
కొందరు సరదా కోసం చేసే ప్రాంక్ వీడియోలు నవ్వు తెప్పిస్తాయి. మరికొందరు తమ కుటుంబ సభ్యులతో ప్రాంక్ పనులు చేసి ఆటపట్టిస్తారు. అవి సక్సెస్ అయితే, ఫన్ ఖాయం. తాజాగా లోసేనా అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేసిన ఓ నకిలీ పాము వీడియో వైరల్‌గా మారింది. తన చిన్నారి కూతురుతో కలిసి బెడ్ రూమ్‌లో ఉన్న లోసేనా.. ఆమె భర్త బెల్టును పాములాగా సెట్ చేసి.. ఆ గది బయట ఉన్న భర్తతో ‘ఇక్కడేదో ఉందండి’అని కేక వేసి చెప్తుంది. దాంతో అతను చేతిలో ఓ కత్తి పట్టుకేని గది తలుపు తెరచుకుని లోనికి వస్తాడు.. దాని అంతు చూద్దామని.
అయితే, తలుపు తెరవగానే సరిగ్గా అతని కాళ్ల వద్దే ఉన్న బెల్టును చూసి పాముగా భ్రమపడతాడు. భయంతో ఒక్కసారిగా బిగ్గరగా అరచి, చేతిలో ఉన్న కత్తితో దానిపై దాడి చేస్తాడు. అప్పటికే నవ్వును అదిమిపట్టుకుని ఉన్న లోసేనా, ఆమె కూతురు పగలబడి నవ్వుతారు. ఇక కేకలు వేస్తూ తలుపు ఆవలకు వెళ్లిన భర్త...అక్కడ ఉన్నదేంటి అని అడిగేసరికి.. ‘అది నీ బెల్టే’అని తల్లీపిల్లలు మరోసారి ఫన్‌పండగ చేసుకుంటారు. మరోసారి బుక్ అయ్యాడని అంటారు. అయితే,‘నాన్నా పులి’ మాదిరిగా ఈ ప్రాంక్ వేషాలు ఎందుకని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. నిజమైన పాము వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ నవ్వులాటలు అని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment