ఎయిర్ హోస్టెస్ రాలేదని... విమానాన్ని నిలిపేశారు
హైదరాబాద్ : ఎయిర్ హోస్టెస్ రాలేదని బెంగళురు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి..... హైదరాబాద్ నుంచి శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బెంగళూరు బయలుదేరవలసి ఉంది. ఆ విమానం ఎయిర్పోర్ట్కు వచ్చింది. బెంగళురు వెళ్లవలసిన ప్రయాణికులంతా సదరు విమానాన్ని ఎక్కేశారు. కానీ ఆ విమానం ఉదయం 7.00 గంటలు అయినా కదలలేదు. అదికాక విమాన బయలుదేరుతున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదు.
దీంతో ప్రయాణికులు విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో... ప్రయాణికుల ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయణికుల్లో చిన్నారులు కూడా ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అత్యవసర పని మీద బెంగళురు వెళ్లవలసి ఉందని... విమానం ఆలస్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మరో విమానంలో తమను బెంగళురు పంపాలని ఎయిర్పోర్ట్ అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.