అల్లిపురం(విశాఖ దక్షిణం): గుట్టుగా లాడ్జీ రూంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులను సిటీ టాస్క్‌ఫోర్సు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలను రక్షించి మహిళా రక్షణ గృహానికి తరలించారు. టూటౌన్ పోలీసులు, టాస్క్‌పోర్సు ఏసీపీ ఎ.త్రినాథరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి లాడ్జీలలో గదులు బుక్ చేసి రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు టాస్క్‌ఫోర్సుకు సమాచారం అందింది.
చదవండి: మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే..
ఈ మేరకు అల్లిపురంలోని సప్తగిరి లాడ్జీపై ఏసీపీ ఎ.త్రినాథరావు, టూటౌన్ పోలీసులు దాడి చేశారు. గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, 7 సెల్‌ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment