అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
వాషింగ్టన్: ఏప్రిల్ ఫస్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న ఫ్రాంక్‌లు చేస్తూ.. స్నేహితులను, సన్నిహితులను సరదాగా ఆటపట్టిస్తారు. ఏప్రిల్ ఫూల్స్‌ని చేసే విషయంలో సెలబ్రిటీలు కూడా ముందుంటారు. తాజాగా ఈ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడి భార్య, ఫస్ట్ లేడి జిల్ బైడెన్ కూడా చేరారు. ఎయిర్‌హోస్టెస్‌గా వచ్చి.. రిపోర్టర్లను, సిబ్బందిని ఏప్రిల్ ఫూల్స్ చేశారు. కాలీఫోర్నియా పర్యటన ముగించుకుని వస్తుండగా.. విమానంలో జిల్ బైడెన్ ఈ ప్రాంక్ చేశారు.
ఎయిర్‌హోస్టెస్‌లాగా డ్రెస్ చేసుకుని.. నల్లటి మాస్క్ ధరించి.. జాస్మిన్ అనే నేమ్ ట్యాగ్ తగిలించుకుని క్యాబిన్‌లో ప్రవేశించారు జిల్ బైడైన్. అనంతరం అందులో ఉన్న వారందరికి స్వీట్ సర్వ్ చేశారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ‘జాస్మిన్’ వారి ముందే విగ్, మాస్క్ తీసేసి చిరునవ్వులు చిందిస్తూ ‘ఏప్రిల్’ ఫూల్ అని అరిచారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతసేపు తమ ముందు ఎయిర్‌హోస్టెస్‌గా తిరిగిన వ్యక్తి ఫస్ట్ లేడా అని ఆశ్చర్యపోయారు.
ఇక జిల్ బైడెన్ సర్వ్ చేసిన స్వీట్‌లానే ప్రాంక్ కూడా సూపర్‌గా ఉందని ప్రశంసించారు సిబ్బంది. అయితే జిల్ బైడెన్ ఇలాంటి చిలిపి పనులు చేయడం ఇదే ప్రథమం కాదట. గతంలో ఇలా రెండు మూడు సార్లు తమతో ప్రయాణిస్తున్న వారిని ఆటపట్టించారట.
చదవండి: విడాకులు తీసుకోకపోతే బైడెన్‌ను కలిసే అవకాశం వచ్చేది కాదు..
Comments
Please login to add a commentAdd a comment