కెనడాకు చెందిన సిమన్ లాప్రైజ్ అనే ప్రాంక్‌స్టర్ ఏకంగా పోలీసులే ఆశ్చర్యపోయేలా చేశాడు. కెనడాలోని మాంట్రియల్‌లో తన ఇంటి ముందు నోపార్కింగ్ ప్రదేశంలో ప్రఖ్యాత డీలోరియన్ డీఎంసీ-12 మోడల్ కారును అచ్చుగుద్దినట్టు మంచుతో తయారు చేశాడు. నిజమైన కారుకు ఉండే విధంగా చక్రాలు, అద్దాలు, వైపర్ ఇలా అన్నింటిని తయారుచేశాడు. కారుపై మంచుకురిస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలానే ఆ కళాఖండం ఉంది. రాత్రి సమయంలో ఆ మార్గంలో వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఆ కారును చూశారు. అది నిజమైన కారేమోనని అనుకున్నారు. కానీ అది నిజమైంది కాదని తెలిసి, సరదాకోసం చేశాడని నవ్వుకుని పోయారు. పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు ఆ కారును నిశితంగా పరిశీలిస్తుంటే సిమన్ దూరంగా ఉండి నవ్వుకున్నాడు. పోలీసులు ‘యూ మేడ్ అవర్ నైట్ హహహహ’ అని కారుపై ఒక నోట్ రాసి వెళ్లిపోయారు. ఇది సిమన్ తన ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఇది కేవలం సరదాకోసమే చేశానని సిమన్ లాప్రైజ్ తెలిపారు. మంచుతో డిఫరెంట్‌గా చేయాలనిపించింది. అందుకే కారును తయారుచేశానని సిమన్ తెలిపారు. అయితే నోపార్కింగ్‌లో ఆ కళాఖండం ఉండటంతో మరునాడు మంచును తొలగించే యంత్రాలతో ఆ స్నో కారును తీసేశారు.
స్నో కారు (ఇన్ సెట్ లో పోలీసులు రాసిన నోట్)
Comments
Please login to add a commentAdd a comment