లాడ్జీలు , హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడుతున్న సీఐ రామ్‌కుమార్
కృష్ణాజిల్లా ,నూజివీడు : తమ అనుమతి లేకుండా పట్టణంలోని ఎస్‌ఐలకు, పోలీసు సిబ్బంది ఎవరికీ లాడ్జీలలో రూమ్‌లు ఇవ్వొద్దని సీఐ మేదర రామ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని అన్ని లాడ్జీల నిర్వాహకులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎస్‌ఐలు లాడ్జీలను బాగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలొచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ స్థాయి నుంచి కింది సిబ్బందికి గదులు ఇచ్చేటప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
లాడ్జీలలో మందు తాగడం, పేకాట ఆటడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి లాడ్జీలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెలరోజుల ఫుటేజీ నిల్వ ఉండేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా నేరం జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేసుకోవాలని, అవసరమైతే ఆధార్ ప్రూఫ్ చూపించాలని అడగాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment