prank
-
లెక్చరర్ కుర్చీ కింద బాంబు.. విద్యార్థుల ప్రతీకారం..
విద్యా బుద్ధులు నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు. ఆ తర్వాత ఏమైందంటే?పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.ఫైర్ క్రాకర్స్ తరహాలో పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసిన లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చాలని అనుకున్నారు. బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోల్ని చూశారు. అనంతరం వీడియోల్లో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్‌కి వచ్చే లెక్చరర్ చైర్లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్‌తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థికి అప్పగించారు. చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్‌గా క్లాస్ రూమ్‌లో కూర్చున్నారు. లెక్చరర్ గదిలోకి రావడం.. అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్లో కూర్చున్నారు. వెంటనే క్లాస్ రూమ్‌లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చాడు. అదృష్టవశాత్తూ.. పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్‌కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు తయారీ, ఎంతమంది విద్యార్థులు ఈ ఆకతాయి పనులు చేశారు వంటి వివరాల్ని సేకరించారు. అనంతరం మహిళా లెక్చరర్ తిట్టడం వల్లే విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి బాంబును తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో విద్యార్థలుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బాంబు ఘటనలో ప్రమేయం ఉన్న 13 నుంచి 15 మంది విద్యార్థుల తల్లిదండ్రలుకు సమాచారం అందించారు. అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు సదరు మహిళా లెక్చరర్‌కు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని కోరారు. పిల్లల్ని హెచ్చరించారు.తల్లిదండ్రుల విజ్ఞప్తితో విద్యార్థులపై కేసులు, విచారణతో పేరుతో ఇబ్బంది పెట్టొద్దని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
సరదా హద్దు దాటితే..పరిస్థితి ఇలా ఉంటుందా?
సరదాగే ఒకళ్లని ఆటిపట్టించేలా చేసే పనులు ఇరువురుకి ఆనందం కలిగించాలి. అవి హద్దు దాటితే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ పనుల వల్ల ఇరువురిలో ఒక్కరూ హర్ట్ అయ్యి ప్రతిచర్యకు దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే కాబోలు పెద్దలు ఏదైన సరే శృతి మించకూడదని పదే పదే అంటారు. ఇక్కడ అలానే సరదా అల్లరి కాస్తా శృతి మించింది. ఫలితం ఓ వ్యక్తి తీవ్ర గాయలపాలవ్వడానికి దారితీసింది. అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. రష్యాలో చెల్యాబిన్స్క్‌లో ప్రొఫెసర్ బ్లాగిక్ స్ట్రీట్‌లోని ఓ అపార్ట్మెంట్లో పార్టీ జరగుతుంది. ఆదివారం కావడంతో వారంతపు రోజు ఎంజాయ్ చేయలనుకున్నారు. అందులో భాగంగా కొందరు వ్యక్తులు ఒక అపార్ట్మెంట్లో చేరి అల్లరి చేష్టలతో హుషారుగా ఉన్నారు. అయితే వారి అల్లరి శృతి మించింది. ఏకంగా వంటగదిలో స్మోకింగ్ బాంబ్ పేల్చారు. దీంతో మనస్తాపం చెందిన ఓ అమ్మాయి పట్టరాని కోపంతో దారుణమైన చర్యకు పూనుకుంది. ఏకంగా మరిగిమరిగే నీళ్లను తీసుకొచ్చి పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై పోసేందుకు యత్నించింది. అయితే ఆ నీళ్లు కాస్త ఆ ఇంటి యజమానిపైనే నేరుగాపడ్డాయి. అయితే ఆ వ్యక్తి ఏమీ స్మోకింగ్ బాంబ్ ప్రయోగించిన వ్యక్తి కాదు. అతను కూడా అలా చయొద్దన్న వ్యక్తే అని పోలీసుల విచారణలో తెలిసిందే. ఈ హఠాత్పరిణామం గురించి పోలీసులకు సమాచారం అందడంతో పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై చర్య తీసుకుని వారికి జరిమాన కూడా విధించారు. ఇలా చేసిన సదుర అమ్మాయిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తీవ్ర స్థాయిలో చర్మం బర్న్ అయ్యిందని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సదరు మహిళపై పలువురు నెటిజన్లు ఫైర్ అవ్వగా, కొందరూ మాత్రం అలా వాళ్లు స్మోకింగ్ బాంబ్ పేల్చాలనుకోవడం కూడా తప్పే అందువల్ల ఆమె అలా ప్రవర్తించిందని మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!) -
హీరో ఆకాష్ పూరి ని ప్రాంక్ చేసిన ప్రేమదేశం మూవీ టీమ్
-
ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి
Heroine Krithi Shetty Crying In Live Interview: 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ సరసన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. కాగా తాజాగా తమిళనాట జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఇంటర్వ్యూలో ఏడ్చేసింది బేబమ్మ. చదవండి: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్ మరో యాంకర్‌ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది. అయితే ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైన హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝗞𝗿𝗶𝘁𝗵𝗶 𝗦𝗵𝗲𝘁𝘁𝘆 🔵 (@krithi.shetty_shines) -
దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, అందాల భామ సారా అలీ ఖాన్, తమిళ స్టార్ హీరో ధనుష్ ముగ్గురు కలిసి నటించిన చిత్రం 'ఆత్రంగి రే'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో ప్రముఖ హిందీ టాక్ షో 'ది కపిల్ శర్మ షో'లో సందడి చేశారు అక్కీ, సారా. సినిమా చిత్రీకరణలో జరిగిన చిలిపి సన్నివేశాలు, సందడి గురించి ముచ్చటించారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను తనదైన రీతిలో అడిగి ఆకట్టుకున్నాడు కపిల్ శర్మ. అయితే ఈ క్రమంలో అక్షయ్ తనపై ఎలాంటి ట్రిక్ ప్లే చేశాడో చెప్పుకొచ్చింది సారా. నేను ఏం ట్రిక్ ప్లే చేశాను అని అక్షయ్ అడగ్గా.. సర్ మీరు నాకు స్వీట్ అని చెప్పి వెల్లుల్లి తినిపించారు. అది కూడా దేవుడి ప్రసాదం (నైవేద్యం) అని చెప్పారు మీరు. 'ఇదిగో బేటా ఇది దేవుడి ప్రసాదం' అని అన్నారు. అది కొంచెం వండిన వెల్లుల్లి కూడా కాదు. పచ్చి వెల్లికాయ.' అని తెలిపింది సారా. దీనికి 'అది నిన్ను బాధపెట్టిందా' అని అక్షయ్ అడిగితే 'అవును నాకు కొంచెం ఆనారోగ్యంగా అనిపించింది.' అని చెప్పింది సారా. ఈ మాటతో 'నువ్ తిన్నట్లు నీ కెరీర్‌పై ప్రమాణం చేసి చెప్పు' అని అడగ్గా 'నేను దాన్ని తింటే కచ్చితంగా అనారోగ్యంగా అనిపించేది' అని బదులిచ్చింది సారా అలీ ఖాన్. దీంతో ఒక్కసారిగా షోలో నవ్వులు చిందాయి. ఇదీ చదవండి: సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్ -
టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో'
Cricket Pitch Invader Jarvo Tweets In Support Of Team India: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐపీఎల్-2021కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ట్వీట్ చేశాడు. Dose India need me for the T20 World Cup?Got my full kit ready!!! #showyourgame #jarvo69 #T20WorldCup pic.twitter.com/KeCZxjJFKe— Jarvo69 (Daniel Jarvis) (@BMWjarvo) October 29, 2021 టీమిండియాకు నా హెల్ప్ ఏమైనా కావాలా..? కిట్‌తో రెడీగా ఉన్నాను.. బరిలోకి దిగడమే తరువాయి అంటూ టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరించిన సెల్ఫీని పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. జార్వో ట్వీట్‌పై టీమిండియా అభిమానులు స్పందిస్తున్నారు. జార్వో ఉంటే టీమిండియాకు కలసి వస్తుందని కొందరంటుంటే.. కోహ్లీ రాజీనామా చేసి జార్వోకు కెప్టెన్సీ ఇవ్వాలని మరొకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. దీంతో ఆదివారం(అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f— Raghav Padia (@raghav_padia) September 3, 2021 చదవండి: టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్.. లంక స్పిన్నర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు -
ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన 'జార్వో' మళ్లీ వచ్చేశాడు..
Cricket Pitch Invader Jarvo Intrudes Field Once Again In NFL Match: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐపీఎల్-2021కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి మరోసారి మైదానంలోకి దూసుకొచ్చి వార్తల్లోకెక్కాడు. Random guy on the field at the London game dapping players up in a Jaguars jersey pic.twitter.com/FP2kF13Tnt — Barstool Sports (@barstoolsports) October 17, 2021 అయితే ఈసారి అతను ఎంట్రీ ఇచ్చింది క్రికెట్ మైదానంలోకి కాదు. లండన్‌లో జరుగుతున్న అమెరికన్ ఫుట్‌బాల్(NFL) మ్యాచ్ మధ్యలోకి. జాక్సన్ విల్లే జాగ్వార్స్, మయామీ డాల్ఫిన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతుండగా.. జార్వో, జాగ్వార్స్ జెర్సీ ధరించి ఒక్కసారిగా మైదాన ప్రవేశం చేశాడు. తాను కూడా జాక్సన్ జాగ్వార్స్ ఆటగాడినే నంటూ గతం తరహాలోనే నానా హంగామా చేశాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని మైదానంలో నుంచి లాక్కెల్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 చదవండి: T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్..
లండన్: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీమిండియా జర్సీ ధరించి.. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధిస్తున్న ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69ను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి నానా హడావుడి చేస్తున్ననేపథ్యంలో తొలుత మందలింపులతో సరిపెట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా లండన్ దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్వోను అరెస్ట్ చేశారు. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 'జార్వో 69' పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఈ టీమిండియా అభిమాని ఇప్పటి వరకు మూడుసార్లు(లార్డ్స్ టెస్ట్, లీడ్స్ టెస్ట్, ఓవల్ టెస్ట్) మైదానంలోకి ప్రవేశించాడు. తాజాగా ఓవల్ టెస్ట్ రెండో రోజు ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మైదానంలోకి చొరబడ్డ జార్వో.. తాను టీమిండియా బౌలర్‌ని అంటూ హంగామా చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను ఢీకొంటూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. Jarvo is at the crease #engvsindia pic.twitter.com/XlATed4vGg — JJK (@72jjk) August 27, 2021 ఈ ఘటనతో బెయిర్‌స్టో ఒకింత అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ పోప్ కూడా తన ఏకాగ్రత దెబ్బతినిందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరలయ్యింది. కాగా, లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి జార్వో అరెస్ట్‌కు సిఫార్సు చేశారు. India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 చదవండి: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
రిపోర్టర్లను, సిబ్బందిని ఫూల్స్ చేసిన జో బైడెన్ భార్య
వాషింగ్టన్: ఏప్రిల్ ఫస్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న ఫ్రాంక్‌లు చేస్తూ.. స్నేహితులను, సన్నిహితులను సరదాగా ఆటపట్టిస్తారు. ఏప్రిల్ ఫూల్స్‌ని చేసే విషయంలో సెలబ్రిటీలు కూడా ముందుంటారు. తాజాగా ఈ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడి భార్య, ఫస్ట్ లేడి జిల్ బైడెన్ కూడా చేరారు. ఎయిర్‌హోస్టెస్‌గా వచ్చి.. రిపోర్టర్లను, సిబ్బందిని ఏప్రిల్ ఫూల్స్ చేశారు. కాలీఫోర్నియా పర్యటన ముగించుకుని వస్తుండగా.. విమానంలో జిల్ బైడెన్ ఈ ప్రాంక్ చేశారు. ఎయిర్హోస్టెస్లాగా డ్రెస్ చేసుకుని.. నల్లటి మాస్క్ ధరించి.. జాస్మిన్ అనే నేమ్ ట్యాగ్ తగిలించుకుని క్యాబిన్లో ప్రవేశించారు జిల్ బైడైన్. అనంతరం అందులో ఉన్న వారందరికి స్వీట్ సర్వ్ చేశారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ‘జాస్మిన్’ వారి ముందే విగ్, మాస్క్ తీసేసి చిరునవ్వులు చిందిస్తూ ‘ఏప్రిల్’ ఫూల్ అని అరిచారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతసేపు తమ ముందు ఎయిర్‌హోస్టెస్‌గా తిరిగిన వ్యక్తి ఫస్ట్ లేడా అని ఆశ్చర్యపోయారు. ఇక జిల్ బైడెన్ సర్వ్ చేసిన స్వీట్లానే ప్రాంక్ కూడా సూపర్‌గా ఉందని ప్రశంసించారు సిబ్బంది. అయితే జిల్ బైడెన్ ఇలాంటి చిలిపి పనులు చేయడం ఇదే ప్రథమం కాదట. గతంలో ఇలా రెండు మూడు సార్లు తమతో ప్రయాణిస్తున్న వారిని ఆటపట్టించారట. చదవండి: విడాకులు తీసుకోకపోతే బైడెన్‌ను కలిసే అవకాశం వచ్చేది కాదు.. -
ఇలాంటి ఏప్రిల్ ఫూల్‌ని ఎక్కడా చూసుండరు
ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్ డే. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి స్నేహితులను ఫూల్స్ చేసి తెగ సంబరపడతాం. ఈ రోజు ఫూల్స్ డే అని మనకు తెలుసు కనక.. సరదగా ఆటపట్టిస్తాం. మరి ఈ పిట్టకు ఈ రోజు ఫూల్స్ డే అని తెలిసి ఇలా చేసిందో.. లేక ప్రాణం కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ ఏకంగా పిల్లితోనే ప్రాంక్ చేసింది. సమయం చూసుకుని తుర్రుమని ఎగిరిపోయింది. పిట్ట తెలివికి అవాక్కయిన పిల్లి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది విఫలమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఏప్రిల్ ఫూల్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లి కాళ్ల కింద ఓ పిట్ట వుంటుంది. చూడ్డానికి అది మరణించనట్లు ఉంటుంది. దాంతో పిల్లి దాన్ని నేల మీద అటూ ఇటూ దొర్లిస్తూ ఆడుతూ ఉంటుంది. సమయం చూసుకుని ఆ పిట్ట ఒక్క ఉదుటున అక్కడ నుంచి తుర్రుమంటుంది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న పిల్లి.. పిట్టను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. కానీ అప్పటికే అది అందనంత దూరం వెళ్లి పోతుంది. April fool😊 pic.twitter.com/2lbUAkhzP1 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పిట్ట తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది మన కంటే స్మార్ట్.. తెలివైన పిట్ట గెలిచింది.. అతి విశ్వాసం ఉన్న పిల్లి ఓడింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది? -
నవ్వు తెప్పిస్తున్న ప్రాంక్ వైరల్ వీడియో
కొందరు సరదా కోసం చేసే ప్రాంక్ వీడియోలు నవ్వు తెప్పిస్తాయి. మరికొందరు తమ కుటుంబ సభ్యులతో ప్రాంక్ పనులు చేసి ఆటపట్టిస్తారు. అవి సక్సెస్ అయితే, ఫన్ ఖాయం. తాజాగా లోసేనా అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేసిన ఓ నకిలీ పాము వీడియో వైరల్‌గా మారింది. తన చిన్నారి కూతురుతో కలిసి బెడ్ రూమ్‌లో ఉన్న లోసేనా.. ఆమె భర్త బెల్టును పాములాగా సెట్ చేసి.. ఆ గది బయట ఉన్న భర్తతో ‘ఇక్కడేదో ఉందండి’అని కేక వేసి చెప్తుంది. దాంతో అతను చేతిలో ఓ కత్తి పట్టుకేని గది తలుపు తెరచుకుని లోనికి వస్తాడు.. దాని అంతు చూద్దామని. అయితే, తలుపు తెరవగానే సరిగ్గా అతని కాళ్ల వద్దే ఉన్న బెల్టును చూసి పాముగా భ్రమపడతాడు. భయంతో ఒక్కసారిగా బిగ్గరగా అరచి, చేతిలో ఉన్న కత్తితో దానిపై దాడి చేస్తాడు. అప్పటికే నవ్వును అదిమిపట్టుకుని ఉన్న లోసేనా, ఆమె కూతురు పగలబడి నవ్వుతారు. ఇక కేకలు వేస్తూ తలుపు ఆవలకు వెళ్లిన భర్త...అక్కడ ఉన్నదేంటి అని అడిగేసరికి.. ‘అది నీ బెల్టే’అని తల్లీపిల్లలు మరోసారి ఫన్పండగ చేసుకుంటారు. మరోసారి బుక్ అయ్యాడని అంటారు. అయితే,‘నాన్నా పులి’ మాదిరిగా ఈ ప్రాంక్ వేషాలు ఎందుకని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. నిజమైన పాము వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ నవ్వులాటలు అని హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by lowsena (@lowsena) -
వైరల్: కూతురు స్కూల్ వీడియోలో తండ్రి డ్యాన్స్
స్కూల్ హోంవర్క్ చేస్తున్న ఓ అమ్మాయిని తన తండ్రి, సోదరుడు ఆటపట్టించాలకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తల్లి జెన్నిఫర్ ఈ వీడియోను సోషల్ మీడియాతో పంచుకోగా అది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. కాగా.. ఆ అమ్మాయి పేరు డెలానీ జోన్స్. ఆమె తను చేస్తున్న హొంవర్క్ను వీడియోను తీసి స్కూల్ టీచర్‌కు పంపడానికి కెమెరాను ఫిక్సింగ్ చేసింది. తర్వాత, ఆమె అలెక్సాను ఒక పాటను ప్లే చేయమని అడిగింది. ఆర్ట్ వర్క్ చేస్తుండగా, చిన్నారి తండ్రి, సోదరుడు వీడియోలో డ్యాన్స్ చేస్తూ పలు రకాలుగా ఆటపట్టించే ప్రయత్నాలు చేశారు. కాగా.. డెలానీ తల్లి జెన్నిఫర్ ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ "నేను డెలానీ చేసిన వీడియో ను పాఠశాల యాప్ (సీసా)ను పంపిస్తున్నాను. డెలానీ తరచుగా ఏదో ఒక వీడియో తీసి ఉపాధ్యాయులకు పంపి.. వాళ్లను పలకరించడం, గుడ్‌నైట్ చెప్పడం, సరదాగా మాట్లాడటం లాంటివి చేస్తుంది. అయితే ఈ వీడియో మాత్రం మరికాస్త ఫన్నీగా ఉండబోతుంది. నేను అయితే చాలా నవ్వుకున్నాను. మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా" అని క్యాప్షన్ జత చేశారు. అయితే.. తన కుమార్తె టీచర్స్ కోసం వీడియోను చేస్తుందని డెలానీ తండ్రికి తెలియదు. సరదాగా ట్యుటోరియల్ ఏదో వీడియో చేస్తుందనుకొని సరదాగా తనను ఆటపట్టించాలనుకోగా, చివరికి ఆయనే నవ్వులపాలయ్యాడు. కాగా.. నవంబర్ 18న పోస్ట్ చేసిన ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా 11వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. -
అమ్మో పాము: రెండు రోజులు గదిలోనే
వించెస్టర్: ఓ మహిళ పామును చూసి భయపడిపోయింది. అంతే.. అదెక్కడ ఇంట్లోకి చొరబడుతుందేమోనన్న భయంతో గదిలోనే రెండురోజులపాటు ఉండిపోయింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని హ్యాంప్‌షైర్‌లో జరిగింది. హ్యాంప్‌షైర్‌కు చెందిన ఓ మహిళకు తన ఇంటి ఎదురుగా ఉన్న హాల్లో పాము కనబడింది. దీంతో ఆమె గుండెలదిరిపోయాయి. ఇక గది నుంచి అడుగు బయటకు వేసే ధైర్యం చేయలేక ఇంటికి తాళం వేసుకుని లోపలే ఉండిపోయింది. కానీ తర్వాతి రోజు కూడా పాము అక్కడ నుంచి కదల్లేదు. ఆ పాములో చలనమే లేకపోయే సరికి ఆమెకు ఎంతకూ అంతు చిక్కలేదు. అప్పటికే సమాచారమందుకున్న జంతు సంరక్షణాధికారులు ఆ ఇంటిని చేరుకుని దాన్ని గమనించగా అది ఉత్తి రబ్బర్ పామేనని తేల్చారు. ఎవరో కావాలనే ఆమెను ప్రాంక్ చేసేందుకు ప్రయత్నించారని అభిప్రాయపడ్డారు. కానీ పాపం, సదరు మహిళ అది నిజమేనని అనుకుని గదిలో రెండురోజులపాటు తనని తానే నిర్భందించుకుంది. ఇక పదిరోజు క్రితం కూడా అచ్చంగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రెండు పాములు చెట్టుకు వేలాడుతూ చనిపోయాయని అధికారులకు సమాచారం అందింది. వెంటనే వాళ్లు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అవి బొమ్మ పాములని తేల్చారు. వెంటనే చెట్టు నుంచి ఆ రబ్బరు పాములను తీసేసి దూరంగా పారేశారు. ఈ విషయాన్ని అధికారులు ట్విటర్ ద్వారా వెల్లడించడంలో సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. పిచ్చి పిచ్చి ప్రాంక్‌లతో జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 🐍🐍 Inspector Ryan King was concerned to receive a report of two dead snakes tied together in a tree last week. He went to the scene to investigate, only to find out they were rubber toys! Thankfully he was able to remove them with a grasper and dispose of them properly! pic.twitter.com/LnR0wtGJJy — RSPCA (England & Wales) (@RSPCA_official) February 13, 2020 -
‘మిమ్మల్ని ప్రాంక్ చేశాను బ్రో’
‘ఇదంతా ప్రాంక్ బ్రదర్.. సినిమాల్లో చూసి చూసి బోర్ కొట్టింది. అందుకే మిమ్మల్ని ప్రాంక్ చేద్దామని ఇలా చేశానంటు’న్నారు హీరో అజయ్ దేవగణ్. ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఉన్నా కూడా ఈ మధ్య టీవీల్లో వచ్చే తలాతోకాలేని కార్యక్రమాల పుణ్యానా ఈ ప్రాంక్ కాల్స్ పిచ్చి అందరికి బాగానే ఎక్కేసింది. తాను కూడా అలానే చేశానంటున్నారు అజయ్ దేవగణ్. నిన్న మధ్యాహ్నం అజయ్ ‘కాజోల్ ప్రస్తుతం ఇక్కడ(భారత్) లేరు. 98******** తన వాట్సాప్ నంబర్ ఇది. ఈ నెంబర్ ద్వారా ఆమెను సంప్రదించగలరు’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు కాజల్‌తో మాట్లాడవచ్చనే ఆనందంలో ఆమెకు మెసేజ్‌లు పెట్టి రిప్లై కోసం ఎదురు చూశారు. అంతేకాక ‘రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం సార్’ అంటూ స్ర్కీన్షాట్లు తీసి అజయ్‌కు పంపించారు. ఇలా నెటిజన్లతో కాసేపు ఆడుకున్న అజయ్ దేవగణ్ ఆ తర్వాత అసలు విషయం చెప్పారు. ‘సినిమాల్లో ప్రాంక్(ఫూల్స్) చేసి చేసి బోర్ కొట్టింది. అందుకే వెరైటీగా మిమ్మల్ని ప్రాంక్ చెద్దామని భావించి ఇలా చేశానం’టూ ట్వీట్ చేశారు. దాంతో పాటు అభిమానులు నుంచి తనకు వచ్చిన రీట్వీట్స్ని కూడా పోస్ట్ చేశారు. దాంతో అజయ్ షేర్ చేసిన నంబర్ ఫేక్ అని తేలిపోయింది. ఇండస్ట్రీలో ఇలాంటి చిలిపి పనులు చేయడంలో అజయ్ దేవగణ్ ముందుంటారనే పేరుంది. -
ప్రాంక్ మిస్ ఫైర్.. షాకింగ్ వీడియో
ఫ్రెండ్‌తో చేసిన ప్రాంక్ చర్య ఓ విద్యార్థినికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఏడాదిపాటు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తాజాగా విడుదల చేశారు. అయితే ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలిలా.. పోలాండ్లోని జెకోవీస్-డెడ్జీస్లో ఓ రోడ్డు కూడలిలో ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు. సరదాగా తన స్నేహితురాలు (17)ని ఆట పట్టించాలని ఓ విద్యార్థిని అనుకుంది. అనుకున్నదే తడవుగా తమ పక్క నుంచి బస్సు వెళ్తుండగా.. తన ఫ్రెండ్‌ను భుజంతో నెట్టింది. ఇక అంతే బ్యాలెన్స్ తప్పిన యువతి కింద పడిపోయింది. బస్సు చక్రం తనపై నుంచి వెళ్తుందని భయం చెందినా క్షణాల్లో పక్కకు జరగడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వెంటనే సారీ చెబుతూ తన స్నేహితురాలిని హగ్ చేసుకుంది. ఏప్రిల్ 12న జరిగిన ఈ ఘటనకు సంబధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఫేస్బుక్లో పోస్ట్ చేయగా హల్చల్ చేస్తోంది. -
ప్రాంక్ మిస్ ఫైర్.. వైరల్!
-
షో కారు కాదు, స్నో కారు
కెనడాకు చెందిన సిమన్ లాప్రైజ్ అనే ప్రాంక్‌స్టర్ ఏకంగా పోలీసులే ఆశ్చర్యపోయేలా చేశాడు. కెనడాలోని మాంట్రియల్లో తన ఇంటి ముందు నోపార్కింగ్ ప్రదేశంలో ప్రఖ్యాత డీలోరియన్ డీఎంసీ-12 మోడల్ కారును అచ్చుగుద్దినట్టు మంచుతో తయారు చేశాడు. నిజమైన కారుకు ఉండే విధంగా చక్రాలు, అద్దాలు, వైపర్ ఇలా అన్నింటిని తయారుచేశాడు. కారుపై మంచుకురిస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలానే ఆ కళాఖండం ఉంది. రాత్రి సమయంలో ఆ మార్గంలో వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఆ కారును చూశారు. అది నిజమైన కారేమోనని అనుకున్నారు. కానీ అది నిజమైంది కాదని తెలిసి, సరదాకోసం చేశాడని నవ్వుకుని పోయారు. పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు ఆ కారును నిశితంగా పరిశీలిస్తుంటే సిమన్ దూరంగా ఉండి నవ్వుకున్నాడు. పోలీసులు ‘యూ మేడ్ అవర్ నైట్ హహహహ’ అని కారుపై ఒక నోట్ రాసి వెళ్లిపోయారు. ఇది సిమన్ తన ఫేస్బుక్లో ఫోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇది కేవలం సరదాకోసమే చేశానని సిమన్ లాప్రైజ్ తెలిపారు. మంచుతో డిఫరెంట్‌గా చేయాలనిపించింది. అందుకే కారును తయారుచేశానని సిమన్ తెలిపారు. అయితే నోపార్కింగ్‌లో ఆ కళాఖండం ఉండటంతో మరునాడు మంచును తొలగించే యంత్రాలతో ఆ స్నో కారును తీసేశారు. స్నో కారు (ఇన్ సెట్ లో పోలీసులు రాసిన నోట్) -
మైక్రోవేవ్ ఓవెన్లో ఇరుక్కుపోయిన తల
లండన్: ప్రాంక్.. అంటే తెలిసిందే. సరదాగా ఇతరులను ఆటపట్టించేందుకు చేసే పని. దానిని వీడియో తీసి, యూట్యూబ్‌లో పెడతారు. వీటిని ఫన్నీ ప్రాంక్స్ అని పిలుస్తారు. ఇలాంటివి చేసేవారిని ప్రాంక్‌స్టర్ అంటారు. బ్రిటన్‌కు చెందిన వోల్వర్‌హ్యాంప్టన్‌కు కూడా ఇలాంటి ప్రాంక్స్ చేయడం సరదా. ఈ సరదా పనే.. అతణ్ని చావు దగ్గరిదాకా తీసుకెళ్లి వెనక్కు పంపింది. ఇంతకీ మన హీరో ఏం చేశాడంటే... తన తలను ఓ ప్లాస్టిక్ కవర్‌తో కప్పి, మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టాడు. ఆ తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ నిండా పాలిఫిల్లా(రకరకాల ఆకారాలు తయారుచేసేందుకు ఉపయోగించే సిమెంట్ లాంటి పదార్థం)ను నింపారు. ఆ తర్వాత తల తీసేస్తే తన ముఖాన్ని తయారు చేయడానికి ఓ అచ్చు తయారవుతుందని భావించాడు. అనుకున్నట్లుగా అంతా బాగానే జరిగినా పాలిఫిల్లా పోసిన తర్వాత తల ఎంతకీ బయటకు రాలేదు. ఇక లోపల ఊపిరి ఆడక మన ప్రాంక్‌స్టర్ అల్లాడిపోయాడు. కాసేపటికే చలనం లేకపోయేసరికి చచ్చిపోయాడని కూడా అనుకున్నారు. అయితే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి, దాదాపు గంటన్నరపాటు శ్రమించి, మైక్రోవేవ్ ఓవెన్‌ను కట్ చేసి, పాలిఫిల్లాను పగులగొట్టి, తలను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి, చికిత్స చేయడంతో ప్రాంక్‌స్టర్ కాస్తా ప్రాణాలతో బయటపడ్డాడు. -
పబ్లిగ్గా అమ్మాయికి ముద్దు.. భారీగా ఆదాయం!
న్యూఢిల్లీ: వివాదాస్పద ‘ది క్రేజీ సుమిత్ ప్రాంక్’ యూట్యూబ్ వీడియోపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 1న పోస్ట్ అయిన ఈ వీడియోలో.. యువతులను బహిరంగంగా ముద్దుపెట్టుకెట్టుకున్న యువకుడిని, అతనికి సహకరించిన కెమెరామెన్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కేవలం సెన్సేషన్ కోసం రూపొందించిన వీడియో ద్వారా నిందితులు భారీగా డబ్బు సంపాదించారని ఢిల్లీ జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. సదరు వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (కీచక వినోదం: ప్రాంక్ పేరిట పబ్లిగ్గా ముద్దు..) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే యువతులకు ముద్దులు పెడుతూ.. సుమిత్ కుమార్ సింగ్, అతని అనుచరుడు సత్యజిత్ కద్యాన్లు రూపొందించిన వీడియోను యూట్యూబ్‌లో లక్షమందికిపైగా వీక్షించారని, కేవలం సెన్సేషన్ కోసం రూపొందించిన ఈ వీడియో ద్వారా వారు సుమారు రూ.70వేల ఆదాయాన్ని ఆర్జించారని పోలీసులు చెప్పారు. అంతేకాదు, తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ సాధించినందుకుగానూ యూట్యూబ్ సంస్థ సుమిత్ గ్యాంగ్‌కు అప్రైజల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిందని తెలిపారు. అయితే సదరు వీడియోలోని అమ్మాయిలంతా తమవాళ్లేనని, ముద్దు పెట్టుకోగానే షాక్‌కు గురైనట్లు నటించేలా ముందే ఒప్పందాలు కుదిరాయని ప్రధాన నిందితుడు సుమిత్ చెప్పనట్లు పోలీసులు పేర్కొన్నారు. నిదితులు చెప్పిన వివరాల ఆధారంగా వీడియోలోని అమ్మాయిలను కూడా ప్రశ్నిస్తామని, ఒకవేళ ఆ అమ్మాయిలు నిందితులకు తెలిసినవారే అయినా, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం నేరం కాబట్టి ఆమేరకు కేసు నమోదుచేస్తామని జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ వివరించారు. ఇలాంటి అసభ్యకర వీడియోలను పబ్లిష్ చేయడమేకాక, హిట్స్ వచ్చినందుకు సర్జిఫికేట్ ఇవ్వడంపై యూట్యూబ్ యాజమాన్యమైన గూగుల్ సంస్థకు కూడా నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పారు. దీనిపై గూగుల్ సంస్థ కూడా స్పందించింది. ‘వేధింపులు, హింసను ప్రేరేపించే వీడియోలు, విద్వేష వ్యాఖ్యలు, షాకింగ్ సంఘటనలు, అభ్యంతరకర సందేశాలు.. వాటికి సంబంధించిన వీడియోలను నిషేధించేలా మా సంస్థకు నిర్దిష్ట ప్రమాణాలున్నాయి. సుమిత్ ప్రాంక్ వీడియో కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం’అని యూట్యూబ్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. వాళ్లు ఆపితేనే ఆగుతా: నిందితుడు సుమిత్ కాగా, దర్యాప్తు సందర్భంగా నిందితుడు సుమిత్ కుమార్ సింగ్ తానేతప్పూ చేయలేదని వాదించుకోవడం గమనార్హం. సుమిత్.. ఏడాదికాలంగా యూట్యూబ్‌లో చానెల్ నడుపుతున్నానని, ఇప్పటివరకు 35కుపైగా వీడియోలను పోస్ట్చేశాడని, వాటికి వచ్చే హిట్స్‌ను బట్టి, యూట్యూబ్ అకౌంట్ ద్వారానే డబ్బులు పోగేశాడని పోలీసులు తెలిపారు. ‘నేను చేసింది తప్పని సెన్సార్ బోర్డు నిర్ధారించాలి. వాళ్లు చెబితే తప్ప ఇలాంటి వీడియోలు తీయడం ఆపను’అని సుమిత్ మీడియాతో అన్నాడు. -
కీచక వినోదం: ప్రాంక్ పేరిట పబ్లిగ్గా ముద్దు..
నూతన సంవత్సరం సందర్భంగా బెంగళూరులో నిస్సిగ్గుగా సాగిన కీచక పర్వాన్ని మరువకముందే ఢిల్లీలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ యువకుడు ఒకడు 'ప్రాంక్' పేరిట కీచక చర్యకు పాల్పడ్డాడు. యువతుల అనుమతి తీసుకోకుండానే బహిరంగంగా వారిని ముద్దుపెట్టుకొని.. ఆ వీడియోలు యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. 'క్రేజీ సుమిత్' పేరిట యూట్యూబ్ చానెల్లో పోస్టు చేసిన ఈ వీడియోలపై బెంగళూరు ఘటనల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కీచక చర్యలపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవ్వడంతో సదరు ప్రాంక్‌స్టర్ యూట్యూబ్ నుంచి ఆ వీడియోలు తొలగించాడు. తాను సరదాకు చేశానని, దీనిపై ఇంత ఆగ్రహం వస్తుందని అనుకోలేదని క్షమాపణ చెప్తూ ఓ వీడియో పెట్టాడు. యూట్యూబ్‌లో ఆదాయం కోసం నికృష్టమైన వీడియోలు పెట్టిన అతను.. తన క్షమాపణ వీడియోకు కూడా మంచి క్లిక్కులు వస్తుండటంతో దానినీ క్యాష్ చేసుకుంటున్నాడు. కాగా, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అతని తీరుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, బాధితులు ముందుకొచ్చి వివరాలు తెలుపాలని కోరారు. -
అంతరిక్షంలో వ్యోమగామి వెంటపడ్డ గొరిల్లా
అంతరిక్షంలోకి కుక్కలు వెళ్లడం మనకు తెలుసు కానీ ఈమధ్య గొరిల్లాలు కూడా వెళుతున్నాయా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో అవుననే అంటుంది. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఓ గొరిల్లా ప్రత్యక్షమవ్వడమే కాదు.. ఏకంగా ఓ వ్యోమగామిని వెంటపడి తరిమింది. అంతరిక్ష కేంద్రంలో ఒక్కసారిగా గొరిల్లాను చూసి కంగుతిన్న ఆ వ్యోమగామి బిత్తరపోవడమే కాదు.. భయంతో పరుగులు కూడా పెట్టాడు. ఇంతకు ఆ గొరిల్లా అంతరిక్ష కేంద్రంలోకి ఎలా వచ్చింది? వ్యోమగామిని ఎందుకు తరిమింది? అంటే దానికి వెనుక మరో వ్యోమగామి చిలిపి పని.. సహచర అంతరిక్ష యాత్రికుడ్రిని టీజ్ చేయాలన్న కొంటె ఆలోచన దాగి ఉంది. అమెరికాకు చెందిన వ్యోమగామి స్కాట్ కెల్లీ అంతరిక్షంలోని ఐఎస్ఎస్లోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. మార్చి మొదటి వారంలో అతను భూమికి తిరిగి రావాలి. వెళ్లేముందు ఏదో ఒక తుంటరి పని చేసి అంతరిక్ష కేంద్రంలో ఉన్న తన తోటి మిత్రులను ఆటపట్టించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గొరిల్లా అవతారమెత్తాడు. అంతరిక్ష కేంద్రంలోని జీరో గ్రావిటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. గొరిల్లా వేషం కట్టిన స్కాట్ కెల్లీ ఒక తెల్ల డబ్బానుంచి బయటకు వచ్చి గాల్లో తేలుతూ బ్రిటిష్ ఆస్ట్రోనాట్ టిమ్ పీక్ వెంటపడ్డాడు. అతనేమో నిజంగానే గొరిల్లా వచ్చిందనుకుని దాన్నుంచి తప్పించుకునేందుకు తెగ తంటాలు పడ్డాడు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తోంది. గొరిల్లా సూట్‌ను స్కాట్ సోదరుడు మార్క్ అంతరిక్ష కేంద్రానికి పంపాడు. ఈ వీడియోను మొదట పోస్ట్ చేసింది కూడా అతనే. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్న అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీనే.