prostitution gang
-
లేడీ కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. వ్యభిచారం కూల్ అంటూ!
ఒకప్పుడు కామెడీ అంటే నవ్వుకోవడం మాత్రమే. కానీ ఇప్పుడేమో కామెడీ అంటే ప్రతిదీ డబుల్ మీనింగ్ లేదంటే బూతు అన్నట్లు మారిపోయింది. టీవీ షోల్లోనూ మహిళల్ని కించపరిచేలా కామెడీ పేరుతో పంచులు వేస్తూనే ఉండటం మీరు చూసే ఉంటారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ కూడా వ్యభిచారంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కూల్ ప్రొఫెషన్ అని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) సోషల్ మీడియా పుణ్యమా అని గత కొన్నాళ్ల నుంచి స్టాండప్ కమెడియన్స్ డిమాండ్ పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో ఆయా కమెడియన్స్ ఫేమస్ అయిపోతున్నారు. అయితే తమకు వస్తున్న ఆదరణ చూసి కొన్నిసార్లు నోరు జారేస్తున్నారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ అలానే అనేసింది. 'వ్యభిచారం చాలా కూల్ ప్రొఫెషన్. వేరు చూసి చూడటం లాంటి ఏం ఉండవు. ఫ్రెషర్స్ కి కూడా అందులో జాబ్స్ దొరుకుతాయి' అని చెప్పుకొచ్చింది. అయితే ఈమె వ్యాఖ్యలపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది అని విదూషిని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) View this post on Instagram A post shared by Vidushi Swaroop (@vidushiswaroop) -
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు..
కర్ణాటక: జిల్లాలోని ముళబాగిలు తాలూకా కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు వద్ద హైటెక్ వేశ్యావాటికపై ముళబాగిలు పోలీసులు దాడి జరిపి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారు కాగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కార్యాచరణలో 6 మంది మహిళలను రక్షించారు. కార్యాచరణపై కోలారు జిల్లా ఎస్పీ ఎం నారాయణ వివరాలు అందించారు. ఈ మహిళలను హైదరాబాద్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రెస్టారెంట్ యజమానులతో కలిసి వేశ్యావాటికను నడుపుతున్నాడని తెలిపారు. ఘటనకు సంబంధించి మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్ యజమాని, మేనేజర్, సప్లయర్, రిసెప్షనిస్ట్, మహిళలను తీసుకొచ్చిన ఏజెంట్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏజెంట్ విజయ్, మంజునాథ్, అంజప్ప, సతీష్‌లను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రెస్టారెంట్ యజమాని చంద్రహాస్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దాడి సమయంలో రూ.5,56,300 నగదు, రూ.2 కోట్ల విలువ చేసే 10 కార్లు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ వేశ్యావాటికతో పాటు డ్యాన్స్ కూడా ఆడించేవారని తెలిపారు. విజయవాడ, చిత్తూరు, విశాఖ పట్టణం నుంచి మహిళలను తీసుకువచ్చే వారని తెలిసిందన్నారు. సతీష్ అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేశాడని, మహిళలంతా 20, 21, 23, 24 ఏళ్ల వయసు వారేనని, వారిని సఖి సాంత్వన కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముళబాగిలు తాలూకా హెచ్.బయప్పనహళ్లి సమీపంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్టులో రాక్ వ్యాలీ బార్ అండ్ రెస్టారెంట్ గదుల్లో మహిళలను ఉంచి వేశ్యావాటికను నిర్వహిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని రచించి దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. -
క్షుద్రపూజల పేరుతో మహిళలను.. వ్యభిచార కూపంలోకి
ప్రొద్దుటూరు క్రైం : క్షుద్రపూజల పేరుతో మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. తిరుపతికి చెందిన బాధిత మహిళ ఫిర్యాదుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ముఠాలోని ఏడుగురు సభ్యులను వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారుడు అయిన బాబా కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. తిరుపతికి చెందిన ఒక మహిళ ఆర్థిక సమస్యలతో బాధపడేది. తన కుమార్తెలకు వయసు వచ్చినా ఇంకా పెళ్లిళ్లు కాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేవారు. ఈ క్రమంలో ఓ బాబా క్షుద్రపూజలు చేస్తే ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబంలోని ఇతర సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయని ఒక మహిళ ద్వారా తెలుసుకున్న ఆమె.. సదరు ముఠా సభ్యులను ఆశ్రయించింది. తిరుపతి మహిళను ఫోన్లో సంప్రదించిన మోసగాళ్లు ఆమెను కడపకు రమ్మని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ముఠా సభ్యులు కొందరు ఆమెతో కడపలో సమావేశం అయ్యారు. అయితే వారు పెట్టిన కొన్ని షరతులకు ఆమె అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం తిరిగి వారు ప్రొద్దుటూరులో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పూజలు చేస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు నిందితుల అరెస్ట్ ఏఎస్పీ ప్రేరణాకుమార్ ఆదేశాల మేరకు సీఐ యుగంధర్, ఎస్ఐ కృష్ణంరాజునాయక్లు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఠా సభ్యులు అమృతానగర్‌లో ఉన్నారని తెలియడంతో దాడులు నిర్వహించారు. దాడిలో అనంతపురం జిల్లాకు చెందిన వసారింటి నాగరాజు, కంబగిరి రాముడు, వడ్డే వెంకటేష్, కర్నూలు జిల్లాకు చెందిన మార్కె కంబగిరి రాముడు, మొట్టే కాంతమ్మ, నంద్యాల జిల్లాకు చెందిన జిట్టా రవికుమార్, తిరుపతికి చెందిన పొలిచెర్ల ప్రియను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపిస్తునట్లు ఏఎస్పీ తెలిపారు. విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన సూత్రధారి బాబా, మరి కొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం.. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళలను ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. ఇందుకోసం ముఠాలోని మహిళలను ఏజెంట్లుగా ఉపయోగించుకుంటున్నారు. వారి ద్వారానే అమాయక మహిళలను ట్రాప్ చేస్తున్నారు. కుద్ర పూజలకు అంగీకరించిన మహిళలను లొంగదీసుకొని వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల వ్యభిచార నిర్వాహకులతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరి ఉచ్చులో పడి ఎంత మంది మహిళలు మోసపోయారనే దానిపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యుగంధర్, ఎస్ఐ కృష్ణంరాజునాయక్, బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ ప్రేరణాకుమార్ అభినందించారు. -
ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో ముగ్గురు లేడీ కిలాడీలు ముఠాగా ఏర్పడి బస్స్టేషన్లలో అమాయకులైన యువకులను తమ సైగలతో ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఓ వాహనంలో ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకెళ్లే వారు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో రూ.20వేలు, సెల్‌ఫోన్, గీసుకొండ పీఎస్ పరిధిలో రూ.3వేలు, సెల్ఫోన్లను బలవంతంగా దోచుకున్నారు. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి మామునూరు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తన సిబ్బందితో సోమవారం రాంగోపాల్‌పురం వద్ద నిందితురాళ్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ నరేష్కుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై రాజిరెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్‌పాషా, రోజాలను ఈస్ట్‌జోన్ డీసీపీ అభినందించారు. -
అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..
అల్లిపురం(విశాఖ దక్షిణం): గుట్టుగా లాడ్జీ రూంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ముగ్గురు విటులను సిటీ టాస్క్ఫోర్సు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలను రక్షించి మహిళా రక్షణ గృహానికి తరలించారు. టూటౌన్ పోలీసులు, టాస్క్‌పోర్సు ఏసీపీ ఎ.త్రినాథరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి లాడ్జీలలో గదులు బుక్ చేసి రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు టాస్క్ఫోర్సుకు సమాచారం అందింది. చదవండి: మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే.. ఈ మేరకు అల్లిపురంలోని సప్తగిరి లాడ్జీపై ఏసీపీ ఎ.త్రినాథరావు, టూటౌన్ పోలీసులు దాడి చేశారు. గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, 7 సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. -
మాదాపూర్: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్
సాక్షి, మాదాపూర్: ఓయో రూంలలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న నిందితులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జైహింద్ ఎన్క్లేవ్ రహదారిలో ఓయో క్వాలియాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 20వ తేదీ రాత్రి పోలీసులు ఓయో రూంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకురాళ్ళు, ఓ విటుడితో పాటు 5 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి మొబైల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో.. మహిళపై హత్యాచారం? మాదాపూర్: మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ(34)పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి..అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్ సిఐ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఔట్‌పోస్టు వద్ద సోమవారం ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం రాత్రి ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రమైన గాయాలుండడంతో రాయితో బలంగా కొట్టినట్లుగా భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మహిళకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈఘటనకు సంబంధించి అనుమానితులైన కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
బాలికపై వ్యభిచార ముఠా అమానుషం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): కరోనాతో తల్లిని పోగొట్టుకున్న పదమూడేళ్ల బాలికను తాను చూసుకుంటానని తండ్రికి మాయమాటలు చెప్పిన ఓ మహిళ వ్యభిచార కూపంలోకి దింపింది. పలు ప్రాంతాల్లో పలువురి చేతిలో అమానుషానికి గురైన ఆ బాలిక చివరకు తప్పించుకొని వచ్చి, తండ్రికి చెప్పింది. తండ్రి వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పది రోజుల్లో కేసును ఛేదించి, 12 మంది నిర్వాహకులు, పలువురు విటులను అరెస్టు చేశారు. గుంటూరు, కృష్ణా, హైదరాబాద్, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఈ ముఠాలో నిర్వాహకులు, విటులు ఉన్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన వివరాల ప్రకారం.. హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న గుంటూరు జిల్లాకు చెందిన బాలికకు ఇటీవల కోవిడ్ సోకడంతో ఇంటికి తెచ్చారు. బాలిక తల్లికి కూడా కోవిడ్ సోకడంతో గుంటూరు ద్వారకానగర్ ఏడో వీధికి చెందిన ఎం.స్వర్ణకుమారి నాటుమందు ఇప్పిస్తానని నమ్మించింది. తన కుమార్తె ఇంటి వద్దే ఉంటుందని తండ్రి చెప్పాడు. ఈలోగా బాలిక తల్లి మృతిచెందింది. బాలికను తాను చూసుకుంటానని స్వర్ణకుమారి తండ్రిని నమ్మించి, గుంటూరు చైతన్యపురి 4వ వీధిలోని ఇంటికి తీసుకువచ్చింది. అక్కడ బాలికను నిర్బంధించి, వ్యభిచార కూపంలోకి దింపింది. విజయవాడ, కృష్ణా, తణుకు, నెల్లూరు జిల్లా, హైదరాబాద్, నెల్లూరులో వ్యభిచారం చేయించింది. నెల్లూరులో ఆమె నుంచి తప్పించుకున్న బాలిక విజయవాడ బస్టాండ్‌కు చేరింది. బాలిక అదృశ్యమైందంటూ స్వర్ణకుమారి గుంటూరు నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విజయవాడ బస్టాండ్‌లో బాలికను మరో నిర్వాహకురాలు పుణ్యవతి అలియాస్ నాగలక్ష్మి బాలికకు మాయమాటలు చెప్పి, తనతో తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. అక్కడ్నుంచి తణుకులోని శారద, అశ్విని వద్దకు పంపింది. బాలికను అశ్విని విజయవాడ తీసుకువచ్చి జేసింత, హేమలతకు అప్పగించి డబ్బులు తీసుకుంది. వారిద్దరూ బాలికతో వ్యభిచారం చేయించారు. తాను ఈ పని చేయలేనని, చదువుకుంటానని బాలిక చెప్పింది. బాలికను తీసుకుని వారు కారులో పాఠశాలకు వచ్చారు. తాము పోలీస్ మహిళా మిత్రలమని పాఠశాల యాజమాన్యానికి చెప్పి, టీసీ ఇవ్వమని కోరారు. బాలిక తండ్రికి మాత్రమే టీసీ ఇస్తామని వారు బదులిచ్చారు. వారు బాలిక తండ్రిని పిలిపించి, టీసీ తీసుకొని, తాము చదివిస్తామని విజయవాడ తీసుకెళ్లారు. మళ్లీ వ్యభిచారం చేయించడంతో, బాలిక తప్పించుకుని ఇంటికి వచ్చి తండ్రికి విషయం చెప్పింది. తండ్రి వెంటనే మేడికొండూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును అరండల్ పేట పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు స్వర్ణకుమారిని, ఇతర నిందితుల్లో పలువురిని అరెస్టు చేశారు. వ్యభిచార వృత్తి నిర్వహించే స్వర్ణకుమారి గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీసినట్లు పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ డి.గంగాధరం, పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ కూడా పాల్గొన్నారు. -
పడుపువృత్తి బ్రోకర్ల నుంచి రూ. లక్షల్లో లంచం..
సాక్షి, చెన్నై(తమిళనాడు): మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో వ్యభిచారం నిర్వహించుకునేందుకు అనుమతివ్వడమే కాకుండా.. బ్రోకర్ల నుంచి లక్షల్లో లంచం పుచ్చుకున్న ఇద్దరు ఇన్స్పెక్టర్ల పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా వారి ఇళ్లల్లో విస్తృతంగా మంగళవారం సోదాలు నిర్వహించింది. వివరాలు.. ప్రస్తుతం కీల్పాకం నేర విభాగం ఇన్స్పెక్టర్గా శాంవిన్సంట్, సైదాపే ట శాంతి భద్రతల విభాగం ఇన్స్పెక్టర్గా శరవణన్ పని చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు ఈ ఇద్దరూ వ్యభిచార నిర్మూలన విభాగం ఇన్స్పెక్టర్లుగా పనిచేశారు. ఈ సమయంలో ఆ ఇద్దరూ విదేశీ, స్వదేశీ మోడల్స్‌ను చెన్నైకు రప్పించే బ్రోక ర్ల నుంచి లక్షల్లో లంచం పుచ్చుకుని చూసి చూడనట్టు వ్యవహరించినట్టు ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీనిపై రహస్య విచారణ చేపట్టిన ఏసీబీ వర్గాలు ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కేసు నమోదు చేసింది. అంతే కాకుండా, మంగళవారం ఉదయాన్నే వారి ఇళ్లల్లో సోదాలు చేసింది. కీల్పాకం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉన్న శాం విన్సంట్, పులియాంతోపు పోలీసు క్వార్టర్స్‌లోని శరవణన్ ఇంటిలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ రోడ్లో ఏడుగురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఖుల్నా జిల్లాలోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్ కోలిబా, నహిదా ఖుసుర్దాస్ కోలిబా, కాచి ముషారఫ్ సర్దార్లతో పాటు మరి కొందరు యువతులను అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగ్లాదేశ్ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీలు, నకిలీ ఆధార్ కార్డులు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం) వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్, అతని భార్య నహిదా ఖుసుర్దాస్ కోలిబాలు కొన్నేళ్ల క్రితం అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించారు. కొంతకాలం పాటు ముంబైలో గడిపి.. ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చారు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ఏజెంట్ అతియార్ మొండల్, వ్యభిచార నిర్వాహకుడు కాచి ముషారఫ్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. చదవండి: (మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై?) బంగ్లాదేశ్‌లో పని మనిషులుగా ఉన్న కొందరు యువతులకు అతియార్ మొండాల్ ఇండియాలో మంచి పని, జీతం ఇప్పిస్తాననని మాయమాటలు చెప్పి సనత్‌నగర్‌కు తీసుకొచ్చాడు. ఇక్కడ గ్యాంగ్‌తో కలిసి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ కమిషనర్ డీసీపీ (ఓఎస్డీ) పీ రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే నాగేశ్వర్ రావు, ఎస్ఐ కే శ్రీకాంత్, బీ పరమేశ్వర్, బీ అశోక్ రెడ్డి, జీ శివానందం నిందితులను పట్టుకున్నారు. -
టోలిచౌకి: యువతుల అర్ధ నగ్న ఫొటోలతో వ్యభిచారం
సాక్షి, నాగోలు: డేటింగ్ యాప్‌లో యువతుల అర్ధ నగ్న ఫొటోలు పెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండా దేశానికి చెందిన నిర్వాహకురాలితో పాటు ఆ దేశానికి చెందిన యువతిని రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలను వెల్లడించారు. ఉగాండా దేశానికి చెందిన నముబిరు సియానా (32) నాలుగేళ్ల క్రితం విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి టోలిచౌకిలోని నిజాంకాలనీలో నివాసం ఉంటోంది. ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో ఆన్లైన్ వ్యభిచారం ప్రారంభించింది. ఉగాండా నుంచి ఓ యువ తిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మీర్ పేట చెరువు వద్ద వారిని అరెస్ట్ చేశారు. సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకొని యువతిని హోమ్‌కు తరలించారు. నముబిరు సియానాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ తెలిపారు. మాట్లాడుతున్న సీపీ మహేష్ భగవత్ బాధితులకు పునరావాసం.. మహిళలను, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకం దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాది ఏర్పాటు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అక్రమ రవాణా నుంచి మహిళలను కాపాడిందని తెలిపారు. మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించి, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు పట్టణంలో కొంతకాలంగా బైక్ దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠాను కూడా అరెస్ట్ చేశారు. సంబంధిత వివరాలను స్థానిక ఏసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని శ్రీనివాసకాలనీలో ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు సీఐ లింగయ్య సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు చేశారు. మందమర్రికి చెందిన ఓ మహిళ సదరు ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్నట్లు వెలుగుచూసింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూర్ ప్రాంతాల నుంచి మహిళలను తెప్పిస్తున్నట్లు గుర్తించారు. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల యువతుల ఆర్థిక ఇబ్బందులు గుర్తించి వారిని వ్యభిచారం వైపు నడిపిస్తున్నారని తెలి సింది. విటులను రప్పించేందుకు దినేష్, రమేష్‌కు నెలకు రూ.15వేల వేతనం కూడా చెల్లిస్తున్నట్లు వెలుగుచూసింది. విటుల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ రూ.500 సదరు మహిళలకు ఇప్పిస్తున్నట్లు బయటపడింది. తాజాగా ఇద్దరు మహిళలతో వ్యభిచారం కొనసాగిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలితోపాటు 8మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో కాగజ్‌నగర్‌కు చెందిన దినేష్, రమేష్, అబ్దుల్‌గఫర్, షేక్‌రియాజ్, షేక్ఇర్ఫాన్, అబ్బుదల్ జబ్బర్, జీషన్‌ఖాన్ ఉన్నారు. నిర్వాహకురాలి నుంచి రూ.15 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతులను సఖీ సెంటర్‌కు తరలించారు. అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ జిల్లా కేంద్రంలో తరచూ బైక్ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సున్నంబట్టివాడ సమీపంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులో తీసుకుని విచారణ చేపట్టగా.. అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా వెలుగు చూసింది. ఇందులో ప్రధాన నిందితుడు బాలుడు కావడం విశేషం. ఇతడు గతంలో బైక్‌ల దొంగతనం, గంజాయి సరఫరా కేసులో సంరక్షణ గృహంలో ఉండి ఈ ఏడాది జూన్‌లో విడుదలయ్యాడు. అనంతరం అతడి మేనమామ, ములుగు జిల్లా వెంకటపురానికి చెందిన శ్రీకాంత్, ఆయన స్నేహితుడు, మంచిర్యాల జిల్లా గోపాల్‌వాడకు చెందిన ఈశ్వర్‌తో కలిసి బైక్‌లు దొంగిలిస్తున్నాడు. వాటిని భూపాలపల్లి జిల్లా సుబ్బక్కపల్లికి చెందిన కిరణ్, మంచిర్యాల అశోక్‌రోడ్‌కు చెందిన మహేందర్లకు అమ్ముతుండేవారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండేవారు. వీరిపై మంచిర్యాల, మందమర్రి, లక్సెట్టిపేట, రామగిరి, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, నల్లబెల్లి, కాటారం పోలీస్స్టేషన్ల పరిధిలో 15 బైక్ దొంగతనాల కేసులు ఉన్నాయి. వీరినుంచి 15 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు బైక్‌దొంగలతోపాటు కొనుగోలు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సీఐ లింగయ్య, ఎస్సైలు మారుతి, ప్రవీణ్‌కుమార్, రాజమౌళి గౌడ్, సిబ్బంది భరత్, దివాకర్, శ్రావణ్‌కుమార్, సీసీఎస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. బాలికపై లైంగికదాడి వేమనపల్లి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన వేమనపల్లి మండలం జక్కెపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక కస్తూరి బాలో చదువుకుంటోంది.లాక్డౌన్ కావడంతో ఇంటివద్దే ఉంటోంది. రెండురోజుల క్రితం గ్రామంలో యక్షగాన నాటక ప్రదర్శన ఉండడంతో కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్లారు. దీనిని అదునుగా చూసిన అదే గ్రామానికి చెందిన పొర్‌తెట్టి అంజన్న బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి రాగా.. జరిగిన విషయాన్ని బాలిక వారికి తెలిపింది. వారు నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రహీంపాషా తెలిపారు. అలుగును హతమార్చిన ఐదుగురు అరెస్ట్ జన్నారం(ఖానాపూర్): గ్రామ శివారులోకి వచ్చిన అటవీ అలుగును హతమార్చిన ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రేంజ్ అధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట్ రేంజ్ మేదరిపేట సెక్షన్ లోని దమ్మన్నపేట గ్రామ శివారులో అటవీ అలుగును పలువురు వేటాడినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం రేంజ్ అధికారి వెంకటేశ్వర్ రావు సిబ్బందితో కలిసి దమ్మన్నపేటలో డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేయగా.. ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కానీ అదే గ్రామానికి చెందిన శ్రీను అలియాస్ మచ్చశ్రీను ఇంట్లో అలుగు ఉందన్న సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అటవీ అధికారుల వాహనాన్ని అడ్డగించారు. గ్రామ పెద్దల సహాయంతో శ్రీనును కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా అలుగును చంపినట్లు ఒప్పుకున్నాడు. మూడు రోజుల ముందే దమ్మన్నపేట గ్రామ సమీపంలో వాగులోకి చేపలు పట్టేందుకు శ్రీనుతో పాటు చిన్ననర్సయ్య అలియాస్ చిరంజీవి, రాము అలియాస్ చింటు, భీమయ్య అలియాస్ బాలు, నరేశ్ చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వాగులో అటవీ అలుగు కనిపించగా.. ప్రాణంతో పట్టుకున్నారు. శ్రీనివాస్ ఇంట్లో అలుగును రెండ్రోజులపాటు ప్రాణంతో ఉంచారు. అటవీ అధికారులకు తెలిసిందని తేలడంతో అలుగును చంపి దొరికిన ప్రదేశంలోనే వదిలేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. -
నగరంలో ఆన్లైన్ కేంద్రంగా వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలంలో వంశీ రెడ్డి అలియాస్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకులు అంజలి, చిన్నాలు పరారీలో ఉన్నారు. నిందితులు నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా బారి నుంచి నలుగురు యువతులను పోలీసులు రక్షించారు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు కాగా.. మరో యువతి స్వస్థలం విజయవాడగా గుర్తించారు. -
సెక్స్ రాకెట్: నటి, మోడల్ అరెస్టు!
ముంబై: ముంబైలోని ఓ స్టార్ హోటల్లో రహస్యంగా నడిపిస్తున్న సెక్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. తూర్పు గోరెగావ్‌లో గురువారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ముంబై పోలీసులు ఇద్దరు యువతులను రక్షించారు. అలాగే ఈ సెక్స్ రాకెట్‌కు యువతులను సరాఫరా చేస్తున్న ఓ నటిని, మోడల్‌ను అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గోరెగావ్‌లోని ప్లస్ స్టార్ హోటల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో హోటల్‌పై దాడి చేశారు. చాలాకాలంగా హోటల్లో వ్యభిచారం జరుగుతుందని సీనియర్ పోలీసు అధికారి దిండొషీకి.. గుర్తుతెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో దానిని నిర్థారించి డీసీపీ జోన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో డిప్యూటీ కమిషనర్ డి స్వామి ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ... మొదట ఓ పోలీసు అధికారి మారువేషంలో కస్టమర్లా హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఈ రాకెట్‌లోని వ్యక్తిని పోలీసు అధికారి సంప్రదించగా. అతడు.. ఇద్దరు యువతలతో కలిసి హోటల్‌కు వచ్చాడు. దీంతో అతడిని అరెస్టు చేసి యువతులను రక్షించినట్లు కమిషనర్ తెలిపారు. అలాగే ఈ దాడిలో ఈ వ్యభిచార ముఠాకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్న నటి అమృత ధనోవా(32), మోడల్ రిచా సింగ్‌ను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా రక్షించిన యువతుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. అరెస్టు చేసిన వారిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) 370(3),34 సెక్షన్ ప్రకారం అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం కింద పలు కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, చీరాల రూరల్ (ప్రకాశం): చీరాల రామకృష్ణా పురం పంచాయతీలోని బోడిపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై చీరాల ఒన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గృహ నిర్వాహకులతో పాటు ఒక పురుషుడు, నలుగురు మహిళలను అరెస్టు చేశారు. వారివద్ద రూ. 9,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఒన్‌టౌన్ సీఐ నరహరి నాగ మల్లేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. రామకృష్ణాపురం పంచాయతీలోని బోడిపాలెంలో నివాసముండే అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులు గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. వీరు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే మహిళలను, కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలకు దూరంగా ఉండే మహిళలను గుర్తిస్తారు. వారికి డబ్బులు ఆశచూపించి లోబరుచుకుని వ్యభిచార కూపంలోకి బలవంతంగా దించుతారు. అంతేకాక వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించారు. ఈ విధంగా వారు వ్యాపార పరంగా చీరాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వ్యభిచార మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే వారు చీరాల, ఈపురుపాలెం, విజయవాడ, గుంటూరు, వైజాగ్, వంటి ప్రాంతాలకు చెందిన మహిళలను చీరాలకు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని సిఐ తెలిపారు. అయితే ఇటువంటి సంఘటనలపై తరచు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయా ప్రదేశంపై పోలీసులు ఎప్పటినుండో నిఘా పెట్టారు. పూర్తి సమాచారం అందుకున్న ఒన్‌టౌన్ సీఐ నాగ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో రామకృష్ణాపురంలోని బోడిపాలెం వ్యభిచార గృహంపై దాడిచేశారు. ఈ దాడిలో ఒక పురుషుడితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. వారితో పాటు గృహ నిర్వాహకులైన అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులను కూడా అరెస్టు చేశారు. వారిని తనిఖీలు చేయగా వారివద్ద రూ. 9,230 నగదు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన నగదుతో పాటు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోని దించినట్లయితే కఠినంగా శిక్షిస్తామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బంగ్లాదేశ్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
కుషాయిగూడ: వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలికతో పాటు మరో ఇద్దరు బంగ్లాదేశీయులు, స్థానికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సోహెల్ హుస్సేన్ పదేళ్ల క్రితం నగరానికి వచ్చి టెక్ మహేంద్రలో ఫ్లై ఉడ్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన విస్టి హుస్సేన్‌ను వివాహం చేసుకున్న అతను న్యూ ఆఫీజ్పేట్లో ఉంటున్నాడు. వీరికి అమ్మాయిలను సిగ్ధర్ అనే వ్యక్తితో పరియం ఏర్పడింది. సిగ్థర్ ప్రేమ పేరుతో బంగ్లాదేశ్‌కు చెందిన బాలిక(17)ను మోసం చేసి బెంగుళూరు తీసుకువచ్చాడు. అక్కడ సృజన్ అనే వ్యక్తి సాయంతో ఆమెను వ్యభిచారం దించి డ్యాన్స్గ్లర్గా మార్చాడు. అనంతరం ఆమెను విజయవాడకు చెందిన విజయ అనే మహిళకు ఆ అప్పగించడంతో ఆమె సదరు బాలికతో వ్యభిచారం చేయించేది. సోహెల్ హుస్సెన్ విజయ నుంచి ఆ అమ్మాయిని కొనుగోలు చేసి గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గురువారం ఈసీఐఎల్‌లోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేపి బాలికతో పాటు విటుడు హరిచౌదరిని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సోహెల్ హుస్సెన్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో ప్రజ్వల ఎన్జీఓ నిర్వాహకురాలు డాక్టర్ సునీతాకిషన్ ఇచ్చిన సమాచారం మేరకు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి దాడులు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సినీ సహాయ దర్శకుడు, నటుడు అరెస్ట్
సాక్షి, మేడ్చల్ : ఓ వ్యభిచార ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. విటులను ఆన్లైన్ ద్వారా ఆకర్షిస్తూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఘట్కేసర్లోని ఓ ఇంటిపై దాడులు జరిపారు. వెంకటాద్రి టౌన్షిప్ బస్టాండ్ సమీపంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఓ ఇంటిఫై ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ సహాయ దర్శకుడు మూల రాజశేఖర్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ యార్లగడ్డ రవికుమార్ తో పాటు, ముగ్గురు మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు వీరిని ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విదేశీ మహిళలతో 30 ఎస్కార్టు వెబ్సైట్లు
ఇండోర్ (మధ్యప్రదేశ్): దాదాపు 10 దేశాలకు చెందిన మహిళలతో 30 ఎస్కార్టు వెబ్సైట్లు నడుపుతున్న ఓ యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్షల్ ఝా(30) బీటెక్ వరకు చదువుకున్నాడు. 2014లో ఇతడికి సాగర్ జైన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతడు అప్పటికే వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్నాడు. అతడి సూచనలు, సలహాలతో ఎస్కార్టు సర్వీస్‌ను ప్రారంభించేందుకు హర్షల్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఛండీగఢ్‌కు చెందిన వికాస్ బత్రా అలియాస్ రాహుల్ సాయంతో ఆస్ట్రేలియా, యూఎస్ఏ, ఇంగ్లండ్ దేశాల అడల్ట్ వెబ్సైట్ల సెర్చ్ ఇంజిన్లను నిర్వహించటం నేర్చుకున్నాడు. అప్పటి నుంచి దాదాపు 10 దేశాలకు చెందిన వ్యభిచారిణులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని, ఇండోర్ కేంద్రంగా సేవలను అందజేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇండోర్ పోలీసులు హర్షల్‌ను అదుపులోకి తీసుకుని, అతనిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
వ్యభిచార ముఠా అరెస్ట్
అత్తాపూర్: బాలికతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి హ్యాపీహోమ్స్ ప్రాంతానికి చెందిన నిషాఖాన్(45) గృహిణి. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. నెల రోజుల క్రితం నిషాఖాన్ సులేమాన్‌నగర్‌కు చెందిన తషీన్ ఫాతిమా(32), పహాడీఫరీష్‌కు చెందిన సదా(21)లను కలిసి ఓ అమ్మాయి కావాలని కోరింది. అందుకు గాను డబ్బులు ఇస్తానని చెప్పింది. ఎందుకని వారు ప్రశ్నించగా వ్యభిచారం కోసమని సమాధానమిచ్చింది. వచ్చిన దాంట్లో సగం వారికిస్తానని ఆశచూపింది. ఫాతిమా, సదాలు పహాడీషరీఫ్‌లో కుమార్తె(16)తో సహా నివాసం ఉంటున్న ఓ గృహిణి వద్దకు వెళ్లారు. తమకు తెలిసిన వారింట్లో పనిచేసేందుకు అమ్మాయి కావాలని ప్రతినెలా రూ.15 వేలు చెల్లిస్తారని చెప్పారు. వీరి మాటలు నమ్మిన గృహిణి తన కుమార్తె(16)ను వాళ్లతో పంపింది. వాళ్లిద్దరూ బాలికను తీసుకెళ్లి నిషాఖాన్‌కు రూ.5వేలకు అమ్మేశారు. నిషాఖాన్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దించింది. నెలరోజులుగా ఉప్పర్‌పల్లి, చింతల్మెట్ లాల్‌దాబా, బండ్లగూడ ప్రాంతాల్లోని ఇళ్లలో ఉంచి వ్యభిచారం చేయిస్తోంది. మూడు రోజుల క్రితం ఉప్పర్‌పల్లి నుంచి తప్పించుకున్న బాలిక రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాఖాన్ ఇంటిపై దాడిచేసి నిషా, ఫాతిమా, సదాలతో పాటు ముగ్గురు విటులు మహ్మద్‌అలీ(21), మహ్మద్ మజీర్(20), మహ్మద్ షకీలుద్దీన్(24)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను రెస్క్యూ హోంలో చేర్చారు. నిషాఖాన్ గతంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం కేసులో జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై నెల రోజుల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్న అందరినీ కాల్‌లిస్ట్ ఆధారంగా అదుపులోకి తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్, ఎస్సైలు వెంకట్‌రెడ్డి, శివప్రసాద్, మల్లిఖార్జున్ పాల్గొన్నారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
- నిర్వాహకురాలితో పాటు ఐదుగురు సెక్స్ వర్కర్ల అరెస్టు గోల్కొండ: గుట్టుగా వ్యభిచారం చేస్తున్న ఓ ముఠాను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వరుసగా రెండవ రోజు కూడా టోలిచౌకి పరిసరాల్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు కావడం చర్చనీయాంశంగా మారింది. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజా వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గోల్కొండ పీఎస్ పరిధిలోని మినీ గుల్షన్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం రాత్రి ఇన్స్పెక్టర్ రాజా వెంకట్‌రెడ్డి తన సిబ్బందితో ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా నాయకురాలితో పాటు ఐదుగురు సెక్స్ వర్క్ర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వ్యభిచార ముఠావారు బొంబాయ్ నుంచి డ్యాన్స్ర్లను తీసుకువచ్చి వారిచే బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. కాగా తదుపరి విచారణ నిమిత్తం కేసును గోల్కొండ పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వారి నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ యువతులను రెస్కూ హొమ్కు తరలించామని గోల్కొండ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ తెలిపారు. -
వ్యభిచారం ముఠా గుట్టురట్టైంది..
అల్వాల్: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆదివారం జరిగింది. సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...అల్వాల్ రామ్‌నగర్ భాటియా బేకరి సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి నిర్వహకులు కృష్ణమూర్తి, సత్యంలతో పాటు విటులు ఆనంద్షబాని, దాసరి ప్రసాద్, శ్రీనివాస్, 30 సంవత్సరాల యువతిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైజాగ్‌లో హైటెక్ వ్యభిచారం
-
వైజాగ్‌లో హైటెక్ వ్యభిచారం
అక్కయ్యపాలెం: హైటెక్ తరహాలో సాగుతున్న వ్యభిచారం గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. వివరాలివీ... హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన నీలకంఠారెడ్డి ‘వైజాగ్ కాల్‌గర్ల్స్’ పేరుతో ఓ వెబ్సైట్ క్రియేట్ చేశాడు. అందులో తనను అఖిల్‌గా పరిచయం చేసుకుని కాంటాక్టు ఫోన్ నంబర్‌ను ఉంచాడు. అందమైన అమ్మాయిలను సప్లయి చేస్తామని, కావాల్సిన వారు సంప్రదించాలని అందులో పేర్కొన్నాడు. అమ్మాయిలను విటులకు సరఫరా చేసే ఈ దందా ఏడు నెలల నుంచి కొనసాగుతోంది. ఇందుకోసం వైజాగ్ సీతమ్మపేటలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అందులో కంప్యూటర్ ఏర్పాటు చేసుకుని శ్రావణి అనే మహిళ సాయంతో ఈ ఘన కార్యం నెరపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ద్వారకా పోలీసులు సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో కూపీలాగగా మొత్తం వ్యవహారం బయటపడింది. మంగళవారం ఉదయం ఇంటిపై దాడి చేసి నీలకంఠారెడ్డి, శ్రావణిలతో పాటు ఇద్దరు యువతులను ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఎంటర్ప్రైజెస్ పేరుతో వ్యభిచారం
బెల్లంపల్లి: ఎంటర్ప్రైజెస్ కార్యాలయం పేరుతో ఓ కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ఓ ముఠా అందులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళా నిర్వహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సంప్రీత్సింగ్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. -
అదో పెద్ద వ్యభిచార రాకెట్...
* చిన్నారి దుర్గ కిడ్నాప్ కేసు విచారణలో వెలుగు చూసిన నిజం * రైలు, బస్స్టేషన్ల వద్ద యువతులు, బాలికల అపహరణ * యాదగిరిగుట్టలో వ్యభిచార గ్యాంగ్‌కు విక్రయం * తాజాగా చిన్నారిని రక్షించిన పోలీసులు అడ్డగుట్ట: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఈనెల 5న జరిగిన చిన్నారి దుర్గ కిడ్నాప్.. విడుదల కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. దుర్గను కిడ్నాప్ చేసింది కేవలం ఇద్దరే అని అంతా అనుకున్నారు. అయితే, జీఆర్పీ పోలీసుల విచారణలో మరో దిగ్భ్రాంతికర విషయం బయటపడింది. నిందితులు ఇద్దరు కాదని.. వీరి వెనుక మరో ఐదుగురు సభ్యుల వ్యభిచార ముఠా ఉందని తేలింది. పోలీసులు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరిలో కొందరు పాతనేరస్తులున్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ జనార్దన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 5న కాకినాడకు చెందిన రాణి కూతురు దుర్గను ఓ మహిళ ఎత్తుకెళ్లింది. రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా జీఆర్పీ పోలీసులు నిందితురాలని పట్టుకొని,బాలికను ఆమె తల్లికి క్షేమంగా అప్పగించారు. కాగా, నిందితురాలి విచారణలో ఇప్పుడు సెక్స్ రా కెట్ గుట్టు రట్టయింది. మెదక్ జిల్లా జిన్నారంలోని బాలాజీనగర్‌కు చెందిన బొంతల కుమార్(24) సికిం ద్రాబాద్ రైల్వే, బస్టేషన్ల వద్ద మాటు వేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చే యువతులు, చిన్నారులను గుర్తిస్తాడు. తమ గ్యాంగ్‌లోని సభ్యురాలు పద్మావతి అలియాస్ సునీత(26) సహకారంతో వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన చి న్నారులను ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీయిస్తాడు. వారిని యాదగిరిగుట్ట సుభాష్‌నగర్‌కు చెందిన కంసాని శంకర్(51)కి అమ్మేస్తాడు. శంకర్ తన భార్య దివ్య సహకారంతో వ్యభిచార గృహాలు నడిపే కోడెం బేగమ్మ(60), మేకల బూస(55), చింతల కమలమ్మ(48)లకు వారిని కొంత మొత్తానికి అమ్మేస్తాడు. యు వతులతో ప్రతి రోజూ వ్యభిచారం చేయిస్తూ వచ్చిన డబ్బులో కొంత కమిషన్ తీసుకుంటాడు. బాలికలను పెంచి పెద్ద చేశాక ‘వృత్తి’లోకి దింపుతారు. యాదగిరిగుట్ట కేంద్రంగా వీరు వివిధ జిల్లాల్లో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుర్గ కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులకు వైష్ణవి(5) అనే మరో పాప కూడా దొరికింది. వైష్ణవిని కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు నెలల క్రితం కుమార్ కిడ్నాప్ చేసి శంకర్‌కు అమ్మేశాడు. ఆ దుర్మార్గుల నుంచి బాలికను రక్షించిన పోలీసులు ఆమె తల్లిదండ్రుల వివరాలు తెలియకపోవడంతో రెస్క్యూహోంకు తరలించారు. ఈ పాపను గుర్తించిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్పీ జనార్దన్ కోరారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను ఎస్పీ ప్రశంసిస్తూ క్యాష్ రివార్డులు అందజేశారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
భాగ్యన గర్ కాలనీ: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను కూకట్పల్లి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యనగర్‌కాలనీలోని హోటల్ వన్‌ప్లస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. విటులు బి. ఓంప్రకాష్ (30), ప్రశాంత్‌రెడ్డి (24), కె.ప్రీతం (24), జి.విశ్వనాథ్ (24), మురళి (28)లతో పాటు ఇద్దరు వ్యభిచారిణులను అరెస్టు చేశారు. -
వ్యభిచార ముఠాకు హెడ్ కానిస్టేబుల్ సపోర్ట్
-
విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
విశాఖ : విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. బీచ్ రోడ్డు అఫిషియల్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. భార్యాభర్తల సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన ఇద్దరు బాలికలను రక్షించి.. చైల్డ్ హోమ్‌కు తరలించారు. ఇక నిర్వాహకుడు వీకె రెడ్డి, బ్రోకర్ జిలానీలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైనవారి కోసం గాలిస్తున్నారు. -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
-
వ్యభిచార ముఠా గుట్టురట్టు
చందానగర్ : ఆన్లైన్ ద్వారా హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్‌హౌస్‌పై దాడి చేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) అధికారులు.. ఇద్దరు యువతులు సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కథనం మేరకు.. పాతబస్తీ వాసి మాలిక్ ముంబై, కోల్‌కతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఏపీహెచ్‌బీ కాలనీలోని గ్రీన్ గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్లో విటులను ఆకర్షించి, ఒక రాత్రికి రూ.10 వేల చొప్పున వసూలు చేసేవాడు. దీనిపై కమిషనర్ సీవీ ఆనంద్‌కు సమాచారం అందడంతో, ఆయన ఆదేశాల మేరకు ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్సై రమేశ్ ఆదివారం గెస్ట్‌హౌస్‌పై దాడి చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన శుభంరాజ్ శర్మ (22), ప్రమోద్ పాటిల్(33), శ్రీరామమూర్తి (24), వెంకటేశ్వరరావు(29), రోషన్‌కుమార్ యాదవ్(27), రాజ్‌మిశ్రా(24)లతో పాటు టోలిచౌకికి చెందిన మజర్ ఉల్లాఖాన్ సమీర్(27) పట్టుబడ్డారు. వీరితో పాటు కోల్‌కతాకు చెందిన యువతులు రీముహజ్రా, తృప్తిదత్తాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్, రూ.3 వేల నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు మాలిక్ పరారీలో ఉండగా, పట్టుబడ్డ యువతులను రెస్క్యూహోమ్‌కు తరలించారు.