
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం సాయంత్రమైనా బయల్దేరలేదు. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం సాయంత్రం 7 గంటలు దాటినా బయల్దేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సుమారు 5 గంటలు అయినా ఎయిరిండియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.