సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడలో ఆన్‌లైన్ వ్యభిచారం ముసుగులో మోసాలు పెరిగిపోతున్నాయి. అసలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా చర్యలు తీసుకోని కారణంగా మరో అకృత్యం వెలుగుచూసింది. గుంటూరుకు చెందిన రాజేశ్వరి, ఆమె అల్లుడు ఇంటర్‌నెట్ మాధ్యమంగా చేసుకుని ఆన్‌లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొందరు యువతుల ఫొటోలు ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లలో అప్‌లోడ్ చేస్తూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతుండేవారు.
ఈ క్రమంలో తన ఫొటోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఓ బాధిత యువతి గుర్తించారు. ఆన్‌లైన్ వ్యభిచారానికి తాను అంగీకరిస్తున్నట్లు తెలుపుతూ కొందరు తన ఫొటోలు అప్‌లోడ్ చేసి వ్యాపారం చేస్తున్నారని విజయవాడకు చెందిన ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యువతుల జీవితాలతో చెలగాటం ఆడటంతో పాటు డబ్బులు వసూళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతోన్న అత్త రాజేశ్వరితో పాటు ఆమె అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ వీళ్లు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment