాడు. ఇది వారి మధ్య తొలుత వాగ్వాదానికి దారి తీసింది. అంతే కాకుండా తనకూ, తన స్నేహితునికీ ఇంట్లో ఉన్న బిర్యానీ వడ్డించమని కోరాడు. రీతూ అంగీకరించక పోవడంతో అవమానంగా భావించి స్నేహితుని సమక్షంలోనే ఆమెపై చేయి చేసుకున్నాడు. దాన్ని అడ్డుకునేందుకు రాకేశ్ ప్రయత్నించడంతో అతన్ని ఇంట్లోనుంచి బయటకు గెంటి తలుపు వేసేశాడు. అనంతరం రీతూను మంచంపైకి నెట్టి ఆమె ముఖంపై దిండుతో అదిమి హతమార్చాడు. ఈ సంఘటనను దాచి ఉంచి భార్య తల్లితండ్రులకు సచిన్ ఫోన్‌చేసి రీతూ ఆరోగ్యస్థితి సీరియస్‌గా ఉందని తెలియజేశాడు. వారు అక్కడికి చేరువలోనే ఉన్న తమ మరో కుమార్తె ఇంటివద్ద ఉంటున్నారు. వారు వెంటనే వచ్చి చూసేసరికి రీతూ మంచంపై మరణించి ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అదే రోజు నిందితుడ్ని కస్టడీలోకి తీసుకొని విచారించడంతో కేసు గుట్టు వీడింది. ఈ మేరకు పోలీసులు గురువారం సచిన్ ఉప్పల్‌ను రిమాండ్‌కు తరలించారు. నిందితులుగా ఉన్న అతని తండ్రి రమేష్ ఉప్పల్, తల్లి సీమా ఉప్పల్, సోదరి నితిన్ ఉప్పల్‌పై కూడా కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సచిన్, అతని స్నేహితుడు రాకేశ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా తమ కుమార్తె మరణానికి కారకుడైన సచిన్‌కు ఉరిశిక్ష వేస్తేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని రీతూ తల్లిదండ్రులు తెలిపారు.కాగా సచిన్ దంపతుల ఆరునెలల కొడుకు తల్లి మంచంపై ఆడుకుంటున్న సమయంలోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి పలువురు కదిలిపోయారు. రీ పోస్టుమార్టం నిర్వహించాం: ఏసీపీ రీతూ హత్య కేసులో రెండో అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రీ-పోస్టుమార్టం కూడా జరిపించామని ఏసీపీ రవిచందన్‌రెడ్డి తెలిపారు. కాగా సచిన్‌కు కొడుకు విషయంలో భార్యపై అనుమానం ఉండేదనీ దీనికోసం డీఎన్ఏ పరీక్ష కోసం ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఈ విషయమై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదనీ ఈ కోణంలోనూ విచారణ చేపడతామని వెల్లడించారు. రీతు హత్య కేసులో వెంటనే స్పందించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి, పోలీస్ సిబ్బందికి తగిన పారితోషికం అందచేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
అవమానించిందనే రీతూను చంపేశా..
-
రీతూ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం
హైదరాబాద్ : భర్త చేతిలో దారుణ హత్యకు గురైన మాజీ ఎయిర్‌హోస్టెస్ రీతూ మృతదేహానికి వైద్యులు రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో 11 మంది సభ్యుల వైద్యుల బృందం మంగళవారం రీ పోస్ట్‌మార్టం చేశారు. మరోవైపు అల్లుడు సచిన్‌నే తన కుమార్తెను హత్య చేసినట్లు రీతూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా భర్త ఇంట్లో మద్యం సేవించడంపై రీతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో మద్యం మత్తులో ఉన్న సచిన్ బీరు సీసాతో రీతు తలపై బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడ్డ సచిన్ స్నేహితులు, అపార్ట్మెంట్ వాచ్‌మన్ సహకారంతో రామంతాపూర్‌లోని మాట్రిక్ అస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అయితే అప్పటికే రీతు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో... కంగారుపడి ఏమీ ఎరగనట్టుగా రీతు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి బెడ్రూంలో పడేసి... ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. -
ఎయిర్ హోస్టెస్ హత్య?
-
ఎయిర్ హోస్టెస్ హత్య?
అనుమానంతో భర్త వేధింపులు ఇటీవలే ఉద్యోగం మాన్పించిన వైనం తల్లిదండ్రులు సర్దిచెప్పి వెళ్లిన కొద్ది గంటలకే విషాదం హైదరాబాద్: ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన ఓ మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. మనస్పర్థలు రావడంతో భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు సముదాయించి వెళ్లిన కొద్ది గంటలకే ఈ ఘోరం చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ ఆటోనగర్‌కు చెందిన రీతు(26) ఆరేళ్ల నుంచి జెట్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. ఉప్పల్‌కు చెందిన సచిన్ (28)తో రీతుకు 2013 నవంబర్‌లో వివాహమైంది. పెళై్లన రెండు నెలల తర్వాత నుంచి అత్తమామలు, భర్త అదనపు కట్నం కోసం రీతును శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఆమెను ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం కూడా మాన్పించారు. కాగా, గత ఏడాది నవంబర్‌లో రీతు పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయినా సచిన్‌లో మార్పు రాలేదు. బాబు తనకు పుట్టలేదని మరింతగా ఆమెను వేధించేవాడు. దీంతో సచిన్ వేధింపుల గురించి రీతు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆదివారం ఉదయం రామంతాపూర్‌లోని సచిన్ ఇంటికి వచ్చి సముదాయించి సాయంత్రం వెళ్లిపోయారు. వీరు వెళ్లిన తర్వాత రాత్రి 11.30కి సచిన్ రీతు తండ్రికి ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం సీరియస్‌గా ఉందని రావాలని కోరడంతో అర్ధరాత్రి వారు ఇంటికి చేరుకున్నారు. కంటి పైభాగంలో గాయంతో బెడ్రూంలో పడి ఉన్న రీతును చికిత్స నిమిత్తం వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లయిన 18 నెలలకే తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని సచిన్‌పై రీతు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య, వరకట్న వేధింపుల కింద ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతురాలి భర్త సచిన్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మద్యం వద్దన్నందుకేనా.. రీతు తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత సచిన్తన స్నేహితులతో కలసి రాత్రి 8 గంటలకు ఇంట్లో మద్యం సేవించినట్టు తెలిసింది. ఇంట్లో మద్యం సేవించడంపై రీతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. దీంతో మద్యం మత్తులో ఉన్న సచిన్ బీరు సీసాతో రీతు తలపై బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడ్డ సచిన్ స్నేహితులు, అపార్ట్మెంట్ వాచ్‌మన్ సహకారంతో రామంతాపూర్‌లోని మాట్రిక్ అస్పత్రికి ఆమెను తరలించారు. అయితే అప్పటికే రీతు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఏమీ ఎరగనట్టుగా రీతు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి బెడ్రూంలో పడేసినట్లు తెలిసింది. భర్తే పొట్టన పెట్టుకున్నాడు: రీతు సోదరి పెళై్లన నాటి నుంచి రీతును సచిన్ వేధింపులకు గురిచేసేవాడని, అనునిత్యం ఆమెను అనుమానించేవాడని రీతు సోదరి తులిక పేర్కొంది. భర్తే తన సోదరిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించింది. -
ఎయిర్హోస్టెస్లకు ఇక మైసూరు సిల్కు చీరలు!!
మైసూరు సిల్కు చీరలంటే చాలు.. అతివలకు ఎనలేని మోజు. వాటి అందం, హుందాతనం వేరే వేటికీ రాదు. అలాంటి మైసూరు సిల్కు చీరలకు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించనుంది. ఎయిరిండియాలోని ఫ్లైట్ అటెండెంట్లు, ఎయిర్ హోస్టెస్‌లు ఇక మీదట ఈ చీరలను ధరించబోతున్నారు. ఈ మేరకు మొత్తం 10వేల చీరలను వెంటనే పంపాలని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఎస్ఐసీ)కి భారీ ఆర్డర్ లభించింది. ఈ మొత్తం చీరల విలువ అక్షరాలా రూ. 6.5 కోట్లు. దీంతో మైసూరు సిల్క్ చీరల ఖ్యాతి ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని సంస్థ ఛైర్మన్ బి.బసవరాజు ఆశిస్తున్నారు. ఇతర అనేక రకాల బ్రాండ్లను కూడా పరిశీలించిన తర్వాత చివరగా అత్యంత నాణ్యమైన మైసూరు సిల్కునే ఎయిరిండియా ఎంచుకుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన మైసూరు సిల్కు చీరలకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ఖరీదు రూ. 12 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది. వివిధ దేశాలకు ఇవి ఎప్పటినుంచో ఎగుమతి అవుతున్నాయి. సినిమా తారలు, మోడళ్లు కూడా తరచు మైసూరు సిల్కు చీరలే ధరిస్తుంటారు. తమకు తరచు రాష్ట్రపతి భవన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయని బసవరాజు తెలిపారు. వివిధ దేశాల నుంచి మన దేశానికి పర్యటనకు వచ్చే వివిధ దేశాధినేతల భార్యలకు కూడా వీటిని బహూకరిస్తుంటారు. ఎలక్ట్రానిక్ జకార్డ్ మిషన్లను ఉపయోగించడం వల్ల చీరల నాణ్యత బాగా పెరిగిందని, ఇలాంటి మరో 10 మిషన్లను రూ. 60 లక్షల ఖర్చుతో ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు. -
‘హిట్’.. హీట్!
కంట్రోల్ తప్పి కష్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదేనేమో! ఐరిష్ రాక్ బ్యాండ్ స్టార్ డాలర్స్ ఒరియోర్డన్ కోపంతో ఎయిర్ హోస్టెస్‌ను కొట్టి కటకటాల పాలయింది. డబ్లిన్ షనాన్స్ ఎయిర్‌పోర్టులో ఈ సింగర్‌ను పట్టుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో పెట్టారట. డాలర్స్ దెబ్బకు కాలికి గాయమైన ఎయిర్‌హోస్టెస్‌ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారనేది లోకల్ మీడియా కథనం. న్యూయార్క్‌లో లింగస్ ఫ్లయిట్ ఎక్కిన డాలర్... డబ్లిన్‌లో దిగే లోపు ఈ రాద్ధాంతం చేసేసింది. అయితే అంతగా కొట్టాల్సిన అవసరమేమొచ్చిందన్నది బయటకు రాలేదు. -
ఎయిర్ హోస్టెస్ రాలేదని... విమానాన్ని నిలిపేశారు
హైదరాబాద్ : ఎయిర్ హోస్టెస్ రాలేదని బెంగళురు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి..... హైదరాబాద్ నుంచి శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బెంగళూరు బయలుదేరవలసి ఉంది. ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. బెంగళురు వెళ్లవలసిన ప్రయాణికులంతా సదరు విమానాన్ని ఎక్కేశారు. కానీ ఆ విమానం ఉదయం 7.00 గంటలు అయినా కదలలేదు. అదికాక విమాన బయలుదేరుతున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో... ప్రయాణికుల ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయణికుల్లో చిన్నారులు కూడా ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అత్యవసర పని మీద బెంగళురు వెళ్లవలసి ఉందని... విమానం ఆలస్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మరో విమానంలో తమను బెంగళురు పంపాలని ఎయిర్పోర్ట్ అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
అమ్మ విలువ... ఉన్నప్పుడు తెలియలేదు!
‘నీ నవ్వే చాలు చామంతీ, పూబంతీ...’ అని పాడాలనిపించే నవ్వు రోజాది. చామంతి సినిమాతో మొదలైన ఈ పూబంతి రీల్ సమరాన్ని, రియల్ సమరాలను ఎదుర్కొంటూ నగరి నియోజకవర్గానికి ఎంఎల్ఎ అయ్యారు. ఆమె తొలి సినిమా ప్రేమతపస్సు, తొలి ప్రసంగం తిరుపతిలో శంఖారావం సదస్సు. ఇక టీవీ షోల విషయానికి వస్తే జల్సా ప్రోగ్రామ్‌కి న్యాయనిర్ణేతగా, మోడరన్ మహాలక్ష్మి కార్యక్రమంతో యాంకర్‌గా పరిచయం అయ్యారు. ఆమెకు మంచి పేరు తెచ్చిన టీవీ షో జబర్దస్త్. సినిమాల్లో రోజా, రాజకీయాల్లో రోజా సెల్వమణిగా మారిన శ్రీలత అంతర్వీక్షణం ఇది. మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? నవంబర్ 16వ తేదీ, కడపలో పుట్టా. సొంత ఊరు తిరుపతి దగ్గర చింతపర్తి. మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం... నచ్చే లక్షణం... ఎంత పెద్ద టెన్షన్ అయినా త్వరగా ఓవర్‌కమ్ కాగలగడం. నచ్చని లక్షణం... అందర్నీ నమ్మడం. ఎదుటి వారి నుంచి ఏమాశిస్తారు ? నిజాయితీని ఆశిస్తా. ముందు ఒకమాట వెనుక మాట లేని కచ్చితత్వాన్ని కోరుకుంటా. ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ? నేనంటే ఇష్టపడే వారిని. మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోవడం ఇష్టం ? నటిగానా, రాజకీయ రంగంలో ధీర వనితగానా... రెండూనూ. మనీ మేనేజ్మెంట్లో మీరు నిష్ణాతులా ? అవును, ఇంటి నిర్వహణ నేనే చూసుకుంటాను. ఏ కోర్సు చదవాలనుకున్నారు? ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నాను. ఇంట్లో వాళ్లు డాక్టర్ని చేయాలని బైపిసిలో చేర్పించారు. తర్వాత హోమ్‌సైన్స్‌లో జాయిన్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాను. ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడ్డారు ? చెన్నైలో స్థిరపడాలనుకున్నాను. రాజకీయాలతో హైదరాబాద్‌కి వచ్చాను. కానీ ఎక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానో వారికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? వ్యక్తి కాదు, వ్యక్తులు. మా పెద్దన్నయ్య కుమారస్వామి రెడ్డి, భర్త సెల్వమణి. మిమ్మల్ని కెరీర్ దిశగా ప్రభావితం చేసిన సందర్భం... ఎంపి శివప్రసాద్ గారు 1998లో నాన్నగారిని అడిగి ప్రచారం కోసం నన్ను తీసుకెళ్లారు. అప్పుడాయన సత్యవేడు ఎంఎల్ఎగా గెలిచి మంత్రయ్యారు. తొలి సంపాదన ఎప్పుడు? 1991లో. చామంతి సినిమాకి అడ్వాన్స్ ఐదు వేలిచ్చారు. చాలా గ్రేట్‌గా అనిపించింది. అత్యంత సంతోషపడిన సందర్భం కూడా అదేనా? అత్యంత సంతోషం అంటే... నా పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, నా పేరు పక్కన ఎంఎల్ఎ అని వేసినప్పుడు. మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన సందర్భాలు! అమ్మాయి... అన్న తర్వాత అలాంటివి తప్పవు. ిసినీనటి అయినప్పుడు బంధువుల మాటలు నొప్పించాయి. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వాళ్లే నా ఓటమికి ప్రయత్నించడం. ఇవి మానసికంగా. భౌతికంగా అయితే ‘సమరం’ సినిమా షూటింగ్ సమయంలో కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు బాధపడ్డాను. మీకు విచిత్రం అనిపించే విషయాలు? సినిమాల్లో డబ్బు తీసుకుని నటిస్తాం. అప్పుడు ప్రజలకు చేసేదేమీ ఉండదు. కానీ బ్రహ్మరథం పడతారు. రాజకీయాల్లో వందమందిలో పదిమందికైనా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. చేతనైన మంచేదో చేద్దాం అని వస్తే... ఏం చేసినా విమర్శిస్తారు. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా మమ్మీ ఉన్నప్పుడు ఆమె విలువ తెలియలేదు. అమ్మ ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోకుండా ఆమెను ఏడిపించేవాళ్లం. మా అమ్మ ఎప్పుడూ ‘నీకు పెళ్లయి కూతురు పుడితే నా విలువ తెలుస్తుంది’ అనేవారు. అమ్మ గుర్తొచ్చినప్పుడంతా ఆమె పట్ల మరింత అక్కర చూపి ఉంటే బావుండేదనిపిస్తుంటుంది. సహాయం పొంది... ద్రోహం చేశారనే ఆరోపణ? చాలామంది ఉన్నారు. అదీ బంధువుల్లోనే. సొంతవాళ్లే అలా చేస్తే బాధనిపిస్తుంది. డబ్బే పరమావధి కాదు. అలాంటిది వాళ్లు డబ్బే ప్రధానం అన్నట్లు ఉంటే కష్టంగా ఉంటుంది. తల్లిగా రోజా గురించి ఒక్కమాటలో... పిల్లలు మెచ్చుకునే విధంగా ఉన్నాను. షూటింగులు, మీటింగుల కారణంగా వాళ్లు నన్ను మిస్ కాకూడదని నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను. కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు! పాప (అన్షు మాలిక) పుట్టినప్పుడు... సంతృప్తినిచ్చిన పాత్ర? భైరవద్వీపంలో యువరాణి పాత్ర. ఎప్పుడైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చిందా? అబద్ధం చెప్పాల్సి వస్తే నవ్వేసి సరిపెడతాను. మీ నవ్వుతో అవతలి వాళ్లు అన్నీ మర్చిపోతారేమో? (మళ్లీ పెద్దగా నవ్వు) దేవుడు వరమిస్తానంటే... కుటుంబంతో సంతోషంగా ఉండాలి. పేదలకు సహాయం చేసే అవకాశం ఇవ్వమంటాను. మీ గురించి మీరు ఒక్కమాటలో... ఏదైనా విషయంలో ఎంత గట్టిగా పోరాడతానో. బంధాలు, బంధుత్వాల దగ్గర అంతటి సున్నిత మనస్కురాలిని. - వాకా మంజులారెడ్డి -
గగన వీధిలో విహరించే కెరీర్‌కు ఎయిర్ హోస్టెస్!
ఆకాశయానం, అధిక వేతనం.. వీటికి అవకాశం కల్పించే గ్లామరస్ కెరీర్ ఎయిర్ హోస్టెస్. విమానాల్లో ప్రయాణికులకు స్వాగతం పలికి, వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే గగన సఖిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నవారెందరో ఉంటారు. ప్రపంచ దేశాలను సందర్శించే అవకాశం, ఉన్నత స్థాయి జీవనం దీనిద్వారా సాధ్యమవుతుంది. మనదేశంలోకి నూతన ఎయిర్ లైన్స్ సంస్థల ఆగమనంతో ఎయిర్ హోస్టెస్‌లకు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో ఉద్యోగాలు వీరికి అందుబాటులో ఉన్నాయి. హోదాను బట్టి వేతనం ఎయిర్ హోస్టెస్‌లకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. తాము పనిచేస్తున్న విమానాల్లో ప్రయాణికులకు అవసరమైన సూచనలు ఇవ్వాలి. భోజన వసతి కల్పించాలి. వారు క్షేమంగా ప్రయాణించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ప్రథమ చికిత్స అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి భద్రంగా బయటపడేలా సహాయపడాలి. ఈ పనులన్నీ చేయడానికి శిక్షణ పొందాలి. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో భారత్‌లో విమానయాన సంస్థల సంఖ్య పెరుగుతోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం ఎయిర్‌పోర్టులు ఏర్పాటవుతున్నాయి. విమాన ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఎయిర్‌లైన్స్ సంస్థలు నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. దీంతో ఎయిర్ హోస్టెస్‌లకు ఉద్యోగావకాశాలు రెట్టింపవుతున్నాయి. కెరీర్‌ను ప్రారంభించిన రెండు మూడేళ్లలో సీనియర్ కేబిన్ అటెండెంట్ స్థాయికి చేరుకోవచ్చు. హోదాను బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. అనుభవం ఆధారంగా అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ విభాగంలోకి ప్రవేశించొచ్చు. ఆసక్తి ఉంటే టెక్నికల్, కస్టమర్ సర్వీసెస్ ట్రైనర్‌గా కూడా పనిచేయొచ్చు. ఈ వృత్తిలో ఒత్తిళ్లు, సవాళ్లు అధికంగా ఉంటాయి. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. సోషల్ లైఫ్‌ను కోల్పోతున్నామనే భావన అప్పుడప్పుడు కలుగుతుంది. సవాళ్లను ఎదుర్కోగల గుండె నిబ్బరం ఉన్నవారికి ఇది సరైన కెరీర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ హోస్టెస్ అంటే మహిళలే గుర్తుకొస్తారు. కానీ, ఇటీవలి కాలంలో పురుషులు కూడా ఈ రంగంలో పనిచేస్తున్నారు. వీరికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కావాల్సిన నైపుణ్యాలు: ఎయిర్ హోస్టెస్‌లకు విధుల్లో ఎన్ని ఒత్తిళ్లనైనా ఎదుర్కొని ప్రశాంతంగా పనిచేయగల ఓర్పు, సహనం తప్పనిసరిగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కంటిచూపు మెరుగ్గా ఉండడం అవసరం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు ఉండాలి. సంక్లిష్ట పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం కావాలి. నిత్యం ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకూడదు. వేతనాలు: ఎయిర్ హోస్టెస్‌లకు తమ అనుభవం, పనిచేస్తున్న సంస్థ, విధులను నిర్వర్తించిన సమయాన్ని బట్టి వేతనం అందుతుంది. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ ఆదాయం ఉంటుంది. ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పొందొచ్చు. సీనియారిటీ ఆధారంగా ఇందులో పెరుగుదల ఉంటుంది. హెడ్ ఫ్లైట్ అటెండెంట్ నెలకు రూ.60 వేలు సంపాదించుకోవచ్చు. కొన్ని అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఎయిర్ హోస్టెస్‌లకు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా వేతనాలు చెల్లిస్తున్నాయి. అర్హతలు ఎయిర్ హోస్టెస్‌గా మారాలనుకుంటే కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ హోస్టెస్ అకాడమీలో చేరి తగిన శిక్షణ పొందిన తర్వాత విధుల్లో చేరొచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అభ్యసించినవారు కూడా ఇందులోకి అడుగుపెడుతున్నారు. స్థానిక భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా పరిజ్ఞానం ఉంటే మంచి అవకాశాలను దక్కించుకోవచ్చు. ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అకాడమీలు విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఫ్రాంక్ఫిన్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అకాడమీ-హైదరాబాద్ వెబ్సైట్: www.frankfinn.com అప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ వెబ్సైట్: www.aptechaviationacademy.com సృష్టీస్ ఏవియేషన్ వెబ్సైట్: www.sristysaviation.com ఐఐ ఫ్లై ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ వెబ్సైట్: http://iifly.in/ మాస్టర్ ఏవియేషన్ అకాడమీ వెబ్సైట్: www.masteraviationacademy.com ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ వెబ్సైట్: www.flyairaviationacademy.in -
నర్తనమే‘ప్రీతి’కరం
ప్రొఫెషన్కార్పొరేట్ జాబ్ అనుకున్నంత తేలికేం కాదు. పెద్దజీతం వెనుకే ప్రాజెక్టులు, టార్గెట్ల మానసిక ఒత్తిడి తప్పదు. శాస్త్రీయ నృత్యమంటే నల్లేరుపై నడక కాదు. దానికి కళాపిపాస మాత్రమే కాదు, కఠోర సాధన కావాలి. ఈ రెండు రంగాల్లోనూ ఏకకాలంలో రాణించాలంటే మనో నిబ్బరం, శారీరక సామర్థ్యం ఉండాలి. అవి ఉన్న వారికి వేదికలు నీరా‘జనాలు’ పడతాయి. కార్పొరేట్ సంస్థలు కళాభినందనలు కురిపిస్తాయి. నర్తనమే‘ప్రీతి’కరం ‘‘పని ఒత్తిడి ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువగా డ్యాన్స్క్లాస్లో గడుపుతా’’ నన్నారు బేగంపేట నివాసి, ఎస్ అండ్ పి క్యాపిటల్ ఐక్యూ కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్‌గా చేస్తున్న ప్రీతి. ‘‘ డ్యాన్స్ చేస్తుంటే వచ్చే తృప్తి మరెందులోనూ రాదు’’ అంటున్నారు. పదేళ్లుగా నృత్యసాధనలో ఉన్న ప్రీతి, మూడేళ్ల క్రితమే జాబ్‌లో జేరారు. ఉద్యోగంలో చేరాక నృత్యసాధన కష్టం కాలేదా? అన్న ప్రశ్నకు ‘‘జాబ్ మొదలుపెట్టాక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వడం పెరిగింది. చెన్నై, బెంగళూరు, తిరుపతి, ఒరిస్సా, పూరి ఇలా ఎన్నో చోట్ల లాస్ట్ త్రీ ఇయర్స్‌లో ప్రదర్శనలిచ్చా’’ అంటూ వివరించారు. ‘‘కొండాపూర్‌లో ఆఫీస్, దోమలగూడలో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్.. నేనుండేది బేగంపేట. రోజూ 3గంటల దాకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. టైమ్ బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టం అనిపించడం లేదు’’ అంటూ చెప్పారామె. తనకు ఆఫీస్‌లో ప్రత్యేకమైన గౌరవం అందుతున్న వైనాన్ని చెబుతూ.. ‘‘నా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్‌ను దాని ప్రకారం సెట్ చేయడం అవీ మా బాస్‌లు చూస్తార’’న్నారు. అభిరుచి బలమైనది. సంప్రదాయం అంతకంటే బలమైనది. సంప్రదాయ కళలపై అభిరుచి ఏర్పడితే, ఎంతటి వ్యయప్రయాసలకైనా వెనుకాడరు కళాకారులు. ఒకవైపు ఊపిరి సలపని విధినిర్వహణలో సతమతమవుతూనే, మరోవైపు తమకు అభిరుచి గల సంప్రదాయ కళలో రాణిస్తున్నారు నగరానికి చెందిన ముగ్గురు యువతులు. మనసుంటే మార్గాలకు లోటుండదని వీరు రుజువు చేస్తున్నారు. ప్రసిద్ధ నర్తకి శోభానాయుడు అకాడమీలో సాధన చేసే వీరు ‘సిటీప్లస్’తో తమ ముచ్చట్లు చెప్పారు. డ్యాన్స్ ‘హోస్టెస్’ నాట్యం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.. ఈ మాట ఒక ఎయిర్‌హోస్టెస్ నోటి నుంచి వినిపిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నిత్యం ఆకాశయానం చేసే లావణ్య మనసు గాల్లో విహరించేది మాత్రం కాళ్లకు గజ్జెలు కట్టినప్పుడే. గచ్చిబౌలి నివాసి అయిన ఆమె జీతం కోసం విమానాల్లో విధులు నిర్వర్తిస్తూ, జీవితాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం నాట్యంతో సహవాసం చేస్తున్నారు. ‘‘నృత్యసాధన 8వతరగతిలో స్టార్ట్ చేశాను. వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాను. డ్యాన్స్ ఒక వ్యసనం లాంటిది. టెన్షన్స్ అన్నీ పోతాయి. అకాడమీ ఒక టెంపుల్ లాంటిది. డ్యాన్స్‌తో నాకు డిసిప్లిన్, పంక్చువాలిటీ, కాన్సన్ట్రేషన్.. అన్నీ వచ్చాయి. అందుకే మంచి జాబ్ వచ్చినా డ్యాన్స్ వదలదలచుకోలేదు. 