tractors seized
-
ఇసుక అక్రమ రవాణా: 3 ట్రాక్టర్లు సీజ్
గుంటూరు(నూజెండ్ల): అనుమతులు లేకుండా ఇసుకను తరిలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని ములకలూరు గ్రామంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలించి యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. -
30 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
వరంగల్ : వరంగల్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ బంకు జంక్షన్ వద్ద 30 ఇసుక ట్రాక్టర్లను సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో మిల్స్‌కాలనీ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఇసుకను వర్ధన్నపేట నుంచి వరంగల్‌కు తరలిస్తున్నారు. ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించి డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. (కరీమాబాద్) -
అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్
ప్యాపిలీ: కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలోని పెద్దపూజర్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు గురువారం సీజ్ చేశారు. పెద్దపూజర్లకు చెందిన కమతం భాస్కర్ రెడ్డి, సిద్దరాముడు, లక్ష్మీకాంత రెడ్డి, గోపాల్‌లకు ఈ ఇసుక అక్రమ దందాలో భాగస్వామ్యమున్నట్లు సమాచారం. దాంతో పాటు భాస్కర్ రెడ్డికి చెందిన రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామానికి భూగర్భ గనుల శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
15 ఇసుక ట్రాక్టర్లు సీజ్
మామునూరు: వరంగల్ జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 ట్రాక్టర్లను శనివారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి వరంగల్ కు ఇసుకను తీసుకెళ్తుండగా మామునూరు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకన్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్ల ను తదుపరి చర్యల కోసం మండల తహసీల్దార్‌కు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్
కృష్ణా: జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక రేవులనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. అయినా మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లాలోని తిరువూరు మండలం చింతలపాడులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. -
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న4 ట్రాక్టర్లు సీజ్
ఖమ్మం: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడెం ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. -
రుణాలు కట్టలేదని.. ట్రాక్టర్లు సీజ్
రైతు రుణాల మాఫీ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ తేల్చకపోవడం అన్నదాతల తల మీదకు వస్తోంది. అనంతపురం జిల్లాలో బ్యాంకు అధికారులు అత్యుత్సాహం చూపించారు. వజ్రకరూర్ స్టేట్‌బ్యాంక్ అధికారులు 15 మంది రైతులకు చెందిన ట్రాక్టర్లను సీజ్ చేశారు. మడకశిర మండలంలోని బి.రాయపురం, బుల్లసముద్రం ప్రాంతాల్లో 50 మంది రైతులకు కూడా మడకశిర స్టేట్ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒకవైపు తెలంగాణలో లక్ష రూపాయల వరకు రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రుణ మాఫీ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తే పదేళ్లలో తాము తిరిగి చెల్లిస్తామనడంతో ఇటు రిజర్వు బ్యాంకు గానీ, రాష్ట్రంలోని బ్యాంకులు గానీ ప్రభుత్వం మాటలను విశ్వసించడం లేదు. మరోవైపు రైతులు మాత్రం తమ రుణాలు మాఫీ అవుతాయేమోనని ఆశగా ఉన్నారు. వాళ్లు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఇప్పుడు ఆస్తుల స్వాధీనం మొదలుపెట్టాయి.