prostitution case
-
వారి వల్ల నా ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు.. చనిపోదామనుకున్నా: నటి యమున
సౌత్ ఇండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ప్రేక్షకుల అభిమాన తారగా యమున కొనసాగింది. 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఆమె జర్నీ సూపర్ స్పీడ్‌లో ఉన్న సమయంలోనే వివాహం జరగడం ఆపై... తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం ఆపేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. కానీ సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ వ్యభిచార కేసులో యమున పట్టుబడింది అని వార్తలు వచ్చాయి. ఈ ప్రభావం ఆమె కెరియర్‌పై కూడా పడింది. అయితే దీనిపై యమునకు న్యాయ స్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో ఆమెకు సంబంధించి ఎలాంటి పాత్ర లేదని కోర్టు కూడా స్పష్టం చేసింది. కానీ ఆమెను సోషల్‌మీడియా మాత్రం వదలడం లేదు. ఆమెపై ఇప్పటికీ తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి వ్యూస్ కోసం కొందరు చేస్తున్న పని వల్ల ఆమెను క్షోభకు గురిచేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ఓ టీవీ ప్రొగ్రామ్‌కి హాజరైన యమున..ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. 'సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల నా ఫ్యామిలీలో చాలామంది పక్కన పెట్టేశారు. అవన్నీ భరించలేక చనిపోదామని కూడా నిర్ణయించుకున్న. అప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి ఏం చేసుకోలేకపోయాను.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే విషయంపై గతంలో యమున ఏం చెప్పింది..? ఈ విషయంపై యమున గతంలో కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వార ఒక వీడియో చేసి తన బాధను పంచుకుంది. 'ఒక సమస్య వల్ల నేను బయటపడ్డాను.. అక్కడ ఏం జరిగిందో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఈ విషయంలో న్యాయస్థానం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ నేను సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్ననైల్స్తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది.' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Y Yamuna (@actressyamunaofficial) -
ఆరోజు హోటల్లో కావాలని ఇరికించారు.. ఇప్పటికీ వేధిస్తున్నారు : యమున
వెండితెరపై హీరోయిన్గా అలరించిన నటి యమున ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం, అభినయంతో చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే ఓ చేదు సంఘటన ఆమెకు ఎదురైంది. 2011లో బెంగుళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే వార్త అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో యమున కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఆ తర్వాత ఈ విషయంలో తన తప్పేమీ లేదని, కావాలనే తనని ఇరికించారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో యమున చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ తనను వేధిస్తున్నారని, ఆ సంఘటనకు సంబంధించి అసభ్యకరమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆవేదనను వెల్లడించింది. ''ఆ సంఘటన తాలూకూ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆరోజు అసలేం ఏం జరిగిందన్నది ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది.కానీ సోషల్‌మీడియాను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్ననైల్స్తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది'' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Y Yamuna (@actressyamunaofficial) -
చెరసాలలోకి మృగాలు.. ఏపీ అధికారిణిపై హైకోర్టు ప్రశంసలు
ఇంకా పూర్తిగా ఊహ కూడా తెలియని వయస్సు.. సరదాగా తోటి స్నేహితులతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాల్సిన చిన్నారిని 12 ఏళ్ల ప్రాయంలోనే మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించారు ఆ కిరాతకులు.. అంగట్లో వస్తువులా ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక విక్రయానికి తెగబడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తిప్పుతూ వ్యభిచారం చేయించారు. ఈ వేధింపులు తాళలేక నరరూప రాక్షసుల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. కేసును సీరియస్‌గా తీసుకున్న అప్పటి డీఎస్పీ, ప్రస్తుత అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.సుప్రజ ఈ చిన్నారికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో అపర కాళికలా మారారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేసులో ఎంత పెద్దవారు ఉన్నా పోలీసులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పది నెలల కాలంలో 79 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్కొక్కరికి 90 రోజుల నుంచి 120 రోజులపాటు రిమాండ్ విధించేలా చర్యలు చేపట్టారు. దీనిపై సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్‌ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. నిందితులందరికీ శిక్ష పడటం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరును హైకోర్టు సైతం ప్రశంసించింది. ఆదిశక్తిలా ఉరికిన ఏఎస్పీ సుప్రజ వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుల నుంచి తప్పించుకున్న బాలిక మేడికొండూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారి తనను తీసుకువెళ్లిన ప్రాంతాలన్నీ చెప్పినా అప్పటి స్టేషన్ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ కేసును అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ, ప్రస్తుత గుంటూరు జిల్లా ఏఎస్పీ కె.సుప్రజకు ఉన్నతాధికారులు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసు మూలాల్లోకి వెళ్లారు. ఆదిశక్తి అవతారంలా ముందుకురికారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి, బాలిక చెప్పిన ప్రాంతాలన్నింటిలోనూ నిఘా ఏర్పాటు చేసి వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజ చేతే విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించటంతోపాటు, కేసు ఛేదనలో ప్రతిభ చాటిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఒక కేసు.. 80 మంది దోషులు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలిక తల్లికి కోవిడ్ వచ్చి ఆస్పత్రిలో ఉన్న తరుణంలో తండ్రితో స్వర్ణ అనే మహిళ పరిచయం చేసుకుని బాలికను తనతో పంపిస్తే ఆమె బాగోగులు చూసుకుంటానని మాయమాటలు చెప్పింది. ఆ తర్వాత ఆమె మరొకరికి బాలికను విక్రయించింది. ఇలా బాలికను ఒకరి తర్వాత మరొకరు విక్రయిస్తూ చేతులు మార్చారు. వ్యభిచార కూపంలోకి దింపారు. తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో సుమారు 47 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల చేతుల్లో ఆ పసిమొగ్గ వాడిపోయింది. ఆఖరికి రాజస్థాన్–పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి తప్పించుకున్న పాప ఎలాగో మేడికొండూరు చేరి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో 80 మంది నిందితులుగా తేలారు. ఇప్పటికే 79 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు మాత్రం లండన్‌లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీస్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అతను ఎప్పుడు ఇండియాకి వచ్చినా అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయంతో కొంత ఉపశమనం సమాజంలో కొందరు మానవమృగాల్లా వ్యవహరిస్తున్నారు. చిన్నారులపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇది ఎంతో బాధాకరం. వికృత చేష్టలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. కిరాతకులకు శిక్షలు వేయించినప్పుడు బాధిత చిన్నారులకు కొంతైనా న్యాయం చేయగలిగామన్న సంతోషం కలుగుతుంది. మేడికొండూరు కేసులోనూ సుమారు 10 నెలలు కష్టపడి చార్జిïÙటు దాఖలు చేశాం. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తాం. – కె.సుప్రజ అడిషనల్ ఎస్పీ, గుంటూరు జిల్లా పసిపాపలకు న్యాయం చేసి.. సుప్రజ ఈస్ట్ డీఎస్పీగా పనిచేసిన సమయంలో కొత్తపేటలో ఐదేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితులు నేపాల్‌లో ఉంటే వారిని రప్పించి అరెస్టు చేయడంతోపాటు ప్రధాన నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. లాలాపేటలో రెండేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడినప్పుడు కూడా విచారణ చేపట్టి అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. -
Hyderabad: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. తోటి హిజ్రాలతో కలిసి..
బంజారాహిల్స్: ఆన్లైన్ వ్యభిచారం నడిపిస్తున్నారంటూ ఓ హిజ్రా ఇంటికి వెళ్లిన నలుగురు విలేకరులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... భారత్ తెలుగు న్యూస్‌లో న్యూస్ రిపోర్టర్ పి.సాయికిరణ్ రాజు, టీజీ 24/7 న్యూస్ రిపోర్టర్ కె.సంపత్ విజయ్ కుమార్, యాకుబ్‌పాషా, ప్రీలాన్స్ రిపోర్టర్ కె.ప్రశాంతి తదితరులు ఆదివారం అర్ధరాత్రి వెంకటగిరి సమీపంలోని హైలం కాలనీలో నివసించే హిజ్రా(26) ఇంటికి వెళ్లారు. ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ ఆమెతో చెప్పగా అందుకు సదరు హిజ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగింది. రూ. 2 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా తన సెల్ఫోన్లు ధ్వంసం చేశారని బాధిత హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు విధాలా బెదిరించడంతో బాధితురాలు సహచర హిజ్రాలతో కలిసి ఈ నలుగురు విలేకరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. (చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు) -
బాలికతో వ్యభిచారం కేసులో మరో 10 మంది అరెస్ట్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : బాలికను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో పోలీసులు మరో పది మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అడిషనల్ ఎస్పీ సుప్రజ, అరండల్‌పేట సీఐ రామానాయక్, పీసీఆర్ సీఐ టీవీ రత్నస్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడికొండూరుకు చెందిన బాలికను వ్యభిచార కూపంలో దించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 80 మందిని గుర్తించగా, ఇప్పటి వరకు 74 మందిని అరెస్ట్ చేశారు. మిగతా ఆరుగురిలో వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలు మనస్విని అరెస్ట్ చేయాల్సి ఉందని, మరో వ్యక్తి లండన్‌లో ఉండటంతో ఇప్పటికే నోటీసులిచ్చినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన జెస్సింత మహిళా మిత్రగా చెప్పుకుంటూ.. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలను గుర్తించి వ్యభిచార కూపంలోకి దించుతోందని పోలీసులు చెప్పారు. మైనర్‌తో వ్యభిచారం చేయించిన జెస్సింత, ఆమె కుమార్తె హేమలతలు గతంలో జైలుకు వెళ్లారని, జైలు నుంచి బయటకొచ్చాక.. పలువురు విటులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే మీ పేర్లు కూడా పోలీసులకు చెబుతామంటూ బెదిరిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు చెప్పారు. దీనిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే హేమలత పలువురు మగవాళ్లను మోసం చేసి డబ్బులు గుంజుకున్న ఘటనలూ వెలుగులోకి వచ్చాయన్నారు. పరారీలో ఉన్న మిగతా ఆరుగురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..
అల్లిపురం(విశాఖ దక్షిణం): గుట్టుగా లాడ్జీ రూంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులను సిటీ టాస్క్ఫోర్సు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలను రక్షించి మహిళా రక్షణ గృహానికి తరలించారు. టూటౌన్ పోలీసులు, టాస్క్‌పోర్సు ఏసీపీ ఎ.త్రినాథరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి లాడ్జీలలో గదులు బుక్ చేసి రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు టాస్క్ఫోర్సుకు సమాచారం అందింది. చదవండి: మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే.. ఈ మేరకు అల్లిపురంలోని సప్తగిరి లాడ్జీపై ఏసీపీ ఎ.త్రినాథరావు, టూటౌన్ పోలీసులు దాడి చేశారు. గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, 7 సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటినే వ్యభిచార గృహంగా మార్చిన మహిళ.. పదేళ్లుగా అమ్మాయిలతో గుట్టుగా..
శ్రీకాకుళం: పాలకొండ పట్టణం.. గటాలడెప్పి వీధిలోని ఒక ఇంట్లో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. సోమవారం సాయంత్రం ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు పక్కాగా దాడిచేసి నలుగురు విటులతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఒక మహిళ తన ఇంటినే వ్యభిచార గృహంగా నడుపుతోంది. గత పదేళ్లుగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తోంది. దీన్ని గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో ఇంటిపై దాడి చేయగా నలుగురు యువకులు, ఒక మహిళ పట్టుబడినట్లు ఎస్సై చెప్పారు. యువకులపై కేసు నమోదు చేశామని, సంబంధిత మహిళను ఆసుపత్రికి తరలించామన్నారు. నిర్వహకురాలుని అదులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు
తాడికొండ: వ్యభిచారం కేసులో టీడీపీ నేత, అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్యను ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. రాయపూడి – మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య ఓ రేకుల షెడ్డులో తుళ్లూరుకు చెందిన ఓ యువతితో రాసలీలలు సాగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దళిత జేఏసీ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తూ మహిళలను లొంగదీసుకుంటున్నాడనే ఆరోపణలు బసవయ్యపై ఉన్నాయి. యువతితో రాసలీలల్లో ఉండగా వీరికి కాపలాగా ఉన్న రామచంద్రవర్మ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. యువతితో కలిసి నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, ఆపై
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి పొత్కపల్లి పోలీసులు గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా అసలు విషయం బయట పడినట్లు సమాచారం. గత కొంతకాలంగా మడకకే చెందిన ఓ యువతితో రాకేశ్, మరికొందరు నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, నీలి క్యాసెట్ల దందాను నడుపుతున్నట్లు తెలిసింది. పోలీసులు పక్కా సమాచారంతో ఆ యువకుడిని పట్టుకోగా వీణవంక మండలంలోని చల్లూరు సెల్ పాయింట్లో నీలి క్యాసెట్లు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం. నీలి చిత్రాల ముఠా గత కొంతకాలంగా యువతులను, మహిళలను లొంగదీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెనక చాలామంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పొత్కపల్లి ఎస్సై ఎస్.లక్ష్మణ్‌ను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, వివరాలు తర్వాత చెబుతామని పేర్కొన్నారు. (చదవండి: Health Benefits of Butter: ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి) -
రిటైరయ్యే వయస్సు.. పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు
అనంతపురం క్రైం/సెంట్రల్: అతని పేరు మాధవరెడ్డి.. అనంతపురం నగర పాలక సంస్థలో వర్క్ ఇన్స్పెక్టర్. మరికొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ పొందే వయస్సు! రూ. లక్ష వరకూ జీతం. అయినా పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి అమ్మాయిలకు ఎర వేసి వ్యభిచార వృత్తిలోకి దింపుతుంటాడు. అనేక సంవత్సరాలుగా దీనినే వృత్తిగా పెట్టుకున్న ఇతగాడు ఇటీవల ఓ బాలికను వ్యభిచార కూపంలోకి దించే యత్నంలో దిశ పోలీసులకు పట్టుబడ్డాడు. (చదవండి: Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం) ఏనాడూ ఉద్యోగం చేసింది లేదు తన సర్వీసు మొత్తం అనంతపురం మున్సిపాలిటీ... ఆ తర్వాత నగర పాలక సంస్థలోనే పని చేస్తున్న మాధవరెడ్డి ఏనాడూ ఉద్యోగం చేసింది లేదు. ప్రముఖులకు అమాయకులైన అమ్మాయిలను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. తన అక్రమ సంపాదనలోను, నెలవారీ జీతంలోనూ నగర పాలక సంస్థ ఉన్నతాధికారులకు వాటాలు పంచుతూ కార్యాలయం మెట్టు కూడా ఎక్కకుండా నెట్టుకొస్తున్నాడు. ఆన్లైన్ ద్వారా అమ్మాయిలను బుక్ చేసుకునేలా విటులకు వెసులుబాటు కలి్పంచి తన చీకటి వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. ఈ క్రమంలోనే ఇతనిపై ఇతర రాష్ట్రాల్లోనూ పోలీసులు కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరేందుకు అప్పట్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి రూ.50 లక్షలు, సూపరింటెండెంట్‌కు రూ.లక్షల్లో ముట్టజెప్పినట్లు ఆ సంస్థ ఉద్యోగులే బాహటంగా చెబుతున్నారు చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి సత్ఫలితాన్నిచ్చిన ‘దిశ’ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం సత్ఫలితాన్నిస్తోంది. బాధితులు ఎవరైనా ఆశ్రయిస్తే తక్షణమే దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మాధవరెడ్డి పన్నిన ఉచ్చు నుంచి తప్పించుకున్న ఓ బాలిక నేరుగా డీఎస్పీ శ్రీనివాసులును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఈ నెల 9న కేసు నమోదు చేసిన దిశ పోలీసులు వెంటనే రంగంలో దిగారు. నగర శివారులోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మాధవరెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. బాధితులు ముందుకు రావాలి మాధవరెడ్డి ఉచ్చులో చిక్కుకున్న బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయాలని దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సూచించారు. బుధవారం సాయంత్రం దిశ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్తులో మాధవరెడ్డి లాంటి వంచకుల చేతిలో ఏ ఒక్కరూ మోసపోకుండా ఉండేందుకు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ...
నరసరావుపేట టౌన్(గుంటూరు జిల్లా): తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి తనతో ముంబాయిలో వ్యభిచారం చేయించి ఆ డబ్బు తీసుకొని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన ఓ వివాహిత నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.ప్రభాకరరావు కథనం మేరకు. 26 ఏళ్ల వివాహిత భర్తతో విడిపోయి పెద్దకుమార్తెతో కలిసి పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న తల్లి వద్దకు చేరుకుంది. 2017 నుంచి తల్లితోనే నివసిస్తోంది. అప్పటికే ఆమె తల్లి, వినుకొండకు చెందిన దూదేకుల మీరావలితో సహజీవనం చేస్తోంది. తాను చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయకపోతే వివాహితను, ఆమె కుమార్తెను చంపుతానని మీరావలి భయపెట్టాడు. అయితే దీనికి ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో దూదేకుల మీరావలి, తన స్నేహితుడైన చాగల్లు గ్రామానికి చెందిన సైదాతో కలిసి ఆ యువతిని కొట్టి బలవంతంగా ముంబాయి తరలించి తొమ్మిది నెలలపాటు వ్యభిచారం చేయించారు. వచ్చిన డబ్బును యువతి కుమార్తె పేరుపై వేస్తామని నమ్మబలికిన మీరావలి, సైదా తమ అకౌంట్లకు జమ చేసుకున్నారు. తొమ్మిది నెలల అనంతరం నరసరావుపేటకు వచ్చిన ఆమె తన డబ్బు గురించి మీరావలిని ప్రశ్నించగా తనను కొట్టి మళ్లీ బలవంతంగా ఐదు నెలలపాటు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యవభిచారం చేయించారని పేర్కొంది. కొంతకాలంగా మీరావలి చెప్పిన పని చేయకూడదని ఆ వివాహిత నిర్ణయించుకుంది. అయితే మళ్లీ వ్యభిచారం చేయకపోతే చంపుతామని మీరావలి, సైదా బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. తనతో బలవంతంగా వ్యభిచారం చేయించి సుమారు రూ.15 లక్షలు కాజేసిన మీరావలి, సైదాపై చర్యలు తీసుకోవాలని ఆమె చేసిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం.. టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా! -
గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు
సాక్షి, గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్‌పేట్ ఓయూ కాలనీలో ‘ఎంఎస్పీ గెస్ట్ ఇన్’గెస్ట్ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్‌హౌజ్‌ను బాగా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్‌హౌజ్ వాచ్మెన్ జనైనాజెమ్ ఉద్దీన్ మలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్ పరారీలో ఉన్నాడు. వాచ్‌మెన్‌తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్‌లను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్ చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం -
ప్రేమ పేరుతో నమ్మించి.. వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లో అదృశ్యమై.. హైదరాబాద్ చేరిన యువతి జాడను రాచకొండ పోలీసులు 10 గంటల వ్యవధిలోనే గుర్తించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ ఆదేశాలతో మనుషుల అక్రమ రవాణా విభాగ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటా ఆధారంగా బాధితురాలి జాడను గుర్తించి రక్షించింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో ఓ యువకుడు 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. శనివారం ఉదయం ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెంటనే ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పారు. దీంతో అక్కడ మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తివాహిని ఎన్జీవో సభ్యులు కూడా అప్రమత్తమై హైదరాబాద్‌లోని ప్రజ్వల ఎన్జీవో బృందానికి తెలిపారు. అదే సమయంలో పశ్చిమబెంగాల్ పోలీసులు, ప్రజ్వల సంస్థ ప్రతినిధులు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితురాలు తల్లిదండ్రులకు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లుగా గుర్తించి నిఘా పెట్టారు. కొన్ని గంటల వ్యవధి లోనే మరో ఫోన్ నంబర్ నుంచి తల్లిదండ్రులకు బాధితురాలు కాల్ చేయడంతో దాన్ని ట్రేస్ చేసి ఆ అమ్మాయిని రక్షించారు. ‘ఇరు రాష్ట్రాల పోలీసులు, శక్తివాహిని, ప్రజ్వల సంస్థల సభ్యులు ఈ అమ్మాయిని రక్షించేందుకు దాదాపు 5 గంటల పాటు శ్రమించారు. చివరికి శనివారంరాత్రి 11.30 గంటల ప్రాంతంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు ఛేదనలో సీపీ మహేశ్‌భగవత్ చూపిన చొరవ ప్రశంసనీయం’అని ప్రజ్వల సంస్థ నిర్వాహకు రాలు డాక్టర్ సునీతా కృష్ణన్ తెలిపారు. -
షార్ట్ ఫిల్మ్‌లలో అవకాశమంటూ.. వ్యభిచారంలోకి
సాక్షి, నెల్లూరు : షార్ట్ ఫిల్మ్‌లలో అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతూ నగరంలోని మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న జాకీర్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఒక బాలిక ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఎనిమిది మంది యువతులను పట్టుకున్నారు. అనంతరం యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితుడు జాకీర్‌ను విచారించగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులున్నట్టు తేలింది. -
‘నా తల్లిదండ్రులే వ్యభిచారం చేయిస్తున్నారు’
సాక్షి, ముంబై: మానవ సభ్యసమాజం తలదించుకునే హృదయవిదారకర ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. మైనర్ బాలికకు బలవంతపు వివాహం చేసి, అనంతరం వ్యభిచార కూపంలోకి దింపారు ఆమె తల్లిదండ్రులు. ముంబై సమీపంలోని మాన్‌ఖర్థ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. మాన్‌ఖర్థలో నివసిస్తున్న ఓ బాలికకు ఆమె కుటుంబ సభ్యులు ఏడాది క్రితం బాల్య వివాహం జరిపించి అమానవీయ ఘటన పాల్పడ్డారు. తనకు పెళ్లి ఇష్టం లేదన్నా వినకుండా 15 ఏళ్ల బాలికను 35 ఏళ్ల వయసు గల వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. అయితే అతనితో జీవించడానికి ఇష్టపడని ఆ బాలిక కొంత కాలం తరువాత తిరిగి పుట్టింటికి చేరుకుంది. అనంతరం ఆమె తల్లిదండ్రులు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. కుటుంబ పోషణ కొరకు వ్యభిచారం చేయల్సిందిగా తల్లిదండ్రులు, ఆమె సోదరుడు బలవంతపెట్టారు. వారి వేధింపులను బరించలేని బాలిక సమీపంలోని పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులు, భర్త, సోదరుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వ్యభిచారం చేయాలంటూ బలవంతపెడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు బాలిక ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులు, సోదరుడు, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. అయితే బాలిక సొంత సోదరుడు కూడా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వారిపై పోక్స్, మైనర్ బాలికల వివాహ నిషేదిత చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై బాలిక 2018 ఏప్రిల్ 22న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందితులను ఏడాది తరువాత అరెస్ట్ చేయడం గమనార్హం. -
ఆన్లైన్ వ్యభిచారం.. యువతుల అసభ్య ఫొటోలతో!
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడలో ఆన్లైన్ వ్యభిచారం ముసుగులో మోసాలు పెరిగిపోతున్నాయి. అసలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా చర్యలు తీసుకోని కారణంగా మరో అకృత్యం వెలుగుచూసింది. గుంటూరుకు చెందిన రాజేశ్వరి, ఆమె అల్లుడు ఇంటర్నెట్ మాధ్యమంగా చేసుకుని ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొందరు యువతుల ఫొటోలు ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లలో అప్లోడ్ చేస్తూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతుండేవారు. ఈ క్రమంలో తన ఫొటోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఓ బాధిత యువతి గుర్తించారు. ఆన్లైన్ వ్యభిచారానికి తాను అంగీకరిస్తున్నట్లు తెలుపుతూ కొందరు తన ఫొటోలు అప్లోడ్ చేసి వ్యాపారం చేస్తున్నారని విజయవాడకు చెందిన ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యువతుల జీవితాలతో చెలగాటం ఆడటంతో పాటు డబ్బులు వసూళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతోన్న అత్త రాజేశ్వరితో పాటు ఆమె అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ వీళ్లు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సెక్స్ రాకెట్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్!
చెన్నై : సెక్స్ రాకెట్ కేసులో తమిళ సీనియర్ నటి సంగీత బాలన్ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనతో తమిళ సినీవర్గాల్లో కలకలం రేగింది. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు సహా పలువురు యువతులను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. నటి సంగీతతో పాటు సురేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ధర్మాసనం ఇద్దరికి కస్టడీ విధించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను రెస్క్యూహోంకు తరలించారు. ఈ సెక్స్ రాకెట్లో సంగీత బాలన్‌తో పాటు మరికొందరి సీని ప్రముఖుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 1996లో కరుప్పు రోజా తమిళ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన సంగీత బాలన్ అనంతరం పలుచిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. అనేక టీవీ ప్రొగ్రామ్స్‌లో కూడా నటించారు. రాధిక శరత్ కుమార్ ‘వాణి రాణి’ సీరియల్లో సంగీత బాలన్ అత్త పాత్రతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. -
వ్యభిచారం కేసులో వీరిద్దరే కీలకం!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లోని రెండు స్టార్ హోటల్స్‌పై శనివారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. వేర్వేరుగా వ్యభిచార దందాలు నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇరువురిని రెస్క్యూ చేశారు. నిర్వాహకుడు కాస్టింగ్ డైరెక్టర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. ముంబైకి చెందిన మోనిశ్ కపాడియా తెలుగు, హిందీ చిత్రాలకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈవెంట్స్, ఫ్యాషన్ షోలు నిర్వహించే ఇతను కొన్నేళ్లుగా వ్యభిచార దందా నిర్వా హకుడిగా మారాడు. నగరంలోని స్టార్ హోటళ్లలో వర్ధమాన హీరోయిన్లతో వ్యభిచారం నిర్వహిస్తుంటాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనార్దన్ అలియాస్ జానీ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వ్యభిచార నిర్వాహకుడు. గుంటూరు జిల్లాకు చెందిన డి.వెంకట్రావును సహాయకుడిగా నియమించుకుని ఈ దందా నిర్వహిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల సాయంతో.. వీళ్లు వర్ధమాన హీరోయిన్లతో పాటు కొందరు టీవీ ఆర్టిస్టులనూ ముంబై, కోల్‌కతాల నుంచి రప్పిస్తున్నారు. మోనిశ్, వెంకట్ వేర్వేరుగా ‘కస్టమర్ల’తో కూడిన 40 నుంచి 50 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా సినీ, టీవీ నటిని ఉచ్చులోకి దింపిన వెంటనే వారి ఫొటోలను వాట్సాప్‌లో కస్టమర్లకు షేర్ చేస్తుంటారు. వారి ఆసక్తి మేరకు ఆయా బాధితురాళ్లను విమానాల్లో తరలిస్తుంటారు. స్టార్‌హోటల్స్‌లో రూమ్స్ సిద్ధం చేసి లాబీల్లోనే కస్టమర్‌తో నగదు లావాదేవీలు పూర్తి చేస్తారు. కస్టమర్లకు హోటల్లో గది నంబర్ చెప్పి యాక్సిస్ కార్డు ఇచ్చి పంపిస్తుంటారు. ఒక్కో కస్టమర్ల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తుంటారు. శుక్రవారం మోనిశ్ తెలుగు సినీ రంగానికి చెందిన ఓ వర్ధమాన హీరోయిన్ను బంజారాహిల్స్ పరిధిలో... శనివారం సిటీకి చేరుకున్న వెంకట్రావు బెంగాలీ టెలివిజన్ రంగానికి చెందిన నటిని పంజగుట్ట పరిధిలో ఉన్న హోటల్స్‌లో ఉంచి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, కేఎస్ రవి తమ బృందాలతో రెండో హోటళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. మోనిశ్, వెంకట్రావులను అరెస్టు చేయడంతో పాటు ఇద్దరు బాధితురాళ్లను రెస్క్యూ చేశారు. వీరి నుంచి రూ.50 వేల నగదు, సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జానీ కోసం గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ రిమాం డ్కు, బాధితురాళ్లను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల కాల్ డేటాతో పాటు వీటిలోని వాట్సాప్ గ్రూపుల్నీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు నిర్వాహకుల కస్టమర్ల జాబితాలో సిటీకి చెందిన పలువురు వ్యాపారవేత్తలతో పాటు బడాబాబులూ ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోలేమని, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటేనే అరెస్టుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
వ్యభిచారంలో దొరికిన టాలీవుడ్ నటి
-
వ్యభిచారంలో అడ్డంగా దొరికిన టాలీవుడ్ నటి
సాక్షి, హైదరాబాద్ : సెక్స్ రాకెట్లు నటీనటులు దొరకడం కొత్తేంకాదు. అప్పుడప్పుడు పోలీసులకు దొరకడం జరుగుతూ ఉంటుంది. తాజాగా హైదారాబాద్‌లో మరో వర్థమాన నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. జూన్ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనా ఓ ప్రముఖ హోటల్లో పోలీసులు జరిపిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడింది. ఈ దాడుల్లో రిచాతోపాటు, ప్రముఖ కాష్ట్యూమ్ డిజైనర్ మౌనిక్ కడాకియా, హోటల్ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరివెనుక పెద్ద తలలే ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యభిచారంలో దొరికిన టాలీవుడ్ నటి -
ఐపీసీ సెక్షన్ 497ను సమీక్షిస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: వ్యభిచారం కేసుల్లో పురుషుల్ని దోషులుగా, మహిళల్ని బాధితులుగా పరిగణిస్తూ 157 ఏళ్ల కిత్రం రూపొందించిన చట్టం రాజ్యాంగబద్ధతను సమీక్షించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ విషయమై నాలుగు వారాల్లో స్పందనను తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ఇటలీలో ఉంటున్న భారత పౌరుడు జోసెఫ్ షైన్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. భర్త అనుమతి లేకుండా భార్య మరో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్ 497 ప్రకారం దాన్ని వ్యభిచారంగా పరిగణిస్తున్న విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది. ఒకవేళ మరో పురుషుడితో శృంగారానికి తన భార్యను భర్త అనుమతిస్తే అది వ్యభిచారం కాదని చట్టంలో ఉండటం భార్యను ఓ వస్తువుగా మార్చడమేనని అభిప్రాయపడింది. ఇది రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కుకు, లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. భర్త కాకుండా మరో పురుషుడితో భార్య శృంగారంలో పాల్గొన్నప్పుడు సదరు వ్యక్తితో పాటు ఆమెకూ శిక్ష విధించకపోవడాన్ని సమీక్షిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. సెక్షన్ 497 మహిళల పట్ల సానుకూలంగా ఉందనీ.. ఇది ప్రాథమిక హక్కుల్ని, లింగ సమానత్వాన్ని ఉల్లంఘిస్తోందని విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
అంగడి బొమ్మలు
వీరే కాదు బేతంచర్లకు చెందిన 15 ఏళ్ల బాలిక, కర్నూలు నగరంలోని బంగారుపేటకు చెందిన 17 ఏళ్ల బాలిక, పాములపాడు మండలానికి చెందిన వేంపెంట గ్రామానికి చెందిన ఒక నెల శిశువును తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇలాగే విక్రయించారు. ఎమ్మిగనూరు మండలం నగరూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కర్నూలు నగరంలోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా గర్భిణి అని తేలింది. ఆమెను లోక్‌అదాలత్ జడ్జి ఎదుట హాజరుపరచగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజ్వల హోమ్‌కు తరలించారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి (ఇతనికి అప్పటికే వివాహమైంది) మోసం చేశాడు. సోషల్ వర్కర్‌కు ఈ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను గుర్తించి తిరుపతిలోని చైల్డ్‌హోమ్‌కు తరలించారు. గోనెగండ్ల మండలం చింతలమాను వీధికి చెందిన ఏడాది పాపను తల్లిదండ్రులు ఆర్థిక కారణాలతో విక్రయించారు. ఈ విషయం తెలిసి డీసీపీయూ వారు పాపను స్వాధీనం చేసుకుని కర్నూలులోని శిశుగృహలో ఉంచారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కోసిగి, కౌతాళం, డోన్, కృష్ణగిరి, వెల్దుర్తి, కర్నూలు, కల్లూరు మండలాల్లో పేదరికాన్ని ఆసరగా చేసుకుని దళారులు చెలరేగిపోతున్నారు. అభం శుభం తెలియని అమాయక ఆడపిల్లలను మోసం చేసి వ్యభిచార కూపాలకు తరలిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో ఈ ప్రాంతాల నుంచి 160 మంది దాకా ఆడపిల్లలను కొనుగోలు చేసి మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబయి, పూణే నగరాల్లో ఉండే రెడ్‌లైట్ ఏరియాల్లోని వ్యభిచార కూపాల్లో అమ్మేశారు. గత రెండేళ్ల నుంచి 17 మందిని ఇలా కొనుగోలు చేసి విక్రయించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. వీరుగాక తప్పిపోయిన పిల్లలు 59 మంది ఉన్నారు. వీరిలో సగం మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని సమాచారం. ఆర్థిక కారణాతోనే.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఏటా కరువు పరిస్థితులు నెలకొనడం సహజం. ఈ కారణంగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి పేదలు బతుకుదెరువు కోసం ముంబయి, బెంగళూరు, గుంటూరు వంటి నగరాలకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. దీనికితోడు నిరక్షరాస్యత, మూఢనమ్మకాల కారణంగా కొన్ని కుటుంబాల్లో అధిక సంతానం ఉంది. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు, కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని దళారులు రంగంలోకి దిగుతున్నారు. ఆడపిల్లలున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పి పిల్లలను తీసుకెళ్తున్నారు. వారిని ముంబయి, బెంగళూరులలోని మహానగరాల్లో పెద్దల ఇంట్లో పనిలో పెడతామని నమ్మబలుకుతున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులకు కొంత సొమ్ము అడ్వాన్స్‌గా ముట్టచెబుతున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నా హాయిగా ఉంటారన్న నమ్మకంతో దళారుల బుట్టలో పడుతున్నారు. వారి పిల్లలను దళారుల చేతిలో పెట్టడమే తరువాయి ముంబయి రైలెక్కిస్తున్నారు. రైల్వేపోలీసుల చొరవతో... ఇలా దళారుల వలలో పడి రైలెక్కిన చిన్నారుల్లో చాలా మంది వ్యభిచార కూపాలకు చేరుతున్నారు. అదృష్టం బాగుంది కొందరు పిల్లలు రైలు ప్రయాణంలో రైల్వే పోలీసుల కంట పడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఇలా దళారుల నుంచి రక్షించబడిన కేసుల్లో అధిక శాతం రైల్వేపోలీసుల చొరవ వల్లేనంటే అతిశయోక్తి కాదు. బాలల రక్షణకు కఠిన చట్టాలున్నాయి లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలపై లైంగికదాడి, లైంగిక హింస చేస్తే దానిని అత్యాచారంగానే పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు ఏడు సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది. బాలలకు సహాయం, పునరావాసం కల్గించేందుకు ప్రత్యేక బాలల పోలీసుల బృందం ఫిర్యాదు అందిన తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేసి, బాలలకు ఆదరణ, రక్షణ కల్పించేందుకు షెల్టర్ హోమ్‌కు తరలిస్తాము. ఈ మేరకు కర్నూలులో స్వధార్‌హోమ్ ఉంది. అలాగే తిరుపతి, మహబూబ్‌నగర్‌లలో విద్యాభ్యాసం చేసేందుకు ప్రత్యేక పాఠశాలలు, అనంతపురంలో కాలేజ్ ఎట్ హోమ్‌లు ఉన్నాయి. ఇక్కడ బాలికలకు విద్యా,వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. టి.శారద, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి -
వ్యభిచారం చేస్తూ దొరికిన టీడీపీ నేత
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలకేంద్రంలో ఓ టీడీపీ నాయకుడు వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో సదరు నేత వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. పట్టుబడిన టీడీపీ నేత ముప్పాళ్ల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుబాబుగా గుర్తించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు యువతులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరినీ స్టేషన్‌కు తరలించారు. -
వ్యభిచారం కేసులో క్రికెటర్ గాళ్ ఫ్రెండ్, నటి అరెస్ట్
పుణె: వ్యభిచారం కేసులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గాళ్ ఫ్రెండ్, ప్రముఖ ముంబై మోడల్, టీవీ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి పుణెలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌పై పోలీసులు దాడి చేసి మోడల్‌తో పాటు కృష్ణ, విపుల్ దహల్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన మోడల్ పలు జ్యువెలరీ బ్రాండ్ యాడ్స్‌లో నటించింది. ఆమె సొంతూరు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. ముంబైలో ఉంటూ మోడల్‌గా పనిచేస్తున్న ఆమెను పుణె తీసుకువచ్చి వ్యభిచార రాకెట్లో దించారు. విటుడితో 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని నిర్వాహకులు ఆమెను పంపినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మహిళల సంక్షేమ కేంద్రానికి పంపారు. అయితే సెంటర్ సిబ్బందిపై మోడల్ దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
శ్వేతా పత్రం
తెల్లగా ఉన్నవన్నీ పాలు కావు. నల్లగా ఉన్నవన్నీ నీళ్లు కావు. కానీ, తెల్లటి కాగితంపైన చిన్న మచ్చయినా కనబడుతుంది. నిజానికి.. తెల్ల కాగితంపై ఎవరైనా మచ్చ వెయ్యొచ్చు. శ్వేతాబసును ఒక మచ్చ వేధించింది.. తరిమింది.. కరిచింది. కానీ, ఆమె మనోధైర్యాన్ని హరించలేకపోయింది. యస్.. షి ఈజ్ బ్యాక్. ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన శ్వేతా పత్రం ఈ ఇంటర్వ్యూ. ఆ రోజు ఏం జరిగింది ...? రెండేళ్ల క్రితం శ్వేతాబసు ప్రసాద్‌ను ఓ స్టార్ హోటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెను రెస్క్యూ హోమ్‌కి తరలించాలని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు శ్వేతాకు క్లీన్ చీట్ ఇచ్చింది. కేసును కొట్టివేస్తూ రెస్క్యూ హోమ్ నుంచి విడుదల చేయాలని ఉత్తర్వ్యులు ఇచ్చింది. నిజానికి ‘సంతోషం’ సినీవార పత్రిక అవార్డుల వేడుకలో పాల్గొనడానికి శ్వేత హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి స్టార్ హోటల్లో బస చేశారామె. అవార్డు ప్రదానోత్సవం పూర్తి కాగానే ముంబై వెళ్లిపోవాలనుకున్నారు. కానీ, శ్వేత ఫ్లైట్ మిస్ అయ్యారు. దాంతో హోటల్లోనే ఉండిపోయారు. ఆ సమయంలో హోటల్‌పై పోలీసులు దాడి చేయడం, అరెస్ట్ చేయడం జరిగాయి. రెండేళ్ల క్రితం మీ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఇంకా వెంటాడుతోంది. ప్రాస్టిట్యూషన్ కేసులో ఏ నటి పట్టుబడినా కొందరు ఉదాహరణగా మీ పేరు లాగడం గురించి? శ్వేతాబసు ప్రసాద్ : నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నా పేరుని లాగుతున్నారంటే నేను పాపులర్ అని అర్థం. నా పేరు స్పెల్లింగ్ బాగుందనీ, నా ఫొటోలు బాగున్నాయనీ అర్థం (నవ్వేస్తూ). నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకునే వాళ్ల గురించి వదిలేద్దాం. మీడియా నాకు సపోర్ట్‌గానే ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ‘కంగ్రాట్స్’ అంటుంటారు. నా మంచి కోరుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. నాకు వాళ్లు చాలు. ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోను. అయినా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయించలేం. ఎవరి సంస్కారం వాళ్లది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. పర్సనల్‌గా మధ్యలో కొన్ని సమస్యలు. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? సమస్యలు కామన్ అండి. సెలబ్రిటీల జీవితంలో తప్పవు. నా లైఫ్‌లో ఇప్పటివరకూ నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ నా సక్సెస్‌కి దిష్టిలా భావిస్తున్నాను. చిన్న వయసులోనే పెద్ద పెద్ద విజయాలు చూశాను. ఆ విజయాల ముందు నేను ఎదుర్కొన్న సమస్యలు చాలా చిన్నవి. ఇప్పుడు లైఫ్ అంటారా.. చాలా ప్రశాంతంగా ఉంది. వెరీ కూల్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘మక్డీ’, ‘ఇక్బాల్’ మాత్రమే చేశారు. ఎందుకని? ‘మక్డీ’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. చదువు పాడవుతుందని అమ్మా నాన్న వద్దన్నారు. ‘ఇక్బాల్’కి సుభాష్ ఘయ్ నిర్మాత. అంత పెద్ద నిర్మాత అడగడంతో కాదనలేదు. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కొంతమంది పేరెంట్స్ డబ్బులు కోసం ఆలోచించి, సినిమాలు ఒప్పుకుంటారు. మా అమ్మానాన్న అలా కాదు. అందుకే ‘ఇక్బాల్’ తర్వాత సినిమాలు చేయనివ్వలేదు. నా బాల్యం సో స్వీట్. స్కూల్లో మంచి మార్కులొచ్చేవి. ఆర్టిస్ట్‌గా మంచి పేరొచ్చింది. నాది మంచి ఫ్యామిలీ. ఇన్ని తియ్యని విషయాలున్నాయి. పెద్దయ్యాక చిన్న చేదు అనుభవం. ఇప్పుడు చేస్తున్న ‘మిక్సర్ పొట్లం’ సినిమా టైటిల్ నా లైఫ్‌కి వర్తిస్తుంది. నా లైఫ్‌లో టూ మచ్ స్వీట్, చిన్నపాటి కారం ఉంది. నో ప్రాబ్లమ్. ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే.. స్వీట్ గురించి కాకుండా హాట్ గురించే పదే పదే మాట్లాడతారు... అది నా సమస్య కాదు. ‘మీరిలా మాట్లాడొద్దు’ అని నేనెవరితోనూ అనలేను. అలా చెప్పాలంటే ఎంతమందికి చెప్పాలి? అయినా ఎందుకు చెప్పాలి? మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది కదా. మాట్లాడనివ్వండి. ఆ సంగతి పక్కన పెడితే.. నా గురించి మంచి విషయాలు మాట్లాడేవాళ్లూ ఉన్నారు. ఏదైనా కాంట్రవర్శీ వచ్చినప్పుడు దాన్ని ఫోకస్ చేసిన మీడియా ఆ తర్వాత నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడింది. ఇలా మంచి విషయాలు మాట్లాడేవాళ్లూ ఉన్నారు. అది చాలు. మీ మాటల్లో పరిణతి కనిపిస్తోంది.. ఎదుర్కొన్న చేదు అనుభవాలే దానికి కారణమా? మీకో విషయం చెబుతా. నా జీవితంలో జరగకూడనిది జరిగినప్పుడు నా కంటి నుంచి ఒక్క చుక్క కూడా రాలేదు. నాకు ఏడవడం అంటే ఇష్టం ఉండదు. న్యాయస్థానం గురించి ఓ విషయం చెబుతాను. ఇండియాలో ఏ కేసుకైనా తీర్పు దొరకాలంటే ఏళ్లు పడుతుంది. కానీ, నిందితురాలిగా ముద్రపడి, నేను న్యాయస్థానం ముందుకొచ్చిన రెండే వారాల్లో నాకు ‘క్లీన్ చిట్’ ఇచ్చారు. కోర్ట్ క్లీన్ చిట్ ఇవ్వగానే.. నాకు మొదట శుభాకాంక్షలు చెప్పింది హైదరాబాద్ పోలీసే. న్యాయస్థానమే తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా ఆ విషయం గురించి ఏదేదో మాట్లాడుతున్నవాళ్లను ‘ఫూలిష్’ అనడం మినహా నేనేం చేయలేను. అంతా జరిగి రెండేళ్లయింది. ఇంకా ఎందుకు? మళ్లీ మళ్లీ మాట్లాడుకోవడంలో అర్థం లేదు. గడచిన మూడేళ్లల్లో తెలుగులో కనిపించలేదు. ఈ గ్యాప్‌లో ఏం చేశారు? మా్స్ కమ్యూనికేషన్ కోర్స్ చేశా. ఇప్పుడు నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్‌ని (నవ్వుతూ). ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం మీద ‘రూట్స్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశా. ‘ఇంటీరియర్ కేఫ్ నైట్’ పేరుతో ఓ షార్ట్ ఫిలిం నిర్మించి, యాక్ట్ చేశాను. నసీరుద్దిన్ షా కూడా నటించారు. ఆల్రెడీ ఆన్లైన్లో ఈ షార్ట్ ఫిలింకి 1 మిలియన్ హిట్స్ దాటాయి. ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ప్రారంభించిన ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’లో నటిస్తున్నాను. ఈ మూడేళ్లల్లో నేను తెలుగు స్క్రీన్ మీద కనిపించలేదు కానీ బిజీగానే ఉన్నాను. కొంచెం ఫ్రీ అవుతున్న సమయంలో దర్శకుడు సతీష్ కలసి ‘మిక్చర్ పొట్లం’ కథ చెప్పారు. తెలుగుకి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఒప్పుకున్నాను. కమ్‌బ్యాక్‌కి మంచి మూవీ అవుతుందని అనిపించడానికి కారణం? ఇందులో నేను ట్రావెల్స్ బిజినెస్ చేస్తాను. ఒక బస్సు ఉంటుంది. షిర్డీ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే బస్సు. అందులో భిన్న మనస్తత్వాలున్న వ్యక్తులుంటారు. మిక్చర్ అంటేనే చాలా ఐటమ్స్ ఉంటాయని అర్థం. ఈ సినిమాలో అన్ని రకాల ప్రేక్షకులకూ కావల్సినవి ఉన్నాయి. అందుకే కమ్ బ్యాక్‌కి మంచి మూవీ అవుతుందనుకున్నా. షిర్డీ నుంచి మొదలయ్యే బస్సు అన్నారు.. అంతకుముందెప్పుడైనా మీరు షిర్డీ వెళ్లారా.. దైవభక్తి ఉందా? నేను పుట్టింది బిహార్‌లో అయినా చదువుకున్నదీ, ఉంటున్నదీ ముంబైలోనే. షిర్డీ ఎలానూ దగ్గర కాబట్టి మా అమ్మానాన్నతో కలసి చాలాసార్లు వెళ్లాను. అక్కడికెళ్లగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ‘కొత్త బంగారు లోకం’లో బబ్లీగా ఉండేవారు. ఇప్పుడిలా సన్నగా అయిపోయారేంటి? ఆ సినిమా చేసినప్పుడు నేను టీనేజ్ పాపని (నవ్వుతూ). నా వయసప్పుడు 18. ఇప్పుడు 25. ఏజ్ పెరిగేకొద్దీ బేబీ ఫ్యాట్ పోతుంది. టీనేజ్ ఫ్యాట్ అంతా పోయిన తర్వాత ఫిజిక్ మెయిన్టైన్ చేయడానికి ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. నాకు జిమ్ అంటే ఇష్టం ఉండదు. అందుకే యోగా చేయడం మొదలుపెట్టాను. రోజూ 30 సూర్య నమస్కారాలు చేస్తాను. మజిల్స్ రిలాక్సేషన్ కోసం కొంతమంది మసాజులు చేయించుకుంటారు. ఎవరిష్టం వాళ్లది కాబట్టి, నేనెవర్నీ తప్పుబట్టడంలేదు. కానీ, ఎప్పుడో వారానికో లేక పది రోజులకో చేయించుకునే మసాజులకన్నా డైలీ యోగా చేయడం బెటర్ అని నేనంటాను. యోగాకి కూడా మజిల్స్‌ని రిలాక్స్ చేసే పవర్ ఉంది. ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగుంటుంది. తెలుగులో ఒక సినిమా, హిందీలో ఒకటి చేస్త్తూనే, ‘చంద్ర నందిని’ అనే హిందీ టీవీ సీరియల్ చేస్తున్నారు... కారణం? అది మంచి హిస్టారికల్ సీరియల్. బాలాజీ టెలీఫిలింస్ ఏక్తా కపూర్ నిర్మాత. ఈ సంస్థకు ఇంతకు ముందు కూడా సీరియల్స్ చేశా. ఇందులో నేను వారియర్ ప్రిన్సెస్‌ని. చాలెంజింగ్ రోల్. అందుకే ఒప్పుకున్నా. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధం నేర్చుకున్నాను. ముంబైలో సినిమా, టీవీ, వెబ్ సిరీస్ అనే తేడా ఉండదు. అందరూ అన్నీ చేస్తారు. అది అడ్వాంటేజ్. పైగా ఇది రెగ్యులర్ అత్తా-కోడళ్ల గొడవలతో సాగే సీరియల్ కాదు. తెలుగులో ‘సూపర్ 2’ షో కూడా చేశాను. యాజ్ యాన్ యాక్టర్ మంచి ప్రాజెక్ట్ ఏది వచ్చినా చేస్తాను. ఫైనల్లీ.. లవ్‌లో ఉన్నారట.. ఆ లైఫ్ గురించి చెబుతారా? సారీ అండి.. అది మాత్రం చెప్పలేను. పెళ్లి? టూ ఎర్లీ. ఇప్పట్లో ప్లాన్స్ లేవు. ఓన్లీ కెరీర్ మీదే దృష్టి పెట్టాను. కవితలు రాస్తాను! నాకు రైటింగ్ అంటే ఇష్టం. సీతాకోక చిలుకను చూసినప్పుడో, పచ్చని చెట్టు కనిపించినప్పుడో, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి తారస పడినప్పుడో కవిత వచ్చేస్తుంది. ఇప్పటివరకూ చాలా రాశా. రాస్తూనే ఉంటా. భవిష్యత్తులో ఆ కవితలతో పుస్తకం వేస్తానేమో. గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ మంచి అమ్మానాన్నలకు కూతురిని కావడం నా లక్. ‘ఇక్బాల్’ తర్వాత ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘హల్లా భోల్’ ఇలా బోల్డన్ని సినిమాలకు అవకాశం వచ్చింది. డబ్బు కోసం అవన్నీ ఒప్పుకుని ఉండొచ్చు. కానీ, మా అమ్మానాన్న నన్ను డబ్బు సంపాదించే మెషిన్లా చూడలేదు. నా చదువు కోసం, నా బాల్యాన్ని నేను సంతోషంగా అనుభవించడం కోసం సినిమాలు వద్దన్నారు. ఐయామ్ గ్రేట్ఫుల్ టు మై పేరంట్స్. ‘కొత్త బంగారు లోకం’ కథ విన్నప్పుడు ‘హీరోయిన్గా ఇలాంటి సినిమాతోనే పరిచయం కావాలి’ అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్నారు. అమ్మానాన్నలు చెప్పినట్లే చేశాను. - డి.జి. భవాని -
వ్యభిచారం కేసులో ఇరికించేందుకు కుట్ర : నటి
తమిళసినిమా: నన్ను వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించడానికి నా మాజీ భర్త కుట్ర పన్నుతున్నాడని నటి రాధ ఆరోపించారు. సుందరా ట్రావెల్ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన నటి రాధ. ఇప్పటికే పలు మార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈమె ఇటీవల మరో సారి వార్తల్లోకెక్కి కలకలం సృష్టిస్తున్నారు. తాను నాలుగు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ అలియాస్ పైసల్ అనే వ్యక్తితో పరిచయమైందని, అది ప్రేమగా మారడంతో 2008 నుంచి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నామని తెలిపారు. అయితే శ్యామ్‌కు పలువురు అమ్మాయిలలో సంబంధం ఉందని తెలియడంతో తాను ఆయన నుంచి విడిపోయానని వివరించారు. కాగా తన తల్లి సైదాపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తికి ఐదు లక్షలు అప్పు ఇచ్చారని,అతను ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని చెప్పారు. తాను వెళ్లి అడగ్గా సరిగా సమాధానం చెప్పకుండా దుర్భాషలాడాడని తెలిపారు. దీంతో అతని నుంచి తన డబ్బు తిరిగి ఇప్పించేలా చేయమని తన మాజీ భర్తను కోరానన్నారు. ఇటీవల ఆయన ఫోన్ చేసి కేకే.నగర్‌కు రా నీ డబ్బు ఇప్పిస్తానని చెప్పడంతో తాను అక్కడికి వెళ్లానన్నారు. అక్కడ అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కమ్ డివిజన్ ఉపకార్యద ర్శి మునివేల్ ఉన్నారని తెలిపారు. ఆయన తనతో తనను గుర్తు పట్టలేదా అని అడిగారన్నారు. మీరు నడిగర్ సంఘంలో డాన్స్ శిక్షణకు వచ్చినప్పుడు పరిచయం అయ్యాం అని చెప్పారన్నారు. ఆ తరువాత అప్పుడప్పుడూ మునివేల్ తన ఇంటికి వస్తుండేవారని చెప్పారు. అది నచ్చని తన మాజీ భర్త శ్యామ్ మునివేల్ భార్యతో ఐదు లక్షలు ఇస్తాను రాధను వ్యభిచార కేసులో అరెస్ట్ అయ్యేలా చెయ్యి అని చెప్పారని ఈ విషయాన్ని తనకు మునివేల్ తెలిపారని రాధ పేర్కొన్నారు. కాగా తన భర్తను డిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కం డివిజన్ ఉప కార్యదర్శి భార్య ఉమాదేవి నటి రాధపై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పుళల్ జైలులో ఉన్న వైరమ్ అనే ఖైదీ తనను ఫోన్లో బెదిరించినట్లు ఆడియో టేపును బయట పెట్టి రాధ సోమవారం తనకు రక్షణ కావాలని కోరుతూ పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఉమాదేవి తన భర్త, నటి రాధల రహస్య సంభాషణలను బయట పెట్టి కలకలం రేపారు. అయితే దీనిపై స్పందించిన నటి రాధ అది తన వ్యక్తిగత విషయం అని పేర్కొనడం గమనార్హం. పుళల్ జైలులో ఉన్న ఖైది వైరమ్ మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, తను నటి రాధను బెదిరించి ఉంటాడని పోలీసులు నమ్ముతున్నారు. ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.వైరమ్ గురించి బలమైన ఆధారాలు లభిస్తే అతనిపై తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపారు. నటి రాధ తనను ఖైదీ వైరమ్ ఫోన్లో బెదిరించారన్న ఆరోపణలను వైరమ్ భార్య లీనా ఖండించింది. తన భ ర్త పేరుతో ఎవరో బెదిరించి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. నటి రాధ, కోడంబాక్కం డివిజన్ ఉపకార్యదర్శి భార్య ఉమాదేవి, ఖైదీ వైరమ్ భార్య లీనా ఫిర్యాదులపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. -
వ్యభిచారం కేసులో బంగ్లాదేశీ యువతులు అరెస్ట్
రంగారెడ్డి: బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులు వ్యభిచారం చేస్తూ గురువారం ఎస్ఓటీ పోలీసులకు పట్టుబట్టారు. వారితో మరో యువకుడ్ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.18వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్ యువతులు దొంగ పాస్‌పోర్టు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (వనస్థలిపురం) -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
అల్వాల్ (మల్కాజ్ గిరి): హైదరాబాద్ నగరంలో ఇండింపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడుపుతున్న నిర్వాహకురాలిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కేరళకు చెందిన రోజీ అనే మహిళ అల్వాల్‌లోని సాయినగర్ కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నడిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గృహంపై ఆదివానం దాడిచేసి ముగ్గురు మహిళలను, ఇద్దరు విటులను, నిర్వాహకురాలు రోజీని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు హైదరాబాద్‌కు, ఒకరు సిద్ధిపేటకు చెందిన వారని పోలీసులు తెలిపారు. కాగా, వీరందరు 30 ఏళ్లలోపు వారేనని పోలీసులు చెప్పారు. వీరితో పాటు విటులు వెంకటరెడ్డి(50), యాదగిరి(30)లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
ప్లీజ్.. నాపై సానుభూతి వద్దు..
తనపై ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదని టాలీవుడ్ హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ స్పష్టం చేసింది. రెస్య్యూ హోమ్ నుంచి విడుదలైన తర్వాత తాను మానసికంగా మరింత బలపడ్డానని తెలిపింది. కాగా వివాదాల్లో చిక్కుకున్న శ్వేత... ఇప్పుడిప్పుడే తన కెరీర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె 'రూట్స్' అనే ఓ క్లాసికల్ మ్యూజిక్కు సంబంధించిన డాక్యుమెంటరిపై పని చేస్తున్నానని చెబుతున్న శ్వేతబసును ఓ ప్రయివేట్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. *నేను చాలా బాగున్నాను. బలహీనపడాల్సిన పనేముంది. ఏం జరిగింది ... ఏ జరగలేదు. జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. మనం వాటిని దాటేయాలి. కాలం ఎలాంటి గాయాన్ని అయినా మరిపిస్తుంది. మీరు నమ్మండి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. *ఎప్పుడైతే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ... అప్పుడే మీకు నిజమైన పరీక్ష. అప్పుడే మీకు అర్ధమవుతుంది జీవితం ఎంత కష్టమైందో. ఒక్కసారి ఆ పరిస్థితి నుంచి మీరు గట్టెక్కితే... ఇక మీరు ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగలరు. నేను అలాంటి కష్టాలను దాటి వచ్చానని గర్వంగా చెబుతున్నాను. ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను. *ప్రతీ ఒక్కరు నాపై విపరీతమైన సానుభూతిని ఒలకబోస్తున్నారు. నాపై అత్యాచారం జరగలేదు. నేను రేప్ విక్టిమ్‌ను కాదు. ప్లీజ్ నాపై ఇంతగా సానుభూతిని చూపకండి. నాకు తెలుసు జరిగిన సంఘటన మంచిది కాదని... అది సాధారణమైన విషయం కాదని కూడా తెలుసు. కాని నాకు అదో ఎక్స్పీరియన్స్... నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం. ఈ సంఘటనకు సంబంధించి ఎవరిపైనా నేను కోపం పెంచుకోలేదు. *సినిమా ఇండస్ట్రీ చెడ్డదేం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సంతోషంగా పలకరిస్తారు. నాతో స్నేహంగా ఉంటారు. *ఇప్పుడు హన్సిల్ మెహతా ప్రాజెక్టు గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన సినిమా ఆఫర్‌కు సంబంధించి ఇంకా ఏదీ అఫిషియల్ కాలేదు. హన్సిల్ మెహతా ప్రాజెక్టు కావచ్చు లేక మరేదైనా... నేను ఆడిషన్స్‌కు హాజరవుతాను. నా సొంత టాలెంట్‌పైనే సినిమా అవకాశాలు సాధించుకుంటాను. *నసీరుద్దిన్ షా నాకు ఓ సారి మెసేజ్ చేశారు. కోల్‌కతాలో ఆయన చేస్తున్న ఐన్‌స్టీన్ అనే షో చూడటానికి రమ్మన్నారు. ఆయన దగ్గర నా ఫ్రెండ్ పని చేస్తుంది. నేను సాధారణంగా అందరితో మరోసారి కలుపుగోలుగా ఉండాలని ఆయన సూచించారట. నేను కూడా ఇప్పుడిప్పుడే అందరితో కలుస్తున్నాను. *రూట్స్ అనే డాక్యుమెంటరీపై పని చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది పెద్ద వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చారు. *స్వేచ్ఛగా ఎగిరిపోతాను. నాకు రెక్కలున్న సంగతి వారికి తెలియదు. అందుకే నాలో నేను సంతోషపడుతుంటాను. నాపై ఏడిచే వారిపై జాలిపడతాను. -
సినీనటి శ్వేతాబసు ప్రసాద్‌కు క్లీన్ చిట్
హైదరాబాద్ : సినీనటి శ్వేతాబసు ప్రసాద్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్వేతాబసు ప్రసాద్‌పై అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని శ్వేతాబసు ప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కావాలనే పోలీసులు తనను ఇరికించారని ఆమె కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ హోటల్‌కు వెళ్లినట్లు శ్వేతాబసు ప్రసాద్ న్యాయస్థానం ముందు విన్నవించారు. దాంతో ఆమె వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు, కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కోర్టు తీర్పుపై శ్వేతాబసు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే ఇన్నిరోజులుగా వేచి చూస్తున్నానని..ఆమె తెలిపారు. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యుల మొహాల్లో నవ్వు కనిపిస్తుందని పేర్కొన్నారు. వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై, కోర్టు ఆదేశాలపై ఇటీవలే రెస్క్యూ హోం నుంచి శ్వేతాబసు ప్రసాద్ విడుదలైన విషయం తెలిసిందే. -
శ్వేతా బసు.. మళ్లీ వస్తోంది!
సంచలనాల హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ సినీ పరిశ్రమలోకి వచ్చేశారు. ఓ హోటల్లో దొరికిన ఆమెపై పోలీసులు వ్యభిచారం కేసు పెట్టి రెస్క్యూహోంకు పంపడం, కోర్టు జోక్యం చేసుకుని ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించడం తెలిసిందే. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పట్లోనే శ్వేతాబసు చెప్పింది. మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని ఓ డాక్యుమెంటరీతో కెమెరా ముందుకు వెళ్తోంది. జాతీయ అవార్డు విజేత హన్సల్ మెహతా తన స్వీయ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇందులో శ్వేతాబసుకు చాలా కీలకపాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే దాన్ని అంగీకరించిన ఆమె.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తారని సమాచారం. రెస్క్యూహోం నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడే, తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని శ్వేతాబసు తెలిపింది. మెహతా సినిమాతో ఇప్పుడది నిజమైంది. -
నటి వ్యభిచారం కేసులో కొత్త మలుపు
హైదరాబాద్: వ్యభిచారం కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి కేసు కొత్త మలుపు తిరిగింది. మరో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో ప్రముఖ సినిమా నటి పట్టుబడి సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో సదరు నటి పోలీసులకు చిక్కింది. అయితే ఈ హోటల్ గదిని సంతోషం అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని రిమాంగ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు కోర్టు ఎదుట కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. డిఫెన్స్ న్యాయవాది ప్రదీప్ కుమార్ తన వాదనల్లో ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజనిర్ధారణ కోసం సంతోషం అవార్డ్స్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. కాగా, తనను పోలీసులు అన్యాయంగా ఇరికించారని బాధితురాలు వాపోయింది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు హోటల్ గదికి వెళ్లానని పేర్కొంది. తాను విద్యార్థిని అని, గ్రాడ్యుయేషన్ చేస్తున్నానని కూడా కోర్టుకు తెలిపింది. వీడియో ద్వారా ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆమె చెప్పినదాంట్లో వాస్తవం లేదని పోలీసులు అంటున్నారు. -
పోలీసుల అదుపులో ఆరుగురు విఠులు, ముగ్గురు మహిళలు
హైదరాబాద్:నగరంలోని కూకట్ పల్లి సుమిత్రా నగర్ లో ఓ ఇంటిలో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విఠులను అదుపులోకి తీసుకున్నారు. -
వ్యభిచారం కేసులో జూనియర్ ఆర్టిస్టు
-
వ్యభిచారం కేసులో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టు
ఎల్బీనగర్ ప్రాంతంలో వ్యభిచారం చేస్తూ నీహారిక అనే జూనియర్ ఆర్టిస్టు పట్టుబడింది. ఈ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారం అందడంతో స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ దాడులు చేయడంతో ఆమెతో పాటు భారీ సంఖ్యలో యువతులు, పలువురు పురుషులు పట్టుబడ్డారు. పట్టుబడ్డవారిలో ప్రముఖులు, బడా వ్యాపారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో అయితే పోలీసు నిఘా చాలా తక్కువగా ఉంటుందని వ్యభిచార ముఠాలు ఈ ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు తెలిసింది. డబ్బులకు అలవాటుపడి కొంతమంది యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని హోటళ్లు, లాడ్జిలలో తరచు వ్యభిచారం కేసులు నమోదవుతున్నాయి. -
వ్యభిచారం కేసులో బెంగాలీ నటి అరెస్ట్
-
సినిమా పేరుతో వ్యభిచారం: స్టంట్ మాస్టర్ అరెస్ట్
తిరువొత్తియూరు : సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి యువతులను మోసం చేసి వ్యభిచారానికి దింపుతున్న స్టంట్ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తామని ఓ ముఠా యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసు కమిషనర్ జార్జి ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైంబ్రాంచ్ విభాగం అదనపు కమిషనర్ నల్లశివం, డెప్యూటీ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో వ్యభిచార నిరోధక విభాగం సహాయ కమిషనర్ గణపతి, ఇన్స్పెక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిఘా వేసింది. వడపళణిలోని ఒక స్టూడియో సమీపంలో ఉన్న విలాసవంతమైన ఇంటిలో తనిఖీ చేశారు. యువతులతో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న సినిమా స్టంట్‌మాస్టర్ బాంబే కుమార్‌ను, ఇతనికి సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న నలుగురు యువతులకు విముక్తి కల్పించారు.