2005 నుంచి ఎయిర్ఇండియాలో జాబ్ చేస్తున్నా. రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఫ్లయిట్ టైమింగ్స్‌తో ప్రతి రోజూ ప్రాక్టీస్‌కి వెళ్లలేను. అయితే మా ఆఫీసు వాళ్లు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అప్పుడప్పుడు టైమింగ్స్ ఎడ్జస్ట్ చేస్తారు. తాజాగా ఢిల్లీలో ఎయిర్ఇండియా వాళ్ల ప్రోగ్రామ్‌లో నా ప్రదర్శన ఏర్పాటు చేశారు. బయటి నుంచి రాగానే మమ్మీ అన్నీ రెడీ చేసి పెడుతుంది. డ్యూటీ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చి, కాస్ట్యూమ్స్ తీసుకుని డ్యాన్స్ క్లాస్‌కి వెళతా. 3గంటలు సాధన చేస్తా’’ అంటూ వర్క్టైమింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్న వైనాన్ని చెప్పారు లావణ్య. నృత్యమే ‘నిత్య’కృత్యం నృత్యమే తన నిత్యకృత్యం అంటున్నారు టీసీఎస్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిత్య. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో నివసించే ఆమె.. ఆరేళ్ల వయసులో అమ్మ ప్రోత్సాహంతో నృత్యసాధన ప్రారంభించారు. ‘చదువు, వీణ, డ్యాన్స్.. ఇలా దాదాపు పదహారేళ్లు గడిచింది. చదువు దెబ్బతింటుందని చాలామంది టెన్త్‌క్లాస్‌లో పూర్తిగా పుస్తకాలకే అంకితమవుతారు. నేను అప్పుడు కూడా ఇవి మానలేదు. టెన్త్‌లో 92శాతం పైన మార్కులు సాధించాను. ఎంసెట్‌లో సిటీ పరిధిలో 21వ ర్యాంక్ తెచ్చుకున్నాను. జేఎన్టీయూలో ఫ్రీ సీట్ వచ్చింది. నా చదువంతా మెరిట్ స్కాలర్షిప్ మీదే సాగిందంటే అది డ్యాన్స్ పుణ్యమే. నృత్యం నాకు చాలా గుర్తింపు కూడా తెచ్చింది. ప్రతిష్టాత్మక డ్యాన్స్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాను. కంపెనీ తరఫున ముంబైలోని టాటా హౌస్‌లో జేఆర్డీ టాటా 157వ జయంతి సందర్భంగా ఫారిన్ డెలిగేట్స్ ముందు మేడమ్ శోభానాయుడు కొరియోగ్రఫీ చేసిన నృత్యం ప్రదర్శించాను. అకాడమీలో బైక్ పార్క్ చేసుకుని, ఆఫీసుకు వెళతాను. ఆఫీసు నుంచి అకాడమీకి తిరిగొచ్చి, ప్రాక్టీస్ అయ్యాక బైక్ మీద ఇంటికొస్తాను. రోజుకు గంటన్నర ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుందో ముందే తెలియదు కాబట్టి ఆఫీసు వర్క్‌లో అడ్వాన్స్‌గా ఉంటాను’ అని తన నృత్య సాధనను వివరించారు నిత్య. -
ఎయిర్ హోస్టెస్‌ల సెల్ఫోన్లు మాయం
హైదరాబాద్: ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లకు చెందిన ఖరీదైన సెల్ఫోన్లు మాయమైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కొచ్చీకి చెందిన దీపికాదేష్ట, క్రిస్టిఎడుక్యులా జెట్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్‌లు. విధుల్లో భాగంగా ఆదివారం నగరానికి వచ్చిన వీరు రాత్రి సోమాజిగూడలోని పార్క్ హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు. భోజనం చేస్తున్న సమయంలో తమ ఖరీదైన ఐఫోన్, సామ్సంగ్ నోట్-4 సెల్ఫోన్లు పక్కనే పెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత చూడగా సెల్ఫోన్లు కనిపించలేదు. వెంటనే వారు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.