boduppal
-
బోడుప్పల్లో ఘోరం.. స్టూడెంట్ దుర్మరణం
సాక్షి, క్రైమ్: బోడుప్పల్లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా కారు నడిపి ఒకరిని బలిగొన్నాడు. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. చనిపోయిన యువకుడి ఐడెంటిటీని.. బీటెక్ చదివే విశాల్‌గా గుర్తించారు పోలీసులు. విశాల్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో నడుపుతున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
34 కాలనీలు.. 85 నామినేషన్లు
మేడ్చల్: ఏళ్ల క్రితం చట్ట ప్రకారంగా కొనుగోలు చేసిన భూముల్లో వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో వారి స్థలాలు వక్ఫ్ భూములని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సమస్యలను పట్టించుకోవాలని మేడ్చల్ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 30 కాలనీల ప్రజలు 85 మందితో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. బోడుప్పల్ ప్రాంతంలో ఆర్ఎన్ఎస్ కాలనీ, పెంటారెడ్డి కాలనీ,ç మారుతీనగర్, ఘట్కేసర్కు చెందిన మధురానగర్ తదితర 30 కాలనీల ప్రజలు నాలుగేళ్లుగా విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ ప్రాంతంలో 30 సర్వే నంబర్లలో 300 ఎకరాలు, ఘట్కేసర్ పరిధిలో 10 ఎకరాలు భూమి ఉంది. 40 ఏళ్ల క్రితం అవన్నీ వెంచర్లుగా మారిపోయాయి. బోడుప్పల్, పిర్జాదీగూడ నగర శివారు ప్రాంతాలు కావడంతో శరవేగంగా అభివృద్ధి సాధించాయి. రియల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేశారు. చట్టబద్ధంగా వినియోగదారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి సొంతింటి కల నెరవేర్చుకున్నారు. దాదాపు 30 కాలనీలలో ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. 2018 వరకు అంతా సాఫీగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 2018లో ఓ వ్యక్తి కాలనీలు ఉన్న భూములన్నీ వక్ఫ్ భూములని ఫిర్యాదు చేయడంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో 7వేల కుటుంబాల వారు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలు పెట్టారు. 2022 సంవత్పరంలో 30 కాలనీల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడంతో కాలనీలలో ఇల్లు కట్టుకున్న వారి భవిష్యత్ అంధకారంగా మారంది. జేఏసీ తరపున పోరాటాలు చేసినా పాలకుల నుంచి, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారి రోదన అరణ్య రోదనగా మారింది. తమ సమస్యను ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఎవరికి విన్నవించుకున్నా పరిష్కారం కాకపోవడంతో వారు తమ సమస్యపై పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 88 నామినేషన్లు వేశారు. శుక్రవారం కాలనీల వాసులు కీసరలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 116 మంది నామినేషన్లు వేయగా అందులో 88 మంది బోడుప్పల్ 30 కాలనీలకు చెందిన వారే. ప్రభుత్వానికి మా సమస్య తెలియాలనే.. మేం ఎన్నికలలో విజయం సాధిస్తామని నామినేషన్ వేయలేదు. మా సమస్య వచ్చే ప్రభుత్వానికి తెలియాలనే మూకుమ్మడి నామినేషన్లు వేశాం. ఎన్నికల ద్వారానైన మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుందని అనుకుంటున్నాం. – శ్రీధర్‌రెడ్డి, ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు పాలకులు పట్టించుకోవడం లేదు.. పాలకులు పట్టించుకోకపోవడం వల్లే 88 మంది నామినేషన్లు వేశారు. సమస్యను మంత్రి మల్లారెడ్డికితో పాటు అందరు పాలకులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. మా సమస్య పట్టించుకోని నేతలకు ఓటు ద్వారా బుద్ది చెబుతాం – కుంభం కిరణ్‌కుమార్, కార్పొరేటర్, జేఏసీ కోచైర్మన్ -
బోడుప్పల్ లో రూ.10 కోట్ల కుచ్చుటోపి
-
ఆవు పేడతో వినాయక విగ్రహాలు
బోడుప్పల్: జీవ జాతులకు హాని కలుగకుండా... పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఆవు పేడతో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆయా విగ్రహాలను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోంది బోడుప్పల్ బాలాజీహిల్స్ కాలనీలోని శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. ►ఆవు పేడతో 300 రకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ నిర్వాహకుడు కుప్ప శ్రీనివాస్ తెలిపారు. వినాయక విగ్రహాలు, గోడకు వేలాడ దీసే బొమ్మలు, ఇంటి ముఖ ద్వార తోరణాలు, ఆది యోగి విగ్రహాలు, శివలింగాలు, జ్ఞాపికలు, నర్సరీ కుండీలు, విత్తన గోలీలు, దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాలు, ప్రమిదలు, జప మాలలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెన్ను స్టాండ్లు, సెల్‌ఫోన్ స్టాండులు, విభూది, దంత మంజరి (పళ్లపొడి), తయారు చేస్తున్నారు. అలాగే గో మూత్రంతో పినాయిల్, వేప, హ్యాండ్‌వాచ్‌ల లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఆవు పేడతో చెప్పులు తయారీ, ఆసనాల కోసం వేసుకునే పీటలు, దూబ్‌బత్తి, దోమల కోసం మచ్చల బత్తి వంటి ఉత్పతులు తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ►గోశాలకు విరాళాలు అందజేసే వారికి పేడతో తయారు చేస్తున్న ఉత్పత్తులను ఉచితంగా అందజేస్తున్నామని సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ తెలిపారు. భావితరాలకు గో జాతిని వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. -
బోడుప్పల్ అంటే.. బాబోయ్ మాకొద్దంటున్న అధికారులు!
సాక్షి,బోడుప్పల్(హైదరాబాద్): బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గత కొంత కాలంగా అధికారులు లేకుండా పాలన కొనసాగుతుంది. ఇక్కడ పని చేసే అధికారులు కొంత మంది ఇష్టం లేక వెళ్లి పోవడం, మరి కొంత మంది సెలవులపై వెళ్లడంతో కిందస్థాయి సిబ్బందిచే పాలన కొనసాగిస్తున్నారు. అధికారులపై విపరీతమైన ఒత్తిడి, పనిభారంతో పాటు వేధింపులు ఉండడంతో ఇక్కడ పని చేయడానికి ఏ అధికారి ఇష్ట పడడం లేదు. దీంతో ఇప్పటికే కమిషనర్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మేనేజర్, హరితహారం ఇన్చార్జ్ లేకుండానే తూతూ మంత్రంగా పాలన కొనసాగిస్తున్నారు. పాలనాధ్యక్షుడైన మేయర్‌కు అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్‌కు ప్రజా పాలనపై పట్టు లేకపోవడం, ఇతర విషయాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపకపోవడంతో పాలన పూర్తిగా స్తంభించిపోతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్‌పై పనిచేసే అధికారులు ఇక్కడ పని చేయకపోగా, మరి కొంత మంది అధికారులు బదిలీ అయ్యారు. కమిషనర్ కూడా సెలవులపై వెళ్లడంతో నగర పాలక సంస్థలో పాలన అటకెక్కింది. సమన్వయ లోపం కారణమా? ► బోడుప్పల్ కమిషనర్, మేయర్‌కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో గత కొంత కాలంగా వారు ఎడ,పెడ మొఖంగా ఉన్నారు. దీంతో పాటు పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన సెలవులపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ పదవీకాలం ముగిసింది. అనంతరం ఆయననే మళ్లీ అవుట్ సోర్సింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా తీసుకున్నారు. ఆయన కొంత కాలం పని చేసిన తర్వాత ఇక్కడ చేయలేనని వెళ్లిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరో శానిటరీ ఇన్స్పెక్టర్ రాలేదు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొంది స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్‌లో అవార్డులు పొందిన బోడుప్పల్ నేడు చెత్త విషయంలో మురికి కూపంగా మారింది. ఇక్కడ పని చేసిన మేనేజర్ మరో చోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఆర్ఓను ఇన్చార్జ్ మేనేజర్‌గా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా వస్తారు.. అలా వెళ్తారు.. ► మున్సిపాలిటీకి కీలకమైన విభాగం టౌన్‌ప్లానింగ్. ఇక్కడ గతంలో నల్గొండలో పనిచేసే ఓ ఏసీపీ అధికారి డిప్యూటేషన్‌పై మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు అక్కడ పని చేశారు. ఓ మంత్రి సహకారం మేయర్, కొంత మంది కార్పొరేటర్లు భవన నిర్మాణాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆయన తన డిప్యూటేషన్‌ను రద్దు చేయించుకుని నల్గొండలోనే ఉండి పోయారు. ఆయన తరువాత మరో టీపీఓ డిప్యూటేషన్‌పై వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఇమడ లేక వెళ్లిపోయారు. ప్రస్తుతం అధికారి లేకుండానే టౌన్ ప్లానింగ్ విభాగం కొనసాగుతోంది. కిందిస్థాయి అధికారులతోనే.. ► ప్రతి సంవత్సరం హరితహారం కోసం బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ, మొక్కల పంపిణీ, పార్కుల ఏర్పాటు, నిర్వహణ, పెరటి తోటల పంపకం, మొక్కలకు నీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, నిర్వహణ కోసం పదవీ విరమణ పొందిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్‌ను నెలకు రూ. 50 వేలు ఇచ్చి తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన సదరు అధికారి సైతం పని చేయలేమని వెళ్లిపోయారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే అందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగం మినహా ఇస్తే మిగతా విభాగాలు కింద స్థాయి అధికారులు, సిబ్బందిచే నడుపుతున్నారు. దీంతో పాలన అంతా స్తంభించి పోయి అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్‌సింగ్.. వైరల్ -
ప్రతిపక్షాలు, పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తులు: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలతో పాటు పోలీసులు కూడా సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా మారారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగ దీక్షకు అనుమతిచ్చి చివరి నిమిషంలో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్స్టేషన్లలోనే మేం దీక్ష చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. చదవండి: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌కు కోర్టు ఆదేశం ప్రతి మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం బోడుప్పల్లో దీక్షకు యత్నించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి రవీంద్ర నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమకారుడు చనిపోతే పరామర్శించడానికి ప్రభుత్వం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్ర నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాడని గుర్తుచేశారు. పోరాటానికి దక్కిన ఫలితం చివరకు ఆత్మహత్య అని వాపోయారు. ఇది హత్యనా? ఆత్మహత్యనా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. కేవలం కేసీఆర్ నిర్లక్ష్యంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువతను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కొత్త రాగం అందుకుని గర్జనలు చేస్తోందని, చంద్రబాబు సలహా ఇచ్చారా? కేసీఆర్ అనుమతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మీ లోక్‌సభ పరిధిలోనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం గుర్తించరా? అని నిలదీశారు. ఆ కుటుంబానికి కనీసం భరోసా ఇవ్వలేని మీరు ఒక ఎంపీయేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి.. ఇన్నాళ్లు అమ్ముడు పోయి.. ఇప్పుడు గర్జనలు, దీక్షలు చేస్తామంటే మిమ్మల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీలు తొత్తులుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. టీపీసీసీ అంటేనే టీఆర్ఎస్ ప్యాకెట్లో కాంగ్రెస్ కమిటీ అని అభివర్ణించారు. తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు వేసే వరకు పోరాటాలు చేస్తుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు పోలీసులు కూడా కేసీఆర్‌కు తొత్తులుగా మారారని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చుని దీక్ష చేస్తామని చెప్పారు. -
రవీంద్ర నాయక్ కుటుంబానికి అండగా వైఎస్ షర్మిల
-
బోడుప్పల్ లో ముగ్గురు యువకుల హంగామ
-
కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి
-
కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్: తెలంగాణ క్రీడాకారులు పట్టుదల, కసితో క్రీడలు ఆడి జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించాలని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బోడుప్పల్‌లోని వైష్ణవి క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం రాత్రి దివంగత చెర్ల ఆంజనేయులు యాదవ్ జ్ఞాపకార్థం టీఆర్ఎ అధ్యక్షుడు మంద సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 68వ కబడ్డీ సీనియర్ ఇంటర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అందులో భాగంగా హకీం పేట్లో స్పోర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు అసమానతలు తొలగించి అందరం ఒకే కుటుంబం అనే భావన కల్పించాలన్నారు. క్రీడల్లో పైరవీలకు తావు లేదని, గెలవాలనే తపన, లక్ష్యం ఉన్న క్రీడాకారులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, క్రీడల్లో రాణించే వారికి 2 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ శామీర్‌పేట్‌లో 250 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కబడ్డీ ప్రాచీణమైనదని, క్రికెట్‌ను తలదన్నేలా కబడ్డీ క్రీడాకారులు రాణించాలన్నారు. తొలుత కబడ్డీ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల భరత నాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి జగదీశ్ యాదవ్, మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కిందపడ్డ మల్లారెడ్డి కబడ్డీ పోటీల ప్రారంభంలో భాగంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లారెడ్డి కబడ్డీ ఆడారు. ఇరువురు రెండు జట్టులుగా ఏర్పడి కబడ్డీ ఆడుతుండగా కూతకు వెళ్లిన మల్లారెడ్డి గ్రౌండ్లో వేసిన మ్యాట్ జారడంతో కింద పడిపోయారు. దీనిని గమనించిన మంత్రి శ్రీనివాస్ మల్లారెడ్డిని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. -
అమెరికాలో తెలంగాణవాసి మృతి
సాక్షి, తొర్రూరు/కొడకండ్ల: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి అతడి కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. గత నెల 27 చనిపోయినా అతడి మరణవార్తను బుధవారమే అందుకున్న ఆ కుటుంబం ఇప్పుడు గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్ మేడిపల్లికి చెందిన పానుగంటి శ్రీధర్ అమెరికాలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. న్యూయార్క్ సిటీలోని బాఫెల్లాలో నివాసముండే అతడికి భార్య ఝాన్సీ, కుమారుడు శ్రీజన్(5) ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సోదరుడి వివాహం నిమిత్తం భార్య ఝాన్సీ, శ్రీజన్ ఇండియాకు వచ్చారు. లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయారు. అప్పట్నుంచి శ్రీధర్ యూఎస్‌లో ఒంటరిగానే ఉంటున్నారు. వీరియోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు ఫోన్లోనే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో గతనెల 26న భార్య సెల్‌కు కుమారుడి బాగోగులపై శ్రీధర్ మెసేజ్ పంపించాడు. దీనికి ఆమె బాగున్నాడని బదులిచ్చారు. ఆ తర్వాత 27 ఉదయం భార్య ఝాన్సీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీధర్ నుంచి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఝాన్సీ.. అపార్ట్మెంట్లో పక్కనే నివాసముండే వారికి ఫోన్ చేసింది. దీంతో వారు అమెరికా పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీధర్ నిద్రలోనే మరణించాడని నిర్ధారించారు.(చదవండి: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి) ఆలస్యంగా మరణవార్త అమెరికాలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడం, అక్కడి అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో శ్రీధర్ కుటుంబ సభ్యులు ఆయనకు ఏమైందోనని ఆందోళన చెందారు. అయితే శ్రీధర్ మరణవార్తను బుధవారమే అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం రావడానికి ఆరు నెలలు పడుతుందని అక్కడి అధికారులు సందేశం పంపడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. త్వరగా స్వదేశానికి రప్పించండి పోస్టుమార్టం, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తయినా మృతదేహాన్ని ఇండియాకు పంపించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడి మృతదేహం త్వరగా రప్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ను కూడా కలవనున్నట్లు తెలిపారు. -
'రౌడీషీట్ పెట్టండి.. వాడి అంతు చూస్తా'
సాక్షి, హైదరాబాద్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ యువకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 71, 72, 73 ప్లాట్ నంబర్ 35, 36 పార్ట్ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్ అనే యువకుడు ఆరోపించాడు. ఈ క్రమంలోనే శివకిషోర్.. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారని మేయర్‌ను ప్రశ్నించగా నువ్వెవడు రా..? అని పరుష పదజాలంతో దూషించి, ఏడుగురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగినట్లు బాధితుడు వివరించారు. విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే వీడిపై రౌడీషీట్ పెట్టండి. తర్వాత వాడి అంతుచూస్తానని మేయర్ సామల బుచ్చిరెడ్డి బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. (కస్టమర్ కేర్ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!) -
హైదరాబాద్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్ : వీధికుక్కల వీరంగానికి ఓ ఆరేళ్ల చిన్నారి విలవిల్లాడింది. సకాలంలో తగిన వైద్యం అందక ఆరు గంటలపాటు నరకయాతన అనుభవించింది. పాపను బతికిం చుకునేందుకు పేదింటి తల్లిదండ్రులు ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరి గినా లాభం లేకపోయింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం, ఉదాసీనత వల్ల చివరకు తుదిశ్వాస విడిచింది. ‘అమ్మానాన్న.. భయమైతంది’అంటూతమ కుమార్తె పలికిన చివరి పలుకులు తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కావడం అం దరినీ కలచివేసింది. హైదరాబాద్‌లో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అమ్మచేతి గోరుముద్ద తిని... మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు కారంపూడి తండాకు చెందిన అంగోత్ హోలీ నాయక్ తన భార్య కవిత, కుమార్తె అంగోత్ బేబి, కుమారుడు గణేశ్లతో కలసి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి నగర శివార్లలోని చెంగిచెర్లలో ఉన్న సుశీల టౌన్షిప్లో నివాసముంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు దినసరి కూలీగా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడు. పది నెలల క్రితం నుంచి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారు ఉంటున్న కాలనీకి ఆనుకొని ఒకవైపు అడవి, మరోవైపు యాటల మండీ (జంతు వధశాల) ఉన్నాయి. రోజులాగే నాయక్ శని వారం ఆటో తీసుకొని బయటకు వెళ్లాడు. భార్య కవిత ఉద యం 10 గంటలకు కుమార్తె అం గోత్ బేబికి గోరుముద్దలు తినిపించింది. ఆ తర్వాత బట్టలు ఉతుకుతుండగా అమూల్తా వచ్చి అమ్మా టాయ్‌లెట్ వస్తోందని చెప్పడంతో బాత్రూమ్కు వెళ్లమని చెప్పింది. అయితే అంగోత్ బేబి ఇంటి ముందు ఉన్న రోడ్డుపైకి వెళ్లడాన్ని తల్లి గమనించలేదు. అదే సమయంలో ఒక్కసారిగా వచ్చిన ఐదు వీధికుక్కలు పాపపై దాడి చేశాయి. నిస్సహాయంగా ఉన్న ఆ పాపను ఒళ్లంతా పట్టి పీకాయి. ఇంటి బయట కుక్కల అరుపులు, కుమార్తె ఆర్తనాదాలు వినిపించడంతో బయటకు వెళ్లి తల్లి చూడగా అంగోత్ బేబిని కుక్కలు పట్టుకొని ఇంకా కరుస్తుండటం చూసింది. వెంటనే అక్కడున్న కర్రలు, రాళ్లతో కుక్కలను చెదరగొట్టిన కవిత... భర్తకు విషయం తెలపడంతోపాటు అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అప్పటికే పాప శరీరమంతా రక్తసిక్తమైంది. ఆరు గంటలపాటు తల్లడిల్లి... శనివారం ఉదయం 10.30 గంటలకు కుక్కలు దాడి చేయగా 11.00 గంటల సమయంలో తల్లిదండ్రులు అమూల్తాను ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి యాజమాన్యం ఫీజు వసూలు చేసి రెండు గంటలపాటు చికిత్స చేసింది. ఆ తర్వాత తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. సమీపంలోని అంకుర ఆస్పత్రికి తరలించాలని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో చేసేది లేక మరో అంబులెన్సులో తల్లిదండ్రులు తమ చిన్నారిని ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపను దాదాపు మూడు గంటలపాటు పరీక్షించిన వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో మరో అంబులెన్సులో సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నిర్వాహకులు ఆ చిన్నారికి చికిత్స చేయబోమని తెగేసి చెప్పడంతో ఫీవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసే సమయంలో నీళ్లు తాగిన పాప తనకు భయంగా ఉందంటూ తల్లిదండ్రులతో చివరగా మాట్లాడింది. అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో పాపను నిలోఫర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సాయంత్రం 4:15 గంటలకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిలోఫర్‌లో దాదాపు గంటపాటు చికిత్స పొందిన అమూల్తా చివరకు కన్నుమూసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఐదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తమ బిడ్డను ఎవరూ కాపాడలేకపోయారంటూ కన్నీరుమున్నీరయ్యారు. అమూల్తా అంటే తమకు ఎంతో ప్రాణమని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ‘సాక్షి’తో మాట్లాడుతూ తల్లిడిల్లారు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం అంత్యక్రియల కోసం స్వస్థలానికి వెళ్లింది. -
మేనేజర్ లంచావతారం
సాక్షి, బోడుప్పల్: బోడుప్పల్ నగర పాలక సంస్థలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ కమ్ మేనేజర్ పి.రాజేందర్‌రెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ జె.వెంకటేశ్‌గౌడ్ చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాను కమీషన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ సీటీ రేంజ్–2 డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పీర్జాదిగూడలో నివసించే పి.రాజేందర్‌రెడ్డి బోడుప్పల్ నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ కమ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. బోడుప్పల్లో నివసించే జె.వెంకటేశ్‌గౌడ్ నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్. ఈయన ఇటీవల రూ.62 లక్షల విలువైన రోడ్డు పనులు చేశాడు. వాటిలో రూ.27 లక్షలకు బిల్లు చేశాడు. అయితే వాటిని మంజూరు చేయాలంటే తనకు 7శాతం కమీషన్ ఇవ్వాలని రాజేందర్‌రెడ్డి కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని వేడుకున్నా వినలేదు. దీంతో కమీషన్ ఇస్తానని ఒప్పుకున్న వెంకటేశ్‌గౌడ్ 20 రోజుల క్రితం రూ.లక్ష అందజేశాడు. మళ్లీ ఈ నెల 19న రూ.20 వేలు ఇచ్చాడు. శుక్రవారం మరో రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఈలోపు వెంటేశ్‌గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.50 వేలు ఇస్తానని శుక్రవారం ఉదయం రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేశాడు. ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఆసిఫ్‌కు ఇవ్వమని రాజేందర్‌రెడ్డి చెప్పాడు. కాంట్రాక్టర్ వద్ద రూ.50 వేలు తీసుకున్న ఆసిఫ్ రాజేందర్‌రెడ్డికి ఇచ్చేందుకు ఆయన క్యాబిన్‌కు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రాజేందర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన క్యాబిన్లో రెండు గంటలకు పైగా సోదాలు చేశారు. రాజేందర్‌రెడ్డి, ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారుల్లో టెన్షన్.. బోడుప్పల్ నగర పాలక సంస్థపై ఏసీబీ అధికారులు దాడి చేయడంతో వివిధ శాఖల అధికారుల్లో భయం మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజనానికి సిద్ధమవుతుండగా ఈ దాడులు జరిగాయి. ఏసీబీ ఆఫీసర్లు రావడంతో అధికారులంతా అవాక్కయ్యారు. తొలుత ఏసీబీ అధికారులు మీసేవ కేంద్రంలో బిల్లులు చెల్లించే వారికి అనుమతినిచ్చారు. అధికారులతో పని ఉన్న వారిని అనుమతించలేదు. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కమిషనర్ శంకర్, టీపీఓ శ్రీధర్‌రెడ్డి తప్ప మిగతా శాఖల అధికారులు అందుబాటులో లేరు. -
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం
సాక్షి, మేడ్చల్ : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన శుక్రవారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే పార్టీ నేతలు మంత్రి సమక్షంలోనే బాహా బాహీకి దిగారు. వారిని వారించినా ఫలితం లేకపోవడంతో మంత్రి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి... పార్టీ తొలి సభ్యత్వాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా గురువారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది. -
బోడుప్పల్లో రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : సొంత పనుల నిమ్మిత్తం నడుచుకుంటూ వెళుతున్న మహిళను నెంబర్ ప్లేట్ లేని కారు ఢీకొట్టిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పులికంటి సంగీతారెడ్డికి తీవ్ర గాయాలవడంతో దగ్గర్లోని ఆర్.బీ.ఎమ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఉదంతం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోడుప్పల్కి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సంగీతారెడ్డిలు భార్యభర్తలు. కొంతకాలంగా భర్త, అత్తింటివారితో సంగీతకు విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా నెంబర్‌ప్లేట్ లేని వాహనం సంగీతను గాయపరచడం పోలీసులకు అనుమానం కలిగిస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి...
బోడుప్పల్: ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో దంపతులు మృతి చెందారు. మేడిపల్లి ఇనస్పెక్టర్ డి.అంజిరెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం... రాజమండ్రికి చెందిన పి.కోటేశ్వరరావు (29) గత కొంత కాలంగా నగరంలో ఉంటూ తార్నాకలోని ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగినేని పల్లికి చెందిన స్వప్న(27) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పీర్జాదిగూడ మునిసిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో నివసిస్తున్న వీరు ఆదివారం పనిమీద అన్నోజిగూడకు బయలుదేరారు. నారపల్లి చౌరస్తా వరకూ వచ్చి ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చేందుకు వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఏపీ 29జడ్ 2157 నంబరు కలిగిన ఆర్టీసీబస్సును మరో టూవీలర్ వేగంగా క్రాస్ చేసి వెళ్లింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి హఠాత్తుగా సీట్లో నుంచి బస్సులో కింద పడిపోయాడు. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ ఎక్కింది. బస్సు వెళ్లాక వెళ్దామని అక్కడే ఆగి ఉన్న కోటేశ్వరరావు వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ టీవీ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి మల్కాజ్గిరి ఏసీపీ గోనె సందీప్‌రావు సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడపడమే కారణమని కొందరు స్థానికులు చెప్పారు. -
యువ దంపతుల ఆత్మహత్య
బోడుప్పల్: యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోడుప్పల్లో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .నాచారంలోని చింతల్‌బస్తీకి చెందిన ఎల్లసాని నవనీత్ యాదవ్ (27), స్వప్న (26)ఏడాది క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నవనీత్ కాగ్నిజెంట్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, స్వప్న హబ్సిగూడలోని జెన్‌ప్యాక్ కాల్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె 9నెలల గర్భిణి. ఆరు నెలల క్రితం బోడుప్పల్, అశోక్‌నగర్‌కు మారిన వీరు ఓ భవనంలో పెంట్ హౌజ్‌లో అద్దెకు ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా వీరు ఇంటి నుంచి బయటికి రాకపోవడం. స్నేహితులు, బంధువులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నవనీత్ తల్లి గురువారం రాత్రి వారి ఇంటికి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించి ఇంటి యజమానికి చెప్పడంతో అతను అనుమానంతో మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో నవనీత్, స్వప్న మృతదేహాలను కనిపించాయి. పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో పురుగుమందు తాగి అత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మేడిపల్లి సీఐ అంజిరెడ్డి, మల్కాజ్గిరి ఏసీపీ గోనె సందీప్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టి పరిమళం...
మట్టే మాణిక్యం..మట్టే బంగారం. మట్టిలో మహిమలెన్నో..అంటూ చిన్నారుల నుంచి యువత వరకు మట్టిలో మునిగితేలారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలే వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తూ ఆదివారం బోడుప్పల్ హనుమాన్ ఆలయంవద్ద నిర్వహించిన మడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. బోడుప్పల్: సిమ్‌లైన్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో బోడుప్పల్ హనుమాన్ ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన మడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. 400 మందికి పైగా యువతీ యువకులు ఇందులో పాల్గొని సందడి చేశారు. ‘మట్టి విగ్రహాలనే వినియోగిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దలు మట్టిలో కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, తాడాట, రెయిన్ డ్యాన్స్‌లతో ఆడిపాడి అలరించారు. ఫెస్టివల్ నిర్వాహకుడు కె.జయసింహాగౌడ్ మాట్లాడుతూ.. ‘పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందుకు అందరూ నడుం బిగించాలి. గుంట తవ్వి ఎర్రమట్టి, బంక మట్టి పోసి.. అందులో నీళ్లు, వన మూలికలు వేసి ఈ వేడుకలు నిర్వహించాం. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని, వారుండే కాలనీలోనే నిమజ్జనం చేసి పర్యావరణాన్ని కాపాడాల’ని కోరారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని దగ్గర్లోని కొలనులో నిమజ్జనం చేశారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం
-
సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బోడుప్పల్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సర్వే చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనతో కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుగానే కేంద్ర మంత్రి పదవి రిజర్వేషన్ చేసి ఉంచారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం కొన్ని కార్యక్రమాల్లో వారి తీరుతో తెలిపోయింది. కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారం రోజున రాహుల్‌తో చంద్రబాబు వ్యవహరించిన తీరు, ఇటీవల అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా పార్లమెంటులో టీడీపీ, కాంగ్రెస్‌లు ఉమ్మడి అజెండాతో పనిచేయడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఒకరితో నిశ్చితార్థం.. మరో యువతితో..
సాక్షి, బోడుప్పల్ (హైదరాబాద్) : ఒక యువతితో నిశ్చితార్థం చేసుకొని.. మరో యువతిని వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చర్లపల్లికి చెందిన బీపంగి హరిబాబు(28) స్థానికంగా అమ్మ ఆన్లైన్ మీసేవ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22న బోడుప్పల్ శివపురికి చెందిన ఓ యువతి(24)తో నిశ్చితార్థం అయ్యింది. రూ.3 లక్షలు ఇచ్చేందుకు ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం రోజు ఖర్చుల నిమ్తితం రూ.50 వేలు ఇచ్చారు. మరో రూ.50 వేలు నిశ్చితార్థం కోసం ఖర్చు చేశారు. ఆగస్టులో పెళ్లి నిర్ణయించారు. ఈలోపు హరిబాబు ఎవరికీ చెప్పకుండా మీ సేవలో పనిచేసే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు హరిబాబును నిలదీయగా సమాధానం చెప్ప లేదు. దీంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
టఫ్ వన్ బాస్ అంటున్న కేటీఆర్..!
సాక్షి, హైదరాబాద్ : ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటారు. తనను ఉద్దేశించి.. తనను ట్యాగ్ చేసి ఎవరు ట్వీట్ చేసినా.. చాలావరకు బదులు ఇస్తుంటారు. దీంతో రోజురోజుకు ఆయన ట్విటర్ ఖాతాకు విజ్ఞాపనలు, ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. చాలామంది తన సాయం కోసం చేస్తున్న ట్వీట్లకు కేటీఆర్ కూడా బదులిస్తున్నారు. తాజాగా కేటీఆర్ దృష్టికి ఒక ఆసక్తికరమైన ట్వీట్ వచ్చింది. దానిని రీట్వీట్ చేస్తూ.. ‘టఫ్ వన్ (కష్టమైంది) బాస్’ అంటూ బదులిచ్చారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే..‘కేటీఆర్ సార్.. నేను శాకాహారిని. నేను ఇడ్లీ, దోసా, అన్నం.. ఇలా ఏదీ తిన్నా జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. మా బోడుప్పల్లో హోటళ్లు రాత్రి 10 గంటలవరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ఇక నా స్నేహితుడు హైదరాబాద్ పాతస్తీలో నాన్ వెజ్ తింటాడు. బిర్యానీ తిన్నా, రోటీ తిన్నా జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. హోటళ్లు 24 గంటలూ తెరిచి ఉంటాయి.. నాయ్యం చేయండి సార్’ అంటూ ఎంబీ ప్రకాశ్ చేసిన ట్వీట్‌కు కష్టమే బాస్ కేటీఆర్ బదులిచ్చారు. -
‘అశ్లీలం’ కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ హీరోయిన్ల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న కేసులో సీఐడీ అధికారులు బుధవారం ఓ సివిల్ ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు గత ఏడాది ఈ కేసు నమోదైన విషయం విదితమే. అప్పటి నుంచి బాధ్యులను గుర్తిస్తున్న సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. బోడుప్పల్‌కు చెందిన రుద్రవరకు రఘువరన్ ఓ ప్రైవేట్ సంస్థలో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇంటర్నెట్లో ఓ బ్లాగ్స్పాట్ క్రియేట్ చేసిన ఇతను ప్రముఖ హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ అందులో పోస్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి కల్పిత కథలను పొందుపరుస్తున్నాడు. తద్వారా సైట్‌కు హిట్స్ పెరగడంతో ఆర్థికంగా లాభం పొందుతున్నాడు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మళ్లీ అత్తింటి ముందు సంగీత ధర్నా