
ముంబై : బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి పడిపోవడంతో ఓ మహిళా ఎయిర్ హోస్టెస్(53)కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఏఐ 864 ఎయిరిండియా విమానంలో పనిచేస్తున్న సదరు ఎయిర్ హోస్టెస్ డోర్‌ను క్లోస్ చేసే క్రమంలో విమానంలోంచి పడిపోయినట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం చికిత్సం కోసం ఆ ఎయిర్ హోస్టెస్‌ను నానావతి ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment