Lodge room
-
రెండేళ్ల క్రితం ఇష్టంలేని పెళ్లి.. ప్రియుడ్ని మరిచిపోలేక..
తిరుపతి క్రైం/కొవ్వూరు: ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి తిరుపతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలోని షాపూర్‌కు చెందిన అనూష(21)కు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన గుడ్ల పోసిబాబుతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొవ్వూరు ఆంధ్రా షుగర్స్‌లో పని చేస్తున్న పోసిబాబు తన భార్యతో కలిసి కొంతకాలంగా కొవ్వూరులోనే నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. భార్య అనూష కనిపించడం లేదంటూ పోసిబాబు ఈ నెల 5న కొవ్వూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 4వ తేదీ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లి 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించ లేదని పేర్కొన్నారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులకు తెలిపాడు. పోసిబాబు ఇంట్లో అనూష రాసిన లేఖ లభించింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక, హైదరాబాద్ షాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణారావు (23) అనే యువకుడు, అనూష గతంలో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అనూషకు, పోసిబాబుకు వివాహం చేశారు. కృష్ణారావును మరచిపోలేని ఆమె.. అతడితో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 5న ఇద్దరూ కలిసి తిరుపతి వెళ్లారు. అక్కడి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని త్రిలోక్ లాడ్జిలో దిగారు. అక్కడే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం రూము ఖాళీ చేయాల్సిన వీరు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. లాడ్జిలో లభించిన ఫోన్ ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
లాడ్జిలో విగతజీవులుగా ప్రేమ జంట.. ఆమె మెడలో తాళి..
అల్లిపురం (విశాఖ దక్షిణం): వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలకాలం కలిసి జీవించాలనుకున్నారు.. ఇంతలో ఏ కష్టమొచ్చిందో.. లాడ్జిలో విగతజీవులుగా మారారు. గదిలోని కిటికీకి ఉరేసుకుని తనువు చాలించారు. అయితే ఆత్మహత్యకు ముందు వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు యువతి మెడలోని తాళి ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాగా, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఇన్చార్జి సీఐ, మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం, దూసి గ్రామానికి చెందిన దామోదర్, ఆముదాలవలస మండలం బలగాం గ్రామానికి చెందిన సంతోషి కుమారి (18) సోమవారం గొల్లలపాలెందరి అయ్యన్ రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు హోటల్ రూమ్ నుంచి బయటకు రాలేదు. మంగళవారం మధ్యాహ్నం వారి బంధువు లాడ్జికి వచ్చి వారి ఫొటో చూపించి ఏ గదిలో ఉన్నారో తెలుసుకున్నారు. రూమ్ దగ్గరకు వెళ్లి పిలిచినా, తలుపులు తట్టినా లోపలి నుంచి ప్రతిస్పందన రాలేదు. సుమారు గంటపాటు వేచి చూసిన తర్వాత వారు లాడ్జి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే లాడ్జి సిబ్బంది తలుపులు తెరిచి చూసేటప్పటికి ప్రేమికులు ఇద్దరూ బాత్రూమ్లో కిటికీకి తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో లాడ్జి సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ సోమశేఖర్ ఆదేశాల మేరకు ఎస్ఐలు చంద్రశేఖర్, విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వారి గదిలో ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, కొన్ని పత్రాలు లభించగా వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రజక కులానికి చెందిన వీరిద్దరి మధ్య ఇటీవల పరిచయం పెరిగిందని, దామోదర్ కుల వృత్తి చేసుకుంటుంటుండగా, సంతోషి కుమారి నర్స్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయి మెడలో తాళి కనపడటంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ద్వారా ఇద్దరి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు బుధవారం నగరానికి రానున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..
అల్లిపురం(విశాఖ దక్షిణం): గుట్టుగా లాడ్జీ రూంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులను సిటీ టాస్క్ఫోర్సు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలను రక్షించి మహిళా రక్షణ గృహానికి తరలించారు. టూటౌన్ పోలీసులు, టాస్క్‌పోర్సు ఏసీపీ ఎ.త్రినాథరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి లాడ్జీలలో గదులు బుక్ చేసి రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు టాస్క్ఫోర్సుకు సమాచారం అందింది. చదవండి: మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే.. ఈ మేరకు అల్లిపురంలోని సప్తగిరి లాడ్జీపై ఏసీపీ ఎ.త్రినాథరావు, టూటౌన్ పోలీసులు దాడి చేశారు. గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, 7 సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. -
14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..
సాక్షి, బంజారాహిల్స్: పద్నాలుగు సంవత్సరాల వయసున్న మేనల్లుడిని లొంగదీసుకున్న మేనత్త ఆ బాలుడితో శారీరక వాంఛలు తీర్చుకుంటూ ఆ దృశ్యాలను వీడియో రికార్డింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ 20 తులాల బంగారు నగలతోపాటు రూ. 6 లక్షలను బలవంతంగా వసూలు చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని గాయత్రీహిల్స్‌లో నివసించే ఓ మహిళ ఇంట్లో ఇటీవల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. అలమారాలో ఉండాల్సిన నగలు కనిపించకపోవడంతో ఆమె గాలిస్తున్న సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు(14) తాను మేనత్తకు ఒక నెక్లెస్ ఇచ్చానని చెప్పాడు. ఎందుకు ఇచ్చావంటూ తల్లి ప్రశ్నించగా బెంగళూరులో నివసించే మేనత్త తన బాయ్‌ఫ్రెండ్ ఇర్ఫాన్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చి చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉండేదని చెప్పాడు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) తాను చదువుతున్న స్కూల్‌కు వచ్చి తనతో పాటు తీసుకెళ్లి లాడ్జిలో తన వాంఛలు తీర్చుకునేదని ఈ క్రమంలో ఆమె మాజీ భర్త ఇర్ఫాన్ ఈ దృశ్యాలను వీడియో తీసేవాడని ఎవరికైనా ఈ విషయం తెలియజేస్తే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించేవాడని... ఇలా మూడుసార్లు తనను లాడ్జికి తీసుకెళ్లిందన్నారు. బంగారు ఆభరణాలతో పాటు రూ. 6 లక్షలు తీసుకురాకపోతే వీడియో బయటపెడతామంటూ బ్లాక్మెయిల్ చేయడంతో దొంగిలించినట్లు బాలుడు తల్లికి చెప్పాడు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితురాలితో పాటు ఆమె మాజీ భర్తపై ఐపీసీ సెక్షన్ 384, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (వివాహేతర సంబంధం.. రాత్రి 11:30 గంటలకు ప్రియుడికి అన్నం తీసుకెళ్లి..) -
ఓయో లాడ్జిలో గడిపిన వీడియోతో బెదిరింపులు..
కేపీహెచ్‌బీకాలనీ: అశ్లీల వీడియోలను బహిర్గతం చేస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికి వరకు ఇద్దరూ కలిసి బాధితుడి నుంచి రూ. 4.50 లక్షలు వసూలు చేయడమేగాక మరో రూ.1.5లక్షలు డిమాండ్ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కావేరి హిల్స్‌లో ఉంటున్న మణికంఠకు టెండర్ ఆన్లైన్ అప్లికేషన్లు పూర్తి చేసే క్రమంలో మహేశ్వరి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆధారంగా ఈ నెల 14న వీరిద్దరూ కూకట్పల్లి విజయానగర్ కాలనీలోని ఓయో లాడ్జిలో గడిపారు. అనంతరం మహేశ్వరి తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి మణికంఠను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా సంతోష్‌తో మణికంఠకు ఫోన్ చేయించి తాము కూకట్పల్లి పోలీసులమని చెబుతూ లాడ్జిలో గడిపిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని అతడిని బెదిరించి అతడి నుంచి రూ.4.49 లక్షలు వసూలు చేయడంతో పాటు ఐఫోన్ కూడా తీసుకున్నారు. మరో రూ. 1.5లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఈ నెల 22న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులకు బదిలీ చేశారు. కేపీహెచ్‌బీ పోలీసులు మణికంఠ ద్వారా నిందితులకు ఫోన్ చేయించి డబ్బులు తీసుకునేందుకు ఫోరంమాల్ వద్దకు రావాలని చెప్పారు. గురువారం ఉదయం మహేశ్వరి, సంతోష్ అక్కడికి రాగానే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 4.09లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
ఖాకీ.. ఇదేం పని..?
అనంతపురం సెంట్రల్: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు సొమ్ములకు ఆశపడి దిగజారుడుగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకు తలవంపులు తీసుకొస్తున్నారు. ఓ లాడ్జిలో కనిపించిన ఇద్దరు మహిళలను కేసుల పేరుతో బెదిరించి, నగదు డిమాండ్ చేసి.. చివరికి వారి చేతుల్లో ఉన్న బంగారు గాజులు లాక్కుని వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సరోజినీ రోడ్డులో గల ప్రముఖ లాడ్జిలోకి సోమవారం ఇద్దరు మహిళా ఉద్యోగులు వెళ్లారు. వీరు గౌరవప్రదమైన వృత్తుల్లో కొనసాగుతున్నారు. సదరు మహిళలు లాడ్జిలోకి ప్రవేశించి లిఫ్ట్ గది వద్ద వేచి చూస్తున్నారు. అంతలోగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి లిఫ్ట్‌లో వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడ నిఘా వేసి ఉన్న టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గమనించారు. కానిస్టేబుళ్లను చూడగానే ఇద్దరు వ్యక్తులు లాడ్జి నుంచి పారిపోయారు. కానీ మహిళలు పారిపోయేందుకు వీలు కాకపోవడంతో లాడ్జిలోంచి బయటకు వచ్చి వెనుక వైపు ఓ షాపింగ్‌మాల్‌కు చెందిన వాహనాల పార్కింగ్ స్థలంలోకి వెళ్లారు. కానిస్టేబుళ్లు కూడా వారి వద్దకు చేరుకున్నారు. బెదిరించి.. గాజులు లాక్కుని.. మీరు స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని సదరు మహిళలను కానిస్టేబుళ్లు బెదిరించారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగినులు బెంబేలెత్తిపోయారు. స్టేషన్ వరకు వెళ్తే జీవితాలు నాశనం అవుతాయని, కుటుంబాలు వీధిన పడతాయని ప్రాధేయపడ్డారు. ఇదే అదనుగా భావించిన కానిస్టేబుళ్లు వారి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఆ క్షణంలో వారి వద్ద నగదు లేకపోవడంతో చేతుల్లోని బంగారు గాజులను కానిస్టేబుళ్లు లాగేసుకుని వదిలేశారు. చర్చనీయాంశమైన కానిస్టేబుళ్ల తీరు మహిళా ఉద్యోగులు లాడ్జిలో తప్పు చేస్తూ రెడ్‌హ్యాండ్‌గా ఏమీ పట్టుబడలేదు. కేవలం లిఫ్ట్‌లో మాత్రమే ప్రయాణించారు. ఒకవేళ వారికి వివాహేతర సంబంధాలున్నట్లు అనుమానం ఉంటే స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయాలి. తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ కానిస్టేబుళ్లు బంగారు గాజులు లాక్కుని వారిని వదిలేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపితే అసలు నిందుతులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. దిగజారుడుగా వ్యవహరించిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది కూడా వేచి చూడాలి. -
లాడ్జిలో పాడుపనులు
కర్ణాటక, బళ్లారి అర్బన్: జిల్లాలోని హగరిబొమ్మనహళ్లిలో హొసపేటె రోడ్డులో ఉన్న ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో సోమవారం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దాడిలో ముగ్గురు యువతులతో పాటు దావణగెరె జిల్లాకు చెందిన సంజు(20) అనే విటుడును అదుపులోకి తీసుకున్నట్లు హెచ్బీహళ్లి సీఐ తెలిపారు. నిందితులను విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో పోలీసు పర్యవేక్షణ లేకపోవడంతో చాపకిందనీరులా వ్యభిచారం జరుగుతోందని, ఫలితంగా యువత పెడతోవపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
రామభద్రపురం విజయనగరం : మండల కేంద్రంలోని శ్రీసాయి శ్రీనివాసా లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు అన్నయ్య మామిడి చినరాములు, అతని కుమారుడు రామకృష్ణ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. దత్తిరేజేరు మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మామిడి గౌరీష్ (48) సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. దీంతో బంధువులు పరిసర గ్రామాలలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న సమయంలో రామభద్రపురం లాడ్జీలో చనిపోయి ఉన్నాడన్న సమాచారం వచ్చింది. దీంతో మృతుడి బంధువులు లాడ్జీకి చేరుకున్నారు. అయితే మృతదేహాన్ని చూసిన తర్వాత బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతదేహాన్ని లాడ్జీ వెనుకనున్న మెట్ల గుండా ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకువచ్చినట్లుగా ఉంది. మూడు రోజులుగా ఓ వ్యక్తి గదిలో ఉంటే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని బంధువులు ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే గరీష్ చనిపోయాడని ఆరోపించారు. న్యాయం చేసేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లమని మృతుడి బంధువులు స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ ఇలియాస్ అహ్మద్ సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ పుటేజీ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. మృతుడి భార్య దయమంతి ఫిర్యాదు మేరకు యాజమాన్య ప్రతినిధులను అరెస్ట్ చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడు పశువుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. -
పోలీసులకు లాడ్జీలలో రూమ్‌లు ఇవ్వొద్దు
కృష్ణాజిల్లా ,నూజివీడు : తమ అనుమతి లేకుండా పట్టణంలోని ఎస్ఐలకు, పోలీసు సిబ్బంది ఎవరికీ లాడ్జీలలో రూమ్‌లు ఇవ్వొద్దని సీఐ మేదర రామ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని అన్ని లాడ్జీల నిర్వాహకులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎస్ఐలు లాడ్జీలను బాగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలొచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ స్థాయి నుంచి కింది సిబ్బందికి గదులు ఇచ్చేటప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. లాడ్జీలలో మందు తాగడం, పేకాట ఆటడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి లాడ్జీలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలరోజుల ఫుటేజీ నిల్వ ఉండేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా నేరం జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేసుకోవాలని, అవసరమైతే ఆధార్ ప్రూఫ్ చూపించాలని అడగాలన్నారు. -
మద్యం బాటిల్‌తో గొంతు కోశారు
– లాడ్డి సూపర్వైజర్ పరిస్థితి విషవుం శ్రీకాళహస్తి: లాడ్జి గదిలో టీవీ రాలేదని.. మద్యం బాటిల్‌తో సూపర్వైజర్ గొంతు కోసిన సంఘటన వుంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషవుంగా ఉంది. శ్రీకాళహస్తి పట్టణం జయరాంరావు వీధిలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు ఓ గది అద్దెకు తీసుకున్నారు. వుద్యం సేవించారు. తమ గదిలో టీవీ రాలేదని లాడ్జి సూపర్వైజర్ దినేష్ రెడ్డికి తెలియజేశారు. ఆ తర్వాత జీడిపప్పు తీసుకురమ్మన్నారు. అది ఆలస్యం కావడంతో ఆగ్రహించారు. వుద్యం వుత్తులో బాటిల్ పగులగొట్టి సూపర్వైజర్ గొంతుకోసి పరారయ్యారు. వెంటనే లాడ్జిలో పనిచేస్తున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదుచేసి దినేష్‌రెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రథవు చికిత్స చేసి పరిస్థితి విషవుంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కాగా నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ ప్రవీణ్‌కువూర్ తెలిపారు. వురో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.