సాయిపల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్‌ | Fan Kisses Sai Pallavi at Thandel Event | Sakshi
Sakshi News home page

సాయిపల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. బాషా రేంజ్‌ ఎలివేషన్‌

Published Sun, Feb 16 2025 9:26 PM | Last Updated on Mon, Feb 17 2025 9:04 AM

Fan Kisses Sai Pallavi at Thandel Event

కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi) ఎంచుకునే కథలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. ఏవి పడితే అవి చేసుకుంటూ పోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్ని మాత్రమే చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తండేల్‌ సినిమా చేసింది. ఇందులో మరోసారి తన నటనతో కట్టిపడేసింది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

సెల్ఫీ దిగాక..
ఇకపోతే తండేల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో జరిగిన చిన్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విడుదలకు ముందు జరిగిన తండేల్‌ జాతర ఈవెంట్‌లో ఓ మహిళా అభిమాని ఎలాగోలా సాయిపల్లవిని చేరుకుంది. తనతో సెల్ఫీ దిగిన అమ్మాయి హీరోయిన్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది. దీంతో తెగ సంతోషపడిపోయిన ఆమె సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టింది.

బుజ్జి తల్లికి బాషా రేంజ్‌ ఎలివేషన్‌
ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. బాషా సినిమాలో రజనీకాంత్‌ మాణిక్‌ బాషాగా మారిన సమయంలో తన అనుచరులంతా కూడా ఆయన చేతిని ముద్దాడుతుంటారు. ఆ సీన్‌తో సాయిపల్లవి క్లిప్‌ను పోలుస్తూ బుజ్జితల్లికి బాషా రేంజ్‌ ఎలివేషన్‌ ఇస్తున్నారు. ఇకపోతే సాయిపల్లవి ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తోంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నాడు.

 

 

చదవండి: నా భార్య చనిపోయేవరకు వీల్‌చైర్‌లోనే.. అదే చివరిమాట.. : చిన్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement