కృష్ణా: జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక రేవులనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. అయినా మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లాలోని తిరువూరు మండలం చింతలపాడులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.