
కుషాయిగూడ: వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలికతో పాటు మరో ఇద్దరు బంగ్లాదేశీయులు, స్థానికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సోహెల్ హుస్సేన్ పదేళ్ల క్రితం నగరానికి వచ్చి టెక్ మహేంద్రలో ఫ్లై ఉడ్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన విస్టి హుస్సేన్‌ను వివాహం చేసుకున్న అతను న్యూ ఆఫీజ్‌పేట్‌లో ఉంటున్నాడు. వీరికి అమ్మాయిలను సిగ్ధర్ అనే వ్యక్తితో పరియం ఏర్పడింది. సిగ్థర్ ప్రేమ పేరుతో బంగ్లాదేశ్‌కు చెందిన బాలిక(17)ను మోసం చేసి బెంగుళూరు తీసుకువచ్చాడు.
అక్కడ సృజన్ అనే వ్యక్తి సాయంతో ఆమెను వ్యభిచారం దించి డ్యాన్స్‌గ్లర్‌గా మార్చాడు. అనంతరం ఆమెను విజయవాడకు చెందిన విజయ అనే మహిళకు ఆ అప్పగించడంతో ఆమె సదరు బాలికతో వ్యభిచారం చేయించేది. సోహెల్ హుస్సెన్ విజయ నుంచి ఆ అమ్మాయిని కొనుగోలు చేసి గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గురువారం ఈసీఐఎల్‌లోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేపి బాలికతో పాటు విటుడు హరిచౌదరిని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సోహెల్ హుస్సెన్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో ప్రజ్వల ఎన్‌జీఓ నిర్వాహకురాలు డాక్టర్ సునీతాకిషన్ ఇచ్చిన సమాచారం మేరకు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగి దాడులు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment