
సాక్షి, క్రైమ్: బోడుప్పల్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా కారు నడిపి ఒకరిని బలిగొన్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
చనిపోయిన యువకుడి ఐడెంటిటీని.. బీటెక్ చదివే విశాల్‌గా గుర్తించారు పోలీసులు. విశాల్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో నడుపుతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment